Jump to content

Greater Vijayawada


Recommended Posts

  • 4 months later...
  • 1 month later...
6 నెలల్లో హోదా

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ఆరు నెలల్లో విజయవాడ మహానగరంగా మారనుంది. హైదరాబాద్‌, విశాఖ నగరాలకే పరిమితమైన మహానగర హోదా ఇక విజయవాడకు త్వరలో దక్కనుంది. విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం లోగడ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన 19 గ్రామాలతో కలిపి 45 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం విజయవాడ పరిధి 61.9 చ.కి.మీ.లు. జనాభా 15 లక్షల దాకా ఉంది. 45 గ్రామాలను కలిపితే జనాభా 20 లక్షలు దాటనుందని అంచనా.

విలీన గ్రామాలు: గన్నవరం, కంకిపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నున్న, పాతపాడు, రాయనపాడు, పైడూరిపాడు, గొల్లపూడి, నల్లకుంట, కొత్తూరు తాడేపల్లి, షాబాదా, జక్కంపూడి, మంగలాపురం, అంబాపురం, ఫిర్యాదినైనవరం, నిడమానూరు, గూడవల్లి, ఎనికపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, డోన్‌ఆత్కూరు, కేసవపల్లి, బుద్ధవరం, ఉప్పులూరు, కూనవరం, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు, గుంటుపల్లి, సూరాయపాలెం, పునాదిపాడు, ఎదురుపావులూరు సహా మరో 11 గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం కానున్నాయి.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 2 weeks later...
  • 2 weeks later...

మెగాసిటీ.. రెడీ
10-01-2018 09:06:52

19న కానూరులో డివిజనల్‌ పంచాయతీ సమావేశం
విలీన జాబితాలో నాలుగు మండలాలు
మొత్తం 32 పంచాయతీలకు నోటీసులు
సమావేశానికి రాకపోతే క్రమశిక్షణ చర్యలు
గన్నవరం మండల గ్రామాలకు అందని ఆహ్వానాలు
బెజవాడ ‘మెగాసిటీ’గా అవతరించటానికి రంగం సిద్ధమౌతోంది. నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల విలీనానికి సన్నాహకంగా విజయవాడలో ఈ నెల 19న కానూరులో జరగనుంది. విలీనం జరిగితే జనాభా ఆరు రెట్లు పెరుగుతుంది. మొత్తం 403.7 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఈ ప్రతిపాదలకు కొన్ని గ్రామాలు అనుకూలంగా ఉండగా.. మరికొన్ని పంచాయతీలు వ్యతిరేకిస్తున్నాయి.

విజయవాడ(ఆంధ్రజ్యోతి): బెజవాడ ‘మెగాసిటీ’గా అవతరించటానికి రంగం సిద్ధమౌతోంది. విజయవాడ శివారున ఉన్న ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్‌ మండలాల పరిధిలోని గ్రామాల విలీనానికి సన్నాహకంగా విజయవాడ డివిజనల్‌ పంచాయతీ సమావేశం ఈ నెల 19న కానూరులో జరగబోతోంది. పై నాలుగు మండలాలలోని మొత్తం 32 గ్రామ పంచాయతీలకు డివిజనల్‌ పంచాయతీ అధికారి (డీపీవో) చంద్రశేఖర్‌ నోటీసులు జారీ చేశారు. కానూరులోని తులసీనగర్‌ - వరలక్ష్మీపురం కాలనీ ఆంజనేయస్వామిగుడి దగ్గర ఉన్న పోలవరపు వెంకటకృష్ణయ్య కమ్యూనిటీ హాల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు మండలాల విలీన ప్రతిపాదనలో ఉన్న గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీ విస్తరణాధికారులు ఈ సమావేశానికి విలీన తీర్మానాలను తమ వెంట తీసుకు రావాలని డీపీవో ఆదేశించారు. ఈ సమావేశాన్ని డివిజనల్‌ పంచాయతీ అధికారి (డీపీవో) చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
 
సమావేశానికి తీర్మానాల కాపీలతో రాని సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీ విస్తరణాధికారులు (ఈవో పీఆర్‌డీ) రాకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో హెచ్చరించారు. మెగాసిటీగా బెజవాడను విస్తరించటానికి ఇంతకు ముందే కృష్ణా జిల్లా యంత్రాంగం 45 గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదన తీసుకు వచ్చింది. ప్రస్తుతం విజయవాడ నగర విస్తీర్ణం 62 చదరపు కిలోమీటర్లు ఉంది. మొత్తం 45 గ్రామాల విస్తీర్ణం విజయవాడతో కలిపితే మొత్తం 403.7 చదరపు కిలోమీటర్లు అవుతుంది. అంటే.. ప్రస్తుత బెజవాడ కంటే ఆరు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం విజయవాడ జనాభా 10.50 లక్షలుగా ఉంది. విలీన ప్రతిపాదిత 45 గ్రామ పంచాయతీల మొత్తం జనాభా విజయవాడతో కలిపి 14,74,142 అవుతుంది. ఈ జనాభా 2017 నాటికి 17,07,104 అవుతుందని, 2021 నాటికి 18,55,153 గా ఉంటుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. విలీన ప్రతిపాదిత పంచాయతీలతోపాటు విజయవాడ నగర జనాభా వృద్ధిరేటు చూస్తే 2011 నాటి సెన్సస్‌ కంటే 24.92 శాతం అదనంగా నమోదైంది.
 
గన్నవరం మండలానికి అందని నోటీసులు
మొత్తం 45 గ్రామపంచాయతీలు విలీన ప్రతిపాదిత జాబితాలో ఉండగా విజయవాడ డివిజన్‌ స్థాయి సమావేశానికి 32 గ్రామాలనే ఆహ్వానించటం చర్చనీయాంశంగా మారింది. గన్నవరం మండలం పరిధిలోని 13 గ్రామాలు కూడా విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. వీటికి నోటీసులు ఇవ్వకపోవటంపై సందిగ్ధత నెలకొంటున్నాయి. గన్నవరం ఐటీ కంపెనీలకు, ఇండస్ర్టియల్‌ కారిడార్లకు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు కేంద్రంగా ఉంది. అలాంటి మండలాన్ని ఎందుకు మినహాయించారన్న దానిపై చర్చ నడుస్తోంది. డీపీవో అఫీసు వర్గాలు అందుబాటులో లేకపోవడం వల్ల స్పష్టత లోపించింది.
 
సమావేశంలో తీర్మానాల స్వీకరణ
ఈ నెల 19న జరిగే డివిజనల్‌ స్థాయి సమావేశంలో అన్ని గ్రామ పంచాయతీల నుంచి తీర్మాన కాపీలను స్వీకరిస్తారు. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి చూస్తే సింహభాగం గ్రామాలు విలీనానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. మరికొన్ని గ్రామాలు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. తీర్మానాలు తీసుకోవటం ప్రొసీజర్‌ అయినప్పటికీ, నిర్ణయాన్ని ప్రభావితం చేసేదిగా ఉండదు. ప్రభుత్వం ఎలాగూ మెగాసిటీగా చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది కాబట్టి పంచాయతీల నుంచి ప్రతికూలంగా ఎలాంటి తీర్మానాలు వచ్చినప్పటికీ మెగా సిటీ ప్రకటనకు ప్రతిబంధకం కాదు.
 
విలీనానికి మేము సుముఖం
గతంలో పంచాయతీల పరిధిలో ఇళ్ల ప్లాన్ల మంజూరు ఉండేది. ఇప్పుడు సీఆర్‌డీఏకు బదలాయించారు. దీంతో పంచాయతీలకు ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. గతంలో ఇసుక మీద కూడా పంచాయతీలకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇంటి పన్నులను కూడా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. స్థానిక పంచాయతీలుగా భవిష్యత్తు ఏమిటన్నది అర్థం కావటం లేదు. సిబ్బంది జీతాలు ఇవ్వటానికి కూడా రూ. లక్షల్లో అప్పు చేయాల్సి వస్తోంది. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గొల్లపూడి గ్రామాన్ని విజయవాడలో విలీనం చేయటానికి అభ్యంతరం లేదని మా భావన. ఆ మేరకు తీర్మానం చేశాం. ఈ నెలలో జరిగే సమావేశంలో దానిని సమర్పిస్తాం.
సాధనాల వెంకటేశ్వరమ్మ, గొల్లపూడి సర్పంచ్‌
 
విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..
గతంలో విజయవాడలో విలీనం చేసిన గ్రామాలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ఇప్పుడు మా పంచాయతీలను కలిపి ఏమి అభివృద్ధి చేస్తారు ? విజయవాడ కార్పొరేషన్‌ అప్పులలో ఉంది. మా పంచాయతీలను కలుపుకుంటే ఏ నిధులు పెట్టి కార్పొరేషన్‌ అభివృద్ధి చేయగలదు. ఇప్పటి వరకు చేసిన తీర్మానాలన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక మీదట కూడా సానుకూలంగా ఉండదు. విలీనాన్ని మేం వ్యతిరేకిస్తాం.
తుమ్మల సోమయ్య, కానూరు సర్పం

Link to comment
Share on other sites

అర్బనైజేషన్‌ దిశగా..
19-01-2018 11:50:19
 
636519594207476556.jpg
  • జిల్లాలో సగం పట్టణ జనాభా!
  • 2011 జనాభా లెక్కల ప్రకారమే పట్టణ జనాభా 18,57,291
  • జిల్లాలో తొమ్మిది పట్టణాలు
  • కార్పొరేషన్‌ హోదాలో విజయవాడ
  • స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలుగా మచిలీపట్నం, గుడివాడ
  • సెకండ్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలుగా జగ్గయ్యపేట, నూజివీడు
  • నగర పంచాయతీలుగా తిరువూరు, ఉయ్యూరు, నందిగామ
  • సగానికి సగం మండల కేంద్రాలకు పట్టణ రూపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లా పల్లె ముద్రను వదిలి పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో మొత్తం 50 మండలాల్లో 970 గ్రామ పంచాయతీలు, తొమ్మిది పట్టణాలున్నాయి. అర్బనైజేషన్‌ ప్రభావంతో తాజాగా మరో ఆరు పంచాయతీ లకు పట్టణ హోదా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 మండ లాల్లో సగం ఇప్పటికే పట్టణ ముసుగు తొడు క్కున్నాయి. ఇవి మేజర్‌ గ్రామ పంచాయతీ లుగా చలామణి అవుతున్నాయి. కొన్ని పట్టణా లుగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలో పట్టణీకరణ దిశగా అడుగులు పడుతున్న వైనంపై దృష్టి సారిస్తే అనేక విషయాలు అవగతమవు తున్నాయి.
 
మెగాసిటీగా విజయవాడ..
కృష్ణాజిల్లా తూర్పు, పశ్చిమ కృష్ణాలనే రెండు భాగాలుగా కలిసి ఉంటుంది. ఈ రెండింటి మధ్యన విజయవాడ నగరం ఉంది. ఇది పరిపాలనా కేంద్రంగానూ ఉంటోంది. జిల్లా కేంద్ర కార్యకలాపాలన్నీ దాదాపు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. విజయవాడ ప్రస్తుతం టూ టైర్‌ సిటీగా ఉంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇక్కడ పాలక సంస్థగా ఉన్నా, జిల్లా యంత్రాంగం పరిపాలనా వ్యవహరా లన్నీ ప్రధానంగా ఇక్కడి నుంచే జరుగుతు న్నాయి. విజయవాడ నగర ప్రస్తుత విస్తీర్ణం 61.88 స్క్వేర్‌ కిలోమీటర్లుగా ఉంది. 10.39 లక్షల జనాభా నివసిస్తోంది. స్క్వేర్‌ కిలోమీటర్‌ విస్తీర్ణంలో 16,800 మంది జనాభా నివసిస్తోంది. విజయవాడను మెగాసిటీగా రూపాంతరం చెందించటానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే విజయవాడకు తూర్పు, పశ్చిమ, ఉత్తర, వాయువ్య దిశలలో ఉన్న దాదాపు 45 గ్రామాలను విలీనం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్‌, ఇబ్రహీం పట్నం, గన్నవరం మండలాలకు చెందిన ఈ గ్రామాలన్నీ విజయవాడలో విలీనానికి సిద్ధమవుతున్నాయి. ఈ గ్రామాల విలీనంతో విజయవాడ విస్తీర్ణం ఆరు రెట్లు అంటే 404 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతోంది.
 
తొమ్మిది పట్టణాలు..
జిల్లాలో మొత్తం తొమ్మిది పట్టణాలు న్నాయి. వీటిలో ప్రధానమైనది విజయవాడ నగరం. మిగిలిన వాటిలో జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం ముఖ్యమైంది. ఇక్కడ పోర్టు నిర్మాణంతో పాటు, ఇండస్ర్టియల్‌ కారిడార్‌, రోడ్డు - రైల్‌ నెట్‌వర్క్‌లు సాకారం కానున్నాయి. ఈ క్రమంలో మచిలీపట్నం కూడా స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ హోదా అందుకోవటానికి సిద్ధం అవుతోంది. పోతేపల్లి, మాచవరం, మేకవానిపాలెం, కరగ్రహారం, గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్‌ఎన్‌ గొల్లపాలెం, అరిసేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉన్నాయి. మచిలీ పట్నం మునిసిపాలిటీ ప్రస్తుత విస్తీర్ణం 26.67 చదరపు కిలోమీటర్లు. జనాబా 1,70,008 మంది. చదరపు కిలోమీటర్‌కు 6374 మంది జనాబా ఇక్కడ నివసిస్తోంది. స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా ఉన్న గుడివాడ కూడా కార్పొరేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. గుడివాడ మునిసిపాలిటీ ప్రస్తుత విస్తీర్ణం 12.67 చదరపు కిలోమీటర్లు. వలివర్తిపాడు, లింగవరం, గుడివాడ, జనార్థనపురం, పెదపారుపూడి, బల్లిపాడు, భూషణగుళ్ళ, పాములపాడు, మల్లయపాలెం, మహేశ్వర పురం, బొమ్ములూరు మునిసిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా పట్టణ రూపు సాధించి మరింత విస్తృతమవుతున్నాయి.
 
 
సెకండ్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలుగా ఉన్న వాటిలో జగ్గయ్యపేట, నూజివీడు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. విజయవాడ తర్వాత విస్తీర్ణంలో ఈ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. నూజివీడు 28.69 చదరపు కిలోమీటర్లలోనూ, జగ్గయ్యపేట 23.05 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ ఉన్నాయి. ఈ రెంండింటిలోనూ కలిపి దాదాపు లక్షకు పైగా జనాభా నివసిస్తోంది. నూజివీడు మునిసిపాలిటీ పరిధిలో అన్నవరం, బోర వంచ, రామన్నగూడెం, సుంకొల్లు, వెంకటాయ పాలెం, తుక్కులూరు, పోతిరెడ్డిపల్లి, యన మదల గ్రామాలు ఉన్నాయి. జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలో బలుసుపాడు, అనుమంచిపల్లి, షేర్‌ మహమ్మద్‌పేట, రవికం పాడు, తిరుమలగిరి, టీజీ పాలం, చిల్లకల్లు ఉన్నాయి. నూజివీడు, జగ్గయ్యపేటలను స్పెషల్‌ గ్రేడ్‌ లేదా కార్పొరేషన్లుగా అయ్యే అవకాశం ఉంది. పెడన మూడవ గ్రేడ్‌ మునిసిపాలిటీగా ఉంది.
 
నగర పంచాయతీలూ తక్కువేమీ కాదు :
జిలాల్లో తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలుగా ఉన్నాయి. సెకండ్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలుగా ఉంటూ విజయవాడ తర్వాత స్థానంలో ఉన్న జగ్గయ్యపేట, నూజివీడు మునిసిపాలిటీల విస్తీర్ణం కంటే కూడా ఈ నగర పంచాయతీల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇక్కడ పట్టణీకరణ శరవేగంగా జరగటానికి అవకాశాలున్నాయి. తిరువూరు నగర పంచాయతీ 27.67 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జనాబా 35 వేల వరకు నివసిస్తున్నారు. అయితే ఉయ్యూరు ఇక్కడ ప్రత్యేకం. దీని విస్తీర్ణం 10.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే అయినప్పటికీ.. 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. నందిగామ నగర పంచాయతీ కూడా విస్తీర్ణంలో అతి పెద్దదిగా చెప్పుకోవాలి. నందిగామ మునిసి పాలిటీ 28.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 44 వేల జనాభా నివసిస్తోంది.
 
ప్రతిపాదిత నగర పంచాయతీల స్వరూపం ఇది..
జిల్లాలో మరో ఆరు మండల కేంద్రాలకు నగర పంచాయతీల హోదా కల్పించాలన్న ప్రతిపాదనలు జిల్లా నుంచి ప్రభుత్వానికి వెళ్ళాయి. వీటిలో అవనిగడ్డ (27 వేల జనాబా), కైకలూరు (22 వేలు), మైలవరం (21 వేలు), పామర్రు (22 వేలు), విస్సన్నపేట (17 వేలు), కలిదిండి (33 వేలు) ఉన్నాయి. ఈ మండల కేంద్రాలన్నీ కూడా జిల్లా కేంద్రానికి కనిష్ఠంగా 39 కిలోమీటర్లు గరిష్ఠంగా 108 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అమరావతి రాజధాని కనిష్ఠంగా 48 కిలోమీటర్లు, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం. ఈ ప్రతిపాదిత నగర పంచాయతీలు జిల్లాలోని ప్రధాన పట్టణాలతోను, ఇతర జిల్లాల పట్టణాలతోనూ లావాదేవీలు ఎక్కువుగా జరుపుతుంటాయి. అవనిగడ్డకు రేపల్లె పట్టణం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. కైకలూరుకు భీమవరం పట్టణం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాకపోకలు ఉన్నాయి. మైలవరం నుంచి విజయవాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్సన్నపేటకు నూజివీడు మునిసిపాలిటీ 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలిదిండికి భీమవరం మునిసిపాలిటీ 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...