Jump to content

Recommended Posts

Posted
నవ్యాంధ్రలో ఆధునిక వైద్యం
 
636203245908191262.jpg
  •  ఇబ్రహీంపట్నంలో ఏఏఐఎంఎస్‌ 
  •  20 ఎకరాల సీలింగ్‌ సర్‌ప్లస్‌ ల్యాండ్‌ను కేటాయిస్తూ జీవో జారీ 
  • తెల్ల రేషన్ కార్డుదారులకు 5 శాతం పడకలు 
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ వైద్య సదుపాయం 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
నవ్యాంధ్రలో ఆధునిక వైద్యాన్ని అందించే మరో సూపర్‌ స్పెషాలిటీ, బోధనాసుపత్రిలు త్వరలో రానున్నాయి. అమరావతి అమెరికన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఏఐఎంఎస్‌) సంస్థ దరఖాస్తు మేరకు ఇబ్రహీంపట్నంలో 20 ఎకరాల సీలింగ్‌ సర్‌ప్లస్‌ ల్యాండ్‌ను కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. సీలింగ్‌ భూమిని ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ మల్లెల పద్మనాభరావు మిగులు భూమి కింద ప్రభుత్వానికి అప్పగించారు. భూమిని ఆస్పత్రికి ఇచ్చేందుకు పంచాయతీ తీర్మానం చేసింది. ప్రభుత్వ అధికారులు ఎకరా రూ.2.50 కోట్ల మేరకు ఖరీదు కట్టినా, నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఎకరా రూ.50లక్షలకు నిర్ణయించారు. ఈమేరకు రెవెన్యూ స్పెషల్‌ చీప్‌ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి రాజధాని చెంతనే..
త్వరలో ఇబ్రహీంపట్నం నుంచి అవరావతికి కృష్ణానది మీదుగా ఐకాన బ్రిడ్జి రానుంది. దీంతోపాటు ప్రస్తుతం కేటాయించిన సర్వేనెంబర్లలోని మిగిలిన భూమిలో పెద్ద కన్వెన్షన సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో యూకే, షెట్టి ఆస్పత్రుల నిర్మాణానికి స్థలం కేటాయించిన రీతిలోనే అమెరికన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు స్థలం కేటాయించారు. సర్వే 151లో 8.17 ఎకరాలు, సర్వే 154లోని 17.61 ఎకరాలలో సూపర్‌స్పెషాలిటి, మెడికల్‌కాలేజి, టీచింగ్‌ ఆస్పత్రులు నిర్మాణం కానున్నాయి. జిల్లాస్థాయి ఆస్పత్రి, సూపర్‌స్పెషాలిటీ, మెడికల్‌ కాలేజీ, టీచింగ్‌ ఆస్పత్రులు నిర్మాణమవుతాయి. డాక్టర్‌ నవనీత కొర్రపాటి, డాక్టర్‌ చంద్ర ఎస్‌.మొక్కపాటి దరఖాస్తు చేశారు.

నిబంధనలు ఇవీ..
ఆస్పత్రిలోని మొత్తం బెడ్ల సంఖ్యలో ఐదుశాతం బెడ్లను తెల్లరేషనకార్డు పేదలకు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ విద్యార్థులకు, ఆశ్రమ విద్యార్థులకు, గురుకుల, మనబడి విద్యార్థులకు వైద్యం నిర్వహించాలి. ఎంసీఐ నిబంధనల మేరకు సంస్థలను నిర్వహించాలి. ఆస్పత్రిలో చార్జీలు ఎక్కువగా ఉండకూడదు. ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చార్జీలు తక్కువగా ఉన్నట్టయితే, వాటిని పరిశీలించి ఆమేరకు మెడికల్‌ బిల్లులను రీయింబర్స్‌కు సిఫారసు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని జీవోలో పేర్కొన్నారు.
  • 2 weeks later...
Posted
అమరావతిలో పీఈఎస్‌ విద్యా సంస్థలు
 
  • 1300 కోట్ల పెట్టుబడి.. 
  • నేడు సీఎం సమక్షంలో ఒప్పందం 
బెంగళూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజధాని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు పేరొందిన పీఈఎస్‌ యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతిలో విద్యా ప్రాజెక్టులలో భారీ పెట్టుబడులకు నిర్ణయించింది. పీఈఎస్‌ విద్యా సంస్థల చాన్సలర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి శనివారం విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకోనున్నారు. పీఈఎస్‌ విద్యా సంస్థలు తొలుత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను అమరావతిలో ఆరంభించనున్నట్లు శుక్రవారం దొరస్వామి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు ఎంపికైన వారికి శిక్షణను ఇక్కడి కేంద్రం నుంచే ఇస్తామని తెలిపారు. ఒప్పందంలో రెండో ప్రాజెక్టుగా సైన్స అండ్‌ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్య, పారిశ్రామిక, వైద్య ప్రాజెక్టులను పీఈఎస్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. తొలుత రెండు ప్రాజెక్టుల్లో రూ.1300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
Posted
అమరావతిలో పీఈఎస్‌ విద్యా సంస్థలు
 
636212546148713179.jpg
బెంగళూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రూ.1300 కోట్ల పెట్టుబడులతో విద్యా సంస్థల స్థాపనకు బెంగళూరుకు చెందిన పీఈఎస్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు శనివారం విశాఖ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో పీఈఎస్‌ వ్యవస్థాపడుకు, వర్సిటీ చాన్సెలర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమరావతిలో తొలుత అధ్యాపక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నేటీ ఆధునిక విద్యా విధానంపై పీఈఎస్‌ సంస్థ శిక్షణ ఇస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు, శిక్షణలు నిర్వహిస్తారు. పీఈఎస్‌ సంస్థల ఐదు దశాబ్దాల అనుభవం నవ్యాంధ్రకు ఉపయోగపడేందుకు తోడ్పాటునందిస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు దొరస్వామిని సీఎం చంద్రబాబు అభినందించారు.
Posted
అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ డిజైన్ లు ఇవే

 

srm-university-amaravati-1.jpg
 

దక్షిణాదిన ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో 200 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూమి, నీరుకొండ సమీపంలో కేటాయించారు. రెండు దశల్లో అప్పగించే ఈ భూమికి ఎకరం రూ.50 లక్షలుగా ధరగా ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, బిజినెస్‌, వైద్య కోర్సులను అందించనున్నారు. 52 వేల మంది విద్యను అభ్యసించనున్నారు. పదేళ్లలో మొత్తం రూ.4,400 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చెయ్యనున్నారు. వర్సిటీ ఏర్పాటు పూర్తయ్యేనాటికి 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని త్వరలో జరగనుంది.

అలాగే ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, అమరావతి కాంపస్ లో, ఫాకల్టీ పోస్ట్లు భర్తీకి కూడా వర్సిటీ అవకాశం ఇచ్చింది. హెచ్ఓడి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు, ఇక్కడ క్లిక్ చెయ్యగలరు http://www.srmuniv.ac.in/srmap/dean-hods.html

చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఎస్‌ఆర్‌ఎం డిజైన్ లు సిద్ధం చేసేంది... ఆ డిజైన్ లు ఇవే..

srm-university-amaravati-2.jpg

srm-university-amaravati-3.jpg

srm-university-amaravati-4.jpg

Posted
అమరావతిలో ‘‘బిట్స్‌’’
 
636216842150200643.jpg
హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని నగరానికి మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ‘బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెన్‌- బిట్స్‌’ రానున్నది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బిట్స్‌ పిలానీ యాజమాన్య ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. అమరావతిలో ఇతర ప్రఖ్యాత విద్యా సంస్థల తరహాలోనే బిట్స్‌ కూడా తమ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, బిట్స్‌ అధినేత కుమార మంగళం బిర్లాతో సంప్రదింపులు జరిపితే ఈ సంస్థ ఏర్పాటుపై తుది నిర్ణయం వెలువడుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో ఐఐటీలకు దీటుగా ఇంజనీరింగ్‌ విద్యను బోధించే సంస్థ బిట్స్‌. రాజస్థాన్‌లోని పిలానీలో 1964లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. పిలానీ కాకుండా ప్రస్తుతం దేశంలో గోవా, హైదరాబాద్‌లలో మాత్రమే బిట్స్‌ క్యాంప్‌సలున్నాయి. మరొకటి దుబాయ్‌లో ఉంది.
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted

చెన్నైకు చెందిన వీరైయాన్‌ సరస్వతి చారిటబుల్‌ ట్రస్ట్‌ అమరావతిలో సవిత విశ్వవిద్యాలయాన్ని రూ.150 కోట్లతో ఏర్పాటుచేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. దీనికి పదేళ్లలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడతారు. 21,065 మంది ఈ పదేళ్లలో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం అమరావతిలో 75ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

Posted

* ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన, రవాణా (లాజిస్టిక్‌), సముద్రయాన (మారిటైమ్‌) విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులకు ఆమోదం. ఈ శాసనసభ సమావేశాల్లోనే వాటిని ప్రవేశపెట్టాలని నిర్ణయం

Posted

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నెలకొల్పబడనుంది. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పనున్న తొలి ప్రైవేట్ యూనివర్సిటీ విట్‌ కు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. కాగా ఇప్పుడు చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సవీత విశ్వవిద్యాలయం రాజధానిలో అడుగిడనుంది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న సవీత విశ్వవిద్యాలయానికి ఆసక్తి వ్యక్తీకరణ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన సవీత విశ్వవిద్యాలయం మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఇంజనీరింగ్, ఫీజియోథెరపీ, నర్సింగ్, లా అండ్ మేనేజ్ మెంట్ కోర్సులను అందిస్తోంది.
17022408_1589185421095043_43363906224206

Posted
‘గీతం’తో యూకే వర్సిటీ ఒప్పందం
 
  • అమరావతి ప్రాంగణానికి సహకారం
విశాఖపట్నం, మార్చి 8: అమరావతిలో గీతం విశ్వవిద్యాలయం త్వరలో నెలకొల్పనున్న నూతన ప్రాంగణానికి యూకేకు చెందిన లాంకెస్టర్‌ విశ్వవిద్యాలయం సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు బుధవారం గీతం విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన లాంకెస్టర్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ వ్యవహారాల విభాగం ఆచార్యులు, ఉపకులపతి స్టీవ్‌ బ్రాడ్లీ, మేనేజ్‌మెంట్‌ విభాగం డీన్‌ యాంగన్‌ లీంగ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. యూకే వర్సిటీల్లో తొమ్మిదవ స్థానంలో ఉన్న లాంకెస్టర్‌ వర్సిటీ ప్రపంచ ర్యాంకింగ్‌లో 135వ స్థానంలో ఉందని ఈ సందర్భంగా స్టీవ్‌ బ్రాడ్లీ తెలిపారు. గీతం వర్సిటీ, తాము సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో బోధన, పరిశోధన రంగాల్లో పరస్పరం సహకరించుకుంటామన్నారు. గీతం వర్సిటీ అమరావతి ప్రాంగణాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి తమ సహకారం ఉంటుందన్నారు. గీతం వర్సిటీ వీసీ ప్రసాదరావు మాట్లాడుతూ బోధన విభాగాలతో పాటు భారీ పరిశోధన ప్రాజెక్టులను, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నామనిని పేర్కొన్నారు.
 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...