Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

వినూత్న ప్రచారం
29-10-2018 07:41:10
 
636763956714054416.jpg
  • కృష్ణమ్మ ఒడిలో పవర్‌ బోట్‌ రేసింగ్‌
  • అమరావతిలో మెగా ఈవెంట్‌
  • ఎఫ్‌-1 హెచ్‌ 2వో ఏర్పాట్లు
  • విజయవాడలో ఫ్లాష్‌మాబ్‌తో ప్రచారం
  • ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరులలో రోడ్‌ షో, ఫ్లాష్‌మాబ్స్‌
  • అంతర్జాతీయ, జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే కార్యక్రమాలు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచపటంలో చూపేలా ఫార్ములా వన్‌ హెచ్‌ 2వో పవర్‌బోట్‌ రేస్‌ చాంపియన్‌ షిప్‌కు విస్తృత ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎఫ్‌1 హెచ్‌2వో పై ఆదివారం విజయవాడ ట్రెండ్‌సెట్‌ మాల్‌లో ఫ్లాష్‌మాబ్‌తో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టింది. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులు డ్యాన్సులు, పోస్టర్ల ప్రదర్శనతో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ అందరినీ ఆకట్టుకుంది. ఎఫ్‌ 1 హెచ్‌2వో, ఏపీ టూరిజం, మా లక్ష్మీగ్రూపు లోగోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పర్యాటకశాఖ నేతృత్వంలో కృష్ణానదిలో ఏర్పాట్లు, మరోవైపు మెగా ఈవెంట్‌పై వినూత్న ప్రచారానికి ఏకకాలంలో చర్యలు చేపట్టడం విశేషం. తొలిసారిగా వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌పోటీలకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాలతో పాటు, ఫ్లాష్‌మాబ్స్‌, రోడ్డు షోలు వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
 
efSEfsdf.jpgదేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్‌, బెంగళూరు నగరాలలో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది.దేశవ్యాప్తంగా ఎఫ్‌ 1హెచ్‌2వో చాంపియన్‌ షిప్‌ అంశంపై పాఠశాలల్లో డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించ నున్నారు. మరో రెండు, మూడురోజుల్లో ఫార్ములా వన్‌పవర్‌ బోట్లు విజయవాడ రానున్నాయి. ప్రపంచ రైడర్స్‌కు ఘనస్వాగతం పలికేందుకు పర్యాటకశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం నగర సుందరీకరణ బాధ్యతలను స్థానిక సంస్థకు అప్పగించింది. నవంబర్‌ మొదటివారానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయనున్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచ ఈవెంట్‌కు పక్కా ఏర్పాట్లు
31-10-2018 08:26:27
 
636765711881527499.jpg
  • ఎఫ్‌ 1 హెచ్‌ 2వో ఈవెంట్‌ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం
  • 5న క్షేత్రస్థాయి పర్యటన, 15న విజయవాడలో కార్నివాల్‌
  • శాఖల వారీగా బాధ్యతల కేటాయింపు
విజయవాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రపంచ గ్రాండ్‌ ఈవెంట్‌ ‘ఎఫ్‌ 1 హెచ్‌ 2 వో పవర్‌బోట్‌ రేసింగ్‌ ’ వరల్డ్‌ ఛాంపియన్‌షి్‌పకు ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్టు కృష్ణా కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం, పర్యాటక శాఖ ఎండీ హిమాన్షు శుక్లాలు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ‘ఎఫ్‌ 1 హెచ్‌ 2 వో’ ఈవెంట్‌ ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అవసరాల ప్రాతిపదికన ఏఏ శాఖలు క్షేత్ర స్థాయిలో ఏమేమి చేపట్టవలసి ఉందో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం మాట్లాడుతూ కృష్ణానదిలో మూడురోజుల పాటు జరిగే గ్రాండ్‌ ఈవెంట్‌ ను తొలి రోజు నవంబర్‌ 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌లో 32 దేశాల ప్రాతినిథ్యంతో 10 టీములు పోటీలలో పాల్గొంటున్నాయని తెలిపారు. రేసింగ్‌లో మొత్తం 22 బోట్లు పాల్గొంటాయని తెలిపారు. విదే శాలలో ఎంతో క్రేజు ఉన్న ఈ రేసింగ్‌ను చూడటానికి విజయవాడ రావటానికి 500 మంది విదేశీ ప్రేక్షకులు రాబోతున్నారని చెప్పారు. రెండు లక్షల మందికి పైగా ప్రేక్షకులు రాబోతున్న ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికి రెండు సార్లు ఫీల్డ్‌ విజిట్‌ చేశామన్నారు.
 
సాయంత్రం సమయాలలో ప్రపంచ స్థాయి కల్చరల్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని తెలిపారు. దుర్గా ఫ్లై ఓవర్‌ కింద కార్పొరేషన్‌ నేతృత్వంలో ఎఫ్‌1 హెచ్‌2 ఓ పార్కును ఏర్పాటు చేయించటం జరుగుతోందన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ఫైర్‌ బ్రిగేడియర్లు , ఫైర్‌ ఫైటర్స్‌ వంటివి అందుబాటులో ఉంచుతామన్నారు. తీరం వెంబడి గస్తీ కోసం మత్స్యశాఖ తరపున గజ ఈతగాళ్ళు , బోట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నుంచి ప్రత్యేక బలగాలు, బోట్లు కూడా తీరం వెంబడి మోహరిస్తున్నట్టు తెలిపారు. రెండు లక్షల మంది ప్రేక్షకులు వస్తారన్న అంచనాతో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా పటిష్ట బ్యారికేడింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. పర్యాటక శాఖ ఎండీ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, ఎఫ్‌ 1 హెచ్‌2 ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబరు 15వ తేదీన విజయవాడ నగరంలో గ్రాండ్‌ కార్నివాల్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పోటీలలో పాల్గొనబోయే మొత్తం పది టీములు వారి బోట్లతో సహా ప్రదర్శన ఉంటుందన్నారు. బందరు రోడ్డులో గ్రాండ్‌ కార్నివాల్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్నివాల్‌కు సంబంధించి పోలీసు అధికారులకు సమాచారం అందించామని త్వరలోనే రూట్‌మ్యా్‌పను ఖరారు చేయటం జరుగుతుందన్నారు. నవంబరు 17వ తేదీన ఎఫ్‌1 హెచ్‌ 2 ఓ రేస్‌తో పాటు, నవంబరు 18న ఎఫ్‌ 4 ఎస్‌ ఈవెంట్‌ను కూడా నిర్వహించటం జరగుతోందన్నారు. ఈ ఈవెంట్‌లో యంగ్‌ డ్రైవర్లు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ 2 పీ బాబూరావు, వీఎంసీ కమిషనర్‌ నివాస్‌, డీటీసీ మీరా ప్రసాద్‌, ఏపీటీడీసీ డీవీఎం శ్రీనివాసరావులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

16 నుంచి.. ఎఫ్‌1 హెచ్‌2వో బోట్‌ రేసింగ్‌
01-11-2018 03:16:15
 
  • అమరావతికి 9 విదేశీ బృందాలు
న్యూఢిల్లీ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికకానుంది. కృష్ణా నదిలో ఫార్ములా-1 హెచ్‌-2వో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈనెల 16 నుంచి 18 వరకు పవర్‌ బోటు పోటీలు జరుగుతాయి. హెచ్‌-2వో రేసింగ్‌ సంస్థ, విజయవాడకు చెందిన మాలక్ష్మీ గ్రూప్‌ వారి ఎక్స్‌ట్రీమ్‌ అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల వివరాలను బుధవారం ఢిల్లీలో ఏపీ టూరిజం కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. 14 దేశాలకు చెందిన 9 బృందాలు ఈ పోటీలో పాల్గొంటాయని తెలిపారు.
 
ఆస్ట్రేలియా, చైనా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నార్వే, పోలెండ్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, థాయ్‌లాండ్‌, యూఏఈ, యూఎ్‌సఏ దేశాల నుంచి పవర్‌ బోట్‌ డ్రైవర్లు పాల్గంటారని వివరించారు. పవర్‌ బోట్‌ రేసింగ్‌కు కృష్ణా నది అనుకూలమని, మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ పోటీల ద్వారా అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. 90 లక్షల మంది వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారని, 400 మంది విదేశీయులు అమరావతికి వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రాఫ్ట్స్‌, ఫుడ్‌, మ్యూజికల్‌ ఫెస్టివల్‌ కార్యాక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే తరహా కార్యక్రమాలను భవిష్యత్తులో 18 ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
Link to comment
Share on other sites

‘కృష్ణా’లో మర పడవ పందేలు
అమరావతికి మరో గుర్తింపు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేదికగా అంతర్జాతీయ పవర్‌ బోట్‌ రేసింగ్‌ (మర పడవ పందేలు) నిర్వహణకు రంగం సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజి వెనుక జలాల్లో ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించే ఈ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి డైవర్లు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ, మాలక్ష్మి, ఎఫ్‌వన్‌-హెచ్‌టూఓ సంస్థలు సంయుక్తంగా వీటిని నిర్వహించనున్నాయి. దాదాపు 14 సంవత్సరాల అనంతరం భారత్‌లో జరిపే ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ సీఈవో శ్రీనివాసరావు శుక్రవారం బెంగళూరులో వెల్లడించారు. పోటీల నిర్వహణ అమరావతి పర్యాటక పరిధిని మరింత విస్తృతం చేయనుందన్నారు. రెండు లక్షలకు పైగా వీక్షకులు హాజరు కానున్న ఈ పోటీలను కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు వీక్షించే ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో 350 మంది పోటీదారులు పాల్గొంటారన్నారు. అమరావతి బృందంతో పాటు పోర్చుగల్‌, ఇటలీ, యూఏఈ, ఫ్రాన్స్‌లకు చెందిన పేరొందిన డైవర్లలో ఇద్దరు మహిళలున్నట్లు సమావేశంలో పాల్గొన్న మాలక్ష్మి సంస్థ సీఈవో సందీప్‌ మండవ తెలిపారు. సమావేశంలో ఎఫ్‌వన్‌-హెచ్‌టూఓ లాజిస్టిక్స్‌ సంచాలకులు మార్కో పీట్రిని పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...