Jump to content

polavaram

Recommended Posts

Polavaram project concrete works to enter Guinness book of world records
Polavaram project concrete works to enter Guinness book of world records

Polavaram project concrete works to enter Guinness book of world records

Monday, Dec 31, 2018

Chief Minister Nara Chandrababu Naidu advised the irrigation officials to see that maximum area in the state should get benefit from Polavaram project. When the officials informed the Chief Minister nearly 75.38 lakh acres will get irrigation facility with the completion of Polavaram project, the Chief Minister advised the officials to prepare a report on the extent of area in each district to be benefited out of Polavaram project.

The Chief Minister conducted 84th virtual review on the progress of Polavaram project works today. The irrigation officials said additional 32.2 lakh acres will get irrigation facility with Polavaram project in addition to stabilising 43.18 lakh acres. The project will help to supply 7.32 tmc of drinking water to Visakhapatnam and 16.12 tmc of water for industrial purposes. They said that Polavaram canals will provide drinking water to 28.5 lakh people in 540 villages in addition to supplying 5 tmc of water to Orissa and 1.5 tmc to Chattisgadh.

The officials said 63.27 per cent of project works were completed so far. They said the project concrete works enter into Guinness book of world records by completing 28000 to 30000 cubic metres of concrete works on January 7.

The Chief Minister asked the officials to complete the R&R package works by March 2019.

The officials said the state govt spent Rs 15,380.97 cr and the central govt has to release Rs 3,517.84 cr. They said 4.36 lakh farmers, students and others visited the Polavaram project so far.
Link to comment
Share on other sites

24 గంటలు.. 28 వేల క్యూ.మీ. కాంక్రీట్‌

6, 7 తేదీల్లో పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు నమోదుకు సర్వం సిద్ధమైంది. స్పిల్‌ఛానల్‌లో 24 గంటల్లో రికార్డుస్థాయిలో 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయనున్నారు. 6వ తేదీ ఉదయం 9 నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ పని జరగనుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. పనులను పరిశీలించడానికి జాతీయ, అంతర్జాతీయ మీడియాను పోలవరం తీసుకొస్తున్నారు. ఈ రికార్డును గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేయనున్నారు.

10 వేల మందితో సీఎం బహిరంగ సభ
సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేసినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తర్వాత 13 జిల్లాల జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది, పది వేల మంది రైతులు పాల్గొనే బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, ఎస్పీ ఎం.రవిప్రకాష్‌, ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేష్‌బాబు గురువారం పర్యవేక్షించారు.

దిల్లీ నుంచి వచ్చిన మట్టి, రాయి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, వాడుతున్న కంకర, ఇసుక, మట్టి, రాయిని పరిశీలించారు. కొన్ని నమూనాలను సేకరించారు.

Link to comment
Share on other sites

కాంక్రీటు ఘట్టం రేపే!
05-01-2019 03:18:39
 
  • రేపు, ఎల్లుండి 28-30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు
  • గిన్నిస్‌ రికార్డు ముంగిట పోలవరం
  • సాధిస్తామన్న నవయుగ ఎండీ శ్రీధర్‌
  • ప్రతి పావుగంటకు లెక్క నమోదు
  • గిన్నిస్‌ బుక్‌లో రికార్డయ్యేదాకా వివరాలు చెప్పరు
  • సలహాదారు రమేశ్‌బాబు వెల్లడి
  • హాజరు కానున్న 24 మంది నిపుణులు
  • 3 వేల మంది రాష్ట్ర ఇంజనీర్లు కూడా..
పోలవరం, జనవరి 4: పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల్లో మరో కీలక ఘట్టం ఆదివారం చోటుచేసుకోనుంది. గిన్నిస్‌ రికార్డు సాధించే దిశగా నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్లో 6వ తేదీ (ఆదివారం) ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి మర్నాడు ఏడో తేదీ ఉదయం ఏడు గంటల వరకు.. అంటే 24 గంటల్లో 28 వేల నుంచి 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేసేందదుకు రంగం సిద్ధం చేసింది. ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను నవయుగ ఎండీ చింతా శ్రీధర్‌, ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేశ్‌బాబు శుక్రవారం పర్యవేక్షించారు. గిన్నిస్‌ రికార్డు సాధించి తీరతామని.. మరో పదేళ్ల వరకు దీనిని ఎవరూ అధిగమించలేరని శ్రీధర్‌ ధీమా వ్యక్తంచేశారు. ‘అన్ని బ్లాస్టింగ్‌ పాయింట్ల వద్ద సిమెంట్‌ ఇసుక, కంకర, ముందస్తుగా నిల్వలు ఉంచాం.
 
అక్కడ తయారైన కాంక్రీటును స్పిల్‌ చానల్‌, స్పిల్‌వేలో వేసే విధంగా కాంక్రీటు మిక్చర్‌ వాహనాల రాకపోకలకు వేర్వేరుగా దారులు ఏర్పాటు చేశాం. ప్రతి నిమిషాన్ని ఎంతో విలువైనదిగా పరిగణించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని గిన్నిస్‌ రికార్డు సాధించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. రికార్డు నమోదుకు లండన్‌ గిన్నిస్‌ బుక్‌కు సంబంధించిన ఇద్దరు అధికారులు వస్తున్నారు. పీహెచ్‌ డీ చేసిన మరో 8 మంది నిపుణులు న్యాయనిర్ణేతలుగా వస్తున్నారు. మొత్తం 24 మంది ఈ రికార్డును పరిశీలించడానికి రానున్నారు’ అని తెలిపారు. గిన్నిస్‌ బుక్‌ అధికారులు ప్రతి 15 నిమిషాలకోసారి బ్లాస్టింగ్‌ పాయింట్ల వద్ద ఎంత కాంక్రీటు తయారవుతోంది.. ఏయే ప్రాంతాల్లో వేస్తున్నారు. దాని క్వాంటిటీ ఎంతనే విషయాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారని రమేశ్‌బాబు చెప్పారు.
 
నమోదు చేసిన వివరాలను ప్రతి గంటకు వీడియో తీసి పంపిస్తామన్నారు. వీటన్నిటినీ లండన్‌ నుంచి పరిశీలించి గిన్నిస్‌ బుక్‌లో రికార్డు చేసేవరకు వెల్లడించరని, రికార్డు పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తారని వెల్లడించారు. రికార్డు నమోదు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖలో ఉన్న 2,500 మంది నుంచి 3 వేల మంది ఇంజనీర్లు పోలవరం వస్తారని, ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సీనియర్‌ మేనేజరు కాంత్రి, ఈఈ శ్రీనివాసరావు, పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. కాగా.. రికార్డు పనుల పర్యవేక్షణకు వస్తున్న అధికారులకు ప్రాజెక్టు ప్రాంతం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాఫర్‌ డ్యాం వద్ద ఇసుక తెన్నెలపై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
 
మోదీ తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలి: ఉమ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన ప్రధాని మోదీ తెలుగు జాతికి క్షమాపణలు చెప్పాలని మంత్రి దేవినేని డిమాండ్‌ చేశారు. అవార్డు అందుకున్నాక ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ తెలుగు జాతిపై కక్షగట్టారని విమర్శించారు. జూనియర్‌ మోదీ జగన్‌, సీనియర్‌ మోదీ కేసీఆర్‌తో కుమ్మక్కై.. 3డీ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
Advertisement

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...