sonykongara Posted September 20, 2018 Posted September 20, 2018 ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఐటీ, ఎలక్ర్టానిక్స్ హబ్‌గా మారనుంది. శ్రీవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా పనిచేస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలించింది. ప్రఖ్యాత కంపెనీ టీసీఎల్ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించింది. చైనాలోని షేన్జెన్లో టిసిఎల్ కంపెనీ సిఈఓ కెవిన్ వాంగ్ తో గురువారం భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ..ఏపీకి టీసీఎల్ రావాలని ఆహ్వానించారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టిసిఎల్,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. టీసీఎల్ ఘనత ఇది.. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రతిష్టాత్మక ఎలక్ర్టానిక్స్ కంపెనీ టీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చైనా పర్యటనలో జరిగిన అతి పెద్ద ఒప్పందం ఇది. టీవీలు,స్మార్ట్ ఫోన్లు,వాషింగ్ మేషిన్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల వంటి కన్సూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టీసీఎల్ కంపెనీ ఏపీకి తీసుకు రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టివి ప్యానల్స్ తయారీ లో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న టిసిఎల్ సంవత్సరానికి 80 లక్షల టివి ప్యానల్స్ తయారు చేస్తోంది. ఎలా ఒప్పించారంటే..! చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్‌తో కుదిరిన ఒప్పందం వెనుక మంత్రి లోకేష్ పట్టుదల, సడలని ఆత్మవిశ్వాసం ఉంది. ముందుచూపు, పక్కా ప్రణాళికతో టీసీఎల్ యాజమాన్యాన్ని ఒప్పించి, మెప్పించి ఏపీకి రప్పిస్తున్నారు. దీనికి చాలా రోజుల ముందే టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు ఇండియా వచ్చారు. అప్పుడే వీరిని కలిసిన మంత్రి లోకేష్..ఏపీలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరించారు. అప్పటి నుంచీ టీసీఎల్ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న టీసీఎల్.. ఇండియాలో ఏపీయే తమ సంస్థ కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని నిర్ణయం తీసుకునేలా మంత్రి ఇక్కడి పరిస్థితులను వారికి వివరించారు. గతంలో టీసీఎల్ ప్రతినిధులు ఇండియాకు వచ్చిన నుంచీ చైనాలో ఒప్పందం జరిగే వరకూ మాటల్లేవు, లీకుల్లేవు.. అంతా ఒక పద్ధతిప్రకారం, ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలక్ర్టానిక్స్ కంపెనీని తీసుకురావడంలో విజయం సాధించారు లోకేష్. టీసీఎల్ సీఈవోకి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడా లేని పాలసీని తీసుకొచ్చి ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో పనిచేస్తున్న మూడు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఇప్పటి వరకూ దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ మాత్రమే జరిగిందని, ఆంద్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పారు. డిజైన్ టూ డెత్ అనే మోడల్ లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్, పిసిబి, చిప్ డిజైన్, కెమెరా మాడ్యూల్స్, బ్యాటరీ ఇలా అన్ని ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని టీసీఎల్ సీఈవోకి వివరించారు. ఇండియాలో ప్రతి సంవత్సరం వినియోగిస్తున్న 500 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ లో 250 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు చెయ్యాలి అని టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. టీసీఎల్తోపాటు, కంపెనీ విడిభాగాలు సరఫరా చేస్తున్న 15 కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అని మంత్రి కోరారు. మంత్రి ప్రతిపాదనలపై సీఈవో సానుకూలంగా స్పందించారు. అనంతరం తిరుపతిలో కంపెనీ పెట్టేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందం జరిగింది.
Raaz@NBK Posted September 20, 2018 Posted September 20, 2018 15 minutes ago, Nfan from 1982 said: Great ? job lokesh
AnnaGaru Posted September 20, 2018 Posted September 20, 2018 (edited) TCL ane vadiki land dobbedutunnaru annamata....ade adarsh scamster T.chandrasekhar adigite ivvaledu Edited September 20, 2018 by AnnaGaru BalayyaTarak 1
sonykongara Posted September 20, 2018 Author Posted September 20, 2018 Lokesh NaraVerified account @naralokesh 36m36 minutes ago నా చైనా పర్యటనలో అత్యంత సఫలమైన సందర్భం ఇది. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టిసిఎల్, దేశంలో మొదటిసారిగా ఏపీలో అడుగు పెడుతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ రంగానికి, రాష్ట్ర యువతకు ఇది నిజంగా శుభవార్త. 5 replies 9 retweets 27 likes Lokesh NaraVerified account @naralokesh 36m36 minutes ago టిసిఎల్ సంస్థ సీఎఫ్ఓ మైకెల్ వాంగ్ తో సమావేశం ఒక అద్భుత అవకాశం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగం వేళ్ళూనుకోడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి మైకెల్ వాంగ్ ఇచ్చిన సహకారం నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది. 1 reply 5 retweets 13 likes Lokesh NaraVerified account @naralokesh 36m36 minutes ago ఇండియాలో ఏడాదికి 500 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ వినియోగిస్తున్నారు. అందులో 50 శాతం కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు చెయ్యాలన్నది ప్రభుత్వ లక్ష్యం. షేన్ జెన్ ను సందర్శించాక ఏపీలో ఒక మినీ షేన్ జెన్ ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఏర్పడింది. 0 replies 5 retweets 11 likes
sonykongara Posted September 20, 2018 Author Posted September 20, 2018 9 minutes ago, AnnaGaru said: TCL ane vadiki land dobbedutunnaru annamata....ade adarsh scamster T.chandrasekhar adigite ivvaledu oho alga vacchra bro, first chusi ardam kala naku
AnnaGaru Posted September 20, 2018 Posted September 20, 2018 Foxconn(worlds no#1 already there) FLex in tirupati(worlds No#2) TCL in Tirupati(worlds no#3) Worlds 1,2,3 vachai ga mottaniki....
Raaz@NBK Posted September 20, 2018 Posted September 20, 2018 5 minutes ago, AnnaGaru said: Foxconn(worlds no#1 already there) FLex in tirupati(worlds No#2) TCL in Tirupati(worlds no#3) Worlds 1,2,3 vachai ga mottaniki....
OneAndOnlyMKC Posted September 20, 2018 Posted September 20, 2018 Pichodu : already TCS vundi kada Malli Kottaga TCL ani evadiko mukku Moham teliyani vadiki land ichesaru appanam ga janasena tarapuna vudyamam chestanu ...
sonykongara Posted September 21, 2018 Author Posted September 21, 2018 తిరుపతిలో టీసీఎల్21-09-2018 03:49:26 మంత్రి లోకేశ్ సమక్షంలో సీఎఫ్ వోతో ఒప్పందం చైనా పర్యటనలో ఇదే పెద్ద అగ్రిమెంటు టీవీ ప్యానెల్స్ తయారీలో సంస్థది మూడో స్థానం అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రముఖ కంపెనీ టీసీఎల్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేశ్ గురువారం చైనాలోని షేన్జెన్లో టీసీఎల్ కంపెనీ సీఎ్‌ఫవో మైకేల్ వాంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీసీఎల్, ఆంధ్రప్రదేశ్ ఎలకా్ట్రనిక్స్ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. లోకేశ్ చైనా పర్యటనలో కుదిరిన అతి పెద్ద ఒప్పంద ఇది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలకా్ట్రనిక్స్ పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టీసీఎల్ కంపెనీని ఏపీకి తీసుకురావడంలో ఆయన కృషి ఫలించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎల్ కంపెనీల్లో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీవీ ప్యానెల్స్ తయారీలో ఈ సంస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఏటా 80 లక్షల టీవీ ప్యానెల్స్ తయారుచేస్తోంది. ఇండియా సందర్శించినప్పుడే.. టీసీఎల్ కంపెనీ సీఈవో, ప్రతినిధులు గతంలో భారత్ వచ్చినప్పుడే లోకేశ్ వారిని కలిశారు. రాష్ట్రంలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సహకాలను వారికి వివరించారు. ఎలకా్ట్రనిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడా లేని పాలసీని తీసుకొచ్చి ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. భారత్‌లో ప్రతి ఏడాది వినియోగిస్తున్న 500 బిలియన్ డాలర్ల విలువైన వినియోగ ఎలకా్ట్రనిక్స్ ఆంధ్రప్రదేశ్‌లో తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టీసీఎల్‌తో పాటు విడి భాగాలు సరఫరా చేస్తున్న 15 కంపెనీలను కూడా ఆంధ్రకు తీసుకురావాలని కోరారు. మంత్రి ప్రతిపాదనలపై సీఈవో సానుకూలంగా స్పందించారు. దరిమిలా లోకేశ్ చైనా పర్యటనలో తిరుపతిలో కంపెనీని పెట్టేందుకు కీలక ఒప్పందం కుదిరింది. పలు కంపెనీల ఆగమనం.. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో ఒక్క మొబైల్ కూడా తయారయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఫాక్స్‌కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్ కంపెనీలు ఇప్పటికే వచ్చాయి. హోలీటెక్, ఫ్లెక్స్ ట్రానిక్స్, రిలయన్స్ జియో త్వరలో కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి. లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే రాబోతోంది. ఎలకా్ట్రనిక్స్ డిజైన్ కంపెనీ ఇన్వెకాస్ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టి 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. వినియోగ ఎలకా్ట్రనిక్స్ తయారీలో ఉన్న అస్టృమ్ రూ.100 కోట్ల పెట్టుబడితో కంపెనీ స్థాపించనుంది.
sonykongara Posted September 21, 2018 Author Posted September 21, 2018 China’s TCL electronics to set up unit in AP DECCAN CHRONICLE. Published Sep 21, 2018, 1:35 am IST Updated Sep 21, 2018, 1:35 am IST The MoU was signed after a meeting between the IT minister and TCL Electronics, CEO, Kevin Wang. The Chinese company employs around 75,000 people across its companies around the globe. Vijayawada: China’s leading consumer electronics manufacturing company, TCL Corporation, will set up operations at Tirupati in Andhra Pradesh. Representatives of state IT and electronics department and TCL Corporation signed agreements in this regard in the presence of IT minister Nara Lokesh in China on Thursday. The MoU was signed after a meeting between the IT minister and TCL Electronics, CEO, Kevin Wang. It will be TCL’s only investment in India. Chinese major, TCL, is into manufacturing of TVs, smart phones, washing machines, air conditioners, refrigerators and other consumer electronics. The Chinese company employs around 75,000 people across its companies around the globe. It stands third in the world in TV panels manufacturing. TCL manufactures around 80 lakh TV panels every year. Lokesh told the representatives of TCL that Andhra Pradesh was the only state in India which has three electronics manufacturing clusters. He added that while other states have been into assembling of electronic goods, AP is emerging as an electronics manufacturing hub. He added AP has plans to emerge as a destination for electronics design. Earlier in the day, as part of his China visit, Mr Lokesh spoke about emerging technologies, the fourth industrial revolution and also on the development taking place in Andhra Pradesh.
sonykongara Posted October 3, 2018 Author Posted October 3, 2018 New conversation Lokesh NaraVerified account @naralokesh 43m43 minutes ago One of the top-5 smartphone sellers globally will now manufacture Smart LED TVs in Andhra Pradesh... Keep watching this space!! #APInvestorsDelight
sonykongara Posted October 3, 2018 Author Posted October 3, 2018 TCL Electronics sets a new facility in Tirupati; plans Google-certified Android QLED and AI TV in India By: MyMobile Team | October 3, 2018 FacebookTwitterWhatsAppLinkedInEmail TCL Electronics has partnered with the Andhra Pradesh government to set up a new manufacturing facility in Tirupati. The development is in line with TCL’s long-term vision of building localised capabilities in order to better cater to the growing market demand for innovative home entertainment solutions across the country. The Tirupati unit will also fulfil the market demand for smart consumer electronics appliances in India. TCL has a physical presence in over 80 countries and caters to more than 160 international markets through its robust channel network and strong industry tie-ups. In H1 2018, TCL Electronics’ global LCD TV sales volume crossed the 10-million mark to reach over 13.17 million sets, growing by 37.2% year-on-year. The company also registered exceptional response in various overseas markets, with its overseas sales volumes increasing by 44.4% year-on-year to more than 8.28 million. TCL’s online partnership with Amazon is expected to further drive significant increase in market traction for the brand, which is now looking to firmly establish itself amongst the Top 3 TV brands on the e-commerce platform and become the most-popular consumer TV brand. It has also tied up with large offline electronics retailers such as Croma, Reliance Digital, and Vijay Sales, as well as major regional channel partners to build a robust, pan-India sales and distribution channel. Mike Chen, Country Manager – TCL India, said, “We have always strived to provide our customers with the ultimate audio-visual entertainment experience through technology in a bid to make their homes smarter and their entertainment experiences richer. Our partnership with the Andhra Pradesh government and the establishment of our Tirupati manufacturing unit would allow us to provide Indian consumers with innovative smart TVs driven by the latest cutting-edge QLED and AI technologies.” TCL’s recent announcement also underlines its plans to introduce several innovative smart entertainment solutions within the Indian market designed to fulfil the evolved entertainment sensibilities of the country’s growing young consumer base. Under the first wave of its latest product launch, it aims to disrupt the premium home entertainment segment by introducing India’s first Google-certified Android QLED TV on Amazon.
sonykongara Posted December 19, 2018 Author Posted December 19, 2018 టీసీఎల్‌కు రేపే శంకుస్థాపన19-12-2018 02:33:26 2200 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటు ఏటా 60 లక్షల టీవీల ఉత్పత్తి 8 వేల మందికి ఉద్యోగాలు త్వరలోనే రిలయన్స్ జియో పార్కు అదే బాటలో సన్నీ ఓపోటెక్, హోలీటెక్ నేడు అమరావతిలో 6 ఐటీ సంస్థలకు శ్రీకారం అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్స్ దిగ్గజ కంపెనీ, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద టీవీ ప్యానల్స్ తయారీ సంస్థ టీసీఎల్ తిరుపతికి రానుంది. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంటును నెలకొల్పనుంది. ఏటా 60 లక్షల టీవీలను ఇక్కడ తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 8 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ గురువారం ఈ ప్లాంటుకు భూమిపూజ చేయనున్నారు. టీసీఎల్ చైర్మన్ లీ డాంగ్ షెంగ్ కూడా పాల్గొంటారు. తిరుపతి ఎలక్ర్టానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటవుతోంది. లోకేశ్ చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్ కంపెనీని రాష్ట్రానికి వచ్చేలా ఒప్పించారు. ఎలక్ర్టానిక్స్ హబ్‌గా తిరుపతి ఆవిర్బవించేందుకు ఈ కంపెనీ కూడా కీలకం కానుంది. ఇక్కడే 150 ఎకరాల్లో రిలయన్స్ జియో ఎలక్ర్టానిక్స్ పార్క్ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. సన్నీ ఓపోటెక్ కూడా రూ.500 కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో వస్తోంది. కెమెరా మాడ్యూల్స్, స్ర్కీన్స్ తయారీలో దిగ్గజ సంస్థ అయిన హోలీటెక్.. 75 ఎకరాల్లో రూ.1400 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కేవలం విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా.. ఎలక్ర్టానిక్స్ పరికాల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్స్ నుంచి సర్క్యూట్ బోర్డు తయారీ వరకు అన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలని లోకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. రాష్ట్ర రాజధాని అమరావతికి మరో ఆరు ఐటీ కంపెనీలు రానున్నాయి. మంగళగిరి, విజయవాడల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ చిన్నతరహా కంపెనీలు. ఏపీఎన్ఆర్టీ చొరవతో 87 సంస్థలు అమరావతికి రానున్న ఆరు కంపెనీల్లో ఐదింటిని తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ భవన్లో లోకేశ్ బుధవారం ప్రారంభించనున్నారు. జీటీ కనెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పారికరం ఐటీ సొల్యూషన్స్, టెక్స్కేప్, ట్రెండ్ సాఫ్ట్ టెక్నాలజీస్, డియాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ రామచంద్రనగర్లోని కే బిజినెస్ స్పేసెస్ కార్యాలయంలో ఏపీ ఆన్లైన్ కంపెనీని ప్రారంభించనున్నారు. ఏపీఎన్ఆర్టీ చొరవతో ఇప్పటివరకు 87 ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. 4,710 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ అధ్యక్షుడు రవికుమార్ వేమూరి తెలిపారు.
AnnaGaru Posted December 19, 2018 Posted December 19, 2018 (edited) wow....TCL CEO himself came to Tirupati for this....the person in below picture is TCL worldwide CEO DONGSHENG TCL revenue is 20 billion USD per year and this step will redirect others to AP Edited December 19, 2018 by AnnaGaru
abhi Posted December 19, 2018 Posted December 19, 2018 1 hour ago, AnnaGaru said: wow....TCL CEO himself came to Tirupati for this....the person in below picture is TCL worldwide CEO DONGSHENG TCL revenue is 20 billion USD per year and this step will redirect others to AP Super good to see it is becoming electronic manufacturing hub
Nfan from 1982 Posted December 19, 2018 Posted December 19, 2018 1 minute ago, abhi said: Super good to see it is becoming electronic manufacturing hub
sskmaestro Posted December 19, 2018 Posted December 19, 2018 (edited) @AnnaGaru Lokesh Minister ayyaka vachina companies, vati stamina, location, potential job opportunities, expected start date, current status ila oka thread start cheyyandi.... keep it locked so that it won’t get spammed. Pin cheddam.... let the data be 100% genuine. Emi leni 0% state nunchi eh range ki vachindo so far oka clarity untundi.... meda lo erra tundu eskoney pratee erri edavaaa Lokesh ni abuse cheyyatam taggutundi Edited December 19, 2018 by sskmaestro
MVS Posted December 20, 2018 Posted December 20, 2018 Amaravathi oka datlone dabbulai dochi pedutunaru ane valaki ivani emi kanapadava ..... Vizag lo IT & pharma ....medical manufacturing uttarandhra...automobile nellore & ananthpur..electronic manufacturing nellore & chitoor....education,IT & hospitality Amaravathi ....renewable energy & steel plant kurnool & kadapa .....small scale industries & ITES vijayawada & guntur .... baggie 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now