Jump to content

Top Private universities in Amaravati

Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
విట్‌’లో బీబీఏ ప్రారంభం
24-06-2018 03:13:11
 
  • మిచిగాన్‌ డియర్‌ బోర్న్‌ వర్సిటీతో ఎంఓయూ
గుంటూరు(విద్య), జూన్‌ 23: అమరావతిలోని విట్‌ యూనివర్సిటీ 2018-19 విద్యా సంవత్సరంలో 2+2 బీబీఏ డిగ్రీ కోర్సును ప్రారంభించినట్టు చాన్సలర్‌ విశ్వనాథన్‌ శనివారం పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ డియర్‌ బోర్న్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు రెండేళ్లు అమరావతి, రెండెళ్లు అమెరికాలో చదువుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరో ఆప్షన్‌గా బీబీఏ డిగ్రీ+ ఏడాది డిప్లమా చేశాక అమెరికా ఎంఎస్‌ వెళ్లి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. విట్‌లో బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగావ్‌ డియర్‌ బోర్న్‌లో పీజీ చేసే సౌలభ్యం ఉందన్నారు.
Link to comment
Share on other sites

మిషిగాన్‌-డియర్‌ బోర్న్‌ వర్సిటీతో వీఐటీ-ఏపీ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: బీబీఏ డిగ్రీ కోర్సుకు సంబంధించి వీఐటీ-ఏపీ వర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ డియర్‌ బోర్న్‌ యుఎండీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అమెరికాలోని మిషిగాన్‌-డియర్‌ బోర్న్‌ వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఛాన్సలర్‌ డానియల్‌ లిటిల్‌, వీఐటీ ఛాన్సలర్‌ జి.విశ్వనాథన్‌ ఈ మేరకు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో అమరావతిలోని వీఐటీ వర్సిటీలో బీబీఏ చేసే విద్యార్థులు రెండేళ్లు అమరావతిలో..రెండేళ్లు అమెరికాలో చదువుకోవచ్చని విశ్వనాథన్‌ తెలిపారు. చదువు పూర్తయ్యాక ఆ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందవచ్చన్నారు. మరో ఆప్షన్‌గా అమరావతిలో మూడేళ్ల బీబీఏ డిగ్రీ, ఏడాది డిప్లొమా చేశాక ఎంఎస్‌ అమెరికాలో చేయవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.అలాగే వీఐటీ అమరావతి ప్రాంగణంలో బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు యుఎండీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసే సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు బీబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చని వీఐటీ-ఏపీ వర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

On 6/25/2018 at 5:32 PM, sonykongara said:

Seat kaavalante em cheyaali and inter lo percentage entha raavali 

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
అమరావతికి జేవియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌
ప్రఖ్యాత విద్యాసంస్థకు  ఈ నెలలోనే శంకుస్థాపన
2ap-state9a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ వస్తోంది. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) సంస్థ అమరావతిలోని ఐనవోలు సమీపంలో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఎకరం రూ.10 లక్షల చొప్పున 50 ఎకరాలు కేటాయించింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ.. భువనేశ్వర్‌లో రెండో క్యాంపస్‌ ఏర్పాటు చేసింది. మూడో ప్రాంగణాన్ని ఇప్పుడు అమరావతిలో ప్రారంభిస్తోంది.

5 వేల మందికి బోధన
మొత్తం విద్యార్థులు: 5 వేలు
కోర్సులు: మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు
అకడమిక్‌ బ్లాక్‌: 17 ఎకరాల్లో జీ+5 విధానంలో నిర్మిస్తారు. 84 తరగతి గదులు, 7 లెక్చర్‌ హాళ్లు, 500 ఫ్యాకల్టీ కార్యాలయాలు, 40 కాన్ఫరెన్స్‌ రూంలు, మినీ ఆడిటోరియం, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటివి ఉంటాయి. ఇవికాకుండా పరిపాలన విభాగం, గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, ఇంటర్నేషనల్‌ సెంటర్‌, వినోద, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
* డిగ్రీ, పీజీ విద్యార్థులకు జీ+15 అంతస్తుల్లో వేర్వేరుగా హాస్టల్‌ భవనాలు; బోధన, బోధనేతర సిబ్బందికి జీ+17 విధానంలో నివాస భవనాలు నిర్మిస్తారు.

Link to comment
Share on other sites

  • 4 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...