Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
శరవేగంగా కియా పనులు
వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి మొదలు
భారతీయుల కోసం  ఎస్పీ-2 మోడల్‌
12ap-main8a.jpg

ఈనాడు, అనంతపురం: కియా కార్ల తయారీ పరిశ్రమ పనులు వేగంగా జరుగుతున్నాయనీ, అన్ని విభాగాల పనులు కొలిక్కి వస్తున్నాయనీ, వచ్చే ఏడాది నుంచి ఇక్కడ నుంచి కార్ల ఉత్పత్తి మొదలవుతుందని ఆ సంస్థ ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ ఎస్డీ పార్క్‌ తెలిపారు. అనంతపురంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కియా పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. పార్క్‌తోపాటు, సంస్థ ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ రాజశేఖరన్‌, మార్కెట్‌ విభాగ లీడ్‌ పీఆర్‌ కుష్బూ గుప్తా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కియాలోని ప్రధాన కార్యాలయంతో సహా వివిధ విభాగాల పనులను వేర్వేరు సంస్థలకు ఇచ్చి చేయిస్తున్నట్లు చెప్పారు. రోజుకు దాదాపు 4,153 మంది పనుల్లో పాలుపంచుకుంటున్నారన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయిలో కార్ల తయారీ మొదలవుతుందన్నారు. ఏడాదికి 3 లక్షల కార్లు ఇక్కడ సిద్ధమవుతాయని చెప్పారు. భారతీయ మార్కెట్‌ కోసం తొలుత ఇక్కడ ఎస్పీ-2 మోడల్‌ కారును తయారు చేస్తున్నామన్నారు. భారతీయుల కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

10 వేల మందికి ఉపాధి....
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌తో కియాకు అనుంబంధమైన పరిశ్రమలు మరో 4, ఇతర విడిభాగాలు అందించే మరో 11 పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. తద్వారా అనంతపురం జిల్లాతోపాటు, పెనుకొండ ప్రాంతం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని వివరించారు. కియా పరిశ్రమలో మూడు వేల మందికి ఉపాధి కలగనుండగా, అనుబంధ పరిశ్రమల్లో 6,400 మందికి ఉపాధి దక్కుతుందని చెప్పారు. కియాలో అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు పార్క్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి ప్రజలు పరిశ్రమ ఏర్పాటుకు ఎంతో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

హరిత మంజరి.. భవిత రంజని!
ఇక కియా.. కాలుష్యరహిత ప్రాంతం
చుట్టూ పది కి.మీ. పరిధిలో ప్రత్యేక జోన్‌
కాలుష్యం వెదజల్లే వాటికి అనుమతుల్లేవ్‌
ప్రత్యేకంగా దృష్టి సారించనున్న అహుడా
atp-top1a.jpg
పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ సిద్ధమవుతోంది. దీనికి తోడు అనుబంధ పరిశ్రమలు కూడా చకచకా కొలువు దీరుతున్నాయి. సాధారణంగా ఇలా వరుసగా పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ వాయు కాలుష్యం ఎక్కువ అవుతుందని అంతా భావిస్తారు. కానీ... కియా పరిధిలో అసలు కాలుష్య ఛాయలే లేకుండా, పూర్తిస్థాయి కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నారు. ఈ బాధ్యతను అహుడా చేపట్టనుంది.
ఈనాడు - అనంతపురం

పెనుకొండ వద్ద ఏర్పాటవుతున్న కియా పరిశ్రమ కేంద్రంగా చుట్టూ ఉన్న ప్రాంతమంతా మున్ముందు కాలుష్యరహిత, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చూడనున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44ను ఆనుకొని, పెనుకొండ మండలం అమ్మవారిపల్లె వద్ద 536 ఎకరాల్లో కియా పరిశ్రమ ఏర్పాటవుతోంది. ఈ పరిశ్రమ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసకంలో ట్రయల్‌ రన్‌, సెప్టెంబరు నుంచి నిరంతర కార్ల తయారీ మొదలు పెట్టాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇక కియాలోనే నాలుగు అనుంబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండగా, సమీపంలో 4, కొంత దూరంలో మిగిలిన 7 కలిపి మొత్తం 11 అనుబంధ పరిశ్రమలు సిద్ధం అవుతున్నాయి. ఇవేకాకుండా కియాకు దగ్గరలో మరికొన్ని సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అధికారులు కూడా దాదాపు 2 వేల ఎకరాలను గుర్తించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చ వారికి ఆ భూములను ఇచ్చేలా చూస్తున్నారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఉండేలా చూశారు. మరోవైపు ఇన్ని పరిశ్రమల ఏర్పాటుతో ఆ ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారుతుందని భావిస్తే.. అది పొరపాటే. కాలుష్యం లేని ప్రాంతంగా తీర్చిదిద్దేలా అధికారులు ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

తెలుపు, ఆకుపచ్చ జోన్‌లుగా..
కియాతోపాటు, జిల్లాలోని జాతీయ రహదారి-44 ఆనుకొని ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు అహుడా పరిధిలో చేరింది. దీంతో అహుడా అధికారులు కియా చుట్టుపక్కల కాలుష్య ప్రభావం అనేదే లేకుండా చూసేందుకు ఓ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.

* కియా పరిశ్రమలోని ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని, దానికి చుట్టూ 10 కి.మీ. దూరం వరకు ఏమాత్రం కాలుష్యం లేని ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు.
* ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు, మరే ఇతర ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయాలన్నా సరే అహుడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దీంతో వాటిలో కాలుష్య ప్రభావం లేని వాటికే అనుమతులిస్తారు.
* కియా పరిశ్రమలో ఎటువంటి పరికరాలు తయారు కావు. ఇది కేవలం అసెంబుల్డ్‌ యూనిట్‌ కావడంతో దీని నుంచి ఎటువంటి కాలుష్యం వెలువడదు. ఇక అనుబంధ పరిశ్రమలు కూడా దాదాపు అంతే. దీంతో కియా పరిశ్రమలతో కాలుష్య ప్రభావం ఉండదని తేల్చారు.
* కియా ప్రతినిధులు కూడా తమ ప్రాంతం చుట్టూ అసలు కాలుష్య ప్రభావం లేకుండా చూడాలనీ, తాము కూడా ఇందుకు సహకరిస్తామని ముందే కోరారు. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
* కియాకు పది కి.మీ. దూరంలో ఎక్కడైనా టౌన్‌షిప్‌లు, ఇతర నిర్మాణాలు వంటి అన్నింటిలో కాలుష్య ప్రభావం లేకుండా చూస్తారు. అలాగే పరిశ్రమల సమీపంలోనూ, టౌన్‌షిప్‌లు, రహదారుల వెంట పచ్చదనం ఉండేలా చూడనున్నారు.
* కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఏదైనా ప్రాంతంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఐదు రంగులుగా గుర్తిస్తారు. ఇందులో కాలుష్యం లేని, అతి తక్కువ కాలుష్యం ప్రభావం మాత్రమే ఉండే తెలుపు, ఆకుపచ్చ జోన్‌లుగా ఈ కియా పరిసర ప్రాంతాలు ఉండేలా అహుడా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలో దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

29 minutes ago, aditya369 said:

so mostly ikkada assemble chestaru, not manufacturing?

A Car will have 30000 of parts. All parts cannot be manufactured in one place.  There will be ancillary units providing those parts. some might be imported from different countries too.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Kia Motors plant to fast-track Anantapur's makeover as manufacturing hub of Andhra Pradesh

South Korean carmaker Kia Motors is currently setting $1 billion worth manufacturing plant at Anantapur district of Andhra Pradesh. The plant will be operational in mid-2019 and developments are in swing.

 
Oct 31, 2018 16:59 IST
      •  
         
         
         
         
         
 
  •  
     
     
     
     
     
 

When it comes to vehicle manufacturing in India, Tamil Nadu is one of the most preferred states. The southern state is often referred to as the Detroit of South Asia owning to plants of automobile majors Daimler, BMW, Hyundai, Renault-Nissan, Ford and Ashok Leyland. Maharashtra is the next best in the business with Mahindra, Tata Motors, Jaguar, Land Rover, Volkswagen and other under the belt. However, Andhra Pradesh was never in the frame until South Korean carmaker Kia Motors decided to build their first plant in India at Anantapur district.

Kia Motors India Anantapur Plant
 
Main entrance of Kia Motors India plant in Anantapur district of Andhra PradeshKen Sunny
 

While Tamil Nadu, Maharashtra and Gujarat are the hotbeds of vehicle manufacturing in India, Kia Motors decision to set up its plant at southern state of Andhra Pradesh may sound like a senseless move. Despite all the odds, Kia Motors India and Government of Andhra Pradesh signed the deal in April 2017 and the plant construction in Yerramanchi village at Penukonda Mandal of Anantapur is currently in full swing.

Kia Motors India Anantapur plant

Main entrance of Kia Motors India plant
 
Main entrance of Kia Motors India plantKen Sunny
 

The South Korean carmaker is investing over $1 billion to set up its new manufacturing facility in India. The 536 acres plant will have 3 lakh units of production capacity and it will employ around 3,000 when fully operational. Kia Motors conducted the framework installation ceremony in February this year is in top gear and now inching closer to the finishing construction and trail run has been scheduled in early 2019.

1/2
  • Kia Motors India plant
     
    Kia Motors India plantKia Motors
  • Kia Motors
     
    Test track under construction at Kia Motors India plantKen Sunny

PreviousNext

The Anantapur plant consists of a press shop, body shop, paint booth, assembly line, engine and transmission manufacturing units, a giant test track, a large canteen and others. Kia Motors has also set up a training centre and a new township is under construction on the other side of National Highway 44 where the plant is located.

Kia Motors India Anantapur Plant
 
Kia Motors India Anantapur plant siteKia Motors
 

Kia Motors training centre

In June this year, Kia Motors India inaugurated a 5-acre training facility right opposite to the plant. The company also introduced a Basic Technical Course (BTC) in automobiles for skill development. The course has been designed for anyone who wishes to work in the automobile sector at the entry level in collaboration with Andhra Pradesh State Skill Development Corporation (APSSDC). As a part of the course, various batches of trainees will undergo a five day BTC training which will provide the basic technical skills required. The selected candidates will be inducted to Kia Motors India plant.

Kia Motors India training centre
 
Kia Motors India training centreJagadish Singh
 

Kia Motors plant transforming Anantapur

Before the arrival of Kia Motors, Anantapur was just another district in the southwestern part of the state with no manufacturing pedigree. Andhra Pradesh has marketed itself as a dream investment destination after the separate state of Telangana was carved out of it in 2014. CM of Andhra Pradesh N Chandrababu Naidu was keen to bring Kia Motors to his state and Anantapur is now reaping the benefit. Along with the Kia Motors plant, many ancillary industries producing parts for the automaker have started working on their units in the vicinity of Anantapur and it is expected to create a job opportunity of up to 10,000. The proximity to Bengaluru International Airport and Chennai port also open the door for easy exports for Kia Motors in the future.

Kia Motors India
 
Many South Korean internationals are active in the construction of Kia Motors India plantKia Motors
 

Kia Motors plant is expected to be the harbinger of Anantapur's quest to become a new vehicle manufacturing hub in India. Future investors cannot turn their back to Anantapur for the unprecedented support from administration and availability land. A new Detroit of South India in the making?

Link to comment
Share on other sites

జనవరి 29... అనంతపురం కియాలో కీలకమైన రోజు..

   
kia-02112018-1.jpg
share.png

అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది.

 

kia 02112018 2

కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం ఓ వరమని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటవుతున్న కియా పరిశ్రమను గురువారం ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జనవరి 29న ట్రయల్‌ కారు తయారు చేసి ఇస్తామని కియా ప్రతినిధులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

kia 02112018 3

ప్రస్తుతం పరిశ్రమలో కారు బాడీ ప్రెస్సింగ్‌ యూనిట్‌ పనులు 98.3 శాతం, బాడీ తయారీ యూనిట్‌ పనులు 99.2శాతం, పెయింటింగ్‌ యూనిట్‌ 95 శాతం, ఇంజిన్‌ యూనిట్‌ 95శాతం, అసెంబుల్డ్‌ యూనిట్‌ 95.8 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనవరిలో ముఖ్యమంత్రి మొదటి కారును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మెగా పరిశ్రమలే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్‌ఎంఐ పార్కు (స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇప్పటికే 35 నియోజకవర్గాలను గుర్తించినట్లు వివరించారు.

 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రభుత్వంతో కియా మోటార్స్‌ తుది ఒప్పందం
కియా మోటార్స్‌ నిర్వాహకులు ప్రభుత్వంతో తుది ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ సంస్థ, అనుబంధ పరిశ్రమలు కలిపి రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో తుది ఒప్పందం చేసుకున్నారు. సచివాలయంలో గురువారం పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, కియా మోటార్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ కూక్‌ హాన్‌ షిమ్‌ మధ్య ఇది జరిగింది.
Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:
Jm-UzsO8_bigger.jpg Lokesh NaraVerified account @naralokesh

KIA cars ranging from Rs. 6 lakhs to Rs. 26 lakhs were lined up during the dealers’ plant visit organized today. The disciplined construction effort by KIA has led to 90% completion of the plant within a short period of time, giving employment to 9500 people already. #KIAmotors

https://pbs.twimg.com/media/DsIn2nOVYAYKNPH.jpg

https://pbs.twimg.com/media/DsIn2nOVsAAz8Pm.jpg

Benz car lekka vundhi ga :super:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కియ కరెంటు కార్లొచ్చాయ్‌!
30-11-2018 02:44:34
 
636791426757944698.jpg
  • సచివాలయంలో పరుగులు
సచివాలయంలోకి నాలుగు ఎలక్ట్రిక్‌ కార్లు వచ్చేశాయి. కియ కంపెనీ నాలుగు హైబ్రిడ్‌ కార్లను పంపింది. వీటిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించనున్నారు. సచివాలయంలో 5వ బ్లాక్‌ పక్కన చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కోసం సచివాలయంలో 4 చార్జింగ్‌ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కియ ఎలక్ట్రిక్‌ కార్లను బుధవారమే ముఖ్యమంత్రి ప్రారంభించాల్సి ఉంది. కానీ... ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వచ్చే నెల 9 తేదీన ఎలక్ట్రిక్‌ కార్లను ప్రారంభించే అవకాశముందని మంత్రి అమర్నాథరెడ్డి తెలిపారు.
 
- అమరావతి, ఆంధ్రజ్యోతి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...