Jump to content

Amaravati


Recommended Posts

ayya CBN... :wall: :wall: :wall:

 

Farmers deggara thisukoni... ilaa employees ki vallaki free gaa iyyadam edaithe undo :wall:

 

Vallaki salaries emaina isthunnaru.. HRA isthunnaru.. malli ee gola endi :blink:

farmers plots farmers ki ichesaru,and development kuda start avutundi ichina plots lo 

 

migata lands adi govt istam free ga ivvalo,leda ani 

 

capital lo janalu tiragali ante ilantivi minimum undali,lekapote vijayawada or guntur lo settle avutaru andaru,inko gandhinagar ayiddi amaravathi kuda,

Link to comment
Share on other sites

I don't think many would object to giving accommodation to IAS/MLA/Judges as that is the norm. problem starts with secretariat employees.  majority of public does not like giving more freebies to them. by the way, significant part of those 9600 units would be for secretariat/department employees. 

 

unfortunate thing is lot of these employees will get apartments at subsidized rates, pay the installments and after retirement will move to Hyderabad. There should be rules prohibiting them from selling for next 20-25 years.

Link to comment
Share on other sites

22వ తేదీన లండన్‌కు మంత్రి నారాయణ
 

 అమరావతి: ఈ నెల 22వ తేదీన లండన్‌కు సీఆర్‌డీఏ కమిషనర్‌తో కలిసి వెళ్లి నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులతో భేటీ కానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ పరిపాలనాభవనాల సముదాయ నిర్మాణానికి సంబందించిన మాస్టర్‌ ప్లానును ఈ సంస్థ తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అక్కడ నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లను కూడా ఈ సంస్థ అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 28 వ తేదీన నార్మన్‌ఫోస్టర్‌ కంపెనీ ప్రతినిధులు పరిపాలనాభవనాలకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

9 నగరాలకు భూములు కేటాయించిన ప్రభుత్వం
 
అమరావతి: 9 నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం భూములు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు, విజ్ఞాన నగరానికి 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511 ఎకరాలు, ఆర్థిక నగరానికి 5,168, మీడియా నగరానికి 5,107, ఎకరాలను కేటాయించింది. క్రీడల నగరానికి 4,150, న్యాయ నగరానికి 3,438 ఎకరాలు, పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు కేటాయించింది. ఈనెల 22న ప్రభుత్వానికి రాజధాని డిజైన్లను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అందజేయనున్నది. భూములు కేటాయించిన ఆయా నగరాల్లో ఆయా రంగాల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

‘స్మార్ట్‌’ అమరావతికి జపాన్ చేయూత
 
636230678713793392.jpg
  • 5 కీలకాంశాలపై ప్రతిపాదనలు
  • రాష్ట్ర అధికారులతో ప్రఖ్యాత కంపెనీల చర్చలు
  • టెక్నికల్‌ ప్రజంటేషన్లతో ప్రాజెక్టులపై వివరణ
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): అమరావతి నగరంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చేందుకు దోహదపడే పలు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను జపాన్ దేశానికి చెందిన వివిధ సుప్రసిద్ధ కంపెనీలు సమర్పించాయి. అమరావతి అభివృద్ధి నిమిత్తం 2015 అక్టోబరు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జపాన్ ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎంఐటీఈ) మధ్య ఎంవోయూ కుదిరింది. అందులో భాగంగా జపానకు చెందిన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన ప్రతినిధులు తాము రూపొందించిన వివిధ ప్రతిపాదనలను ఏపీసీఆర్‌డీఏ, ఏడీసీ, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. విజయవాడలో శుక్ర, శనివారాల్లో జరిగిన సమావేశాల్లో వారు అమరావతిని స్మార్ట్‌, సస్టెయినబుల్‌ సిటీగా రూపొందించేందుకు తోడ్పడనున్న 5 అంశాలపై అత్యుత్తమ జపనీస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన టెక్నికల్‌ ప్రజంటేషన్లు ఇచ్చారు. ఆ అంశాలివీ..
 

డేటా సెంటర్‌-క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: అత్యధునాతన, తక్కువ శక్తితో పని చేసే మాడ్యులార్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా అమరావతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలను అందించడం దీని లక్ష్యం. ఇవి మాడ్యులార్‌ కావడంతో వివిధ సిటిజన అప్లికేషన్సకు అవసరమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను అందుబాటులోకి తెస్తాయి. పైగా వీటి ఏర్పాటుకు తక్కువ సమయం పడుతుంది.

 
వాతావరణ రాడార్‌ వ్యవస్థ: జపాన్‌కు చెందిన ప్రఖ్యాత తోషిబా సంస్థ ప్రతిపాదించిన అత్యధునాతన, సమీకృత వాతావరణ రాడార్‌ వ్యవస్థ అమరావతికి ప్రకృతి వైపరీత్యాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. నది, కాలువలు, మురుగునీరు, రవాణా తదితర వ్యవస్థలన్నింటితో అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ ప్రకృతి విపత్తులను తగినంత ముందుగానే పసిగట్టి, హెచ్చరిస్తుంది. ఇప్పటికే జపానలో ఎంతో విజయవంతమైన ఈ వ్యవస్థ ద్వారా ప్రాణనష్టాలను పూర్తిగా నిరోధించవచ్చు.
 
నీటి సరఫరా వ్యవస్థ: అమరావతిలోని ప్రతి నివాసగృహమూ నాణ్యమైన, పరిశుద్ధమైన నీటిని పొందేందుకు ఉపకరించే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థ గురించి కోబెల్కో సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత వినియోగంలో ఉన్న ఈ వ్యవస్థ అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో నడుస్తుంది. అమరావతి ప్రాంతంలో లభ్యమయ్యే నీటి స్వభావానికి అనుగుణంగా ఇందులో అవసరమైన మార్పులు చేశారు.
 
మురుగునీటి శుద్ధి: అమరావతి పూర్తి పర్యావరణహితంగా ఆవిర్భవించేందుకు దోహదపడే సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ గురించి ప్రతినిధులు వివరించారు. అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానానికి ఇంధనం ఖర్చు తక్కువ. ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఇది అమలులో ఉంది.
 
ట్రాఫిక్‌ నియంత్రణ: తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్న విజయవాడ నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నిప్పన సిగ్నల్‌ కంపెనీ అత్యధునాతన ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను రూపొందించి, ప్రదర్శించింది. సెన్సర్ల సహాయంతో పని చేసే ఈ వ్యవస్థ... నగరంలోని వివిధ సిగ్నలింగ్‌ పాయింట్ల వద్ద ఉండే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆయా సిగ్నళ్లు ఎంతసేపు వెలగాలనే విషయాన్ని నిర్ధారించడం ద్వారా ట్రాఫిక్‌ జామ్‌లను నివారిస్తాయి. ఈ సమావేశాల్లో ఏపీసీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ వి.రామమనోహరరావు, విజయవాడ డీసీపీ (ట్రాఫిక్‌) రాణా, ఏడీసీ ఉన్నతాధికారులతోపాటు జపానకు చెందిన హరుహికో అందోహ్‌, ఇచిరో అబె, యుకి త్సునాషిమా, తకమస హిరోసె, యుట కోబయషి తదితరులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

నవశోభ
 
636230615656704796.jpg
  • రాజధాని అమరావతిలో 9 థీమ్‌ సిటీలకు భూకేటాయింపు
  • పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు
  • పాలనా నగరికి అత్యల్పంగా 2,702 ఎకరాలు
  • 9 నగరాలను కలుపుతూ విశాలమైన రోడ్లు
  • 134 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం
  • పర్యావరణహిత రాజధానికి ప్రణాళికలు
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలో నిర్మించదలచిన 9 థీమ్‌ సిటీలకు శనివారం భూములు కేటాయించింది. రాజధానిని కేవలం పరిపాలనకే పరిమితం చేయరాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. విద్య, వైద్య, పర్యాటక, ఆతిథ్య, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని కేంద్రస్థానంగా నిలవాలన్నది సీఎం ప్రగాఢ సంకల్పం. అప్పుడే ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు పెరిగి రాజధాని అభివృద్ధి పరుగులు తీస్తుందన్నది ఆయన విశ్వాసం.
 
   దానికి అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రా‌నిక్స్‌, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాలనే తొమ్మిది ప్రత్యేక థీమ్‌ సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణా నదీ తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. 53,647 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న అమరావతికి ఈ ‘నవ నగరాలు’ వినూత్న శోభను సమకూర్చనున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునికశైలిలో ఈ నగరాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఈ నవ నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో పర్యాటక నగరానికి అత్యధికంగా 11,574 ఎకరాలను కేటాయించారు. పరిపాలనా నగరానికి అత్యల్పంగా 2,702 ఎకరాలను కేటాయించారు. ఈ థీమ్‌ సిటీలను అనుసంధానించేందుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన రహదారులు, మెట్రో తదితర రవాణా వ్యవస్థలను నెలకొల్పడంతోపాటు అమరావతి మొత్తాన్నీ సీఎం ఆకాంక్షల మేరకు ‘బ్లూ- గ్రీన కాన్సెప్ట్‌’ (జలవనరులు, పచ్చదనం)తో పూర్తి పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
CRDA.jpg 
 
 
పర్యాటక నగరం
అమరావతిని పర్యాటకుల స్వర్గథామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నందున దీనిని అత్యధికంగా 11,574 ఎకరాల్లో నిర్మించనున్నారు. వీటిల్లో పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, రిసార్టులు, పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు, వినోద ప్రదేశాలు తదితరాల కోసం 8,778 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1397, వాణిజ్యావసరాలకు 451, పరిశ్రమలకు 100, ప్రత్యేక జోనకు 156, భవిష్యత్తు అవసరాలకు 692 ఎకరాలను నిర్దేశించారు.
 
విజ్ఞాన నగరం
రాజధానిని ప్రపంచస్థాయి విద్యా, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థినీవిద్యార్థులను ఆకర్షించాలని భావిస్తున్న నేపథ్యంలో విజ్ఞాన నగరానికి 8547 ఎకరాలు కేటాయించారు. వీటిల్లో ప్రత్యేక జోనకు 979 ఎకరాలు, విద్యాసంస్థలు, గృహావసరాల కోసం 3562, వాణిజ్యావసరాలకు 1257, వినోదం- ఇతరత్రా ప్రజోపయోగ వినియోగం కోసం 1340, పరిశ్రమలకు 87, భవిష్యత్తు అవసరాల నిమిత్తం 1322 ఎకరాలను కేటాయించారు.
 
ఆరోగ్య నగరం
ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు వైద్య విశ్వవిద్యాలయాలు, అనుబంధ రంగాలకు చెందిన విద్యాసంస్థలు, కార్యాలయాలు ఏర్పాటవనున్న ఈ హెల్త్‌ సిటీకి 6,511 ఎకరాలను కేటాయించారు. వీటిల్లో ప్రత్యేక జోనకు 1048, గృహావసరాలకు 3306, వినోదం- ఇతరాలకు- బహిరంగా ప్రదేశాలకు 580, వాణిజ్యావసరాలకు 504, భవిష్యత్తు అవసరాలకు 1072 ఎకరాలను కేటాయించారు.
 ap4.jpg
ఆర్థిక నగరం
ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే, పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలతోపాటు ప్రైవేటు రంగంలోని పలు ఆర్థిక సంస్థలతో ఏర్పడనున్న ఫైనాన్షియల్‌ సిటీకి 5,618 ఎకరాలు కేటాయించారు. ఇందులో ప్రత్యేక జోనకు 844, గృహావసరాలకు 1389, వినోదం, సామాజిక ప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశాలుగా ఉంచేందుకు 1250, వాణిజ్య అవసరాలకు 828, పారిశ్రామిక రంగానికి 101, భవిష్యత్తు అవసరాలకు 756 ఎకరాలను కేటాయించారు.
 
క్రీడా నగరం
అమరావతి క్రీడల స్వర్గథామంగా వెలుగొందాలని, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ సిటీకి 4150 ఎకరాలను కేటాయించింది. వీటిల్లో ప్రత్యేక జోన్లకు 436, గృహావసరాలకు 1819, సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశాలుగా ఉంచేందుకు 555, వాణిజ్య అవసరాలకు 513, పరిశ్రమలకు 134, భవిష్యత్తు అవసరాలకు 693 ఎకరాలను నిర్దేశించింది.

న్యాయనగరం
ఇందులో హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఆ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగుల వరకు అందరి నివాసగృహాలు ఏర్పాటవుతాయి. 3,438 ఎకరాల్లో నిర్మితమవనున్న ఈ జస్టిస్‌ సిటీలో ప్రత్యేక జోనకు 458, గృహావసరాలకు 1276, వినోదం- ఇతర సామాజికావసరాలకు 692, వాణిజ్యావసరాలకు 467, భవిష్యత్తు అవసరాలకు 545 ఎకరాలను కేటాయించారు.

 
మీడియా సిటీ
ప్రింట్‌, ఎలక్ట్రా‌నిక్‌, వెబ్‌ మీడియాలకు చెందిన పలు సంస్థల కార్యాలయాలు, వాటి ఉద్యోగుల గృహాలు ఇందులో ఏర్పాటవుతాయి. 5107 ఎకరాల్లో నిర్మితం కానున్న ఈ నగరంలో ప్రత్యేక జోన్లకు 346, గృహావసరాలకు 1862, వినోదం- ఇతర సామాజికావసరాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచేందుకు 1291, వాణిజ్య అవసరాలకు 791, పారిశ్రామికావసరాలకు 250, భవిష్యత్తు అవసరాలకు 567 ఎకరాలను కేటాయించారు.
ap5.jpg
విశాల రహదారులు.. మెట్రో అనుసంధానం
తొమ్మిది థీమ్‌ సిటీలను అనుసంధానించేందుకు విశాలమైన రహదారులను నిర్మిస్తారు. వీటిల్లో 60 మీటర్ల వెడల్పు ఉండే 3 ప్రధాన రహదారులతోపాటు 50 మీటర్ల వెడల్పుతో 275 కి,మీ. పొడవైన అంతర్గత రహదారులు, 25 మీటర్ల వెడల్పు ఉండే రోడ్లు ఉంటాయి. అదనంగా 186 కి.మీ. పొడవైన 8 వరుసల అవుటర్‌ రింగ్‌ రోడ్డు, 97.5 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తారు. 134 కి.మీ. మెట్రో రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది.

 
పరిపాలన నగరం
రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కేంద్రనాడిగా నిలిచే ఈ అడ్మినిస్ట్రే‌టివ్‌ సిటీలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల నివాసగృహాలు ఇత్యాదివి ఉంటాయి. దీనికి కేటాయించిన 2,702 ఎకరాల్లో ప్రత్యేక జోన్లకు 638 ఎకరాలు, గృహావసరాలకు 833, వినోదం- ఇతర సామాజికావసరాలు- బహిరంగస్థలాలకు 567, వాణిజ్య కార్యకలాపాలకు 237, భవిష్యత్తు అవసరాలకు 427 ఎకరాలను కేటాయించారు.
 
ఎలక్ట్రా‌నిక్స్‌ నగరం
6,582 ఎకరాల్లో ఇది ఏర్పాటుకానుంది. ఇందులో ప్రత్యేక జోనకు 645, పారిశ్రామిక రంగానికి 1618, గృహావసరాలకు 1862, వాణిజ్యావసరాలకు 682, వినోదం- ఇతర ప్రయోజనాల కోసం 757, భవిష్యత్తు అవసరాలకు 503 ఎకరాల చొప్పున కేటాయించారు.
 
త్వరలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ ముసాయిదా డిజైన్లు
తొమ్మిది థీమ్‌సిటీలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచస్థాయి నిపుణులతో ప్రణాళికలు రూపొందింపజేస్తున్నారు. పరిపాలనా నగరంలోని 900 ఎకరాల్లో నిర్మించనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను రూపొందిస్తున్న లండనకు చెందిన నార్మన ఫోస్టర్‌ సంస్థ వాటి ముసాయిదా డిజైన్లను ఈ నెల 22న అందజేయనుంది. దీంతో రాజధాని నిర్మాణ ప్రక్రియ మరొక కీలక దశను అధిగమించినట్లవుతుంది. కొద్ది నెలల్లోనే ఫైనల్‌ డిజైన్లను ఖరారు చేసి, ఆ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. 
crda4.jpg
Link to comment
Share on other sites

తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా..

అమరావతి

సూచనలు, సలహాలిచ్చే పరకాల కమిటీ భేటీ 22, 23తేదీల్లో

మార్చిలో నగర నిర్మాణ నమూనాల్ని అందించనున్న ‘నార్మన్‌ ఫోస్టర్‌’

ఏప్రిల్‌ ఆఖరుకు సవివర ప్రణాళిక అందజేత

ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర రూపకల్పనలో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కార్యరంగంలోకి దిగుతోంది. ఈనెల 22, 23 తేదీల్లో విజయవాడలో సమావేశం కానుంది. తెలుగు చరిత్ర, సంస్కృతిపై పట్టున్న కమిటీ సభ్యులు...రాజధానిలో ఆకృతుల రూపకల్పనకు ప్రభుత్వం నియమించిన బ్రిటన్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌కి సూచనలు, సలహాలు ఇవ్వనుంది. మొత్తంగా నగర స్వరూపం, తొమ్మిది ఉప నగరాలు, 27 టౌన్‌షిప్పులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి దారితీసే ఏడు ప్రధాన రహదారులు, వివిధ ఐకానిక్‌ భవనాలు తదితర నిర్మాణాల స్వరూపం ఎలా ఉండాలన్న దానితో సహా పలు అంశాలపై సిఫార్సు చేస్తుంది. చర్చలు, సంప్రదింపుల అనంతరం బృంద సభ్యులు ప్రధానంగా నాలుగు అంశాల్లో కీలకమైన సూచనలు చేస్తారు.

శాతవాహనుల పాలనకు ముందు..తరువాత: ప్రాసాదం(భవనం-ఐకానిక్‌ భవనాల నిర్మాణశైలి), యానం(ప్రయాణం-రహదారులు), ఆసనం(కూర్చునేది-సభలు, సమావేశాలు నిర్వహించుకునే హాళ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో కూర్చునే ప్రాంతాలు, శాసనసభ, మండలిలో సీటింగ్‌ తదితరాలు), శయనం(పడుకునే ప్రాంతం-నివాసాలు) ఎలా ఉండాలన్న వాటిపై వీరు చర్చించి నివేదికిస్తారు. శాతవాహనుల పాలనాకాలం, వీరికి ముందు, వీరి తరువాత, బౌద్ధమతం ఈ ప్రాంతంలో విస్తరించటానికి ముందు, ఆతరువాత భవనాలు, ఇతర నిర్మాణాలు ఎలాగున్నాయన్న దానిపై వీరు ఇప్పటికే కొంత అధ్యయనం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని పాలించిన... ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, విజయనగర రాజులు(హంపి), గజపతులు, వేంగి, పల్నాడు, కాకతీయ(రుద్రమదేవి పట్టాభిషిక్తానికి సంబంధించిన శాసనం రాజధాని నగర పరిధిలోని మందడం గ్రామంలోనే ఉంది) రాజుల కాలంలోని నిర్మాణశైలి, ఆకృతులను పరిగణనలోకి తీసుకుంటారు. మొఘల్‌ చక్రవర్తుల కాలంలో దిల్లీకి దారితీసే రహదారులకు లాహోర్‌ గేట్‌, కాశ్మీరీ గేట్‌ వంటివి ఉన్నట్లుగా...రాజధాని అమరావతి నగరంలోకి వెళ్లే ఏడు ప్రధాన రహదారులకు ఎలాంటి పేర్లు పెట్టాలి, ప్రవేశించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలుండాలన్న వాటిపైనా రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహదారు పరకాల ప్రభాకర్‌ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి సూచనలిస్తుంది. వీటిని పరిగణనలోకి తీసుకుని మార్చి మొదటి వారంలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడు రూపాల్లో(థీమ్స్‌) రాజధాని నగర నిర్మాణ నమూనాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. వీటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనాపై సవివరమైన ప్రణాళిక, నమూనాల్ని ఏప్రిల్‌ ఆఖరుకు ఇవ్వనుంది.

కమిటీ సభ్యులు: పుణెలోని దక్కన్‌ కళాశాల డీమ్డ్‌ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి కె.పద్దయ్య, ఎస్‌.వి.విశ్వవిద్యాలయంలో ప్రాచీన భారత చరిత్ర, ఆర్కియాలజీ విభాగం మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ క్రాంత్‌ చౌదరి, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ కె.వి.రావు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సీఈఓ శివనాగిరెడ్డి, ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, అమరావతి హెరిటేజ్‌ సిటీ సలహాదారు అమరేశ్వర్‌ గల్లా, రచయిత పాపినేని సాయి, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదవీ విరమణ చేసిన చరిత్ర ప్రొఫెసర్‌ వి.రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాలశాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌లు.

amar5.jpg

Link to comment
Share on other sites

ఈరోజు రాత్రి లండన్ వెళ్ళనున్న మంత్రి నారాయణ
 
636232984490711442.jpg
అమరావతి: ఈరోజు రాత్రి రాష్ట్ర మంత్రి నారాయణ లండన్ వెళ్ళనున్నారు. రాజధాని అమరావతి మాస్టర్ డిజైన్‌పై లండన్‌లో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులకు మంత్రి పలు సూచనలు చేయనున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రాజధాని డిజైన్స్‌పై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 28న మూడు రకాల డిజైన్లను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...