Jump to content

TDP 2nd list announced


Recommended Posts

8 hours ago, Vinod NKR said:

Proddatur and KamLapuram list is perfect 

Ela perfect bro proddutur , parvenu Kumar teddy ni work chesukomani cheppi last min lo hand ivadama ..papam Prateek Kumar 

Link to comment
Share on other sites

అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో పట్టున్నవారికే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోంది. 94 మందితో ఇదివరకే విడుదల చేసిన మొదటి జాబితాలోనేగాక 34 మంది అభ్యర్థులతో గురువారం ప్రకటించిన రెండో జాబితాలో కూడా ఇదే కోణం ప్రధానంగా ప్రతిఫలించింది. ఈ 34 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. కొన్నిచోట్ల మార్పుపై తర్జనభర్జనలు జరిగినా ప్రజల్లో సానుకూలత ఉందనుకున్న చోట సీనియర్లకే అవకాశం ఇచ్చారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు దీనికి ఉదాహరణ. వయోవృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వరదరాజులురెడ్డి(81)కి టికెట్‌లభించింది. ఆయన వయసు రీత్యా బాగా సీనియర్‌. ఆయన కంటే ఆర్థికంగా బాగా స్థితిమంతులు, యువ నేతలు పోటీపడ్డారు. కానీ పార్టీ సర్వేల్లో ప్రజాదరణలో వరదరాజులురెడ్డికే ఎక్కువ మొగ్గు ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకే అవకాశమిచ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు నియోజకవర్గ బాధ్యతలు వద్దంటూ వైదొలిగారు. అక్కడ బత్తుల తాతయ్యబాబును ఇన్‌చార్జిగా నియమించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ రాజు పార్టీ పనికి ముందుకొచ్చారు. తాతయ్యబాబుతో వైరం పెట్టుకోకుండా కలిసి పనిచేశారు. ఇప్పుడు సర్వేలు చేస్తే ప్రజలు ఆయనవైపే మొగ్గు చూపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రజాదరణ వల్ల ఆయనకు అవకాశం దక్కింది. మొదటి జాబితాలో నంద్యాల అసెంబ్లీ సీటును ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన టీడీపీ.. రెండో జాబితాలో గుంటూరు తూర్పు, మదనపల్లె సీట్లను ఆ వర్గానికే చెందిన మహమ్మద్‌ నజీర్‌, షాజహాన్‌ బాషాలకు కట్టబెట్టింది. ఒక టీవీ చానల్లో పాత్రికేయుడిగా పనిచేసిన డాక్టర్‌ మురళీమోహన్‌కు పూతలపట్టు (ఎస్సీ) స్థానం కేటాయించారు. రంపచోడవరం (ఎస్టీ)లో అంగన్వాడీ మాజీ కార్యకర్త శిరీషకు అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు స్థానం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్‌కు దక్కింది.

 

ముప్పిడి ఇటూ ఇటూ

రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధిలో టీడీపీ దళిత నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన గతంలో గోపాలపురం(ఎస్సీ) ఎమ్మెల్యేగా చేశారు. ఆ నియోజకవర్గంలో ఒక వర్గం ఈసారి కూడా ఆయనకే టికెట్‌ ఇవ్వాలని కోరింది. అదే లోక్‌సభ స్థానం పరిధిలోని కొవ్వూరు (ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ నేతలు సైతం అనూహ్యంగా ఆయన్ను తమ స్థానంలో నిలబెట్టాలని అధిష్ఠానాన్ని కోరడం విశేషం. ఒక దళిత నేత కోసం రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థనలు రావడం అరుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ముప్పిడిని కొవ్వూరు అభ్యర్థిగా ఎంపిక చేశారు.

 

కుటుంబ సభ్యులకు అవకాశం..

కొన్నిసీట్లలో ప్రస్తుత ఇన్‌చార్జుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం లభించింది. కడప జిల్లా కమలాపురంలో ప్రస్తుత ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి బదులు ఆయన కుమారుడు చైతన్యరెడ్డికి, తిరుపతి జిల్లా వెంకటగిరి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానంలో ఆయన కుమార్తె సాయి లక్ష్మీప్రియకు, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి, ప్రస్తుత ఇన్‌చార్జి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర, అదే జిల్లా కదిరిలో ప్రస్తుత ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ సతీమణి యశోదాదేవికి టికెట్లు ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా ఆకస్మికంగా మరణించడంతో ఆయన సతీమణి సత్యప్రభకు టికెట్‌ ఇచ్చారు.

 

వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు రెండో జాబితాలో టీడీపీ టికెట్లు లభించాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు టికెట్‌ ఇవ్వగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. అదే నియోజకవర్గానికి టీడీపీ టికెట్‌ పొందారు. టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతికి కోవూరు సీటిచ్చారు.

 

బీసీ కోణంలో..

గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఒక సీటు తప్పనిసరిగా బీసీ వర్గాలకు ఇవ్వాలన్న నిర్ణయంతో గుంటూరు పశ్చిమ సీటు పిడుగురాళ్ల మాధవికి దక్కింది. ఆ సీటుకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు పరిశీలించినా బీసీ కోణంలో ఆయనకు అవకాశం దక్కలేదు. మంత్రి విడదల రజనితో మాధవి తలపడనున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో సీనియర్‌ నేత తిక్కారెడ్డి అవకాశం కోల్పోయారు. అక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్‌కు టికెట్‌ దక్కింది.

 

ఇంటర్‌, ఆపైన 29 మంది

టీడీపీ అభ్యర్థుల తాజా జాబితాలో 29మంది అభ్యర్థులు ఇంటర్‌, ఆపైన చదివినవారే. ఇంటర్‌ చదివినవారు 8మంది కాగా గ్రాడ్యుయేట్లు-9, పీజీ-11, పీహెచ్‌డీ-1, టెన్త్‌లోపు చదివినవారు ఐదుగురు ఉన్నారు. 75 ఏళ్లు మించిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. వీరిలో వరదరాజులురెడ్డికి 81ఏళ్లు కాగా... గోరంట్ల బుచ్చయ్యచౌదరికి 77 ఏళ్లు. 25-35 ఏళ్ల మధ్య ఇద్దరు, 36-45 మధ్య 8, 45-60 మధ్య 19, 61-75 మధ్య ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. తాజా జాబితాలో టికెట్లు పొందిన 34 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

16 స్థానాలు త్వరలోనే ఖరారు

మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఇప్పటికి రెండు జాబితాల్లో కలిపి 128 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 16 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు టీడీపీ ప్రకటించిన సీట్లలో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిపి 45శాతం (58సీట్లు) దక్కాయి. ఇందులో ఎస్సీలకు 27, బీసీలకు 24, ఎస్టీలకు 4, మైనారిటీలకు 3 లభించాయి. రెడ్డి సామాజిక వర్గానికి 28, కమ్మ-28, కాపు-8, క్షత్రియ-5, వెలమ-1, వైశ్యులకు రెండు, దక్కాయి.

 

నేడు టీడీపీ ఎంపీల జాబితా?

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను పొత్తులో భాగంగా టీడీపీ 17 స్థానాల్లో పోటీచేయనుంది. టీడీపీ వర్గాల ఆంతరంగిక సమాచారం ప్రకారం ఇప్పటికి ఖరారైన అభ్యర్థులు.. శ్రీకాకుళం-కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విశాఖపట్నం-ఎం.భరత్‌, విజయవాడ-కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్‌, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నరసరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, చిత్తూరు (ఎస్సీ)-దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజంపేట-సుగవాసి బాలసుబ్రమణ్యం, నంద్యాల-బైరెడ్డి శబరి. ఇంకా అమలాపురం(ఎస్సీ), బాపట్ల(ఎస్సీ), కర్నూలు, కడప, ఏలూరు, అనంతపురం, హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు.

 

కమలాపురం, కదిరిలో నేతల కుటుంబ సభ్యులకు అవకాశం

బీసీ కోటాలో గుంటూరు పశ్చిమకు మాధవి

మంత్రాలయంలో రాఘవేందర్‌ కూడా..

వైసీపీ నుంచి వచ్చిన ఆనం, ఆదిమూలానికీ సీట్లు

పూతలపట్టులో పాత్రికేయుడికి చాన్సు

రంప టికెట్‌ అంగన్వాడీ కార్యకర్తకు

 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...