Jump to content

Adani Group


sonykongara

Recommended Posts

  • Replies 98
  • Created
  • Last Reply
విశాఖ డేటా సెంటర్‌ పార్క్‌కు 13న సీఎం శంకుస్థాపన

 

ఈనాడు, విశాఖపట్నం: దేశంలోనే డిజిటల్‌ సమాచారాన్ని భద్రపరిచేందుకు అతి పెద్ద డేటా సెంటర్‌ పార్క్‌ను విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సముద్ర అంతర్భాగం నుంచి ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశాన్ని కలుపుతూ సబ్‌మెరైన్‌ కేబుల్‌ను విశాఖ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా దేశాలతో ఫోన్‌ సంభాషణలు అత్యంత వేగంగా ఉండాలంటే సబ్‌మెరైన్‌ కేబుల్‌కు సమీపంలో డేటాసెంటర్‌ ఉండడం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఈ గ్రూపు ఇక్కడ డేటా పార్కును ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఐ.టి.సంఘం(ఐటాప్‌) ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ కె.శ్రీధర్‌ మాట్లాడుతూ సమగ్ర మౌలిక సదుపాయాలన్నీ ఒకేచోట ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇతర సంస్థలు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా 50వేల వరకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.

 

Link to comment
Share on other sites

అదాని డేటా సెంట‌ర్ పార్క్‌కు భూమిపూజ చేయనున్న సీఎం చంద్రాబాబు
13-02-2019 21:40:52
 
636856909496018479.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అదాని డేటా సెంట‌ర్ పార్క్‌కు భూమిపూజ చేయనున్నారు. ప్రపంచంలోనే తొలి ఎకోఫ్రెండ్లీ డేటాసెంట‌ర్ పార్క్ కావడం విశేషం. ఈ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుతో అదాని గ్రూప్‌ దాదాపు ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది. వివిధ ద‌శ‌ల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టనుంది అదాని గ్రూప్‌.
Link to comment
Share on other sites

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అదానీ డేటా సెంటర్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ పార్క్ వల్ల ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే డేటా హబ్ గా మారనుంది. ఇది మనందరికీ గర్వకారణం. మొదటి దశలో 40వేల కోట్ల పెట్టుబడులతో 28,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి.

2 replies 2 retweets 9 likes
 
 
 
 
 
 
 
 

అదానీ గ్రూప్ తో 2018 అక్టోబర్ 23న మొదటి సమావేశం జరిగింది. జనవరి 9, 2019 న ఒప్పందాలు జరిగాయి. ఈరోజు డేటా సెంటర్ పార్క్ శంకుస్థాపన జరుపుకుంటోంది. ఇలాగే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తవుతుందన్న నమ్మకం నాకు ఉంది.

1 reply 1 retweet 3 likes
 
 
 
 
 
 
 
 

పెట్టుబడులకు , పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో , ఎటువంటి సహాయ సహకారాలు సమకూరుస్తుందో తెలిపేందుకు అదానీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు ఒక ఉదాహరణ.

DzXZ0aUU0AAQS5C.jpg
DzXZ3KlU0AAZF2d.jpg
DzXZ48-VAAATvnq.jpg
DzXZ5quV4AEGQoI.jpg
Link to comment
Share on other sites

డేటాసెంటర్ పార్క్ ఏర్పాటు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్ల‌యర్స్, సాఫ్ట్ వేర్, స్టార్ట్ అప్,టెలికాం కంపెనీలు పెద్దఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ అనుబంధరంగాల నుంచి సుమారు లక్షకోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు సమకూరుతాయి.

DzXs2lpUYAAFt9_.jpg
DzXs2lpVAAAy_b4.jpg
DzXs2lmV4AIvs3M.jpg
DzXs759U8AEsmW2.jpg
Link to comment
Share on other sites

డేటా @ఏపీ
15-02-2019 01:43:51
 
636857918324745025.jpg
  • 70 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు
  • 150 ఎకరాల విస్తీర్ణంలో 5 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా
  • ప్రపంచంలోనే మొదటి ఎకో ఫ్రెండ్లీ సెంటర్‌
  • అట్టహాసంగా రుషికొండలో భూమిపూజ
  • డేటా కోసం ఎవరైనా విశాఖ రావాల్సిందే
  • సైబరాబాద్‌ తరహాలో ‘క్లౌడ్‌ సిటీ’
  • ఏపీ మరో ఇన్నోవేషన్‌ వ్యాలీ: చంద్రబాబు
విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంద్రజ్యోతి): సమాచార సాంకేతిక రంగం మరింత విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో సంపదకు ‘డేటా’ (సమస్త సమాచారం) కొలమానంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలోని రుషికొండలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూపు ఏర్పాటు చేయనున్న ‘అదానీ డేటా సెంటర్‌ అండ్‌ టెక్నాలజీ పార్కు’కు గురువారం సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అత్యంత సుందరమైన ప్రాంతంలో, 150 ఎకరాల విస్తీర్ణంలో 5 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ సెంటర్‌ ప్రపంచంలోని మొదటి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్‌ కావడం మరింత సంతోషంగా ఉందన్నారు.
 
‘డేటాతో అద్భుతాలు సృష్టించవచ్చు. విద్యార్థిదశ ఎవరికైనా కీలకం. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగితే అద్భుతాలను ఆవిష్కరించడం ఖాయం. నేటి యువతకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనాలసిస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ వంటి వాటిపై లోతైన అవగాహన ఉండడం లేదు. ఈ డేటా సెంటర్‌ అందుబాటులోకి వస్తే అలాంటి వారికి కచ్చితమైన సమాచారం అందుతుంది. దీనివల్ల సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుంది. డేటా సెంటర్‌కు అదానీ గ్రూపు పెట్టే పెట్టుబడిలో రూ.30-40 కోట్లు సోలార్‌ విద్యుత్‌కే అవుతుంది. ఆ విద్యుత్‌ను వినియోగించుకుని నిరంతరం సెంటర్‌ నుంచి డేటా సేకరణ, పంపిణీ జరుగుతుంది’ అని సీఎం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
 
రైతుకు ఆదాయం వచ్చేలా..!
‘డేటా పార్కును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని 17 లక్షల విద్యుత్‌ పంపు సెట్లన్నింటినీ సోలార్‌ ఎనర్జీ పంపుసెట్లుగా మార్చాలని యోచిస్తున్నాం. మోటార్లను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు వీలుగా 1.7 బిలియన్ల ఎనర్జీ మోటార్లను వచ్చే 3-4 ఏళ్లల్లో ఉత్పత్తి చేసేలా ఆసక్తిగల కంపెనీల కోసం అన్వేషిస్తున్నాము. ఎనర్జీ మోటార్ల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తాం. దీనివల్ల ప్రతి రైతుకీ నెలకు రూ.15-18వేలు ఆదాయం అదనంగా వస్తుంది. అదానీ గ్రూపు ఏర్పాటుచేస్తున్న డేటా పార్కు వల్ల దేశానికే ఏపీ డేటా హబ్‌గా మారుతుంది. ఇతర దేశాలు సైతం డేటా కోసం విశాఖ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజును మనమంతా చూస్తాం. ఒక కంపెనీ రూ.70వేల కోట్లు ఒకేచోట పెట్టుబడి పెట్టడం ప్రపంచంలో ఇదే ప్రప్రథమం.
 
దీనికి ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నుకున్నందుకు అదానీ గ్రూపు ఎండీ రాజేశ్‌ అదానీని అభినందిస్తున్నాను. అదానీ కంపెనీకి సుందరమైన ప్రాంతం కేటాయించడంపై విమర్శలు వచ్చినా నేను రాజీ పడలేదు. ఎంఓయూ జరిగిన 36 రోజుల్లో భూమి పూజ జరిగేలా కృషిచేసిన ఐటీ మంత్రి లోకేశ్‌, అదానీ గ్రూపు సభ్యులకు అభినందనలు. అద్భుతమైన భవనాలు నిర్మించి మార్కెటింగ్‌లో కూడా రాజేశ్‌ అదానీ దూసుకుపోవాలి. అందుకోసం నా అవసరముంటే ఏ పనైనా చేస్తాను. మార్కెటింగ్‌లో నేను అత్యుత్తమ ఎగ్జిక్యూటివ్‌ని. ఏపీ ఇన్నోవేషన్‌ వ్యాలీ అవుతుంది.’
 
 
పథకాలపై 90% సంతృప్తి లక్ష్యం
‘రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వాటిపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డేటా సెంటర్‌ను వాడుకునే ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలపై 80ు సంతృప్తి ఉంది. దానిని 90 శాతానికి తీసుకువెళ్లాలన్నది నా లక్ష్యం. అలాగే పార్టీపై 80ు సంతృప్తి, 85ు ఓటుబ్యాంక్‌ ఉండాలన్నది నా లక్ష్యం. అది కచ్చితంగా సాధిస్తాను. ఐటీ గురించి పెద్దగా తెలియని 1995లోనే నేను పార్టీ కార్యాలయంలోని నా గదిలో ఉండే రికార్డులన్నీ కంప్యూటరైజ్‌ చేశాను. భవిష్యత్‌ నాలెడ్జిదేనని గుర్తించడంవల్లే అప్పట్లో రాష్ట్రంలో కేవలం 25 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే వాటిని 250 నుంచి 300కి పెంచాను. దీనివల్ల మానవ వనరులను అభివృద్ధి చేయగలిగాము. ఉద్యోగావకాశాలను కల్పించాలి కాబట్టి విదే శాల్లో 16 రోజులపాటు తిరిగి ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించాను.
 
మైక్రోసాఫ్ట్‌ తొలిసారిగా అమెరికా దాటి హైదరాబాద్‌లో బ్రాంచి ప్రారంభించడమే నా కృషికి నిదర్శనం. వచ్చిన కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి కాబట్టి సైబరాబాద్‌ను సృష్టించాను. అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఐటీ ఆవశ్యకతను వివరిస్తే నన్ను, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని కలిపి కమిటీగా వేశారు. మేమిచ్చిన ప్రతిపాదనల వల్లే బీఎ్‌సఎన్‌ఎల్‌ ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్‌ పడింది. ఐటీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే కారణం నా ముందు చూపే.’
 
 
నాలెడ్జి సిటీగా విశాఖ
‘సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో పచ్చనికొండలు, విశాలమైన రోడ్లు, సముద్ర తీరం కలిగిన 1,350 ఎకరాల్లో ‘క్లౌడ్‌ సిటీ’ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాం. భోగాపురం విమానాశ్రయంలో విమానం సముద్రం మీదుగా ల్యాండ్‌ కావాల్సి ఉంటుంది. అలాంటి ఎయిర్‌పోర్టు దేశంలో ఇదొక్కటే కావడం ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. విశాఖ నుంచి భోగాపురం వరకూ ప్రత్యేకంగా మరొక నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి ఏ పేరు పెట్టాలో విద్యార్థులే సూచించాలి. భవిష్యత్‌లో విశాఖను మరో కొత్తనగరంగా మనమంతా చూస్తాం. పదేళ్లలో నాలెడ్జి సిటీగా మారబోతుంది. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
 
 
చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌:లోకేశ్‌
‘రాష్ట్రానికి సీఎం చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన చరిష్మాను చూసే భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. డేటా సెంటర్‌ ఏర్పాటుకు జనవరి 9న ఎంఓయూ జరిగింది. 21 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. మేము 36 రోజుల్లో ఏర్పాటు చేశాం. ఈ సెంటర్‌తో విశాఖలో సుమారు 28 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 85 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని మంత్రి లోకేశ్‌ తెలిపారు.
 
 
2vizag02885.jpg 
 
ఏపీ సహకారం భేష్‌: రాజేశ్‌ అదానీ
పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమమైన సహకారం అందిస్తోందని అదానీ గ్రూపు ఎండీ రాజేశ్‌ అదానీ అన్నారు. రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు భూమిపూజ చేసిన రోజు తమకు ఎంతో ముఖ్యమైనదన్నారు. ‘మా ఆలోచనలను మంత్రి లోకేశ్‌కు చెప్పగానే ఆయనతోపాటు సీఎం చంద్రబాబు, ఐటీ అధికారులు ఎంతో సహకరించారు. మా సందేహాలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తోంది. దీనివల్ల పెట్టుబడిదారులకు ఎంతో శ్రమ తప్పుతుంది’ అని రాజేశ్‌ అదానీ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

విశాఖలో క్లౌడ్‌ సిటీ 

 

1350 ఎకరాల కేటాయింపు 
అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన 
మిలీనియం టవర్‌ ప్రారంభోత్సవం,   పలు అభివృద్ధి పనులకూ శ్రీకారం 
ఈనాడు - విశాఖపట్నం

14ap-main3a_3.jpg

విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. గురువారం కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్క్‌లకు  మంత్రులు నారా లోకేష్‌, గంటాశ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదానీ సంస్థ ఇక్కడ రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని, ఒప్పందం కుదుర్చుకున్న 35 రోజుల్లో పునాదిరాయి వేశామని తెలిపారు. అదాని గ్రూప్‌ను రప్పించే విషయంలో, తనపై ఒత్తిళ్లు వచ్చినా వాటికి తలొగ్గలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు డాటా ఆధారంగా నిర్ణయమవుతుందని, ఈ డేటా సెంటర్‌కు పునాదిరాయి పడటంతో మరెన్నో పరిశ్రమలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తాను ఉత్తమ మార్కెటింగ్‌ మేనేజర్‌నని, ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని అదానీ సంస్థ ఎండీ రాజేష్‌ అదానీకి  చెప్పారు. గతంలో పాలన తీరుతెన్నులు గుర్తుచేసుకుంటూ.. ‘1984లో రికార్డులన్నీ కంప్యూటరీకరించేవాళ్లం. అప్పట్లో పెద్ద సర్వర్లు ఉండేవి. పార్టీ కార్యాలయానికి ఏసీ లేకున్నా సర్వర్ల కోసం ఏసీ పెట్టించేవాళ్లం. ఇప్పుడు సర్వర్లకు బదులు డేటా సెంటర్లు వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. భోగాపురంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి తిరిగొస్తూ,  కాపులుప్పాడ పరిసరాలన్నీ చూశానని,  ఇక్కడున్న వనరులు చూస్తే సిలికాన్‌వ్యాలీ కన్నా బాగా మార్చవచ్చని అనిపిస్తోందని చెప్పారు. నార్తర్న్‌ వర్జీనియా దశాబ్దకాలంలో ఎంతో అభివృద్ధి సాధించని, అలాగే ఇక్కడ పచ్చదనాన్ని  పెంచడంతో పాటు పూర్తిగా విద్యుత్తు వాహనాలు నడిచేలా చేస్తామని తెలిపారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాపులుప్పాడ సమీపంలోని కొండల్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో  ఓ ప్రపంచస్థాయి కన్సల్టెంటును పెట్టుకుని  మాస్టర్‌ప్లాన్‌ తయారు చేయమని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని సంస్థలతో పాటు గృహాలు, వాణిజ్యపరంగా కూడా వృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తామని తెలిపారు.

14ap-main3b_1.jpg

మిలీనియం టవర్స్‌ ప్రారంభోత్సవం 
ఐటీహిల్‌-3లోని మిలీనియం టవర్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.  అలాగే అలీప్‌ ఇండియా ఆధ్వర్యంలో 55 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న హరిత పారిశ్రామికవాడ, స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.75.84కోట్లతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై 15మెగావాట్‌ తెలియాడే సోలారు ప్లాంటు, రూ.530కోట్లతో 33ఎంఎల్‌డీ వ్యర్థజలాల సేకరణ, శుద్ధి ప్లాంటు, ఆనందపురం మండలం గంగసాని గ్రామంలో ఏర్పాటుచేయబోయే అబ్దుల్‌కలామ్‌ ముస్లిం కల్చరల్‌ సెంటర్‌,  పాండ్రంగి బ్రిడ్జి, తాటితూరు కాజ్‌వేలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వచ్చే ఐదేళ్లలో 500శాతం డేటా అవసరం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ బావుందని,  అందుకే తాము ఇక్కడ డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని అదానీ గ్రూపు ఎండీ రాజేష్‌ అదానీ తెలిపారు. ఇక్కడి విధానాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.. రానున్న ఐదేళ్లలో 500 శాతం డేటా అవసరమవుతుందని,  దీర్ఘకాలిక ప్రణాళికలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు.

ఇక ‘తెలుసుకునే’ టెక్నాలజీ

భవిష్యత్తులో ట్రాకింగ్‌ టెక్నాలజీ రాబోతోందని ముఖ్యమంత్రి  చెప్పారు. మనం ఏం తింటున్నాం, ఎలా జీవిస్తున్నాం.. వాటిలో ఎలాంటి పోషకాలున్నాయి.. ఇలా ప్రతీదీ లెక్కచూడగల  సాంకేతికత అవసరముందని చెప్పారు. భవిష్యత్తులో దీనిపై కూడా దృష్టిపెడతామని అన్నారు. రాష్ట్రప్రభుత్వంమీద ప్రజల్లో 80శాతం సంతృప్తి ఉందని, దీన్ని 90 శాతానికి చేరేలా కృషిచేస్తున్నామని, ఓటు బ్యాంకు కూడా 80శాతం ఉండేలా చూసుకోవడం తనకున్న కల అని తెలిపారు.

డేటా కేంద్రంతో 1 శాతం వృద్ధిరేటు 
అదానీ గ్రూప్‌ తమ డేటా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడమే కాదు.. దాని విద్యుత్తు అవసరాల కోసం ఇక్కడే సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు నెలకొల్పుతుందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.  ఈ గ్రూపు ఇక్కడ 28 వేల ఉద్యోగాలివ్వబోతోంది. డేటా కేంద్రాలపరంగా ఇదో సరికొత్త విప్లవమని పేర్కొన్నారు. రూ. 70 వేల కోట్ల భారీ పెట్టుబడి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీనివల్ల రాష్ట్ర వృద్ధిరేటు ఒక శాతం పెరుగుతుందని చెప్పారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. డాటా సెంటర్‌ కోసం ఏపీనే ఎందుకు ఎంచుకున్నారని తాను ప్రశ్నించినప్పుడు, ఒక్క చంద్రబాబే అందుకు కారణమని ఆయన సమాధానమిచ్చారని చెప్పారు. అదానీ సంస్థ పనుల్ని 21 రోజుల్లో ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారని, కొంత ఆలస్యంగా 36 రోజుల్లో మొదలుపెట్టామని అన్నారు. ఐటీ మంత్రిగా ఇకపై జరిగే ఒప్పందాల్లో 21 రోజుల్లో పనులు మొదలయ్యేలా  చర్యలు తీసుకుంటానని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...