Jump to content

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted
రేపల్లె : నిజాంప ట్నం హార్బర్‌ అభివృద్ధికి ఆ టంకం తొలగింది. శాసనసభలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ వా న్‌పిక్‌, నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించటంతో ప్రభుత్వం స్పందించి భూసేకరణకు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో తీరప్రాంతం పారిశ్రామిక, ఔషధ నగర్‌గా అభివృద్ధి చెందనుంది. వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ కోసం 2002లో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామాల్లో 1091.56 ఎకరాల అడవులు, దీనిలోనే 911.41 ఎకరాలను ఓడరేవు, పారిశ్రామిక కారిడార్‌ కోసం సేకరించేలా గతంలో ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా ప్రకటనను ఉపసంహరించుకుంది. దీంతో నిజాంపట్నం హార్బర్‌ దిండి ప్రాంతంలో అభివృద్ధి, పరిశ్రమలు రావటంతోపాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, తీరప్రాంతం అభివృద్ధి చెందనుంది.
బడా కంపెనీల ఆసక్తి..
రాజధాని జిల్లా కావటంతో తీర ప్రాంతం వెంట ఉన్న గ్రామాల్లో కొన్ని బడా కంపెనీల యాజమాన్యం ఫ్యాక్టరీలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ ప్రాంతాలను సందర్శించి వసతులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నిజాంపట్నం మండలం దిండి, అడవులదీవి, కొత్తపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలంలోని లంకెవానిదిబ్బ, మోళ్ళగుంట, తాళ్ళతిప్ప గ్రామాలను మూడు బడా కంపెనీల యాజమాన్యాలు పరిశీలించి వెళ్లాయి. ఇప్పటికే ఓ కెమికల్‌ కంపెనీ, టైర్ల, రంగుల కంపెనీ, ఆక్వా లేబోరేటరీలతో పాటు మత్స్యసంపదకు దాణా మందుల కంపెనీల పెట్టేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొంతమంది అడవులదీవి, దిండి ప్రాంతంలో భూములు కొన్నారు. వెనుకబడిన తీరప్రాంతంలో ఈ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం
తీరప్రాంతంలో నీటి కొరత, పొల్యూషన్‌, విద్యుత్‌, రహదారులు అనుగుణంగా వున్నాయి. ఎటు చూసినా 20 కిలోమీటర్లు వస్తే 216-ఏ జాతీయ రహదారి ఎక్కి ఒంగోలు, మద్రాసు, కర్ణాటక, కేరళ మార్గం ఒకవైపు , రేపల్లె, మచిలీపట్నం, కాకినాడ, యానాం, విశాఖపట్నం, ఒరిస్సా, కలకత్తా వెళ్ళే మార్గాలు చేరుకోవచ్చు. సముద్రం వెంట మడ అడవులు ఉండటంతో పొల్యూషన్‌కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు.
తీర ప్రాంత అభివృద్ధే లక్ష్యం

వెనుకబడిన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. శాసనసభా సమావేశాల్లో నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధి, వాన్‌పిక్‌ భూములపై మూడు సార్లు ప్రస్తావించానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుందని తెలిపారు.
Posted

వాన్‌పిక్‌ భూముల్లో ఓడరేవు!

వాడరేవు నిజాంపట్నం పారిశ్రామిక కారిడార్‌(వాన్‌పిక్‌) భూముల్లో ఓడరేవు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సాధ్యాసాధ్యాల పరిశీలనకు త్వరలోనే నిపుణుల కమిటీ అక్కడకు వెళ్లే అవకాశముంది. గతంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 18,878 ఎకరాలను వాన్‌పిక్‌కు కేటాయించారు. వాన్‌పిక్‌కు కేటాయించిన భూములను రద్దుచేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఇంతకుముందే సిఫార్సు చేసింది. భూముల రద్దు వ్యవహారం, ఓడరేవు నిర్మాణాన్ని వేర్వేరుగా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓడరేవు నిర్మాణ బాధ్యతను విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సర్కారు ముందుకెళ్లనుందని తెలిసింది.

Posted

how can they deal vanpic lands issue and building a port separately? confusing. May be it means they deal with them in parallel rather than in sequence. ayina anni kotha ports responsibility VPT ki enduku istunnaru? they already have their hands full with their expansion works. 

Posted
వాన్‌‌పిక్‌ రేవుపై అదానీల ఆసక్తి
 
  • మంత్రివర్గ సమావేశంలో చర్చ 
హైదరాబాద్‌, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఓడరేవుల నిర్వహణలో జాతీయ స్ధాయిలో పేరుగాంచిన అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశలోని వాన్ పిక్‌ పోర్టుపై ఆసక్తి చూపుతోంది. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అధికారులు ఈ విషయం తెలిపినట్లు సమాచారం. తూర్పు తీరాన విశాలమైన సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశలో ఒక రేవు తీసుకోవాలని ఆ గ్రూపు ప్రయత్నిస్తోందని, వానపిక్‌పై తమకు ఆసక్తి ఉందని ఇటీవల తమను కలిసి చెప్పారని మౌలిక వసతుల శాఖ కార్యదర్శి అజయ్‌ జైన కేబినెట్‌ భేటీలో తెలిపారు. ‘అదానీ గ్రూపు ప్రతినిధులు నన్ను కూడా కలిసి వానపిక్‌పై తమకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. ఆ పోర్టు వ్యవహారాలు చూస్తున్నవారిని కలిసి మాట్లాడుకోవాలని వారికి చెప్పాను. తర్వాత ఏమైందో నాకూ తెలియదు. వారికి ఆసక్తి ఉంటే ఇరు పక్షాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
  • 3 weeks later...
  • 8 months later...
  • 7 months later...
  • 1 month later...
Posted
వాడరేవు - పొందుగల మధ్య జాతీయ రహదారి
29-01-2018 08:38:54
 
636528119333986725.jpg
చిలకలూరిపేట, గుంటూరు: ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు వద్ద ప్రారంభమై చిలకలూరిపేట, నరసరావుపేట, నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా కృష్ణానది వంతెన పక్కనే పొందుగల వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్చారు. దీనికి 167ఎ గా నంబరును కేటాయించారు. ఇది మొత్తం 127 కి.మీలు పొడవున ఉన్నది. ఈ మార్గంలో నకరికల్లు నుంచి పొందుగల వరకు ఉన్న 46కి.మీ మార్గాన్ని ఇప్పటికే అద్దంకి-నార్కట్‌పల్లి మార్గంలో భాగంగా నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి పరచారు. ఇక మిగిలిన వాడరేవు-నకరికల్లు మధ్యలో ఉన్న 81 కి.మీ మార్గాన్ని కూడా పెద్దఎత్తున అభివృద్ధి చేయడానికి అధికారులు నిర్ణయించారు.
 
   రోడ్లు, భవనాలశాఖ అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం వారం రోజులలో ఈ రహదారిని నేషనల్‌ హైవేస్‌ సంస్థకు అప్పగించనున్నారు. నేషనల్‌ హైవేస్‌ సంస్థ ఈ రహదారి సమగ్ర అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్‌(డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) కోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నది. ఇప్పటికే ఒకసారి రాష్ట్ర రహదారుల సంస్థ డిపిఆర్‌ను తయారు చేయించగా నేషనల్‌ హైవేస్‌ సంస్థ ప్రత్యేకంగా డిపిఆర్‌ను తయారు చేయిస్తున్నది. ప్రాధమికంగా లభించిన వివరాల ప్రకారం ఈ మార్గంలో చిలకలూరిపేట, నరసరావుపేటల వద్ద కొత్తగా బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేస్తారు. చిలకలూరిపేట వద్ద పసుమర్రు నుంచి ప్రారంభమై దక్షిణం వైపుగా పోలిరెడ్డిపాలెం వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ప్రస్తుతం ఉన్న 5.5మీటర్ల రహదారిని 10 మీటర్లకు విస్తరిస్తారు. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వరకు నాలుగు లైన్ల రహదారిగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది.
  • 2 weeks later...
  • 1 month later...
Posted
23 minutes ago, sonykongara said:

vanpic.jpg

Papam aa farmers notlo matta, vallavi vallake icheyochuga anthaga kavalante or govt ki handover cheyochuga ade amount ki they can use it for better purpose.

Ila atatch chesi pettukunte meostadi bhoomulu padavatam tappa

  • 2 months later...
  • 4 weeks later...
Posted

చీరాల ఓడరేవు లో పోర్ట్ గడ్కరీ ప్రకటన
#chirala #vodarevu
రెండు శుభవార్తలు మా జిల్లా కి.ఇంత కాలం అభివృద్ది కి నోచుకోని మా జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే రోజు రెండు శుభవార్తలు అందించాయి
1. భారీ కాగిత పరిశ్రమ
2. ఎన్నాళ్ళ గానో మేము రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న పోర్ట్ ని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు

Posted
1 minute ago, sonykongara said:

చీరాల ఓడరేవు లో పోర్ట్ గడ్కరీ ప్రకటన
#chirala #vodarevu
రెండు శుభవార్తలు మా జిల్లా కి.ఇంత కాలం అభివృద్ది కి నోచుకోని మా జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే రోజు రెండు శుభవార్తలు అందించాయి
1. భారీ కాగిత పరిశ్రమ
2. ఎన్నాళ్ళ గానో మేము రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న పోర్ట్ ని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు

edi nijama

Posted (edited)
8 minutes ago, sonykongara said:

చీరాల ఓడరేవు లో పోర్ట్ గడ్కరీ ప్రకటన
#chirala #vodarevu
రెండు శుభవార్తలు మా జిల్లా కి.ఇంత కాలం అభివృద్ది కి నోచుకోని మా జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే రోజు రెండు శుభవార్తలు అందించాయి
1. భారీ కాగిత పరిశ్రమ
2. ఎన్నాళ్ళ గానో మేము రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న పోర్ట్ ని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు

drama XXXXXXX....AP reorg act prakaram by 2019 port should be completed...ippudu SC case kosam meru land ivvaledu antadu.....

kani AP ennosarlu first pick a place ante study ani natakam adaru....

A paper industry ki ippudu etlagu berth kavali.....AP govt cheyyataniki ready ayyindi adi...

Edited by AnnaGaru
Posted
వాడరేవు పోర్టు అభివృద్ధికి 3వేల ఎకరాలు
సీఎంకి లేఖరాస్తానన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
04441113BRK141-GADKARI.JPG

విశాఖ: ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు అభివృద్ధికి మూడు వేల ఎకరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకు లేఖ రాస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. విశాఖ పోర్టుకి కొత్తగా భూమి లభించే అవకాశం లేనందున ఈ పోర్టుపై ఒత్తిడి తగ్గాలంటే కొత్త పోర్టు అవసరమని ఆయన చెప్పారు. విశాఖలో రెండు రోజుల పాటు దేశంలోని మేజర్ పోర్టుల పనితీరు, ఈ ఏడాది అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఆయన సహాయ మంత్రులతో కలిసి సమీక్షించారు. సమీక్ష వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

పోర్టుల అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించామని, ఇందులో భాగంగానే అక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అన్ని పోర్టుల సదుపాయాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ వెల్లడించారు. సోలార్ విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు అన్ని పోర్టుల్లో చేయాలని, ప్రయోగాత్మకంగా చేసిన ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చిందని వివరించారు. సాగర్ మాల, భారత్ మాల ప్రాజెక్టుల వల్ల దేశంలో జలరవాణా పూర్తిస్థాయిలో అభివృద్ది చెందుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి ఈ ప్రాజెక్టులు, ఇతర పథకాల కింద రూ.4లక్షల కోట్లకు పైగా మంజూరు చేసినట్టు వివరించారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అఫ్ ఇండియా ప్రైవేటీకరించే యోచన లేదన్నారు. విశాఖ, పారదీప్, న్యూమంగళూరు పోర్టులు దీని బాధ్యతను తీసుకుంటాయన్నారు.

Posted
10 minutes ago, AnnaGaru said:

drama XXXXXXX....AP reorg act prakaram by 2019 port should be completed...ippudu SC case kosam meru land ivvaledu antadu.....

kani AP ennosarlu first pick a place ante study ani natakam adaru....

A paper industry ki ippudu etlagu berth kavali.....AP govt cheyyataniki ready ayyindi adi...

AP reorg act kanna munde upa govt cabinet decision tisukunnadi deasm 3 ports kattalani dani lo okati prakasam lo kattali taruvtha ramayapatnam port,dugarajapatnam port game adearu mana congi nayakulu, inka bjp valla sangthi telusu kadha,navayuga vallu oppukunuda ramayapatnam  kastam anukuta

Posted
31 minutes ago, sonykongara said:
వాడరేవు పోర్టు అభివృద్ధికి 3వేల ఎకరాలు
సీఎంకి లేఖరాస్తానన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
04441113BRK141-GADKARI.JPG

విశాఖ: ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు అభివృద్ధికి మూడు వేల ఎకరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకు లేఖ రాస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. విశాఖ పోర్టుకి కొత్తగా భూమి లభించే అవకాశం లేనందున ఈ పోర్టుపై ఒత్తిడి తగ్గాలంటే కొత్త పోర్టు అవసరమని ఆయన చెప్పారు. విశాఖలో రెండు రోజుల పాటు దేశంలోని మేజర్ పోర్టుల పనితీరు, ఈ ఏడాది అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఆయన సహాయ మంత్రులతో కలిసి సమీక్షించారు. సమీక్ష వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

పోర్టుల అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించామని, ఇందులో భాగంగానే అక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అన్ని పోర్టుల సదుపాయాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ వెల్లడించారు. సోలార్ విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు అన్ని పోర్టుల్లో చేయాలని, ప్రయోగాత్మకంగా చేసిన ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చిందని వివరించారు. సాగర్ మాల, భారత్ మాల ప్రాజెక్టుల వల్ల దేశంలో జలరవాణా పూర్తిస్థాయిలో అభివృద్ది చెందుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి ఈ ప్రాజెక్టులు, ఇతర పథకాల కింద రూ.4లక్షల కోట్లకు పైగా మంజూరు చేసినట్టు వివరించారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అఫ్ ఇండియా ప్రైవేటీకరించే యోచన లేదన్నారు. విశాఖ, పారదీప్, న్యూమంగళూరు పోర్టులు దీని బాధ్యతను తీసుకుంటాయన్నారు.

Another drama with full of blatant lies

Posted (edited)

vodarevu port location ekkada 

vodarevu or motupalle ?

https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Motupalli-port-plan-triggers-protest/article15269276.ece

motupalle ayithe chinnaganjam daggara vuntundi . its near to proposed paper mill

ramayapatnam port is within exclusive zone of krishnapatnam port. 

https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cpim-for-assembly-resolution-on-ramayapatnam-port-project/article24307395.ece

Edited by ravindras

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...