Jump to content

Recommended Posts

  • ravindras changed the title to kshatriya add on ashok gajapathi raju issue

రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియులు చేసుకున్న విన్నపాలను పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కు కాపు సమాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాజ్యాలు పోయినా మహారాజుల కుటుంబాలను ప్రజలు గౌరవిస్తారని లేఖలో పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అన్నారు. జగన్ కు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పూర్తి సారాంశం ఇదే.

"రెండు రాష్ట్రాల గౌరవ క్షత్రియ సమాజం వారు తమరికి దినపత్రికలో యాడ్ ద్వారా చెప్పుకున్న విన్నపమును సీరియస్ గా పరిశీలించమని కోరుకుంటున్నాను.

గౌరవ అశోక్ గజపతిరాజు గారిది మహారాజుల కుటుంబం. వారి తాత, తండ్రి గార్ల నుంచి ఎన్నో దేవాలయాలు కట్టడానికి ఆర్థిక సహాయంతో పాటు, వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారండి. వాటికి ట్రస్టులు ఏర్పాటు చేసి, నిత్య పూజా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలియనిది కాదు. చదువుకునే పిల్లలకు స్కూళ్లు, వాటికి వాటికి కావాల్సిన సదుపాయాలు చేసినవారండి. రాజ్యాలు పోయినా... మహారాజ కుటంబం అని అందరూ గౌరవిస్తారండి.

ఈ మధ్య మాన్సాస్ ట్రస్టు విషయంలో గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం అశోక్ గజపతిరాజు తిరిగి ఛార్జ్ తీసుకున్న తర్వాత... గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు తొందరలో రాజు గారిని జైలుకు పంపుతామని అనడం చాలా బాధాకరం. అశోక్ రాజు, నేను కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ మంత్రులుగా అసెంబ్లీలో ఒకే సోఫాలో కూర్చునేవారము. ఎప్పుడైనా, ఎవరినైనా వారు అగౌరవమైన భాషలో మాట్లాడటం నేను చూడలేదండి.

ఈ రోజుకీ మా ప్రాంతం వారు క్షత్రియులను, వెలమ దొరలను ఎప్పుడూ పేరుతో పిలవరండి. దివాణం/దొర అనే సంబోధిస్తారు. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఏ సీఎం పొందని గౌరవం పొందారంటే వారు చేసిన మంచి పనులు, ఎముక లేనివిధంగా చేసిన ఉపకారాలు ఎవరూ మర్చి పోరండి. వారు హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు ప్రజల గుండె తల్లడిల్లిపోయింది. దేశం మొత్తం వెతకడానికి శాటిలైట్ మరో మార్గాల ద్వారా అప్పటి ప్రధాని గారు, సోనియాగాంధీ గారు చేసిన ప్రయత్నం చిన్న విషయం కాదండి. శత్రువు కూడా ప్రేమించే స్థాయికి వైయస్ వెళ్లారు. ఆ స్థాయికి మీరు... ఆ మహానాయకులకి అంత దగ్గరకి కాకపోయినా ఇంచుమించుగా ఆ కోవకు చెందిన వారండి.

పూర్వం వీరితో పాటు వైశ్యులు, బ్రాహ్మణులు పేద పిల్ల చదువుల కోసం భూములు దానం ఇవ్వడంతో పాటు, బిల్డింగుల కోసం ధన సహాయం చేసి, వారి పేర్లు పెట్టమని కోరేవారు. దయచేసి పూర్వం గౌరవంగా జీవించిన వారిని అవమానించే కార్యక్రమాన్ని తీసుకోవద్దని మీ గౌరవ నాయకులకు ఆదేశాలను జారీ చేయమని కోరుతున్నాను" అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

Link to post
Share on other sites

అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కులాన్ని తిట్టినట్లా శ్రీరంగనాథరాజు? అంటూ టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబుకు ఆపాదించడం వైసీపీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. కులాల మధ్య మంటలు రాజేసి ఆ మంటల్లో చలికాచుకునే నీచమైన పార్టీ వైసీపీ అని అన్నారు. మీ పార్టీకి ఉన్న కులగజ్జిని అందరికీ ఆపాదిస్తే ఎలా.? అని ప్రశ్నించారు.  విధానపరంగా ఎదుర్కోవడం చేతకాక క్షత్రియుల మధ్య జగన్ రెడ్డి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. 

సీఎం జగన్ రెడ్డి కులానికి ఇచ్చిన 822 నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా ఇతర కులానికి కట్టబెట్టారా? అని మంతెన ప్రశ్నించారు. క్షత్రియుల అభివృద్ధికి ఏం కృషి చేశారన్నారు. బీసీలు సఖ్యతగా ఉన్నారని వారిలో ఎడబాట్లు తెచ్చేందుకు కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారని,  కాసుల్లేని కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి బీసీలను అవమానించారన్నారు. ఎన్నో భూదానాలు చేసి దేశంలోనే గొప్ప రాజవంశంలో పుట్టిన అశోక్ గజపతిరాజును వెల్లంపల్లి శ్రీనివాస్ వెధవ అని సంబోధించినప్పుడు శ్రీరంగనాథరాజు ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంతెన హెచ్చరించారు.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...