niceguy Posted October 2, 2016 Posted October 2, 2016 CBN vi anni long term sanskhema padakaalu..vote bank ki use ayyevi kooda vunte better..
srinivasulu pokuri Posted October 2, 2016 Posted October 2, 2016 This scheme is very good... Will be huge success in future....
Kondepati Posted October 2, 2016 Posted October 2, 2016 if correctly implemented this will be one of the best schema to hit masses after arogyasri
minion Posted October 2, 2016 Posted October 2, 2016 This scheme is very good... Will be huge success in future.... any specifics on this scheme? what's covered or not etc. Would love to go to some in my village with some information ... not to mention enroll myself (well, I probably don't qualify) or my Mother.
minion Posted October 2, 2016 Posted October 2, 2016 CBN vi anni long term sanskhema padakaalu..vote bank ki use ayyevi kooda vunte better.. Atleast to me ... it's not always about electoral gains. But, I agree ... CBN and TDP need to watch how deep these policies are reaching.
Paruchuri Posted October 2, 2016 Posted October 2, 2016 Bpl/lower middle class vaallaku ntr vaidhya parishad,unskilled labour ki chandranna bhima Cbn Alane middle class vaalla meedha kuda oka eye este bagundu..ilane govt insurance companies tho collaborate ayyi health policies takkuvaki vachela cheste inka bagundu..
Husker Posted October 3, 2016 Posted October 3, 2016 any specifics on this scheme? what's covered or not etc. Would love to go to some in my village with some information ... not to mention enroll myself (well, I probably don't qualify) or my Mother. 15k per month or below income unna vallandiriki.. govt nunchi group insurance laga.. chanipothe family will get 5lacs.. injured ayithe somewhere aroud 3.6lacs.. natural death ki 30k rupees.. like life insurance policy for lower middle to poor ppl.. it covers almost half the population of around 2.5crs ppl Interesting thing is there is no heavy paperwork and proofs needed.. self declaration and some ID proof is enough to enroll..
aditya369 Posted October 3, 2016 Posted October 3, 2016 15k per month or below income unna vallandiriki.. govt nunchi group insurance laga.. chanipothe family will get 5lacs.. injured ayithe somewhere aroud 3.6lacs.. natural death ki 30k rupees.. like life insurance policy for lower middle to poor ppl.. it covers almost half the population of around 2.5crs ppl Interesting thing is there is no heavy paperwork and proofs needed.. self declaration and some ID proof is enough to enroll.. Farmers eligible aa?
Husker Posted October 3, 2016 Posted October 3, 2016 Farmers eligible aa?Pakkana inko thread lo video undi chudandi.. special ga ae work chesthunnarani emi undadhu anukuntunna.. elogible if ur income is below 15k per month.. agri landlords ayithe kastam anukunta.. agri labours eligible auvtharu..
Yaswanth526 Posted October 3, 2016 Posted October 3, 2016 https://www.youtube.com/watch?v=fKtoULdp2F4
Yaswanth526 Posted October 3, 2016 Posted October 3, 2016 https://www.youtube.com/watch?v=RvIZtpHzXwo
sonykongara Posted October 3, 2016 Author Posted October 3, 2016 2 కోట్ల కుటుంబాలకు బీమా ధీమా చంద్రన్న బీమాతో నా జన్మ సార్థకం పేదరికం లేని సమాజమే ధ్యేయం: సీఎం పేదల సంక్షేమానికి జీవితం అంకితం ఆపదలో ఆదుకోవడానికి నేనున్నా అసంఘటిత కార్మికుల కోసం బీమా పథకానికి బాబు శ్రీకారం 2 కోట్ల మంది అసంఘటిత కార్మిక కుటుంబాలకు భరోసా బీమా పథకం ప్రారంభ సభలో బాబు తిరుపతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘2003లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్ర్తాల సమర్పణకు తిరుమలకు వెళుతుంటే నాపై హత్యాయత్నం జరిగింది. పేదలకు ఏదో మంచి చేయాలనే ఆ దేవుడు నన్ను బతికించాడు. ఈ రోజు నా జన్మకు సార్థకత లభించింది. నా జీవితంలో ఇది చాలా పవిత్రమైన రోజు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది పేదల బతుకుకు భరోసా కల్పించిన రోజు. ఇందుకు గర్వపడుతున్నా. దేవుడి పాదాల చెంత నిలబడి చెబుతున్నా.. పేదరికం లేని సమాజ స్థాపనే నా జీవితాశయం. దేవుడు నాకిచ్చిన శక్తి, తెలివి అంతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఉపయోగిస్తా.. పేదరికం లేని సమాజాన్ని నిర్మించి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. కొంతమంది మహిళా కార్మికులకు బీమా కార్డులను అందజేశారు. అనంతరం ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారో ఆయన మాటల్లోనే... నా జీవితంలో పవిత్రమైన రోజు ‘నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది పేదలకు జీవితాలకు భద్రత కల్పించిన రోజు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని నమ్ముతున్నా. రోడ్డుపైకి వచ్చిన ఇంటి యజమాని ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేం. ప్రమాదంలో శాశ్వత వికలాంగులైనా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎన్నో కుటుంబాలను చూసి ఆలోచించగా పుట్టిందే ఈ చంద్రన్న బీమా పథకం. ఇక రాష్ట్రంలోని ఏ అసంఘటిత కార్మిక కుటుంబం భయపడాల్సిన పనిలేదు. మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ అన్నదమ్ముడిగా అండగా ఉంటాను. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి మూడు వారాల్లోపు ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుంది. శాశ్వత వైకల్యం మరణంతో సమానమే. అందుకే అలాంటి కుటుంబాలకు ఐదు లక్షల బీమా చెల్లిస్తాం. అంగవైకల్యం కలిగితే 3.60 లక్షలు, సహజ మరణం సంభవిస్తే 30వేల రూపాయలు అందజేస్తాం. చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేసుకున్న వారికి ఈ క్షణం నుంచే బీమా వర్తిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 155214 నంబర్‌కు డయల్ చేయండి. మీ వివరాలు చెప్పండి. తక్షణం సహాయక చర్యలు మొదలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి రెండు కోట్ల మంది చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేసుకున్నారు. ఇకపై చేసుకునే వారికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకంతో నా జన్మసార్థకమైందని భావిస్తున్నా.’ పేదరికం ఎంత దుర్భరమో ‘పేదరికం ఎంత దుర్భరమైందో, ఎంత భయంకరంగా ఉంటుందో నా అంత దగ్గరగా మరెవ్వరూ చూసి ఉండరు. నాలుగేళ్ల క్రితం 208 రోజులు 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. పల్లెలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారో చూశా. ఏ ఊరి రోడ్డు చూసినా మలమూత్రాలతో నిండిపోయి వాటిమధ్యనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. కటిక పేదరికం. అవన్నీ గమనించాక పాదయాత్రలోనే నిర్ణయించుకున్నా. ఈ జీవితం పేదల సంక్షేమానికే అంకితం చేయాలని. మీ బిడ్డలు చూడకపోయినా అండగా మీ బిడ్డగా నేనుంటానని హామీ ఇచ్చా. ఆ క్రమంలోనే వృద్ధాప్య పింఛను రూ.వెయ్యి, వితంతు పింఛను రూ.1500 చేశా. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడం కోసం దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తాడో, ఎంత తెలివి ఇస్తాడో అంతా ఖర్చు చేస్తా. ప్రతి వ్యక్తీ నెలకు పది వేల రూపాయలు సంపాదించుకోవాలి. ఇందుకు అవసరమైన వనరుల కల్పనకు పెద్దఎత్తున అన్వేషిస్తున్నా. రెండు ఆవులుంటే నెలకు పది వేలు సంపాదించుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి 50శాతం సబ్సిడీతో దాణా రైతుల ఇళ్లవద్దకే పంపిస్తా’ అన్నారు.సీఎం మానసపుత్రిక: అచ్చెన్న చంద్రన్న బీమా పథకం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మానసపుత్రిక అని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సగం జనాభాకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం ఎంతో మహోన్నతమైందన్నారు. ఈ పథకంతో చంద్రబాబు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. డ్రైవర్లను ఆదుకునేందుకు రెండేళ్ల క్రితం తొలుత ఈ పథకం ప్రారంభించామన్నారు. ఇప్పుడు అసంఘటిత రంగంలోని అన్ని వర్గాల కార్మికులకు బీమా వర్తింపచేసేందుకు ఏటా రూ.5 కోట్ల ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
sonykongara Posted June 3, 2017 Author Posted June 3, 2017 చంద్రన్న బీమాకు అదనపు ప్రీమియంఈనాడు, అమరావతి: చంద్రన్న బీమా కింద అదనపు ప్రీమియం కోసం రూ.8.73 కోట్లు మంజూరు చేస్తూ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తొలుత రెండు కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని అంచనా వేసి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించారు. ప్రజాసాధికార సర్వే తర్వాత దాదాపు అదనంగా 13.54 లక్షల మంది అదనంగా అసంఘటిత కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్మికులకు సంబంధించిన ప్రీమియం చెల్లించేందుకు అదనపు మొత్తం మంజూరు చేశారు.
sonykongara Posted June 3, 2017 Author Posted June 3, 2017 చంద్రన్న బీమా కొండంత ధీమా కృష్ణా, గుంటూరు జిల్లాలో 37,54,895 మంది దరఖాస్తు ఏడాది కాలంలో 10556 కుటుంబాలకు లబ్ధి జూన్, జులై మాసాల్లో నమోదు గుడివాడ పట్టణంలోని ధనియాలపేటకు చెందిన తాపీ కార్మికులైన వాకాడ అప్పలనాయుడు, కెల్లా దుర్గాప్రసాద్‌లు ఆదివారం పనిలేకపోవడంతో సరదాగా చేపల వేటకు వెళ్లారు. పెద ఎరుకపాడులోని 106 ఎకరాల తాగునీటి చెరువులో గాలం వేశారు. ప్రమాదవశాత్తు చెరువులోకి జారిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. గుడివాడ మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న బండి దుర్గాప్రసాద్, భూపతి ఏసులు ద్విచక్ర వాహనంపై ఏలూరు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. గుడివాడ, న్యూస్‌టుడే పట్టణానికి చెందిన ఉరిటి రాంకుమార్ తన పెళ్లి రేపనగా ఏర్పాట్లు స్వయంగా చేసుకునేందుకు బంటుమిల్లి రోడ్డులోని శాలివాహన కల్యాణ మండపానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వారి వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం లేకుండా చంద్రన్న బీమా పథకం ఆదుకుంది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున చంద్రన్న బీమాపథకం కింద లబ్ధి చేకూరింది. కృష్ణాజిల్లాలో 17,65,048 మంది, గుంటూరు జిల్లాలో 19,89,847 మంది అసంఘటిత కార్మికులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏడాది కాలంలో 10,556 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. పథకం ఎవరి కోసం అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు15న ప్రారంభించింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న అసంఘటిత రంగ కార్మికులు ఆధార్, బ్యాంక్‌ఖాతా, రేషన్‌కార్డుతోపాటు రూ. 15 చెల్లించి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతాలేని వారికి వాటిని సమకూర్చి బీమా పథకం కింద బీమా మిత్ర నమోదు చేస్తారు. బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కింద జూన్, జులై మాసాల్లో పేర్లు నమోదు చేస్తారు. ప్రయోజనాలు ఈ పథకం కింద నమోదై ప్రమాదంలో మరణించిన, పూర్తి అంగవైకల్యం పొందిన వారికి రూ. 5 లక్షలు బీమా కింద లభిస్తుంది. పాక్షిక అంగవైకల్యం అయితే రూ. 3,62,500 చొప్పున, సహజంగా మరణిస్తే రూ. 30 వేలు లభిస్తుంది. పథకం కింద నమోదైన అసంఘటిత రంగ కార్మికులకు ఇద్దరు పిల్లలు వరకు రూ. 1200 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. కృష్ణాలో 268 కుటుంబాలకు ప్రమాద బీమా జిల్లాలో ఇప్పటి వరకు 3714 క్లైమ్‌లు పరిష్కరించామని, వాటిలో 268 ప్రమాద బీమా అని చంద్రన్న బీమా ఏపీఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షలు చొప్పున, పాక్షిక అంగవైకల్యం పొందిన వారికి రూ. 3,62,500 చొప్పున చెల్లించినట్లు ఆయన వివరించారు. 3446 మంది సహజంగా మరణించడంతో వారి కుటుంబాలకు రూ. 30 వేల చొప్పున చెల్లించామన్నారు.
Naren_EGDT Posted June 3, 2017 Posted June 3, 2017 Super, CBN :terrific: Chandranna Beema ... Peda prajala dheema
niceguy Posted June 3, 2017 Posted June 3, 2017 Remium penchochuga ...so that ekkuva people benefit ayyettu..
sonykongara Posted June 3, 2017 Author Posted June 3, 2017 Remium penchochuga ...so that ekkuva people benefit ayyettu..
niceguy Posted June 3, 2017 Posted June 3, 2017 Ee news channels and papers meeda depend avvatam kanna..every town lo major centers lo Hoardings pedithe baaga reach avuthundhi..
minion Posted June 3, 2017 Posted June 3, 2017 Ee news channels and papers meeda depend avvatam kanna..every town lo major centers lo Hoardings pedithe baaga reach avuthundhi.. All these tv channels and 'news' papers (not just sakshi) are obviously operating with blatant agenda to undermine everything TDP does (except may be AJ). I'm sure CBN/TDP knows this. Lower level leaders (constituency level, mla) need to take active part in taking these programs further. CBN anni chusukoledu.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now