Jump to content

జ‌న‌సేన వ్యూహకర్త : దేవ్‌… వాసుదేవ్‌ .. కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ ..!


Recommended Posts

  • Replies 137
  • Created
  • Last Reply
18 minutes ago, AnnaGaru said:

mottam whole episode edo EVV comedy cinema laga telchadu Kishan reddy gadu.......Nano car lo PK vadi intiki velli mottam plan cheste Dev...vasudev gadi debbaki chintalbasti lo bolta padindi...

 

 

 

Link to comment
Share on other sites

10 minutes ago, seenu454 said:

masters ekkadoo miss ayya evadu eedu?

జ‌న‌సేన వ్యూహకర్త : దేవ్‌… వాసుదేవ్‌ .. కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ ..!

May 2, 2018
 
 
 
 
Janasena-Party-1.jpg?resize=600%2C400&ss

జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా దేవ్ ని నియమిస్తూ నిన్న‌నే అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పరిచయం చేశారు. వైకాపాకి ప్ర‌శాంత్ కిషోర్ ఎంతో… జ‌న‌సేన‌కి ఈయ‌న అంతే అనే స్థాయి అన్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చారు. ఇక‌, దేవ్ మాట్లాడుతూ… త‌న‌కు తెలుగు స‌రిగా రాద‌నీ, కొంచెం కొంచెం వచ్చ‌ు అన‌ట్టుగా ఇంగ్లిష్ లో ప్ర‌సంగించారు. గ‌డ‌చిన ద‌శాబ్దకాలంలో తనకు కొన్ని జాతీయ, అంత‌ర్జాతీయ పార్టీల‌కు పని చేసిన అనుభ‌వం ఉంద‌న్నారు. ఎన్నిక‌లు, స‌ర్వేలు, వ్యూహాలు.. ఇలాంటి విష‌యాల్లో త‌న‌కు చాలా చాలా అనుభ‌వం ఉంద‌ని కూడా చెప్పుకున్నారు. త‌న‌కు ఉన్న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి… త‌న వ్యూహాలు, ఇన్ పుట్స్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌లూ సిద్ధాంతాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌న్నారు. అంద‌రం క‌లిసి జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామ‌ని చెప్పారు. అతనికి 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటికల్ స్త్రాటెజీస్ కంపెని ఉందని కూడా పవన్ చెప్పారు.

ఇదీ దేవ్ ఇంట్రొడ‌క్ష‌న్‌..! దీంతో ఈ దేవ్ ఎవ‌రూ..? ప్ర‌శాంత్ కిశోర్ స్థాయి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తా..? ఆయ‌న ఇంత‌కాలం సేవ‌లందించిన జాతీయ పార్టీలేవి, అంత‌ర్జాతీయ పార్టీలేవి..? త‌డ‌బ‌డుతూ తెలుగు మాట్లాడుతున్నారంటూ… ఇన్నాళ్లూ ఈయ‌న ఎక్క‌డున్న‌ట్టు, ఈయన పుట్టి పెరిగిందెక్కడ.. అనే విష‌యాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కానీ, అస‌లు విష‌యం ఏంటంటే… ఈ దేవ్ అస‌లు పేరు ఏమనగా.. వాసుదేవ్‌..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ, తెలంగాణ‌, మన పక్కా లోకల్! తెలుగులో మాట్లాడ‌టం భేషుగ్గా వ‌చ్చు. గ‌తంలో ఈయ‌న భారతీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారు. ఆ సంద‌ర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేవారు. ఈయ‌న తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌కి బంధువు.

 

సో.. ఇదండీ ఈయ‌న నేప‌థ్యం. మ‌రి, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాన‌నీ, స‌ర్వేలు చేయించాన‌నీ, ద‌శాబ్దకాలం అనుభ‌వం ఉంద‌నీ… జాతీయ పార్టీలేం ఖ‌ర్మ‌, అంత‌ర్జాతీయ పార్టీల‌తో ప‌నిచేసిన అనుభ‌వం తనదని ప‌రిచ‌యం చేసుకోవ‌డం విడ్డూరం..! ఇంకా విచిత్రం ఏంటంటే… చ‌క్క‌టి తెలంగాణ మాండ‌లికంలో మాట్లాడ‌టం వ‌చ్చి కూడా త‌న‌కు తెలుగు పెద్ద‌గా రాద‌ని చెప్పుకోవ‌డం!

టీవీ చ‌ర్చ‌ల్లో అప్పుడ‌ప్పుడూ పాల్గొనే ఒక సాధార‌ణ స్థాయి కార్య‌క‌ర్త‌ను తీసుకొచ్చి… వ్యూహ‌క‌ర్త అని ప‌వ‌న్ ప‌రిచ‌యం చేయ‌డం ఏమ‌నుకోవాలో అర్థం కావ‌డం లేదు. త‌న గురించి భారీ బిల్డ‌ప్పులు ఇచ్చుకుంటూ ప‌వ‌న్ ని ఆయ‌నే బుట్ట‌లో ప‌డేశారా, లేదా దేవ్ నియాక‌మం వెన‌క కూడా భాజ‌పా క‌నెక్ష‌న్ ఉందా..?

Link to comment
Share on other sites

దేవ్  .....వాసుదేవ్   !  

అద్దె తుపాకివి -  అయినా తెలుసుకోవాలి !   మహాత్ముల పేరు చెప్పావు  !    ఆత్మను అమ్ముకోకు, జీవనోపాధికి అబద్ధాన్నిప్రచారం చెయ్యకు.

పంజాబ్ తో పాటు ఆర్యావర్తం అంతా వేళ్లూనుకున్న బానిస, మూఢ  విజాత నిరంకుశ  భావజాలాల్ని ఖండిస్తా అడుగడుగునా  మతదురహంకారాన్ని అధిగమిస్తా  అనేక విష ప్రయోగాల్ని తట్టుకొంటా  ప్రాణాల్ని లెక్క చెయ్యని ఆర్య సమాజ స్థాపకుడు, స్వాతంత్ర సమర బీజ ప్రదాత, ఆధ్యాత్మిక కృషీవలుడు - స్వామి దయానంద సరస్వతి.....

ఆ కర్మయోగి  ప్రవచనంలోని ముఖమైన మూల సిద్ధాంతం వేదప్రవోక్తం, స్వయం ప్రకాశక సత్యం మీద మరింత వెలుతురు వేసేదే  - సత్యాన్ని సర్వవేళలా స్వీకరించు , అది  కానిదాన్ని త్యజించు

Link to comment
Share on other sites

5 minutes ago, Sr Fan said:

దేవ్  .....వాసుదేవ్   !  

అద్దె తుపాకివి -  అయినా తెలుసుకోవాలి !   మహాత్ముల పేరు చెప్పావు  !    ఆత్మను అమ్ముకోకు, జీవనోపాధికి అబద్ధాన్నిప్రచారం చెయ్యకు.

పంజాబ్ తో పాటు ఆర్యావర్తం అంతా వేళ్లూనుకున్న బానిస, మూఢ  విజాత నిరంకుశ  భావజాలాల్ని ఖండిస్తా అడుగడుగునా  మతదురహంకారాన్ని అధిగమిస్తా  అనేక విష ప్రయోగాల్ని తట్టుకొంటా  ప్రాణాల్ని లెక్క చెయ్యని ఆర్య సమాజ స్థాపకుడు, స్వాతంత్ర సమర బీజ ప్రదాత, ఆధ్యాత్మిక కృషీవలుడు - స్వామి దయానంద సరస్వతి.....

ఆ కర్మయోగి  ప్రవచనంలోని ముఖమైన మూల సిద్ధాంతం వేదప్రవోక్తం, స్వయం ప్రకాశక సత్యం మీద మరింత వెలుతురు వేసేదే  - సత్యాన్ని సర్వవేళలా స్వీకరించు , అది  కానిదాన్ని త్యజించు

అద్దె mike sridar

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...