Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

ప్రపంచానికి సత్తా చాటాం 
అమరావతిలో ఇక ఏటా ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలు 
  ఈ నెలలోనే వైమానిక విన్యాసాలు 
  బహుమతుల ప్రదానంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఈనాడు - అమరావతి 
18ap-main1a.jpg

రాజధాని అమరావతిలో ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ పోటీలను అత్యద్భుతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై ఏటా రాజధానిలో ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ల పోటీలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది పోటీలు నవంబరు 15, 16, 17 తేదీల్లో ఉంటాయని ప్రకటించారు. ఎఫ్‌1హెచ్‌2ఓ, ఎఫ్‌4 పోటీల బహుమతుల ప్రదానోత్సవంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పర్యాటకశాఖ ఈ పోటీల్ని అద్భుతంగా నిర్వహించిందని కితాబిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా తాను రాష్ట్రంలో ఫార్ములా 1 కార్‌ రేస్‌లు నిర్వహించేందుకు ప్రయత్నం చేశానని, 2004 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాకపోవడంతో అది సాధ్యం కాలేదని చెప్పారు. ఇప్పుడు ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలు నిర్వహిస్తున్న యూఐఎం సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న నికొలో డి శాన్‌ జర్మొనో అప్పట్లో ఫార్ములా 1 రేస్‌ల నిర్వహణ సంస్థ బాధ్యతలు చూసేవారని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో తాను ఇటలీ వెళ్లి ఆయనను కలిశానని వివరించారు. ఈ పోటీలు 70-75 దేశాల్లో టీవీల్లో ప్రసారమయ్యాయని, 9 కోట్ల ప్రజలు వీక్షించారని ఆయన పేర్కొన్నారు.

ఆక్వా బైకింగ్‌ పోటీలు 
‘‘ఇకపై ప్రతి నెలా జల క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్‌ నిర్వహిస్తాం. వచ్చే సంవత్సరం నిర్వహించే పోటీలకు ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహిస్తాం. అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ    ఈవెంట్‌ చూడటానికి వచ్చేలా చేస్తాం. ఎఫ్‌1హెచ్‌2ఓ చివరి రోజు పోటీలు చూడటానికి లక్ష మందికిపైనే వచ్చారు. రాష్ట్రంలో టీవీల ముందు కూర్చుని లక్షల మంది చూశారు. భవిష్యత్తులో మరిన్ని జరగాలి. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఇక్కడ జలోత్సవం(వాటర్‌ ఫెస్టివల్‌), ఆక్వా బైకింగ్‌ తదితర పోటీలు నిర్వహిస్తాం. ఈ నెలలోనే ఇక్కడ వైమానిక విన్యాసాలూ నిర్వహిస్తాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

18ap-main1b.jpg

ఫ్రాన్స్‌లో పోటీలకు గౌరవఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ 
త్వరలో ఫ్రాన్స్‌లో జరిగే ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ను గౌరవఅతిథిగా ఆహ్వానించారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తప్పనిసరిగా వెళతారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎఫ్‌1హెచ్‌2ఓ ఎక్కడ జరిగినా ఆంధ్రప్రదేశ్‌ ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఒకపక్క వినోదం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు, అడ్వెంచర్‌ టూరిజంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల కంటే, సేవారంగంలోనే ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయన్నారు. సేవారంగానికి పర్యాటకమే మూలస్తంభమని, ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

పర్యాటకశాఖ మంచి మార్కులతో పాసైంది 
ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ పోటీలను బ్రహ్మాండంగా నిర్వహించిందని పర్యాటక శాఖపై సీఎం ప్రశంసలు కురిపించారు. కార్యక్రమం నిర్వహణ, పరిశుభ్రత వంటివి బాగున్నాయని ప్రజలు అభిప్రాయపడ్డారని, పర్యాటక శాఖ మంచి మార్కులతో పాసైందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని 80 శాతానికిపైగా ప్రజలు కోరుతున్నారన్నారు.

వేడుకగా బహుమతుల ప్రదానం 
ఎఫ్‌1హెచ్‌2ఓ, ఎఫ్‌4 పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ రెండు పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ, యూఐఎం అధ్యక్షుడు నికొలో డి శాన్‌ జర్మొనో తదితరులు బహుమతులు అందజేశారు. ఎఫ్‌4 పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన అమరావతి బోటు డ్రైవర్‌ జెల్ఫ్‌ బెంజమిన్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే నెలలో ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలు నిర్వహిస్తున్న అబుదాబి ప్రతినిధులకు చంద్రబాబు పతాకాన్ని అందజేశారు.

Link to comment
Share on other sites

పవర్‌ చూపిన అబుదాబి 
ప్రథమ, తృతీయ స్థానాలను గెలుచుకున్న అబుదాబి డ్రైవర్లు 
ఆరో స్థానంలో నిలిచిన అమరావతి రెండో డ్రైవర్‌ ఎరిక్‌ ఎడిన్‌ 
ఫార్ములా-4లో అమరావతికి ద్వితీయ స్థానం 
  ఈనాడు - అమరావతి 
18ap-main3a.jpg

ఉత్కంఠగా ఎదురు చూసిన ఫార్ములా-1 పవర్‌బోటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తుదిపోరు ఆదివారం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కళ్లు చెదిరిపోయే వేగంతో బోట్లు కృష్ణా జలతరంగాలపై పరుగులు తీస్తుంటే గ్యాలరీల్లోని జనం కేరింతలు కొడుతూ డ్రైవర్లను ప్రోత్సహించారు. తొలి నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అబుదాబి బృందం డ్రైవర్‌ షాన్‌ టొరంట్‌ అంచనాలకు అనుగుణంగానే రేసులో తొలిస్థానంలో నిలిచాడు. ఎమిరేట్స్‌ రేసింగ్‌ బృందం మహిళా డ్రైవర్‌ స్ట్రోమోయ్‌ మ్యారిట్‌ తొలిసారి ఈ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శననిచ్చి రెండోస్థానంలో నిలిచింది. తొలి 4 రేసుల్లో కలిపి రెండో స్థానంలో ఉన్న అబుదాబి బృందం మరో డ్రైవర్‌ స్టార్క్‌ ఎరిక్‌ తన సత్తాను మరోసారి చాటి మూడో స్థానంలో నిలిచాడు.

మధ్యలో ఆగిపోయిన అమరావతి బోటు 
పోల్‌ పొజిషన్‌ 5వ స్థానంలో పోటీకి దిగిన అమరావతి డ్రైవర్‌ జోనస్‌ అండర్సన్‌ మొదట్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పోటీల్లో తొలి అయిదారు స్థానాల్లో కొనసాగారు. తర్వాత నాలుగోస్థానంలోకి వచ్చాడు. ఇక టాప్‌-3లోకి వస్తాడంటూ ప్రేక్షకులు పెద్దఎత్తున చప్పట్లు, కేరింతలు పెడుతూ అతడిని ప్రోత్సహించారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే అన్నట్లు అండర్సన్‌ ఏమాత్రం తగ్గకుండా పోటీపడ్డాడు. అయితే పోటీ 11 నిమిషాల్లో అంటే ఇంకో 12 ల్యాప్స్‌ పూర్తిచేయాల్సిన సమయంలో అండర్సన్‌ నడుపుతున్న అమరావతి బోటు మధ్యలో ఆగిపోయింది. తర్వాత పోటీలో కొనసాగలేకపోయాడు. బోటును వేరే బోటు సహాయంతో నిర్వాహకులు బయటకు తీసుకువచ్చారు. దీంతో పోటీలో అమరావతి ప్రధాన డ్రైవర్‌ లేకుండాపోయాడు. అయితే అమరావతి రెండో డ్రైవర్‌ ఎరిక్‌ ఎడిన్‌ బోటు రేసు కొనసాగించాడు. మొదట్లో ఎక్కడో 15, 16 స్థానాల్లో ఉన్న అతను రేసు పూర్తయ్యేసరికి ఆరో స్థానంలో నిలిచాడు. అమరావతి డ్రైవర్‌ జోనస్‌ అండర్సన్‌ మాత్రం ఆదివారం రేసు పూర్తి చేయకపోవడం వల్ల పాయింట్లు ఏమీ పొందలేకపోయాడు. ఫలితంగా ఇప్పటివరకూ ఉన్న ఏడో స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. అయితే  రెండో డ్రైవర్‌గా ఉన్న ఎరిక్‌ ఎడిన్‌ ఆదివారం రేసులో ఆరోస్థానంలో నిలవడం ద్వారా సాధించిన 5పాయింట్లతో కలిపి మొత్తం 18పాయింట్ల పొందాడు. దీంతో ఇప్పటివరకూ ఉన్న 8 స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకున్నాడు.

18ap-main3b.jpg

*మ్యాడ్‌ క్రాక్‌ బాబా రేసింగ్‌ బృందానికి చెందిన ఓ బోటు ఆదిలోనే కదలకపోవడంతో పోటీ నుంచి వైదొలిగింది. 
* మొదటి ల్యాప్‌ పూర్తవుతున్న సమయంలోనే చైనా బృందానికి చెందిన ఫిలిప్పి చియప్పేకు చెందిన బోటు ఇంజిన్‌ పైభాగం ఊడిపోయి నీటిలో సగం మునిగిపోవడంతో ఆయన బోటు ఆగిపోయింది. సహాయ బృందం వెంటనే స్పందించి ఆయన్ను బోటు నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. 
* విక్టరీ బృందానికి చెందిన అలెక్స్‌కు చెందిన బోటులో సాంకేతిక లోపం కారణంగా ఆయన పోటీ మధ్యలో వైదొలిగారు.

తొలి మూడు స్థానాల్లో నిలిచిన డ్రైవర్లు 
* షాన్‌ టొరంట్‌ - అబుదాబి బృందం (20 పాయింట్లు) 
*  స్ట్రోమోయ్‌ మ్యారిట్‌ - ఎమిరేట్స్‌ రేసింగ్‌ (15 పాయిట్లు) 
*  స్టార్క్‌ ఎరిక్‌ - అబుదాబి  (12 పాయింట్లు)

18ap-main3c.jpg

ఫార్ములా-4లో సత్తా చాటిన బెంజమిన్‌ 
మరోపక్క ఆదివారం జరిగిన ఫార్ములా-4 రేసులో మాత్రం అమరావతి బోటు డ్రైవర్‌ జెల్ఫ్‌ బెంజమిన్‌ సత్తా చాటాడు. అమరావతిని రెండో స్థానంలో నిలిపాడు. శని, ఆదివారం రెండ్రోజులు జరిగిన ఈ ఎఫ్‌-4 రేసులో చివరకు మ్యాడ్‌ క్రాక్‌ బాబా రేసింగ్‌ డ్రైవర్‌ మిహల్‌దినెక్‌ రుడాల్ఫ్‌ తొలి స్థానంలో నిలవగా అమరావతి డ్రైవర్‌ జెల్ఫ్‌ రెండోస్థానంలో, ఎఫ్‌1 అట్లాంటిక్‌ బృందం డ్రైవర్‌ వైట్లే సామ్‌ మూడోస్థానంలో నిలిచాడు.

18ap-main3d.jpg
Link to comment
Share on other sites

పవర్‌ రేసింగ్‌కు.. ఫిదా..
19-11-2018 10:50:39
 
636782214400107611.jpg
  • ముగిసిన ఎఫ్‌1హెచ్‌2ఓ రేస్‌ పోటీలు
  • కిక్కిరిసిన కృష్ణాతీరం
  • కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం
  • భవనాల పైకెక్కి మరీ వీక్షించిన స్థానికులు
పవర్‌ బోట్‌ రేసు వీక్షణం ప్రమాదాన్ని కూడా లెక్కచేయలేదు. నడిరోడ్లపైనే గంటల తరబడి నిలిచి రేసులను చూసినా తనివి తీరలేదు. జలవిన్యాసాలతో, రేసర్ల దుందుడుకు ప్రదర్శనకు ఫిదా అయిన జనం ఫార్ములా వన్‌ రేస్‌కు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఒక్కో ల్యాప్‌ను దాటుతూ.. మలుపుల్లో వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోన్న రేసర్ల ప్రతిభ ప్రతీ ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేసింది.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ టూరిజం శాఖ నిర్వహణలో చేపట్టిన ఎఫ్‌1హెచ్‌2ఓ రేసుల్లో భాగంగా ఫైనల్‌ బోటింగ్‌ రేసులు ఆదివారం ఘనంగా ముగిశాయి. 9 దేశాల నుంచి 19 బోట్లతో రేసర్లు చేసే విన్యాసాలు కళ్లారా చూడటానికి జనం పోటెత్తారు. భవానీపురం శివారుల్లోని హైదరాబాద్‌ జాతీయ రహదారి మొదలు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, ఫ్లైఓవర్‌, భవానీ, దుర్గా ఘాట్లపై జనం బారులు తీరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాకతో భద్రతా కారణాల దృష్ట్యా పలువురు పాసులతో వచ్చినా లోపలికి అనుమతించకపోవడంతో అసహనంతో రోడ్లపై నుంచే రేసులను వీక్షించారు.
 
ప్రతీ ల్యాప్‌కు ఉత్కంఠ
tgrgaerfgawe.jpgఫార్ములా రేసుల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో రెండు విడతలుగా రేసులను నిర్వహించారు. తొలుత ఫార్ములా 4, అనంతరం 1 రేసులను చేపట్టారు. రేసు ప్రారంభమైంది మొదలు ప్రతీ రేసర్‌ ముందంజలో నిలవడానికి చేసిన విన్యాసాల వీక్షకులను ఆశ్యర్యానికి గురిచేశాయి. ప్రతీ ల్యాప్‌కు ఉత్కంఠ పెరగడంతో పాటు అమరావతి టీమ్‌ ప్రథమ స్థానానికి రావడంపైనే అందరూ దృష్టి పెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఫార్ములా ఫోర్‌ రేసు తొలుత ప్రారంభమైంది. దాదాపు 35 నిమిషాలపాటు నిర్వహించిన ఆ రేసులో పాల్గొన్న 19 మంది రేసర్లలో అమరావతి టీమ్‌కు చెందిన జెల్ఫ్‌ బెంజ్‌మెన్‌ 20 ల్యాప్స్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి 15 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
 
మొదటి స్థానంలో విక్టరీ టీమ్‌కు చెందిన అల్‌ ఫహిమ్‌ అహ్మద్‌, మూడో స్థానంలో వైటిల్‌ సామ్‌ నిలిచారు. అనంతరం కొద్దిపాటి నిరీక్షణతో ప్రారంభించిన ఫార్ములా వన్‌ రేసు చూపరులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించింది. రెప్పపాటులో ఏ విన్యాసం చూడలేకపోతామో! ఎవరి విజయాన్ని గుర్తించలేకపోతామో! అన్నంతగా లక్షలాది మంది వీక్షకులు రేసులో లీనమైపోయారు. రేసు ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అమరావతి టీమ్‌ రేసర్‌ జోనస్‌ అండర్సన్‌ బోట్‌ కీలక సమయంలో సాంకేతిక సమస్యకు గురవడంతో రేసు నుంచి అర్థాంతరంగా వైదాలగాల్సి వచ్చింది.
 
రేసును ఆశ్వాదిస్తూ..
aefwefe.jpgనగరానికి తొలిసారిగా పరిచయమైన అంతర్జాతీయ పవర్‌ బోట్‌ రేసును చూడటానికి ప్రజలు ప్రమాదాన్ని సైతం లెక్కచేయలేదు. భవనాల పిట్టగోడలు, పార్కింగ్‌ బైకులు.. సరిహద్దు గోడలు.. ఇలా ఎత్తైన ఏ నిర్మాణం కనిపిస్తే దానిపై నిలబడే రేసును ఆస్వాదించారు. వేల మంది జనం ఆలస్యంగా ఘాట్‌కు చేరుకున్నారు. అయితే రేసులను ప్రారంభించడానికి అప్పటికే ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో పోలీసు అధికారు లు ఘాట్‌ను, పరిసర ప్రాంతాలను అష్టదిగ్భంధనం చేశారు.
 
అమరావతి విజేతతో సీఎం..
race1-big.jpgఫార్ములా 4 పోటీల్లో ఏపీ తరఫున బరిలోకి దిగి రెండోస్థానాన్ని దక్కించుకున్న జెల్ఫ్‌ బెంజ్‌మెన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో దిగారు. బహుమతుల ప్రదానం పూర్తయిన తరువాత విజేతలకు సన్మానం చే సిన అనంతరం జెల్ఫ్‌ను దగ్గరకు తీసుకున్న చంద్రబాబు ఫొటోలకు ఫోజిచ్చారు. బహుమతి ప్రదానం అనంతరం విజేతగా నిలిచిన వారి దేశ జాతీయ గీతంతోపాటు భారత దేశ జాతీయగీతాన్ని ఆలపించి గౌరవ
వందనం చేశారు.
Link to comment
Share on other sites

F1H2O will be made an annual event: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

The Chief Minister, applauding the efforts of the drivers and their teams, said that the objective to organise F1H2O event here was to bring Amaravati on to the global map.

Published: 19th November 2018 07:28 AM  |   Last Updated: 19th November 2018 08:18 AM   |  A+A-

will.jpg

Chief Minister N Chandrababu Naidu carrying national flag during F1H2O event in Vijayawada on Sunday; (Below)winners celebrate after the event I Express

By Express News Service

VIJAYAWADA: Chief Minister N Chandrababu Naidu has said the State government is planning to make F1H2O Power Boat Racing Championship an annual event. Addressing a gathering on the conclusion of the F1H2O Power Boat Racing World Championship in Vijayawada on Sunday, the Chief Minister said the next year’s edition will also be held on Krishna river. “You can mark it in your calendars now. The race will take place from November 16 to 18 next year,” Naidu said.  

willA.jpgThe Chief Minister, applauding the efforts of the drivers and their teams, said that the objective to organise F1H2O event here was to bring Amaravati on to the global map. He said that the State government was making efforts to make Andhra Pradesh, the best tourism spot in the country. 

“Considering the thousands, who thronged Punnami Ghat and those watching the contest on TV across the world, we are expecting 70 to 80 million people to watch the reruns,” he added. Naidu also spoke about the concerted efforts by various ministries to bring world class sporting events of a similar nature to inculcate the sporting spirit and habit in youth of the State. 

ALSO READ | Vijayawada-Singapore flight will herald new era: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

 
 

 

Later, the Chief Minister inaugurated the F1H2O Racing Park. Many families were seen thronging the park soon after its inauguration.   

Shaun Torrente of Team Abu Dhabi came first, while Maret Stromoy of Team Emirates and Erik Stark of Team Abu Dhabi stood second and third, respectively. 

Earlier, the Chief Minister took a trial round before beginning the race and flagged it off. 
Erik Edin of Team Amaravati trailed on the sixth position as Jonas Andersson, the team’s lead racer, was declared out in the last few laps of the race as his power boat developed a technical glitch. As many as one lakh people were said to have watched the event. 

Taking to Twitter, IT and Panchayat Raj Minister Nara Lokesh said, “Great finish by Shaun Torrente of Abu Dhabi to bag the top honours. Jonas Andersson of #TeamAmaravati gave a terrific fight, but it wasn’t his day today. Better luck to him next time. All in all #F1H2O_Amaravati has got people notice #Amaravati and its amazing potential.”

Naidu and Tourism Minister Akhila Priya felicitated Nicolo Di San Germano, promoter, H2O Racing, Paulo Di San Germano, president, F1H2O, Raffaele Chiulli, UIM president, Lavinia Cavallero, vice  president H2O racing, Mukesh Kumar Meena, secretary Tourism, Himanshu Shukla, CEO, AP Tourism, Y Harish Chandra Prasad, founder and chief mentor, Malaxmi Group and Sandeep Mandava, CEO, India Xtreme Adventure Activities Pvt Ltd.

Link to comment
Share on other sites

On 11/19/2018 at 4:40 AM, Nfan from 1982 said:

Bad news 

Article is not completely true bro.

VIP passes is must for any event as we are aware.

For general public it has been made  free and there is a big turnout on Day 2 when I attended it, there are all arrangements done and global dance and music festival after the event was also good and engaging.

Parking arrangements were also done and there are hoardings with parking slots map every where near the site.

People not allowed to watch it from Prakasham Barrage as it will become a blocker for traffic if people start to pile up there.

 

Only down side I felt was traffic organizing by police which is also because of the uncompleted flyover I believe.

 

 

Link to comment
Share on other sites

  • 4 weeks later...
ఆఖర్లో మెరిసిన అమరావతి
షార్జాలో ముగిసిన ఎఫ్‌1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: షార్జాలో ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌బోట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌-2018 పోటీలు శనివారం ముగిశాయి. అబుదాబి బృంద డ్రైవర్‌ షాన్‌ టొరంట్‌ 89పాయింట్లతో ప్రపంచ విజేతగా నిలిచారు. టోర్నీ చివరి రౌండ్‌ ఫార్ములా-1 రేస్‌లో తొలి అయిదింటిలో రెండు స్థానాలు అమరావతి బృంద డ్రైవర్లకే దక్కాయి. ప్రధాన డ్రైవర్‌ జోనస్‌ అండర్సన్‌ రెండోస్థానంలో, రెండవ డ్రైవర్‌ ఎరిక్‌ ఎడిన్‌ 5వ స్థానంలో నిలిచారు. అబుదాబి బృంద డ్రైవర్‌ ఎరిక్‌ స్టార్క్‌ (తొలిస్థానం) కంటే కేవలం 12.27 సెకన్లు ఆలస్యంగా అండర్సన్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. మొత్తం ఏడు రౌండ్ల పోటీల తర్వాత టాప్‌-10లో అబుదాబి డ్రైవర్‌ షాన్‌ టొరంట్‌కు మొదటి, మరో డ్రైవర్‌ ఎరిక్‌ స్టార్క్‌కు రెండో, అమరావతి బృందంలో ప్రధాన డ్రైవర్‌ జోనస్‌ అండర్సన్‌కు ఏడో, డ్రైవర్‌ ఎరిక్‌ ఎడిన్‌లకు తొమ్మిదో స్థానం దక్కింది.  ఫార్ములా-4 రేస్‌లో అమరావతి బృంద డ్రైవర్‌ అలెగ్జాండర్‌ లిండ్‌హోమ్‌కు ప్రథమ స్థానం లభించింది. బహుమతుల ప్రదానం సందర్భంగా అలెగ్జాండర్‌తో పాటు జోనస్‌ భారత జాతీయ పతాకాన్ని చేతబూని అభివాదం చేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...