Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
హైలెస్సా..!
25-11-2018 10:21:40
 
636787380989206058.jpg
  • అలరించిన నాటు పడవల రేస్‌
  • ఎయిర్‌ షో స్పెషల్‌ అట్రాక్షన్‌
  • 1600 మీటర్ల దూరం
  • బరిలో 12 జట్లు.. 36మంది పోటీదారులు
  • వీక్షకులకు కనువిందు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): నాటుపడవల జోరుతో.. బోటురేస్‌ అదిరింది! నగరంలో తొలిసారిగా జరిగిన నాటు పడవల రేసు మస్తు మజానిచ్చింది. ముందెన్నడూ చూడని నాటుపడవల రేస్‌ను బెజవాడ ప్రజలు ఆస్వాదించారు. పోటీలు ఆద్యంతం అరుపులు, కేకలతో హుషారెత్తించారు. అమరావతి ఎయిర్‌ షోకి నాటు పడవల రేస్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఏరోబాటిక్‌ విన్యాసాలకు అర్థగంట ముందు నిర్వహించిన నాటుపడవల రేస్‌ కేకపుట్టించింది. ఎయిర్‌షోకు వచ్చిన వీక్షకులకు నాటుపడవల రేసింగ్‌ గురించి చెప్పగానే పెద్దపెట్టున హర్ష ధ్వానాలు చేశారు. భవానీఐల్యాండ్‌ నుంచి ప్రకాశాం బ్యారేజీవరకు 1600 మీటర్ల రేస్‌ నిర్వహించారు. రేస్‌లో కృష్ణాతీరంలోని మత్స్యకారులు నాటు పడవలతో పాల్గొన్నారు. మొత్తం 12 జట్లు నాటుపడవల రేస్‌లో పాలు పంచుకున్నాయి. ఒక్కో టీమ్‌కు ముగ్గురు చొప్పున మొత్తం 36మంది పోటీదారులు రేస్‌లో పాల్గొన్నారు. భవానీద్వీపానికి అభిముఖంగా నదిలో ట్యాగ్‌లైన్‌ ఏర్పాటుచేశారు. ట్యాగ్‌లైన్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ సమీపం వరకు 800 మీటర్ల దూరంలో మరో ట్యాగ్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. రాను, పోను కలిపి మొత్తం 1600 మీటర్ల దూరంగా నిర్ణయించారు. ఒక్కో బోటులో ముగ్గురు పోటీదారులు పాల్గొన్నారు. పోటీలు 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. భవానీ, పున్నమి, దుర్గాఘాట్‌, బ్యారేజీ మీద నుంచి ప్రేక్షకులు ఈలలతో రేసర్లను హుషారెత్తించారు. నెం.10 బోటు రేసులో ముందంజలో దూసుకెళ్లింది.
 
విజేతలు వీరే
fggRgNWERtgwe.jpgప్రథమ స్థానం : నెంబర్‌-10 (ఎస్‌ వెంకటేశ్వరరావు, ఎన్‌ లక్ష్మయ్య, ఎన్‌.మహేష్‌)
ద్వితీయ స్థానం: నెంబర్‌-2 (బి.ధనరాజు, ఎన్‌.కోటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు)
తృతీయ స్థానం : నెంబర్‌-4(జీఎస్‌రావు, కన్నా నాగరాజు, ఎం.నాగ మునీంద్రరావు). నాటు పడవల రేస్‌ విజేతలకు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుమతులను అందించనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లకు వరుసగా రూ.15,000, రూ.10,000, రూ.5000ల నగదు బహుమతితో పాటు, ట్రోఫీలను అందజేస్తారు.
Link to comment
Share on other sites

జెట్‌ విస్తరణకు.. తొలి అడుగు
29-11-2018 08:55:45
 
636790785467704404.jpg
  • జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల్లో 80 శాతం మందికిపైగా డాక్యుమెంట్లు సమర్పణ
  • భూసేకరణకు రూ 106 కోట్లు!
  • రెండు రోజుల్లో కలెక్టర్‌ ఖాతాకు
  • స్కెచ్‌లకు రూపకల్పన
జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ విస్తరణకు అడుగు ముందుకు పడింది ! ఈ పనుల కోసం 106 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.106 కోట్లను కేటాయించినట్టు తెలిసింది. ఇవి కలెక్టర్‌ ఖాతాకు రెండు రోజుల్లో జమ కానున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో, తర్వాత చేసే ప్రక్రియ వైపు రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేసింది. రైతుల నుంచి డాక్యుమెంట్ల స్వీకరణకు తెరలేపింది. జక్కంపూడి , వేమవరం, షాబాద రైతులు బేషరతుగా తమ డాక్యుమెంట్లను అందించటానికి సమయాత్తమయ్యారు. ఇప్పటికే 80 శాతం మందికి పైగా సమర్పించారు.
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: జెట్‌ సిటీ విస్తరణకు అవసరమైన భూముల సేకరణకు తొలి అడుగు పడింది. భూ సేకరణ ప్రతిపాదనలో ఉన్న జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల భూములు తీసుకోవడం అనధికారికంగా ప్రారంభమైంది. కలెక్టర్‌ ఖాతాలో డబ్బు పడిన తర్వాత ప్రారంభించాల్సిన ప్రక్రియను రెవెన్యూ అధికారులు కాస్త ముందుగానే చేపట్టారు. రైతులు సానుకూలంగా ఉండటంతో తర్వాత ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రూరల్‌ రెవెన్యూ అధికారులు ఈ పక్రియను చేపట్టారు. రూరల్‌ మండలంలో భూముల పరిహారం నిర్ణయించడంలో జరిగిన జాప్యం, నిధుల విడుదల నిర్ణయాలు ఆలస్యమవడంతో ప్రతిపాదించిన భూములలో తాత్కాలికంగా సాగు చే సుకోవడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతిపాదిత మొత్తం 106 ఎకరాలలో రైతులు సాగు చేపట్టారు. వరి పంట వేసిన కొద్ది రోజులకే కేబినెట్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పంట దశకు చేరుకున్న తరుణంలో ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంట కోత జరగగానే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్‌ ఖాతాకు రెండు రోజుల్లో నిధులు బదిలీ చేయటానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టు తెలిసింది. చాలా మంది రైతులు వరి నూర్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సైతం తరలిస్తున్నారు.
 
స్వచ్ఛందంగా ఇస్తున్నారు
రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు , టైటిల్‌ డీడ్స్‌ వంటివి రూరల్‌ రెవెన్యూ యంత్రాంగం కోరింది. దీనికి జక్కంపూడి, వేమవరం, షాబాద రైతులు తక్షణం స్పందించారు. దాదాపుగా 80 శాతం పైగా రైతులు భూముల డాక్యుమెంట్లను రెవెన్యూ యంత్రాంగానికి అందించారు. మిగిలిన రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు పొలం పట్టాలను తనఖా పెట్టడంతో అప్పగించలేదని తెలుస్తోంది. వీరు అధికారులను కలిసి పరిస్థితి వివరించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో డబ్బు జమ అయ్యే అవకాశం ఉండటంతో అధికారికంగా భూ సేకరణ ప్రక్రియను డిసెంబర్‌ నుంచే చేపట్టాలని భావిస్తున్నారు. భూ యజమానుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోనున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను వారి దగ్గర నుంచి తీసుకుంటారు. సర్వే చేస్తారు. ఆ తర్వాత ఆ భూమికి సంబంధించి స్కెచ్‌( ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ ) వేస్తారు. ఇది పూర్తికాగానే రైతుల బ్యాంకు అక్కౌంట్లను తీసుకుంటారు. డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు.
Link to comment
Share on other sites

విజయవాడకు 5స్టార్‌ హంగు 
రేపు ప్రారంభం 
7ap-main4a.jpg

కరెన్సీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలో నిర్మించిన తొలి 5స్టార్‌ హోటల్‌ నోవాటెల్‌ను ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని వరుణ్‌గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రభు కిషోర్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లు, అధికారుల సహకారంతో ‘అతిథుల ఆనందమే’ ధ్యేయంగా ఎకార్‌ కంపెనీ ప్రోత్సాహంతో అధునాతనంగా నిర్మించామని చెప్పారు. 227 గదులు, 4 రెస్టారెంట్లు, 10వేల చ.అడుగుల సమావేశ మందిరం, ఒలింపిక్స్‌ ప్రమాణాలతో నిర్మించిన 45 మీటర్ల  ఈతకొలను, భూగర్భంలో మూడు ఫ్లోర్లలో 200 కార్ల పార్కింగ్‌, సౌర విద్యుత్తు, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు, 200 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, ధ్యానం, యోగా, జిమ్‌, స్పా, సెలూన్‌, వైఫై సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్‌లో సీఆర్డీఏ సహకారంతో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 5స్టార్‌ హోటల్‌, 33 ఏళ్ల లీజుతో మరో 5 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నామని వెల్లడించారు. విశాఖపట్నంలోని తాజ్‌హోటల్‌ను తీసుకుని ఆధునికీకరించనున్నామని చెప్పారు. సీఈవో మాధవ్‌, జనరల్‌ మేనేజర్‌ మధుపాల్‌ పాల్గొన్నారు.

7ap-main4b.jpg
Link to comment
Share on other sites

అమరావతిలో నోవాటెల్‌ హోటల్‌.. రేపు ప్రారంభించనున్న సీఎం
08-12-2018 11:32:28
 
636798659820315313.jpg
రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నోవా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. వరుణ్‌ గ్రూప్‌ రూ.150 కోట్ల పెట్టుబడితో విజయవాడలో జాతీయ రహదారి పక్కన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ సమీపంలో ఎకరం విస్తీర్ణంలో ఈ హోటల్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఈ హోటల్‌ను ప్రారంభిస్తారని వరుణ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రభు కిశోర్‌ చెప్పారు. ‘విజయవాడ విమానాశ్రయం నుంచి 16 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్‌ నుంచి ఆరు కిలోమీటర్లు, బస్‌స్టేషన్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో 227 గదులతో ఈ హోటల్‌ను నిర్మించాం. ప్రతి రూమ్‌లో వైఫై సౌకర్యం ఉంటుంది. ఒకేచోట అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఈ హోటల్‌ను నిర్మించాం’ అన్నారు.
 
 
     హోటల్‌లో దిగే అతిథుల వ్యాయామం కోసం 200 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, 45 మీటర్ల విస్తీర్ణంలో టెర్రా్‌సపై ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో వాకింగ్‌ ట్రాక్‌ ఉన్న ఏకైక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వరుణ్‌ నోవాటెల్‌ అని కిశోర్‌ చెప్పారు. త్వరలో రాజధాని అమరావతి సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో రూ.150 కోట్ల అంచనాతో మరో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మించేందుకు వరుణ్‌ గ్రూపు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే నాలుగు ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కన మార్చి నెలలో మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నట్టు కిశోర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...