Jump to content

Recommended Posts

Posted
కన్నపేగు కాదనుకుంటే.. ‘చంద్రన్న’ ఆదుకున్నాడు..!
24-05-2018 09:49:18
 
636627521606770727.jpg
పాయకరావుపేట, విశాఖ: అవును... మీరు చదివింది నిజమే. మానవత్వం వద్దన్నా... చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లు సత్యనారాయణ (గోకవరం సత్తిబాబు). పాయకరావుపేట పంచాయతీకి చెందిన ఈయన లారీ డ్రైవర్‌. శరీరంలో ఓపిక ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని భార్యా పిల్లలను పోషించాడు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డాడు. తన భార్య ఉన్నంతవరకు ఆయన బాగోగులు చూసుకునేది. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు పట్టించుకోవడం మానేశారు.
 
దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఆర్టీసీ బస్టాండులో కాలం వెల్లదీస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు, పోలీసులు కుటుంబ సభ్యులకు చెబితే మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఇంతలో ఎవరో మృతుడికి చంద్రన్న బీమా వస్తుందని చెప్పడంతో వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ సంఘటన చూసిన పలువురు తీవ్ర ఆవేదన చెందారు. మానవత్వం నశించిన చోట చంద్రన్న బీమా ఆదుకుందని విచారం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై చంద్రన్న బీమా సిబ్బంది కుమా రిని వివరణ కోరగా బుధవారం ఆర్టీసీ బస్టాండులో అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. పరిశీలించి వివరాలు నమోదు చేస్తామని ఆమె తెలిపారు.
Posted

TDP 24x7 @TDP24x7 29m29 minutes ago

 
 

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణం నిరుపేద కుటుంబానికి చెందిన పగిడిపల్లి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. అతను చంద్రన్న భీమాలో నమోదై ఉండటంతో నామిని గా ఉన్న అతని కుమారుడి కి "చంద్రన్న భీమా" పథకం కింద రెండు లక్షలు మంజూరు చేశారు. #AndhraPradeshCM #ChandrababuNaidu #ncbn #TDP

DeD2-yAV0AAjKB6.jpg
Posted

TDP 24x7 @TDP24x7 15m15 minutes ago

 
 

గుంటూరు జిల్లా శిరిగిరిపాడు గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన దిరిశిణల వెంకటనారాయణ రెడ్డి గుండె పోటు తో మృతి చెందాడు. అతను చంద్రన్న భీమాలో నమోదై ఉండటంతో నామిని గా ఉన్న అతని భార్య కి "చంద్రన్న భీమా" పథకం కింద రెండు లక్షలు మంజూరు చేశారు.#AndhraPradeshCM #ncbn #chandrababunaidu

DegCZHAUwAA8hOK.jpg
Posted
చంద్రన్న బీమా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది: బాబు
01-06-2018 13:25:38
 
636634563456229663.jpg
అమరావతి: మూడోదశ చంద్రన్నబీమా కార్యక్రమం ప్రారంభమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన... చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబుయ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రన్న బీమా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. బీమా మిత్రలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో దళారుల జోక్యం లేకుండా చేశాం. ప్రభుత్వ పథకాల విషయంలో డ్వాక్రా సంఘాలు గొప్పగా పనిచేస్తున్నాయి. ఉపాధి హామీ పథకం సక్రమంగా పనిచేస్తోంది’’ అని చంద్రబాబు కితాబిచ్చారు.
 
 
రోడ్డుప్రమాదాల్లో డ్రైవర్లు చనిపోవడం బాధాకరమని, డ్రైవర్‌ చనిపోతే ఆ కుటుంబం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని, డ్రైవర్లను ఆదుకోవాలని బీమా పథకాన్ని ప్రారంభించామని బాబు చెప్పారు. బీమా మిత్ర టీడీపీ మానస పుత్రిక అని ఆయన అభివర్ణించారు. పెద్దకర్మ రోజే బాధితులకు బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామని, వృద్ధులను ఆదుకోవాలనే పెన్షన్లను ప్రారంభించామన్నారు. సకాలంలో అందితేనే సహాయానికి సార్థకత వస్తుందని చంద్రబాబు అన్నారు.
Posted
బీమా క్లయిమ్ 13రోజుల్లో పరిష్కారం: మంత్రి పితాని
01-06-2018 13:30:42
 
636634566493722976.jpg
అమరావతి: చంద్రన్న బీమా పథకం ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా, వేగంగా అమలు కావడం సంతోషకరమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బీమా క్లయిమ్‌ను 13 రోజుల్లో పరిష్కరించగలుగుతున్నామని తెలిపారు. ఈ పథకంలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చంద్రన్న బీమా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 155214ను ఏర్పాటు చేసినట్లు మంత్రి పితాని వెల్లడించారు.
Posted
చంద్రన్న బీమా ఆలోచన ఆలా పుట్టింది
మూడో ఏడాది ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

12451701BRK84A.JPG

అమరావతి: ఇంటి పెద్ద హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రన్న బీమా మూడో ఏడాది కార్యక్రమాన్ని అమరావతిలో ఈరోజు ఆయన ప్రారంభించారు. 2016లో 2.13కోట్ల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2.5కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద బీమా పథకంగా గుర్తింపు పొందింది. రెండేళ్లలో 1.50 లక్షల కుటుంబాలకు రూ.2వేల కోట్ల బీమా చెల్లించారు.

ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో తాను చూసిన సంఘటనల నుంచే చంద్రన్న బీమా ఆలోచన పుట్టిందని తెలిపారు. ‘లారీ డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి వారం పది రోజుల వరకు తిరిగిరారు. అలాంటి వారు ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. అందుకే చంద్రన్న బీమా పథకాన్ని వారికీ వర్తింపచేయాలని అనుకున్నాం. దీన్ని మొదట్లో చాలామంది వ్యతిరేకించారు. వాటిని పట్టించుకోకుండా డ్రైవర్లకు బీమాను వర్తింపచేస్తున్నాం. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 11వ రోజే పరిహారాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.

Posted
చంద్రన్న బీమా’ మూడో దశ ప్రారంభం
01-06-2018 12:38:18
 
636634535058883662.jpg
ఉండవల్లి: అసంఘటిత కార్మిక రంగం పరిధిలోనికి వచ్చే ప్రతీవ్యక్తి కుటుంబ రక్షణ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘చంద్రన్న బీమా’ పథకం మూడో దశ ప్రారంభమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చంద్రన్న బీమా పథకాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. జూన్‌ 1 నుంచి 2019 మే 31వరకు మూడోదశ చంద్రన్న బీమా వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 2.5 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లబ్ది చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1800కోట్ల బీమా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సహజ మరణాలకు రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా ద్వారా అందజేయనున్నారు. రెండేళ్లలో 1.50కోట్ల కుటుంబాలకు రూ.2వేల కోట్ల బీమా పరిహారం లభించింది. 
Posted (edited)
4 minutes ago, Raaz@NBK said:

Ee chandranna Bheema policy ki publicity ivvali Inka.. Banners and Theatres lo Add isthe best..

Raaz bro, idi already prati vallaki telusu....andaru join ayyaru.......GUINESS RECORD lo ki veltundi....

2 crore people joined it seems....

 

Andhra labour department applied for Guinness Book of World Records under highest number of workers covered under the multi-benefited insurance scheme.

Edited by AnnaGaru

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...