Jump to content

Amaravati

Recommended Posts

బాబుతో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధుల భేటీ
 
విజయవాడ: సీఎం చంద్రబాబుతో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధుల భేటీ అయ్యారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలకు సంబంధించి మూడు డిజైన్లను చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు అందించారు. వీటితో పాటుగా 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం, ల్యాండ్ స్కేప్ డిజైన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను బాబుకు నార్మన్ ఫోస్టర్‌ కంపెనీ ప్రతినిధులు అందించారు.
Link to comment
Share on other sites

antha ardam kaledu...kakapote a REACTORS kanna edaina better :) Fuse lu out ayyai a Maki gadidi chuste..

CBN porapatuna OK chesatadu ani vanikindi avi chuste..

Chustunte "slope"(2:30 daggara) laga undi...kinda nunchi chuste pai daka every building kanapadutundi a model lo

correct ga chepparu,maki designs the worst 

Link to comment
Share on other sites

బ్లూగ్రీన్‌ సిటీగా ఏపీ రాజధాని : సీఎం చంద్రబాబు
 
636239939695781136.jpg
మంగళగిరి : ముంపు భయం లేకుండా ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని అందమైన బ్లూగ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అమరావతికి వరద బెడద నుంచి శాశ్వత విముక్తిని కల్పించే లక్ష్యంతో సీతానగరం వద్ద రూ.237 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌, ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులను చూశాక.. అమరావతి నిర్మాణంలో ఆ తరహా ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి 453 చదరపు కిలోమీటర్ల పరిధిలో కురిసిన వర్షం కొండవీటి వాగుకు చేరి 12వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుందన్నారు. ఇందులో ఐదువేల క్యూసెక్కులను ఎత్తిపోతల ద్వారా ప్రకాశం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి మిగతా వరదనీటిని సమీప కాలువల్లోకి (బకింగ్‌హామ్‌ కాలువ, గుంటూరు ఛానల్‌) పంపే విధంగా డిజైన్‌ చేశామన్నారు.
 
ప్రస్తుతం 20 మీటర్ల నుంచి 30 మీటర్ల వెడల్పువున్న కొండవీటివాగును రెండొందల మీటర్లకు విస్తరించి వరద నీరు సజావుగా పారేలా చేయడంతో పాటు దీనిని రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిని కొండవీటివాగు, బకింగ్‌హమ్‌ కాలువ, కృష్ణానదులతో కలిపి నాలుగువైపులా పాండిచ్చేరి, తెలంగాణా, ఛత్తీస్‌ఘడ్‌, కాకినాడలతో అనుసంధానం చేసి జల రవాణా వ్యవస్థను అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. దీని వల్ల రైతులకు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోనుందన్నారు. రాజధాని అమరావతికున్న పెద్ద ఆస్తి నీళ్లేనని.. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల వరకు నీళ్లే ఉన్నాయని.. దీనిని రెండు వైపులా చక్కగా అభివృద్ధి చేయగలిగితే ప్రపంచంలోనే అత్యద్భుతమైన బ్లూగ్రీన్‌ సిటీగా అవతరిస్తుందన్నారు.
 
దశాబ్దాలుగా కొనసాగుతున్న కొండవీటివాగు సమస్య కారణంగా ఈ ప్రాంతంలో సుమారు 14 వేల ఎకరాలు ముంపునకు గురయ్యేవని... తాను లోగడ పలుమార్లు ముంపు గ్రామాలను సందర్శించానని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో రూ.90 లక్షల వ్యయంతో ముంపు నివారణ చర్యలను చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని వాగ్దానం చేశామని...దానిని ఇవాళ నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ముందుకు రాబట్టే రాజధాని అమరావతిని బ్రహ్మండంగా నిర్మించుకునే అవకాశం వచ్చిందన్నారు. ఇదో గొప్ప స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములివ్వడం ద్వారా రైతులు రాష్ట్రానికే కాకుండా యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వారిని ఎప్పటికప్పుడు అభినందించి తీరాల్సిందేనన్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబుకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల నివేదిక
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాలుగు రకాల డిజైన్లు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు అందచేశారు. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించనున్నారు. నార్మన్ పోస్టర్ కాన్సెప్ట్‌లను రేపు కేబినెట్‌ భేటీలో మంత్రులు, కార్యదర్శులకు చంద్రబాబు వివరించనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు పూర్తి స్థాయి మాస్టర్‌ ప్లాన్‌ ఇవ్వనున్నారు. మార్చి 22న మరోసారి సీఎంతో నార్మన్ ప్రతినిధులు సమావేశంకానున్నారు.

sony bro fb lo tdp official page lo konni photos pettaru,ikkada post cheyyi bro

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...