swarnandhra Posted July 13, 2018 Posted July 13, 2018 (edited) 2 hours ago, ravindras said: vodarevu port location ekkada vodarevu or motupalle ? https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Motupalli-port-plan-triggers-protest/article15269276.ece motupalle ayithe chinnaganjam daggara vuntundi . its near to proposed paper mill ramayapatnam port is within exclusive zone of krishnapatnam port. https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cpim-for-assembly-resolution-on-ramayapatnam-port-project/article24307395.ece https://s8.postimg.cc/61oscud9h/Screen_Shot_2018-07-13_at_10.12.10_AM.png Dugarajapatnam is in exclusive zone of Krishnapatnam, Ramayapatnam is not. Edited July 13, 2018 by swarnandhra
ravindras Posted July 13, 2018 Posted July 13, 2018 7 minutes ago, swarnandhra said: https://s8.postimg.cc/61oscud9h/Screen_Shot_2018-07-13_at_10.12.10_AM.png Dugarajapatnam is in exclusive zone of Krishnapatnam, Ramayapatnam is not. https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cpim-for-assembly-resolution-on-ramayapatnam-port-project/article24307395.ece read above link
swarnandhra Posted July 13, 2018 Posted July 13, 2018 18 minutes ago, ravindras said: https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cpim-for-assembly-resolution-on-ramayapatnam-port-project/article24307395.ece read above link when was this changed to 150km? I think it is a good idea though. exception should be give to captive ports. Earlier they had 30km. Even at 30, Dugarajapatnam would still be in its exclusive zone. “The government of Andhra Pradesh hereby agree that no party other than the concessionaire (Krishnapatnam Port Co.) shall have the right to develop a new port within 30km of either side of Krishnapatnam port limits during the concession period under this agreement,” says the agreement signed on 17 September 2004.
ravindras Posted July 13, 2018 Posted July 13, 2018 8 minutes ago, swarnandhra said: when was this changed to 150km? I think it is a good idea though. exception should be give to captive ports. Earlier they had 30km. Even at 30, Dugarajapatnam would still be in its exclusive zone. “The government of Andhra Pradesh hereby agree that no party other than the concessionaire (Krishnapatnam Port Co.) shall have the right to develop a new port within 30km of either side of Krishnapatnam port limits during the concession period under this agreement,” says the agreement signed on 17 September 2004. ysr extended it . ysr extended limits of gangavaram port also . he denotified mutyalammapalem port which has natural depth of 23 meter. mutyalammapalem port backyard of simhadri ntpc. https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Gangavaram-Port-lsquoemerges-winnerrsquo/article15331631.ece
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 వాడరేవులో నౌకాశ్రయం నిర్మిస్తాం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరించబోం విశాఖలో సాగర జలాలపై తేలియాడే రెస్టారెంటు! కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడువేల ఎకరాలనిస్తే ప్రకాశం జిల్లా వాడరేవు వద్ద కేంద్రం నౌకాశ్రయాన్ని నిర్మిస్తుందని, ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ పంపనున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నౌకాశ్రయ నిర్మాణ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే ప్రత్యేక ప్రయోజక వాహకం(ఎస్పీవీ) ఏర్పాటుచేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాజా సమీక్ష సమావేశం సందర్భంగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు వివరించారు. విశాఖ నౌకాశ్రయాన్ని ‘ఫ్రీట్రేడ్ జోన్’ చేయడంతోపాటు మరో శాటిలైట్ పోర్టును ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించడం లేదని ప్రకటించారు. దీన్ని ఒకింత పునర్వ్యవస్థీకరించి విశాఖ పోర్టు, పారాదీప్, న్యూమంగళూరుపోర్టు సంయుక్త నిర్వహణలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే ఈమేరకు మంత్రివర్గ నిర్ణయం వెలువడుతుందన్నారు. ముంబయిలో సముద్రంపై తేలియాడే రెస్టారెంట్లు రెండింటిని ఏర్పాటుచేస్తున్నామని, విశాఖలోనూ అలాంటిది ఏర్పాటుచేయాలని పోర్టు ఛైర్మన్ కృష్ణబాబుకు సూచించానని తెలిపారు. తన మంత్రిత్వశాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.4.10లక్షల కోట్ల ప్రాజెక్టులున్నాయని, రూ.1.60లక్షల కోట్ల సాగరమాల ప్రాజెక్టు, రూ.1.50లక్షల కోట్ల రహదారులు, రూ.లక్ష కోట్ల జల రవాణా ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కాండ్లా నౌకాశ్రయంలో రెండువేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. సముద్రనీటి నుంచి మంచినీటిని తయారుచేసేలా ట్యూటికోరన్, కాండ్లా, పారాదీప్ నౌకాశ్రయాల్లో ‘డీశాలినేషన్ ప్లాంట్ల’ను ప్రయోగాత్మకంగా నిర్మించనున్నట్లు ప్రకటించారు. పోర్టుల నుంచి సరకు రవాణా వేగవంతం కావాలంటే అవసరమైనన్ని వ్యాగన్లు అవసరమని, రైల్వేశాఖ సహకారంతో ‘వ్యాగన్ ఇన్వెస్ట్‌మెంట్’ పథకానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. అన్ని నౌకాశ్రయాల్లోనూ కంటైనర్ స్కానర్లను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. సాగరమాల ప్రాజెక్టు వల్ల కోటి మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నౌకాశ్రయాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వల్ల దేశం వాహనరంగంలో అగ్రగామిగా మారుతోందన్నారు. సమావేశంలో కేంద్ర సహాయమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, పి.రాధాకృష్ణన్, పోర్టు ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు పాల్గొన్నారు. తొలుత దేశంలోని 12 ప్రధాన పోర్టుల ఛైర్మన్లు, ప్రతినిధులతో రెండోరోజు సమీక్షను గడ్కరీ నిర్వహించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి చుక్కానిగా విశాఖ ఓడరేవు మహారాణిపేట(విశాఖపట్నం), న్యూస్‌టుడే: అంతర్జాతీయ వాణిజ్యానికి విశాఖ ఓడరేవు చుక్కానిలా మారిందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్(వీసీటీపీఎల్)లో రూ.151 కోట్ల విలువైన భారీ కంటైనర్ హ్యాండ్లింగ్ క్రేన్లను ఆయన ప్రారంభించారు. కంటైనర్ల హ్యాండ్లింగ్ కోసం రెండు భారీ పానమాక్స్ క్యారీ క్రేన్లు, నాలుగు రబ్బర్ టైర్డ్ గాంట్రీక్రేన్లను వీసీటీపీఎల్ ఏర్పాటు చేసుకుంది. అనంతరం ఓడరేవులో ఎస్సార్ వైజాగ్ టెర్మినల్ లిమిటెడ్(ఈవీటీఎల్) ఆధ్వర్యంలో నిర్మించిన ఇనుప ఖనిజ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్‌ను కేంద్రమంత్రి జాతికి అంకితం చేశారు. నగరాన్ని ఓడరేవు కాలుష్యం నుంచి రక్షించేందుకు సీహార్స్ కూడలి నుంచి కాన్వెంట్ కూడలి వరకూ నిర్మించిన ఎత్తయిన గోడనూ ప్రారంభించారు. కన్వేయర్ బెల్టు వద్ద రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 ‘వాడ’రేవుకు ఓకే!14-07-2018 02:34:49 3 వేల ఎకరాలిస్తే ఏర్పాటు చేస్తాం: గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎస్పీవీ పారిశ్రామిక అభివృద్ధికీ పూర్తి సహకారం భూమికోసం రాష్ట్రానికి లేఖ రాస్తున్నాం దుగరాజపట్నానికి ఇదే ప్రత్యామ్నాయం! వచ్చేనెల నుంచి ముంబై-గోవా క్రూయిజ్ విశాఖలోనూ క్రూయిజ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్ మూడేళ్లలో ‘సాగర మాల’ ప్రాజెక్టు పూర్తి విశాఖ సభలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘దుగరాజపట్నంలో పోర్టు కుదరదు’ అని తేల్చి చెబుతున్న కేంద్రం... ‘వాడరేవులో అయితే ఓకే’ అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్కడ 3 వేల ఎకరాలు ఇస్తే పోర్టు పెడతామని స్వయంగా కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణా, పోర్టుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి రాయాల్సిన లేఖను కూడా సిద్ధం చేశామని తెలిపారు. విశాఖపట్నంలో రెండు రోజులుగా మేజర్ పోర్టుల పనితీరును సమీక్షిస్తున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం విలేఖరులతో మాట్లాడారు. ‘వాడరేవు’ పోర్టుపై కీలక ప్రకటన చేశారు. ‘‘వాడరేవులో మూడువేల ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నాను. సాగరమాల ప్రాజెక్టు కింద ఆ ప్రాంతంలో పోర్టు ఆధారిత పారిశామ్రిక అభివృద్ధికి కూడా సహకరిస్తాం’’ అని గడ్కరీ తెలిపారు. కొత్త పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేస్తామని గడ్కరీ ప్రతిపాదించారు. నిజానికి... రాష్ట్రంలో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. కానీ... అది సాధ్యంకాదని కేంద్రం తేల్చేసింది. ఇప్పుడు అనూహ్యంగా విశాఖ పోర్టుకు అనుబంధంగా వాడరేవులో పోర్టు ఏర్పాటు చేస్తామని గడ్కరీ ప్రకటించడం విశేషం. ఇది విశాఖ పోర్టు ట్రస్టు పరిధిలోనే ఉంటుంది. విశాఖ రేవులో కార్యకలాపాలు ప్రస్తుతం సంతృప్తస్థాయికి చేరుకున్నాయి. దీని విస్తరణకు లేదా సమీపంలోనే మరో పోర్టు ఏర్పాటుకు స్థలం అందుబాటులో లేదు. దీంతో కొత్త పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వాడరేవులో 3వేల ఎకరాలు కేటాయిస్తే అక్కడే పోర్టు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖను సిద్ధం చేసింది. భారీగా పెట్టుబడులు... దేశంలో పోర్టులను కలుపుతూ రైలు, రోడ్డు మార్గాల నిర్మాణంపై రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని గడ్కరీ తెలిపారు. ఇందులో... రూ.4.5 లక్షల కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని... మరో రూ.2.5 లక్షల కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మరో రూ.8.7 లక్షల కోట్లతో 576 ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇవి పూర్తయితే కోటి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దేశంలో 18 శాతం జనాభా సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో మేజరు పోర్టులన్నీ సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రతి పోర్టులో తప్పనిసరిగా ఫిషింగ్ హార్బర్ ఉండాలని తేల్చిచెప్పారు. అందులో శీతల గిడ్డంగుల సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టులో రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎగుమతులు మాత్రమే జరుగుతాయి. కాండ్లా పోర్టులో రెండు వేల మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. దీనివల్ల పోర్టుకు అవసరమైన విద్యుత్తు యూనిట్ రూ.2.40కే లభిస్తుంది’’ అని తెలిపారు. సరుకు రవాణాకు రైల్వే వ్యాగన్ల కొరత అధికంగా ఉందని, దీనికి పరిష్కారాలు చూస్తున్నామని చెప్పారు. ప్రతి పోర్టులో కంటెయినర్ స్కానర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో పోర్టులన్నీ రూ.2 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల లాభం ఆర్జించే స్థాయికి చేరాయన్నారు. పర్యాటకం కూడా కీలకమైన అంశమని... వచ్చే నెల నుంచి ముంబై-గోవా మధ్య క్రూయిజ్ ప్రారంభమవుతుందని గడ్కరీ తెలిపారు. విశాఖపట్నంలో క్రూయిజ్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని పోర్టు చైర్మన్ కృష్ణబాబుకు తెలిపారు. అలాగే... ముంబైలో సముద్రంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్నంలోను అలాంటిది ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదేళ్లలో ఇండియాను ఆటోమొబైల్ హబ్‌గా మారుస్తామని, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి మోటారు వాహనాలు ఎగుమతి అయ్యేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సాగరమాల ప్రాజెక్టు కింద రూ.1.5 లక్షల కోట్లు రహదారులకు, రూ.లక్ష కోట్లు నీటి మార్గాలకు ఇస్తున్నామన్నారు. ప్రైవేటు పోర్టుల పోటీని తట్టుకునేందుకు ట్రేడర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చే అధికారం విశాఖపట్నం పోర్టు చైర్మన్‌కు ప్రత్యేక అధికారం కల్పిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)ని ప్రైవేటుపరం చేయడం కానీ, పెట్టుబడుల ఉపసంహరణ కానీ ఉండవని గడ్కరీ స్పష్టంగా ప్రకటించారు. విశాఖపట్నం, పారాదీప్, మంగుళూరు పోర్టులు డీసీఐని టేకోవర్ చేస్తాయని, వాటి ఆధ్వర్యంలోనే యథాపక్రారం నడుస్తుందని ప్రకటించారు. వైఎస్ హయాంలో... ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో రేవు ఏర్పాటు చేయాలని వైఎస్ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయి. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ‘వాన్‌పిక్’ (వాడరేవు-నిజాంపట్నం పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్) ఏర్పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో ‘వాన్‌పిక్’ భారీ ఎత్తున ప్రైవేటు భూములు కొనుగోలు చేసింది. ప్రభుత్వం కూడా భూమి సేకరించి ఇచ్చింది. అయితే... జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రమోటర్లు కూడా నిందితులు కావడం, భూమి వివాదాస్పదంగా మారడంతో ‘వాడరేవు’ కథ అక్కడితో ఆగిపోయింది. విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఆ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ... కేసుల నేపథ్యంలో అది కుదరలేదు. మొత్తానికి... ఎప్పుడో ముగిసిందనుకున్న ‘వాడరేవు’ కథ గడ్కరీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. పోర్టు ఏర్పాటు కోసం ఎలాంటి వివాదంలేని 3వేల ఎకరాలు భూములు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు షిప్పింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 edi game laga undi land ED daggra unte state ela isthundi
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 వనరుల్లేని చోట... వాడరేవు మాట! మూడు వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటన రామాయపట్నంపై స్పందించని నాయకులు ఆశల పోర్టుపై భిన్నవాదనలు ఈనాడు డిజిటల్- ఒంగోలు వనరులున్న చోట నిర్మించరట. అవకాశం లేని చోట భూమి ఇస్తే నిర్మిస్తారట... ఇదీ కేంద్ర నౌకాయాన, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం చేసిన ప్రకటనలో అంతరార్థం... ‘వాడరేవులో మూడు వేల ఎకరాల భూమి అవసరం ఉంది. దీని కోసం ముఖ్యమంత్రికి లేఖ రాస్తాం. భూమి అందించిన వెంటనే పోర్టు నిర్మాణం ప్రారంభిస్తాం.’ - విశాఖలో విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఈ ప్రకటన జిల్లాకు సంతోషాన్నిచ్చేదే. తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాకు అత్యావశ్యకమైన పోర్టుపై సానుకూల మాట ఊరటనిచ్చేదే. కానీ ఆచరణలోనే ప్రతికూలాంశాలు ఎక్కువ వెంటాడుతున్నాయి. అన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నం పోర్టు విషయంలో ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. కానీ భూములు అందుబాటులో లేని వాడరేవు పేరు తెరపైకి రావడం తాజా చర్చనీయాంశం. వాడరేవులో భూమి కష్టమే... చీరాల సమీపంలోని వాడరేవులో పోర్టు నిర్మాణమంటే కనీసం మూడు వేల ఎకరాల భూమి అవసరం ఉంది. ఇదే మంత్రి చెప్పిన మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఇంత భూమి లభ్యత కష్టమే. సమీపంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాలు భూమి ఉన్నప్పటికీ ఇది మొత్తం వ్యాన్‌పిక్ కేసులో భాగంగా ఈడీ ఎటాచ్ చేసింది. ప్రస్తుతం ఈ భూమిపై ఎటువంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. ఇది తప్ప వాడరేవులో ఇతర భూమి లేదు. కీలకమైన భూమి విషయంలోనే ఇన్ని చిక్కులు ఉండగా, ఇక ఇతర సాంకేతిక అంశాల్లోనూ స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఇక్కడ పోర్టు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఎటువంటి పరిశోధనలు, ప్రతిపాదనలు జరగలేదు. మినీ హార్బర్ నిర్మాణానికే అనుమతులు వచ్చాయి. అందుకు తగిన దస్త్రాలు ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. మినీహార్బర్ నిర్మాణానికి కావాల్సిన రూ. 400 కోట్ల నిధులపైనే స్పష్టత లేదు. ఈ ప్రకటన వచ్చి ఎటువంటి దశ మొదలు కాకుండానే, తాజాగా పోర్టు నిర్మాణం అంటూ ప్రకటనలు చేయడంతో స్థానికంగాను కొంత గందరగోళం నెలకొంది. రామాయపట్నం ఏమైనట్టు? జిల్లాకు పూర్వం నుంచి ఉన్న నౌకాశ్రయం రామాయపట్నం. బ్రిటిష్ పాలన సమయంలోనే దీన్ని విదేశాలకు రవాణాకు ఉపయోగించేవారు. కాల క్రమేణా ఈ రేవు కళ కోల్పోయి కొన్ని దశాబ్దాలుగా మరుగున పడింది. జిల్లా అవసరాలు, ఉపాధి, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు రామాయపట్నం నిర్మాణం అత్యవసరమన్న వాదనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టు నిర్మాణానికి అత్యంత అనుకూలతలు ఉన్న ప్రాంతం రామాయపట్నం అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 2015 నుంచి జరిగిన వివిధ పరిశోధనలు, సాంకేతిక అంశాల్లోనూ ఇదే తేలింది. భూమితో పాటు, మానవ వనరులు, సమీపంలోని వాతావరణం మొత్తం పోర్టుకు అనుకూలమని ఇస్రో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ ఇక్కడ పోర్టు నిర్మాణం విషయంలో ఎటువంటి ముందడుగు పడడం లేదు. స్పష్టమైన హామీ రావడం లేదు. జిల్లాకు అవసరమైన, అనుకూలమైన, కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్న రామాయపట్నం పోర్టు విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. కేవలం వాడరేవు అని మాత్రమే ప్రకటించారు. పోర్టుల విభాగం అధికారులు, రాష్ట్రంలోని కొందరు ముఖ్య నాయకులకు రామాయపట్నం విషయంపై పూర్తి అవగాహన ఉంది. కానీ కేంద్రమంత్రి ద్వారా ఈ ప్రకటన వెలువడడానికి ముందు అసలు ప్రస్తావనే రాలేదు. ఈ స్థితిలో రామాయపట్నం మాటేమిటన్న ప్రశ్నకు జవాబు లేదు.
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 కేసులు తేలితేనే... భూమి దొరికేది! ప్రకాశం జిల్లాలో నౌకాశ్రయ నిర్మాణానికి కేంద్ర మంత్రి హామీ నేపథ్యం.. ఈనాడు-అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో నౌకాశ్రయం నిర్మించేందుకు మూడు వేల ఎకరాల భూమి కావాలని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పేర్కొన్న నేపథ్యంలో... అసలక్కడ భూమి లభ్యత ఎక్కడిదన్న ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు వైఎస్ ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వ (సుమారు అయిదు వేల ఎకరాలకు పైగా), ప్రైవేటు(1,825 ఎకరాలు) భూమిని అప్పగించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈ ప్రాజెక్టుకు చేసిన భూకేటాయింపు కూడా ఉంది. ఆ భూములు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పరిధిలో ఉన్నాయి. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రతిపాదిస్తున్న నౌకాశ్రయానికి భూమి ఇవ్వాలంటే.. దీన్నుంచే కేటాయించాలి. ఈడీ పరిధిలోనున్న భూమిని ఇప్పటికిప్పుడు కేటాయించటం సాధ్యం కాకపోవచ్చని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశాఖపట్నం నౌకాశ్రయం విపరీతమైన రద్దీతో ఉండటం, అదనంగా బెర్త్‌లు నిర్మించే అవకాశం లేకపోవటంతో ఇతర ప్రాంతాల్లో నౌకాశ్రయాలను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలోనే గంగవరం, పక్కనున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడల్లో నౌకాశ్రయాలు ఉండగా.. తాజాగా విశాఖకు రెండో వైపున శ్రీకాకుళం జిల్లా భావనపాడులో మరొకటి ఏర్పాటుకానుంది. ఇవన్నీ ప్రైవేట్ రంగంలోనివే. కాకినాడలోనే స్విస్‌ఛాలెంజ్ విధానంలో ప్రైవేట్ రంగంలోనే మరో నౌకాశ్రయం రానుంది. రాష్ట్ర విభజన చట్టంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో కేంద్రం నౌకాశ్రయం నిర్మించాలని ఉంది. అది సాధ్యం కాకుంటే ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో ఏర్పాటుచేయటానికి అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయి. ఈ రెండింటినీ కాదని కేంద్ర మంత్రి గడ్కరీ కొత్తగా చీరాల సమీపంలోని వాడరేవు వద్ద మూడు వేల ఎకరాల భూమిని కేటాయిస్తే... కొత్త నౌకాశ్రయాన్ని నిర్మిస్తామనడం విస్మయం కలిగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. గతంలోనూ విశాఖపట్నం నౌకాశ్రయంలో రద్దీని తగ్గించటానికి ఇతర చోట్ల భూమినిస్తే కొత్తగా మరొకటి నిర్మిస్తామని నోటిమాటగా చెప్పటమే తప్ప చీరాల సమీపంలోనే కావాలని అధికారికంగా ప్రకటించటం ఇదే తొలిసారని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఒకరు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
sonykongara Posted July 15, 2018 Author Posted July 15, 2018 ఇప్పుడు వాడరేవు పోర్టుగాని, మొన్న కడప స్టీల్ ప్లాంట్‌గాని, అన్నీ ఆ @ysjagan పుణ్యాన వివాదాలలో ఉన్నవే, ఆ జగ్గడేమో అందినకాడ దోచుకొన కేసులలో ఇరుక్కున్నాడు. NDA @narendramodi కేసులు తేల్చడు, భూములు అప్పగించరు, పరిష్కరించే ఆలోచన చేయరు.
sonykongara Posted September 27, 2018 Author Posted September 27, 2018 చంద్రబాబుకు గడ్కరీ లేఖ 27-09-2018 15:06:45 అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామని లేఖలో సూచించారు. దీని కోసం ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ కోరారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని సూచన చేశారు. ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ తరుణంలో ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
sonykongara Posted September 28, 2018 Author Posted September 28, 2018 ఆశల ఓడ... అవరోధాల గోడ...! వాడరేవులో భారీ పోర్టుకు సానుకూలమన్న కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సీఎంకు లేఖ భూ సేకరణే ప్రధాన సమస్యఈనాడు డిజిటల్- ఒంగోలు, చీరాల అర్బన్, న్యూస్‌టుడే జిల్లాలో భారీ ఓడరేవు నిర్మాణం మాట మరోసారి తెరపైకి వచ్చింది. జులై నెలలో విశాఖ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకాశం జిల్లా వాడరేవులో భారీ ఓడరేవు నిర్మిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అనుమతులు ఇస్తామనీ, భారీ ఓడరేవు నిర్మిద్దామని పేర్కొన్నారు. ఇది శుభసూచికమే.. ఆశలు రేకెత్తించేదే.. కానీ, చీరాలలో ఎదురవుతున్న సాంకేతిక అవరోధాలే సమస్యగా మారనున్నాయి. జిల్లాలో ఇప్పటికే రామాయపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్- మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. డీపీఆర్ తయారీ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి చీరాల వద్ద భారీ ఓడరేవు నిర్మిద్దామంటూ ప్రతిపాదన రావడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ లేఖ జిల్లాకు సంతోషాన్నిచ్చేదే. 102 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. జిల్లా నుంచి పొగాకు, గ్రానైట్ రవాణా భారీగా జరుగుతోంది. విదేశాలకు ఎగుమతి ఉంది. కానీ, ఇవన్నీ ప్రస్తుతం నెల్లూరు జిలా కృష్ణపట్నం పోర్టు నుంచి జరుగుతున్నాయి. మన జిల్లాలోనే పోర్టు ఉంటే భారీ స్థాయిలో ఎగుమతులు జరుగుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సుదీర్ఘ కాలంగా జిల్లాలోని రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందడుగు వేసింది. నిర్మాణానికి ముందస్తు దశ మొదలైంది. తాజా లేఖతో చీరాలలో ఓడరేవు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. ఇక్కడ అడ్డంకులు ఎలా అధిగమిస్తారనేదే ప్రశ్నర్థకంగా మారింది. భూ సేకరణకు కష్టమే...!చీరాల సమీపంలోని వాడరేవులో పోర్టు నిర్మాణమంటే మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. గతంలో కేంద్రమంత్రి కూడా ఇదే విషయం చెప్పారు. కానీ, వాడరేవులో ఇంతటి భూమి లభ్యతపైనే అనుమాలన్నీ... ఈ చుట్టుపక్కల సుమారు ఎనిమిది వేల ఎకరాల భూమి ఉన్నా.. అది మొత్తం వాన్‌పిక్ కేసులో భాగంగా ఈడీ అటాచ్ చేసింది. ప్రస్తుతం ఈ భూమిపై ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. ఈ భూమిలో తప్ప, వేరేచోట ఓడరేవు నిర్మాణం సాధ్యపడదు. ఈ భూమిని ఈడీ నుంచి విడిపిస్తే భూముల చిక్కులు తీరినట్టే. ఇందుకు రాష్ట్రమే కాకుండా, కేంద్రం కూడా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కీలకమైన భూమి విషయంలోనే ఇన్ని చిక్కులు ఉండగా, ఇక ఇతర సాంకేతిక అంశాల్లోనూ స్పష్టత లేదు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి ఎన్నో పరిశీలనలు జరిగాయి. వాతావరణ, స్థానిక తేమ, గాలి... ఇలా అన్నిటిపైనా వాడరేవులో నిశిత పరిశోధనలు జరగాల్సి ఉంది. నిజానికి చీరాలలో మినీ హార్బర్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసమే నానా తంటాలు ఎదురవుతున్నాయి. ఇక భారీ ఓడరేవు అంటే భూమి చిక్కులు దాటడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది. * రామాయపట్నం పోర్టు విషయమై జిల్లాలో ఇప్పుడు మిశ్రమ స్పందన ఉంది. మేజర్ పోర్టు అయితే స్వాగతిస్తామంటూ ప్రతిపక్షాలు, పోరాట సమితి సభ్యులు చెబుతుండగా, నాన్-మేజర్ పోర్టు కూడా అదే స్థాయిలో ఉంటుందని, పెద్దగా తేడా ఏమీ ఉండదని అధికార పక్షం చెబుతోంది. జిల్లాలో పోర్టు నిర్మాణ ప్రకటన, అనుమతుల ఉత్తర్వులతో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. విపక్షాల వాదనలు ఎలా ఉన్నా.. జిల్లాలో అధిక శాతం దీన్ని ఆమోదించారు. పోర్టు నిర్మాణంలో కీలకమైన డీపీఆర్ తయారీకీ ఒప్పందం జరిగింది. ఈ తరుణంలో జిల్లాలో మరో ఓడరేవు నిర్మాణమంటూ కేంద్రం నుంచి అనుకూలత వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకం. రామాయపట్నంలోనే కేంద్రంతో కలిసి భారీ ఓడరేవు నిర్మించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
sonykongara Posted September 28, 2018 Author Posted September 28, 2018 వాడరేవు పోర్టు’కు కేంద్రం మొగ్గుఈ నెల 13న సీఎంకు గడ్కరీ లేఖరామాయపట్నంలో ఏర్పాటుకే రాష్ట్రం సుముఖం ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపున ఏర్పాట్లు చేస్తుంటే ఇంకోవైపున కేంద్రం ఇప్పటికీ వాడరేవులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా పోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ మేరకు కేంద్ర ఓడరేవులు, రోడ్డు రవాణామంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రికి తాజాగా లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ప్రకాశం జిల్లా వాడరేవులో ప్రపంచస్థాయి సౌకర్యాలతో పోర్టు నిర్మాణం కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 13న ఆయన రాసినట్లుగాఉన్న లేఖపై ఇప్పటివరకైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సీఎంతోపాటు ఇతర ముఖ్య అధికారులు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యత ఒక ప్రయివేట్ సంస్థకు అప్పగించిన విషయాన్ని, రామాయపట్నంలోనే ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి సమాధాన లేఖరాసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాడరేవులో పోర్టు ఏర్పాటుకు ఇప్పటికే నమోదైన పాత కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయస్థానాల పరంగా ఎదురయ్యే చిక్కులను కూడా వివరించనున్నారని అధికారులు చెబుతున్నారు. 2015 అక్టోబరు 13న కూడా పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయాన్ని సీఎంకి రాసిన లేఖలో గడ్కరీ ప్రస్తావిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా వాడరేవులో పోర్టు నిర్మాణ ప్రతిపాదనల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now