Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 2 weeks later...
పర్యాటక ప్రాంతంగా పద్మావతి ఘాట్‌ 

ఒకేచోట అందుబాటులోకి రానున్న విందు.. వినోదం 
15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధం

ap-state2a_11.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: విజయవాడ నగరంలోని కృష్ణా నదీ తీరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా బస్టాండు సమీపంలోని పద్మావతి ఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. ఆహ్లాదకర వాతావరణం.. పచ్చదనపు సోయగాలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలకు కనువిందు కలిగేలా ప్రస్తుతమిక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సుమారు 1.7 ఎకరాల స్థలంలో రూ.13 కోట్ల వ్యయంతో ఆధునిక ఫుడ్‌కోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వివిధ రకాల వంటకాలతో పాటు ప్రత్యేక రుచులనందించే ఆహారశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.   చిన్నారుల కోసం ఆకట్టుకునే క్రీడా సామగ్రి, పడవ షికారు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉండే ఈ ఘాట్‌లో చల్లదనం కోసం పెద్దఎత్తున రకరకాల మొక్కలు నాటుతున్నారు. నిర్వాహకులు ఏర్పాటుచేసే పలు వినోద కార్యక్రమాలను పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా పద్మావతి ఘాట్‌ మెట్లను హరితశోభతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ap-state2b_1.jpg

ap-state2c.jpg

 
Link to comment
Share on other sites

ఇలా వద్దు కృష్ణమ్మా 
 

దిగువ ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకే ప్రక్షాళన 
25వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సహకారం 
అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఏ.ఎండీ ఇంతియాజ్‌ 
ఈనాడు డిజిటల్‌, విజయవాడ

amr-gen2a_134.jpg

బెజవాడ నగరంతో పాటు జిల్లాకు అందాన్ని తీసుకొచ్చే కాలువలు.. అధికారుల పట్టింపులేని తనం, ప్రజల నిర్లక్ష్యంతో మురుగుకూపాలుగా మారాయి. ఎక్కడికక్కడ చెత్తపేరుకుపోవడంతో పాటు.. దోమలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని తీసుకెళ్లే మూడు ప్రధాన కాలువలతో పాటు.. వాటి అనుబంధ కాలువలను మురుగు నుంచి విముక్తి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. కాలువలు ప్రారంభమైన చోట నుంచి అడుగడుగునా కాలుష్యాన్ని నింపుకుంటూ నగరంలో నుంచి ప్రవహించే ఏలూరు, రైవస్‌, బందరు కాలువలను శుద్ధి చేసేందుకు, దిగువ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఏ.ఎండీ ఇంతియాజ్‌ మంగళవారం పిలుపునిచ్చారు.

విజయవాడ నగర పరిధిలో దాదాపు 24 కిలోమీటర్ల మేర ఏలూరు, రైవస్‌, బందరు కాలువలు వెళ్తుంటాయి. సరైన పర్యవేక్షణ లేక ఆధ్వానంగా మారాయి. నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ, సీఆర్‌డీఏ మధ్య సమన్వయం లేకపోవడడం శాపంగా మారింది. కాలువల సమీపంలో నివాసితులు తమ ఇళ్లలోని చెత్తను వీటిలో వేస్తున్నారు. మరుగుదొడ్లు, ఇళ్లల్లోని వ్యర్థ నీటిని గొట్టాల ద్వారా వదులుతున్నారు. ఫలితంగా కాలుష్య కాసారులగా మారుతున్నాయి. వృథా వస్తువులను తీసుకొచ్చి వేస్తుండడం అనర్థాలకు దారి తీస్తోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు. పట్టిసీమ పథకం నుంచి ఎత్తిపోతల ద్వారా ప్రభుత్వం గోదావరి జలాలను నగరానికి రప్పిస్తోంది. కేవలం విద్యుత్తు వినియోగానికే రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలపైనా ఉంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం కృష్ణా నదీ కాలువల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా నీటి పారుదల, నగరపాలకసంస్థ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, విద్య తదితర శాఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాలువల్లో నీటిని నిలిపేయడంతో.. పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించేందుకు.. సంపూర్ణ పర్యావరణ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ తమవంతుగా కృషి చేయాలని సూచించారు.

ఇదీ పరిస్థితి.! నగరంలో నిత్యం సరఫరా అయ్యే రక్షితనీటిలో 24 ఎంజీడీ నీరు మురుగుగా మారుతోంది. ఇదంతా అధిక భాగం బందరు, ఏలూరు, రైవస్‌ కాలువల్లోకి చేరుతోంది. బొడ్డుబొమ్మ సెంటర్‌ మొదలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ప్రధాన కాలువలోకి మురుగు వచ్చి చేరుతోంది. పాతబస్తీలోని అనేక ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు.. గాంధీ కొండ పరిసరాల నుంచి రైలు పట్టాల కిందుగా ఏలూరు కాలువలోకి వస్తోంది. మూడు కాలువల వెంట సుమారు 133 ప్రాంతాల్లో మురుగునీరు కలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా 53 ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నట్లు తేల్చారు. అయితే వీటిలో కొన్నింటినీ గత మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌ మూయించారు. అలాగే కాలువల వెంట మురుగుశుద్ధి ప్లాంట్ల ద్వారా కాలువల వెంబడి చిన్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా శుద్ధి చేయాలన్నది ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. దీంతో పాటు.. జిల్లా పరిధిలో నాలుగు ప్రధాన, దాని అనుబంధ కాలువలు కలిపి సుమారు 220 కి.మీలు ఉంటాయి. విజయవాడ నగరంతో పాటు.. ఇవి ప్రవహించే అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు విచ్చలవిడిగా చెత్తచెదారం వేయడం, మురుగునీటి కాలువలను నేరుగా కలపడం చేస్తున్నారు. ఫలితంగా దిగువ ప్రాంత ప్రజలకు కలుషితనీరు అందుతోంది.

25 వేల మందితో..: జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన కాలువలతో పాటు.. వాటి అనుసంధాన కాలువలు, కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాలలో చెత్త, చెదారం వంటివి తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని 25వేల మందితో నిర్వహించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ నిర్ణయించారు. దశలవారీగా నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయాన్ని తీసుకోనున్నారు. తొలుత బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల చేసే ప్రాంతం దగ్గర నుంచి నగర పరిధిలోని కాలువల్లో ప్లాస్టిక్‌ సంచులు, వ్యర్థ పదార్థాలు వేసే ప్రాంతాలను గుర్తించి.. మెస్‌లను ఏర్పాటు చేయనున్నారు. కాలువల్లోకి వ్యర్థాలను వేసే ప్రజలను, వ్యాపార సంస్థలను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన నీరు లక్షలాది మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారనే విషయంపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాలువల గట్లపై పచ్చదనం వెల్లివిరిసేలా గడ్డి, ఫల మొక్కలను నాటి ఆహ్లాదరక వాతావరణాన్ని కల్పించాలని, నదీ ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

కరకట్టపై సీసీ కెమెరాలు: యనమలకుదురు - పులిగడ్డ కరకట్టకు ఇరువైపులా భవనాల తొలగింపు వ్యర్థాలను ఇష్టానుసారంగా డంప్‌ చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలతో పాటు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అరికట్టేందుకు నీటిపారుదల, పంచాయతీరాజ్‌ అధికారులు వెంటనే దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రాజధాని ప్రాంతం కావడంతో ఇటీవల పురాతన భవనాల తొలగింపునకు సంబంధించిన ఇటుక, సిమెంట్‌ వంటి వ్యర్థ పదార్థాలను కరకట్టకు ఇరువైపులా ఖాళీగా ఉన్న ప్రాంతంలో డంప్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ డంపింగ్‌ను నివారించేందుకు యనమలకుదురు శివాలయం ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా వ్యర్థపదార్థాలను డంప్‌ చేసే వాహనాలను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

jillalu.png

జిల్లా వార్తలు

 

మరిన్ని వార్తలు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...