Jump to content

Amaravati


Recommended Posts

Guest Urban Legend

రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్‌ జిల్లాను ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంత ప్రజల అవసరాల కోసం అమరావతి పేరుతో కొత్త రిజిసే్ట్రషన్‌ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తుళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా శుక్రవారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


రాజధాని పరిధిలో కొత్తగా 4 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తుళ్లూరులో నూతన సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలిపారు. మందడం, ఉండవల్లి, అనంతవరం గ్రామాల్లో మూడు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్ని అన్నారు.



 


ఈ కార్యాలయాల పరిధిలోనే రాజధాని ప్రాంతంలోని భూములు క్రయ, విక్రయాలు ఏ రిజిస్ట్రేషన్లకు అయినా ఇక్కడే లావాదేవీలు నిర్వహిస్తారు. రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ల పరంగా మున్ముందు ఎలాంటి వివాదాలకు తావుండకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.


http://www.amaravativoice.com/te/amaravati-new-registration-district


Link to comment
Share on other sites

అమరావతిలో హైకోర్టు నిర్మాణం ఆగస్టు 17న ఆరంభం
 
636216869579832604.jpg
  • 2019 ఏప్రిల్‌ మూడోతేదీకి పూర్తి
  • అసెంబ్లీ నిర్మాణం జూలైలో ప్రారంభం
  • శాశ్వత సచివాలయ పనులు మే 10న
  • అసెంబ్లీ 3, హైకోర్టు 4 అంతస్తులు
  • పరిపాలనా నగరిపై ఏపీ సీఎం సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిపాలనా భవన నిర్మాణానికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది. శాశ్వత ప్రాతిపదికన సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల పనులను ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు పూర్తి చేయాలి అనే షెడ్యూలు ఖరారైంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉంది. దీని విభజన ఏపీలో సొంత హైకోర్టు ఏర్పాటు చేసుకోవడంతో ముడిపడి ఉంది. అమరావతిలో హైకోర్టు నిర్మాణాన్ని ఈ ఏడాది ఆగస్టు 17న ప్రారంభించి... 2019 ఏప్రిల్‌ మూడో తేదీనాటికి పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారైంది. పరిపాలనా నగరిలో భాగమైన సచివాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది మే 10న ప్రారంభిస్తారు. 2018 డిసెంబరు 25నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. శాసనసభ నిర్మాణాన్ని జూలై 20న ప్రారంభించి... వచ్చే ఏడాది అక్టోబరు 4నాటికి పూర్తి చేస్తారు.
 
ఇవీ భవనాల రూపు రేఖలు...
శాసనసభా భవనాన్ని జీ+3, హైకోర్టు భవనాన్ని జీ+4 అంతస్తులుగా నిర్మిస్తారు. వీటికి సంబంధిం చిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందిస్తోంది. ఈ నెల 22వ తేదీన సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు సమావేశమవుతారు. ఏప్రిల్‌ 11న అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను ఆ సంస్థ ప్రభుత్వానికి అందిస్తుంది. అనంతరం ఏప్రిల్‌ 19 నాటికి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన సవివర మాస్టర్‌ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నారాయణ, సీఎం కార్యాలయ, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. ఆతర్వాత మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు. పరిపాలనా నగరంలో పచ్చదనం, నీటి నిర్వహణ, ఆర్థిక నిర్వహణకు ఒక్కోఅంతర్జాతీయ కన్సల్టెంట్లను తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్లూ ప్రింట్‌ కోసం నెదర్లాండ్స్‌ కన్సల్టెన్సీ, ఆర్థిక కన్సల్టెన్సీగా మెకెన్సీ సంస్థలను తీసుకున్నామన్నారు. అమరావతిలో జరిగే కార్యక్రమాలను విశ్ల్లేషించేందుకు అమెరికాకు చెందిన సంస్థను ఎంపిక చేశామన్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చయిందనడంలో వాస్తవం లేదన్నారు. ఏసీలు, ఫర్నిచర్‌, మౌలిక సదుపాయాలు అన్నీ కలిపినా చదరపు అడుగుకు రూ.6వేలకు మించి కాలేదని నారాయణ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

ఇది ప్రజా రాజధాని
 
636216838116293359.jpg
  • అందరి సూచనలు, సలహాలు తీసుకోండి... ఉత్తమ సూచనలకు బహుమతులు 
  • వినూత్నంగా, అంతర్జాతీయ స్థాయిలో డిజైన్లు 
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన పరిపాలన నగరం నిర్మాణ అంతర్జాతీయ ప్రమాణాలతో సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌(లండన) ప్రతినిధులతో ఈనెల 22న ఆయన సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణంపై వెలగపూడిలోని తన కార్యాలయంలో గురువారం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. నార్మన ఫోస్టర్స్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా చర్చించారు. పరిపాలనా నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతులు వినూత్నంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఉత్తమంగా ఉండాలని సూచించారు. భవన నిర్మాణాల్లో భారతీయ, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, సాహితీవేత్తలు, చలనచిత్ర, కళారంగాల ప్రముఖులతోపాటు అన్ని వర్గాలను సంప్రదించి... సమన్వయం సాధించే బాధ్యతను పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు. అమరావతి రూపకల్పన, నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌ నిపుణులు, విద్యార్థులతోసహా రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ‘ప్రజా రాజధాని’లో అన్ని వర్గాలూ సంతోషంగా జీవించేలా ఉత్తమ సూచనలను చేసిన వారికి బహుమతులను అందించాలన్నారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు.
.
2019లో జాతీయ క్రీడల నిర్వహణే లక్ష్యం..
అమరావతిలో 2019 జాతీయ క్రీడోత్సవాలను నిర్వహించాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు వీలుగా... క్రీడానగరాన్ని నిర్మించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. 2018 నాటికి స్టేడియం, ఎరీనాలను నిర్మించాలని ఆయన సూచించగా, స్పోర్ట్స్‌ సిటీలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు.
 
అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్‌
గత రెండేళ్లలో అమరావతి నిర్మాణంలో సాధించిన మైలురాళ్లను, 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని అధికారులు వివరించారు. త్వరలోనే విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలు, సుమారు రూ.250 కోట్లతో ఒక ఫైవ్‌ స్టార్‌, నాలుగు త్రీస్టార్‌, 6 జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు, రూ.4000 కోట్ల వ్యయంతో 2 ప్రఖ్యాత ఆస్పత్రులు అమరావతిలో ఏర్పడబోతున్నాయన్నారు. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డుకు సంబంఽధించి జాతీయ రహదారుల విభాగంతో ఈ నెల 28న ఒప్పందం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అమరావతిలో ప్రభుత్వోద్యోగుల కోసం దాదాపు 3,165 నివాసాలతోపాటు విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి మొత్తం రూ.4,750 కోట్లతో రూపొందించిన అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందు ఉంచారు.
Link to comment
Share on other sites

Naidu Finalizes Road Map for Amaravati Construction London-based architect firm Norman Foster and Partners which is the master architect of Andhra Pradesh capital Amaravati will submit the final designs of Amaravati Administrative buildings on February 22nd. The designs are likely to be submitted on April 4th and will be finalized on April 19th. The Bhoomi Puja for Assembly will be held on July 20th and High Court Building on August 17th. According to the plan now the G+3 Assembly building construction will cost 245 Crore and is expected to be complete by 4th October 2018. High Court building will be constructed as G+4 and will cost 450 Crore. The Permanent Secretariat Building construction will begin on May 10th and will be complete by December 25th, 2018. These buildings will come up on 900 acres. If they are completed as per the plan now, they will remain as testimony for Naidu in 2019 election.

 

Link to comment
Share on other sites

అమరావతిలో కీలక అడుగులపై నిర్ణయం

జులై 20న శాసనసభకు శంకుస్థాపన

ఆగస్టు 17న హైకోర్టుకు కొబ్బరి కాయ

పరకాలకు సమన్వయ బాధ్యతలు

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఈనాడు - అమరావతి

2ap-main2a.jpg

ఆకృతులు: లండన్‌కు చెందిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ అమరావతిలో పరిపాలనా భవనాల ఆకృతులను ఈ నెల 22న సమర్పించనుంది. మూడు రకాల కాన్సెప్ట్‌ ఆకృతులపై రూపొందించిన వీటిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వ అభిప్రాయాల ప్రకారం ఏప్రిల్‌ 4న తుది ఆకృతిని సమర్పిస్తుంది. దానిని ఏప్రిల్‌ 19న ఖరారు చేస్తారు.

శాసనసభ: జులై 20న శాశ్వత శాసనసభ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 4 అక్టోబర్‌ 2018కి పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. జీ ప్లస్‌ త్రీ భవనంగా నిర్మించనున్నారు. దీనికి రూ.245 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా.

హైకోర్టు: ఆగస్టు 17న శంకుస్థాపన చేస్తారు. 3.4.2019కి నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. దీనిని జీ ప్లస్‌ ఫోర్‌గా నిర్మించనున్నారు. రూ.450 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

సచివాలయం: మే 10న నిర్మాణం ప్రారంభించి, వచ్చే ఏడాది డిసెంబర్‌ 25కు పూర్తి చేయాలనేది లక్ష్యం.

2ap-main2b.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది జులై 20న అమరావతిలో శాసనసభ, ఆగస్టు 17న రాష్ట్ర హైకోర్టు భవన సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. వీటి నిర్మాణాలకు సంబంధించిన ఆకృతులు (డిజైన్లు) రూపొందిస్తున్న ‘మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌’ సంస్థతో గురువారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు. లండన్‌లోని ఆ సంస్థ ప్రతినిధులను ఆకృతుల తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22న ఆకృతులు ఇస్తామని వారు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ విలేకరులకు వెల్లడించారు. 900 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే భవనాల నిర్మాణాలకు సంబంధించిన తుది ఆకృతిని ఏప్రిల్‌ 19న ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా అడుగేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎక్కడా రాజీపడదలచుకోలేదని, అత్యద్భుతంగా నిర్మించాలని తాపత్రయపడుతున్నామని వివరించారు. భారతీయ, ఆంధ్ర సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా, మన వారసత్వ సంపద మేళవించేలా చూడాలని ఆదేశించారు. చరిత్రకారులు, రూపశిల్పులు, చలన చిత్ర కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, పురావస్తు నిపుణులు ఇలా అన్ని వర్గాలతో చర్చించి, సమన్వయపరచి, పర్యవేక్షించే బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌కు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారసత్వ, కళా, చారిత్రక అంశాలన్నింటిపైనా అధ్యయనం చేసి మన నూతన రాజధానిలో ప్రస్ఫుటమయ్యేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పరకాలకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజలను, అర్కిటెక్ట్‌ నిపుణులను, విద్యార్థులను అందర్నీ భాగస్వాములను చేసి వారి సూచనలు తీసుకోవాలని, మెరుగైన వాటికి బహుమతులు అందించాలని చెప్పారు. 2019 జాతీయ క్రీడలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం జరగాల్సి ఉందని సీఎం చెప్పారు.గత రెండేళ్ల కాలంలో అమరావతి నిర్మాణంలో మైలురాళ్లను, 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పదివేల మందికి సరిపడేలా దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏడాదిలో పూర్తి అవుతుందన్నారు. ఈ నెల 28న అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐతో ఎంఓయూ చేసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర రాజధాని ప్రాంతంలో (సీడ్‌ క్యాపిటల్‌) స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన స్విస్‌ ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌ఫై ప్రతిపాదనలు సమర్పించడానికి ఈ నెల 21న తుది గడువుగా నిర్ణయించారు. దీనికి ముందుగా 6వ తేదీన ఆసక్తి ఉన్న బిడ్డర్లతో సీఆర్డీఏ సమావేశం నిర్వహించనుంది.

Link to comment
Share on other sites

Rail Route Confirmed for Amaravati

Union Government has cleared a Railway Route to Amaravati which will enable connect to the Capital from various cities in the country. This Rail Route will not on improve the connectivity but also helps in the development. This track will be of 106 Kilometers long and will cost 2680 Crore.

This line will also ease Traffic Pressure on Vijayawada and Guntur Railway Stations. Those coming to the Capital area can directly come now. However, only One Crore is sanctioned to this project in the current budget. It will be executed in partnership of the state and the Union governments.

The state government should take care of the Land Acquisition and Center will fund for the project. It is estimated that the Rail Route should be complete in 4 years time. One Station is proposed for every Five Kilometers while a terminal will come up near Vaddamaanu.

Link to comment
Share on other sites

2019కి ఓ రూపం

రాజధానిలో విద్య, వైద్యం, పర్యాటకం.. ఆధ్యాత్మికం

అన్ని విభాగాల్లోనూ భూకేటాయింపులు

అమరావతి అభివృద్ధిపై స్పష్టత

ఈనాడు - అమరావతి

5ap-main5a.jpg

రాజధాని అమరావతి అభివృద్ధి 2019నాటికి స్పష్టమైన రూపం సంతరించుకునే దిశగా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు భూమి కేటాయిస్తోంది. విద్య, వైద్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, ఆధ్యాత్మికం, మతపరం, పర్యాటకం, మ్యూజియం తదితరాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తోంది. విద్య, వైద్య సంస్థల్లో ప్రైవేటు రంగానికి చెందిన వాటికి భారీ కేటాయింపులున్నాయి. భూమి కోసం వచ్చిన ప్రతిపాదనల్ని తొలుత రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిశీలించాక మంత్రుల బృందానికి నివేదిస్తుంది. బృందం పరిశీలించి మంత్రిమండలికి సిఫార్సు చేస్తుంది. కేబినెట్‌ ఆమోదం పొందాక కేటాయింపులు ఉంటాయి. ఇప్పటికే 995.5ఎకరాల్ని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రాజధాని నగర పరిధిలో కేటాయించారు. ఆయా సంస్థలిచ్చిన నివేదికల ప్రకారం వీటి ద్వారా సుమారు రూ.17,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 44,406 మందికి ఉపాధి కలుగుతుందని ఆయా సంస్థల అంచనా. ఇప్పటికే పరిశీలన పూర్తయి భూమిని కేటాయించాలని మంత్రుల బృందానికి సీఆర్‌డీఏ సిఫార్సు చేసిన జాబితాలో 13 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలున్నాయి. ఇవి 90ఎకరాలకు సంబంధించిన ప్రతిపాదనలు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న వాటిల్లో భారీగా 747 ఎకరాలకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి.

ముఖ్యమైన ప్రతిపాదనల్లో కొన్ని...

* ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌ (ఏపీఎన్‌ఆర్‌టీ) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సొసైటీ భారీగా రూ.300 కోట్ల వ్యయంతో ఐకానిక్‌ టవర్‌ కట్టేందుకు ప్రతిపాదన ఇచ్చింది.

* బ్రహ్మకుమారీస్‌, ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌, అక్షర్‌ధామ్‌ వంటి సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాలు నెలకొల్పేందుకు భూమి కోరాయి.

* రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ 50ఎకరాల్లో సైన్స్‌ సిటీ నిర్మించేందుకు ప్రతిపాదించింది.

* కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంస్థ నాలెడ్జ్‌ ఎకానమీ జోన్‌ ఏర్పాటుకు 200 ఎకరాలు కోరింది.

* పర్యావరణ వారసత్వంపై అమరావతి అంతర్జాతీయ మ్యూజియాన్ని రూ.150 కోట్లతో నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చింది.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఒక్కొక్కటి చొప్పున ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు స్థలం కోరాయి.

5ap-main5b.jpg

5ap-main5c.jpg

5ap-main5d.jpg

Link to comment
Share on other sites

అమరావతి రాజధానికి మూడు రైలుమార్గాలు మంజూరు
 
636219625702947227.jpg
  • నంబూరు - అమరావతి - యర్రబాలెం రెండు వరసల రైల్వేలైన్
  • నరసరావుపేట - సత్తెనపల్లి.. పెదకూరపాడు - అమరావతి సింగిల్‌ లేన్
ఆంధ్రజ్యోతి, గుంటూరు: అమరావతి రాజధాని రైలుమార్గం అమరికలపై స్పష్టత వచ్చేసింది. అన్ని వైపుల నుంచి రాజధాని నగరానికి కనెక్టివిటీ ఉండేలా మూడు రైలుమార్గాలను రైల్వేబోర్డు ఆమోదించింది. రాయలసీమ వైపు నుంచి వచ్చే రైళ్ల కోసం నరసరావుపేట- సత్తెనపల్లి రైలుమార్గాన్ని మంజూరు చేశారు. అలానే నడికుడి మార్గంలో వచ్చే రైళ్లు పెదకూరపాడు నుంచి అమరావతికి చేరుకొనేందుకు వీలుగా పెదకూరపాడు- అమరావతి రైలుమార్గాన్ని శాంక్షన్ చేశారు. ఇక కాజీపేట మార్గంలో నుంచి వచ్చే రైళ్లు అమరావతికి చేరుకొనేలా యర్రబాలెం - అమరావతి - నంబూరు మార్గాన్ని ఎలైన్ మెంట్‌ చేశారు. ఈ మూడు రైలుమార్గాలను నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు.

అమరావతి రైలుమార్గం సర్వే పూర్తి అయిన నేపథ్యంలో ఇటీవలే బడ్జెట్‌లో 106 కిలోమీటర్ల ఈ రైల్‌లేన్ కు రూ.2,658 కోట్లు కేటాయించారు. సర్వే జరుగుతోన్న సమయంలో మంగళగిరి, కృష్ణాకెనాల్‌ నుంచి లింక్‌ ఇస్తారని అంతా భావించారు. అయితే సర్వే జరిపిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ మాత్రం నంబూరు నుంచి అమరావతి మీదగా యర్రబాలెం (కాజీపేట మార్గంలో కొండపల్లి స్టేషను తర్వాతది) వరకు డబుల్‌ లేనను సిఫార్సు చేసింది. దీని వలన విజయవాడతో సంబంధం లేకుండా కొన్ని రైళ్లను అమరావతి మీదగా నంబూరు, గుంటూరు, న్యూగుంటూరు రైల్వేస్టేషన్ల మీదగా గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లోకి మళ్లిస్తారు. దీని వలన విజయవాడ రైల్వేస్టేషను మీద భారం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమ వైపు నుంచి రాజధానికి రాకపోకలు పెరుగుతోన్న దృష్ట్యా గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌(విద్యుద్దీకరణతో) ప్రాజెక్టును రైల్వే శాఖ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు వైపు నుంచి వచ్చే రైళ్లు అమరావతికి చేరుకొనేందుకు నరసరావుపేట - సత్తెనపల్లి రైలుమార్గాన్ని మంజూరు చేశారు. అలానే పెదకూరపాడు - అమరావతి నూతన రైలుమార్గం కూడా శాంక్షన్ చేశారు. దీని వలన అమరావతికి అన్ని ప్రాంతాలతో అనుసంధానం జరుగుతుంది. అయితే బడ్జెట్‌లో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉన్నది. అమరావతి రైలుమార్గం ప్రాజెక్టుకు కేవలం రూ. కోటి మాత్రమే కేటాయించారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభం కావడం అనుమానమే. గుంటూరు - తెనాలి డబ్లింగ్‌ ప్రాజెక్టును పూర్తి చేయడానికే గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖ ఆపసోపాలు పడుతోన్నది. దీనిని పరిగణనలోకి తీసుకొంటే నాలుగేళ్లలో అమరావతి రైలుమార్గం పూర్తి చేయడం సాధ్యపడదన్న అభిప్రాయం రైల్వేవర్గాల ద్వారా వ్యక్తమౌతోంది

Link to comment
Share on other sites

15న నార్మన్ ఫోస్టర్‌తో భేటీ
 
636221213087343061.jpg
  • రాజధాని డిజైన్లపై చర్చలకు
  • లండన్‌ వెళ్తామన్న నారాయణ
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి డిజైన్ల విషయంలో చర్చల కోసం ఈ నెల 15న లండన్‌ వెళ్లనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలోని 900 ఎకరాల్లో నిర్మించదలచిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌తోపాటు అందులోని ఐకానిక్‌ బిల్డింగ్‌లైన్ శాసనసభ, హైకోర్టులకు డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందిస్తోంది. ముసాయిదా డిజైన్లను నార్మన్ ఫోస్టర్‌ ఈ నెల 22న సమర్పించనున్న నేపథ్యంలో మలివిడత సంప్రదింపుల కోసం తాము లండనకు వెళ్తున్నట్టు మంత్రి నారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాకు వివరించారు. అమరావతి నిర్మాణ ప్రక్రియను అనుకున్న విధంగా ముందుకు సాగించేందుకుగాను దేశ, విదేశాలకు చెందిన 7 ప్రఖ్యాత సంస్థలను కన్సల్టెంట్లుగా నియమించుకున్నామని, వాటి సలహాలు, సూచనలతో వచ్చే మూడేళ్లలో సుమారు రూ.25వేలు-.29వేల కోట్లను వెచ్చిస్తామని తెలిపారు. ఈ మొత్తంలో రాజధానిలో రహదారులు, డ్రెయిన్లు, విద్యుత తదితర మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.20వేలు- 22వేల కోట్లు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.5వేలు- 7వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తామనిచెప్పారు. వాస్తవానికి వచ్చే రెండేళ్లకే పైన పేర్కొన్న పనులు దాదాపుగా పూర్తవుతాయని, మూడో ఏడాదిలో వాటికి తుది మెరుగులు దిద్దే ప్రక్రియను చేపడతామని వివరించారు.
Link to comment
Share on other sites

పరిటాల, క్రోసూరు ప్రాంతాల్లో ఈ రహదారి వాటర్‌ఫ్రంట్‌కు ఆనుకుని వెళ్తున్న దృష్ట్యా అక్కడ ఐదువేల ఎకరాలను భూసమీకరణ పద్ధతిలో తీసుకొంటే అక్కడ ఒక ఆర్థిక నగరాన్ని అభివృద్ధి చేయవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని రైల్వేలైను కోసం ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు

Link to comment
Share on other sites

పరిటాల, క్రోసూరు ప్రాంతాల్లో ఈ రహదారి వాటర్‌ఫ్రంట్‌కు ఆనుకుని వెళ్తున్న దృష్ట్యా అక్కడ ఐదువేల ఎకరాలను భూసమీకరణ పద్ధతిలో తీసుకొంటే అక్కడ ఒక ఆర్థిక నగరాన్ని అభివృద్ధి చేయవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని రైల్వేలైను కోసం ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు

@ anna garu bro kochem light veyyandi dini meda

Link to comment
Share on other sites

రాజధానిలో మంచినీటి కోసం బ్యారేజీ నిర్మస్తాం: నారాయణ
 
గుంటూరు: రాజధానిలో మంచినీటి కోసం ప్రకాశం బ్యారేజీకి 5 కిలోమీటర్ల దూరంలో మరో బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూం కోసం సీఎం బ్లాక్‌పై 18 వేల చదరపు అడుగులతో మరో భవనం నిర్మిస్తామని మంత్రి అన్నారు. భవనాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...