Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
కియ’లో శిక్షణ జోరు
31-07-2018 03:17:43
 
636686038643715966.jpg
  •  ఒక్కో బ్యాచ్‌కు 33మంది అభ్యర్థులు
  •  ఇప్పటికే 80మందికి తరగతులు పూర్తి
పెనుకొండ టౌన్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): దక్షిణకొరియాకు చెందిన కియ కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారుపల్లి వద్ద శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు ఈ సంస్థలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఆధ్వర్యంలో దుద్దేబండ క్రాస్‌ వద్ద ఏర్పాటుచేసిన కియ శిక్షణ కేంద్రంలో తరగతులు ప్రారంభించారు. దీనికోసం దరఖాస్తు చేసుకున్న డిప్లమో విద్యార్థుల్లో ఎంపిక చేసిన 2,145మందికి గాను 1,100మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైనవారికి ఆటోమొబైల్‌ పరిశ్రమల కోసం ప్రాథమిక సాంకేతిక కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు.
 9kia2sss.jpg
కియలో నేరుగా 4వేల మందికి, పరోక్షంగా 7వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు పలు విభాగాల్లో శిక్షణ జోరుగా సాగుతోంది. నేరుగా ఉద్యోగ అర్హత సాధించినవారితో పాటు సాంకేతిక శిక్షణలో నైపుణ్యం కనబరచిన అభ్యర్థులకు 4వారాల శిక్షణ తరగతులు ప్రారంభించారు. 33మంది చొప్పున బ్యాచ్‌లుగా విభజించి కారు విడిభాగాలు అమర్చడం, తొలగించడం, బాడీషాప్‌, పెయింట్‌షాప్‌ విభాగాల్లో 11మంది ప్రత్యేక ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటివరకూ 80మందికి శిక్షణ పూర్తిచేశామని ఏపీఎస్ఎస్ డీసీ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
Link to comment
Share on other sites

కరవు పల్లెల్లో కియా సిరులు 
ప్లాంట్‌ రాకతో మారిన అనంత గ్రామీణ జీవన చిత్రం 
శిరికి సూర్యనారాయణ 
అనంతపురం జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి 
4ap-main4a.jpg

ఒక భారీ పరిశ్రమ రాకతో ఆ ప్రాంతం రూపురేఖలు ఎంతగా మారిపోతాయో..ప్రజల జీవన శైలిలో ఎన్ని మార్పులు వస్తాయో అనంతలో నిర్మితమవుతున్న ‘కియా’ కార్ల పరిశ్రమతో నిరూపితమవుతోంది. ‘రాయలసీమ..రతనాల సీమ’ అన్న గత కీర్తి మరోసారి ఈ ప్లాంట్‌ రాకతో వచ్చిందనిపిస్తోంది. ఇక్కడ స్థాపిస్తున్న పరిశ్రమతో జిల్లాలోని పలు మండలాల్లో ప్రజల జీవన చిత్రమే మారిపోయింది. పేదరికం తాండవం చేసే పల్లెల్లో నేడు ‘సిరు’ల జల్లులు కురుస్తున్నాయి. వలసలతో బోసిపోయి ఉండే గ్రామాలకు నేడు పక్క రాష్ట్రాల నుంచి వలసలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. సంవత్సరం కాలంలోనే గ్రామాలు పట్టణ శోభను సంతరించుకున్నాయి. లక్షల మంది భవితవ్యం బంగారుమయంగా మారింది.

4ap-main4c.jpg

 

4ap-main4b.jpg* రూ.7 లక్షల నుంచి కోటికి పెరిగిన ఎకరా ధర 
* భారీగా ఇళ్ల నిర్మాణం  
* రూ.వేలల్లో అద్దెలు 
* రెస్టారెంట్లు, దాబాలు, సూపర్‌ మార్కెట్లతో గ్రామాలకు కొత్త శోభ 
* రోజూ పది వేల మందికి ఉపాధి 
* మార్చిలో మొదటి కారు మార్కెట్‌లోకి వచ్చేలా ప్రణాళికలు

వలసలతో ఏడాదిలో ఆరేడు నెలలు ఖాళీగా ఉండే ఇళ్లపై ఇప్పుడు అంతస్థులు వెలుస్తున్నాయి. ఉపాధి కోసం వెళ్లి తిరిగొచ్చేవరకు ఇంటిని ఉచితంగా వాడుకోమన్నా ఎవరూ ఊ కొట్టని గ్రామంలో ప్రస్తుతం అదే ఇళ్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు అద్దెలు వస్తున్నాయి. నీటి తడుల్లేక వ్యవసాయం పండక ఎందుకూ ఉపయోగ పడటం లేదన్న భూములు..ఎకరా రూ.7లక్షల ధరకు కొనని భూముల ధర నేడు కోటికి పైనే.. రూ.లక్ష చూడని కళ్లు ఇప్పుడు రూ.కోట్లను దర్శిస్తున్నాయి. సొంతూర్లలోనే చేతినిండా పని. కాస్త ఓపిక ఉండాలే గానీ రోజూ రూ.350 నుంచి రూ.500 సంపాదించుకుంటున్న పరిస్థితి. డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ చేసి కాస్త నైపుణ్యం కలిగిన వారికి ఐదంకెల జీతాలతో తలరాతలే మారిపోనున్నాయి. ఇదంతా అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మెటార్స్‌ యూనిట్‌ ఏర్పాటు మహత్యం.

కియా మోటార్స్‌ యూనిట్‌ పనులు ఏడాదిలో 75 శాతానికిపైగా పూర్తి చేయడం దేశంలోనే రికార్డుగా చెబుతున్నారు. గుజరాత్‌లో నానో కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు స్వల్పకాల వ్యవధిలో పూర్తి చేసినా అందులో పెట్టుబడి, నిర్మాణ విస్తీర్ణం కియా కంటే చాలా తక్కువ. గత ఏడాది జూన్‌లో కియాకు అప్పగించిన భూముల్లో అత్యధిక ప్రాంతం కొండలు, గుట్టలే. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏపీఐఐసీ ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకొని ఆరు నెలల వ్యవధిలో 80 లక్షలకుపైగా క్యూబిక్‌ మీటర్లలో కొండలను బ్లాస్టింగ్‌ చేసి గోతులను పూడ్చే పనులు పూర్తి చేయించింది. ఏపీఐఐసీ చదును చేసిన భూమిని ఒక వైపున అప్పగిస్తుంటే మరో వైపున కియా అనుబంధ సంస్థ హుండాయ్‌ ఇంజనీరింగ్‌ కనస్ట్రక్షన్స్‌ (హెచ్‌ఈసీ) ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి చంద్రబాబు కియా ‘ఫ్రేం వర్క్‌ ఇనస్టలేషన్‌’ కార్యక్రమంలో పాల్గొనేనాటికి 20 శాతానికిపైగా ప్లాంట్‌ పనులు పూర్తయ్యాయి. తరువాత ఐదు నెలల వ్యవధిలో మరో 55 శాతం పనులు పూర్తి చేశారు. మార్చికి మొదటి కారును మార్కెట్లోకి తీసుకొచ్చేలా నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించారు. యూనిట్‌ పనుల కోసం రోజూ దాదాపు పది వేల మందికిపైగా వివిధ విభాగాల్లో పనిచేస్తుండగా.. కొరియా నుంచి తీసుకొచ్చిన 400 మంది నిపుణులు యూనిట్‌ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు.

535.50 ఎకరాలలో.. ప్లాంట్‌లో ప్రధానమైన ఇంజినీరింగ్‌ షాపు, ప్రెస్‌ ఫిట్‌, బాడీ షాపు, ఎసెంబ్లీ యూనిట్‌, పెయింట్‌ షాపు, యూటిలిటీ యూనిట్‌, టెస్టింట్‌ ట్రాక్‌ ఏరియా, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌, పరిపాలన భవనం పనులు అత్యంత భద్రత ఏర్పాట్లు మధ్య శరవేగంగా నిర్వహిస్తున్నారు. 24 గంటల విద్యుత్తు, తాగునీటి సరఫరా, ఇతరత్రా సదుపాయాల పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.

రూ.200 కోట్లు: కియా మోటార్స్‌కు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏపీఐఐసీ వెచ్చించిన వ్యయమిది. 180 ఎకరాల్లో కెనాల్‌ మళ్లింపు, రహదారుల పనుల కోసం ఈ మొత్తాలను వెచ్చించారు. 
36 ఎకరాలలో టౌన్‌షిప్‌: ప్లాంట్‌లో సేవలు అందించే కొరియన్ల కోసం ప్రత్యేకంగా టౌన్‌షిప్‌ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఏడాదిలో ఈ పనులు పూర్తికానున్నాయి.

11.20 ఎకరాలలో శిక్షణ కేంద్రం: కియాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేందాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది బృందానికి ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన కేంద్రంలో ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. 6,500 మంది నిరుద్యోగ యువత శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.

100 ఎకరాలు: రైల్వే స్లైడింగ్‌ యూనిట్‌ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 48.47 ఎకరాల్లో ట్రక్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేస్తారు. కార్లు ఇక్కడి నుంచి వ్యాగన్లలో నింపి ప్రధాన రైల్వే మార్గంలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు.

వ్యాపారం ...ఉపాధి 
కియా మోటార్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరాకు రూ.10.50 లక్షలు చొప్పున చెల్లించారు. చాలామంది రైతులు వేరొకచోట భూములు కొనుగోలు చేసి మిగతా మొత్తాలను కొత్త ఇళ్ల నిర్మాణం, ఉన్న ఇళ్ల విస్తరణ కోసం వెచ్చిస్తున్నారు. వీరిలో అత్యధికులు మళ్లీ కియా మోటార్స్‌ పనుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కొందరు ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు కొనుగోలు చేసి కియా అవసరాలకు అందిస్తున్నారు. పెనుకొండ, అమ్మవారిపల్లె, కురుమాండ్లపల్లెలో ఇళ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టి కొరియన్లతోపాటు ఇతరులకు అద్దెలకు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పెనుకొండలో రెండు పడక గదుల ఇళ్లు నెలకు రూ.5 వేలు నుంచి రూ.6 వేల అద్దెకు లభించే పరిస్థితి నుంచి నేడు రూ.15 వేలు నుంచి రూ.25 వేలుకు చేరుకుంది. 
 

రికార్డు కియా
కొరియా వ్యాపారులు ఇక్కడి అవసరాలను గుర్తించి వారే ఇక్కడ రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేశారు.
4ap-main4e.jpg
4ap-main4n.jpg* రూ.13 వేల కోట్ల భారీ పెట్టుబడితో ప్రారంభమైన కియా మోటార్స్‌ యూనిట్‌ పనులు ఏడాదిలో 75% పైగా పూర్తి కావడం దేశంలోనే రికార్డు. 
* కియాకు అనుబంధంగా 130 ఎకరాల్లో 8 కంపెనీల పనులు ప్రారంభమయ్యాయి. కార్ల తయారీకి అవసరమైన విడి భాగాలను ఇవి తయారు చేస్తాయి.

11.20 ఎకరాలలో శిక్షణ కేంద్రం 
4ap-main4m.jpg* అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్‌ డిప్లమో, ఇంజినీరింగ్‌, డిగ్రీ, టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేసిన యువతను ఎంపిక చేసి వీరందరికీ కొరియా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. 
* ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వేల సంఖ్యలో కియా మోటార్స్‌ పనులతో ఉపాధి పొందుతున్నారు. 
* చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు,  ఇళ్లఅద్దెలు బాగాపెరిగాయి.


4ap-main4f.jpg
ప్రభుత్వ ఆదేశాలపై కియా మోటార్స్‌కు అవసరమైన సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. భూములు చదును, రహదారి పనులు పూర్తి చేశాం. బస్‌ స్టేషన్‌, అగ్నిమాపక కేంద్రం, పోలీస్‌ ఔట్‌పోస్టులకు కావలసిన స్థలాలు కేటాయించాం. అదనంగా మరో 78 ఎకరాలు ఇస్తున్నాం. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సంస్థకు ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీ అండగా ఉంటుంది.
- రఘునాథ్‌, ఏపీఐఐసీ, డీజీఎం, అనంతపురం
కొరియన్ల కోసం ప్రత్యేక రెస్టారెంట్లు 
4ap-main4l.jpg
కియా మోటార్స్‌ పనుల్లో భాగస్వాములవుతున్న 400 మందికిపైగా కొరియన్ల కోసం గ్రామాల్లో ప్రత్యేకంగా రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. పెనుకొండ, సోమందపల్లె, అమ్మవారిపల్లె, గుట్టూరులో ప్రస్తుతం ఆరు రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. పెనుకొండ, గుడిపల్లె వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా మరో రెండు భారీ రెస్టారెంట్ల పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.
4ap-main4d.jpg
అప్పులు తీర్చుకొని హాయిగా జీవనం... 
4ap-main4j.jpg
‘కియా మోటార్స్‌ కోసం ఇచ్చిన 4.5 ఎకరాల భూమికి రూ.55 లక్షల పరిహారం వస్తే అప్పులన్నీ తీర్చేసి రెండు అంతస్థుల బిల్డింగ్‌ కట్టి అద్దెలకు ఇచ్చాను. నెలకు రూ.20 వేలకుపైగా అద్దెలు వస్తున్నాయి. మరికొంత మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశాను. అంతకు ముందు పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రస్తుతం సాఫీగా జీవనం సాగిస్తున్నాం’
- జి.జయచంద్రారెడ్డి, రైతు, అమ్మవారిపల్లె
వలసల బాధ తప్పింది.... 
4ap-main4i.jpg
‘వ్యవసాయంతో గత రెండున్నరేళ్లలో రూ.2.50 లక్షలు నష్టపోయాను. ప్రతి ఏటా ఉపాధి కోసం వలసలు వెళ్లే వాళ్లం. కియా రాకతో ఇప్పుడా బాధలు తప్పాయి. ప్రస్తుతం ఇక్కడ గార్డుగా పని చేసి నెలకు రూ.10 వేల జీతం తీసుకుంటున్నా...సొంతూర్లో ఇంతకంటే ఇంకెం కావాలి?’
-కె.రామాంజనేయులు, రైతు,నాగసముద్రం
ఉపాధి కోసం వలస వచ్చాం.... 
4ap-main4h.jpg
‘బీహార్‌లో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కియా మోటార్స్‌ పనులు ప్రారంభమయ్యాయంటే ఉపాధి కోసం వందమందికిపైగా కలిసి వచ్చాం. ఇక్కడ మాకు రోజుకు రూ.400 వస్తోంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడ బాగున్నాయి’
- ప్రసాద్‌ మండల్‌, కూలీ, బీహార్‌
శిక్షణతో చక్కని నైపుణ్యం 
4ap-main4g.jpg
‘కియా మోటార్స్‌ తరఫున కొరియా నుంచి వచ్చిన నిపుణులు అందిస్తున్న శిక్షణ ఎంతో బాగుంది. కార్లు తయారీ, వీటిలో వివిధ విభాగాలు, సాంకేతిక సమస్యలు ఎదురైతే ఏవిధంగా పరిష్కరించాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పూర్తయ్యాక మరోసారి పరీక్ష నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. సొంత జిల్లాలో ఇలాంటి అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది’
- మంజునాధ్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థి, కొర్రపాడు
కొరియా నేర్చుకుంటున్నా... 
4ap-main4k.jpg
‘కియా రాకతో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంతో కొరియా భాష నేర్చుకుంటున్నా...పెనుకొండలోని సత్యసాయి డిగ్రీ కళాశాలలోనూ కొత్తగా కోర్సు కూడా ప్రవేశపెడుతున్నారు. నేను పని చేస్తున్న సూపర్‌ మార్కెట్‌లోనూ ఎక్కువగా కొరియా వస్తువులే విక్రయిస్తున్నాం.’
- ఎస్‌.రుచితాసాయి, పెనుకొండ
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

f6ri71j.jpg

KOrean language witll fetch more companies. Hope every one who learns language will get the job.

 

This is added advantage for AP.

 

They should also start teaching japanese language in sri city. Japs are booming in sricity, considering the lack of resources in Japan, Andhrites can grab the oppurtunity, like they did to US during Y2K.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...