Jump to content

Recommended Posts

  • 2 weeks later...
Posted

Amaravati: అమరావతికి ఐఆర్‌ఆర్‌ కూడా..!

రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రప్రభుత్వం... అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

Updated : 31 Jul 2024 06:47 IST
 
చురుగ్గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
విజయవాడ తూర్పు బైపాస్‌కు 20 కి.మీ. ఎడంగా ఎలైన్‌మెంట్‌?
ఈనాడు - అమరావతి

ap300724main4a.jpg

రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రప్రభుత్వం... అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులు, ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దానిలో భాగంగా ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదననూ తెరపైకి తెచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌కి ఎడంగా, కనీసం 20 కి.మీ. దూరం నుంచి ఐఆర్‌ఆర్‌ వెళ్లేలా ఎలైన్‌మెంట్‌ సిద్ధం చేయనుంది. దీనికి భూమిని భూసమీకరణ విధానంలో తీసుకోవాలని యోచిస్తోంది. గతంలో తెదేపా హయాంలో సుమారు 180 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)తో పాటు, సుమారు 97.5 కి.మీ. పొడవైన అమరావతి ఐఆర్‌ఆర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ.. తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్‌ఆర్‌ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో పాటు, ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదనల్ని పూర్తిగా అటకెక్కించింది. ఇప్పుడు విజయవాడ పశ్చిమ బైపాస్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం, తూర్పు బైపాస్‌ కూడా నిర్మిస్తే అది ఒక రింగ్‌రోడ్డులా ఏర్పడుతుంది కాబట్టి.. ప్రస్తుతానికి అమరావతికి ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదన పక్కన పెట్టాలని రాష్ట్రప్రభుత్వం మొదట అనుకుంది. కానీ రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి... మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఐఆర్‌ఆర్‌ కూడా అవసరమేనని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

గతంలో మూడు ప్రతిపాదనలు

అమరావతి, విజయవాడ చుట్టూ  8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీస్‌ రోడ్డుతో ఐఆర్‌ఆర్‌ నిర్మాణానికి గతంలో మూడు   ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు.   2.5 మీటర్ల వెడల్పుతో సైకిల్‌ ట్రాక్, మరో 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ కూడా ప్రతిపాదించారు. అప్పట్లో రూపొందించిన మూడు ప్రతిపాదనలు..

ప్రతిపాదన 1:

ఐఆర్‌ఆర్‌ పొడవు 94.5 కి.మీ.

అవసరమైన భూమి: 1,165 ఎకరాలు; 

నిర్మాణ వ్యయం: రూ.5,918 కోట్లు

ప్రతిపాదన 2: 

పొడవు 97.5 కి.మీ. 

అవసరమైన భూమి: 1,253 ఎకరాలు 

నిర్మాణ వ్యయం: రూ.6,878 కోట్లు

ప్రతిపాదన 3: 

పొడవు 81 కి.మీ. 

అవసరమైన భూమి: 785 ఎకరాలు 

నిర్మాణ వ్యయం: రూ.4,698 కోట్లు

* వీటిలో రెండో ప్రతిపాదనను అప్పట్లో దాదాపు ఖరారుచేశారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2లుగా విభజించి అంచనాలు రూపొందించారు. వాటిలో ఫేజ్‌-2 ప్రాజెక్టు కొంత దూరం కొత్తూరు, కొండపల్లి రిజర్వు అడవి మీదుగా వెళుతుంది. ఒకచోట 8 కి.మీ.ల మేర సొరంగం నిర్మించాలి.

అభివృద్ధికి ఆలంబన 

  • అమరావతితో పాటు, చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు, రాజధానికి మెరుగైన రోడ్డు అనుసంధానానికి ఐఆర్‌ఆర్‌ కీలకం.
  • ఐఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీ బాగా తగ్గుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది. 
  • ఐఆర్‌ఆర్‌ నిర్మాణంతో మెరుగైన అనుసంధానంతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
  • సుమారు 45వేల ఎకరాల భూమి అభివృద్ధికి ఓపెన్‌ అవుతుందని అంచనా.
  • ఐఆర్‌ఆర్‌కి వెలుపల కూడా కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది.
  • ఐఆర్‌ఆర్‌ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించే రహదారులకు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రత్యేక గ్రోత్‌ కారిడార్లుగా అభివృద్ధి చెందుతాయి.
  • సమీకరణ విధానంలో భూమిని తీసుకుంటే.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో భూసేకరణ భారం తగ్గుతుంది.

  • 2 months later...
Posted

Vja West bypass almost completion stage 

Vja East bypass work to be started 

Amaravati ORR under project study and approval 

Where is the scope for Amaravati IRR ??

Am I missing something??

Posted
7 hours ago, Nfan from 1982 said:

Vja West bypass almost completion stage 

Vja East bypass work to be started 

Amaravati ORR under project study and approval 

Where is the scope for Amaravati IRR ??

Am I missing something??

Amaravati IRR ela cheyyalani chusthunaru State cheyyala leda ela ani state cheyyali ante land acquisition elaani, asalu mundu Amravati IRR ne chesethe bagundedi

Posted
3 hours ago, sonykongara said:

Amaravati IRR ela cheyyalani chusthunaru State cheyyala leda ela ani state cheyyali ante land acquisition elaani, asalu mundu Amravati IRR ne chesethe bagundedi

I am thinking that IRR is nothing but East and west bypasses combined 🧐

Posted
22 minutes ago, Nfan from 1982 said:

I am thinking that IRR is nothing but East and west bypasses combined 🧐

Nuvvu annattu ila cheste better. Otherwise waste of money Adi eppatiki complete avutundo. Land acquisition appudu janalu court ki vellaru ante Adi eppatiki avvadu

  • 3 weeks later...
Posted

రాష్ట్రంలో పెట్టుబడులపై అదానీ గ్రూప్‌ ముఖ్యమైన ప్రతిపాదనలు

రాజధాని ఇన్నర్‌రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు సిద్ధం. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌కు తగ్గట్టే ఐఆర్‌ఆర్‌ని ఫేజ్‌-1, ఫేజ్‌-2లుగా నిర్మించే ప్రతిపాదన. 

Posted (edited)

Adani group inner ring road ki contractor ga work chestunda? 
 
or IRR free ga chesi ports meda padatara 100 years lease ala with min fee 

Edited by srikanthnarne
Posted
18 hours ago, Bleed_Blue said:

@sonykongara....any update on ORR alignment bro?

Seems like bhashyam Praveen is asking for slight change to include pekurapadu and siripuram in the plan

vadlamanu village vallu matram 1750 acers land pooling scheme lo isthamu annaru anta, cbn kuda oka anndu anta MLA matladi 10 days lo ok chestharu antunnaru.

Posted
3 minutes ago, sonykongara said:

vadlamanu village vallu matram 1750 acers land pooling scheme lo isthamu annaru anta, cbn kuda oka anndu anta MLA matladi 10 days lo ok chestharu antunnaru.

okay...so any alignment change?

Posted

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌ డీపీఆర్‌ రూపకల్పన మొదలు

రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌- ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్ ఖరారుతో పాటు, సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) తయారీ పనులు మొదలయ్యాయి.

Updated : 04 Nov 2024 09:20 IST
 
ఓఆర్‌ఆర్‌లో కలిసే వివిధ రోడ్లపై సర్వేలు
ఏడాదిలో డీపీఆర్, భూసేకరణ పూర్తిచేయాలని లక్ష్యం

041124brk124198543a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌- ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్ ఖరారుతో పాటు, సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) తయారీ పనులు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో.. భూసేకరణ సహా ఖర్చంతా భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందులోభాగంగా తుది ఎలైన్‌మెంట్ ఖరారు చేయాలని, డీపీఆర్‌ సిద్ధం చేయాలంటూ ఇక్కడి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు ఆదేశాలొచ్చాయి. దీంతో ఇటీవలే సలహా సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి పనులు ఆరంభించారు. సర్వేలు పూర్తిచేసి ఏడాదిలో డీపీఆర్‌ రూపకల్పన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

డ్రోన్‌ వీడియోలతో పరిశీలన

మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్ను 2018లో రూపొందించారు. ఇప్పటికే ఆరేళ్లు కావడంతో.. ఎలైన్‌మెంట్ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్‌ వీడియోలు తీస్తున్నారు. పాత ఎలైన్‌మెంట్లోకి కొత్తగా ఏవైనా నిర్మాణాలు వచ్చాయా? రోడ్లు వేశారా? ఓఆర్‌ఆర్‌ మీదుగా హైటెన్షన్‌ విద్యుత్‌లైన్లు ఎన్ని ఉన్నాయనే వివరాలన్నీ డ్రోన్‌ వీడియోలతో పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తయ్యాక, రాష్ట్రప్రభుత్వంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చించి, తుది ఎలైన్‌మెంట్ను కేంద్రానికి పంపి, ఆమోదం తీసుకోనున్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తయితే దానిపై సగటున ఎన్ని వాహనాలు తిరుగుతాయనే అంచనాకు సర్వేలు చేస్తున్నారు. వివిధ జాయతీ రహదారులు, ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారుల్లో.. ప్రస్తుతమున్న ట్రాఫిక్‌ ఎంత? వాటిలో ఎన్ని వాహనాలు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్తాయనేది ట్రాఫిక్‌ కౌంట్‌ సర్వే చేస్తున్నారు.

  • హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, అనంతపురం.. తదితర మార్గాల వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ ప్రవేశించి, ఎంత దూరం వెళ్లి.. ఇతర మార్గాల్లోకి మళ్లే అవకాశాలు ఉన్నాయనేది కనుగొనేందుకు ఆరిజన్‌ అండ్‌ డెస్టినేషన్‌ సర్వే చేస్తున్నారు.
  • ఎన్ని యాక్సిల్స్, ఎంత లోడుతో వాహనాలు వెళ్తున్నాయి, వాటిలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లేవి ఎన్ననేదానిపై యాక్సిల్‌ లోడ్‌ సర్వే చేస్తున్నారు.

అనుమతులు, డీపీఆర్, భూసేకరణ ఒకేసారి..

ఎలైన్‌మెంట్ ఖరారు తర్వాత ఓ వైపు డీపీఆర్‌ సిద్ధమవుతూనే మరోవైపు భూసేకరణ, అన్ని అనుమతులు తీసుకోనున్నారు. ఓఆర్‌ఆర్‌పై రహదారులు దాటేచోట చేపట్టాల్సిన నిర్మాణాలు, కృష్ణానదిపై 2 భారీ వంతెనలు, రైల్వేక్రాసింగ్స్‌ వద్ద వంతెనలు, 2 సొరంగాలు, కాల్వలు, తదితర వివరాలన్నీ డీపీఆర్‌లో సిద్ధం చేయనున్నారు.

  • 189 కి.మీ. ఓఆర్‌ఆర్‌కు 5 జిల్లాల పరిధిలో దాదాపు 3వేల హెక్టార్ల భూసేకరణ చేయాలని అంచనా. ఏడాదిలో డీపీఆర్‌ సిద్ధమయ్యే నాటికి 90% భూసేకరణ పూర్తయితే, వెంటనే టెండర్లు పిలిచి, పనులు ఆరంభించేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
  • మరోవైపు ఓఆర్‌ఆర్‌ కొంతభాగం అటవీ ప్రాంతాల నుంచి వెళ్తుంది. దీనికి అటవీశాఖ అనుమతులు, ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కావడంతో పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. డీపీఆర్‌ పూర్తయ్యేలోపే ఈ అనుమతులు పొందడంపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు
Posted
1 hour ago, Bleed_Blue said:

okay...so any alignment change?

theliyadu bro

డ్రోన్‌ వీడియోలతో పరిశీలన

మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్ను 2018లో రూపొందించారు. ఇప్పటికే ఆరేళ్లు కావడంతో.. ఎలైన్‌మెంట్ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్‌ వీడియోలు తీస్తున్నారు. పాత ఎలైన్‌మెంట్లోకి కొత్తగా ఏవైనా నిర్మాణాలు వచ్చాయా? రోడ్లు వేశారా? ఓఆర్‌ఆర్‌ మీదుగా హైటెన్షన్‌ విద్యుత్‌లైన్లు ఎన్ని ఉన్నాయనే వివరాలన్నీ డ్రోన్‌ వీడియోలతో పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తయ్యాక, రాష్ట్రప్రభుత్వంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చించి, తుది ఎలైన్‌మెంట్ను కేంద్రానికి పంపి, ఆమోదం తీసుకోనున్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తయితే దానిపై సగటున ఎన్ని వాహనాలు తిరుగుతాయనే అంచనాకు సర్వేలు చేస్తున్నారు. వివిధ జాయతీ రహదారులు, ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారుల్లో.. ప్రస్తుతమున్న ట్రాఫిక్‌ ఎంత? వాటిలో ఎన్ని వాహనాలు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్తాయనేది ట్రాఫిక్‌ కౌంట్‌ సర్వే చేస్తున్నారు.

  • హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, అనంతపురం.. తదితర మార్గాల వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ ప్రవేశించి, ఎంత దూరం వెళ్లి.. ఇతర మార్గాల్లోకి మళ్లే అవకాశాలు ఉన్నాయనేది కనుగొనేందుకు ఆరిజన్‌ అండ్‌ డెస్టినేషన్‌ సర్వే చేస్తున్నారు.
  • ఎన్ని యాక్సిల్స్, ఎంత లోడుతో వాహనాలు వెళ్తున్నాయి, వాటిలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లేవి ఎన్ననేదానిపై యాక్సిల్‌ లోడ్‌ సర్వే చేస్తున్నారు.
Posted
27 minutes ago, sonykongara said:

got you, thanks bro.......siripuram garnepudi madhya polam kondam ani seeing but it is 4-5 kms from ORR.....siripuram ki right side current alignment going.......adi left side ki pedakurapadu side ki maare chances vunai ani kontha mandi telling anduke asked :)

Posted
1 hour ago, Bleed_Blue said:

got you, thanks bro.......siripuram garnepudi madhya polam kondam ani seeing but it is 4-5 kms from ORR.....siripuram ki right side current alignment going.......adi left side ki pedakurapadu side ki maare chances vunai ani kontha mandi telling anduke asked :)

try chesthanu bro

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...