Jump to content

Rationalism-Humanism Discussion Thread

RamaSiddhu J

Recommended Posts

బ్రూనో సజీవ దహనం... అతిపెద్ద మానవ తప్పిదం
—————————————————————————

నేడు సత్యాన్వేషణ  దినం

ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం. ఇటలీలోని రోమ్‌ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్‌ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు.

'నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారులు ఆశ్చర్యపోయారు. వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు. ఇతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు. సైతాను రక్తం భూమిమీద పడితే అరిష్టం సంభవిస్తుంది.. అని తీర్మానించుకున్నారు. మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు. 

అప్పటివరకు మత విశ్వాసకులు భూమి కేంద్రకమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు. అది తప్పని సూర్యుని చుట్టే భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ విషయం అంతకుమందు నికొలస్‌ కోపర్నికస్‌ (1473-1543) చెప్పిందే. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు, ఈ భూమి లాంటి ''భూములు'' (గ్రహాలు) ఇంకా ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆదీ, అంతం ఉన్నాయని మత విశ్వసకులు బోధిస్తూ ఉంటే, అలాంటి వేమీ లేవన్నాడు బ్రూనో. మొత్తానికి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం క్రైస్తవ సన్యాసి అయి ఉండి.. క్రీస్తుకు, బైబిల్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్‌ మత న్యాయస్థానం వారికి ఆగ్రహం తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఆనాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు. మనిషి, మనిషిని - మనిషిగా గుర్తించక పోవడం అతి దారుణంగా చరిత్రలో నమోదయ్యింది.

శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి అయిన గియార్డనో బ్రూనో కాంపోడి ఫియోరి కూడలిలో నిలబెట్టారు. అది పేద క్రైస్తవ సన్యాసులు నివసించే ప్రాంతం. మతానికి వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా వారికి ఇలాంటి గతే పడుతుందని బ్రూనోకు బహిరంగంగా శిక్ష విధించారు. మొదట ఆయన బట్టలూడదీశారు. తర్వాత నగంగా తలక్రిందులుగా వేలాడదీశారు. సజీవంగా నిప్పంటించారు. అక్కడ ఉన్న జనం కన్నీటి పర్యంతమయ్యారు. శాసకుల దురాగతం చూసి భయకంపితులయ్యారు. పొరపాటున వేలి చివర కాలితేనే భరించుకోలేము కదా? 

మరి సజీవంగా కాలిపోవడానికైనా వెనుకాడని బ్రూనో గుండె ధైర్యాన్ని ఎలా అంచనా వేయగలం? కేవలం అభిప్రాయ బేధాలుండడం వల్ల ఒక మనిషిని నిలువునా కాల్చేసిన దురాగతం ఆనాడు అక్కడ జరిగింది. ఒక అబద్దం నిజాన్ని కాల్చేసింది. మతం, విజ్ఞాన శాస్త్రానికి మంటబెట్టింది. మూఢత్వం జిజ్ఞాసను చంపేసింది. గెలిచామనుకున్న మత పెద్దలు ఆరోజు అక్కడ తాత్కాలికంగా సంతోషించి ఉండొచ్చు. కాని మానవ చరిత్రలో వారు దోషులుగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా శాశ్వతంగా మిగిలిపోయారు. 

ఇంతకూ మత న్యాయస్థానం గియార్డనో బ్రూనోపై మోపిన అభియోగాలేమిటీ? ఏఏ కారణాల వల్ల ఆయనకు శిక్ష విధించారు?

1. కేథలిక్కుల నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పుస్తకాలు రాసినందుకు. 

2. జీసస్‌ క్రీస్తును దేవుడిగా కీర్తించడాన్ని నిరసించినందుకు, 

3. ఆనాటి మత బోధకుల విశ్వాసాల్ని.. ట్రినిటీ (ఈశ్వర త్రిగుణత్వవాదం)ని బలంగా దెబ్బతీసినందుకు. 

4. జీసస్‌ తల్లి మేరీ కన్యాత్వాన్ని ప్రశ్నించినందుకు, అంటే.. కన్య అయిన మేరీ క్రీస్తుకు జన్మనెలా ఇచ్చిందీ.. అని అడిగినందుకు.. 

5. పునర్జననం ఉండదని అన్నందుకు. 

6. మానవుడి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించలేదని అన్నందుకు. 

7. మత బోధకులు మాయలు, మంత్రాలతో జనాన్ని మభ్యపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా నిరసించినందుకు.

ఇప్పటికీ బ్రూనో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయా యన్నది మనం గుర్తించుకోవాలి. క్రీ.శ. 1593-1600 మధ్య కాలంలో ఏడేండ్లు చెరసాలలో బంధించి, బ్రూనోను శిక్షించడానికి అన్ని రకాల కారణాల్ని వెతికింది నాటి మత న్యాయస్థానం. అతను పుస్తకాలలో రాసిన విషయాల ఆధారంగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నవారు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కేసును బలోపేతం చేశారు. అబద్దపు కేసుల్ని గెలిపించాలంటే చట్టాలు, న్యాయస్థానాలు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. 

బ్రూనోకు వ్యతిరేకంగా సమకూర్చుకున్న పత్రాలు ఓసారి నోనా టవర్‌లో గల్లంతయ్యాయి. నాటి ప్రభువుల అడుగులకు మడుగులొత్తే వారు కొందరు మరికొన్ని సాక్ష్యాలు తెచ్చి సమర్పించారు. అంటే మూఢుల పట్టుదలను తక్కువగా అంచనా వేయగూడదని మనమిక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. తన తప్పిదాలను ఒప్పుకుని, క్షమాభిక్ష అర్థించవల్సిందిగా నాటి రోమన్‌ మత న్యాయస్థానం బ్రూనో మీద ఎంతగానో ఒత్తిడి తెచ్చింది. 

అయినా స్థిర చిత్తుడైన బ్రూనో లొంగలేదు. వారి అన్ని ప్రయత్నాలు విఫలమైనాయని గ్రహించి ఎనమిదవ పోప్‌ క్లిమెంట్‌ మరణశిక్ష విధించాడు. ఆ రోజు జనవరి 20, 1600 సంవత్సరం. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 17 నాడు అమలులోకొచ్చింది.

పత్రికలు, మీడియా లేని రోజుల్లో విషయాలు ఉన్నదున్నట్టుగా ఎలా బయటకొచ్చాయీ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. బ్రూనో ఆలోచనా విధానంతో ఏకీభవించే వారు సామన్య జనంలో ఉంటారు కదా? వారు చూసింది చూసినట్టుగా ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా బ్రెస్‌ లౌ ప్రాంతానికి చెందిన గాస్పర్‌ స్కూప్‌ అనే అతను అక్కడ జరిగిన సంఘటనల్ని నమోదు చేశాడు. అందులో మానవాళి సగర్వంగా తలెత్తి చెప్పుకోగల విషయం ఒకటుంది. నాటి మత న్యాయాధీశులకు వణుకు పుట్టించే మాట గియార్డనో బ్రూనో అన్నాడని.. గాస్పర్‌ స్కూప్‌ రాశాడు.

''మీరుపలికే ఆ వాక్యం (మరణశాసనం) నా కన్నా అది మిమ్ముల్నే ఎక్కువ భయకంపితుల్ని చేస్తుంది'' అని నిర్భయంగా, ధైర్యంగా ప్రకటించి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు బ్రూనో. గియార్డనో (1548-17 ఫిబ్రవరి 1600) ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ, నాప్లస్‌ రాజ్యం, నోలాలో పుట్టాడు. కవిగా, తత్త్వవేత్తగా, గణిత శాస్త్రాజ్ఞుడిగా పేరు సంపాదించుకున్నా, ఖగోళ సిద్ధాంత కర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలు కచ్చితంగా చెప్పగలిగాడంటే.. ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేసుకోవాలి. చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తరువాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలై ఉండి, వేడినిచ్చే కొన్ని 'సూర్యుళ్ళు' నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టు తిరిగేవాటినే 
''భూములం'టున్నామని, అవి వెలుగునూ, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు. 

అసలు మొదటిసారి నక్షత్రాలను సూర్యుళ్ళుగా గుర్తించింది బ్రూనోయేనని ఆస్ట్రో ఫిసిస్ట్‌ - స్టీవెన్‌ సోటర్‌ ధృవీకరించారు.
అమోఘమైన ధారణాశక్తి, గొప్ప రచనా కౌశలం గియనార్డో బ్రూనో సొత్తు. ధృఢ చిత్తుడిగా ఉండడం, సత్యశోధన కోసం, సత్య స్థాపన కోసం ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలగడం.. ఏ తరం వారికైనా ఆయన ఆదర్శం. ఖాళీ మెదళ్ళతో కేవలం ప్రచార ఆర్భాటాలతో, అబద్దాలతో, నిజాయితీ అనే పదం ఒకటుందని కూడా తెలుసుకోకుండా బతుకుతున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది.

 సత్యం ఏదో తెలిసి కూడా దాన్ని ప్రకటించడానికి జడుసుకునే పిరికి వాళ్ళు మన సమాజం నిండా ఉన్నారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలో కూడా ఉన్నారు. అలాంటి వారు రోజూ బ్రూనో వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుని, తమలో కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకోగలిగితే సమాజాన్ని బాగుచేసిన వారవుతారు. చుట్టూ ఉన్నవారికి ఆదర్శప్రాయులు కావడం తర్వాత, ముందు వారు తమను తాము మోసం చేసుకోకుండా బతికితే చాలు.

వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనోలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మూఢ నమ్మకాల్ని నిరసించారు. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మతపెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్దాలని నిజాలుగా భ్రమింప జేస్తున్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రకంగా తీసుకుని, లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమి తెలుసుకోవాలి!

ఫిబ్రవరి 17వ తేదీ ప్రపంచ ఆలోచనా సరళిని మార్చిన బ్రూనోను గుర్తుచేయడంతో పాటు, అలాంటి మరో మహానుభావుడు ఛార్లెస్‌ డార్విన్‌ను కూడా గుర్తు చేస్తుంది. ఇదే రోజు 1836లో డార్విన్‌ హెచ్చెమ్మెస్‌ బీగిల్‌ అనే ఓడ మీద టాస్మోనియా నుండి బయలుదేరాడు. బ్రూనో జ్ఞాపకార్థం పదిహేడు ఫిబ్రవరిని 'సత్యాన్వేషణ దినం'గా పరిగణిస్తున్నాం!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, 
బయాలజీ ప్రొఫెసర్‌.

Link to comment
Share on other sites

  • Replies 216
  • Created
  • Last Reply

దేవుణ్ణి ఎవరు సృష్టించారు.. ?
""""""""""""""""""""""""""""""""""""""""""

దేవుణ్ణి ఒకరు సృష్టిండం ఏంటి అని అనుకుంటున్నారా ఐతే ఈ పోస్ట్ మీ కోసమే చదవండి..

ఈ విశ్వాన్ని, మనిషిని దేవుడే సృష్టించాడని చాలామంది భావన..

వాస్తవానికి మనిషే దేవుణ్ణి సృష్టించాడు..

అందుకు కొన్ని రుజువులు కూడా కనిపిస్తున్నాయి..

మీరు కూడా పరిశీలించి చూడండి ! ఆలోచించండి !!

1. మనిషి రూపంలోనే దేవుళ్లుంటారు..

2. మనిషి కున్న జాలి, దయ, కోపం, ప్రతీకారం వంటి లక్షణాలు దేవుళ్లలోనూ కనిపిస్తాయి..

3. మనుషుల్లో వుండే కామం దేవుడిలోనూ కనిపిస్తుంది. అందుకే వారికీ సంసారం, పిల్లలూ కనిపిస్తారు..

4. పలువురితో సంగమించాలన్న మానవుడి వాంఛే, దేవుళ్ళకు బహు భార్యల్ని కట్ట బెట్టింది..

5. మనుషులు తినే పదార్థాలనే దేవుళ్లకు నైవేద్యం పెడతారు..

6. తనకంటే దేవుడు గొప్ప వాడని చెప్పేందుకే మనిషి దేవుళ్ళకు ఎక్కువ తలలు, నాలుగు (అంతకంటే ఎక్కువ) చేతులు తగిలించాడు..

7. తనకు తెలిసిన ఆయధాలనే దేవుళ్ళ చేతుల్లో పెట్టాడు..

8. దేవుడు పైనేక్కడో ఉండి తనని నడిపిస్తాడన్న భావనే దేవుళ్లను ఎత్తయిన కొండల మీద ప్రతిష్టించారు..

9. మనిషి ఆటవిక జీవనం గడిపినప్పుడు దేవుళ్ళూ ఆటవిక రూపాల్లోనే వున్నారు..

10. మనిషికి స్థిర నివాసాలొచ్చాకనే దేవుళ్లకూ నివాసాలొచ్చాయి..

11. నాగరికతలో భాగంగా మనిషికి లభించిన ప్రతి వసతీ దేవుడికి కల్పిస్తున్నది మనిషులే..

12. కొన్ని మాతాల్లో కొంత భిన్నత్వం కనిపిస్తుంది.
ఉదా:- ఇస్లాం చిట్ట చివరి మతం కావడంతో, దేవుడికి రూపం లేకుండా చేశారు.. 

13. వాస్తవానికి మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంను స్థాపించే నాటికే, నేటి అరబ్ ప్రాంతాల్లోనూ విగ్రహారాధన ఉండేది..

14. మనిషి లాగే ఆలోచించే శక్తి ఏ జంతువుకైనా వస్తే , అది తన కోసం కూడా ఓ దేవుడిని సృష్టించుకుంటుంది..

ఉదా:- ఒక చీమకే ఆలోచించే శక్తి వేస్తే.. అది తన కోసం కూడా ఓ దేవుణ్ణి సృష్టించుకుంటుంది.. అపుడు ఆ చీమల దేవుడు కూడా 'చీమ' రూపం లొనే ఉంటాడు.. కాకపోతే ఆ చీమల  దేవుడు 3,4 అడుగుల ఎత్తు ఉండొచ్చు.. దానికి ఒకటి కంటే ఎక్కువ తలలూ,  దాని ఒంటికి ముందు భాగంలో 20, 30 కాళ్ళూ (చేతులు) వెనుక భాగంలో మరో 20, 30 కాళ్ళూ ఉండొచ్చు.. ! అంతే.. !!

 -- Subbaraju Penmetsa

Link to comment
Share on other sites

శూద్రులంటే ఎవరు?
——————————

శూద్రులంటే బ్రాహ్మణ, క్యత్రియ, వైశ్యులు కాని మిగిలిన హిందూ చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.

‘” బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు.” అని ( ఋగ్వేదం 10 – 90 – 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.

” భగవద్గీత ” 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.

మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1. వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 – 1 ) లో పేర్కొన్నాడు.

హిందూ (బ్రాహ్మణ) మత సామాజిక వ్వస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?

1. ” బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం”. ( మనుస్మృతి 1 – 91 )

2. ” శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించిన యెడల బ్రాహ్మనులను హింసించును. ” ( మను 10 – 129 )

3. ” ,బ్రాహ్మనుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా.” ( మను 8 – 417 )

4. ” బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. ” ( 10 – 123 )

5. ” జీతభత్యాల ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. ” ( మను 8 – 413 )

6. ” బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. ” ( మను 10 – 125 )

7. ” శూద్రుడు బ్రాహ్మణుని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. ” ( మను 8. 271 )

8. ” ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. ” ( మను 8 – 272 )

9. ” బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. ” ( మను 8 – 281 )

10. “శూద్రుడు బ్రాహ్మణుని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. ” ( మను 8 – 282)

11. ” బ్రహ్మణుని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. ” ( 8 – 283 )

12. ” శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. ” (మను 4 – 99 )

13. ” బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. ” ( మను 2 – 31 )

14. ” బ్రాహ్మణుని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. ” ( మను 9 – 335 )

బ్రాహ్మినిజం శూద్రులపై జరిపిన ఈ మనుధర్మం అనే ధర్మం న్యాయమైనదేనా? అలా శాసించి అమలుపరచిన శాస్త్రం పవిత్రమైనదిగా భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణించాలా??

Link to comment
Share on other sites

"మానవులు సమూహాలుగా జీవిస్తున్న తొలినాళ్ళలో ఒక గ్రూపు మరో గ్రూపుపై దాడి చేసి, సంపధను, గోవులను ఓడిపోయిన గ్రూపు అమ్మాయిలను గెలిచిన గ్రూపు వారు ఎత్తుకెల్లేవారు. అలా తీసుకు పోయిన స్త్రీలు పారిపోకుండా వారి మెడకు, కాళ్ళకు, చేతులకు, నడుముకు తాళ్ళతో/ గొలుసులతో బంధించేవారు. వాటి అవశేషాలే నేడు స్త్రీలు ధరిస్తున్న మంగళసూత్రం, వడ్డాణం, కాళ్ళకడియాలు, గాజులు. ఆ నాటి ఇనుపకచ్ఛడాల అవశేషమే, ఈనాటి సిగ్గుబిళ్ళ..

@RamaSiddhu J Bro idi intha deep ga research ela chesaru.. .. idi nijamo abaddamo ardam kavatledu...

magavallu kuda ungaralu , kadiyalu , medalo golusulu etc,. pettukuntaru kada... even chinnapillalu gajjalu kuda pettukuntaaru kada... ante mee vuddesam vallani kuda charitra lo bandinchara..? alaaga..? i mean magavallani kuda..?

Link to comment
Share on other sites

2 hours ago, ChiefMinister said:

Samples from Archeological Excavations.

Aadavallaki Ekkuva Alamkaralu Magavallatho polisthe

Link to comment
Share on other sites

24 minutes ago, RamaSiddhu J said:

Samples from Archeological Excavations.

Aadavallaki Ekkuva Alamkaralu Magavallatho polisthe

Invaders raakamundhe india gold ornaments usage ekkuva. India wealth, gold ni loot cheyyadaaniki invaders attack chesevaaru. Odipoyina vaalla wealth, ladies ni takeover cheyyadam ane concept whole world lo vundhi.

Foreign country lo gold usage enduku thakkuvagaa vundhi? Vaallu chains use cheyyaledhaa? Vaallaki seelam ane concept ledhaa? Ladies takeover ni lite theesukunnaaraa?

gold usage Hindus lo enduku ekkuvagaa vundhi? Iron chains gold chains gaa elaa  convert ayyaayi? 

Link to comment
Share on other sites

17 minutes ago, RamaSiddhu J said:

Samples from Archeological Excavations.

Aadavallaki Ekkuva Alamkaralu Magavallatho polisthe

which excavations..?did he mentioned any references or just like a myth he wrote these statements..?

is this the same through out the world..? 

bangaram ekkuva adavalle vesukuntaru ekkadayina i mean in any place.

but akkada mention chesina reasons naku matram antha logical ga anipinchaledu... 

gold ane material world wide andaru chala vaatiki vadutharu... 

oka vela aa paina mention chesina reason ayithey why they are using Gold like metal instead they can use IRON, Bronze, steel etc.,,. which are very cheap compared to GOld....

Magavallani kuda once upon a time ilaagane sankellu veyyatam valla eeroju adi gold chains , kadiyalu vesukune culture vachindi ani nenu oka book raasesthe ... is it correct..?

we have to question every thing .... without questioning we wont get anything... this is what I belive...if we escape from questions... 

Link to comment
Share on other sites

On 2/12/2022 at 4:55 AM, RamaSiddhu J said:

IMG-20220212-WA0003.jpg

its all a part of nature... 

if we observe animals, the strength of  Bull, bison, lion, Tiger is more comparatively do you think here also it is male dominated society..?  

eppudu pusthakallo rasinavi matrame correct anukovaddu... try to think from your side also... this is what a Rational thinker has to do I feel...

at the end it doesn't matter who is strong ... every one is equal in society.....

Link to comment
Share on other sites

"భరతుడు" అనేది 'మహా భారతం'లోని ఒక పాత్ర మాత్రమే., ఈ ఉపఖండాన్ని ఒకప్పుడు 'భరతుడు' అనేటాయన ఏలాడనేది చరిత్ర కాదు. అది ఓ కథ మాత్రమే.. అయినాసరే "ఇండియా"ను "భారత్"లేదా "భారత దేశం" అని ఎందుకు పిలవాలి ?
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
[భరతుడు చారిత్రక పురుషుడు కానే కాదు. మహా భారత కథలో.. భరతుడు అనేది ఒక (పౌరాణిక) పాత్ర మాత్రమే.. ఈ ఉపఖండాన్ని ఒకప్పుడు'భరతుడు'అనేటాయన ఏలాడనేది కరెక్ట్ కాదు.]
****
ఈ మధ్య కొందరు, మన దేశానికి రాజ్యాంగ పరంగా "భారత దేశం" అని  పేరు పెట్టి పిలవటం మొదలు పెట్టడం గురించీ, అభ్యంతరాలు వెలిబుచ్చటం చూశాను. 

వారి అభ్యంతరం ఎందుకంటే, 
భరత అనే పేరు పురాణాల నుంచీ తీసుకొనబడింది. 
ఈ పేరు చరిత్రలో ఈ దేశం పేరుగా ఎవరూ వాడినట్లుగా కానీ, 
ఏ రాజూ ఆ పేరు గల దేశంగా దీనిని పరిపాలించినట్లు గా కానీ  చారిత్రక ఆధారాలు లేవు. 
ఈ విషయం నిజమే కావచ్చు. కానీ, 

మరొక నిజమేమంటే, ఈ భూభాగమంతా కలసి ఒకే రాజు క్రింద కానీ, ఒకే శాసన వ్యవస్థ క్రింద కానీ ఎప్పుడూ ఏలబడలేదు. 
అలా ఎవరి చేతనయినా, ఇందులో అధిక భాగం ఏలబడినా కూడా,  అపుడు, దానిని వారి వంశం పేరుమీదనో, లేక వారి పేరుమీదనో లేక వారి రాజధాని పేరు మీదనో పిలిచారు కానీ, వేరే ఏ స్థిరమయిన పేరూ వాడినట్లు గా లేదు. 

అయితే, ఈ భూభాగాన్ని ప్రస్తావించేటపుడు, "జంబూ ద్వీపే భరత వర్షే" అనే మాటలు, కొన్ని సంస్కృత రచనలలో కనిపిస్తాయి. మరియు, బ్రాహ్మణీయ మత ఆచారాలలో కనిపిస్తాయి. 

మనదేశ భూభాగము, ద్వీపం కాదు ద్వీపకల్పము కనుక దానిని జంబూ ద్వీపం అనటం హాస్యాస్పదం (సుమారు 5 కోట్ల సం ల క్రింద అయితే, ok అనే వాళ్ళం ఇప్పుడు కాదు :)

మన దేశ భూభాగానికంతటికీ కలిపి తొలుతగా పేరు పెట్టినది మనకు వాయువ్య దిశ లో ఉన్న విదేశీయులు, పర్సియనులు, అరబ్బులు, బాక్ట్రియనులు, గ్రీకులు. వారు సింధు నది దాటిన తరువాత వచ్చే భూభాగం కనుక దీనిని సింధు అనే పదానికి వారి వారి భాషలలొ వ్రాసుకోబడిన హిందు, ఇందు, ఇండస్, ఇండె, ఇండీన్, ఇండియా వంటి పదాలను వాడారు. 

ఇక పోతే, ఆ తరువాత, కాలక్రమాన, హిందూ అనే పదము, ఒక ప్రాంతానికి కాక ఒక మతానికి (లేదా మిశ్రితమతాలకు) పరిమితం అయినందున, మన రాజ్యాంగ నిర్మాతలు, మన దేశానికి పేరు పెట్టేటపుడు, ఆ పదంకు బదులు, భారత అనే పదం వాడటమే సమంజసం అని భావించి ఆ పేరు పెట్టారు. 

భారత అనే పదంలో ఏ మత ప్రసక్తీ లేదు. 
భారతీయులు, భారతీయత అనే పదం లో కూడా ఏ మత భావనా, ప్రతిఫలించదు. 

కనుక భారతదేశం, భారతీయులు, భారతీయత అనే మతాతీత పదాలను వాడటం లో అభ్యంతరం ఉండనక్కర లేదని నా అభిప్రాయం.  
ఇంగ్లీషులో నయితే,  India, Indians, BeingIndian అనే పదాలలో కూడా   మతభావన కాకుండా దేశ భావననే ఉంది కనుక, అందులో కూడా అభ్యంతరం ఉండనక్కర లేదు. 

ఈ భరత లేదా భారత అనే పదం, భరతుడు పరిపాలించినందు వలన కాదు. 
మనది భరిత (నిండుగా ఉన్న) భారత (బరువైన, గొప్పదైన) దేశం కనుక, దానిని బారత అందాం. 
మతాలకు అతీతం (దూరం) గా భారతీయులు గా కలసి ఉందాం. కలసి బ్రతుకుదాం. 

జై భారత్, జై ఇన్సాన్ (ఇన్సానియత్), జై విజ్ఞాన్.
  --- Bala Nayuni

(Copied From:
Bala Nayuni garu..)
   --- Rajeshwer Chelimela , Jvv Telangana

Link to comment
Share on other sites

On 2/18/2022 at 6:36 PM, ChiefMinister said:

its all a part of nature... 

if we observe animals, the strength of  Bull, bison, lion, Tiger is more comparatively do you think here also it is male dominated society..?  

eppudu pusthakallo rasinavi matrame correct anukovaddu... try to think from your side also... this is what a Rational thinker has to do I feel...

at the end it doesn't matter who is strong ... every one is equal in society.....

Agree with all points but being strong and being equal are two different things with thinline, but being strong always makes a soul think that they are above others, anduke ee godava antha, instead of making statements one should work on how to make weaker strong and make feel them they are equal since we are humans and we have great thinking than animals

Link to comment
Share on other sites

31 minutes ago, MSDTarak said:

here he mentioned physical strength ... 

to give equal opportunity we should never take this into consideration... 

Link to comment
Share on other sites

On 2/18/2022 at 12:11 PM, RamaSiddhu J said:

శూద్రులంటే ఎవరు?
——————————

శూద్రులంటే బ్రాహ్మణ, క్యత్రియ, వైశ్యులు కాని మిగిలిన హిందూ చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.

‘” బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు.” అని ( ఋగ్వేదం 10 – 90 – 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.

” భగవద్గీత ” 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.

మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1. వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 – 1 ) లో పేర్కొన్నాడు.

హిందూ (బ్రాహ్మణ) మత సామాజిక వ్వస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?

1. ” బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం”. ( మనుస్మృతి 1 – 91 )

2. ” శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించిన యెడల బ్రాహ్మనులను హింసించును. ” ( మను 10 – 129 )

3. ” ,బ్రాహ్మనుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా.” ( మను 8 – 417 )

4. ” బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. ” ( 10 – 123 )

5. ” జీతభత్యాల ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. ” ( మను 8 – 413 )

6. ” బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. ” ( మను 10 – 125 )

7. ” శూద్రుడు బ్రాహ్మణుని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. ” ( మను 8. 271 )

8. ” ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. ” ( మను 8 – 272 )

9. ” బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. ” ( మను 8 – 281 )

10. “శూద్రుడు బ్రాహ్మణుని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. ” ( మను 8 – 282)

11. ” బ్రహ్మణుని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. ” ( 8 – 283 )

12. ” శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. ” (మను 4 – 99 )

13. ” బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. ” ( మను 2 – 31 )

14. ” బ్రాహ్మణుని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. ” ( మను 9 – 335 )

బ్రాహ్మినిజం శూద్రులపై జరిపిన ఈ మనుధర్మం అనే ధర్మం న్యాయమైనదేనా? అలా శాసించి అమలుపరచిన శాస్త్రం పవిత్రమైనదిగా భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణించాలా??

@MSDTarak bro ivi nijama leka fake na?

Link to comment
Share on other sites

On 2/18/2022 at 6:36 PM, ChiefMinister said:

its all a part of nature... 

if we observe animals, the strength of  Bull, bison, lion, Tiger is more comparatively do you think here also it is male dominated society..?  

eppudu pusthakallo rasinavi matrame correct anukovaddu... try to think from your side also... this is what a Rational thinker has to do I feel...

at the end it doesn't matter who is strong ... every one is equal in society.....

Strength by looks ?

If both of them practiced (daily activities) equal...both become equal by all means..but in Human Society Females are forced to Practice household works ...the same is not seen in other animals..

Lion and Lioness 

Tigress and Tiger 

Bull and Buffalo (wild) 

What ever animals equally works and practice their daily activities 

Exception is During Pregnancy...

Animals ( other than humans) don't have / force rules one upon other ...so no question of dominance...

There may be a leader for group of animals...

Note: Excetpion is PET animals grown up by Human being ...again we find many differences 

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

here what he mentioned in the books and what you posted initially is about physical strength not by looks... correct me if i am wrong...

Please watch National Geographic Channel or Animal planet.. physical strength is definitely not the same for Lion and Lioness, Tiger and Tigress, Bull and cow... Bison and Buffalo... 

When it comes to physical strength,  a simple question why don't you plough field with COW..? Why are you using OX..?

Especially the above bolded statement please check some videos on National Geographic channel... there you will find a lot...and please give me your feedback... in every species u will find lot of differences its not the same what you think for sure... 

Coming to giving equal Opportunities we have to ... for sure... All are equal and they can choose which ever work they want to do... Age old practises are no more accepted... forcing someone to work is not good...

I request you to answer me for the other questions regarding the Ornaments also.. when you mentioned about archaeological excavations were taken into consideration ...was it mentioned in the book..? which excavations were taken into consideration..? Please throw some light on it...

Link to comment
Share on other sites

43 minutes ago, ChiefMinister said:

Oh k will try get details...ikkada point...Meeru Ee Pane Cheyyali...Sukumaranga undali and Chatram lo biginchdam...women Can do a lot and as equal as men anedi point..try to get it

Link to comment
Share on other sites

15 minutes ago, RamaSiddhu J said:

Oh k will try get details...ikkada point...Meeru Ee Pane Cheyyali...Sukumaranga undali and Chatram lo biginchdam...women Can do a lot and as equal as men anedi point..try to get it

yes I understood ...but considering Physical strength for social equality might not be correct..

Also ornaments gurinchi clarity ga ledu.. because with my observation women like to wear ornaments... oka vela ornaments gift chesthey they feel good .. ala vunnappudu ornaments anevi ela vachayi anna aa history matram naku nijam anipincha ledu...they were tied with Iron chains and then they became ornaments over the period anna argument...

Link to comment
Share on other sites

What is Luxury?

Luxury is not getting treatment from the most expensive hospital in USA.

Luxury is being healthy

Luxury is not going on a cruise and eating food prepared by a renowned chef.

Luxury is eating fresh organic food grown in your own backyard

Luxury is not having an elevator in your house.

Luxury is the ability to climb 3-4 stories of stairs without difficulty.

Luxury is not the ability to afford a huge refrigerator.

Luxury is the ability to eat freshly cooked food 2 times a day.

Luxury is not having a home theatre system and watching the Himalayan expedition.

Luxury is physically experiencing the Himalayan expedition

In the 60s a Car was a luxury.
In the 70s a Television was a luxury.
In the 80s a Telephone was a luxury.
In tge 90s a Computer was a luxury... 

So what is a Luxury now??

Being healthy, being happy, being in a happy marriage, having a loving family, being with loving friends , living in an unpolluted place

All these things have become rare.
And these are the real " *luxury* ".

ANONYMOUS.

Link to comment
Share on other sites

On 2/21/2022 at 5:20 AM, RamaSiddhu J said:

Strength by looks ?

If both of them practiced (daily activities) equal...both become equal by all means..but in Human Society Females are forced to Practice household works ...the same is not seen in other animals..

Lion and Lioness 

Tigress and Tiger 

Bull and Buffalo (wild) 

What ever animals equally works and practice their daily activities 

Exception is During Pregnancy...

Animals ( other than humans) don't have / force rules one upon other ...so no question of dominance...

There may be a leader for group of animals...

Note: Excetpion is PET animals grown up by Human being ...again we find many differences 

Your references are wrong….. even in animals, it’s not the males that does all the works…. 
 
Lion pride : females hunt and get the food. Males enjoy the feast. Main duty of males if to sire off spring and patrol the territory. 
 
any tiger/cheetah/leopard : males only mate with females in heat and leave them. Females will take all the burden of bringing up young. 
 
elephants/buffalo/any herbivore : generally, males will only mate and females will take the burden of bringing up the young. 
 
exception : zebra, giraffe etc., 

there are few species where the male and female own the responsibility of raising the young alike 

ex : foxes, wolfs, hyenas, wild dogs etc where only alpha male and female mate and rest of the clan will take the duty of raising the young. 
 
basically, my point is, nature is divided into being solitary, groups of closely related females, groups of closely related individuals. 
 
humans evolved from being solitary and nomadic to living as a group of closely related individuals concept.  

Link to comment
Share on other sites

6 hours ago, RamaSiddhu J said:

What is Luxury?

Luxury is not getting treatment from the most expensive hospital in USA.

Luxury is being healthy

Luxury is not going on a cruise and eating food prepared by a renowned chef.

Luxury is eating fresh organic food grown in your own backyard

Luxury is not having an elevator in your house.

Luxury is the ability to climb 3-4 stories of stairs without difficulty.

Luxury is not the ability to afford a huge refrigerator.

Luxury is the ability to eat freshly cooked food 2 times a day.

Luxury is not having a home theatre system and watching the Himalayan expedition.

Luxury is physically experiencing the Himalayan expedition

In the 60s a Car was a luxury.
In the 70s a Television was a luxury.
In the 80s a Telephone was a luxury.
In tge 90s a Computer was a luxury...
 
So what is a Luxury now??

Being healthy, being happy, being in a happy marriage, having a loving family, being with loving friends , living in an unpolluted place

All these things have become rare.
And these are the real " *luxury* ".

ANONYMOUS.

paina cheppina bold items lekapothey kinda vunna bold items andariki vundevi anipistundi appudappudu..

Link to comment
Share on other sites

Only science can do Miracles. 

We’re just 50 days into 2022, and already…

Nuclear fusion saw another major breakthrough… a ‘huge step’ in the quest for clean energy.

A woman was cured of HIV through a breakthrough stem cell treatment.

MIT engineers created an ‘impossible’ new material… stronger than steel but as light as plastic.

An international team of scientists used supercomputers to unlock a ‘giant leap’ in the fight against antibiotic resistance.

A new ‘game-changing’ carbon capture technology could deliver a step change in our ability to remove carbon dioxide from the air.

Researchers set a new Guinness World Record for fastest-ever DNA sequencing technique… using it to sequence a human genome in just 5 hours and 2 minutes.

A new breakthrough in spinal cord implant ‘could potentially allow paralysed people to walk again’.

A ground-breaking new technology regrew a frog’s lost leg… and it might work on humans too.

Surgeons completed the first-ever heart transplant with a genetically-modified animal heart… saving the life of a 57-year-old and taking a big step towards helping solve the global donor organ shortage. 

Biodegradable surgical tape has been invented… making some intestinal fixes as easy as ‘duct tape around leaky pipes’.

James Webb, the awe-inspiring $10 billion space telescope 25 years in the making, took its first images… a huge scientific milestone.

An autonomous drone carrying a defibrillator saved the life of a 71-year-old having a heart attack… a first in medical history.

Researchers in Sweden found a promising way to use solar power to convert carbon dioxide into fuel… using ultra-fast laser spectroscopy.

Just a few of many incredible achievements in the first 50 days of the year. 

The world is far from perfect, but we shouldn’t forget that about 90% of all scientists that ever lived are alive today. Never before have we had so many people whose sole purpose of work is to better understand how the world works.

2022 is shaping up to be a remarkable year in science and technology.

(Copied from my friend CB Rao's post in whatsapp)

Link to comment
Share on other sites

ఆవు గురించి నిజాలు.. అబద్ధాలు, అపోహలు..
————————————————————————

భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతోంది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆవుకు సంబంధించి అనేక అశాస్త్రీయ అంశాలు ఆపాదిస్తున్నారు. వాటిలో కొన్ని అంశాలు ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నాయి. ఆ అశాస్త్రీయ అంశాలు, వాటిని ఖండిస్తూ... ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ మాజీ డైరెక్టర్‌, డా|| డి. బాలసుబ్రమణ్యన్‌ ఇచ్చిన వివరణలు ఇలా వున్నాయి.
 
ఆపాదించిన అంశం 1 : 

ఒక ఆవుకు ప్రతిరోజూ కొంత మోతాదులో విషం ఇవ్వడం జరిగింది. 24 గంటల తర్వాత ఆ ఆవు రక్తం, మూత్రం, పేడ, పాలు పరీక్షించబడ్డాయి. ఎక్కడో తెలుసా? 

న్యూఢిల్లీ లోని 'ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌' (ఎయిమ్స్‌) పరిశోధనాశాలలో. ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు. 90 రోజుల పాటు పరిశోధించడం జరిగింది. పరిశోధకులు ఆ ఆవు పాలు, రక్తం, మూత్రం, పేడలలో ఎక్కడా విషపు ఛాయలను కూడా కనుగొనలేకపోయారు. ఆ విషం ఎటుపోయింది? గో మాత విషం మొత్తాన్ని తన గొంతులో దాచుకుంది. ఏ ఇతర జంతువుకూ లేని ప్రత్యేక లక్షణమిది! 'ఎయిమ్స్‌' లోని కొందరు బోధనాచార్యులను నేను అడిగి తెలుసుకున్న విషయమేమంటే...అక్కడ అలాంటి ప్రయోగమేదీ జరగలేదు. ఆ సంస్థకు చెందిన 'జంతువుల నైతిక విలువల కమిటీ' ఏ జంతువుకైనా ప్రయోగం కోసమైనా, ఒక్క రోజైనా విషం ఇవ్వడానికి అంగీకరించదని అక్కడి ఆచార్యులు నొక్కి వక్కాణించారు!
 
ఆపాదించిన అంశం 2 : 

ఈ భూమి మీద నివశించే జంతువులన్నింటిలో ఆవు ఒక్కటే ఆక్సిజన్‌ను పీల్చుకొని, ఆక్సిజనును విసర్జించగలదు.

మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరిపి, ఆక్సిజన్‌ను వదలగలవు. అంతేకాని, ఏ జంతువుకూ ఆక్సిజన్‌ను వదలగల శక్తి లేదు. అయితే, మనుషులు గానీ, జంతువులు గానీ పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ లోని కొంత భాగాన్ని నిశ్వసించే గాలితోబాటుగా వదులుతాయి. ఏ ఆవునైనా పరీక్షించినప్పుడు దాని నిశ్వాసంలోని గాలిలో కొంచెం ఆక్సిజన్‌ ఉన్నట్టు కనబడటానికి కారణం ఇదే. మను షులను పరీక్షించినా వారి శ్వాస లోని గాలిలో కొంత ఆక్సిజన్‌ వున్నట్టు రుజువవడానికి కూడా కారణం అదే. నీటిలో మునిగిన వారిని బయటికి తీసిన తర్వాత నోటితో గాలిని ఊది ఆక్సిజన్‌ను అందిస్తారు.
ఆపాదించిన
 
అంశం 3 :

విషాన్ని విరిచే శక్తి ఆవు పాలకు ఉంది.

విషం అనే పదం చాలా విస్తారమైనది. ఏ విషం? సయనైడా? డీడీటీనా? విషాన్ని ఆవు పాలు విరుస్తాయనే దానికి రుజువేమిటి? సైన్సుగాని, చట్టంగాని రుజువు లేనిదే, దేనినీ అంగీకరించదు. రుజువు చేయలేని అంశాన్ని ఎలా రుజువుచేస్తాం? ఎలా ఖండిస్తాం?
 
ఆపాదించిన అంశం 4 :

ఆవు మూత్రం విషపూరితమైన సూక్ష్మక్రిములను చంపుతుంది.

జంతువుది గానీ, మనిషిదిగానీ ఏ మూత్రమైనా బ్యాక్టీరియాను చంపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దానికి కారణం కూడా తెలిసిందే. మూత్రంలో ఉండే ఎసిడిటీ (తక్కువ పిహెచ్‌ విలువ), అమ్మోనియం సంయోగ పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. ఆవు మూత్రంలో వేరే ప్రత్యేకత ఏమీ లేదు (ఏప్రిల్‌ 2012 నాటి 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఫార్మాసుటికల్‌ రీసెర్చ్‌' అనే పత్రికలో ఎ. అహుజా సమర్పించిన పత్రం, 2(2): 84-87 నుండి).
 
ఆపాదించిన అంశం 5 :

నేల, గోడలూ ఆవు పేడతో అలికితే, రేడియో తరంగాల నుంచి మనల్ని కాపాడుతుంది.

'రేడియో తరంగాలు' అనేది విశాలమైన అర్ధంతో కూడిన పదం. తరంగ దైర్ఘ్యము, శక్తి, తీవ్రత, ఫ్రీక్వెన్సీ లాంటివేవీ తెల్పకుండా రేడియో తరంగాల ప్రభావాన్ని చెప్పలేం. ఆవు పేడతో అలికినా, అలకకపోయినా రేడియో, టీవీలు క్షేమకరంగానే పని చేస్తాయి. అలాగే సెల్‌ఫోన్లు, వైఫైలు కూడా. అసలు ఇబ్బంది రేడియో తరంగాలను గూర్చి ప్రత్యేక స్పెసిఫికేషన్లు పేర్కొనకుండా చేసే ప్రకటనలతోనే వస్తుంది.
 
ఆపాదించిన అంశం 6 :

పది గ్రాముల ఆవు నెయ్యిని నిప్పుల్లో పోస్తే (యజ్ఞాలలో), ఒక టన్ను (1000 కేజీల) ఆక్సిజన్‌ వెలువడుతుంది.

ఇది భౌతిక శాస్త్ర నియమాలకే విరుద్ధం. ఏ ప్రయోగంలోనైనా 10 గ్రాముల పదార్థం 1000 కిలోగ్రాముల పదార్థాన్ని సృష్టించలేదు.

మన పూర్వీకులైన మునులెప్పుడో కనుగొన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో ఎప్పుడో రుజువులు కనుగొంటారనో, వాళ్ళ ప్రకటనలను వ్యతిరేకించేవారు హిందూ నమ్మకాలకు వ్యతిరేకులనో విమర్శించడం సరైన చర్య కాదు.

సోషల్‌ మీడియాలో ప్రచారమౌతున్న అశాస్త్రీయ అంశాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం దేశభక్తులందరి కర్తవ్యం.
 
-- డా|| డి. బాలసుబ్రమణ్యన్‌ ('ది హిందూ' సౌజన్యంతో)

Link to comment
Share on other sites

ప్రతి గ్రామంలో బాబు బస్సు యాత్ర
– ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర
– రాయలసీమలో బాబు బస్సు యాత్ర
– ఎన్నికల వరకూ జనంలోనే తండ్రీకొడుకులు
– ‘మన కోసం’ పేరుతో టీడీపీ యాత్రలు
– ఇక మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘాకు ప్రైవేటు ఇంటలిజన్స్ విభాగం
– పోలీసు అధికారులపై ఇక ప్రైవేటు కేసులు
– వేధించే డీఎస్పీ-ఐపిఎస్ అధికారుల ఆస్తులపై నజర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న ఎన్నికల వరకూ జనం మధ్యలోనే ఉండేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా పాదయాత్ర, బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ యాత్రలు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన పార్టీ నేతలను వేధిస్తున్న పోలీసు అధికారులపై, ఇక విస్తృతంగా ప్రైవేటు కేసులు వేయడంతోపాటు.. స్థానికంగా వైసీపీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు భారీ సంఖ్యలో న్యాయవాదులను నియమించేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమ పార్టీ నేతను బెదిరిస్తున్న పలువురు డీఎస్పీ-ఐపీఎస్ స్థాయి అధికారుల ఆస్తులు, ఇప్పటివరకూ వ చ్చిన ఆరోపణలు తెలుసుకునేందుకు, ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు బస్సుయాత్ర, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేసేందుకు నిర్ణయించారు. మేలో హైదరాబాద్‌లో మహానాడు నిర్వహించేందుకు సమాయాత్తమవుతున్న తెలుగుదేశం పార్టీ, అది ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అగ్రనేతలిద్దరూ జనం మధ్యనే ఉండేలా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా.. జూన్‌లో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రకు పార్టీ సిద్ధమవుతోంది.

ఇక పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు అదే సమయంలో రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరులో కొంత భాగంలో బస్సు యాత్ర ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చంద్రబాబునాయుడు తన బస్సు యాత్రలో, రాయలసీమలోని ప్రతి గ్రామాన్ని సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని పార్టీ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
కడపలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు, పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడయినట్లు సమాచారం. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా వినియోగించుకోవాలంటే, అక్కడ చంద్రబాబు పర్యటించడమే మంచిదన్న సూచన పార్టీ వర్గాల నుంచి వ్యక్తం కావడంతో, చంద్రబాబు సీమలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ విజయం ఖాయమని, జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇక విజయం గురించి ఆలోచించాల్సిన పనిలేదని, పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నందున, పార్టీ నిస్తేజంగా ఉన్న రాయలసీమ-ఉత్తరాంధ్రపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడమే మంచిదన్న కోణంలోనే, చంద్రబాబు రాయలసీమ-లోకేష్ ఉత్తరాంధ్రలో యాత్రలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల వరకూ వీరిద్దరూ జనం మధ్యలోనే ఉండేలా షెడ్యూల్ రూపొంచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ఈ పాదయాత్ర-బస్సుయాత్రలకు మనకోసం పేరు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు ‘మీకోసం’ పేరుతో యాత్ర నిర్వహించ గా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మేరకు మనకోసం పేరునే ఖరారుచేయవచ్చంటున్నారు. మహానాడు తర్వాత జూన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రల్లో బాబు-లోకేష్ వెంట ఉంటే బృందాలపై కసరత్తు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా… పార్టీ అగ్రనేతలు, నియోజకవర్గ స్థాయి నేతలపై ప్రభుత్వం సీఐడీ, స్థానిక పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో.. పార్టీపరంగా లీగల్ సెల్‌ను బలోపేతం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 230 మంది న్యాయవాదులను ఫుల్‌టైమర్లుగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. నియోజకవర్గ-జిల్లా-రాష్ట్ర స్థాయి కేసుల బట్టి, న్యాయవాదులు స్పందించనున్నారు. ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో లీగల్ సెల్‌ను ఏర్పాటుచేసి, కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ప్రధానంగా.. ఎన్నికల సమయం సమీపించేకొద్దీ, కీలకమైన సోషల్‌మీడియా కార్యకర్తలపై వైసీపీ సర్కారు మరిన్ని కేసులు పెట్టే ప్రమాదం ఉన్నందున, వాటిని ఇప్పటినుంచే ఎదుర్కొని కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు నాయకత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే.. లీగల్ సెల్‌ను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది.

ప్రధానంగా ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలపై పోలీసు వేధింపులు పెరిగే అవకాశం ఉన్నందున.. పార్టీపరంగా సొంత ఇంటలిజన్స్ విభాగం ఏర్పాటుచేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ విభాగం పోలీసుస్టేషన్ల వారీగా ఉన్న అధికారుల పనితీరును సమీక్షిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి పనిచేసే అధికారులను గుర్తించి, వారి గత రికార్డులను తెలుసుకుంటుంది.
ఆ మేరకు వారిపై ఎప్పటికప్పుడు ప్రైవేటు కేసులు వేయడం ద్వారా, క్యాడర్‌ను కాపాడుకోవాలన్నది నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో పోలీసువిభాగంలో పనిచేసిన రిటైరయిన అధికారుల సేవలు ఇందుకు వాడుకోనుంది. ఇప్పటికే వివిధ స్థాయిలోని మాజీ పోలీసు అధికారులు, ఆమేరకు తమ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఇంటలిజన్స్ విభాగం వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసంతృప్తిగా ఉన్న అధికారులు, ఉద్యోగులను కూడా గుర్తించనుంది. వారి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తెలుసుకునే యంత్రాంగాన్ని, ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా సెక్రటేరియేట్‌తోపాటు.. రెవిన్యూ, ఎక్సైజ్, మైనింగ్, సివిల్ సప్లయిస్, పోలీసు శాఖపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది

టీడీపీపై ఎదురుదాడి చేస్తున్న కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్ వంటి మంత్రులతోపాటు… ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటిరాంబాబు, రోజా, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాధరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, పార్ధసారధి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ , ఉదయభాను వంటి ఎమ్మెల్యేల వ్యక్తిగత-వ్యాపార కార్యకలాపాలపై నిఘా వేసేందుకు.. ఆయా నియోజకవర్గాల్లో 17 మందిని నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరికింద మరో 17 మందిని నియమించారని చెబుతున్నారు.
వీరంతా ఆయా వైసీపీ ఎమ్మెల్యేల బలహీనతలు, అక్రమాలు, వీరికి వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. ఎన్నికల నాటికి ఆ వివరాలు తెలుసుకుని, ఎన్నికల సమయంలో వాటినే స్థానిక ప్రచారాంశాలుగా సంధించనున్నారు. ఈ విధంగా 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విధిలేక పార్టీ మారిన మాజీ టీడీపీ నేతల్లో, తిరిగి ఎంతమంది వెనక్కి వ చ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నది కూడా ఈ ఇంటలిజన్స్ విభాగం తెలుసుకుని, పార్టీ నాయకత్వానికి నివేదిక ఇస్తుంది.

ఇక పార్టీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్న డీఎస్పీ నుంచి ఐపిఎస్ స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తమను వేధించే సదరు అధికారి గతంలో ఎక్కడ పనిచేశారు? ఎవరి సిఫార్సుతో అక్కడ పోస్టింగు తెచ్చుకున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఏమిటి? సదరు అధికారి హయంలో ఆ విభాగంలో జరిగిన అవినీతి, వచ్చిన ఫిర్యాదులు, వారి కుటుంబ నేపథ్యం, ప్రస్తుతం వారి కుటుంబసభ్యుల ఆస్తుల వంటి వివరాలు సేకరించాలని రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. వేరే రాష్ట్రాలకు చెందిన అధికారులు అక్కడ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు తెసుకునేందుకు 12 మందితో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఐఏఎస్-ఐపిఎస్ అధికారులు, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారన్న కూపీ కూడా లాగనున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. రానున్న ఎన్నికల్లో అమలాపురం ైవె సీపీ ఎంపీ అభ్యర్థిగా, అదేవిధంగా సీమలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న జిల్లాకు ఎస్పీగా పనిచేసిన ఒక అధికారి, ప్రకాశం జిల్లా నుంచి గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమాచారం, ఇప్పటికే పార్టీ నాయకత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. డెప్యుటేషన్‌పై వచ్చిన సదరు ఎస్పీ స్థాయి అధికారి గత ఎన్నికల్లో.. కడప జిల్లాకు చెందిన తన మామ సాయంతో.. ప్రకాశం జిల్లా నుంచి పోటీచేసేందుకు సిద్ధపడినట్లు టీడీపీ నాయకత్వ పరిశీలనలో తేలినట్లు సమాచారం.

పెరగనున్న వేగుల సంఖ్య
ఇదిలాఉండగా, ఇప్పటివరకూ తమకు సమాచారం ఇస్తున్న, ప్రభుత్వంలో వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులు-అధికారుల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వంలో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల వద్ద పనిచేస్తున్న వారే, ఇప్పుడు మళ్లీ ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున నేపధ్యంలో.. అలాంటి వారి సేవలతోపాటు, సెక్రటేరియేట్ నుంచి కమిషనరేట్ వరకూ వివిధ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే 28 మంది ఉండగా, ఆ సంఖ్యను 50కి పెంచాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా పార్టీ సమాచార వ్యస్థను బలోపేతం చేసి, ఎన్నికల ముందు వైసీపీ గుట్టును రట్టు చేయాలన్నది టీడీపీ నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

ఇవి కేవలం భారతదేశంలోనే జరుగుతాయి! 
——————————————————————

నువ్వు చెప్పే విషయం నేను ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను చచ్చేదాకా నిన్ను నువ్వు వ్యక్తీకరించుకునే హక్కును మాత్రం సమర్థిస్తూనే ఉంటాను.
- వోల్టేర్‌, ఫ్రెంచ్‌ రచయిత, చరిత్రకారుడు, తత్త్వవేత్త.
రాలే ఆకులో, జారే చినుకులో, మండే నిప్పులో వీచే గాలిలో ప్రతి విషయంలో దాక్కుని ఉన్న అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడమే సైన్సు. ప్రాయోగిక పరిజ్ఞానంతో, నిరూపణలతో నిలబడేదే సైన్సు. తనను తాను పునరుద్దరించుకునేదే సైన్సు. అది పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. నిత్యజీవితంలో ప్రధాన భాగం కావాలి. మనమిప్పుడు ప్రతి అంశాన్నీ వైజ్ఞానిక దృష్టికోణంతో అవలోకించాల్సి ఉంది. అప్పుడే సహేతుకమైంది ఏదో, అహేతుకమైంది ఏదో గుర్తించగలుగుతాం. దానివల్ల వేటికి ప్రాధాన్యమివ్వాలో, వేటికి ఇవ్వకూడదో అర్థమవుతుంది.

కర్నాటక గవర్నర్‌ తవర్‌ చంద్‌ గెహ్లాట్‌ ప్రఖ్యాత జోగ్‌ జలపాతం చూద్దామని వెళ్ళారు. ఆయన వెళ్ళిన సమయానికి అందులో నీరు లేదు. గవర్నర్‌కు నేతపర్వం కలిగించడానికి లింగనమఖి రిజర్వాయరు నుండి 500 క్యూసెక్కుల నీటిని నాలుగు గంటలపాటు జోగ్‌ జలపాతానికి మరలించారు. 
అక్కడ కొంత సేపు ఆనందించిన గవర్నర్‌ తన దారిన తాను వెళ్ళిపోయారు. అసలు విషయమేమంటే అధికారులు గవర్నర్‌ మెప్పుకోసం విడుదల చేసిన నీటితో రెండు వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది. అసలు ఆ లింగనమఖి రిజర్వాయరు నిర్మించిందే జలవిద్యుత్‌ కోసం. అధికారంలో ఉన్నవారి మెప్పుకోసం ఈ దేశంలో ఎంత దుర్వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఇది భారతదేశంలోని ఒక రాష్ట్ర గవర్నరు విషయం. మరి అలాంటి ఎంతోమంది గవర్నర్‌ల పైన ఉన్న ప్రధాని స్థాయి ఎంత ఉన్నతమైందో మనకు తెలుసుకదా?
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు సంబంధించి ఒక సంఘటన చూద్దాం. ఎలక్షన్‌ సమయంలో ఆయన ఒక రెసిడెన్షియల్‌ ఏరియాలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడు తున్నాడు. అంతే. ఎదురింట్లోంచి ఆ ఇంటి యజమాని బయటికొచ్చాడు. ''మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌! ఇక్కడ మీరేం చేస్తున్నారో తెలుస్తోందా? నా ఇంటిముందు లాన్‌ పాడు చేస్తున్నారు. దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోతే సంతోషం'' అని గొంతెత్తి బిగ్గరగా చెప్పాడు. అంతే - ప్రైమ్‌ మినిష్టర్‌ స్కాట్‌ మోరిసన్‌ వినిపించుకున్నాడు. వెంటనే తన ఉపన్యాస కార్యక్రమం ఆపేసి నిముషాల్లో వెళ్ళిపోయాడు. ఏదో పక్కింటివాడి మీద కోపం వెళ్ళగక్కినట్టు ఆ ఇంటి యజమాని కోప్పడటం - దేశ ప్రధాని కిమ్మనకుండా వెళ్ళిపోవడం. ఎంత ప్రజాస్వామ్యం? ఎంత నాగరికత? పౌరులకు ఎన్ని హక్కులూ? ఇలాంటి సంఘటన మన దేశంలో సాధ్యమా? అలాంటి మాట ఇక్కడ, ఈ దేశంలో కనీసం వార్డు మెంబరుకు కూడా చెప్పలేం. చెప్పినా - అతనేమైనా వింటాడా? తన వెంట ఉన్న వారిని ఉసిగొల్పి, ఆ ఇంటి యజమానిని తన్నించి, నోరు మూయిస్తాడు. నాగరిక - అనాగరిక దేశాల మధ్య వ్యత్యాసం అలా ఉంటుంది. మానవీయ విలువల్ని నిలుపుకోవడమంటే ఏమిటో మనం ఇంకా నేర్చుకోవాల్సే ఉంది.

ఇక్కడ భారత ప్రధాని, ఆయన అనుచరులు ఏ స్థాయిలో ఉన్నారో చూద్దాం. ఈ పోలిక ఎందుకంటే ఎవరు సహేతుకంగా ఉన్నారు. ఎవరు అహేతుకంగా మాట్లాడుతున్నారో బేరీజు వేసుకోవడానికి మాత్రమే! ఇందులో ఎవరినీ నొప్పించాలని గానీ, ఎవరి మనోభావాలో దెబ్బతీయాలని గానీ... కాదు! దేశ ప్రజల ఆకలి, నిరుద్యోగం, ప్రాజెక్టులు, కరోనా నివారణ, రైతులకు కనీస మద్దతు ధర లాంటి అప్రధానమైన విషయాల్ని పక్కనపెట్టి - అతిప్రధానమైన విగ్రహాల నిర్మాణం, చేపట్టిన భారత ప్రధాని, కేదార్‌నాథ్‌లో శంకరాచార్య విగ్రహ ప్రతిష్టాపన చేసి, 136 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం దాని ముందు కూర్చుని.. ఆయన 'ధాన్యం' చేశారు. 

అప్పుడు శంకరాచార్య విగ్రహం నుండి ఒక కాంతిరేఖ ఉద్భవించినట్టు తనకు అనిపించిందనీ - భవ్య భారతదేశాన్ని సాక్షాత్కరింపజేసినట్టు అనిపించిందనీ ప్రధాని మోడీ పత్రికల వారికి తెలిపారు. ఒక నిర్జీవపు రాత్రి విగ్రహం - కాంతిరేఖలు ప్రసరించడం ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందోనన్నది వారి అనుచర లెవరైనా పరిశోధిస్తే నొబెల్‌ ప్రకటిద్దామని స్వీడన్‌: స్టాక్‌ హౌమ్‌లో ప్రైయిజ్‌ కమిటి ఆతురతతో ఉన్నట్లుంది...! ఇలా భ్రమలూ భ్రాంతుల్లో బతికే వారినా ఈ దేశ ప్రజలు దేశ నాయకులుగా ఎన్నుకున్నారూ...? మన అజ్ఞానానికి ఎంతో బాధ కలుగుతుంది. మనం అజ్ఞానంతో ఎన్నుకునే నాయకులు అజ్ఞానంలో ఉండక, జ్ఞాన సంపన్నులెలా అవుతారూ? అయోధ్యలో రామాలయం కాదు, ఇప్పటికైనా రామాయణం ఆధారంగా పుష్పక విమానం తయారు చేయించకపోతే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దెదిగిపోవాలి. దీనిపై మోడీ - షాలు స్పందించాలి అని ప్రతిపక్షం వారు డిమాండ్‌ చేస్తున్నారు. ''పరివార్‌ పరివార్‌-అని తెగమాట్లాడు తున్నారు కదా? ఏదీ మీ పరివారం? ఏదీ మీ కుటుంబం?'' అని కొందరు మోడీని, ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించారు. దానికి ఆదిత్యనాథ్‌ ట్విట్టర్‌లో జవాబిచ్చాడు.. ''నా రాష్ట్రంలోని 25కోట్ల మంది ప్రజలు నా పరివారమే'' అని అన్నాడు. తన ''హృదయ వైశాల్యం'' ఎంతో ప్రకటించాడు. అది కొద్ది నిముషాలు కూడా నిలువలేదు. లక్షల మంది ప్రశ్నలు గుప్పించారు. ''మరి ముస్లింలను ఏం చేస్తావు నాయనా? వాళ్ళు 'అబ్బా జాన్‌' అంటే నీకు చిర్రెత్తుకొస్తుంది. దళిత అమ్మాయి అయితే అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కాల్చేయిస్తావు. ఇక యువతీ యువకులెవరైనా తిండిలేదని అన్నా, ఉద్యోగం ఇప్పించమని అన్నా లాఠీలతో వారిని నుగ్గు నుగ్గు చేయిస్తావు... ఇవి కాక, ఇంకా ఎక్కడుంది నీ పరివారం?'' అని!

సంస్కృతం మాట్లాడితే మధుమేహం రాదు.. అని అన్నాడు బీజేపీ ఎంపీ గణేష్‌సింగ్‌. అమెరికాకు చెందిన ఓ సంస్థ పరిశోధనల ప్రకారం రోజూ సంస్కృతం మాట్లాడటం వల్ల మానవ నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, కొవ్వు నియంత్రణలో ఉంటుందని, మధుమేహం రాదని - ఇస్లామిక్‌ భాషలతో సహా ప్రపంచంలోని 97శాతం భాషలు సంస్కృతం ఆధారంగానే రూపొందాయని ఆయన ప్రకటించారు. ఇది ఆయన స్వీయ అనుభవమా కాదా? అనేది చెప్పలేదు. ఈ ప్రకటనతో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. 1. ఆయన నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదని 2. ఆయన శరీరంలో కొవ్వు నియంత్రణలో లేదని! ఇంతదానికి అమెరికా పరిశోధనా సంస్థ దాకా ఎందుకూ? తమరి వారణాసి పరిశోధనా శాలలో తయారైన విశ్వహిందూ ప్రొడక్ట్‌ - అని చెప్పుకుంటే గొడవే ఉండేది కాదు. మాక్సు ముల్లర్‌ పండితునికి లేని పరిజ్ఞానం ఈ బీజేపీ ఎంపీకి ఉన్నందుకు ఆ పార్టీవారు బహుశా ఛాతీలు విరుచుకుంటున్నారేమో? అన్ని భాషలకు తల్లి సంస్కృతం కాదు నాయనా - అన్ని భాషల కలయిక సంస్కృతం అని చెప్పిన పండితులున్నారు. మరి ఈయన ఎప్పుడైన విన్నాడో లేదో. 'నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మూలం భాగవద్గీత' అని అన్నాడు వరంగల్‌ నిట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పి.హెచ్‌. కృష్ణ. ఇతని కన్నా ఉన్నత స్థితిలో ఉన్న పెద్దలే ఇంతకన్నా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలైతే ఇలాంటి వాళ్ళ డిగ్రీలు రద్దుచేయాలి. కానీ, ప్రభుత్వాలే సన్నాసుల చేతుల్లో ఉంటే చర్య తీసుకునేది ఎవరూ? కావాలని మూర్ఖ సన్యాసులను ఎన్నుకుంటున్న సగటు మనుషులు తమ మూర్ఖకత్వంలోంచి బయటపడి వివేకవంతులయితే కదా - వివేకవంతులను ఎన్నుకునేది? పాఠాలు చెప్పే అధ్యాపకుల ఆలోచనలే అంత నాసిరకంగా ఉంటే, వారి క్లాసులో ఉండే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటీ? ఇక దేశ భవిష్యత్తు ఏమిటీ?

ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు లేరు. వేరు వేరు కారణాల వల్ల డాక్టర్లంతా ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. కొత్తవారెవరూ వచ్చి చేరడం లేదు. ఎందుకంటే అక్కడి ఆసుపత్రులలో పనిచేసే పరిస్థితులు లేవు. వసతుల్లేవు. పరికరాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి ప్రాణం మీదికి తెచ్చుకోవడమెందుకని మామూలు ప్రజానీకం కూడా అటువైపు వెళ్ళడం లేదు. అంతగా అవసరమైతే భూమి, జాగా, నగానట్రా అమ్ముకుని, ప్రయివేటు హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు కూడా కావల్సింది అదే. కార్పొరేట్లు బలపడితే, ఫలితంగా తాము బలపడినట్లే కదా? అదీ లింకు! ఎప్పటికప్పుడు ఏదో ఓ దేవుడిపై, ఏదో ఓ దేవాలయంపై చర్చ పెట్టుకుని మనో బలాన్ని, మనశ్శాంతిని పొందుతున్నారు. బీజేపీని విమర్శించే ప్రాంతీయ పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న చోట బీజేపీనే అనుసరిస్తున్నాయి. అక్కడ వారు రామ మందిరమంటే ఇక్కడ వీరు మరో గుడి పునరుద్దరిస్తారు. అక్కడవాళ్ళు ఒక సన్యాసి కాళ్ళమీద పడితే ఇక్కడ వీరు మరో సన్యాసి కాళ్ళమీద పడతారు. ఎదురు నిలిచి గట్టిగా నిలదీయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలవారు కూడా పూజలు నిర్వహిస్తూ బోనాలెత్తుకుని ఊరేగుతున్నారు. ఆచరించేదంతా ఒక్కటే అయినప్పుడు, హిందూ వేరు - హిందుత్వ వేరని ఉపన్యాలివ్వడం ఎందుకూ? వేల యేండ్ల నాటి అనాగరిక సంప్రదాయాల్ని పునరుద్దరించుకుంటూ తాము ప్రగతి ప్రథాన ఉన్నామంటే ఎట్లా? దేశం వెలిగిపోతోందని చెపుతూ మూర్ఖులు మూర్ఖుల్ని కలుపుకు పోవడమేనా - 'సబ్‌క సాత్‌ సబ్‌క వికాస్‌' అంటే? కల్తీ తేనెను అధిక ధరకు అమ్మే రామ్‌దేవ్‌ దేశభక్తుడు. కష్టపడి తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగే - రైతు దేశద్రోహి - ఖలిస్తానీ - ఉగ్రవాది? మొత్తం ఎయిర్‌లైన్స్‌ అమ్మి, ఒకే ఒక్క విమానం కొన్న తొలి ప్రధాని మోడీ అని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజుల్లో మన పిల్లలకు లెక్కల పరీక్షలో ప్రశ్నలు ఇలా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఉదాహరణకు - ''మూడు ఎయిర్‌ పోర్ట్‌లను అమ్మి ఎనమిది మంది పార్లమెంటు సభ్యుల్ని కొన్నచో - ఇరవై రెండు మందిని కొనాలంటే ఎన్ని ఎయిర్‌పోర్టులను అమ్మాలీ?'' అని...

వాస్తవాల్ని వాస్తవాలుగా స్వీకరించే లక్షణం మన కుండాలి. వాస్తవాల్ని కూడా సినిమాగా తీసి చూపిస్తే తప్ప, మన జనం స్పందించరు, చలించరు. 'జై భీం' సినిమాకు గొప్పగా స్పందించిన మనం - సురేంద్ర గాడ్లింగ్‌; సుధా భరర్వాజ్‌; అరుణ్‌ ఫరేరా... మొదలైనవారు ఆదివాసీల విడుదల కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టిన విషయం తెలుసుకోం. అదే ఆదివాసీల గూర్చి మాట్లాడినందుకు జైల్లోనే మగ్గుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబా గురించి గానీ, మన కండ్ల ముందే తిరిగిన వరవరరావుకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించి గానీ అదేమిటో... ఎవరమూ మాట్లాడం. అసలు విషయమేమిటో కనీసం తెలుసుకుందామన్న ఉత్సుకత కూడా ఉండదు. మన జీవితాల్లోని సంఘటనలు ఎవరైనా తెరకెక్కిస్తే మాత్రం, ప్రేక్షకులుగా మనకు ఎక్కడలేని ఆవేశం పొంగుకొస్తుంది. ప్రేక్షకులం 'ప్రేక్షకుల్లా' ఉండిపోకుండా బాధ్యతగల పౌరులమన్నది గుర్తుంచు కోవాలి! కేవలం మన దేశంలోనే ఇలా ఎందుకు జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి! మార్పుకోసం ప్రయత్నిస్తూ ఉండాలి!!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.

Link to comment
Share on other sites

#నేను
ప్రాంతాలను బట్టి, మతాలను బట్టి , దేశాలను బట్టి,కుటుంబ నేపధ్యాలను బట్టి నా వస్త్రధారణ ఉంటుంది. చాలా చోట్ల నేను ఏమి ధరించాలి అనేది దేశాధిపతులో,మతాధిపతులో, కుటుంబ సభ్యులో నిర్ణయిస్తారు. వస్త్రధారణ విషయంలో నా ఇష్టా ఇష్టాలకంటే మతం, సంసృతి, సాంప్రదాయాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిని మోసే బాధ్యత నాపై మోపబడింది .వాటి కోసం కొన్ని సార్లు నేను చావును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. 
వస్త్రధారణ ఒక్కటే కాదు,నేను  వేసే ప్రతి అడుగులో నా ప్రమేయం చాలా తక్కువుగా ఉంటుంది. నేను ఎం తినాలి, ఎం చదవాలి, ఎ పని చేయాలి, ఎప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎంత మంది పిల్లలను, ఎప్పుడు కనాలి  అనేవి చాలా వరకు నా చుట్టూ  ఉన్న వారు నిర్ణయిస్తారు. 

ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం పుట్టిన మత చాందసాలకు నేటికి నేను బాధితురాలని అవుతున్నాను. ఉదాహరణకు బహిష్టు. అది  శరీరం యొక్క సహజ  ప్రక్రియ. కానీ,దాని చుట్టు తరతరాలుగా అల్లుకుపోయి ఉన్న స్టిగ్మా కారణంగా నేను చాలా చోట్ల వివక్షకు గురి అవ్వడం జరుగుతుంది. అంతే కాదు కొన్ని దేశాలలో నా లైంగిక వాంఛను  నియంత్రించడానికి నా బాహ్యజననేంద్రియాలను కూడా తొలగించడం జరుగుతుంది.దానినే female genital mutilation అని అంటారు. అది మానవహక్కుల ఉల్లంఘన అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నప్పటికి ఇంకా చాలా చోట్ల చీకటి గదులలో నాపై జరుగుతూనే ఉంది. 

మీకు తెలుసా? నా కంటే నా శరీరంలో ఒక భాగమైన గర్భసంచికే ఎక్కువ విలువ మరియు ప్రాధాన్యత. ఎందుకంటే వంశాభివృధ్ది నా భాద్యతలలో ఒకటిగా నిర్ణయించడం జరిగింది. 
కొన్ని చోట్ల నన్ను  ఒక విలువైన వస్తువుగా చూస్తారు. ఎవరూ నన్ను దోచుకోకుండా నాకు  పైనుండి క్రింద వరకూ నల్ల గుడ్డతో  కప్పేస్తారు. లేదా నేను ఎక్కడికీ  పోకుండా నాలుగు గోడల మధ్య నన్ను బందీని చేస్తారు. 
నేను ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట అత్యాచారానికి  గురి అవుతూనే ఉంటాను. కానీ న్యాయం కోసం నేను పోరాడకుండా పరుపు అనే అవరోధాన్ని నా ముందు నిలపడం  జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ఆ అవరోధాన్ని నేను అధిగమించే అవకాశం లేక చావును ఎంచుకుంటాను. ఒక వేళ అత్యాచారం చేసేవాడు నా భర్తే అయితే ఇంకా నేను న్యాయం కోసం పోరాడే అవకాశం కూడా కొన్ని దేశాలలో ఉండదు. 
తెల్లవారితే గృహహింస, లైంగిక వేధింపులతో నా లాంటి చాలా మంది పోరాడుతూ జీవితం గడుపుతూ ఉంటారు. 

వ్యభిచారం అనే వృత్తిలో చాలా చోట్ల నన్ను బలవంతంగా దింపడం జరుగుతుంది. వ్యభిచారి అనే ముద్ర వేసి నన్ను సమాజం ఏహ్యభావంతో చూస్తుంది. ఇక్కడ వింత ఏమిటంటే నన్ను ఈ వృత్తిలో దింపిన వారిని గాని, నా దగ్గరకు వచ్చి తన శారీరక అవసరాలు తీర్చుకునే వారినిగాని సమాజం నన్ను చూసినట్లు ఏహ్య భావంతో చూడదు. ఎందుకంటే ఈ పితృస్వామ్య వ్యవస్ధలో నా మీద శీలం అనే వివక్షతో కూడిన నిబంధనను వేశారు. 

నేను వినయవిధేయతలను కలిగి ఉండి తప్పని సరిగా దైవభక్తిని కలిగి ఉండాలి అనేది నా మీద ఆంక్ష. అంతేకాదు స్వర్గం నరకం అనే భావనలతో నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా మీద పవిత్రత అనే భారాన్ని మోపడం జరిగింది. నాకు తెలీకుండానే నన్ను మతాచారాలకు బానిసను చేశారు. అంతేకాకుండా కనీసం ప్రగతిశీల సమాజం గురించి నేను తెలుసుకొనే అవకాశం లేకుండా చేశారు. కాబట్టి నాకు నేనే లేదా నాలాంటి వారికి అవరోధాలు సృష్టించుకొని  అడ్డుగోడలు నిర్మిస్తూ ఉంటాను. 

ఇంతకీ నేను ఎవరు అనుకుంటున్నార? 
అడుగడుగునా వివక్షను ఎదుర్కొంటూ, హక్కులకోసం పోరాడుతూ,ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ వివిధ రంగాలలో, వివిధ వృత్తులలో  ముందుకు సాగిపోతున్న మనిషిని...మహిళను !! 

అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !
#internationalwomensday

Link to comment
Share on other sites

ఆస్తికుల ప్రకారం ఈ అనంతమైన విశ్వం భగవంతుని సృష్టి అంటారు. అయితే అతను ఈ విశ్వాన్ని సృష్టించక ముందు ఎక్కడ ఉన్నాడు? అతను ఎలా వచ్చాడు? విశ్వం యొక్క ఆది అంతాన్నే కనుగొనలేని మానవుడు దానిని సృష్టించిన వాడిని ఎలా తెలుసుకున్నాడు? 

తపస్సు ద్వారా ఋషులు కనుగొన్నారు అని చెప్పింది అభూత కల్పన. మన ఇంద్రియాలకు ఉన్న పరిమితులు ప్రకారమే ఏదైనా గ్రహించగలం. అది విశ్వ పరిమాణంతో పోలిస్తే అతి స్వల్పమైనది.

ఆకాశంలో ఉన్న చంద్రుడు సాధారణ కళ్ళకు కనిపిస్తాడు. దానిమీద ఏముందో తెలుసుకోవడానికి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే ఏమీ తెలియదు. అలా తెలుసుకోలేక పోయారు కాబట్టే చంద్రుణ్ణి ఒక మనిషిగా ఊహించుకొని కథలు రాసుకున్నారు. కానీ పరికరాల ద్వారా చంద్రుని మీద ఏముందో తెలుసుకోగలిగాము. అది కూడా స్వల్పంగా మాత్రమే.

కంటికి కనబడే వాటిని గురించే చెప్పలేని ఋషులు దేవుణ్ణి దర్శించాము అని చెప్పి రాసిన కథలు వారి కలలు,ఊహలు మాత్రమే. 

సాధారణ మనుష్యుల కంటే ఎక్కువ శక్తి గలవారిని దేవుళ్లుగా చేశారు. నిజానికి మనం దేవుళ్లుగా పూజిస్తున్న ఎవరూ ఇప్పుడు లేరు. మన మాదిరే పుట్టి,మన మాదిరే చనిపోయిన వారు దేవుళ్ళు ఎలా అవుతారు?

తెలివైన వారికి ప్రశ్నలు వస్తాయి. తెలివితక్కువ వారు ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్ముతారు.

దేవుడు ఉన్నాడు అని అనుకుందాం. కానీ ఆ దేముడు నీ ప్రార్థనలు పూజలు ఎందుకు అలకిస్తాడు?. పరస్పర విరుద్ధమైన కోర్కెలు కలిగిన ఇద్దరు మంచి వ్యక్తులు దేముణ్ణి ప్రార్థిస్తే దేముడు ఎవరి కోర్కెను తీర్చాలి? దీనిని సమర్దించడానికి కర్మను అంటగట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ఏమి ఖర్మ ఉంటుంది? 

చెట్టుకు కాసిన ప్రతి పువ్వు కాయగా మారదు. అలాగే జన్మించే ప్రతి శిశువూ ఆరోగ్యంగా పుట్టదు. అది ప్రకృతి సిద్ధమైనది. ఆ లోపాలను మనిషి కొన్ని సార్లు చక్కదిద్దుకోగలుగుతున్నాడు. అంటే అప్పుడు మనిషి దేవుణ్ణి ధిక్కరిస్తున్నట్లేనా?

ఎన్నో ప్రశ్నలు. ఎన్నో సమర్దనలు. ఎవరిది వారికే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం. పూజలు,ప్రార్థనలు ద్వారా నీ కష్టాలు పోయేలా చేస్తాము అంటే మాత్రం అది పచ్చి మోసం. అది ఆత్మ వంచన.

Link to comment
Share on other sites

On 2/18/2022 at 1:41 AM, RamaSiddhu J said:

శూద్రులంటే ఎవరు?
——————————

శూద్రులంటే బ్రాహ్మణ, క్యత్రియ, వైశ్యులు కాని మిగిలిన హిందూ చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.

‘” బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు.” అని ( ఋగ్వేదం 10 – 90 – 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.

” భగవద్గీత ” 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.

మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1. వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 – 1 ) లో పేర్కొన్నాడు.

హిందూ (బ్రాహ్మణ) మత సామాజిక వ్వస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?

1. ” బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం”. ( మనుస్మృతి 1 – 91 )

2. ” శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించిన యెడల బ్రాహ్మనులను హింసించును. ” ( మను 10 – 129 )

3. ” ,బ్రాహ్మనుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా.” ( మను 8 – 417 )

4. ” బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. ” ( 10 – 123 )

5. ” జీతభత్యాల ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. ” ( మను 8 – 413 )

6. ” బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. ” ( మను 10 – 125 )

7. ” శూద్రుడు బ్రాహ్మణుని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. ” ( మను 8. 271 )

8. ” ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. ” ( మను 8 – 272 )

9. ” బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. ” ( మను 8 – 281 )

10. “శూద్రుడు బ్రాహ్మణుని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. ” ( మను 8 – 282)

11. ” బ్రహ్మణుని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. ” ( 8 – 283 )

12. ” శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. ” (మను 4 – 99 )

13. ” బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. ” ( మను 2 – 31 )

14. ” బ్రాహ్మణుని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. ” ( మను 9 – 335 )

బ్రాహ్మినిజం శూద్రులపై జరిపిన ఈ మనుధర్మం అనే ధర్మం న్యాయమైనదేనా? అలా శాసించి అమలుపరచిన శాస్త్రం పవిత్రమైనదిగా భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణించాలా??

edhi too much ga vunnadhi ..... mostly hatred towards brahmins ..... evaru iyyina manu scripts chadivina vallu confirm chesthe manchidi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...