sonykongara Posted January 30, 2018 Author Share Posted January 30, 2018 కార్పొరేషన్‌లో విలీనానికి గొల్లపూడి పంచాయతీ ఓకే 30-01-2018 06:22:49 విజయవాడ: గొల్లపూడి గ్రామ పంచాయతీని విజయవాడ నగరపాలకసంస్థలో విలీనంచేసేందుకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సర్పంచ్ సాధనాల వెంకటేశ్వరమ్మ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు పలు సూచనలతో కూడిన ‘విలీన’ తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాలకు విలీనం తేదీ నుంచి పది సంవత్సరాల పాటు పన్ను మినహయించా లని, పంచాయతీ సిబ్బందిని, కాంట్రాక్టు కార్మికులను నగరపాలకసంస్థలో రెగ్యులర్ చేసి కొనసాగించాలని, సూచించినట్టు తెలిపారు. పైడూరుపాడు పాలకవర్గ సమావేశం కూడా తమ గ్రామాన్ని విజయవాడ నగరంలో విలీనం చేసేందుకు తీర్మానించిందని ఆ పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు. రాయనపాడు నో.. విజయవాడ నగరంలో విలీనాన్ని రాయనపాడు పంచాయతీ తిరస్కరించింది. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో ‘విలీన’ తీర్మానం వీగిపోయింది. తీర్మానంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఓటింగ్ నిర్వహించారు. 12 మంది సభ్యుల్లో ఆరుగురు అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో సర్పంచ్ తలారి అరుణ కుమారి ఓటు ప్రత్యేకమైంది. ఆమె కూడా వ్యతిరేకంగా ఓటు వేయడంతో విలీనానికి నో చెప్పినట్టయిం Link to comment Share on other sites More sharing options...
APDevFreak Posted January 30, 2018 Share Posted January 30, 2018 http://players.brightcove.net/1384193102001/NJgI8K0ie_default/index.html?videoId=5597494640001#vjs_video_3 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted January 30, 2018 Share Posted January 30, 2018 (edited) 13 minutes ago, Jeevgorantla said: http://players.brightcove.net/1384193102001/NJgI8K0ie_default/index.html?videoId=5597494640001#vjs_video_3 Vizag lo cisco&IBMe.t.c same itlantide inka advanced chestunaru.... Edited January 30, 2018 by AnnaGaru Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 31, 2018 Author Share Posted January 31, 2018 ఒకప్పటి ముంపు ప్రాంతం నేడు సూపర్ అర్బన్ 31-01-2018 07:42:50 ఒకప్పుడు.. వరద ముంపు ప్రాంతం నేడు.. సూపర్ అర్బన్.. ఇన్నర్ రింగ్‌ను దాటేసి శరవేగంగా విస్తరణ మెగాసిటీ విలీన ప్రతిపాదిత గ్రామాలకు వారధి విజయవాడతో నున్న, గన్నవరం, నూజివీడు అనుసంధానం అజిత్‌సింగ్‌నగర్.. ఒకప్పుడు వర్షాకాలం వస్తే వరద ముంపునకు గురైన శివారు ప్రాంతం. ఇప్పుడు దీని రూపు మారిపోయింది. బహుళ అంతస్థుల భవనాలతో, ఫ్లై ఓవరు, ఇన్నర్ రింగ్‌లతో మహా నగరాన్ని తలపిస్తోంది. వరదముంపు భయంతో ఇక్కడ ఇళ్లు కట్టాలంటే భయపడే పరిస్థితులు పోయి, భారీ బహుళ అంతస్థుల సముదాయాలు పుట్టగొడుగుల మాదిరిగా వెలిశాయి. విశాలమైన రహదారులతో బెజవాడకు ఉత్తర, ఈశాన్య దిశన ఉన్న శివారు ప్రాంతం ఇది. విజయవాడను అనుకుని కేంద్రీకృతమైన సెంట్రల్ అర్బన్ ఏరియాపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.... (ఆంధ్ర జ్యోతి, విజయవాడ /అజిత్‌సింగ్‌నగర్) బుడమేరు వరదలతో ముంపు ప్రాంతంగా అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ అర్బన్ ఏరియా ఇప్పుడు సూపర్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ముంపు నుంచి శాశ్వత రక్షణ లభించటం.. విజయవాడ జన సంధ్రంగా మారిపోయి విస్తరణకు అనుకూలంగా ఉండటంతో సెంట్రల్ శివారు ప్రాంతం అధునాతన రూపం సంతరించుకుంటోంది. అర దశాబ్ద కాలంగా సెంట్రల్ అర్బన్ ఏరియా విస్తరిస్తూ వస్తోంది. అజిత్‌సింగ్‌నగర్, రామకృష్ణాపురం, అయోధ్యనగర్, వాంబేకాలనీ, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం తదితర ప్రాంతాలన్నీ మెగా అర్బనైజేషన్ దిశగా అడుగులు వేశాయి. మూడు సంవత్సరాలుగా ఊహించని మార్పులతో ఈ ప్రాతం నవ నగరంగా విస్తరిస్తోంది. విపత్తులను జయించిన ప్రాంతం.. సెంట్రల్ అర్బన్ ఏరియా ఉత్తర, పశ్చిమ దిశగా బుడమేరు ప్రవహిస్తోంది. మైలవరం కొండ ప్రాంతం, ఖమ్మం జిల్లా క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి బుడమేరు ఈ ప్రాంతం మీదుగా వెళుతూ కొల్లేరులో కలుస్తుంది. ఒకప్పుడు వర్షాకాలంలో పరివాహక ప్రాంతంలో ఉన్న అజిత్‌సింగ్‌నగర్, వాంబేకాలనీ, రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్, జక్కంపూడి, ఎల్‌బీఎస్ నగర్, రాజీవ్‌నగర్, ఇందిరానాయక్ నగర్‌లను వరద ముంచెత్తేది. వెలగలేరు దగ్గర డైవర్షన్ చానల్ ఏర్పాటు ద్వారా నేడు 15 వేల క్యూసెక్కుల వరద వచ్చినా మళ్ళించగలిగే పరిస్థితి వచ్చింది. వాహ్... ఇందిరానాయక్ నగర్ దశాబ్దం క్రితం ఈ ప్రాంతంలో పక్కా ఇంటిని కట్టేవాళ్ళను ఎగతాళి చేసేవారు. ఇక్కడ గజం భూమి విలువ రూ. 600 ఉంటే గొప్ప. నేడు ముంపు సమస్య నుంచి బయటపడ్డాక... గజం రూ.60 వేల నుంచి రూ. 80 వేల వరకు పలుగుతోంది. ఈ ప్రాంత స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఎనిమిదేళ్ళుగా ఈ ప్రాంతం అభివృద్ధిలో నగరంతో పోటీ పడుతోంది. రాజధాని ప్రకటన తర్వాత శరవేగంగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఒకప్పుడు మురికివాడగా ఉన్న ఇందిరానాయక్ నగర్‌లో నేడు ఎటు చూసినా భారీ బహుళ అంతస్థుల భవనాలే. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా రూపాంతరం చెందనుంది. సింగ్‌నగర్.. సింగపూరే.. సెంట్రల్ అర్బన్ ఏరియాకు గుండెకాయ అజిత్‌సింగ్‌నగర్. ఒకప్పుటి మురికవాడ ఇది. అప్పటి కమిషనర్ అజిత్‌సింగ్ చలవతో ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాల కల్పన మెరుగవడంతో ఆయన పేరునే ఇక్కడి ప్రజలు తమ ప్రాంతానికి పెట్టుకున్నారు. మురికివాడగా ఉండే సింగ్‌నగర్‌ను నేడు.. బెజవాడలో ఏ కాలనీ లేని విధంగా ఉంది. అధునాతన భవనాలతో ఈ ప్రాంతం మహానగరాన్ని తలపిస్తోంది. ఇక్కడ పేదలకూ బహుళ అంతస్థుల భవనాలు సెంట్రల్ అర్బన్ ఏరియా నవీ ముంబయి తరహాలో కనిపిస్తుంది. సింగ్‌నగర్, రాధానగర్, వాంబేకాలనీ, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బహుళ అంతస్థుల భవనాలు ఏర్పాటయ్యాయి. పేదల ఇళ్ళన్నీ జీ ప్లస్ 3, 5 భవనాలే. త్రీస్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్ వచ్చాయి. రెసిడెన్షియల్ గ్రూప్‌హౌస్‌లకైతే లెక్కే లేదు. సువిశాల రహదారులు ఈ ప్రాంతంలో సువిశాల రహదారులు ఉన్నాయి. ఇంత సువిశాల రహదారులు విజయవాడలో మరెక్కడా కనిపించవు. ఈ రహదారులు సెంట్రల్ అర్బన్ ఏరియాకు కొత్త వన్నెలద్దాయి. ఈ రోడ్ల వెంబడే భారీ బహుళ అంతస్థుల భవన సముదాయాలు పుట్టుకొచ్చాయి. సెంట్రల్ అర్బన్ ఏరియాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ నిలుస్తుంది. విజయవాడ శివారు ప్రాంతంలో మొట్టమొదటి ఫ్లై ఓవర్ ఇది. నూజివీడు ప్రధాన రోడ్డుతో విజయవాడ నగరాన్ని ఈ ఫ్లై ఓవర్ అనుసంధానం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు సెంట్రల్ ఏరియాకు ఆభరణంగా నిలుస్తుంది. నాలుగు వరసల ఇన్నర్ రింగ్ ఈ ప్రాంత రూపురేఖలనే మార్చివేసింది. కండ్రిక నుంచి అజిత్‌సింగ్‌నగర్ మీదుగా పాయకాపురంను కలుపుతూ మాచవరం పొలాల మీదుగా గుణదల, రామవరప్పాడులకు వెళుతుంది. విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే పట్టే సమయం కంటే ఇన్నర్ రింగ్ మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవటం చాలా తేలిగ్గా మారిపోయింది. విలీన ప్రతిపాదిత ప్రాంతాలకు అనుసంధానం సెంట్రల్ అర్బన్ ఏరియా ఇప్పుడు మెగాసిటీలో విలీనం కానున్న గొల్లపూడి, జక్కంపూడి, నున్న, సూరంపల్లి, గన్నవరం , రామరప్పాడు, నిడమానూరు, కేసరపల్లి ప్రాంతాలకు అనుసంధాన వారధిగా మారిపోయింది. ఈ ప్రాంతాల నుంచి సెంట్రల్ అర్బన్ ఏరియాకు ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు, ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన రోడ్డు మార్గాల వల్ల అతి తక్కువ దూరంలోనే అనుసంధానం ఏర్పడింది. ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలుగా ఉన్న గన్నవరం, నున్న ప్రాంతాలకు సెంట్రల్ అర్బన్ ఏరియా అనుసంధానమైతే... మరింత విస్తరించే అవకాశం ఉంది. బెజవాడకు ఉత్తర, వాయువ్య ప్రాంతం అంతా భవిష్యత్తులో అతిపెద్ద అర్బన్ ఏరియాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు ఆశ.. ఎంబీపీ స్టేడియం సింగ్‌నగర్‌లో మాకినేని బసవపున్నయ్య స్టేడియం భవిష్యత్తులో ఒక ల్యాండ్‌మార్క్ కానుంది. అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా దీనిని అభివృద్ధి చేయటానికి కావలసినంత భూమి ఇక్కడ ఉంది. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 5, 2018 Share Posted February 5, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 22, 2018 Share Posted February 22, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 21, 2018 Author Share Posted March 21, 2018 మెగాసిటీ’కి .. కార్యరూపం!21-03-2018 08:20:58 రాష్ట్ర ప్రభుత్వానికి.. జిల్లా యంత్రాంగం నివేదిక నలుగురు జోనల్ కమిషనర్లకు ప్రతిపాదన విలీన గ్రామాల అభివృద్ధికి.. డీపీఆర్ విలీనానికి ఆసక్తి చూపించే మరిన్ని గ్రామాలకు అవకాశం జిల్లా యంత్రాంగాన్ని కోరితే... ప్రభుత్వానికి నివేదిక విజయవాడ: మెగాసిటీ కార్యరూపం దాల్చడానికి కీలక మైన మరో అడుగు పడింది ! విజయవాడ నగరంలో మొత్తం 51 గ్రామ పంచాయతీల విలీనాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. డివిజినల్ పంచాయతీ అధికారులు పంచాయతీల నుంచి స్వీకరించిన తీర్మానాలను అనుసరించి సమగ్ర నివేదికను అందజేసింది. పంచాయతీల తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతిపాదిత 45 గ్రామపంచాయతీల్లో మూడొంతులు అంగీకరించగా, ఒక వంతు తిరస్కరించాయి. విలీన ప్రతిపాదిత జాబితాలో లేని గ్రామాలు విజయవాడలో విలీనం కావడానికి ఆసక్తి చూపిన నేపథ్యంలో వాటి తీర్మానాలను పంపారు. విజయవాడ నగర ప్రస్తుత విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు. ప్రతిపాదిత విలీన గ్రామాల విస్తీర్ణం 341.82 చదరపు కిలోమీటర్లుగా ఉంది. మొత్తం కలిపితే 403.7 చదరపు కిలోమీటర్లవుతుంది. ఇలా అయితే మహానగరంగా రూపొందడమే. సమగ్రాభివృద్ధికి డీపీఆర్ విలీన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు నగర యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. ఈ గ్రామాలను చూస్తే 2011 నాటికి చదరపు కిలోమీటర్‌కు 1355 మంది జనసాంధ్రత ఉంది. 2001 తో పోల్చుకుంటే 28.79 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతానికి చదరపు కిలోమీటర్‌కు 1589 మంది జనభా ఉంటుందని అంచనా. 2021 నాటికి 1827 మంది ఉంటుందని తెలుస్తోంది. ప్రజల అవసరాల దృష్ట్యా అభివృద్ధి ప్రణాళికలను డీపీఆర్‌లో పొందు పరచాల్సి ఉంది. వ్యయాన్ని పొందుపర్చాలి మౌలిక వసతుల కల్పనకు ఎంత వ్యయమవుతుందో ఇందులో పొందు పరచాల్సి ఉంటుంది. ఈ డీపీఆర్‌ను మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ)కి పంపి అక్కడి నుంచి తగిన బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వానికి పంపుతారు. నలుగురు కమిషనర్లు కావాలి విలీన ప్రతిపాదన జాబితాలో ఉన్న గ్రామ పంచాయతీల విస్తీర్ణం దాదాపుగా ఐదున్నర రెట్లు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారి ఒక్కరే పర్యవేక్షించడం అసాధ్యం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌జోన్లకు నలుగురు కమిషనర్లను నియమించా ల్సిందిగా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పంచాయతీల పదవీ కాలం పూర్తికాగానే విలీన ప్రతిపాదిత గ్రామాలను ప్రభుత్వం ఎన్నికల నుంచి మినహాయింపు ఇస్తుంది. వీటిని డివిజన్లుగా పునర్విభజించడం తదితర కసరత్తు చేయడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు జోనల్ కమిషనర్లు ఆయా పంచాయితీలకు అధిపతులుగా ఉంటారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో నలుగురు జోనల్ కమిషనర్లను నియమించాలని ఆయన సూచించారు. ఆ పంచాయతీలకు అవకాశం ప్రతిపాదిత జాబితాలో లేని గ్రామాలు మరికొన్ని విజయవాడలో విలీనం కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు పంచాయతీలను ఇదే తరహాలో విలీన జాబితాలో చేర్చారు. మరిన్ని ఆసక్తి చూపుతున్నాయి. దీనిపై కలెక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. పంచాయతీలు ఏకగీవ్రంగా తీర్మానం చేస్తే ఆ గ్రామాలపై నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 21, 2018 Author Share Posted March 21, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 21, 2018 Author Share Posted March 21, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted March 29, 2018 Share Posted March 29, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 2, 2018 Share Posted April 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 2, 2018 Share Posted April 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 3, 2018 Share Posted April 3, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 3, 2018 Author Share Posted April 3, 2018 Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted April 3, 2018 Share Posted April 3, 2018 3 hours ago, sonykongara said: Very good work...ilage summer lo kuda maintain cheste super Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 26, 2018 Share Posted April 26, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 26, 2018 Share Posted April 26, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 20, 2018 Author Share Posted July 20, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 29, 2018 Author Share Posted October 29, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 29, 2018 Author Share Posted November 29, 2018 విజయవాడకు గ్రేటర్ హోదా దక్కేనా?29-11-2018 08:38:19 ప్రజాప్రతినిధుల తీరుతో సందిగ్ధం గుంటూరులో పనులు వేగవంతం గ్రామాల విలీనానికి చకచకా ఏర్పాట్లు బెజవాడలో అడుగు ముందుకుపడని వైనం విజయవాడకు గ్రేటర్ హోదా కొండెక్కినట్టేనా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు కనీస చొరవ తీసుకోకపోవడంతో మహావిస్తరణ క్రమంగా కాగితాల నుంచి కనుమరుగవుతోంది. మరోపక్క గుంటూరుకు గ్రేటర్ హోదా దిశగా పావులు శరవేగంగా కదులుతున్నాయి. గ్రామాల విలీనానికి జీఎంసీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అడుగు ముందుకేసి.. ఆరడుగులు వెనక్కేస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ గ్రేటర్ ప్రతిపాదనను అటకెక్కిస్తోంది. ప్రతిపాదనలతో కాలయాపన చేసిన అధికారులు ప్రయత్నాలను గాలికొదిలేశారు. విస్తరణతో పరుగులు పెట్టించాల్సిన ప్రజాప్రతినిధులు మిన్నకుంటున్నారు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం మహా విస్తరణ దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే 10 గ్రామాల విలీనం చేసుకుని, మరో 11గ్రామాల విలీనానికి సిద్ధపడుతూ విజయవాడకు పోటీనిస్తుండగా.. 49 గ్రామాలకుగానూ ఒక్క గ్రామాన్నీ కలుపుకోలేని వీఎంసీ చతికలిపడుతోంది. విజయవాడ కంటే తక్కువ వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్న గుంటూరు జోరుమీద ఉండగా.. వీఎంసీ మాత్రం కాలయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో వీఎంసీకి గ్రేటర్ మహర్దశ లేనట్లేనని పలువురు ప్రధాన నాయకులు చెబుతుండటం గమనార్హం! (ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ నగర పరిధిలోని పలు రూ రల్ మండలాలను, అందులోని దాదాపు 49 గ్రామాలను విలీనం చేసుకుని గ్రేటర్ విజయవాడగా తీర్చిదిద్దుతామన్న ప్రజాప్రతినిధుల హామీలు కార్యాచరణకు నోచుకోవడం లేదు. విలీన ప్రయత్నాలను పక్కనపెడుతూ 2019 తర్వాత కూడా సాధారణ నగర పా లక సంస్థ ఎన్నికల నిర్వహణకే అధికారులు, నాయకులు మొగ్గుచూపుతున్నారు. నగర పాలక సంస్థ పరిసరాల్లోని దాదాపు 19 గ్రామాల పారిశుధ్య సమస్యలను వీఎంసీనే చేపట్టాలని, గ్రేటర్‌కు ప్రయత్నాలు ముమ్మరంచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను కూడా అమలుచేయలేక నగరపాలకసంస్థ చేష్టలుడిగి చూస్తోంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గ్రేటర్‌పై దృష్టిపెడతామన్న నాయకుల మాట నాలుగున్నరేళ్ల తరువాత కూడా అడుగు ముందుకు పడకపోవడంతో గ్రేటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. మేయర్ కోనేరు శ్రీధర్ మాత్రం పలు సందర్భాల్లో గ్రేటర్ సానుకూలతకు పరస్థితులు అనుకూలించడంలేదని, ప్రయత్నాలు కూడా అనుకున్నంత వేగంగా జరగడంలేదని తెలియజేశారు. 49 గ్రామాల విలీన ప్రతిపాదనలో భాగంగా కార్పొరేషన్ చేసిన సర్వే రిపోర్టును ప్రభుత్వానికి పంపిన తదనంతరం కూడా అదేమాటలను ఆయన వల్లె వేశారు. గత ఏడాదిగా గ్రేటర్‌పై సం బంధిత అధికారులు నోరుమెదపకపోవడం కూడా మేయర్ మాటలకు ఊతమిస్తున్నాయి. పరిస్థితిలావుండగా.. వందేళ్ల చరిత్ర ఉన్న గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం గ్రేటర్ వైపుగా పరుగులు తీస్తోంది. 2012లో పది గ్రామాలను విలీనం చేసుకుని ఆదాయాన్ని రూ.25 లక్షలకు పైగా పెంచుకున్న జీఎంసీ.. మరో 11 గ్రామాల విలీనానికి చకచకా పావులు కదుపుతోంది. ఫలితంగా నగర విస్తీర్ణంతోపాటు జనాభా, ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విలీన గ్రామాల్లోని పంచాయతీలను కార్పొరేషన్ వార్డులుగా మార్చిన జీఎంసీ అధికారుల ప్రయత్న ఫలితంగా నిన్నటివరకు 52గా ఉన్న జీఎంసీ డివిజన్లు నేడు 57కు పెరగ్గా.. 62కు పైగా పెంచాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకు భిన్నంగా విజయవాడలో మాత్రం దశాబ్దం క్రితం పెంచినవే నేటికీ అమలవుతున్నాయి. అక్కడలా.. ఇక్కడిలా.. గ్రేటర్ ప్రతిపాదనకు ఆరేళ్ల క్రితమే అంకురార్పణ చేసిన జీఎంసీ అప్పట్లో 10 గ్రామాలను విలీనం చేసుకుని రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయాన్ని కూడా కార్పొరేషన్‌కే చెల్లించేలా చర్యలు అమలుచేసింది. దీంతో అప్పటివరకు ఉన్న 6 లక్షలున్న గుం టూరు జనాభా కాస్తా.. ఏడున్నర లక్షలకు పైగా పెరగ్గా.. ఓటర్లు కూడా 5 లక్షల పైబ డి ఏర్పాటయ్యారు. ఏటా రూ.రెండు వందల కోట్ల ఆదాయమున్న జీఎంసీనే ఇంతవేగంగా పరుగులు పెడుతుండగా.. ఏటా రూ.1500 కోట్ల బడ్జెట్‌తో ప్రణాళికలు రచిస్తున్న వీఎంసీ మాత్రం చతికిల పడి కూర్చుంది. ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విజయవాడ విలీన ప్రతిపాదిత గ్రామాలను కలుపుకొంటే 437.09 కిలోమీటర్ల వైశాల్యానికి చేరుకుంటుంది. అలాగే 2011 జనాభా సెన్సెస్ ప్రకారం ఉన్న 10 లక్షల 39వేల 518 జనాభా కూడా 15 లక్షల 21వేల 615కు చేరుతుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పడితే వేల సంఖ్యలో నూతన ఉద్యోగావకాశాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. ముఖ్యంగా 59 డివిజన్ల వీఎంసీ ఒక్కసారిగా 160కిపైగా డివిజన్లను ఏర్పాటుచేసుకుని గ్రేటర్ హైదరాబాద్‌కు దీటుగా ఎదిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు గ్రేటర్‌పై తుది నిర్ణయాన్ని వెలువరించి విజయవాడ నగరాభిృద్ధికి తోడ్పడాలని నగర వాసులు కోరుతున్నారు. ఆదాయంతో పనిలేదా? ఆదాయ వనరులను వృద్ధి పరుచుకోలేక, ఉన్న ఆదాయ మార్గాలను పెంపొందించలేక అవస్థలు పడుతున్న వీఎంసీకి గ్రేటర్ ద్వారా నిధుల కొరత తీరే అవకాశం ఉంది. పైగా గ్రేటర్‌కు రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక గ్రాంట్లు అదనం. అలాగే నగరాభివృద్ధికి కావాల్సిన నిధుల బాధ్యతను కూడా రాష్ట్రప్రభుత్వమే స్వయం గా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకపోయిన వీఎంసీ ఉన్న ఫళంగా అప్పుల్లో నుంచి బయటపడాలంటే గ్రేటర్‌కు మార్గం సుగమం చేయడం అనివార్యం. ఆ దిశగా దృష్టి సారించని అధికారులు ఉన్న రెవెన్యూ ఆదాయాలను కూడా రాష్ట్ర పరిధిలో పనిచేసే సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్) చేతుల్లో పెట్టి చోద్యం చూస్తోంది. తద్వారా వీఎంసీ ఆదాయ, వ్య యాలపై పెత్తనమంతా రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి వెళ్లబోతుందన్న సూచనలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే స్థానిక సంస్థల పాలన రాబోయే రోజుల్లో రాష్ట్రప్రభుత్వ కనుసన్నల్లోనే జరగాల్సిరావచ్చు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 29, 2018 Author Share Posted November 29, 2018 జెట్ విస్తరణకు.. తొలి అడుగు29-11-2018 08:55:45 జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల్లో 80 శాతం మందికిపైగా డాక్యుమెంట్లు సమర్పణ భూసేకరణకు రూ 106 కోట్లు! రెండు రోజుల్లో కలెక్టర్ ఖాతాకు స్కెచ్‌లకు రూపకల్పన జక్కంపూడి ఎకనామిక్ టౌన్‌షిప్ (జెట్) సిటీ విస్తరణకు అడుగు ముందుకు పడింది ! ఈ పనుల కోసం 106 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.106 కోట్లను కేటాయించినట్టు తెలిసింది. ఇవి కలెక్టర్ ఖాతాకు రెండు రోజుల్లో జమ కానున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో, తర్వాత చేసే ప్రక్రియ వైపు రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేసింది. రైతుల నుంచి డాక్యుమెంట్ల స్వీకరణకు తెరలేపింది. జక్కంపూడి , వేమవరం, షాబాద రైతులు బేషరతుగా తమ డాక్యుమెంట్లను అందించటానికి సమయాత్తమయ్యారు. ఇప్పటికే 80 శాతం మందికి పైగా సమర్పించారు. ఆంధ్రజ్యోతి, విజయవాడ: జెట్ సిటీ విస్తరణకు అవసరమైన భూముల సేకరణకు తొలి అడుగు పడింది. భూ సేకరణ ప్రతిపాదనలో ఉన్న జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల భూములు తీసుకోవడం అనధికారికంగా ప్రారంభమైంది. కలెక్టర్ ఖాతాలో డబ్బు పడిన తర్వాత ప్రారంభించాల్సిన ప్రక్రియను రెవెన్యూ అధికారులు కాస్త ముందుగానే చేపట్టారు. రైతులు సానుకూలంగా ఉండటంతో తర్వాత ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రూరల్ రెవెన్యూ అధికారులు ఈ పక్రియను చేపట్టారు. రూరల్ మండలంలో భూముల పరిహారం నిర్ణయించడంలో జరిగిన జాప్యం, నిధుల విడుదల నిర్ణయాలు ఆలస్యమవడంతో ప్రతిపాదించిన భూములలో తాత్కాలికంగా సాగు చే సుకోవడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతిపాదిత మొత్తం 106 ఎకరాలలో రైతులు సాగు చేపట్టారు. వరి పంట వేసిన కొద్ది రోజులకే కేబినెట్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పంట దశకు చేరుకున్న తరుణంలో ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంట కోత జరగగానే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ఖాతాకు రెండు రోజుల్లో నిధులు బదిలీ చేయటానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టు తెలిసింది. చాలా మంది రైతులు వరి నూర్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సైతం తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారు రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు , టైటిల్ డీడ్స్ వంటివి రూరల్ రెవెన్యూ యంత్రాంగం కోరింది. దీనికి జక్కంపూడి, వేమవరం, షాబాద రైతులు తక్షణం స్పందించారు. దాదాపుగా 80 శాతం పైగా రైతులు భూముల డాక్యుమెంట్లను రెవెన్యూ యంత్రాంగానికి అందించారు. మిగిలిన రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు పొలం పట్టాలను తనఖా పెట్టడంతో అప్పగించలేదని తెలుస్తోంది. వీరు అధికారులను కలిసి పరిస్థితి వివరించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో డబ్బు జమ అయ్యే అవకాశం ఉండటంతో అధికారికంగా భూ సేకరణ ప్రక్రియను డిసెంబర్ నుంచే చేపట్టాలని భావిస్తున్నారు. భూ యజమానుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోనున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను వారి దగ్గర నుంచి తీసుకుంటారు. సర్వే చేస్తారు. ఆ తర్వాత ఆ భూమికి సంబంధించి స్కెచ్( ఫీల్డ్ మెజర్‌మెంట్ ) వేస్తారు. ఇది పూర్తికాగానే రైతుల బ్యాంకు అక్కౌంట్లను తీసుకుంటారు. డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 28 Author Share Posted April 28 Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 5 Author Share Posted July 5 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 5 Author Share Posted July 5 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 5 Author Share Posted July 5 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted July 6 Share Posted July 6 ORR Map Link to comment Share on other sites More sharing options...
PP SIMHA Posted July 6 Share Posted July 6 east bypass tondaragaa eseyandi plzzz Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 6 Author Share Posted July 6 3 hours ago, PP SIMHA said: east bypass tondaragaa eseyandi plzzz Link to comment Share on other sites More sharing options...
narens Posted July 6 Share Posted July 6 On 7/5/2024 at 11:45 AM, sonykongara said: Hyd lo durgam cheruvu style lo set cheyalsindi…looks coollll Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 6 Author Share Posted July 6 1 minute ago, narens said: Hyd lo durgam cheruvu style lo set cheyalsindi…looks coollll iconic bridge cbn plan jaffa oppukoledu mamuluga kanichearu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now