Jump to content

Top Private universities in Amaravati


Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
రాజధాని సిగలో ఆరోగ్య సంస్థలు
 
 
636373438179163017.jpg
  • అమరావతికి రెండు అంతర్జాతీయ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాక
  • 10న బీఆర్‌ శెట్టి మెడికల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన
  • పిచుకలపాలెంలో వంద ఎకరాల కేటాయింపు
  • 16న నవులూరులో ఇండో- యూకే ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన
 
బీఆర్‌ శెట్టి హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కి కేటాయించనున్న పిచుకలపాలెం రెవెన్యూలోని భూములను పరిశీలిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
 
తుళ్లూరు: రాజధాని అమరావతి విజ్ఞాన ఖనిగా మారబోతుంది. ఇప్పటి కే జాతీయస్థాయి గురింపు పొందిన విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థలు ప్రవేశించి బోధనను ఆరంభించిన సంగతి తెలిసిందే. మరో రెండు అంతర్జాతీయ హెల్త్‌ విద్యాసంస్థలైన బీఆర్‌ శెట్టి మెడికల్‌ సిటీ హెల్త్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌, కింగ్‌ కాలేజీ ఆఫ్‌ లండన్‌కు చెందిన ఇండో-యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాజధాని అమరావతిలో ఏర్పడబోతున్నాయి. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచుకలపాలెం రెవెన్యూలోని వంద ఎకరాల్లో నెలకొల్పుతున్న బీఆర్‌ శెట్టీ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే నెల 16న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలోని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండో- యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కు కూడా మఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పిచుకలపాలెంలో శెట్టి ఇనిస్టిట్యూట్‌కి కేటాయించే భూములను బుధవారం సీఆర్‌డీఏ భూ వ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, సర్వే అధికారులు, ఎకనామిక్‌ డెవలప్‌మెంటు డైరెక్టర్‌ నాగిరెడ్డి, బీఆర్‌ శెట్టి ప్రతినిఽధి ప్రజీత్‌ వాసుదేవన్‌ పరిశీలించారు. బీఆర్‌ శెట్టి ప్రధాన ఇనిస్టిట్యూట్‌ అబుదాబీ దేశంలో నెలకొల్పబడి ఉంది. మనదేశంలో కూడా ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఆ సంస్థ తన ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పటానికి ఆసక్తి కనబరచటంతో వంద ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

16న లండన్‌ కింగ్స్‌ ఆస్పత్రికి శంకుస్థాపన
14-08-2017 01:47:35
 
  • అమరావతి మనందరికీ గర్వకారణం
  • స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో సీఎం
 
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో మన కీర్తిపతాకను రెపరెపలాడించే అమరావతి మనందరికీ గర్వకారణం సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయనున్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. ఇప్పటికే విట్‌, ఎస్‌.ఆర్‌.ఎం. యూనివర్సిటీలు రాజధానిలో తమ క్యాంప్‌సలను ప్రారంభించాయని, బీఆర్‌ శెట్టి వైద్యవిజ్ఞాన సంస్థ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి తన ప్రాంగణానికి భూమిపూజ జరిపిందని పేర్కొన్నారు.
 
ఇదే బాటలో మరెన్నో విఖ్యాత విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయన్న చంద్రబాబు... ప్రపంచంలో పేరొందిన లండన్‌ కింగ్స్‌ హాస్పిటల్‌ రూ.1000 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాజధానితోపాటు ప్రతి జిల్లాను ప్రగతికి చిహ్నంగా నిలిచేలా, వాటి భౌగోళిక స్థితిగతులు, లభ్యమయ్యే సహజ వనరుల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమును స్వాతంత్య్ర దినాన ప్రారంభించబోతున్నామని తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...