Jump to content

Amaravati Outer Ring Road


sonykongara

Recommended Posts

రెండ్రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సిద్ధం చేయండి: చంద్రబాబు
 
636173353951655105.jpg
విజయవాడ: సీఆర్‌డీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి మండలిలో చర్చించి తుది ప్రణాళికి రూపొందిస్తే కేంద్రానికి డీపీఆర్ పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టణాలు, హైవేలను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మిస్తే శాటిలైట్ టౌన్ షిప్‌లు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 35 లక్షల వరకు జనాభా.. ఇది 1995లో హైదరాబాద్ జనాభా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజధాని పరిధిలోని నగరాలు, పట్టణాలకు 30 లేదా 45 నిమినిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ ఉంటుందని సీఎం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి నిర్మించే అంతర్గత రహదారులు మలుపులు లేకుండా నేరుగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
 
రాజధానిలో నవ నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని అంతర్జాతీయ సంస్థలను కోరాలని సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో.. పట్టణాల సంధానం
 
  • అమరావతిపై సమీక్షలో చంద్రబాబు 
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం జరిగిన సీఆర్‌డీఏ సమావేశం ప్రధానంగా రహదారులపైనే సాగింది. అమరావతి నిర్మాణంతో పాటు చుట్టూ ఉన్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటి నుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యాలయాలు, కళాశాలలు, ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు ముందుగా వస్తే నగరాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. కాగా,అమరావతి రాజధానికి 98 కి.మీల ఇన్నర్‌, 186 కి.మీ ఔటర్‌ రింగురోడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం అనుమతించారని మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. రింగ్‌ రోడ్డు కోసం 166 కి.మీ, 186 కి.మీ, 210 కి.మీల పొడవైన మార్గాలు మూడు ప్రతిపాదనలు వచ్చాయని, గుంటూరు నగరాన్ని కలుపుతూ పోయే 186 కి.మీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పారని అన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి 186 కీ.మీ ఔటర్ రింగ్ రోడ్డు

 

 

 

 

సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ వున్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్) నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో వుంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు ఉండాలని చెప్పారు.

బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా అంతర్, బాహ్య వలయ రహదారులపైనే సాగింది. ఈ రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ 3 ఆప్షన్లను ముఖ్యమంత్రి ముందు వుంచారు. వాటిపై కూలంకుశంగా చర్చించిన ముఖ్యమంత్రి అంతిమంగా రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను కలిపేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం ఉండాలని, రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.

తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా వుండేలా ప్రజారాజధానిలో బాహ్య వలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బాహ్యవలయ రహదారి నిర్మాణం జరిగితే చుట్టూ వున్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది అవన్నీ కాలగమనంలో రాజధాని నగరంలో కలిసిపోతాయని వివరించారు. రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌనషిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. బాహ్యవలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. బాహ్య వలయ రహదారి లోపల ప్రస్తుతం వుండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు వుంటుందని, ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని గుర్తుచేశారు.

 

రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతర్ వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ వున్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటినుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు.

రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబరు నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్లా ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాలయాల కోసం టెండర్లు పిలవగా పేరొందిన సంస్థలు ఆ ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు. ప్రపంచంలో పేరొందిన మొదటి 10 అక్రిడేటెడ్ విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతిలో వారు తమ శాఖలను నెలకొల్పుకునేలా అన్ని అవకాశాలను కల్పిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని అన్నారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మారియట్, లీలా గ్రూపు వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. షెట్టీ గ్రూపు, అమృత, విట్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వచ్చాయని అధికారులు వివరించారు. రాజధానిలో జస్టిస్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై ఇక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలతో మాట్లాడాలని కోరారు. రానున్న కొద్ది కాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధంచేయాలన్నారు. ప్రతి మాసం ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా అమరావతిని నిత్యం వార్తలలో నిలపాలని అన్నారు.

Link to comment
Share on other sites

include emundi brother, better infact, yellow is closer to Tenali than Blue. Town most likely will expand towards mangalagiri/nara koduru i mean towards capital. for that side expansion ORR along Yellow line comes in handy.

Tenali antha dooram pola ..inka angala kuduru ye kalavala ..pedravuru ki 4 lane padindi adhi kalavala ...let see
Link to comment
Share on other sites

86 కి.మీ. బాహ్యవలయ రహదారి

ముఖ్యమంత్రి సూత్రప్రాయ ఆమోదం

నేడు మంత్రివర్గంలో చర్చ

ఈనాడు - అమరావతి

014ap-main5a.jpg

రాజధాని అమరావతి చుట్టూ సీఆర్‌డీఏ పరిధిలో 186 కి.మీ. పొడవైన బాహ్య వలయ రహదారిని (ఓఆర్‌ఆర్‌) నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఓఆర్‌ఆర్‌కి సంబంధించి 166 కి.మీ., 186 కి.మీ., 210 కి.మీ.లతో మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 186 కి.మీ. ప్రతిపాదనవైపు మొగ్గు చూపినట్టు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సీఆర్‌డీఏపై వారాంతపు సమీక్ష జరిగింది. అనంతరం మంత్రి నారాయణ విలేఖరులతో మాట్లాడారు. రాజధాని చుట్టూ అంతర్‌ వలయ రహదారిని (ఐఆర్‌ఆర్‌) 98 కి.మీ. మేర నిర్మించనున్నట్టు చెప్పారు. ఓఆర్‌ఆర్‌ని 186 కి.మీ. మేర నిర్మిస్తే గుంటూరు వంటి నగరాలు కూడా దీని పరిధిలోకి వస్తాయన్నారు. దీనిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయడానికి 3నుంచి 5 నెలల సమయం పడుతుందన్నారు. ఓఆర్‌ఆర్‌ని జాతీయ రహదారుల సంస్థ చేపడుతుందని, భూమి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు.

014ap-main5b.jpg పట్టణాలు, జాతీయ రహదారుల్ని అనుసంధానించాలి

రాజధాని ప్రాంత (సీఆర్‌డీఏ) పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఓఆర్‌ఆర్‌ లోపల 30-35 లక్షల జనాభా ఉంటుందని, ఇది 1995లో హైదరాబాద్‌ జనాభాకి సమానమన్నారు. రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ ఉండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ నెలాఖరుకి భూసమీకరణ పూర్తి.. రాజధాని పరిధిలో భూసమీకరణ మొత్తం డిసెంబరు నెలాఖరుకి ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా మిగతా అన్ని చోట్లా స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. అంతర్జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు టెండర్లు పిలవగా పేరున్న సంస్థలు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలో పేరు గాంచిన 10 విద్యా సంస్థలతో సంప్రదింపులు జరుపుదామని, అమరావతిలో వారి శాఖలు ఏర్పాటు చేసేలా అవకాశం కల్పిద్దామని సీఎం సూచించారు. రాజధానిలో జస్టిస్‌ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. క్రీడానగరం ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో మాట్లాడాలన్నారు. సచివాలయం ప్రాంగణంలో శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తవడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని ముఖ్యమంత్రికి తెలిపారు. సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

6878 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు 
16-12-2016 01:36:33
636174489936512821.jpg
  • 5.49 లక్షల ఎకరాల పరిధిలో ఔటర్‌
  • 8 వరుసలకు సీఎం ఓకే
  • అమరావతి-గుంటూరు మధ్య పరిశ్రమల అభివృద్ధి
అమరావతి, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, 186 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్ల ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ రోడ్ల కోసం మూడేసి ప్రతిపాదనలను గురువారం శాఖాధిపతుల భేటీలో అధికారులు సమర్పించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు 97.5 కి.మీ, 92.5 కి.మీ, 81 కిలోమీటర్ల చొప్పున, ఔటర్‌కు 166, 186, 210 కి.మీ.లతో ప్రతిపాదనలు రూపొందించారు. రూ.6878 కోట్లు ఖర్చయ్యే 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ తో పాటు186 కి.మీల ఔటర్‌ రింగు రోడ్డుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
 
 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ 67.5 కిలోమీటర్లు కాగా.. ప్రతిపాదిత జాతీయ హైవే బైపాస్‌ 15 కిలోమీటర్లతోపాటు ఎన్‌హెచ్‌-65కు సంబంధించి 15 కి.మీ మెరుగుపరుస్తారు. కృష్ణా నదిపై తూర్పు వంతెన 2 కిలోమీటర్లు, పడమర వంతెన 2.5 కిలోమీటర్లు అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానం చేస్తూ బైపాస్‌ రోడ్డుగా రూపొందుతుంది. 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో హైదరాబాద్‌- చెన్నై రోడ్డులో 34 కిలోమీటర్లు, చెన్నై- విశాఖ 26.5 కిలోమీటర్లు, విశాఖ-హైదరాబాద్‌ 31 కిలోమీటర్లు కలుస్తాయి. హైదరాబాద్‌ చెన్నై రోడ్డుకు 585 ఎకరాలు, చెన్నై-విశాఖ రోడ్డుకు 490 ఎకరాలు, విశాఖ-హైదరాబాద్‌ రోడ్డు అభివృద్ధికి 178 ఎకరాల భూమి అవసరం. వీటి అభివృద్ధికి రూ.4,434 కోట్లు, భూసేకరణకు రూ.2,444 కోట్లతో మొత్తం రూ.6878 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇన్నర్‌ పరిధిలోకి 1,21,224 ఎకరాలు వస్తాయి. భవిష్యతలో మరో 46,224 ఎకరాలు కలిసే అవకాశముంది. దీని పరిధిలోకి కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, పెనమలూరు, నిడమానూరు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వస్తాయి. సుమారు 19 లక్షల జనాభాతో విజయవాడ, అమరావతి అభివృద్ధి జరుగుతుంది.
 
 
ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. 
విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 186 కిలోమీటర్లతో ఔటర్‌ నిర్మాణం చేపడతారు. హైదరాబాద్‌, విశాఖపట్నం బైపాస్‌ రోడ్లును అనుసంధానిస్తూ ప్రధాన రోడ్లను కలుపుతూ ఈ రోడ్డును నిర్మిస్తారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలికి దగ్గరగా ప్రధాన కార్యాచరణ కేంద్రాలు, గన్నవరం ఎయిర్‌పోర్టుకు మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. వీరపనేనిగూడెంలో ఏపీఐఐసీ పరిశ్రమల క్లస్టర్‌కు డైరెక్ట్‌ కనెక్ట్‌విటీని ఏర్పాటుచేస్తారు. అమరావతి- గుంటూరు మధ్యలో రోడ్డుకు ఇరువైపులా అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. 186 కిలోమీటర్ల పొడవైన ఈ ఎనిమిది వరుసల రోడ్డుకు రెండు పక్కలా సర్వీస్‌ రోడ్లు వస్తాయి. నదులు, రిజర్వాయర్లను మినహాయిస్తే 5,49,838 ఎకరాలు ఔటర్‌ పరిధిలోకి వస్తాయి. ఇన్నర్‌ రోడ్డుతోపాటు 4,00,614 ఎకరాల భూమి అభివృద్ధి జరుగుతుంది. ఔటర్‌ పరిధిలోకి కంచికచర్ల, అమరావతి, లింగాపురం, పాటిబండ్ల, మందపాడు, పేరేచర్ల, పుల్లటిగుంట, అనంతవరప్పాడు, వేజెండ్ల, నందివెలుగు, వల్లభాపురం, వల్లూరుపాలెం, నెప్పల్లి, వెల్దిపాడు, పెదఅవుటుపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, గిరిపల్లి, శోభనాపురం, కోడూరు, మైలవరం, గంగినేని గ్రామాలు వస్తాయి.
Link to comment
Share on other sites

అమరావతి చుట్టూ రెండు వలయాలే

ఒకటి అంతరంగా, మరొకటి బాహ్యంగా..రహదారులపై ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు - అమరావతి 15ap-main2b.jpg

*పొడవు 97.5 కి.మీ.లు

* కొత్తగా వేసే రోడ్డు పొడవు 67.5 కి.మీ.

*ప్రతి పాదిత జాతీయ రహదారి బైపాస్‌ 15 కి.మీ.

*65 నెం. జాతీయ రహదారి ఆధునికీకరణ 15 కి.మీ.

* కృష్ణా నదిపై తూర్పు బ్రిడ్జి: 2 కి.మీ., పశ్చిమ బ్రిడ్జి 2.5 కి.మీ.

* రహదారి నిర్మాణానికి 1253 ఎకరాలు అవసరం

*రహదారి వెడల్పు 75 మీటర్లు

*రహదారి నిర్మాణం, భూసేకరణకయ్యే మొత్తం ఖర్చు రూ.6878 కోట్లు

* నదీ, రక్షిత అటవీ ప్రాంతం మినహా ఐఆర్‌ఆర్‌ లోపల ఉండే మొత్తం ప్రాంతం 1,21,224 ఎకరాలు

*భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం 46,224 ఎకరాలు.

*ఐఆర్‌ఆర్‌ వెళ్లే మార్గంలో ఉండే ప్రధాన గ్రామాలు: కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, పెనమలూరు, నిడమానూరు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం

* ఐఆర్‌ఆర్‌ లోపల ప్రస్తుత జనాభా సుమారు 19 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ వలయ రహదారులను (రింగు రోడ్డులు) రెండింటికే పరిమితం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని చుట్టూ అంతర వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌), బాహ్య వలయ రహదారులనే (ఓఆర్‌ఆర్‌) నిర్మించాలని తాజాగా నిర్ణయించినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో వీటి గురించి ముఖ్యమంత్రి వివరించారు. 186 కి.మీ.లతో రూపొందించిన ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. మీ అభిప్రాయాలు, సూచనలు చెప్పండని ఆయన కోరారు. ముఖ్యమంత్రి బాగుందన్న ప్రతిపాదననే అందరూ ఆమోదించారు.ఐఆర్‌ఆర్‌ను మనమే నిర్మించుకోవాలని, ఓఆర్‌ఆర్‌ను నిర్మించు, నిర్వహించు, అప్పగించు విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని, దాన్ని భూసమీకరణ

విధానంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ సీఆర్‌డీఏ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు, అభివృద్ధి నడవాగా ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. రాజధాని పురోగతిపై అజయ్‌జైన్‌ వివరించిన తీరు బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. రెండు వలయ రహదారులకు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను మూడు నెలల్లో సిద్ధం చేస్తారు. కన్సల్టెంట్‌ల నియామకం ఇప్పటికే జరిగింది. ఐఆర్‌ఆర్‌కి స్టూప్‌, ఓఆర్‌ఆర్‌కి ఆర్వీ అసోసియేట్స్‌ సంస్థలు కన్సల్టెంట్‌లుగా వ్యవహరిస్తాయి. రాజధాని ప్రాంతంలో రవాణా నెట్‌వర్క్‌ వ్యూహ ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

15ap-main2c.jpg

రాజధాని ప్రాంతం పరిధిలో రవాణా నెట్‌వర్క్‌ ప్రణాళిక

రాజధాని ప్రాంత పరిధిలో రవాణా నెట్‌వర్క్‌ ప్రణాళిక సిద్ధమైంది. ఐఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌, జాతీయ రహదారులు వంటి ప్రధాన రహదారుల్ని ఎలా అనుసంధానం చేస్తారు. ప్రధాన ప్రాంతాలతో ఎలా కలుపుతారు అన్న విషయాన్ని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

రాజధాని ప్రాంత పరిధిలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, ప్రధాన పట్టణాలు

జగ్గయ్యపేట, నందిగామ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, పొన్నూరు, చల్లపల్లి, మచిలీపట్నం, పామర్రు, ఉయ్యూరు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌, ఏలూరు, నూజివీడు, ఎ.కొండూరు గ్రోత్‌ సెంటర్లు: కంచికచర్ల, అమరావతి (పాత), పేరేచర్ల, వేజెండ్ల, నందివెలుగు, నేపల్లె, పెదఅవుటుప్లి, ఆగిరిపల్లి, మైలవరం. ఇవన్నీ అవుటర్‌ రింగురోడ్డుపై ఉంటాయి.అర్బన్‌ నోడ్స్‌: గుంటుపల్లి, పెదపరిమి, పెదకాకాని, పెదవడ్లపూడి, గన్నవరం, నున్న.

15ap-main2a.jpg * పొడవు 186 కి.మీ.

* వెడల్పు 120-150 మీటర్లు

* 8 వరుసలు, రెండు వరుసల సర్వీసు రోడ్డు

* కృష్ణా నదిపై బ్రిడ్జిలు. తూర్పు బ్రిడ్జి: 4.5 కి.మీ, పశ్చిమ బ్రిడ్జి: 3.5 కి.మీ.

* నది, రక్షిత అటవీ ప్రాంతం మినహా ఓఆర్‌ఆర్‌ లోపల ఉండే ప్రాంతం విస్తీర్ణం 5,49,838 ఎకరాలు.

* ఓఆర్‌ఆర్‌ మార్గంలో ప్రధాన గ్రామాలు: కంచికచర్ల, అమరావతి, లింగాపురం, పాటిబండ్ల, మందపాడు, పేరేచర్ల, పుల్లడిగుంట, అనంతవరప్పాడు, వేజెండ్ల, నందివెలుగు, వల్లభాపురం, వల్లూరుపాలెం, నేపల్లె, వెత్తిపాడు, పెద అవుటపల్లి, చొప్పెరమెట్ల, నర్సింగపాలెం, ఆగిరిపల్లి, శోభనాపురం, కోడూరు, మైలవరం, గంగినేని

* ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌కి లోపల ఉన్న జనాభా సుమారు 35 లక్షలు

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ రింగు రోడ్లను రెండింటికే పరిమితం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లను నిర్మించాలని తాజాగా నిర్ణయించినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో వీటి గురించి ముఖ్యమంత్రి వివరించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు 97.5 కి.మీ.లు ఉంటుంది. దీనిలో కొత్తగా వేసే రోడ్డు పొడవు 67.5 కి.మీ.లు. ఇందులో భాగంగా కృష్ణా నదిపై తూర్పున 2 కి.మీ.ల బ్రిడ్జి, పశ్చిమాన 2.5 కి.మీ.ల బ్రిడ్జిలు వస్తాయి. రహదారి వెడల్పు 75 మీటర్లు ఉంటుంది. కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, పెనమలూరు, నిడమానూరు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం గ్రామాల గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పోతుంది. దీనిని రాష్ట్రప్రభుత్వమే నిర్మిస్తుంది.

ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 186 కి.మీ.లు, వెడల్పు 120-150 మీటర్లు ఉంటుంది. 8 వరుసల ఈ రోడ్డులో రెండు వరుసల సర్వీసు రోడ్డు ఉంటుంది. దీని కోసం కృష్ణా నదిపై తూర్పున 4.5 కి.మీ.ల బ్రిడ్జి, పశ్చిమాన 3.5 కి.మీ.ల బ్రిడ్జి నిర్మిస్తారు. ఓఆర్‌ఆర్‌ మార్గంలో కంచికచర్ల, అమరావతి, లింగాపురం, పాటిబండ్ల, మందపాడు, పేరేచర్ల, పుల్లడిగుంట, అనంతవరప్పాడు, వేజెండ్ల, నందివెలుగు, వల్లభాపురం, వల్లూరుపాలెం, నేపల్లె, వెత్తిపాడు, పెద అవుటపల్లి, చొప్పెరమెట్ల, నర్సింగపాలెం, ఆగిరిపల్లి, శోభనాపురం, కోడూరు, మైలవరం, గంగినేని గ్రామాలు ప్రధానంగా ఉంటాయి. ఓఆర్‌ఆర్‌ ను నిర్మించు, నిర్వహించు, అప్పగించు విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది.

Link to comment
Share on other sites

రహదారులకు రంగం సిద్ధం!

రాజధానిలో నిర్మాణానికి ప్రణాళిక

కృష్ణా నదిపై ఐదు భారీ వంతెనలు

నాలుగేళ్లలో అన్నీ పూర్తి చేయాలని లక్ష్యం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో కీలకమైన రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అంతర, బాహ్య వలయ రహదారులు, విజయవాడ బైపాస్‌, కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి నుంచి రాజధాని కేంద్ర ప్రాంతాన్ని కలిపే సీడ్‌ యాక్సెస్‌ రహదారుల నిర్మాణం రాబోయే మూడు, నాలుగేళ్లలో పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రచిస్తున్నాయి. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ రహదారి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భూసేకరణ సమస్య తొలగితేే ఇందులో అంతర్భాగమైన భారీ వంతెన పనులూ ఆరంభమవుతాయి. ఇది ఏడాదిలోగా పూర్తవుతుంది. విజయవాడ బాహ్యవలయ రహదారి పనులు కొద్దివారాల వ్యవధిలో పునఃప్రారంభం కానున్నాయి. దీనికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. భూసేకరణ, రిజర్వ్‌ ఫారెస్ట్‌ సమస్యలు తొలగితే వలయ రహదారుల పనులు ప్రారంభించటానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. అంతర్‌ వలయ రహదారిని 2018 నాటికి, బాహ్యవలయ రహదారిని 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణా నదిపై మొత్తంగా ఐదు చోట్ల భారీ వంతెనలు రానున్నాయి. వీటికే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇవన్నీ పూర్తయితే... అంతర్జాతీయ స్థాయి నగరానికి ఉండాల్సిన హంగులన్నీ సమకూరతాయి.

అంతర వలయ రహదారి(ఐఆర్‌ఆర్‌): సుమారు 97.5కి.మీ. పొడవైనది. ఇది విజయవాడ, రాజధాని నగరాలకు బాహ్యవలయ (బైపాస్‌) రహదారిగా ఉపయోగపడుతుంది. దీనిని మూడు భాగాలుగా నిర్మిస్తారు. మొదటిది (34. కి.మీ)... విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్లే జాతీయరహదారిపై కాచవరం సమీపం నుంచి ప్రారంభమై రాజధాని నగర సరిహద్దులకు సమీపం నుంచి వెళుతూ విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లే జాతీయ రహదారిలో కాజా వద్ద ముగుస్తుంది. రెండోది (26.5 కి.మీ)... కాజా నుంచి ప్రారంభమై కనకదుర్గ వారధికి దిగువగా పెనమలూరు మీదుగా వెళ్లి నున్నకి ఎగువన గామన్‌ ఇండియా సంస్థ నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌ రహదారిలో ముగుస్తుంది. ఇది ముగిసే ప్రాంతంలో మూడో భాగం ప్రారంభమవుతుంది. గామన్‌ ఇండియా నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌నే 15కి.మీ. ఉపయోగించుకుంటారు. నున్న ఎగువ ప్రాంతం నుంచి గొల్లపూడి వరకు ఇది ఉంటుంది. తిరిగి గొల్లపూడి నుంచి ప్రస్తుతమున్న విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో కాచవరం వరకు ప్రస్తుతమున్న రహదారినే ఉపయోగించుకుంటారు. దీంతో మూడో భాగం ముగుస్తుంది. ఈ రెండు జాతీయ రహదారులను వాడుకునే మార్గం 37కి.మీ. ఉంటుంది. ఇందులో కొత్తగా నిర్మించాల్సిన రహదారి ఆంగ్ల అక్షరం ‘యు’ మాదిరిగా ఉంటుంది. గొల్లపూడి నుంచి కాచవరం వరకు రహదారి వెడల్పు చేయాలంటే దాదాపు 150 నివాసాల్ని తొలగించాల్సి రావచ్చు. ఇది పూర్తయితే రాజధాని నగరం నుంచి గన్నవరం విమానాశ్రయానికి నేరుగా వెళ్లొచ్చు.

బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌): గుంటూరు నగరం సైతం ఓఆర్‌ఆర్‌ లోపలే ఉండాలని భావించటంతో 186కి.మీ. పొడవున నిర్మించే ఈ రహదారి గుడ్డు ఆకారంలో రానుంది. సీఆర్‌డీఏ పరిధిలోని పట్టణ, నగర శివారు ప్రాంతాలు, ప్రత్యేకించి ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల మీదుగా ఇది వెళుతోంది. భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే... కేంద్రం నిర్మిస్తుంది. దీని నిర్మాణం పూర్తయితే ఒక్కగుంటూరు వైపు మినహా మిగిలిన అన్ని చోట్లా రెండువైపులా తక్షణమే పారిశ్రామికీకరణకు అవకాశముంటుందని అంచనా. దాదాపు 4.5లక్షల ఎకరాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. వీరపనేనిగూడెం వద్దనున్న ఏపీఐఐసీ పారిశ్రామిక సముదాయానికి నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. గన్నవరంతోపాటు మంగళగిరి సమీపంలో ప్రతిపాదిత విమానాశ్రయం సైతం ఓఆర్‌ఆర్‌ లోపలే ఉంటాయి. ప్రతిపాదిత సరుకు రవాణా కారిడార్‌కి కూడా ఇది కీలకమవుతుంది.

సుదీర్ఘ తర్జనభర్జన!

రాజధానికి అంతర, బాహ్య వలయ రహదారుల రూపకల్పన కోసం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, చెన్నై, బ్రసెల్స్‌, హౌస్టన్‌, మాస్కోలకున్న వలయ రహదారులను అధ్యయనం చేశారు. అంతర్జాతీయంగా పేరొందిన ప్రతి నగరానికి కనీసం రెండు నుంచి గరిష్ఠంగా ఐదు(బీజింగ్‌) వరకు వలయ రహదారులున్నాయి. చివరకు రెండు వలయాల్ని నిర్మించాలని భావించారు. వీటిల్లో కేంద్రం ఓఆర్‌ఆర్‌ ఎలాగుండాలన్న దానిపైనే చాలాకాలంగా తర్జనభర్జన జరిగింది.

Link to comment
Share on other sites

సౌందర్య, బుద్ధ, వైకుంఠ మాల
 
636180533435946071.jpg
  • విశాఖ, అమరావతి, తిరుపతి ఓఆర్‌ఆర్‌ పేర్లు
  • రాష్ట్రంలో 16 స్మార్ట్‌ సిటీలు
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సౌందర్యమాల, బుద్ధమాల, వైకుంఠమాల.. రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాల్లో నిర్మించనున్న ఔటర్‌ రింగు రోడ్ల(ఓఆర్‌ఆర్‌)కు పెట్టనున్న పేర్లు ఇవి. విశాఖ నగరం మధ్య నుంచి బీచ, భోగాపురం విమానాశ్రయం నుంచి తిరిగి నగరం వరకు ఔటర్‌ రింగు రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సౌందర్యమాల అని పేరు పెట్టాలని భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ నిర్మించనున్న ఓఆర్‌ఆర్‌కు బుద్ధమాల అని, తిరుపతి నగరం చుట్టూ నిర్మించనున్న ఓఆర్‌ఆర్‌కు వైకుంఠమాల అని పేరు పెట్టాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇంకా ఏమైనా మంచి పేర్లు ఉన్నా సూచించాలని కోరారు. పట్టణాభివృద్ధిపై సమావేశంలో చర్చ జరిగింది.
 
ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీస్‌ పథకం కింద ఎంపిక చేసిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతితోపాటు మొత్తం 14నగరాలు, నగర హోదా పొందిన రెండు పట్టణాలు కలిపి మొత్తం 16 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. 2022కి పీఎంఈవై పథకం కింద 14 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని, అయితే ఇప్పటివరకు కేవలం 4.98 లక్షల మంది లబ్ధిదారులనే గుర్తించారని సీఎం వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 29 శాతం ఉన్న పట్టణ జనాభా 50 శాతానికి పెరగాలన్నారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఒక గది, రెండు గదుల ఇళ్లకు కావాల్సిన నిధులకు ఇబ్బంది లేదని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం డెవలపర్లను కూడా ఎంపిక చేయాలని ఆదేశించారు.
 
9colle2.jpg 
Link to comment
Share on other sites

  • 1 month later...
అమరావతి ఔటర్‌కు 20 వేల కోట్లు
 
విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.20 వేల కోట్లు మంజూరు చేశారని మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏకి సంబంధించి మొత్తం 62 ఒప్పందాలు చేసుకున్నామని, విలువ రూ.1,24,523 కోట్లు ఉంటుందని తెలిపారు. అనంతపురం, అమరావతి మధ్య మూడు వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే రూ.75 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.
Link to comment
Share on other sites

 

అమరావతి ఔటర్‌కు 20 వేల కోట్లు

 

విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.20 వేల కోట్లు మంజూరు చేశారని మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏకి సంబంధించి మొత్తం 62 ఒప్పందాలు చేసుకున్నామని, విలువ రూ.1,24,523 కోట్లు ఉంటుందని తెలిపారు. అనంతపురం, అమరావతి మధ్య మూడు వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే రూ.75 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.

 

good 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఓఆర్‌ఆర్‌కు కొత్త అలైన్‌మెంట్‌

అమరావతి బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)కి సంబంధించి జలాశయాలు, భవన నిర్మాణాలను తప్పించి రూపొందించిన అలైన్‌మెంట్‌ను సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ సమావేశంలో సీఎంకు వివరించారు. ఇంతకుముందు రూపొందించిన అలైన్‌మెంట్‌లో రహదారి 195 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు 197.5 కిలోమీటర్లకు పెరిగింది. ఈ రహదారిని ప్రస్త్తుతం ఆరు వరుసలతో నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో ఎనిమిది వరుసల మార్గంగా మార్చనున్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
కంచికచర్లలో ఔటర్ కలకలం
 
636261958646976801.jpg
(కంచికచర్ల) : గ్రామంలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) కలకలం ప్రారంభమైంది. కంచికచర్ల, వీరులపాడు మండలాల మీదుగా వెళుతున్న అవుటర్‌ రింగ్‌ రోడ్డు కోసం కొద్ది రోజుల నుంచి సర్వే రాళ్లు వేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన రైతులు, ఓఆర్‌ఆర్‌ గురించి చర్చించుకుంటున్నారు.
 
హైదరాబాదు తరహాలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడ చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న సంగతి విదితమే. ఐదు వందల అడుగుల వెడల్పుతో ఎనిమిది వరుసల రోడ్డు నిర్మించాలన్న పట్టుదలతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ రోడ్డుకు అనుసంధానంగా రెండు వైపులా సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్‌ఆర్‌ గురించి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు పంపగానే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది.
 
ఓఆర్‌ఆర్‌ ప్లాన్‌లో స్వల్ప మార్పు
గత ఏడాది ఇచ్చిన ఓఆర్‌ఆర్‌ ప్లాన్‌లో కొద్దిగా మార్పు చేసినట్టుగా తెలిసింది. అమరావతి మండలం లింగాపురం, ధరణికోట మీదుగా వచ్చే అవుటర్‌ రింగ్‌ రోడ్డు కృష్ణానది మీదుగా మున్నలూరు సాగునీటి ఎత్తిపోతల పథకానికి సమీపంలో (కునికినపాడు వైపు) కంచికచర్ల మండలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మోగులూరు, కంచికచర్ల, వీరులపాడు మండలం పొన్నవరం, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, జుజ్జూరు, తిమ్మాపురం మీదుగా దుగ్గిరాలపాడు- గంగినేనిపాలెం గ్రామాల మధ్య జి.కొండూరు మండలంలోకి ప్రవేశిస్తుంది. మున్నలూరు కాల్వ కట్టకు దిగువ భాగం, మోగులూరు రోడ్డు వద్ద ఖాళీగా ఉన్న నివేశన స్థలాల్లో సర్వే రాళ్లు వేశారు. మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు, దేవినేని రమణ ఘాట్‌కు దిగువ భాగంలో రాళ్లు వేశారు. పేరకలపాడు, పొన్నవరం గ్రామాలకు తూర్పు వైపు పంట భూముల్లో అధికారులు వేసిన రాళ్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి సర్వే రాళ్లు వేస్తున్నారు. మున్నలూరు, మోగులూరు గ్రామాలు అవుటర్‌కు బయట ఉంటున్నాయి. వీరులపాడు మండలంలో నరసింహారావు పాలెం గ్రామం మాత్రమే అవుటర్‌ రింగు రోడ్డు లోపల ఉంటోంది. పేరకలపాడు, జగన్నాధపురం, జుజ్జూరు, అల్లూరు, పెద్దాపురం, చెన్నారావుపాలెం తిమ్మాపురం గ్రామాలు అవుటర్‌ రింగు రోడ్డు బయట ఉంటున్నాయి.
 
రైతుల్లో ఆందోళన
అవుటర్‌ కోసం పొలాల్లో సర్వే రాళ్లు వేస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పొలాలకు వెళ్లి సర్వే రాళ్లు చూస్తున్నారు. రెండు రోజుల నుంచి రైతులు అవుటర్‌ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పెద్దగా సాగు నీటి సదుపాయం లేకపోయినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విలువైన భూములు కోల్పోవాల్సి రావటంతో రైతుల్లో భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. అవుటర్‌ కోసం కావల్సిన భూమిని రాజధాని కోసం తీసుకున్నట్టుగా ల్యాండ్‌ పూలింగ్‌ విధానం ద్వారా తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇంతకు ముందే ప్రకటించారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకుంటే స్థలాలు ఎక్కడ ఇస్తారు? నష్టపరిహారం ఎంత వస్తుంది? ఇక ఏం చేయాలి? అనే అంశాలపై రైతులు తర్జనభర్జన పడుతున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...