Jump to content

KAVITHA ARRESTED


Recommended Posts

  • Replies 464
  • Created
  • Last Reply

Top Posters In This Topic

వితను కలిసిన కుటుంబసభ్యులు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు.

Published : 18 Mar 2024 05:41 IST
 
 
 
 
 
 

gh170324main4b.jpg

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్‌కుమార్‌, సోదరుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  కవితను ఈడీ విచారించింది. విచారణ ముగిసిన తర్వాత ఆమెను కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు.  ఈడీ కార్యాలయం వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వచ్చినా.. వారు బయటే ఉండిపోయారు. కవితను కలిసిన తర్వాత కుటుంబసభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు.

Link to comment
Share on other sites

MLC Kavitha: ఆప్‌ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) ప్రకటన విడుదల చేసింది.

Updated : 18 Mar 2024 18:11 IST
 
 
 
 
 
 

124053601_180324kavita-inner.jpg

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ED) ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం (delhi liquor scam) కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.

‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం’’ అని  పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ.. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

Link to comment
Share on other sites

ఈడీ మళ్ళీ ప్రెస్‌నోట్‌ విడుదల చేయడం బహుశః కేసీఆర్‌ను హెచ్చరించడం వంటిదే అని భావించవచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అభ్యర్ధులకు అడ్డు తగలొద్దు… తగిలితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని ఈవిదంగా హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...