Jump to content

Recommended Posts

Guest Urban Legend
Posted
1 hour ago, AnnaGaru said:

idi matram super pattaru.....kakapote manaki hotels kuda levu enough.....etla manage chestaro.....

 

November antey Novotel kuda start avvudhi annai ...date ichadu from sep ani novotel varun vijayawada

Posted
ఫార్ముల-1 బోట్‌ రేస్‌ ఒప్పందం 23న 
నవంబరు 10 నుంచే కృష్ణా నదిలో పోటీలు 
అమరావతి బోట్‌ నమూనా సిద్ధం
ఈనాడు, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో పవర్‌బోట్‌లతో నిర్వహించనున్న ఫార్ములా-1 రేసు (ఫాఫ్‌-1హెచ్‌2ఓ) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమవుతోంది. పోటీల నిర్వహణ సంస్థ యూఐఎం రాష్ట్ర పర్యాటక శాఖతో ఈ నెల 23న ఒప్పందం చేసుకోనుంది. అదేరోజు యూఐఎం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పోటీలు నవంబరు 22-24వరకు జరగాల్సి ఉంది. తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పు చేశారని, నవంబరు 10నుంచే ఇక్కడ పోటీలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పోటీలు నిర్వహిస్తూ వస్తారు. ఫైనల్‌కు చేరుకుని గెలుపొందే బోట్‌, ఆ బోట్‌ డ్రైవర్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఇప్పటికే మేలో పోర్టీమావో(పోర్చుగల్‌), జూన్‌లో లండన్‌(యూకే)లో పోటీలు జరిగాయి. ఆగస్టు 26 నుంచి హార్బిన్‌(చైనా)లో జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఒక బోటుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి థీమ్‌తో నమూనాను సిద్ధం చేశారు. థీమ్‌లో భాగంగా లేత పసుపురంగు బ్యాక్‌గ్రౌండ్‌ పైన ఎరుపు రంగులో ‘అమరావతి’ పేరు, దాని కింద ఏపీ టూరిజం అని రాసి ఉంటుంది. చైనా(లీజుహు)లో ఇదే ఏడాది సెప్టెంబరులో మరోసారి జరిగే పోటీలోనూ అమరావతి థీమ్‌ను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత అమరావతిలో జరిగే పోటీలోనూ థీమ్‌ బోటు ఉంటుంది. డిసెంబరులో షార్జా(యూఏఈ)లో ఈ ఎఫ్‌-1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగియనున్నాయి.
Posted
అమరావతికే ఓ అద్భుతంగా..
15-07-2018 10:09:01
 
636672461381756565.jpg
  • కృష్ణానదిలో పవర్‌ బోటింగ్‌
  • నవంబరులో ఎఫ్‌1 హెచ్‌2ఓ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌
  • ప్రకాశం బ్యారేజీ, భవానీ ద్వీపం ప్రాంతాల్లో పోటీలు
  • 12 దేశాలు, తొమ్మిది టీములు 400 మంది క్రీడాకారులు
  • 2 వేల మంది విదేశీ వీక్షకులు రాక
  • వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో టీమ్‌ అమరావతి
‘పవర్‌ బోటింగ్‌ రేస్‌ మజా ఎలా ఉంటుందో చూడాలని ఉందా? మరో మూడు నెలలు ఓపిక పడితే.. బెజవాడ చెంతన కృష్ణానదిలో ప్రత్యక్షంగా చూసే అవకాశం రాబోతోంది! నేవీ షో వంటి కార్యక్రమాల తర్వాత మరో అద్భుతం కనువిందు చేయబోతోంది! వాటర్‌లో జరిగే ఫార్ములా వన్‌రేస్‌ను చూసేందుకు సిద్ధం కండి..!
 
 
విజయవాడ: నీళ్లలో సర్‌.. ర్‌.. ర్‌ మంటూ దూసుకుపోయే ఎఫ్‌1 హెచ్‌2 పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ కృష్ణాతీరంలో నవంబర్‌ 14, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పర్యాటక శాఖ ద్వారా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది. రోజుకు లక్ష మందికి పైగా స్వదేశీయులు, రెండు వేల మందికి పైగా విదేశీయులు మూడు రోజుల పాటు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టబోతున్నారు.
 
 
ఎఫ్‌ 1 హెచ్‌ 2.. ఓ అంతర్జాతీయంగా హైస్పీడ్‌ బోటింగ్‌ రేస్‌లు నిర్వహించే సంస్థ. ఈ సంస్థ పవర్‌ బోట్‌, ఆక్వా రేసింగ్‌, వరల్డ్‌ నేషన్స్‌ కప్‌ పోటీలను నిర్వహిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ సంస్థ నేతృత్వంలో వరల్డ్‌ చాంపియన్‌ సిరీస్‌లు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం ఈ సంస్థ పది వరల్డ్‌ చాంపియన్‌ సిరీస్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోర్చుగల్‌ (మే 18), లండన్‌(జూన్‌ 15 - 16 ), ఫ్రాన్స్‌(జూన్‌ 29 - జూలై 1 ) తేదీల్లో పోటీలను నిర్వహించారు. నాలుగు, ఐదు చాంపియన్‌ షిప్‌లు చైనాలో ( ఆగస్టు 24- 26, సెప్టెంబర్‌ 15 - 16 ) జరగనున్నాయి. అమరావతిలో ఆరో చాంపియన్‌ షిప్‌ను నిర్వహిస్తోంది. తర్వాత అబుదాబిలో డిసెంబర్‌ 1- 8, ఆ తర్వాత షార్జాలో 13 - 15 లలో ఇలా చాంపియన్‌ షిప్‌లను నిర్వహిస్తుంది.
 
 
అమరావతికి సాకారం ఇలా
అమరావతి రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేయటానికి వీలుగా ఇంటర్నేషనల్‌ బిగ్‌ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పర్యాటకశాఖ నేతృత్వంలో ఆ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించింది. దీంతో పర్యాటక శాఖ ప్రపంచ స్థాయి ఈవెంట్లను అధ్యయనం చేయగా ఎఫ్‌1 హెచ్‌2 ఓ సంస్థ గురించి తెలిసింది. మాలక్ష్మీ గ్రూపు సంస్థకు చెందిన సీఈఓ సందీప్‌ సహకారంతో ఆ సంస్థతో సంప్రదింపులు చేశారు. దాదాపుగా ఆరునెలల కిందట ఈ సంస్థతో పాటు, యూఐఎం సంస్థ ప్రతినిధులు వచ్చి అమరావతిని పరిశీలించి ఎంపిక చేశారు.
 
 
యూఐఎం ప్రమాణాలు
ప్రపంచవ్యాప్తంగా స్పీడ్‌ బోట్‌ పోటీలు నిర్వహించాలంటే యూఐఎం సంస్థ ప్రమాణాలు పాటించాలి. పోటీలు నిర్వహించటానికి ఏది అనుకూలం? ఎక్కడ ఏర్పాటు చేయాలి? రేసర్ల అర్హతలు ఏమిటి? వంటివి కూడా ఈ సంస్థే నిర్దేశిస్తుంది. ఎఫ్‌1 హెచ్‌2 ఓ సంస్థతో పాటు ఈ సంస్థ ప్రతిధులు కూడా కృష్ణానదిని పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కృష్ణానదిలో ప్రధానంగా 23 కిలోమీటర్ల పాటు సుదూర వాటర్‌ ఫ్లో ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి పవిత్ర సంగమం వరకు ఒకేలైన్‌లో ఫ్లో ఉండటం అనుకూలాంశం. కృష్ణానది వెడల్పు 400 మీటర్లు ఉండటం, పన్నెండు మీటర్ల లోతు ఉండటం కూడా కలిసొచ్చిన అంశాలుగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పోటీలు ప్రారంభించి.. భవానీ ద్వీపం వరకు 23 కిలోమీటర్ల వాటర్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు.
  •  పవర్‌ బోటింగ్‌ రేస్‌ సాహసోపేతమైన క్రీడ. బోట్లలో పైలట్స్‌ దిగువున కూర్చుని ఉంటారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నీటిలో దూసుకుపోతాయి. ఇవి మలుపులు తిరిగే సమయంలో కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి.
  • ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్‌, టర్కీ, స్వీడన్‌, అబుదాబి, చైనా, షార్జా, లండన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర మొత్తం 12 దేశాల నుంచి 9 టీమ్‌లు పాల్గొంటున్నాయి. మొత్తం 400 మంది అభ్యర్థులు పాల్గొనబోతున్నారు.
  • వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో టీమ్‌ అమరావతి కూడా పాలు పంచుకుంటోంది. యూఎంఐ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అత్యుత్తమ్మ రేసర్లను ఎంపిక చేసి పోటీలకు పంపించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. అమరావతికి బ్రాండింగ్‌ కల్పించటానికి వీలుగా కూడా టీమ్‌ అమరావతి లోగోను స్పీడ్‌ రేస్‌ బైక్‌పై ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేస్తారు. అమరావతి కంటే వచ్చే నెలలో చైనా దేశంలో జరిగే రెండు మెగా ఈవెంట్లలో ముందుగా టీమ్‌ అమరావతి రేసర్లు పాల్గొంటారు.
  • మూడు రోజుల పాటు జరిగే పోటీలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున లక్ష మందికి పైగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీపై 20 వేల మందికి గ్యాలరీలు ఏర్పాటు చేయవచ్చని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు.
  • ప్రపంచ పవర్‌ బోటింగ్‌ రేస్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రేస్‌ పోటీలకు ఆయా దేశాల నుంచి మొత్తం 2 వేల మందికి పైగా వచ్చే అవకాశం ఉంది. దీంతో విదేశీయుల రాకతో బెజవాడ కళకళలాడనుంది. విదేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా వస్తున్నారు.
 
 
14 ఏళ్ల తర్వాత..
14 సంవత్సరాల కిందట ఈ సంస్థ నేతృత్వంలో ముంబైలో ఒకసారి పోటీలను నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మన దేశంలో నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ చెంతన కృష్ణానదిలో చాంపియన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.
 
 
అమరావతికే ఓ అద్భుతం
అమరావతికి ఒక అద్భుతంగా ఎఫ్‌1 హెచ్‌2 ఓ పవర్‌ బోటింగ్‌ పోటీలు ఉంటాయి. పద్నాలుగేళ్ళ తర్వాత దేశంలో.. గోవా, ముంబై, ఢిల్లీలను కాదని మన కృష్ణానదిలో జరుగుతున్నాయి. అమరావతికి ప్రపంచంలో బ్రాండింగ్‌ కల్పించటానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. ప్రభుత్వపరంగా ఈ పోటీలకు పెద్దగా ఖర్చేమీ చేయటం లేదు. బేసిక్‌ ఎమినిటీస్‌ కల్పిస్తున్నాం. ఈ పోటీల నిర్వహణ ద్వారా.. టీవీ రైట్స్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రైట్స్‌ ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లక్ష మంది కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. - హిమాన్షు శుక్లా, పర్యాటక శాఖ ఎండీ
 
 
అద్భుతం.. కృష్ణా ప్రాంతం..
ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల పోటీలను నిర్వహించాం. ఇక్కడ అత్యద్భుతమైన నది ఉంది. దీవులు కూడా ఉన్నాయి. పవర్‌ బోట్‌ రేస్‌ పోటీలు నిర్వహించటానికి ఇది అత్యంత అనుకూలమైన ప్రాంతం.ప్రపంచంలో చూసిన పలు ప్రాంతాల కంటే ఇక్కడ భిన్నమైన వాతారణం ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పోటీలు నిర్వహించటానికి ప్రభుత్వం పోర్టు చేస్తోంది. - పాల్‌, ఎఫ్‌1 హెచ్‌ 2 ఓ డైరెక్టర్‌
 
Tags : amaravathi, boating, World Championship
Posted (edited)
1 hour ago, Saichandra said:

Super...

Prapacham lone city daggara flat clean(no tide) flow water very rare except few lucky jewels

Amaravati additional gods gift 11 ISLANDS&GREEN HILLS

 

Amaravati capital future gurinchi telavali ante "go to vijayawada temple-pavitrasangamam bank side..stand there and look towards capital pooled area

You will understand the future this city offers..trust me do it once early morning and much much better

Edited by AnnaGaru
Posted
థ్రిల్లింగ్‌ రేస్‌.. ఈ సారి అమరావతిలో..
29-07-2018 02:30:07
 
636684282048957184.jpg
  • పవర్‌ బోట్‌ చాంపియన్‌షిప్‌
  • నవ్యాంధ్రలో ప్రపంచ పోటీలు
  • నవంబరు 17,18 తేదీల్లో..
పడవ పందాలంటే మనకు సెయిలింగ్‌, యాటింగ్‌, కయాకింగ్‌, కనోయింగ్‌ల గురించే తెలుసు..ఇంకా కేరళలో ఓనమ్‌ పండుగ సందర్భంగా వేలాదిమందితో జరిగే పడవ పోటీలు తెలుసు..కానీ ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌ల మాదిరే అత్యంత థ్రిల్‌ కలిగించే పవర్‌ బోట్‌ రేసింగ్‌ కూడా ఒకటి ఉంది..అది మనకు పెద్దగా అవగాహనలేని క్రీడ..కారణం దేశంలో ఎప్పుడో దశాబ్దంన్నర కిందట ఈ రేస్‌ ముంబైలో జరిగింది. మళ్లీ ఇప్పుడు తెలుగు ప్రజల ముంగిటికి వచ్చింది. ఈ నవంబరులో అమరావతిలో జరిగే ఈ వరల్డ్‌ పవర్‌ బోట్‌ రేసింగ్‌ చాంపియన్‌షి్‌ప ను ప్రత్యక్షంగా తిలకించడం క్రీడా ప్రేమికులకు.. ముఖ్యంగా సాహస క్రీడలను ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతి.
 
 
ఫార్ములా 1 పవర్‌బోట్‌ రేసింగ్‌లంటే సరస్సులు, నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో నిర్వహించే పోటీలు. ఈ చాంపియన్‌షి్‌పను యూనియన్‌ ఇంటర్నేషనల్‌ మోటోనాటిక్‌ (యూఐఎం) నిర్వహిస్తుంది. హెచ్‌2ఓ రేసింగ్‌ ఈ చాంపియన్‌షి్‌పను ప్రమోట్‌ చేస్తోంది. అందుకే దీనిని ‘ఎఫ్‌1హెచ్‌2ఓ’ పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అని పిలుస్తారు. పవర్‌బోట్‌ రేసుల్లో ప్రపంచంలో ఇదే అత్యున్నత చాంపియన్‌షిప్‌. కార్‌ రేసింగ్‌లో ఎఫ్‌-1 టైటిల్‌ ఎంత ప్రతిష్ఠాత్మకమో..బోట్‌ రేసింగ్‌ లో ఈ చాంపియన్‌షిప్‌ అంత ప్రతిష్ఠాత్మకం. 1978లో డేవిడ్‌ పార్కిన్సన్‌ అనే పీఆర్‌ మేనేజర్‌ ఆలోచనలనుంచి ఈ ఎఫ్‌-1 పవర్‌ బోటింగ్‌ రేస్‌ రూపుదిద్దుకుంది. అయితే తొలి చాంపియన్‌షిప్‌ మాత్రం 1981లో జరిగింది. మొదటి చాంపియన్‌షి్‌పను ఇటాలియన్‌ పవర్‌ బోట్‌ రేసర్‌ రెనాటో మోలినరి కైవసం చేసుకున్నాడు. అప్పటినుంచి 1987, 88, 89 మినహా ప్రతి సంవత్సరం ఈ ఎఫ్‌-1 పవర్‌ బోటింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా యూరప్‌, మధ్య ప్రాచ్యం, ఆసియాలో మొత్తం ఎనిమిది గ్రాండ్‌ ప్రీ రేస్‌లు జరుగుతాయి. ఆయా రేస్‌ల్లో సాధించిన పాయింట్ల ద్వారా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ విజేతను ఎంపిక చేస్తారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌తోపాటు బీఆర్‌ఎం పోల్‌ పొజిషన్‌, టీమ్‌ చాంపియన్‌షిప్స్‌, ఫాస్ట్‌ల్యాప్‌ ట్రోఫీలకు పాయింట్లు కేటాయిస్తారు.
 
టీమ్‌ ఇలా..: ఒక్కో టీమ్‌లో ఓ మేనేజర్‌, ఇద్దరు డ్రైవర్లు, మెకానిక్‌లు, రేడియో కోఆర్డినేటర్‌, టెక్నికల్‌ కోఆర్డినేటర్‌తోపాటు రేస్‌లకు సంబంధించి అధునాతన సామగ్రి ఉంటుంది.. రేస్‌ల్లో తలపడేందుకు రెండు బోట్లు ఉంటాయి.
 
ఈసారి అమరావతిలో..: 14 సంవత్సరాల తర్వాత ‘ఎఫ్‌1హెచ్‌2ఓ’ పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆతిథ్య అవకాశం మన దేశానికి లభించింది. 2004లో ముంబైలో చివరిసారి ఈ పోటీలు జరిగాయి. ఈసారి నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేదిక అవుతోంది. గోవా, ముంబై. కూడా ఈ చాంపియన్‌షిప్‌ ఆతిథ్యానికి పోటీ పడ్డాయి. యూఐఎం, ఎఫ్‌1హెచ్‌2ఓ ప్రతినిధులు ఆరు నెలల కిందట విజయవాడ వచ్చి కృష్ణా నదిని పరిశీలించిన మీదట, ఈ ప్రాంతం అత్యంత అనువుగా ఉందని గుర్తించి ఇక్కడే నవంబరు 17 నుంచి 18 తేదీల్లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
 
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నాలు..: అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేయటానికి ఎప్పటి నుంచో ఒక పెద్ద ఈవెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చాంపియన్‌షిప్‌ అవకాశంగా లభించింది. పోటీల నిర్వహణకు పర్యాటక శాఖ, ఎఫ్‌1హెచ్‌2ఓ, యూఐఎం సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతికి వరల్డ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని కల్పించటానికి కృష్ణానదిలో ఈ వరల్డ్‌చాంపియన్‌షి్‌ప ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ జల క్రీడపై ఖర్చుపెట్టే ప్రతి పైసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రానుంది. పవర్‌ బోటింగ్‌ రేస్‌లను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తుంటారు. దాంతో టెలివిజన్‌ ప్రసార హక్కుల ద్వారా పర్యాటక శాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జించనుంది. ఇంకా నదిలో ఏర్పాటు చేసే అడ్వర్టయిజ్‌మెంట్‌లపైనా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది.
 
ఈ ఏడాది పోటీలు ఇలా..: ఈ సంవత్సరం వివిధ దేశాల్లో పవర్‌ బోట్‌ గ్రాండ్‌ ప్రీ రేస్‌లు జరుగుతున్నాయి. పోర్చుగల్‌ (మే 18-20), లండన్‌ (జూన్‌ 15-17),ఫ్రాన్స్‌ (జూన్‌ 29 నుంచి జూలై 1) రేస్‌లు ముగిశాయి. చైనా (సెప్టెంబరు 22-23), చైనా (అక్టోబరు 1-2) జరగనున్నాయి. ఆరో గ్రాండ్‌ప్రీని అమరావతిలో నిర్వహించనున్నారు. తర్వాత అబుదాబిలో (డిసెంబరు 6- 8), షార్జాలో (డిసెంబరు 13-15) జరగనున్నాయి.
బరిలోకి అమరావతి టీమ్‌..: అమరావతికి బ్రాండింగ్‌ కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో అమరావతి బోటింగ్‌ టీమ్‌ను కూడా బరిలోకి దించాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల నుంచి 19 మంది డ్రైవర్లు, 9 టీములతో పాటు అమరావతి జట్టు కూడా తలపడనుంది.
 
 
రేస్‌ ఇలా..
ఒక ఎడమ, రెండు కుడి మలుపులుండే 2000 మీటర్ల పొడవైన ట్రాక్‌పై ఫైనల్‌ రేస్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో బోట్లు గంటకు 250 కి.మీ.ల వేగంతో దూసుకు పోతాయి. ఒక్కో రేస్‌ 45 నిమిషాలపాటు ఉంటుంది. 60 నిమిషాల సమయం ఉండే మూడు దశల క్యూ1 ,2, 3 క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా పోల్‌ పొజిషన్‌, తుది రేస్‌లో పాల్గొనే డ్రైవర్లను ఖరారు చేస్తారు.
 
పాయింట్లు..
మొత్తం ఎనిమిది రేసుల్లో. ఒక్కో రేస్‌లో ప్రథమ స్థానానికి 20 పాయింట్లు, రెండో స్థానానికి 15, మూడో స్థానానికి 12, నాలుగో స్థానానికి 9, ఐదో స్థానానికి ఏడు, ఆరో స్థానానికి ఐదు, ఏడో స్థానానికి నాలుగు, ఎనిమిదో స్థానానికి 3, తొమ్మిదో స్థానానికి 2, పదో స్థానానికి 1 పాయింట్‌ కేటాయిస్తారు.
fih2o3-cut.jpg 
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
పర్యాటక ‘ఫార్ములా’...!
19-08-2018 03:38:19
 
636702467012730363.jpg
  • ఎఫ్‌1హెచ్‌2వో విజయవంతానికి సన్నాహాలు..
  • యువతలో క్రేజ్‌ పెంచడమే లక్ష్యం
  • వర్సిటీలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు
  • ఇంజనీరింగ్‌ విద్యార్థులే టార్గెట్‌
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఒంపులు తిరిగిన రోడ్లపై గంటకు 300కిలోమీటర్ల పైగా వేగంతో రయ్‌ రయ్‌మని దూసుకెళ్తుంటే భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందుకే వేగానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫార్ములా-1 రేసులంటే క్రీడాభిమానులు పిచ్చెక్కిపోతారు. వేగం వల్లే ఫార్ములా-1కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. అందుకే వాటర్‌ స్పోర్ట్స్‌లోనూ ఈ ‘ఫార్ములా’నే క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. ఫార్ములా-1 గ్రాండ్‌ప్రీ మాదిరిగానే... ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ‘ఎఫ్‌1హెచ్‌2వో’ అంటే బోట్‌ రేస్‌ అన్నమాట. నీటిపై నిర్వహిస్తారు. యూనియన్‌ ఇంటర్నేషనల్‌ మోటర్‌ ఎంటిక్యూ(యూఐఎం) వీటిని నిర్వహిస్తుంది. ఎంతో ప్రాచుర్యం ఉన్న ఈ క్రేజీ స్పోర్ట్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు యూఐఎం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలకు ఏడు దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా వాటిలో భారత్‌కు తొలిసారిగా అవకాశం దక్కింది. ఆ చాన్స్‌ కూడా ఏపీకి దక్కడం విశేషం. ఈ చాంపియన్‌షి్‌పలో భాగంగా పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రీ, లండన్‌ గ్రాండ్‌ప్రీ, ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రీ పూర్తయ్యాయి. చైనా గ్రాండ్‌ప్రీ సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరుగుతుంది. ఆ తర్వాత అమరావతి వేదికగా ఇండియన్‌ గ్రాండ్‌ప్రీ నవంబరు 17, 18 తేదీల్లో జరుగనుంది. విజయవాడ భవానీ ఐల్యాండ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఐల్యాండ్‌ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వాటర్‌ స్టోరేజీ ఉండటం కలిసొచ్చింది. ఈ నీటిపై పవర్‌ బోట్లు నిమిషాల వ్యవధిలోనే దూసుకెళ్తాయి.
 
ఆఫర్లు... అవగాహన సదస్సులు...
ఎఫ్‌1హెచ్‌2వోను విజయవంతం చేసేందుకు పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఏపీకి రప్పించేలా అనేక ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు స్థానికంగా ఉన్న యువతను ఆకర్షించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు వర్సిటీలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు ప్రారంభించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులే టార్గెట్‌గా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.
 
ఇదే మంచి చాన్స్‌...
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... పైగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కావడంతో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఏపీ భావిస్తోంది. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ఈ పోటీల నిమిత్తం విదేశీ పర్యాటకులు ఇక్కడికొస్తారు. కాబట్టి పర్యాటక శాఖ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ చాంపియన్‌షి్‌పను అమరావతిలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఆయన పిలుపు మేరకే యూఐఎం ఇండియన్‌ గ్రాండ్‌ప్రీని ఇక్కడ నిర్వహించేందుకు అంగీకరించింది. పోటీల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం పర్యాటక శాఖ చేతుల్లో పెట్టింది. పర్యాటకశాఖ ఎండీ హిమాన్షు శుక్లా ఇప్పటికే యూఐఎంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎఫ్‌1హెచ్‌2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహిస్తూనే.. మరోవైపు అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను చాటేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు రచిస్తోంది.
 
గంటకు 266 కిలోమీటర్ల వేగం..
వేగం అంటే ఫార్ములా1 కారుదే. గంటకు 375కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దీనిలాగే ఈ ఎఫ్‌1హెచ్‌2వో రేస్‌ బోట్‌ కూడా నీటిపై రయ్‌మంటూ దూసుకెళ్లగలదు. 2సెకన్ల వ్యవధిలోనే 100కి.మీ. వేగాన్ని అందుకునే ఈ పవర్‌ బోట్లు గంటకు 266కి.మీ వేగంతో ప్రయాణించగలవు. దీని బరువు సుమారు 455కిలోలు ఉంటుంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...