Jump to content

Donakonda


Recommended Posts

  • Replies 87
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Prakasam folks, here are the details of this group complete proposal&exact location and their plans.

I am not sure of their capability as defense side none of us know ties of this group

 

Partners are giants in avialation and defense by the way.

 

http://titangroup.in/Business-Plan.pdf

 

Ekaram entha untai a location pakkana?  if this comes to reality Jaffas ki pandage.

 

Okkate ardam kanidi Russia&Ukraine partners etla vunnai. Vallaki padadu kada??? :poke:

Link to comment
Share on other sites

Prakasam folks, here are the details of this group complete proposal&exact location and their plans.

I am not sure of their capability as defense side none of us know Russian ties of this group

antha baagane vundi kaani 5000 acres a? first two phases okay. third phase (airbase + logistics park total 3000 acres) ento theda ga vundi

Link to comment
Share on other sites

antha baagane vundi kaani 5000 acres a? first two phases okay. third phase (airbase + logistics park total 3000 acres) ento theda ga vundi

okkate dhyrayam Donakonda land kosam fraud ayete evadu cheyyadu. High Flouride land tesukuni vadina uttane emi chesukuntadu.

 

Also e group mana India defense contracts kuda chestunaru.Partners matram major players in defense&aviation

Link to comment
Share on other sites

okkate dhyrayam Donakonda land kosam fraud ayete evadu cheyyadu. High Flouride land tesukuni vadina uttane emi chesukuntadu.

 

Also e group mana India defense contracts kuda chestunaru.Partners matram major players in defense&aviation

hope it materializes soon. 

 

Total 5500 acres, patta land is 600 acres only. Revenue villages:  Siddayapalem, kocherlakota, mallampeta, manginapudi.

Location: halfway between Markapuram and Donakonda.

Link to comment
Share on other sites

Sleepy Donakonda set to take wing
print   ·   T  T  
 
 
 
 
 
Two Ukranian companies seek land to set up manufacturing and service units
20OGSMRHI-W019__21_2940110e.jpg
Transport Minister and Infrastructure Mission Co-chairmanS. Raghava Rao with the industrial delegation from Ukraine, in Ongole on Wednesday. —Photo: Kommuri Srinivas

: Donakonda, a sleepy village in Prakasam district, is all set to witness a flurry of industrial activity in the coming months with two Ukranian companies zeroing in on the once British-time air strip for setting up aircraft manufacturing and service units.

Representatives of the Antonov State Company which has expertise in the manufacture of very large aeroplanes and aeroplanes using unprepared runways and also Motor Sich, one of the leading manufacturers of engines for aircraft and helicopters and industrial gas turbine installations, had detailed discussion on their business plans in collaboration with the Titan Aviation & Aerospace India Ltd, a subsidiary of Titan Group of companies, with State Infrastructure Mission Co-chairman and State Transport Minister Sidda Raghava Rao here on Wednesday.

“With an initial investment of Rs. 3,000 crore by these companies, Donakonda is all set attract investments to the tune of Rs. 50,000 crore in phases as aircraft from 70 countries land here for overhauling,” the Minister said after making a presentation on the land bank and other infrastructure facilities available at Donakonda.

Importing aircraft and helicopter parts from Ukraine in a semi-knocked down condition, 200 to 300 aircraft and helicopters would be manufactured here, explained the companies’ executives to the Minister. As many as 1,700 helicopters now in operation in different countries would be brought for overhauling to Donakonda, where facilities would be created to train 2,000 pilots, they said, adding that local people would get preference for training as aircraft and helicopter maintenance staff.

The delegation had talks with Chief Minister N. Chandrababu Naidu in Vijayawada late on Tuesday and sought allotment of about 6,000 acres.

“We will start the process of setting up the units within three weeks of allotment of land,” they said, adding that a tie-up with Changi Airport group for building infrastructure at Donakonda would be signed.

“Work is expected to start in the next two months and all the facilities are expected to b created in the next 1-1/2 years,” said the Minister along with senior TDP leader Karnam Balarama Krishnamurthy.

MoU with Chinese firms

The delegation included Antonov CTO Alexander Chexherchil, Antonov Director Sunstovlegor, Motor Sich Director Alexander Amirov, Coordinator Oleksi Tokarive and TAAIL Vice-President(Corporate Affairs) S.D.Chandrasekhar.

The State government had also signed Memoranda of Understanding with two Chinese firms for setting up of a Building Materials Industrial Park and a Logistics Park at Donakonda.

An MoU to manufacture defence helicopters, bullet-proof jackets, mobile power plants with capacity ranging from one MW to 100 MW were also in the pipeline, TAAIL officials said.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
మంత్రి శిద్దాతో సింగపూర్‌ ప్రతినిధుల భేటీ

ఒంగోలు: ప్రకాశం జిల్లా దోనకొండలో పరిశ్రమల ఏర్పాటుపై సింగపూర్‌కు చెందిన ఎస్‌సీపీ కన్సల్టెన్స్‌ పీటీఈ లిమిటెడ్‌ ప్రతినిధులు మంత్రి శిద్దా రాఘవరావును మర్యాద పూర్వకంగా కలిశారు. దోనకొండలో పారిశ్రామికవాడ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూములను పరిశీలించిన ఆ కంపెనీ ప్రతినిధులు.. అనంతరం ఒంగోలులో మంత్రిని కలిశారు. ఇప్పటికే దోనకొండలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ముందుకొచ్చిన టైటాన్‌తో కలిసి పరిశ్రమలను నెలకొల్పేందుకు సింగపూర్‌కు చెందిన కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి తెలిపారు.

Link to comment
Share on other sites

దొనకొండలో ‘టైటాన్’ ఏవియేషన్ యూనిట్‌ 
08-08-2016 01:05:57
దొనకొండ, ఆగస్టు 7: ప్రకాశం జిల్లా దొనకొండలో ఏవియేషన్ యూనిట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.భారీ పెట్టుబడితో ఏవియేషన్ మైంటెనెన్స్, రిపేర్లు, ఓవర్‌ హాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ఉక్రెయిన్‌కు చెందిన టైటాన్ కంపెనీ అందుకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సంస్థకు చెందిన ఓ బృందం ఇక్కడ భూములను పరిశీలించి వెళ్లగా, ఆదివారం సాంకేతిక నిపుపుణుల బృందం దొనకొండకు వచ్చి పరిస్థితులను అధ్యయనం చేసింది. సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్లు శ్రీధర్‌రావు, కె. శ్రీనివాసులు, సింగపూర్‌కు చెందిన ఎస్‌సీపీ కన్‌స్ట్రక్షన్స ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ట్యాంగ్‌వెంగ్‌ ఫైతోపాటు పలువురు సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ప్రతిపాదిత మల్లంపేట, కొచ్చర్లకోట రెవెన్యూ డివిజనలోని భూములను సందర్శించింది. అక్కడ రనవే ఏర్పాటు, భూగర్భ జలాల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించింది. జాయింట్‌ కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఇక్కడ భూముల స్వభావం, సౌకర్యాలను మ్యాప్‌ల ద్వారా టైటాన సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ మూడో విడతగా ఆర్థిక బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ కోసం దశలవారీగా పెట్టుబడులు పెడతామన్నారు. ప్రాథమికంగా రూ.6 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పరిశ్రమకు చెందిన ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

దొనకొండలో భవన నిర్మాణ తయారీ కర్మాగారం!

దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను సందర్శించిన చైనా బృందం

pks-gen8a.jpg

దొనకొండ, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మించే కట్టడాలకు అవసరమయ్యే వస్తు నిర్మాణాలు తయారుచేసే కర్మాగారాన్ని దొనకొండ పారిశ్రామిక కారిడార్‌లో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు చైనాకు చెందిన కాస్‌మి కంపెనీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజరు దాయ్‌ క్సియాన్‌కింగ్‌ పేర్కొన్నారు. ఆయన, మరో ఇద్దరితో కూడిన బృందం బుధవారం రుద్రసముద్రం గ్రామంలోని సర్వే నంబరు 263, 264లో ప్రభుత్వ భూములను పరిశీలించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనా పర్యటనలో ‘మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌’ ఇచ్చారని, రాజధాని అవసరమ్యే నిర్మాణాల తయారీకి 1000 ఎకరాలు కావాలని తెలిపారు. ఆమేరకు అవసరమైన భూమి ఉందని తహసీల్దారు కె.వెంకటేశ్వర్లు వారికి వివరించారు. అనంతరం దొనకొండలోని రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు ఎన్‌.రాజేష్‌, ఆర్‌ఐ రాజేష్‌, సర్వేయర్‌ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
10 వేల కోట్లు!
 
636114887837062906.jpg
  • ఆంధ్రప్రదేశ్‌లో చైనా పెట్టుబడులు
  • కంపెనీలు సిద్ధం జూ ఖనిజ, పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుకు ఒప్పందం
  • 500 ఎకరాలు కేటాయించనున్న రాష్ట్రం
  • ప్రకాశం లేదా విశాఖ జిల్లాలో ఏర్పాటు!
  • 2018 చివరికి పార్క్‌ ప్రారంభం
  • 40వేల మందికి ఉద్యోగాలు
  • ఫలితమిస్తోన్న బాబు చైనా పర్యటన
 
న్యూఢిల్లీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన ఫలితాలు అందుబాటులోకి వస్తున్నాయి. గత జూలైలో చైనాలోని హుజోలో చంద్రబాబు పర్యటించడంతో... ఆ ప్రాంతానికి చెందిన మూడు ప్రధాన కంపెనీలు కలిసి ఏపీలో రూ.10వేల కోట్లతో ఖనిజ, పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన భారత ఆర్థిక సదస్సులో... నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియా సమక్షంలో చైనా కంపెనీల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు(ఏపీఈడీబీ) సీఈవో కృష్ణకిషోర్‌ ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. చైనాకు చెందిన పవర్‌ చైనా గుజో ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌, అల్యూమినియం కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌, గుజో మారిటైమ్‌ సిల్క్‌ రోడ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్లు... ఈ పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
 
పార్క్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ ప్రకాశం లేదా విశాఖపట్నం జిల్లాలలో ఏర్పాటు చేయవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్క్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సుమారు 500 ఎకరాలను కేటాయించడమే కాకుండా మౌలికసదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. 2018 సంవత్సరాంతానికి ప్రారంభంకానున్న ఈ పార్క్‌ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన అనంతరం ఏపీఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్‌ నిరవధికంగా చైనా కంపెనీలతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఒప్పించగలిగారు.
 
పెట్టుబడి పెట్టనున్న చైనా కంపెనీలివే
ఖనిజ, పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన మూడు చైనా కంపెనీలు ఆయా రంగాల్లో ఇప్పటికే విశేష అనుభవాన్ని గడించాయి. పవర్‌ చైనా గుజో ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ (పవర్‌ చైనా) కంపెనీ రియల్‌ ఎస్టేట్‌, పెట్టుబడులు, ఆర్థికరంగాలో కూడా విశేష అనుభవాన్ని గడించింది. ప్లానింగ్‌, డిజైనింగ్‌, కన్సల్టింగ్‌, సివిల్‌ వర్క్స్‌, హైడ్రో పవర్‌, థర్మల్‌ పవర్‌ సెక్టార్‌లలో కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. అల్యూమినియం కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌ (చలిఎకో) కంపెనీ 2003లో ఏర్పాటైంది. మెటలర్జీ, రవాణా, ఎలక్ర్టిక్‌ పవర్‌, పెట్రోలియం, కెమికల్‌ ఇండస్ర్టీ, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తదితర రంగాల్లో ముందంజలో ఉంది. ఇక మూడో కంపెనీ గుజో మారిటైమ్‌ సిల్క్‌ రోడ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌(జిక్‌) పట్టణ ప్రణాళిక, నిర్మాణం, మౌలిక వసతుల కల్పన రంగాల్లో నైపుణ్యం సంపాదించింది.
Link to comment
Share on other sites

  • 1 month later...
రాష్ట్రంలో ‘రియల్‌ ఎస్టేట్‌ నగరం’
 
  • అమరావతి, దొనకొండల్లో ఒకచోట ఏర్పాటు
అమరావతి (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రో త్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక ‘రియల్‌’ నగరానికి రూపమివ్వాలని భావిస్తోంది. భవన నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సామగ్రి, సమాచారం ఒకే చోట లభించేలా ఒక నగరాన్ని తీర్చిదిద్దనుంది. ఈ నగరానికి ‘రియల్‌ ఎస్టేట్‌’ నగరంగా నామకరణం చేయనుంది. దీనిని అమరావతిలో కానీ, దొనకొండలో కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలోని భవన నిర్మాణదారులు నిర్మాణ సామాగ్రి కోసం చైనా వెళ్తున్నారు. చైనా నుంచి నౌకా రవాణా ధర కూడా అందుబాటులోనే ఉండడంతో చాలామంది అక్కడి నుంచే నిర్మాణ సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, కన్వెన్షన్‌ కేంద్రాలు వంటి వాటి నిర్మాణానికి భారీగా సామగ్రి అవసరమవుతుంది. ఆయా నిర్మాణాలను చేపట్టే కాంట్రాక్టర్లు చైనాకు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేసేలా పరిస్థితిలో మార్పుతేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

టైటాన్‌ ఏవియేషన్‌కు దొనకొండలో భూముల పరిశీలన

pks-gen7a.jpg

దొనకొండ, న్యూస్‌టుడే: విమాన వస్తు వాహనాల తయారీల కేంద్రం ఏర్పాటు చేసేందుకు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నామని హైదరాబాద్‌ టైటాన్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ కె.గిరికుమార్‌ తెలిపారు. దొనకొండ మండలంలోని కొచ్చెర్లకోట గ్రామంలోని ప్రభుత్వ భూములను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. భూముల హద్దులు మార్చి నెలలో నిర్ణయిస్తారని, కొచ్చెర్లకోట, మల్లంపేట, సిద్దాయపాలెం, మంగినపూడి గ్రామాల్లో 5600 ఎకరాలు భూమి తమ కేంద్రానికి కావాల్సి ఉంటుందన్నారు. ఆ గ్రామాల్లో 7వేల ఎకరాల భూమి ఉందని సర్వేయర్‌ వెంకట్రావు తెలిపారు. 6 కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటు చేస్తామని, విద్యావంతులను తీసుకొని శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రూ.3వేల కోట్లతో ఈ కేంద్రం నిర్మిస్తామన్నారు. ఆసియా ఖండంలో ఆరు కంపెనీల విమానాలు ఇక్కడకు మరమ్మతులకు వస్తాయన్నారు. వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో సంస్థ వైస్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

దొనకొండలో సౌర విద్యుత్ కేంద్రం

30-04-2017 03:38:12
దొనకొండ, ఏప్రిల్‌ 29: ప్రకాశం జిల్లా దొనకొండలో సౌర విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ముంబైలోని ‘లా మెగా’ గ్రూప్స్‌కు చెందిన ట్రానా ఎనర్జీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడ 600 ఎకరాల్లో రూ.500 కోట్లతో కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని వలన 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ట్రానా కంపెనీ భాగస్వామి కె.వి.రమణశాస్త్రీ, డైరెక్టర్‌ యోగేష్‌ చవనీరా శనివారం దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మల్లంపేట గ్రామాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాము ఇతర రాష్ట్రాల్లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రయత్నించినా అక్కడి ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం లభించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్న నమ్మకంతో దొనకొండ ప్రాంతంలో భూముల పరిశీలనకు వచ్చామన్నారు. దొనకొండలో భూములు, భూగర్భ జలమట్టం, తదితర మౌలిక సౌకర్యాలను మ్యాపుల ద్వారా ఏపీఐఐసీ ఇంజనీర్‌ కుమార్‌, సర్వేయర్‌ వెంకట్రావు వివరించారు.
Link to comment
Share on other sites

సౌర పార్కు కోసం భూముల పరిశీలన

pks-gen7a.jpg

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో ప్రభుత్వ భూములను ముంబైకి చెందికి త్రానా కంపెనీ భాగస్వామి కె.వి.రమణ శాస్త్రి, డైరెక్టర్‌ యోగేష్‌ చాపా నేరా, కన్సల్టెంట్‌ పమిడి భానుచందన్‌లు శనివారం పరిశీలించారు. సౌర పార్కు ఏర్పాటు కోసం భూములను పరిశీలించడానికి వచ్చామని వారు తెలిపారు. వెయ్యి ఎకరాల్లో రూ.500 కోట్లతో 100 మెగావాట్ల సౌర పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 1500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. రుద్రసముద్రంలోని 262, 264, 370 నుంచి 450 వరకు సర్వే నెంబర్లను పరిశీలించి మ్యాపులను చూశారు. భూములు అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని పరిశ్రమ పెట్టేందుకు కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఐటీ ప్రమోషన్‌ అధికారి వి.వి.భూపాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ గోగు వెంకటేశ్వర్లు, సర్వేయర్‌ వెంకట్రావు, ఏపీఐఐసీ ఇంజినీర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఆపసోపాలు

కీలక ప్రాజెక్టులకు భూముల గుర్తింపునకే ఏడాదిన్నర

కార్యరంగంలోకి దిగని ధరల నిర్ణయక కమిటీ

నడికుడి - శ్రీకాళహస్తికి వచ్చింది రూ.60లక్షలే

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సర్వే బృందాల నియామకం

pks-gen1a.jpg

ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: నిమ్జ్‌.. దొనకొండ పారిశ్రామికవాడ.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌... ఎక్స్‌ప్రెస్‌ హైవే.. ఇవి జిల్లా ప్రగతిని మలుపుతిప్పే కీలక ప్రాజెక్టులు.. జిల్లా వెనుకబాటుతనాన్ని తరిమికొట్టే పునాది రాళ్లు.. ఇంతటి కీలక ప్రాజెక్టు పనుల పనులను వీలైనంత వేగవంతం చేసి.. ప్రజల ఆకాంక్షలకు రూపు రేఖలను ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా పడుతున్న అడుగులు మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. భూసేకరణ దశలోనే ఆపసోపాలు పడుతున్నారు. మొక్కుబడి సమావేశాలను వదిలి.. క్షేత్రస్థాయిలో పనులను ముందుకు ఉరికించినప్పుడే ఆశయం సిద్ధిస్తుంది. జిల్లాలో ప్రగతి వికసిస్తుంది. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నిమ్జ్‌.. దొనకొండ...

జిల్లాలోని నిమ్జ్‌, దొనకొండలో భూముల సేకరణకు.. రైతుల నుంచి గుర్తించిన భూమిని కొనుగోలు చేయడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటైన కమిటీ కార్యరంగంలోకి దిగాల్సి ఉంది. ఇంత వరకూ ఈ కమిటీ సమావేశమై.. రైతుల నుంచి భూములను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నది లేదు. జీవో 181 ప్రకారం జేసీ ఛైర్మన్‌గా, ఏపీఐఐసీ జడ్‌ఎం మెంబరు కన్వీనరుగా, వ్యవసాయశాఖ జేడీ, రిజిస్ట్రార్‌, ఆర్డీవో, పరిశ్రమలశాఖ జీఎంలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ రైతులతో నేరుగా సంప్రదించి.. వారితో కలిసి ధరను నిర్ణయిస్తుంది. కమిటీ ప్రతిపాదించిన భూమి ధరనే కలెక్టర్‌ ఆమోదిస్తారు. రైతు ఖాతాకు నేరుగా ఏపీఐఐసీ నుంచి నిర్ణయించిన ధర ప్రకారం డబ్బు జమ చేస్తారు. భూములు ఇవ్వడానికి సిద్ధపడిన రైతులతోనే ఈ కమిటీ సంప్రదింపులు చేసి తక్షణం అతడికి డబ్బు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఆ ప్రకారం దొనకొండలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసినా.. ఇంత వరకూ కమిటీ సమావేశమై.. భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చే రైతుల నుంచి సేకరించేందుకు చర్యలు తీసుకోలేదు. నిమ్జ్‌ పరిధిలోనూ పామూరు, పీసీపల్లిలోనూ కమిటీ ద్వారా పరిష్కరించునేందుకు రైతులు ఉన్నా.. ముందడుగు మాత్రం పడటం లేదు. నిమ్జ్‌ పరిధిలో 62వేల ఎకరాలు, దొనకొండ పరిధిలో 25వేల ఎకరాలను ఇప్పటి వరకూ గుర్తించారు. నిమ్జ్‌ పరిధిలో పట్టా భూమి మూడు వేల ఎకరాలు, దొనకొండలో రెండు వేల ఎకరాలు ఉన్నట్లు గుర్తించినా... సేకరణకు కమిటీ కార్యరంగంలోకి దిగడం లేదు.

నడికుడి- శ్రీకాళహస్తికి నిధుల కొరత

జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి నడికుడి- శ్రీ కాళహస్తి ఎంతో ప్రయోజనం కలిగించే రైల్వే ప్రాజెక్టు. మొత్తం ఎనిమిది మండలాల్లో 36 గ్రామాల్లో 190 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ సర్వే పనులు మాత్రమే పూర్తి చేశారు. ఏడాదిగా రూ. 122 కోట్ల నిధులు కావాలని అడుగున్నా... అదిగో, ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. ఇటీవలే ఈపీడీఆర్‌ఐ(ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ పరిశోధన సంస్థకు సోషల్‌ ఇంపాక్టు) సర్వేకు చర్యలు తీసుకున్నారు. ఈ సంస్థ రానున్న 20 రోజుల వ్యవధిలోనే గ్రామసభలను ఏర్పాటు చేసి ఎస్‌ఏ సర్వేకు చర్యలు తీసుకోనున్నట్లుగా ప్రకటించింది. ఈ రైల్వే ప్రాజెక్టు కోసం అడిగిన నిధులను మాత్రం ప్రభుత్వం ఇంత వరకూ విడుదల కాలేదు. దాంతో పనులు మందగించాయి.

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సర్వే బృందాలు

రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు మెరుగైన వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన చోట అవసరమైన భూమిని సేకరించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. మొత్తం 145 కి.మీ. జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ హైవే అభివృద్ధి కానుంది. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట, కంభం, మార్కాపురం, తర్లుపాడు, దొనకొండ, కురిచేడు, దర్శి, సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 23 మంది సర్వేయర్లను, డిప్యూటీ సర్వేయర్లను సర్వే పనులకు నియమించారు. గత బుధవారమే వీరికి నియామక ఉత్తర్వులను సర్వే ఏడీ జారీ చేశారు. 2,537.50 హెక్టార్లను వీరు సర్వే చేయాల్సి ఉంది. రిజర్వు ఫారెస్టులో 9.850 కిమీ, అటవీ ప్రాంతంలో 1.7 కిమీ, గానుగపెంట రిజర్వు ఫారెస్టులో 3.5 కిమీ, ఉప్పుమాగులూరు ఫారెస్టులో 0.900 కిమీ సర్వే చేయాల్సి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టు కోసం భూసేకరణ ఏ పాటిగా జరగనుందో.. జిల్లాలోని సర్వేయర్లందరినీ వేరే పనులకు పెట్టకుండా అత్యంత ప్రాధాన్యం కింద ఎక్స్‌ప్రెస్‌ హైవే సర్వేకు వినియోగించడం గమనార్హం.

నిర్లక్ష్యం వీడితేనే...

జిల్లాలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణులు గుర్తించారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య ఇప్పటికే నాలుగు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. ఏపీఐఐసీకి భూమిని సేకరించి అప్పగించాలని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో సమావేశాలైతే జరిగాయి గానీ.. ఇంత వరకూ ఆశించిన విధంగా భూ సేకరణలో పురోగతి కనిపించడం లేదు. దాంతో నిర్లక్ష్యం వీడితేనే జిల్లాలో పారిశ్రామిక పురోగతి వికసిస్తుందన్న అభిప్రాయం నెలకొంది.

‘ఒంగోలు మండలం త్రోవగుంట- చీరాల వరకూ 216 జాతీయ రహదారి పనులు ముందుకు పోవడం లేదు. ఈ ప్రాజెక్టులో భూసేకరణ పనులు కష్టంగా మారాయి. రహదారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకోవడంలోనూ అసాధారణ జాప్యం జరుగుతోంది. తాజాగా అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు మంజూరయ్యాయి. జిల్లాలోనూ ఈ ప్రాజెక్టు కింద 145 కిమీ అభివృద్ధి జరగనుంది. ఇప్పటికే 50 కిమీ సర్వే పెగ్‌ మార్కింగ్‌ పనులు చేయటం గమనార్హం.’

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...