Jump to content

polavaram


Recommended Posts

స్పిల్‌వే డిజైన్‌కు జలసంఘం ఆమోదం
01-11-2018 04:08:52
 
  • 42 మీటర్ల ఎత్తున కాంక్రీటుకు ఓకే
పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరుచేసింది. స్పిల్‌ వే నిర్మాణంలో ఇప్పటి వరకు 28 మీటర్ల ఎత్తు వరకు కాంక్రీట్‌ వేయడానికి మాత్రమే అనుమతులు వచ్చాయి. ఇప్పుడు 42 మీటర్ల వరకు కాంక్రీట్‌ వేయడానికి బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో గేట్లు అమర్చడానికి పూర్తిస్థాయిలో ఆటంకాలు తొలగిపోయాయి. అయితే ఒకటి నుంచి నాలుగో గేటు వరకు, 14 నుంచి 48వ గేటు వరకు పిల్లర్లు నిర్మించడానికి మాత్రమే అనుమతులు లభించాయి. 5 నుంచి 14వ బ్లాకు వరకు రివర్‌ ఫ్లూయిస్‌ గేట్లకు అనుమతులు రావలసి ఉంది.
Link to comment
Share on other sites

స్పిల్‌వే డిజైన్‌కు జలసంఘం ఆమోదం
01-11-2018 04:08:52
 
  • 42 మీటర్ల ఎత్తున కాంక్రీటుకు ఓకే
పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరుచేసింది. స్పిల్‌ వే నిర్మాణంలో ఇప్పటి వరకు 28 మీటర్ల ఎత్తు వరకు కాంక్రీట్‌ వేయడానికి మాత్రమే అనుమతులు వచ్చాయి. ఇప్పుడు 42 మీటర్ల వరకు కాంక్రీట్‌ వేయడానికి బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో గేట్లు అమర్చడానికి పూర్తిస్థాయిలో ఆటంకాలు తొలగిపోయాయి. అయితే ఒకటి నుంచి నాలుగో గేటు వరకు, 14 నుంచి 48వ గేటు వరకు పిల్లర్లు నిర్మించడానికి మాత్రమే అనుమతులు లభించాయి. 5 నుంచి 14వ బ్లాకు వరకు రివర్‌ ఫ్లూయిస్‌ గేట్లకు అనుమతులు రావలసి ఉంది.
Link to comment
Share on other sites

పోలవరంలో మరో రికార్డు
01-11-2018 04:08:15
 
636766420963140973.jpg
  • 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి
  • నెలలోనే సాధించిన నవయుగ
  •  త్రీగాడ్జెస్‌ రికార్డు బద్దలు కొడతామన్న ఎండీ
పోలవరం, అక్టోబరు 31: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో రికార్డు.. అక్టోబరు నెలలో ఏకంగా 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు పనులు పూర్తిచేసిన ఘనతను కాంట్రాక్టు సంస్థ నవయుగ సాధించింది. ఒక నెలలో ఇంత పెద్దఎత్తున కాంక్రీటు పనులు పూర్తిచేయడం దేశంలోనే ఇది మొదటిసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఈ పనులు చేపట్టిన సంస్థ.. ఇప్పటివరకు పది లక్షల 12 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తిచేసింది. స్పిల్‌ చానల్లో మూడు లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌వే, స్కిల్లింగ్‌ బేషింగ్‌లలో కలిపి మరో ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసింది. ఈ 9 నెలల్లో నాలుగు నెలలు గోదావరి వరదలు, వర్షాలు, తుఫాన్ల కారణంగా పనులు నిలిచిపోయినా.. మిగతా ఐదు నెలల కాలంలోనే 10.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయడం విశేషం. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం వల్లే రికార్డులను సొంతం చేసుకుంది. గత జూన్‌ 10న ఒక్కరోజే 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు ఒక నెలలోనే 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ఇంకో రికార్డు సృష్టించింది.
 
ఎండీ అక్కడే..
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో నవయుగ ఎండీ శ్రీధర్‌ పోలవరంలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. వారంలో మూడు రోజులపాటు ప్రాజెక్టు వద్దే మకాం వేస్తున్నారు. దీనికితోడు దైవబలం కావాలంటూ ప్రతి మంగళవారం ప్రాజెక్టు క్షేత్రంలో చండీ యాగం నిర్వహిస్తున్నారు. దీనిపై శ్రీధర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఇక నుంచి కాంక్రీటు పనుల వేగాన్ని రెట్టింపు చేస్తామని, నవంబరులో 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు మూడు బ్లాచింగ్‌ ప్లాంట్లు, స్పిల్‌ చానల్‌ పనులకు ఏడు బ్లాచింగ్‌ ప్లాంట్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రపంచ రికార్డు పొందిన చైనాలోని త్రీగాడ్జెస్‌ ప్రాజెక్టులో ఒక్క రోజులో 13 వేల క్యూబిక్‌ మీటర్లు వేయడమే ఇప్పటి వరకు ప్రపంచ రికార్డుగా ఉందని.. పోలవరంలో ఒకే రోజున 14 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ఆ రికార్డును బద్దలు కొడతామని చెప్పారు.
Link to comment
Share on other sites

పోలవరంలో వేగంగా కాంక్రీట్‌ పనులు
అక్టోబర్‌లో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తి

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌ పనులకు సంబంధించి అక్టోబరులో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసినట్లు నవయుగ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి తెలిపారు. స్పిల్‌వేలో రోజుకు 3,500 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ఛానల్‌లో 3,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేస్తున్నట్లు బుధవారం ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. కంపెనీ ఎండీ వి.శ్రీధర్‌ వారంలో మూడు రోజులు ప్రాజెక్టు వద్ద మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. స్పిల్‌ఛానల్‌లో మట్టి తవ్వకం వేగం పెరిగితే కాంక్రీట్‌ రోజుకు ఐదు నుంచి ఆరు వేల క్యూబిక్‌ మీటర్లు వేస్తామని అన్నారు. ఇందుకు ఏడు బ్లాచింగ్‌ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు.

Link to comment
Share on other sites

పోలవరంలో వేగంగా కాంక్రీట్‌ పనులు
అక్టోబర్‌లో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తి

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌ పనులకు సంబంధించి అక్టోబరులో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసినట్లు నవయుగ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి తెలిపారు. స్పిల్‌వేలో రోజుకు 3,500 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ఛానల్‌లో 3,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేస్తున్నట్లు బుధవారం ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. కంపెనీ ఎండీ వి.శ్రీధర్‌ వారంలో మూడు రోజులు ప్రాజెక్టు వద్ద మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. స్పిల్‌ఛానల్‌లో మట్టి తవ్వకం వేగం పెరిగితే కాంక్రీట్‌ రోజుకు ఐదు నుంచి ఆరు వేల క్యూబిక్‌ మీటర్లు వేస్తామని అన్నారు. ఇందుకు ఏడు బ్లాచింగ్‌ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు

Link to comment
Share on other sites

రేపు పోలవరంపై కీలక భేటీ
కేంద్ర అధికారులతో దిల్లీలో సమావేశం కానున్న రాష్ట్ర బృందం

ఈనాడు, అమరావతి: పోలవరానికి సంబంధించి రూ.57,900 కోట్ల అంచనా వ్యయంతో సమర్పించిన రెండో సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌), ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అంశాలపై దిల్లీలో శుక్రవారం కీలక భేటీ జరగనుంది. కేంద్రం నిధుల కోసం రాష్ట్రం ఆశగా ఎదురుచూస్తోంది. 2017 ఆగస్టు నుంచి రెండో డీపీఆర్‌ ఆమోద ప్రక్రియపై బంతి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య తిరుగుతున్న నేపథ్యంలో, తాజా సమావేశంలో తదుపరి కార్యాచరణ వెలువడే అవకాశాలున్నాయని జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సింగ్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీరు తదితరులు హాజరవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్‌ గుప్తా, ముఖ్య కార్యనిర్వహణాధికారితో పాటు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ మసూద్‌, అక్కడి చీఫ్‌ ఇంజినీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండా రాష్ట్ర అధికారులకు అందింది. పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.3,120 కోట్ల నిధులు ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. తొలి డీపీఆర్‌ ప్రకారం రూ.390 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి అందాల్సి ఉంది. ఆ పై నిధులు రావాలంటే రెండో డీపీఆర్‌ ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో రెండో డీపీఆర్‌ ఆమోదంపైనే ఏపీ అధికారులు దృష్టి సారిస్తున్నారు.

Link to comment
Share on other sites

పోలవరం ‘లెక్క’ తేలుతుందా?
పాత పని పరిమాణాలు, కొత్త ధరలతో లెక్కించమన్న కేంద్రం
ఆ లెక్క రూ.31,000  కోట్లుగా తేల్చిన రాష్ట్రం
డీపీఆర్‌ 2 ప్రకారం రూ.57,940 కోట్లు
నేడు దిల్లీలో చర్చలు
ఈనాడు - అమరావతి
1ap-main11a.jpg

పోలవరం ప్రాజెక్టులో రూ.57,940 కోట్ల అంచనాతో సమర్పించిన సవరించిన అంచనాల(డీపీఆర్‌ 2)తో పాటు కేంద్రం కోరిన కొత్త లెక్కలపైనా శుక్రవారం దిల్లీ వేదికగా అధికారిక చర్చలు జరగబోతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే ఆమోదించిన పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లో రూపొందించిన అంచనాల ప్రాతిపదికన, 2014 నాటి ధరలతో లెక్కిస్తే ఎంతవుతుందో తేల్చి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కోరిన మేరకు అధికారులు ఆ కసరత్తు నిర్వహించారు. ఆ మేరకు తేలిన లెక్క రూ.31,000 కోట్లుగా నిర్ధరించారు. ఇది ఎలా వచ్చిందో కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే....

* 2010-11 డీపీఆర్‌ ప్రకారం 44,574 మంది నిర్వాసిత కుటుంబాలను మాత్రమే తరలించాల్సిఉంది. అదే కొత్త డీపీఆర్‌ ప్రకారం ఈ అంకె 1,01,532 కుటుంబాలకు పెరిగింది. 2013 భూసేకరణ చట్టం, 1.4.2014 నాటి ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలను కలిపి పాత నిర్వాసిత కుటుంబాలకు ఎంత ఖర్చవుతుందో ఆ మేరకు లెక్కించారు.
* పునరావాసం నిమిత్తం పాత డీపీఆర్‌ ప్రకారం 57,461 ఎకరాల భూమి సరిపోతుంది. కొత్త డీపీఆర్‌ ప్రకారం 1.09 లక్షల ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం, కొత్త ధరలను పరిగణనలోకి తీసుకుంటూ మొదటి డీపీఆర్‌ ప్రకారం ఎంత భూమి అవసరమో ఆ మేరకే లెక్క కోరారు.
* పని పరిమాణాల్లో పాత, కొత్త డీపీఆర్‌ల మధ్య మార్పు ఉంది. ఒక్క ఎడమ కాలువను తీసుకుంటేనే మట్టి తవ్వకంలో 4 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నుంచి 10 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. పాత లెక్కలు, 2014 నాటి ధరలతో లెక్కించారు. సీసీ లైనింగు పనిలోనూ 8 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా ఉన్న పని పరిమాణం కొత్త డీపీఆర్‌లో 14.61 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పెరిగిపోయింది. ఇలా ప్రధాన డ్యాంలోను పాత పని పరిమాణాలను పరిగణనలోకి తీసుకుని...లెక్కలు కట్టాలని కేంద్రం కోరింది.
* ఈ పాత పని, పునరావాస అంచనాలను కొత్త ధరలతో లెక్కిస్తే సుమారు రూ.31,000 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు.

రెండు అంశాలపైనా చర్చ
పోలవరంపై దిల్లీలో అధికారుల స్థాయిలో శుక్రవారం జరిగే కీలక భేటీలో రెండు అంశాలు చర్చకు రానున్నాయి. రెండో డీపీఆర్‌ తాజా పరిస్థితి (రూ.57,940 కోట్ల విలువ)తో పాటు కేంద్రం కోరిన తాజా లెక్కలు (రూ.31,000 కోట్లు)...ఈ రెండే అజెండా అంశాలుగా ఉన్నాయి. రెండో డీపీఆర్‌కు సంబంధించి రాష్ట్రం సమగ్ర సమాచారమూ అందించింది. ఆ స్థాయిలో అంచనాలు ఎందుకు పెరిగాయో వివరించింది. ఈ నేపథ్యంలో రెండో డీపీఆర్‌పై కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ ఏం చెబుతాయనేది శుక్రవారమే తేలుతుంది. అదే సమయంలో కొత్త లెక్కలు ఎందుకు కేంద్రం అడిగిందో కూడా ఈ సమావేశంలో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రెండో డీపీఆర్‌ను ఆమోదించాలని గట్టిగా కోరుతోంది.


‘జెట్‌ గ్రౌటింగు’ ధరలపై తకరారు

పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల కట్‌ ఆఫ్‌ పనులుగా చేపట్టిన జెట్‌ గ్రౌటింగు పనుల విలువను తాము ఎలా లెక్కించగలమని, ఇలాంటి పని ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడా జరగనందున తాము ఎలా నిర్ణయించగలమని బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్ల సమావేశం ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టులో షీట్‌ పైలింగు బదులు జెట్‌ గ్రౌటింగు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ ఆధ్వర్యంలోని కెల్లర్‌ సంస్థ ఈ పనులు చేపట్టింది. షీట్‌ పైలింగు పనికి ఐబీఎం అంచనా ప్రకారం రూ.122.54 కోట్లు. టెండరు డిస్కౌంట్‌ పోను రూ.105.31 కోట్లు. ప్రస్తుతం జెట్‌ గ్రౌటింగు పద్ధతిలో పనులు చేపట్టినందున ఇందుకు రూ.239.44 కోట్లు ఖర్చయినట్లు సంబంధిత గుత్తేదారు సంస్థ లెక్కించి సమర్పించింది. పోలవరం అధికారులు మాత్రం రూ.145.78 కోట్లుగా లెక్కించారు. అందులో టెండర్‌ డిస్కౌంట్‌ పోను రూ.125.29 కోట్లుగా ప్రతిపాదించారు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అందుబాటులో లేకపోవడంతో పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్‌సీ, జలవనరులశాఖ ఇన్‌ఛార్జి ఈఎన్‌సీ శ్రీనివాస్‌లు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పనులకు ముందుగానే అనుమతి తీసుకోవాలి కదా, పని పూర్తయిన తర్వాత ఆమోదం తెలపమనడం ఏమిటని సభ్యులు ప్రశ్నించారు. పని పూర్తయిన తర్వాతే ఆ డేటా ప్రకారం ధరలు లెక్కించడం సులవవుతుందని సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్లు తమ పరిధిలో లేదనడంతో..సమర్పించిన వివరాలను ఎవరైనా నిపుణులతో పరిశీలింపజేసి ఒక అభిప్రాయానికి రావాలని జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు శ్రీనివాస్‌ కోరారు. జీఎస్టీకి సంబంధించి పాత ప్రతిపాదనలనే మరోసారి సిఫార్సు చేయాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

పోలవరం తుది అంచనాలపై..చర్చిద్దాం రండి
02-11-2018 03:55:24
 
  • రాష్ట్ర అధికారులకు కేంద్రం పిలుపు
  • నేడు ఢిల్లీకి శశిభూషణ్‌ బృందం
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలపై కేంద్ర జల వనరుల సంఘం మరో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా ఎన్నో భేటీలు, చర్చలు, సమీక్షలు జరిగాయి. ఇంతవరకూ సవరించిన అంచనాలు ఖరారు కాలేదు. తాజాగా శుక్రవారం చర్చించేందుకు రావాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు వర్తమానం పంపింది. రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఢిల్లీ వెళ్తోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. 2013-14 ధరల ప్రకారం సవరించగా.. భూసేకరణ, సహాయ పునరావాసాలతో కలుపుకొని రూ.57,980.06 కోట్లకు చేరింది. ఇందులో 2013 భూసేకరణ చట్టం కింద ముంపు ప్రాంతాల భూముల సేకరణ, పునరావాసాలకే రూ.30,000 కోట్లను చెల్లించాల్సి వస్తోంది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ అంచనాల పెంపుపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయని కేంద్ర జల వనరుల సంఘం.. భూసేకరణ, పునరావాసం ఖర్చుపై మాత్రం కొర్రీలు వేస్తోంది. 2017 ఆగస్టు నుంచీ పంచాయితీ నడుస్తూనే ఉంది. భూసేకరణకు సంబంధించి 2013కు ముందు చెల్లించిన పరిహారం.. 2013 భూ సేకరణ చట్టం వచ్చాక చెల్లించాల్సిన మొత్తం, లబ్ధిదారుల జాబితా, వారికి అందించిన అవార్డులు, భూముల సర్వే నంబర్లతో సహా ఇవ్వాలంటూ జల సంఘం మెలిక పెట్టింది.
 
ఈ వివరాలను అనేక సార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అందజేసింది. చివరిగా జలసంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో సమాచారాన్ని క్రోడీకరించి పంపింది. ఈ సమాచారం బరువు మూడున్నర టన్నులు ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లోపు దీనిపై తేల్చే ఉద్దేశం కేంద్రానికి లేదని, ప్రాజెక్టుకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్రప్రభుత్వానికి అర్థమైంది. ఈ తరుణంలో తుది అంచనాలపై చర్చిద్దాం రమ్మని శశిభూషణ్‌ను కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌ ఆహ్వానించారు. శుక్రవారం శశిభూషణ్‌ ఇతర అధికారులు ఢిల్లీ వెళ్తున్నారు. త్వరితగతిన అంచనాలు ఆమోదించి సాంకేతిక సలహా మండలికి పంపాల్సిందిగా సింగ్‌ను కోరనున్నారు.
Link to comment
Share on other sites

29 minutes ago, sonykongara said:

ఈ వివరాలను అనేక సార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అందజేసింది. చివరిగా జలసంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో సమాచారాన్ని క్రోడీకరించి పంపింది. ఈ సమాచారం బరువు మూడున్నర టన్నులు ఉంది.

eenadu pulihora tappithe akkada emi avvadu. eesari icchina report lo font chinnadi ga vundi peddadi chesi malli pampandi antaru. paisa kuda ivvaru.

Link to comment
Share on other sites

13 minutes ago, KaNTRhi said:

Enti edo road mottham cracks vachiniyyi anta??? Any issue for Polavaram project in future ??

no, it is nothing like that.

AndhraJyothy article:

అసలేం జరిగిందంటే...
పోలవరం మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారి చాలా ఏళ్లుగా ఉంది. చిన్నగా ఉన్న రోడ్డును ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా వెడల్పు చేశారు. ప్రాజెక్టులో తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఈ రహదారిని ఆనుకునే, కొంచెం దిగువన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ మట్టితో మరో రహదారి నిర్మించింది. ఈ మట్టి రోడ్డుపై దాదాపు నిమిషానికొకటి వంద టన్నుల లోడ్‌తో ట్రక్కులు తిరుగుతున్నాయి. అతి భారీ యంత్రాలు తిరగడంతో మట్టి రోడ్డు ఒత్తిడికి గురై మెల్లమెల్లగా కుంగుతూ వచ్చింది. దీని ప్రభావం పక్కనే ఉన్న తారు రోడ్డుపై పడింది. లోలోపలే ఒత్తిడి పెరిగింది. అది తట్టుకోలేనంతగా పెరిగి శనివారం ఉదయం ువిస్ఫోటం్‌లా మారింది. మెల్లమెల్లగా ఉబుకుతూ రోడ్డు ముక్కలు ముక్కలుగా మారింది. ఇది భూకంపం కాదని, మట్టి రోడ్డుపై పడిన భారీ ఒత్తిడి వల్ల... పక్కనే ఉన్న తారు రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని ఇంజనీర్లు తెలిపారు.
భూకంపం కాదు : ప్రాజెక్టు సీఈ శ్రీధర్‌
పోలవరంలో వచ్చింది భూకంపం కాదు. భారీ యంత్రాలు తిరగడం వల్లనే అలా జరిగింది. దీనికీ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధం లేదు. ప్రాజెక్టులో కాంక్రీటు పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. నవయుగ కంపెనీ పెద్ద ఎత్తున భారీ యంత్రాలతో మరో డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేస్తోంది. 24 గంటల్లోనే రాకపోకలను పునరుద్ధరిస్తాం.

 

Link to comment
Share on other sites

41.15 మీటర్ల ఎత్తుకు సై 

 

కాఫర్‌ డ్యాంపై కేంద్ర జలసంఘం నిర్ణయం 
పూర్తి ఎత్తు 42.5 మీటర్లు  స్పిల్‌ వేలో అంత ఎత్తు వరకు ఆమోదం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకునేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. ఈ మేరకు పోలవరం అధికారులకు వర్తమానం అందింది. ఆకృతుల్లో కొన్ని మార్పులు సూచించింది. కాఫర్‌ డ్యాం దిగువన వెడల్పు తగ్గిస్తూ వాలు విషయంలో మార్పులు సూచించారని సమాచారం. దీనివల్ల ఆర్థికంగాను కొంత ఆదా అవుతుంది. ఒకట్రెండు రోజుల్లో ఆ సమాచారం అందాక ఆకృతుల్లో మార్పులు చేసి ఆమోదం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా నిబంధనలు సూచిస్తూ తదనుగుణంగా అనుమతులు ఇచ్చారా లేక పూర్తి స్థాయిలో అవి లభించాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రీ బోర్డు అన్నీ కలిపి మొత్తం ఎత్తు 42.5మీటర్లు ఉంటుంది. ఈ పూర్తి స్థాయి ఎత్తుకూ ఆమోదం లభించినట్లే. ప్రాజెక్టులో ప్రస్తుత నిర్మాణ కాలం చాలా కీలకమయింది. ఇప్పటికే కాఫర్‌ డ్యాం నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులు కూడా ప్రధాన గుత్తేదారు నుంచి నవయుగకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దస్త్రం రాష్ట్ర స్థాయి స్టాండింగు కమిటీలో ఆమోదం పొంది ప్రభుత్వానికి చేరింది. మరోవైపు గేట్ల నిర్మాణ పనులు ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి బెకం సంస్థకు అప్పగించే ఏర్పాట్లు సాగుతున్నాయి. వీటికి అనుమతులు లభిస్తే పనులు చేపడతారు. కాఫర్‌ డ్యాం పరంగా వీలైనంతలో నవంబరు 15 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

స్పిల్‌ వేలో 42.5 మీటర్ల ఎత్తుకు 
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే నిర్మాణానికి 42.5 మీటర్ల ఎత్తు వరకు అవసరమైన ఆకృతులకు ఆమోదం లభించింది. స్పిల్‌ వే మొత్తం 54 మీటర్ల వరకు ఉండగా.. దశలవారీగా కేంద్ర జలసంఘం అనుమతులిచ్చింది. తాజాగా 42.5 మీటర్ల వరకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో గేట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేస్తున్నారు. డిసెంబర్‌లోనే ప్రక్రియ ప్రారంభించాలని తలపోస్తున్నారు. స్పిల్‌ వేలో కాంక్రీటు పనుల వేగం పెంచారు. అక్టోబరులో 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు పని జరిగింది. నవంబరులో 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించారు.

 

Link to comment
Share on other sites

2 hours ago, swarnandhra said:

no, it is nothing like that.

AndhraJyothy article:

అసలేం జరిగిందంటే...
పోలవరం మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారి చాలా ఏళ్లుగా ఉంది. చిన్నగా ఉన్న రోడ్డును ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా వెడల్పు చేశారు. ప్రాజెక్టులో తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఈ రహదారిని ఆనుకునే, కొంచెం దిగువన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ మట్టితో మరో రహదారి నిర్మించింది. ఈ మట్టి రోడ్డుపై దాదాపు నిమిషానికొకటి వంద టన్నుల లోడ్‌తో ట్రక్కులు తిరుగుతున్నాయి. అతి భారీ యంత్రాలు తిరగడంతో మట్టి రోడ్డు ఒత్తిడికి గురై మెల్లమెల్లగా కుంగుతూ వచ్చింది. దీని ప్రభావం పక్కనే ఉన్న తారు రోడ్డుపై పడింది. లోలోపలే ఒత్తిడి పెరిగింది. అది తట్టుకోలేనంతగా పెరిగి శనివారం ఉదయం ువిస్ఫోటం్‌లా మారింది. మెల్లమెల్లగా ఉబుకుతూ రోడ్డు ముక్కలు ముక్కలుగా మారింది. ఇది భూకంపం కాదని, మట్టి రోడ్డుపై పడిన భారీ ఒత్తిడి వల్ల... పక్కనే ఉన్న తారు రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని ఇంజనీర్లు తెలిపారు.
భూకంపం కాదు : ప్రాజెక్టు సీఈ శ్రీధర్‌
పోలవరంలో వచ్చింది భూకంపం కాదు. భారీ యంత్రాలు తిరగడం వల్లనే అలా జరిగింది. దీనికీ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధం లేదు. ప్రాజెక్టులో కాంక్రీటు పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. నవయుగ కంపెనీ పెద్ద ఎత్తున భారీ యంత్రాలతో మరో డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేస్తోంది. 24 గంటల్లోనే రాకపోకలను పునరుద్ధరిస్తాం.

 

Good to know... dinni pattukoni jana sannasis Twitter lo oogi pothunnaru..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...