Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

ప్రపంచం మెచ్చేలా.. ఎఫ్‌1హెచ్‌2వో!
09-10-2018 02:51:55
 
  • పోటీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశం
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఎఫ్‌1హెచ్‌2వో పవర్‌బోట్‌ రేసింగ్‌ను ప్రపంచ దేశాలు మెచ్చేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నవంబరు 17న జరిగే ఎఫ్‌1హెచ్‌2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు అమరావతి ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధానిలో జరుగుతున్న మొట్టమొదటి ప్రపంచ స్థాయి పోటీలు కాబట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సూచించారు. ఎఫ్‌1హెచ్‌2వో చాంపియన్‌షిప్‌ ఏర్పాట్లపై సోమవారం 30 శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు జనం అంచనాలకు మించి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి అంతకుమించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు, అతిథులు, క్రీడాకారులు, పత్రికా రంగానికి చెందిన వారికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.
 
పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీకి ఉత్తమ జాతీయ పురస్కారం దక్కడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రపంచ పర్యాటకులకు గమ్యస్థానంగా మారాలని సీఎం ఆకాంక్షించారు. బోట్‌ రేసింగ్‌ ఏర్పాట్లపై పర్యాటక శాఖ సెక్రటరీ మీనా ముఖ్యమంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఒకేసారి లక్ష మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్‌, ఏపీటీడీసీ ఎండీ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పోటీలు అదరాలి
ఫార్ములా 1 బోటింగ్‌ క్రీడల ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
  నవంబరు 16, 17, 18 తేదీల్లో పోటీలు
  ముఖ్య అతిథిగా రాష్ట్రపతి లేదా సీజేఐ
  3 లక్షల మంది చూసేలా ఏర్పాట్లు
  అమరావతిలో తొలి అంతర్జాతీయ
   పండగలా జరపాలని సీఎం ఆదేశం
ఈనాడు - అమరావతి
8ap-state1a.jpg

అంతర్జాతీయ పండగలా కలకాలం గుర్తుండిపోయేలా ఫార్ములా-1 పవర్‌ బోటింగ్‌(ఎఫ్‌1హెచ్‌2ఓ) పోటీలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి ప్రపంచస్థాయి పోటీలు కాబట్టి వాటిని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో జలవనరులు, జలక్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా ఈ పోటీల నిర్వహణ ఉండాలన్నారు. ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో వెలగపూడిలో సచివాలయంలో సమన్వయ సమావేశాన్ని సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించారు. పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించాలని సమావేశంలో చర్చించారు. రేస్‌ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు హోం, జలవనరుల, పర్యాటక, పురపాలక, మత్స్యశాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏర్పాట్ల కార్యాచరణ ప్రణాళికను పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా సీఎంకు వివరించారు.

ఇప్పటి వరకూ అనుకున్న ప్రణాళిక..
* లక్షమంది కూర్చుని చూసేలా బాల్కనీల ఏర్పాటు

* పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, నిర్వాహకులు, ముఖ్య అతిథుల కోసం విజయవాడ, గుంటూరులోని హోటళ్లలో 4500 గదుల బుకింగ్‌. వీటితోపాటు హోమ్‌ స్టే కింద ఎంపిక చేసిన 150 ఇళ్లనూ సిద్ధం చేయటం..

8ap-state1b.jpg

లక్ష కాదు.. 3 లక్షల మందికి
ముఖ్యమంత్రి కల్పించుకుంటూ ‘‘అంతర్జాతీయ స్థాయి పోటీలు కాబట్టి యువత పెద్దసంఖ్యలో తరలివస్తుంది. 3లక్షల మంది వచ్చినా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయండి. పోటీలు జరిగే మూడురోజులు సమాంతరంగా అంతర్జాతీయ స్థాయి పర్యాటక లేదా జల పర్యాటకంపై అంతర్జాతీయ స్థాయి సదస్సును అమరావతిలో ఏర్పాటుచేయండి. ప్రధాన పోటీలు కాకుండా మిగిలిన రోజంతా వీక్షకులకు ఆహ్లాదాన్ని పంచేలా ప్రత్యామ్నాయ కార్యక్రమాలుండాలి. ఫార్ములా-1 కాకుండా ఇతర సాధారణ జలక్రీడలు, పడవల పోటీలతోపాటు భారీగా సాంస్కృతిక కార్యక్రమాలుండాలి’’.. అంటూ చెప్పారు.

పోలవరం వద్ద పర్యాటకం
పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటును ప్రతిపాదిస్తూ ఒక ప్రైవేట్‌ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రజంటేషన్‌ ఇచ్చారు.  ప్రతిపాదిత పెట్టుబడి చాలా ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

రాజస్థాన్‌, కేరళను మించడం అభినందనీయం
రాజస్థాన్‌, కేరళను దాటేసి జాతీయ స్థాయిలో సుస్థిర పర్యాటకంలో తొలిస్థానంలో నిలిచి గెలిచిన అవార్డును పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఎండీ హిమాన్షుశుక్లా ముఖ్యమంత్రికి చూపించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Link to comment
Share on other sites

రతిష్ఠాత్మకంగా బోట్‌ రేసింగ్‌
13-10-2018 08:26:50
 
636750160123027205.jpg
  • ఎఫ్‌1హెచ్‌2వోపై కమిటీ భేటీ..
  • అన్ని శాఖల సహకారం అవసరం
  • ముందస్తు ఏర్పాట్లుపై అధికారులకు బాధ్యతలు
  • వీవీఐపీ ఆహ్వానాల బాధ్యత తీసుకున్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం
  • భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణకు సహకరిస్తామన్న సీపీ
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎఫ్‌1 హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ దృష్టిని అమరావతి వైపు ఆకర్షింపచేయాలని సీఎం చంద్రబాబునాయడు భావిస్తున్నారని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహ ణకు ఏర్పాట్లు, పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన సమన్వయ కమిటీ తొలి క్షేత్ర పర్యటనను శుక్రవారం నిర్వహించింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న మీనా అధికా రులతో సమావేశమయ్యారు. ఈ కమిటీలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరు మలరావు, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌, ఏపీటీడీపీ ఎండీ హిమాన్షు శుక్లా తదితరులు పున్నమి ఘాట్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణకు ప్రతి శాఖ నుంచి తాము సహకారం ఆశిస్తున్నామని మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
 
ప్రకాశం బ్యారేజీ వేదికగా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వ హిసు ్తన్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు ఒక్కో జట్టు నుంచి 50 మంది సభ్యులు చొప్పున 500మంది జల క్రీడాకారులు వస్తున్నారని వివరించారు. ఎక్కువమంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడి యాకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించాల్సి ఉంద న్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జలవ నరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజులపాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహి స్తామని చెప్పారు. పోటీలు జరిగే విధా నం, రేస్‌ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా వివరించారు. నగర సుందీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసు కుంటానని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ తెలపగా, జిల్లా యం త్రాంగం అంతటినీ అందు బాటులో ఉంచుతామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు.
 
ఆహ్వా నాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది. ఇటీ వల ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వ హించి దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ బోట్‌ రేసర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు విభాగానికి అందచేయాలన్నారు. రేసింగ్‌లో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించడంపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది.
 
 
 
 

Advertisement

Link to comment
Share on other sites

జల సంరంభానికి సంసిద్ధం
ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం
32 దేశాల ప్రతినిధుల రాక
అమరావతిలో ఫార్ములా- 1
  పవర్‌ బోట్‌ పోటీలు వచ్చే నెల 16 నుంచి
14ap-main6d.jpg

ఈనాడు, అమరావతి: అమరావతి వేదికగా జల సంరంభానికి సర్వం సిద్ధమవుతోంది. కృష్ణా నదిలో వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో 3 రోజులపాటు జరగనున్న ఫార్ములా-1 పవర్‌ బోట్‌ (ఎఫ్‌1హెచ్‌2వో) పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలను 8 దేశాల్లో నిర్వహిస్తున్నారు. భారత్‌లో వీటికి అమరావతి వేదికైంది.

14ap-main6c.jpg

3 లక్షల మందికి ఏర్పాట్లు!
లక్ష మంది కూర్చుని వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేయాలని మొదట అధికారులు సిద్ధమైనప్పటికీ అమరావతిలో జరుగుతున్న తొలి ప్రపంచ స్థాయి పోటీలు కాబట్టి జనం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని 2 లక్షల నుంచి 3 లక్షల మంది కూర్చుని చూసేందుకు అనువుగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

14ap-main6e.jpg

ప్రభుత్వ శాఖలతో..
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 28 శాఖల సమన్వయంతో ఈ ఫార్ములా-1 పోటీలను నిర్వహించే ఏర్పాట్లను చేపట్టారు. ఇందులో రెండు ప్రైవేటు ఆసుపత్రులు భాగస్వామ్యం తీసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ (టూరిజం అథారిటీ) సమన్వయం చేయనుంది. ఈ శాఖలన్నీ కేవలం ఫార్ములా-1 పవర్‌ బోటింగ్‌ ఏర్పాట్లకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోనున్నాయి. ఉదాహరణకు...
పరిశ్రమలు/ఈడీబీ: పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించడం. సీఆర్‌డీఏ: అమరావతికి పెట్టుబడిదారులను ఆకర్షించడం వంటివి చేయాలి.


పోటీలు ఇలా...
14ap-main6a.jpg14ap-main6b.jpg

* ప్రపంచంలోని లీడింగ్‌ డ్రైవర్లు 20 మంది ఈ పోటీల్లో పాల్గొంటారు.
* అమరావతి బోట్‌కు డ్రైవర్లుగా స్వీడన్‌కు చెందిన అండర్సన్‌, ఎరిక్‌ ఎడిన్‌లు ఉంటారు.
* చిన్న వంపుల్లోనూ 90 కి.మీ.వేగంతో వయ్యారాలు పోతూ ఈ బోట్లు పరుగు తీయనున్నాయి.
* పోటీల్లో పాల్గొనే బోట్‌ ఒక్కోటి 380హెచ్‌పీ సామర్థ్యంతో గంటకు 250 కి.మీ.(155మైళ్ల) వేగంతో దూసుకు వెళ్తుంది.
* టీం మేనేజర్లు 50 మంది, రైడర్లు 60 మంది, డైవర్లు 46 మంది, రేడియోమెన్‌ 36 మంది, హెచ్‌2వో రేసింగ్‌ సిబ్బంది 28 మంది, టీవీ క్రూ 30 మంది, యూఐఎం అధికార ప్రతినిధులు (అఫీషియల్స్‌) 11 మంది, భద్రతా సిబ్బంది 12 మంది ఇలా మొత్తం 450మందికిపైగా ఉంటారు.
* 32 దేశాల ప్రతినిధులు పోటీలకు హాజరవుతారు.


14ap-main6f.jpg
Link to comment
Share on other sites

City to host powerboat race, air show

author-deafault.png Special Correspondent VIAYAWADA
October 20, 2018 00:09 IST
Updated: October 20, 2018 00:09 IST
 

To promote tourism, the city will host a three-day air show at Punnami ghat from November 23, said district Collector B. Lakshmikantham.

Addressing a meeting attended by officials of Tourism, Municipal, Police, Irrigation, Revenue and Roads and Buildings departments besides representatives of the Federation of Indian Chambers of Commerce and Industry (FICCI), in his camp office on Friday, the Collector said two important events were scheduled in November--the air show and F1h2O powerboat race on Krishna River.

Chief Minister N. Chandrababu Naidu would inaugurate the air show that is expected to attract nearly 1 lakh audience, he said, adding that officials of various departments would coordinate for its successful conduct. He said the R&B department should install strong barricades to regulate the crowd, the police wing should ensure bandobast and proper parking facility and the Municipal Corporation officials should arrange adequate drinking water facility and proper sanitation.

FICCI Joint Director Manoj Mehta said the air show would be held from 10.15 a.m to 10.45 a.m. and from 4.15 p.m. To 4.45 p.m on all three days.

Powerboat race

Mr. Lakshmikantham said a three-day F1h2O powerboat race would also be held from November 16 and 400 racers would take part in the event.

Earlier, presiding over a meeting of the Hospital Development Committee in the capacity of its chairman, Mr. Lakshmikantham said besides improved health services, focus should also be on extending facilities to patients visiting the hospital.

He said doctors should try to ensure speedy services and treat the patients in a respectful way. He also wanted the authorities to instal air conditioners in the outpatient wards and special wards and waiting rooms with all facilities.

He said the capacity of the Old Government Hospital had been increased by adding 30 additional beds and the new facility would be inaugurated on October 30.

Link to comment
Share on other sites

Panel discusses arrangements for F1h2O race

author-deafault.png Special Correspondent
VIJAYAWADA, October 21, 2018 00:01 IST
Updated: October 21, 2018 00:01 IST
Collector B. Lakshmikantham (centre) discussing with APTDC MG Himanshu Shukla (right) and Municipal Commissioner J. Nivas the route map for F1h2O powerboat race, in Vijayawada on Saturday.

Collector B. Lakshmikantham (centre) discussing with APTDC MG Himanshu Shukla (right) and Municipal Commissioner J. Nivas the route map for F1h2O powerboat race, in Vijayawada on Saturday.   | Photo Credit: HANDOUT_E_MAIL

 

Members identify spots to set up galleries for different sections

With the proposed F1h2O powerboat racing date drawing closer, members of the district-level coordination committee made their second visit to the Punnami Ghat to supervise arrangements for the event.

The international powerboat race is scheduled to be held on Krishna River for three days from November 16 and Chief Minister N. Chandrababu Naidu has constituted a committee to oversee large-scale arrangements that will have to be made to receive the large number of people expected to visit the place besides the international racers, the staff and crew.

Headed by District Collector B. Lakshmikantham, the committee members, comprising Municipal Commissioner J. Nivas, Managing Director of Andhra Pradesh Tourism Development Corporation (APTDC) Himanshu Shukla and others, visited the ghat and walked from K.L. Rao head water works along the riverbed, identified the exact spots to set up galleries for different sections.

They asked the contractor at the construction site of the flyover being built very close to the venue to remove the heaps of construction material from there.

Later, they held a meeting at the Berm Park conference hall. Later, addressing the media, the Collector said Mr. Naidu wanted to attract world’s attention to the event and so the arrangements had to be on a grand scale with the coordination of 30-odd departments.

He said this was the first international water sport event being hosted by the State and entire official machinery would get busy in making arrangements immediately after Dasara festivities.

Mr. Shukla said the Tourism Department was toying with the idea of acquiring private lands along the riverbed for future use. He said he would discuss the issue with Tourism Secretary Mukesh Kumar Meena and put it before Mr. Naidu.

Amaravati Global Musical Festival

He said in the evening hours, Amaravati Global Musical Festival will be held at the venue besides a craft exhibition by the Shilparamam.

Mr. Nivas said the ghats would be beautified and stretches along roads leading to the venue will also be groomed.

Link to comment
Share on other sites

ORGANISERS GEARING UP FOR GRAND PRIX OF AMARAVATI
F1H2O
 

Tuesday, 23 October: As next month’s UIM F1H2O Grand Prix of Amaravati [16-18 November] on the Krishna River in Vijayawada draws ever closer officials have confirmed that preparations on a massive scale are well underway.

 

Mr N Chandrababu Naido, Chief Minister of the Government of Andhra Pradesh said ‘he wants to attract the world’s attention to the event and so the arrangements had to be on a grand scale,” adding, ‘this is the first international water sport event being hosted by the state and the entire official machinery is busy making it happen.’

 

A district level coordination committee has been formed representing officials from 30 departments to ensure that the pre-event planning is on target and to oversee the large scale arrangements that have to be made to accommodate the large numbers of visitors that are expected at the event to ensure their safety and enjoyment.

 

One of the main attractions for the tens-of-thousands of spectators that are expected to line the banks of the Krishna River will be the boats of Jonas Andersson and Erik Edin running in the colours of Team Amaravati and backed by the Andhra Pradesh Tourism Development Corporation. In the team’s first outing in Amaravati colours Andersson finished on the podium in third place in BRM Qualifying and in fourth place in the Agile Grand Prix, Xiangyang.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...