Jump to content

Amaravati


Recommended Posts

ఇంగ్లండ్‌కు నారాయణ, శ్రీధర్‌
 
  • ప్రభుత్వ భవన డిజైన్లపై సంప్రదింపులు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ శాఖ మంత్రి, సీఆర్డీఏ ఉపాధ్యక్షుడు పీ నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ శనివారం ఇంగ్లండ్‌కి వెళ్లారు. ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించదలచిన ప్రభుత్వ భవనాల సముదాయం డిజైనపై దానిని రూపొందిస్తున్న లండన్‌కు చెందిన నార్మన్ ఫాస్టర్‌ సంస్థ నిపుణులతో చర్చలు జరిపేందుకు వీరు వెళ్లినట్టు సమాచారం.
 
       మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా కొన్ని నెలల క్రితమే ఎంపికైన నార్మన్ ఫాస్టర్‌ కంపెనీ భవన డిజైన్లను ఈ నెల 25న సమర్పించనుందనే వార్తల నేపథ్యంలో నారాయణ, శ్రీధర్‌లు అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారు ఇప్పటికే సదరు సంస్థ దాదాపుగా సిద్ధం చేసిన అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు సూచించనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్న విధంగా వైవిధ్యంగా, సృజనాత్మకంగా రూపుదిద్దుకుని రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేలా ఉన్నాయా? లేదా? అనే విషయంపై వారు దృష్టి కేంద్రీకరించనున్నట్టు చెబుతున్నారు. వారిచ్చే సలహాలను పాటించి, డిజైన్లకు తుదిమెరుగులు దిద్దిన తర్వాత వాటిని నార్మన ఫాస్టర్‌ సమర్పించనుందని తెలిసింది.
Link to comment
Share on other sites

అమరావతి’ డిజైన్లపై సంతృప్తి!

 

  • మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌తో నారాయణ బృందం చర్చలు పూర్తి
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన నార్మన ఫాస్టర్‌ సంస్థతో మంత్రి పి.నారాయణ, ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అమరావతి అభివృద్ధి సంస్థ ఎండీ లక్ష్మీపార్థసారధి చర్చించారు. ఫాస్టర్‌ వెల్లడించిన విషయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదరు సంస్థకు చెందిన నిపుణులతో వారు గత 2 రోజులుగా ఇంగ్లండ్‌ రాజధాని లండనలో జరుపుతున్న చర్చలు సోమవారంతో ముగిశాయి. అమరావతిలోని ప్రభుత్వ భవనాల సముదాయం, అందులోని ప్రముఖ కట్టడాల(ఐకానిక్‌ బిల్డింగ్స్‌)కు సంబంధించిన డిజైన్లను ఈ సంస్థ అందజేయనుంది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ నెల 25న డిజైన్లు ప్రభుత్వానికి చేరాల్సి ఉంది.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే నార్మన ఫాస్టర్‌ సిద్ధం చేసిన ముసాయిదా డిజైన్లను నిశితంగా పరిశీలించి, అవి సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా చూసే ఉద్దేశంతో నారాయణ ఆధ్వర్యంలోని బృందం శనివారం లండన వెళ్లింది. ఫాస్టర్‌ సంస్థ రూపొందించిన నమూనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, కొన్ని మార్పుచేర్పులను సూచించారు. ఈ డిజైన్లు ఒకపక్క వైవిధ్యానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూనే మరోపక్క దేశంతోపాటు ఏపీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాలంటే మార్పులు అవసరమని నిపుణులకు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రానికి నారాయణ బృందం విజయవాడ చేరుకోనుంది. కాగా.. ఈ నెల 25న కాకుండా నార్మన సంస్థ డిజైన్లను కొన్ని రోజులు ఆలస్యంగా అందజేయనుందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites



రాజధానికి పెట్టుబడుల వర636212706544773671.jpg



  • విశాఖ సీఐఐ సదస్సులో రూ.22,340 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
  • ఆయా పరిశ్రమలతో వేలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
ఆంధ్రజ్యోతి, గుంటూరు : విశాఖపట్టణంలో రెండు రోజులపాటు జరిగి సీఐఐ సదస్సు గుంటూరు జిల్లాకు భారీగా మేలు చేసింది. అమరావతి రాజధాని నగరం కలిగి ఉన్న గుంటూరులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హోటల్‌, వైద్యం, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదర్చుకొన్నాయి. వీటి విలువ రూ.22 వేల 340 కోట్లుగా ప్రభుత్వంవేసింది. ఒప్పందం కుదుర్చుకొన్న పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగానే వేలమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది.

 

   భౌగోళికంగా గుంటూరు జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అవకాశాలను కలిగిఉంది. చెన్నై - కోల్‌కత్తా జాతీయ రహదారి, నిజాంపట్నం హార్బర్‌, గుంటూరు రైల్వే డివిజన వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. సుమారు 300 కిలోమీటర్ల దూరం మేరకు నదీ తీర ప్రాంతం ఉంది. ఇసుక, గ్రానైట్‌, గ్రావెల్‌, రోడ్డు మెటల్‌, సున్నపురాయి, లేటరైట్‌ వంటి గనుల నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. వరి, పత్తి, మిర్చి తదితర పంటలు సమృద్ధిగా పండుతాయి. అమరావతి రాజధాని నగరం ఇక్కడే నిర్మాణం జరుగుతోంది. దీంతో సహజంగానే పెట్టుబడిదారులు గుంటూరుపై ఆసక్తి కనబరిచారు.

 

ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలు

  • మోహం హాస్పిటల్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకొచ్చింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఆస్పత్రి స్థాపించి 1,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకొన్నది. మోహం ఐటీ సంస్థ రూ.1,800 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు స్థాపించి 1,200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎంవోయూ చేసుకుంది. మోహం ఇనఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.1,051 కోట్ల పెట్టుబడులు పెట్టి 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
  • చక్రమాచి ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది.
  • డాక్టర్‌ ఎల్‌.సుబ్రహ్మణ్యం ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ హబ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చారు.
  • ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో ఫ్రాన్స సీవోఐ టెక్నాలజీస్‌ సంస్థ రూ. 76.7 కోట్లు పెట్టుబడి పెట్టి 115 మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందం చేసుకుంది.
  • గ్రీనపార్కు హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ విలాసమైన హోటల్‌ను రూ.361.75 కోట్లతో నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 2,150 మందికి ఉపాధి లభిస్తుంది.
  • వ్యవసాయ, ఉత్సాదక రంగంలో సెకండ్‌ పవర్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ ఫైబర్‌ ఆప్టిక్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకొన్నది. రూ.2,252 కోట్ల పెట్టుబడితో 10,140 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
  • వీ-టెక్‌ వెబ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ రూ. 200 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు స్థాపనకు ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
  • వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ పడవల ఉత్పాదక కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టి 16 వేల మందికి ఉపాధి కల్పించనుంది.
  • రాజధానిలో జిల్లా ఉండడంతో వాటిల్లో 50 శాతం పైనే గ్రౌండింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పారిశ్రామిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు గ్రౌండింగ్‌ అయితే జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది. వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా జిల్లా వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Link to comment
Share on other sites

22న ప్రభుత్వ భవనాల డిజైన్లు
 
  • సీఎంకి అందజేయనున్న నార్మన్‌ పోస్టర్‌
హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్లను వచ్చే నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ‘నార్మన్‌ పోస్టర్‌’ సంస్థ అందించనుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర నిర్మాణాల డిజైన్లతో ఉన్న మూడు సెట్‌లను సీఎంకి సమర్పిస్తుంది. వీటిలో.. ఒక డిజైన్‌ని సీఎం ఎంపిక చేస్తారు. వాస్తవానికి, ఈ డిజైన్ల తయారీ బాధ్యతను జపాన్‌కు చెందిన మాకీ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ తయారు చేసిన డిజైన్‌ ‘చిమ్నీ’ని పోలి ఉంది. ఇలాంటి డిజైన్‌ను ఇదివరకే మరో దేశంలో వినియోగించడంతో అమరావతిలో కాపీ కొట్టిన డిజైన్‌తో నిర్మాణాలు చేపడుతున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో.. మాకీ సంస్థతో ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొంది. దేశీయ సంప్రదాయం, సంస్కృతులను మేళవిస్తూ, నగర నిర్మాణం జరపాలని సీఆర్‌డీఏ భావించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ శ్రేణి అర్కిటెక్ట్‌ సంస్థ ‘నార్మన్‌ పోస్టర్‌’కు...డిజైన్ల రూపకల్పనా బాధ్యతను అప్పగించారు.
Link to comment
Share on other sites

250 కోట్లతో 5, 4,3 స్టార్ హోటళ్ల నిర్మాణం: చంద్రబాబు
 
636216532419876939.jpg
గుంటూరు: అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. రెండేళ్లలో అమరావతిలో సాధించిన అభివృద్ధిని సీఎంకు అధికారులు వివరించారు. త్వరలో అమరావతిలో విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలు నిర్మాణం చేపడతామని సీఎం తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ నగరాలైన నయారాయపూర్, పుత్రజయ, ఆస్తానాలకు ధీటుగా అమరావతి నగర నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు. 2018 నాటికి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
 
ఆరు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు నిర్మించనున్నారు. సుమారు రూ. 250 కోట్లతో ఒక ఫైవ్ స్టార్, ఒక ఫోర్ స్టార్, నాలుగు త్రీ స్టార్ హోటళ్ల ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ భవనాల డిజైన్లు వినూత్నంగా వుండాలని చంద్రబాబు అన్నారు.
అత్యుత్తమ డిజైన్ల కోసం ప్రాజెక్టు కన్సల్టెంట్లు, రాజధాని, పరిపాలన నగరం నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడదలుచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని భవనాల నిర్మాణ సముదాయ ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.
Link to comment
Share on other sites

చారిత్రకసంపదతో అమరావతిలో మ్యూజియం నిర్మిస్తాం: చంద్రబాబు
 
636216570796609756.jpg
గుంటూరు: అమరావతిలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అమరావతికి సంబంధించి దేశవిదేశాల్లో ఉన్న చారిత్రకసంపదతో మ్యూజియం నిర్మాణం చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పవిత్రసంగమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సుందరీకరణ చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ముఖద్వారాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు స్పష్టం చేశారు
Link to comment
Share on other sites

ఆ నగరాలకు దీటుగా అమరావతి: చంద్రబాబు

విజయవాడ: గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలైన నయా రాయ్‌పూర్‌, పుత్రజయ, ఆస్తానాలకు దీటుగా అమరావతి నగర నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2018 లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో దిశానిర్దేశం చేశారు. అమరావతి నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో అమరావతి అభివృద్ధిలో మైలురాళ్లను ముఖ్యమంత్రికి సీఆర్‌డీఏ అధికారులు వివరించారు. త్వరలో అమరావతిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలు రానున్నాయని చెప్పారు. అమరావతిలో ఆరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు వస్తున్నాయని తెలిపారు. సుమారు రూ.250కోట్లతో ఒక ఫైవ్‌స్టార్‌, ఒక ఫోర్‌స్టార్‌, నాలుగు త్రీస్టార్‌ హోటళ్లు ఏర్పాటవుతాయని వివరించారు. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం జరుగుతుందని, 2018 నాటికి స్టేడియం-ఎరీనా నిర్మాణం, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. శిల్పారామం, లైబ్రరీ, మ్యూజియం నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...