Jump to content

Adani Group


sonykongara

Recommended Posts

  • Replies 98
  • Created
  • Last Reply
విశాఖలో డేటా పార్క్‌ 

 

20 ఏళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు 
ఏపీ ఐటీశాఖ,అదానీ గ్రూప్‌ మధ్య ఒప్పందం 
ఈనాడు - అమరావతి

9ap-main2a_1.jpg

ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్‌, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ, అదానీ గ్రూప్‌ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీల సమక్షంలోనే ఇందుకు బీజం పడింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రజావేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, అదానీ గ్రూప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా విశాఖ నగరంలో పర్యావరణ హిత డేటా పార్క్‌ను అదానీ గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ (మూడు కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. 5 గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ను కూడా నెలకొల్పుతుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు అందించే కీలక కేంద్రంగా   ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్‌వేర్‌ సప్లయర్స్‌, సాఫ్ట్‌వేర్‌, స్టార్టప్‌ కంపెనీలు, టెలీకాం కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఐటీ శాఖ భావిస్తోంది.

డేటా కేంద్రాలు రెండు చోట్లే... 
ప్రస్తుతం భారతదేశంలో డేటా సెంటర్లు చెన్నై, ముంబయి నగరాల్లో మాత్రమే ఉన్నాయి. 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం అభివృద్ధి విలువ 160 బిలియన్‌ డాలర్లు కాగా, ఇది ప్రపంచంతో పోలిస్తే 2 శాతమే. ప్రతి ఏడాది ఈ రంగంలో 20శాతం పెరుగుదల చోటుచేసుకుంటోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో దీనిపై ఆధారపడిన అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుంది.

 

Link to comment
Share on other sites

అభివృద్ధిలో ఇక దూకుడే 

 

డేటా సెంటర్‌తో రూ. 1.75 లక్షల కోట్ల లబ్ధి 
20 శాతం పెరగనున్న జీఎస్‌డీపీ 
విస్తృత స్థాయిలో ఉద్యోగాల కల్పన

9ap-story1a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 1 గిగా వాట్‌ సామర్థ్యంగల డేటాసెంటర్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందం ఆచరణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి పరుగులు తీసే అవకాశముంది. డేటాసెంటర్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. దీనివల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20శాతం పెరుగుతుందని ఒక అంచనా. పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లోకి వస్తే రాష్ట్రానికి రూ.1.75 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. 
అపారమైన అవకాశాలు 
భారీ ఎత్తున డేటా నిల్వ చేసే కేంద్రాలనే డేటాసెంటర్లుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం వాణిజ్య, వ్యాపార, సేవారంగాల్లో కంప్యూటర్లు, డేటాతో ముడిపడే నడుస్తున్నాయి. అవి ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాంటే ‘బ్యాకప్‌’ వ్యవస్థ ఉండాలి. 
ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరగడం, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఆధునిక విధానాలు వచ్చిన నేపథ్యంలో వివిధ మార్గాల్లో డేటా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. భారతదేశం డేటా గోప్యత, రక్షణ హక్కుల్ని పక్కాగా అమలు చేయనుంది. మన దేశంలో ఉత్పత్తయిన డేటాను ఇక్కడే నిల్వ చేయాలని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా నివేదికలో పేర్కొంది. ఇది చట్టంగా మారితే మన దేశంలో భారీ డేటా సెంటర్ల అవసరం చాలా ఏర్పడుతుంది. 
ప్రస్తుతం మన దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 2 శాతం కంటే తక్కువే. 
మెగా డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడితోపాటు, పునరుత్పాదక ఇంధన వనరులు, సముద్ర జలాలు, చౌక విద్యుత్‌ అవసరం. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. సముద్రగర్భంలో కేబుల్స్‌ వేయడం ఇక్కడ తేలిక. 
పెట్టుబడులు: రూ.68,000 కోట్లు 
రాష్ట్రంలో ఒక గిగావాట్‌ సామర్థ్యంగల డేటా సెంటర్‌ (డీసీ) ఏర్పాటు చేస్తే డీసీ డెవలపర్‌ ద్వారా రూ.7వేలకోట్లు, డీసీ వినియోగదారుల ద్వారా రూ.10వేల కోట్లు, దానికి అనుబంధ కార్యకలాపాల ద్వారా రూ.51వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. 
ఉద్యోగాలు: 88,200 
డీసీ డెవలపర్‌ ద్వారా 8,050, వినియోగదారుల ద్వారా 14 వేలు, అనుబంధ కార్యకలాపాల వల్ల 66,150 ఉద్యోగాలు వస్తాయి. 
జీఎస్‌డీపీ కంట్రిబ్యూషన్‌ రూ.1,72,000 కోట్లు 
డెవలపర్‌ ద్వారా రూ.17,800 కోట్లు, వినియోగదారుల ద్వారా రూ.25,200 కోట్లు, అనుబంధ కార్యకలాపాల వల్ల రూ.1,29,000 కోట్లు. 
మూడు చోట్ల స్థలం 
ఆదాని డేటా సెంటర్‌ కోసం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద 300, కాపులుప్పాడ వద్ద 100, విజయనగరంలో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. 
డేటా సెంటర్‌ నిర్వహణకు అవసరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తికి రాయలసీమలో 10 వేల ఎకరాలు కేటాయించనున్నారు. 
ఆదానీ గ్రూపు రూ.10 కోట్ల వ్యయంతో 2 వేల మంది విద్యార్థుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయనుంది. 
రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.25 లక్షల వ్యయంతో మొబైల్‌ హెల్త్‌కేర్‌ సదుపాయం కల్పించనుంది. 
ప్రయోజనాలు 
డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఐటీ పెట్టుబడులన్నీ డేటా సెంటర్ల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి. విశాఖకు భారీగా ఐటీపరిశ్రమలు రావడానికి ఇది దోహదం చేస్తుంది.

చివరి వరకు గోప్యం

దానీ గ్రూప్‌ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చివరివరకు గోప్యంగా ఉంచింది. ఆంధ్రప్రదేశ్‌ లోనే ఏర్పాటు చేసేలా ఆదానీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ గత సంవత్సరం దావోస్‌లోను, ఆ తర్వాత ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లోను ఆదానీ గ్రూప్‌ ముఖ్యులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఆదానీ గ్రూప్‌ ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందని తెలుసుకుని స్వయంగా వారిని కలసి రాష్ట్రంలోని క్లౌడ్‌ హబ్‌ పాలసీ వివరాలను తెలియపర్చారు.

 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Idhedho Gannavaram lo petochu ga.. 

Vache 10 investments lo oka 2-3 ayina Capital area lo pettandi..

Land issue anukunta ga, pool area lo pettatame big white collar companies, leka company vallu కొని pettatame కానీ, govt kashtamemo ivvatam  land.. 

Link to comment
Share on other sites

విశాఖలో అదానీ భారీ ప్రాజెక్ట్‌
10-01-2019 02:02:37
 
  • రూ.70,000 కోట్ల పెట్టుబడి..
  • 1.10లక్షల మందికి ఉద్యోగాలు
  • 500 ఎకరాల్లో డేటా కేంద్రాలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు ముందు నవ్యాంధ్రకు అతి పెద్ద ‘పెట్టుబడి పండుగ’ వచ్చింది. భారత పారిశ్రామిక దిగ్గజం ‘అదానీ’ ఏపీలో దేశంలోనే అతిపెద్దదైన ‘డేటా సెంటర్‌’ ఏర్పాటు చేయనుంది. విశాఖ సమీపంలో 500ల ఎకరాల్లో... ఏకంగా 70వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో అదానీ సంస్థ చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో ఐటీ శాఖ లోకేశ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత కుదిరిన అత్యధిక పెట్టుబడి ఒప్పందం ఇదే. దీని ప్రకారం... అదానీ సంస్థ దేశంలోనే ఎక్కడా లేనంతస్థాయిలో 5జీడబ్ల్యూ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్‌ పార్కులను ఏర్పాటు చేస్తుంది.
 
ఈ పార్కుల్లో 20 ఏళ్ల కాలంలో రూ.70వేల కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. డేటా సెంటర్‌ ద్వారా రూ.40వేల కోట్లు, సోలార్‌ పార్కుల ద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా 1.10లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు తొలిదశ 18 నెలల్లో పూర్తవుతుందన్నారు. భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు,ఫలితాలు ప్రతిదీ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయని, ఐటీకి డేటా సెంటర్‌ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతం లో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఏపీని డేటా హబ్‌గా మారుస్తున్నామన్నారు.
 
ప్రపంచంలోనే తొలిసారిగా...
వందశాతం పునరుత్పాదక ఇంధనంతో నడిచే డేటా సెంటర్‌ పార్కులు ప్రపంచంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పడబోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వీటిద్వారా ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ స్టార్ట్‌పలు రాష్ట్రానికి తరలొస్తాయన్నారు. రాబోయే ఐదేళ్లలో డేటా వినియోగం వందశాతం పెరుగుతుందని, సమాచార నిల్వ కీలకంగా మారుతుందన్నారు. సమాచార వినియోగం జపాన్‌లో 8.3జీబీ ఉంటే ఇండియాలో 8.8జీబీ ఉందన్నారు. భారత్‌లో ఉన్నంతమంది 4జీ వినియోగదారులు మరెక్కడా లేరని, జపాన్‌లో వీరు 6.5శాతం మంది కాగా, ఏపీలో 18శాతం అని వివరించారు. ఇప్పటివరకు సమాచార నిల్వ సామర్థ్యం దేశం వెలుపలే ఉందని, ఇప్పుడు విశాఖలో అత్యంత భారీ సామర్థ్యంతో 3డేటా సెంటర్లు ఏర్పాటవుతాయన్నారు.
 
సాంకేతికంగా ముందజంలో ఉండటం, విద్యాకేంద్రం కావడంతోనే విశాఖను ఎంపిక చేసుకున్నారని సీఎం పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలో ఒక్కోటి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో 10 సోలార్‌ పార్కులు రానున్నాయని తెలిపారు. పన్ను రాబడి, భూముల ధరల పెంపు ద్వారానే వర్జీనియాలో అత్యధిక ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చాయన్నారు. భవిష్యత్తులో వర్జీనియాకు దీటుగా విశాఖ రూపొందుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా డేటా అనలిటిక్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఏఐకు బాటలు పడతాయన్నారు.
Link to comment
Share on other sites

6 hours ago, ramntr said:

Land issue anukunta ga, pool area lo pettatame big white collar companies, leka company vallu కొని pettatame కానీ, govt kashtamemo ivvatam  land.. 

 

23 minutes ago, sonykongara said:

sea unte valla ki use ga untundi

White color jobs antunnaru.. Intha varaku Private valu construct chesukovadaniki permissions levu.. okka software company ki land ivvaledhu..

 

Banks and central institutes  ki land isthe asala patthasu leru (not CBN fault)

 

West,Krishna,Guntur, Prakasam dist vallu waiting S/w companies vasthe Hometowns ki shift ayipovali ani.. valu epatiki vachenu eppatiki campus lu kattukunenu eppudu shift ayyenu.. ee 4 dist batch antha shift ayithe benifit ayyedhi TDP ne..

Link to comment
Share on other sites

9 minutes ago, Raaz@NBK said:

 

White color jobs antunnaru.. Intha varaku Private valu construct chesukovadaniki permissions levu.. okka software company ki land ivvaledhu..

 

Banks and central institutes  ki land isthe asala patthasu leru (not CBN fault)

 

West,Krishna,Guntur, Prakasam dist vallu waiting S/w companies vasthe Hometowns ki shift ayipovali ani.. valu epatiki vachenu eppatiki campus lu kattukunenu eppudu shift ayyenu.. ee 4 dist batch antha shift ayithe benifit ayyedhi TDP ne..

మెగా డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడితోపాటు, పునరుత్పాదక ఇంధన వనరులు, సముద్ర జలాలు, చౌక విద్యుత్‌ అవసరం. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. సముద్రగర్భంలో కేబుల్స్‌ వేయడం ఇక్కడ తేలిక

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

మెగా డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడితోపాటు, పునరుత్పాదక ఇంధన వనరులు, సముద్ర జలాలు, చౌక విద్యుత్‌ అవసరం. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. సముద్రగర్భంలో కేబుల్స్‌ వేయడం ఇక్కడ తేలిక

TFS bro :shakehands:

Link to comment
Share on other sites

సీఎంతో మోదీ సన్నిహితుడు.. ఫలించిన లోకేశ్ వ్యూహం
12-01-2019 11:46:21
 
636828910672318880.jpg
ఆయన ప్రధానికి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త. దేశంలో అంబానీకి పోటీగా ఎదుగుతున్న ఇండస్ట్రియల్ గ్రూప్ అది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి, కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం సాగుతోంది. ఈ తరుణంలో మోదీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త స్వయంగా సొంత విమానంలో విజయవాడ ఎయిర్‌పోర్టు‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ అంశమే ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్. మోదీకి సన్నిహితుడైన ఆదానీ ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వచ్చారనే ప్రశ్న ప్రత్యర్థి పక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఆదానీ రాక ద్వారా ఏపీలో వచ్చే అయిదేళ్లలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహించనున్నాయి. ఇంతకీ ఆదానీ రాక వెనక పరమార్థం ఏంటో ఈ కథనంలో చూద్దాం.
 
 
    దేశంలో అంబానీల గ్రూప్‌కి పోటీగా ఎదుగుతున్న మరో గ్రూప్‌ అదానీలది. గుజరాత్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన ఈ గ్రూపు ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితం అన్న పేరుంది. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించాక అదానీ గ్రూపు తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు- అనేక రంగాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటుచేసే బిజినెస్‌ చేపట్టింది. అదానీ గ్రూపు ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండటం, వీటన్నింటికీ మించి అదానీ గ్రూపు రోజురోజుకీ ఎదుగుతుండటంతో ఆ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గ్రౌండ్‌వర్కు ప్రారంభించారు.
 
 
   ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో లోకేశ్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే! ఇందుకు అనుగుణంగా ఆయన పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో అదానీ గ్రూపు ముఖ్యులను లోకేశ్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వారికి వివరించారు. అప్పట్లో ఆసక్తి ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత అదానీ గ్రూపు ముందుకు రాలేదు. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన విన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరోసారి అదానీ గ్రూపుతో లోకేశ్‌ భేటీ అయ్యారు. అదే సమయంలో అదానీ గ్రూపు డేటా సెంటర్ల బిజినెస్‌లోకి అడుగు పెడుతోందని లోకేశ్‌ తెలుసుకున్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇటీవల అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీని కలుసుకున్నారు. ఏపీలో క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అనువైన పరిస్థితులను వివరించారు. భూమి, మౌలిక వసతుల కల్పన, వివిధ శాఖలతో సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం వంటి వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్‌ ఆహ్వానానికి అదానీ గ్రూపు సానుకూలంగా స్పందించింది.
 
 
   ఇక్కడే అసలు కథ మొదలైంది. అదానీ గ్రూపు సభ్యులు ఏపీలో పర్యటించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా వారికి కలిసివచ్చింది. అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని తెలుసుకున్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అదానీ గ్రూపుని సంప్రదించాయి. ఏపీ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తామనీ, తక్కువ ధరకు భూములు ఇస్తామని కూడా అదానీ గ్రూపునకు ప్రతిపాదనలు వెళ్లాయి. వత్తిడి కూడా పెరిగింది. ఈలోపు అదానీ గ్రూపు ఏపీలో పరిస్థితులను మరోసారి భేరీజు వేసుకుంది. ఈ రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల గురించి, అనంతపురంలో కియా, చిత్తూరుజిల్లా శ్రీసిటీలో ఏర్పాటవుతున్న పరిశ్రమల గురించి తెలుసుకుంది. వీటితోపాటు అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు, ఐటీ కారిడార్‌గా విశాఖపట్నం ఎదుగుతున్న వైనం వారిని ఆకట్టుకున్నాయి. దీంతో అదానీ గ్రూపు ఏపీ వైపే మొగ్గుచూపింది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తమకి పనికి వస్తుందని నమ్మింది.
 
 
    ఈ సందర్భంగా అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎవరికీ చెప్పకుండా విజయవాడ ఎయిర్‌పోర్టులో వాలిపోయారు. ఆయన విజయవాడకు వచ్చే విషయం రెండు గంటల ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. బుధవారం సాయంత్రం అయిదు గంటలకు అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ విజయవాడ ఎయిర్‌పోర్టుకు సొంత విమానంలో చేరుకున్నారు. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆ శాఖ అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. వెంటబెట్టుకుని మరీ సీఎం నివాసానికి తీసుకువెళ్లారు. సుమారు గంటసేపు చంద్రబాబుతో చర్చలు జరిగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోడేటా సెంటర్ల ఏర్పాటుకు వచ్చే అయిదేళ్లలో 70 వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూపు చెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ కూడా కుదుర్చుకుంది.
 
 
   ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అదానీ గ్రూపు కుదుర్చుకున్న ఈ ఒప్పందం అసాధారణ ఘట్టమనే చెప్పాలి. ఈ ఒప్పందం వల్ల ఏపీలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విశాఖపట్నంలో అయిదు వందల ఎకరాలలో మూడు ప్రాంతాలలో ఒక గిగా వాట్ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపు ముందుకు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అదానీ గ్రూపు డేటా సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయబోతోంది. డిన్నర్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అదానీకి సాదరంగా వీడ్కోలు పలికారు. మంత్రి లోకేశ్‌ స్వయంగా విజయవాడ విమానాశ్రయం వరకు అదానీని తీసుకువెళ్లి విమానం ఎక్కించి వచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న గ్రౌండ్‌వర్క్ చివరి నిముషం వరకూ ఎవరికీ తెలియనివ్వడం లేదు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడం, స్వయంగా గ్రూపు ఛైర్మన్ అదానీయే ఏపీకి రావడం, చంద్రబాబుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అదానీ గ్రూప్ ఎండీ అనిల్ సార్దానాతో లోకేశ్ సమావేశం
22-01-2019 17:54:57
 
636837765554276603.jpg
దావోస్‌: ఏపీలో డేటా సెంటర్ పార్క్ ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలాఖరులో డేటా సెంటర్ పార్క్‌కు భూమి పూజ చేస్తామన్నారు. అదానీ గ్రూప్ ఎండీ అనిల్ సార్దానాతో మంత్రి లోకేష్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పనులు వేగంగా పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనెక్టెడ్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకి అదానీ గ్రూప్ సహకారం అందిస్తుందన్నారు
Link to comment
Share on other sites

e Adani gadu evvaram antha teda ga undi....:wall:

eedu  AP lo pratidi bid chesi chivaraki anni block chestadu anipistundi....
Bhavanapadu port,Bhogapuram airport(in final 5), Vizag data center

Just e week gujarat lo data center ani modalu pettadu malli

https://www.livemint.com/Industry/kGBBWaRDhLYKzJyJZFu2oO/Adani-announces-55000-cr-investment-in-Gujarat-in-next-5-y.html

Link to comment
Share on other sites

3 hours ago, AnnaGaru said:

e Adani gadu evvaram antha teda ga undi....:wall:

eedu  AP lo pratidi bid chesi chivaraki anni block chestadu anipistundi....
Bhavanapadu port,Bhogapuram airport(in final 5), Vizag data center

Just e week gujarat lo data center ani modalu pettadu malli

https://www.livemint.com/Industry/kGBBWaRDhLYKzJyJZFu2oO/Adani-announces-55000-cr-investment-in-Gujarat-in-next-5-y.html

Bhavanapadu port ki inka land ivvaledhu govt... so totally can't blame him on this...

Bhogapuram airport... lets see if he gets it first...

Vizag data center - Vizag is one of the many 1GW data centers that the are going to setup ani chepparu kadha... GJ lo investment summit jarugutondhi.. so Industrialist will come and say many things.. lets see how many will be grounded and by when...

Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడికి కట్టుబడ్డాం 

 

ఎన్ని ఫోన్లొచ్చినా  నిర్ణయం మార్చుకోలేదు 
విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుపై  అదానీ సంస్థల సీఈవో అనిల్‌ సార్దానా 
దావోస్‌లో మంత్రి లోకేశ్‌తో భేటీ 
ఇతర సంస్థల ప్రముఖులతోనూ  రాష్ట్ర బృందం చర్చలు 
ఈనాడు - అమరావతి

22AP-main3a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాక మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఆహ్వానించారని, అధికారుల నుంచీ అనేక ఫోన్లు వచ్చాయని.. అదానీ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో అనిల్‌ సార్దానా అన్నారు. అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పారు. 
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన... ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, అధికారుల బృందం మంగళవారం అక్కడ అదానీ సంస్థల ఎండీ, సీఈవోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్దానా మాట్లాడుతూ...ఏపీ ప్రభుత్వం, అధికారులు ఎంతో వేగంగా పనిచేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు లేవని ఆయా రాష్ట్రాలకు చెప్పినట్టు వివరించారు. వేగంగా విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలోనూ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని, కనెక్టెడ్‌ స్మార్ట్‌ సిటీల ఏర్పాటులో అదానీ గ్రూపు సేవలు అందిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్తు సరఫరా, ఫైబర్‌ అనుసంధానం, తాగునీరు, వీధిదీపాలు వంటి అనేక సేవలు కలిపి ప్రజలకు అందించే వ్యవస్థ ఇప్పటివరకు భారత్‌లో లేదని.. అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ విషయంలో తగిన సహకారాన్ని అందిస్తుందని అనిల్‌ చెప్పారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. దావోస్‌ వచ్చిన అదానీ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని కూడా మంత్రి లోకేశ్‌ కలిశారు.

 

Link to comment
Share on other sites

On 1/22/2019 at 1:23 PM, AnnaGaru said:

e Adani gadu evvaram antha teda ga undi....:wall:

eedu  AP lo pratidi bid chesi chivaraki anni block chestadu anipistundi....
Bhavanapadu port,Bhogapuram airport(in final 5), Vizag data center

Just e week gujarat lo data center ani modalu pettadu malli

https://www.livemint.com/Industry/kGBBWaRDhLYKzJyJZFu2oO/Adani-announces-55000-cr-investment-in-Gujarat-in-next-5-y.html

Well, you raised a good point Brother. You may be right. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఏపీలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు
09-02-2019 21:51:06
 
636853461018344395.jpg
అమరావతి: ఏపీలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. రూ.70 వేల కోట్లతో ఐదేళ్లలో డేటా సెంటర్ పార్క్, రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 28 వేల మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశం దొరకనుంది. 12 ఏళ్లలో మూడు దశలలో మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. విశాఖ జిల్లా కాపులుప్పాడ, నక్కపల్లి, జి. కొండూరు ప్రాంతాలలో డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కోసం 500 ఎకరాల భూములను ఏపీ సర్కార్ గుర్తించింది.
 
 
ఇదిలా ఉంటే.. యాంకర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా అదానీ గ్రూపు డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేయనుంది. రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలే కీలకం కానున్నందున డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేయబోతోంది. దీని వల్ల విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధి జరగనుంది. అమెరికాలోని ఫీనిక్స్ తరహాలో విశాఖ అభివృద్ధి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా నక్కపల్లి, కాపులుప్పాడ, జి.కొండూరు వరకు విశాఖ నగరం విస్తరించనున్నది.
Link to comment
Share on other sites

విశాఖలో 70 వేల కోట్లతో డేటా సెంటర్‌
10-02-2019 03:03:14
 
  • అదాని పెట్టుబడులు... 28 వేల ఉద్యోగాలు
  • రూ.978 కోట్లతో అమరావతిలో సోకా్ట్రనిక్‌
  • 6వేల ఉద్యోగాలు... ఎస్‌ఐపీబీ అనుమతి
 
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): సన్‌రైజ్‌ స్టేట్‌ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ గ్రూపు ఆధ్వర్యంలో డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. రూ.70వేల కోట్లతో అయిదేళ్లలో డేటాసెంటర్‌ పార్క్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా 28వేల మందికి ప్రత్యక్షంగా, 5వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 12 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తారు. విశాఖ జిల్లా కాపులుప్పాడ, నక్కపల్లి, జి.కొండూరు ప్రాంతాల్లో డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు కోసం 500 ఎకరాల భూములను గుర్తించారు. యాంకర్‌ ఇన్వెస్టుమెంట్‌గా అదాని గ్రూపు డేటా సెంటర్‌ పార్క్‌ ఉంటుంది. డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు వల్ల విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధి చేస్తారు. అమెరికాలోని ఫినిక్స్‌ తరహాలో విశాఖనగరం విస్తరించనుంది.
 
మరోవైపు, రాజధాని అమరావతిలో సోకా్ట్రనిక్‌ సంస్థ రూ.978 కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఈ కంపెనీ స్థాపనకు 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రాథమికంగా ఆమోదించారు. ఆరేళ్లలో ఈ సంస్థ పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ప్రారంభించనుంది. 260 మందికి ప్రత్యక్షంగా, 6వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. తిరుపతి ఎలకా్ట్రనిక్‌ క్లస్టర్‌-1లో యాస్ట్రమ్‌ రూ.100.32 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ హైటెక్‌ కన్జ్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. 2,090 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
 
తిరుపతి-శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్డులో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు మేజెస్‌ సిద్ధంగా ఉంది. సీఆర్‌డీఏ ప్రాంతంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఐటీ, ఐటీఈఎస్‌ పార్కు ఏర్పాటుకు బీవీఎం ఎఏనర్జీ అండ్‌ రెసిడెన్సీ సంస్థ సన్నాహాలు చేస్తోంది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...