Jump to content

Amaravati


Recommended Posts

Representatives from award winning British design firm Foster and Partners presented the revised designs for assembly and high court to Sri NCBN. Upon thorough review, Sri NCBN suggested changes and requested the architects to finalize the designs soon.

 

19956260_1743539312326319_55995841537062

 

19944568_1743538745659709_29922161751864

Link to comment
Share on other sites

 

ఈ నెల 15న, అమరావతి తొలి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభం

హేళనగా.. అవమానకరంగా, అమరావతిని భ్రమరావతి అని మాట్లాడినవారికి అభివృద్ధే సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తున్నారు.

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. నీరుకొండకు చేరువలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ, మరి కొద్ది వారాల్లో తరగతులను మొదలు పెట్టబోతున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని జూలై 15 న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో 240మందికి అవకాశం కల్పిస్తున్నారు.

రూ.3వేలకోట్లతో నిర్మిస్తోన్న ఎస్‌ఆర్‌ఎంని మొదటి దశలో 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

అమరావతికి జపాన్‌ సహకారం

నేడు సీఎం చంద్రబాబుతో చర్చలు

అమరావతి: జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి) మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రానికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్‌ సహకారం వంటి అంశాలపై ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. జపాన్‌ నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు, పారిశ్రామిక వేత్తలకు మధ్య చర్చలు జరుగుతాయి. రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరిస్తారు. అమరావతికి జపాన్‌ సహకారంపై ఈ సందర్భంగా ‘మేటి’కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరగనుంది. రాజధాని అమరావతికి ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) మాస్టర్‌ ప్లాన్‌, ఎలక్ట్రానిక్‌, స్పోర్ట్స్‌, సిటీ మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన, రాజధాని ప్రాంతానికి డేటా సెంటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం, రాడార్‌ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్‌ సహకారం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉంటాయి. సీఆర్‌డీఏ ప్రాంతానికి సమీకృత ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై అధ్యయనానికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఇప్పటికే అంగీకరించింది. దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్న అంశాన్నీ ఈ ఒప్పందంలో పొందుపర్చుతారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులకు జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ (జెబిక్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్య సహకారానికి సంబంధించిన అంశాలపైనా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. మేటి, జెబిక్‌లతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి శంకుస్థాపన సందర్భంగా (2015 అక్టోబరు 22న) ఎంఓయూలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఆర్‌డీఏ అధికారులు 2016 డిసెంబరులో జపాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మేటి, సీఆర్‌డీఏ అధికారుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.920 కోట్లు ఇవ్వాల్సిందిగా జైకాకి సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. జపాన్‌ 2020లో ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమవుతోంది. అదే పద్ధతిలో అమరావతిలోను క్రీడా సదుపాయాల కల్పనకు సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని స్మార్ట్‌ సిటీగా రూపొందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాల కోసం సీఆర్‌డీఏ జపాన్‌ సహకారం కోరుతోంది.

Link to comment
Share on other sites

stupa ni high court  ki assembly ki diamond set chesaru

 

Stupa ni assembly ki vunchithe bagundedhi...roju andaru tv lo chusedhi adhe kada koncham mana charitra ki related ga vuntundhi...ee diamond shape antha artificial ga vundhi...

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...