Jump to content

polavaram


Recommended Posts

డిసెంబరు 17 నుంచి పోలవరం గేట్ల ఏర్పాటు
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  రికార్డు సమయంలో పనులు పూర్తి చేయాలని సూచన
  రహదారి ఉబికి, నెర్రెలివ్వటంపై మట్టి నమూనాలు పరీక్షించాలని ఆదేశం
5ap-main4a.jpg

ఈనాడు, అమరావతి, పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గేట్ల ఏర్పాటు ప్రక్రియ డిసెంబరు 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి తేదీ నిర్ణయించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై సోమవారం ముఖ్యమంత్రి  చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. 60-20 మీటర్ల కొలతతో గేట్ల అమరికకు సామగ్రి అంతా సిద్ధం చేశామని అధికారులు వివరించారు. ఏప్రిల్‌ నెలాఖరుకల్లా స్పిల్‌ ఛానల్‌, పైలట్‌ ఛానల్‌ ఇతర ముఖ్య పనులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

ఎందుకు ఉబికిందో చూడండి..
పోలవరం వద్ద రోడ్డు ఆ స్థాయిలో ఎందుకు ఉబికిందో పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మట్టి నమూనాలను పరీక్షలకు పంపించమని చెప్పారు. అక్కడ ఎలాంటి భూప్రకంపనలు లేవని, పేలుళ్ల వల్ల ఇది జరగలేదని అధికారులు సీఎంకు వివరించారు. ఆ రహదారి బీటలు వారిన దృశ్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని అధికారులు వెల్లడించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, పోలవరం పునరావాస కమిషనర్‌ రేఖారాణి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధాన రహదారి నెర్రెలు ఇవ్వడంతో నిలిచిన స్పిల్‌ఛానల్‌ మట్టి తవ్వకాల పనులను ముమ్మరం చేసినట్లు ప్రాజెక్టు సలహాదారు రమేష్‌బాబు పోలవరంలో వెల్లడించారు. పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఇకపై ప్రాజెక్టు వాహనాల రాకపోకలకు వీలుగా తయారుచేస్తామని చెప్పారు. మళ్లింపు దారిని ఏజెన్సీ గ్రామాల ప్రజలు, పర్యాటకుల కోసం వినియోగిస్తామన్నారు.

పోలవరంలో 48 గేట్ల ఏర్పాటుకు సంబంధించిన స్కిన్‌ ప్లేట్ల తయారీ పూర్తయింది. వాటిని స్పిల్‌ వే వద్దకు తీసుకువెళ్లి అమర్చాల్సి ఉంటుంది. ఇది కీలక ఘట్టం. గేట్ల ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. స్పిల్‌ వేలో   42.5 మీటర్ల వరకు ఆకృతులకు కేంద్ర జలసంఘం ఆమోదం ఇచ్చిన నేపథ్యంలో గేట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పోలవరంలో 60.33శాతం పనులు అయ్యాయని అధికారులు చెప్పారు. గత వారం రోజుల్లోనే 52వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు, 4.47 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేసినట్లు తెలిపారు. గోదావరి పెన్నా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వివరించారు. నవంబరు నెలాఖరుకల్లా అన్ని ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
పునరావాసంలో భాగంగా మొదటి దశ పనులు డిసెంబరుకల్లా కొలిక్కి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత వారంలో 12శాతం పనులు పూర్తిచేశామని అధికారులు వివరించారు. తూర్పుగోదావరిలో 17 కాలనీలకు సంబంధించి 46శాతం పనులు, పశ్చిమగోదావరిలో 26 కాలనీలకు సంబంధించి 42శాతం పనులు ఇంతవరకు పూర్తయ్యాయని చెప్పారు.
మార్చికి గేట్ల ఏర్పాటు పూర్తి
నవయుగ ఎండీ శ్రీధర్‌
పోలవరం ఓ మహా యజ్ఞమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు తమవంతు కృషిచేస్తున్నామని నవయుగ కంపెనీ ఎండీ కె.శ్రీధర్‌ పేర్కొన్నారు. డిసెంబరు 17న స్పిల్‌వేలో తొలిగేటు బిగింపును ప్రారంభించి, మార్చి నాటికి 48 గేట్లు ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు.  ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో శ్రీధర్‌ మాట్లాడారు. 15 నుంచి ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నామని, అందుకు 75 లక్షల క్యుబిక్‌ మీటర్ల మేర మూడు రకాల కంకర అవసరం అవుతుందన్నారు. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌, కటాఫ్‌ వాల్‌ నిర్మాణానికి 30 లక్షల క్యుబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయాల్సి ఉందన్నారు. వీటన్నింటి కోసం భారీ క్రషర్లు ఏర్పాటు చేశామన్నారు.
Link to comment
Share on other sites

ఏప్రిల్‌కల్లా పూర్తి కావలసిందే!
06-11-2018 02:42:15
 
636770689364525620.jpg
  • పోలవరం ప్రధాన పనులపై సీఎం ఆదేశం
  • జూన్‌నాటికి గ్రావిటీతో గోదావరి జలాలు
  • కాఫర్‌ డ్యాం, స్పిల్‌, అప్రోచ్‌ చానల్‌ లక్ష్యాల కంటే ముందే పూర్తి చేయండి
  • కాంక్రీటు పనుల్లో వేగం పెరగాలి
  • త్రీగార్జెస్‌ రికార్డును అధిగమించాలి
  • ప్రపంచ రికార్డులన్నీ తిరగరాయాలి
  • పోలవరం పనులపై బాబు వర్చువల్‌ రివ్యూ
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిసెంబరు 17న ప్రతిష్ఠాత్మక రేడియల్‌ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించారు. సోమవారం ఉండవల్లి ముఖ్యమంత్రి ప్రజా దర్బారు వేదికలో ప్రాజెక్టుపై వర్చువల్‌ సమీక్ష జరిగింది. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల్లో వేగాన్ని పెంచాలని.. త్రీగార్జె్‌సను అధిగమించి ప్రపంచ రికార్డులన్నింటినీ తిరగరాయాలని నిర్మాణ సంస్థ నవయుగను సీఎం ఆదేశించారు. ఈ రికార్డును తిరగరాసే దిశగా గతంలోనే యంత్రసామగ్రిని సిద్ధం చేసుకున్నామని.. 11.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు చేరువయ్యామని.. మరో గంటలో త్రీగార్జె్‌సను రికార్డును బద్దలు కొడతామనుకున్న తరుణంలో భారీ వర్షం కారణంగా పనులు ఆపేయాల్సి వచ్చిందని సంస్థ ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ వెల్లడించారు.
 
వచ్చే ఏడాది పోలవరం నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా అందించాలని నిర్ణయించినందున ప్రధాన పనులన్నీ లక్ష్యాల కంటే ముందస్తుగా చేపట్టాలని నిర్మాణ సంస్థలను, జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతివారం ఎంతెంత పనులు చేస్తున్నామో లెక్కిస్తూ.. బ్యాక్‌లాగ్‌ లేకుండా చూసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరుకల్లా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు పూర్తికావలసిందేనని స్పష్టం చేశారు. స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌ సహా ప్రధాన పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. చెప్పడం కాదని, ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేలా పనులు పూర్తి చేయాలని మరోసారి సీఎం అన్నారు.
 
రోడ్డు కుంగిన దృశ్యాల పరిశీలన..
పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి ఉబికి, కుంగి, బీటలువారిన దృశ్యాలను సమీక్షలో చంద్రబాబు పరిశీలించారు. మట్టి నమూనాలను పరిశోధనాశాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని సీఎం సూచించారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ నెలాఖరుకల్లా మిగిలిన ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటికీ టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు.
 
పోలవరం నిర్మాణ పనుల పురోగతి ఇదీ..
  • స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌ 1115.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను 894 లక్షల క్యూబిక్‌ మీటర్ల దాకా (80.10%) పూర్తి.
  • స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌ కాంక్రీటింగ్‌ 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్లకు 16.77 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకూ (36.79 శాతం) పూర్తి.
  • డయాఫ్రం వాల్‌ వందశాతం పూర్తి.
  • జెట్‌ గ్రౌటింగ్‌ (3,467 మీటర్లు) సమాప్తం.
  • కనెక్టివిటీ పనులు 59.28 శాతం పూర్తి. ఇందులో లెఫ్ట్‌ కనెక్టివిటీ 47.88 శాతం, రైట్‌ కనెక్టివిటీ 72.12 శాతం పూర్తి.
  • కుడి ప్రధాన కాలువ (177.9 కి.మీ.) 100 శాతం పూర్తి. ఈ కాలువ లైనింగ్‌ 176.20 కి.మీ.కు గాను 157.563 కి.మీ. పూర్తి.
  • ఎడమ ప్రధాన కాలువ 210.927 కి.మీ.కు గాను 179.946 కి.మీ. మేర మట్టి తవ్వకం పనులు (85.31 శాతం) పూర్తి. లైనింగ్‌ పనులు 210.727 కి.మీ.కు 124.595 కి.మీ. (59%) పూర్తి. 452 స్ట్రక్చర్లకు గాను 146 పూర్తి. మిగతా వాటి నిర్మాణం కొనసాగుతోంది.
 
పూర్తిచేయాల్సిన లక్ష్యాలు..
  • 902 హిల్‌: డిసెంబరు 31
  • స్పిల్‌ చానల్‌ మిగిలిన పనులు: డిసెంబరు 31
  • పైలట్‌ ఛానల్‌: డిసెంబరు
  • అప్రోచ్‌ చానల్‌: వచ్చే మార్చి 31
Link to comment
Share on other sites

డీపీఆర్‌-2పై వడివడిగా
నవంబరు ఆఖరు లేదా డిసెంబరు ప్రారంభంలో టీఏసీ భేటీ
  జనవరిలో ఏర్పాటు చేద్దామన్న కేంద్ర జలసంఘం
  విభేదించిన కేంద్ర జలవనరుల కార్యదర్శి
5ap-main19a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో రూ.57,900 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్న డీపీఆర్‌-2 ఆమోదానికి  ప్రయత్నాలు ఊపందుకున్నాయి.. ఇందుకు ఎంతో కీలకమైన సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) భేటీ నవంబరు నెలాఖరున లేదా డిసెంబరు ప్రారంభంలోనే ఏర్పాటుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు(ప్రాజెక్టులు) దాస్‌ కార్యదర్శిగా మరో నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఈ కమిటీ ఉంటుంది. దాని ముంగిట జలసంఘం చీఫ్‌ ఇంజినీరు డీపీఆర్‌ను ప్రవేశపెట్టి, అది లేవనెత్తే అన్ని అభ్యంతరాలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ దానికి పచ్చజెండా ఊపితే అనంతరం కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఆమోదించి ఆర్థికశాఖకు పంపుతారు.

పోలవరం డీపీఆర్‌పై నవంబరు 2న దిల్లీలో జరిగిన భేటీలో టీఏసీ సమావేశం ఏర్పాటు ఎప్పుడనే విషయంపైనా ప్రాథమికంగా కొంత చర్చ జరిగినట్లు తెలిసింది. జనవరిలో ఏర్పాటు చేద్దామన్న ప్రతిపాదన కేంద్ర జలసంఘం నుంచి రాగా కేంద్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించారు. జనవరిలో సమావేశం ఏర్పాటు చేస్తే మినిట్స్‌ ఎప్పుడు ఆమోదం పొందాలి, ఆర్థికశాఖకు ఎప్పుడు పంపాలి.. అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈలోపు ఫిబ్రవరి నెలాఖరు అవుతుందని, ఆర్థిక సంవత్సరమూ పూర్తవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. నవంబరు 12 నుంచి వరుసగా కూర్చుని డీపీఆర్‌-2పై అభ్యంతరాలన్నీ కొలిక్కి తెచ్చి టీఏసీ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలవనరులశాఖ అధికారులు నిర్దేశించారు. రెండు వారాల వ్యవధిలోనే అది ఏర్పాటుచేసే వెసులుబాటు ఉందని, అవసరాలను బట్టి టీఏసీ సమావేశాలు పెడుతున్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. కేంద్ర ఉన్నతాధికారి డీపీఆర్‌-2 తాజా పరిస్థితిపై కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ను ప్రశ్నించగా సరిగా సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్టోబరు 8న ఏపీ అభ్యంతరాలపై సమగ్ర సమాచారం ఇస్తే 20 రోజులుగా ఏం చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.

నిర్వాసిత కుటుంబాల సంఖ్యపై కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు ఓ ప్రశ్న లేవనెత్తారు. పాత నివేదికకు, కొత్త నివేదికకు మధ్య 400 కుటుంబాల వరకూ తేడా వస్తోందని ప్రస్తావించారు. రాష్ట్ర అధికారులు స్పందిస్తూ 41.15 మీటర్ల ఎగువన పునరావాసానికి సంబంధించి ఇంకా ఎలాంటి డ్రాఫ్టు నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో ఆర్థిక, సామాజిక సర్వే పూర్తిచేయలేదని బదులిచ్చారు. అది పూర్తికాకుండా సమగ్ర గణాంకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మీరు నిధులిస్తేనే కదా ఈ ప్రక్రియంతా చేపట్టేది అని సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్‌ గుప్తా సైతం కేంద్ర జలసంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చర్చిద్దామని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అధికారులను పిలిపించాం. దీనిపై మనం వారికి ఏం సమాధానం చెబుతామని కూడా కేంద్ర అధికారులు కేంద్ర జలసంఘాన్ని ప్రశ్నించారు.

మా ముఖ్యమంత్రి రావద్దన్నారు
పోలవరం సవరించిన అంచనాలపై ఏదొకటి తేలే వరకు దిల్లీ నుంచి రావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆదేశించారని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కేంద్ర అధికారులకు తెలియజేశారు. నవంబరు 12 నుంచి కూర్చుని ఈ అంశాన్ని కొలిక్కి తెద్దామని కేంద్ర అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబరు 12న పోలవరం అధికారులు, 13న మళ్లీ రాష్ట్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ దిల్లీ వెళ్లనున్నారు.

Link to comment
Share on other sites

పోలవరంతో పరాచికాలు
09-11-2018 02:29:21
 
636773273627495733.jpg
  • వింత, కొత్త కొర్రీలతో కేంద్రం కిరికిరి
  • 2007 నుంచి ప్రైవేటు ఆడిట్‌కు ఆదేశం
  • నిబంధనలు అంగీకరించకున్నా హుకుం
  • సవరించిన అంచనాల ఆమోదంపై దొంగాట
  • ఇవ్వాల్సింది ఇప్పటికే ఇచ్చామనే సంకేతాలు
  • ఈనెల 12న మరోమారు ఢిల్లీలో భేటీ
నిద్రపోయే వాళ్లను లేపొచ్చు! కానీ... నిద్ర నటించే వాళ్లను లేపేదెలా? జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సవరించిన అంచనాల ఆమోదం విషయంలో... కేంద్రం అచ్చంగా ఇదే తీరు ప్రదర్శిస్తోంది. నిధులు ఇవ్వదు! అలాగని... ఇచ్చేది లేదని సూటిగానూ చెప్పదు! కొర్రీల మీద కొర్రీలు వేస్తూ... ప్రశ్నలు సంధిస్తూ... నివేదికలపై లెక్కకు మిక్కిలి సందేహాలు వ్యక్తం చేస్తూ కాలం గడపడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఒకవైపు సవరించిన అంచనాలను, డిజైన్లను త్వరలోనే ఆమోదిస్తామనే ఆశావహ సంకేతాలు పంపిస్తూనే... మరోవైపు వరుస కొర్రీలతో కేంద్రం విసిగిస్తోందని
రాష్ట్ర జల వనరుల శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనాల సవరణలపై చర్చించుకుందాం రమ్మంటూ రాష్ట్ర జల వనరుల శాఖను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. సరేనంటూ ఈనెల 2న అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ‘అదేమిటి... తుది అంచనాల సవరణను ఇప్పటిదాకా ఆమోదించలేదా? ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు? వెంటనే నిర్ణయం తీసుకోండి!’ అంటూ కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మండిపడింది. ఇదేదో కొత్త విషయమైనట్లుగా, అప్పటిదాకా తమ దృష్టికే రానట్లుగా వింత పోకడలకు పోయింది. ఆ తర్వాతైనా ఫలితం లభించిందా అంటే అదీ లేదు. కాలాతీతంతో కూడిన, సంబంధంలేని కొర్రీని వేసి, వాటికి సమాధానాలు పంపించాలంటూ లేఖ పంపించారు. ఇక్కడ అసలు విషయమేమిటంటే... పోలవరంపై ఎలాంటి కొర్రీలు వేయాలో సూచించేది కూడా కేంద్ర జలవనరుల శాఖే!
 
సంబంధంలేని ‘తవ్వకాలు!’
‘2007లో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి 2014 మార్చి 31 వరకు పోలవరంపై ఆడిటర్‌ జనరల్‌ చేసిన సమగ్ర ఆడిట్‌ నివేదికలను సమర్పించండి’... ఈ నెల 2న జరిగిన భేటీలో కేంద్రం జారీ చేసిన ఆదేశమిది! దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు విస్తుపోయారు. పోలవరం అంచనాలు భారీగా పెరగడానికి కారణం... 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి రావడమే! 2013-14 పోలవరం అంచనాల సవరణకూ.. అంతకుముందు ఆరేడేళ్ల ఆడిటర్‌ జనరల్‌ నివేదికలకు సంబంధం ఏమిటని జల వనరులశాఖ ప్రశ్నించగా... ‘మేం కోరాం! మీరివ్వండి’ అని కేంద్ర జల వనరుల శాఖ ఆదేశించింది. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలకు సంబంధించి ఆడిటర్‌ జనరల్‌ ఇచ్చే వార్షిక నివేదికలను ఏటా క్రమం తప్పకుండా కేంద్రానికి పంపిస్తూనే ఉన్నారు.
 
 
అడుగుతూనే అసహనం
పోలవరం ప్రాజెక్టు 2013-14 సవరణ అంచనాల సమాచారాన్ని 61 వేల పేజీల్లో ఇవ్వడం అవసరమా అని కేంద్ర జల వనరుల శాఖ ప్రశ్నించింది. ‘మీరు అడిగిన ప్రొఫార్మాలోనే ఇచ్చాం. అదనంగా ఒక్క పదం కూడా చేర్చలేదు’ అని రాష్ట్రం తెలిపింది. 2013-14 సవరణ అంచనాలపై కేంద్ర జల సంఘంతో చర్చించేందుకు ఈ నెల 12న రాష్ట్ర జల వనరుల శాఖ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. ఈనెల 13న కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర జల సంఘం అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ సమావేశ మవుతారు.
 
 
అనుమాన బీజాలు నాటేలా
పోలవరం అంచనా వ్యయం పెంపు వెనుక అక్రమాలు ఉన్నాయంటూ కేంద్రం సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలూ ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ‘భూసేకరణ వ్యయం పెరగడంపై మా పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు’ అంటూ ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమీక్షలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించడం విశేషం! ఈ ఆరోపణలను నిరూపించడంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ విఫలమయ్యాయి. ఐనా .. తుది అంచనాల విషయంలో కేంద్ర జల వనరుల శాఖ గిల్లి జోకొట్టేలా వ్యవహరిస్తూనే వస్తోంది.
 
 
ఇంకేమీ ఇచ్చేది లేదట...
పోలవరం ప్రాజెక్టు 2010-11 అంచనా మేరకు రూ.16,010.45 కోట్లు దాదాపు ఇచ్చేశామని.. తుది అంచనాలు ఆమోదం పొందితే తప్ప కొత్తగా నిధులు మంజూరు చేయలేమని కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ నెల 2న జరిగిన భేటీలో దీనిపై లిఖిత పూర్వక స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం నిధుల లెక్కే కాదు. దీంతో ఇతర అంశాలూ ముడిపడి ఉన్నాయి. తుది అంచనాలు ఆమోదం పొందకుంటే పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు కూడా రావు. సాంకేతిక సలహా కమిటీ పరిశీలనకు ఈ అంచనా మొత్తం చేరదు. అక్కడకు వెళితే తప్ప కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదమూ తెలపదు.
 
 
ప్రైవేటుతో చేయించాలని...
సాధారణంగా ప్రాజెక్టు వ్యయాలపై ఆడిట్‌ జనరల్‌ ‘ర్యాండమ్‌ ఆడిట్‌’ మాత్రమే చేస్తారు. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి ఏపీ జల వనరులశాఖ స్పష్టం చేసింది. కేంద్రం కూ డా అంగీకరిస్తూనే... ప్రైవేటు సంస్థలతో సమగ్ర ఆడిట్‌ చేయించాలని సలహా ఇచ్చింది. ఇందుకు నిబంధనలు అంగీకరించబోవని రాష్ట్ర జల వనరుల శాఖ తెలిపింది. ఈలోపు తుది అంచనాలను ఆమోదించాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని కేంద్ర జలవనరుల శాఖ పట్టించుకోలేదు. ‘ఆడిట్‌ నివేదిక ఇస్తేనే తుది అంచనాల సంగతి పరిశీలిస్తాం’ అంటూ మొండికేస్తోంది.
 
అన్నీ తెలిసినా అంతే...
2010-11 అంచనా ప్రకారం పోలవరం వ్యయం రూ.16,010.45 కోట్లు. 2013-14 సవరణ అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.57,940.86 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం... యూపీఏ సర్కారు పోతూ పోతూ చేసిన కొత్త భూసేకరణ చట్టమే! దీని ఫలితంగా భూసేకరణ వ్యయం రూ.2934.42 కోట్ల నుంచి 33225.74 కోట్లకు ఎగబాకింది. అయినప్పటికీ... సవరించిన అంచనాలపై కొర్రీలు నిత్యకృత్యంగా మారాయి.
 
గేట్లు బిగించేది ‘బెకామ్‌’! రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం
పోలవరం గేట్ల తయారీ, బిగింపు బాధ్యతను బెకామ్‌ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రేడియల్‌ గేట్ల తయారీలో అనుభవం కలిగిన బెకామ్‌.. పోలవరంలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ వద్ద సబ్‌కాంట్రాక్టు సంస్థగా పనిచేస్తోంది. ఇప్పుడు జలవనరుల శాఖ దీనికే నేరుగా బాధ్యతలు అప్పగించింది. ఉభయుల మధ్య గతంలో కుదిరిన పాత ఒప్పందం ధరకే బెకామ్‌ ఈ గేట్లను తయారు చేసి బిగిస్తుంది. ఈ బాధ్యత నుంచి 60సీ నోటీసు ద్వారా ప్రభుత్వం ట్రాన్‌స్ట్రాయ్‌ను తప్పించింది. డిసెంబరు 17న రేడియల్‌ గేట్ల బిగింపు పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రాన్‌స్ట్రాయ్‌ ఆధ్వర్యంలో 48 గేట్ల తయారీ పనులను చేస్తున్న బెకామ్‌.. జలవనరుల శాఖ నిర్ణయంతో మరింత వేగం పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా ఆర్థిక భారం పడడం లేదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

పర్యాటక ‘వరం’
13-11-2018 03:29:26
 
  • పర్యాటక కేంద్రంగా పోలవరం
  • రూ.5 వేల కోట్లతో పర్యాటకాభివృద్ధి
  • 7 స్టార్‌ హోటల్‌, ఫిల్మ్‌సిటీ నిర్మాణం
  • ఏడేళ్లలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక
  • పర్యాటక శాఖ మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ జాతీయ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌, దాని చుట్టు పక్కల గ్రామాలను ‘హరిత పర్యాటక’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బాధ్యత మొత్తం పర్యాటక శాఖకు అప్పగించింది. ఇటీవల సీఎం చంద్రబాబు సూచనల మేరకు డ్రాఫ్ట్‌ ప్లాన్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. అనంతరం సీఎం దీనికి ఆమోదం తెలిపారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పోలవరం ప్రాంతాన్ని రూ.5000 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
5 నుంచి 7 ఏళ్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ డ్రాప్ట్‌ ప్లాన్‌కు అధికారులు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. పోలవరం ప్రాంతంలో వాటర్‌ ఫ్రంట్‌తో పాటు 7 స్టార్‌, 5 స్టార్‌ హోటళ్లు, డ్యామ్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కన్వెన్షన్‌ సెంటర్‌, గోల్ఫ్‌ క్లబ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, ఫిల్మ్‌సిటీని కూడా నిర్మించనున్నారు. రవాణా సౌలభ్య కోసం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని వాటర్‌ ట్రాన్స్‌పోర్టుతో అనుసంధానం చేస్తున్నారు. దీని కోసం 25 ప్రత్యేక ఎలక్ర్టానిక్‌ బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పోలవరం పర్యాటక ప్రాజెక్టు ద్వారా 13 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
 
హెరిటేజ్‌, ఆధ్యాత్మిక టూరిజం
కొత్త నిర్మాణాలతో పాటు పోలవరం చుట్టు పక్కల ఉన్న పురావస్తు ప్రాంతాలు, దేవాలయాలను కూడా ప్రభుత్వం టూరిజం కిందకు తీసుకుంది. భద్రాచలం ప్రారంభం నుంచి రాజమండ్రి వరకూ నదీ తీరాన ఉన్న దేవాలయాలను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. పోలవరం సమీపంలోని కేదారేశ్వర దేవాలయం, వెంకటేశ్వరస్వామి దేవాలయం, బుట్టాయగూడెంలోని శివాలయం, శ్రీరామగిరి దేవాలయాను కూడా పర్యాటక శాఖ తీసుకుంది. గుణదల, రాయనిపేట, చొక్కనపల్లి, రుద్రంకోట వంటి పురావస్తు ప్రాంతాలనూ అభివృద్ధి చేయనున్నారు.
 
2sf2sdfws.jpg
Link to comment
Share on other sites

పర్యాటక ‘వరం’
13-11-2018 03:29:26
 
  • పర్యాటక కేంద్రంగా పోలవరం
  • రూ.5 వేల కోట్లతో పర్యాటకాభివృద్ధి
  • 7 స్టార్‌ హోటల్‌, ఫిల్మ్‌సిటీ నిర్మాణం
  • ఏడేళ్లలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక
  • పర్యాటక శాఖ మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ జాతీయ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌, దాని చుట్టు పక్కల గ్రామాలను ‘హరిత పర్యాటక’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బాధ్యత మొత్తం పర్యాటక శాఖకు అప్పగించింది. ఇటీవల సీఎం చంద్రబాబు సూచనల మేరకు డ్రాఫ్ట్‌ ప్లాన్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. అనంతరం సీఎం దీనికి ఆమోదం తెలిపారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పోలవరం ప్రాంతాన్ని రూ.5000 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
5 నుంచి 7 ఏళ్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ డ్రాప్ట్‌ ప్లాన్‌కు అధికారులు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. పోలవరం ప్రాంతంలో వాటర్‌ ఫ్రంట్‌తో పాటు 7 స్టార్‌, 5 స్టార్‌ హోటళ్లు, డ్యామ్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కన్వెన్షన్‌ సెంటర్‌, గోల్ఫ్‌ క్లబ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, ఫిల్మ్‌సిటీని కూడా నిర్మించనున్నారు. రవాణా సౌలభ్య కోసం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని వాటర్‌ ట్రాన్స్‌పోర్టుతో అనుసంధానం చేస్తున్నారు. దీని కోసం 25 ప్రత్యేక ఎలక్ర్టానిక్‌ బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పోలవరం పర్యాటక ప్రాజెక్టు ద్వారా 13 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
 
హెరిటేజ్‌, ఆధ్యాత్మిక టూరిజం
కొత్త నిర్మాణాలతో పాటు పోలవరం చుట్టు పక్కల ఉన్న పురావస్తు ప్రాంతాలు, దేవాలయాలను కూడా ప్రభుత్వం టూరిజం కిందకు తీసుకుంది. భద్రాచలం ప్రారంభం నుంచి రాజమండ్రి వరకూ నదీ తీరాన ఉన్న దేవాలయాలను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. పోలవరం సమీపంలోని కేదారేశ్వర దేవాలయం, వెంకటేశ్వరస్వామి దేవాలయం, బుట్టాయగూడెంలోని శివాలయం, శ్రీరామగిరి దేవాలయాను కూడా పర్యాటక శాఖ తీసుకుంది. గుణదల, రాయనిపేట, చొక్కనపల్లి, రుద్రంకోట వంటి పురావస్తు ప్రాంతాలనూ అభివృద్ధి చేయనున్నారు.
 
2sf2sdfws.jpg 
Link to comment
Share on other sites

త్వరగా తెమల్చండి ప్లీజ్‌
పోలవరంపై రూ.3500 కోట్లు అధికంగా ఖర్చు చేశాం
20లోపు సవరించిన అంచనాలను ఆమోదించండి
లేదంటే ప్రాజెక్టు ఆగిపోతుంది
కేంద్ర అధికారులకు ఏపీ మొర
లభించని స్పష్టమైన హామీ
13ap-main18a.jpg

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు అంచనాలకు తక్షణం ఆమోదముద్ర వేయాలని, జాప్యం చేస్తే నిర్మాణ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీకి మొరపెట్టుకున్నారు. సీడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే మూడు నాలుగుసార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను చూసిన తర్వాత కూడా జాప్యం చేయడం తగదన్నారు. ఈనెల 20 కల్లా సవరించిన అంచనాలను ఆమోదించి జలవనరులశాఖకు పంపాలని, అలా చేస్తే తాము వచ్చే జూన్‌కల్లా నీరు ఇచ్చి చూపుతామని స్పష్టం చేశారు. అయితే కేంద్ర అధికారుల నుంచి పూర్తి స్పష్టత రాలేదు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై మంగళవారం దిల్లీలో జరిగిన కీలక చర్చల్లో ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఓపీ సింగ్‌, కమిషనర్‌ ఓరా, సీడబ్ల్యూసీ సభ్యుడు హల్దార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ టీకేఎల్‌ దాస్‌లను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. తొలుత హల్దార్‌, దాస్‌లతో సమావేశమయ్యారు.

హల్దార్‌ కొంత సానుకూలంగా ఉన్నా...
పోలవరం ఇన్‌ఛార్జి సీఈవోగా పనిచేసిన సీడబ్ల్యూసీ సభ్యుడు హల్దార్‌కు ప్రాజెక్టు పురోగతిపై పూర్తిస్థాయి అవగాహన ఉండటంతో ఆయన సవరించిన అంచనాలపై చాలా వరకు సానుకూలత వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతోషం కూడా వ్యక్తంచేశారు. జనవరి 15కల్లా సవరించిన అంచనాలను పరిశీలించి కేంద్ర జలవనరులశాఖకు పంపుతామని హామీ ఇచ్చారు. దానివల్ల బాగా ఆలస్యమైపోతుందని ఈనెల 20కల్లా ఆమోదించాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు. హల్దార్‌ అంగీకరించినా, చీఫ్‌ ఇంజినీర్‌ దాస్‌ పూర్తిస్థాయి హామీ ఇవ్వలేదని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని మాత్రమే చెప్పారు. అందువల్ల ఈనెల 19న మరోసారి దిల్లీకి రావాలని శశిభూషణ్‌కుమార్‌, వెంకటేశ్వరరావులు నిర్ణయించారు. అంతవరకూ పోలవరం అధికారులను దిల్లీలోనే ఉంచి సీడబ్ల్యూసీకి అవసరమైన సమాచారం అందించాలని తీర్మానించారు.

శశిభూషణ్‌కుమార్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలివీ..
తమ ప్రతిపాదనలు ఆమోదించి పంపడానికే జనవరి 15దాకా సమయం తీసుకుంటే ఆర్థికశాఖ ఆమోదం పొంది డబ్బులు రావడానికి చాలా జాప్యం అవుతుందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సమావేశంలో పాల్గొన్న ఇతర ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘జలవనరులశాఖకు ఈ ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత సాంకేతికసలహా మండలి సమావేశం ఏర్పాటుచేయడానికి కనీసం 15 రోజులు పడుతుంది.

* దాన్ని వారు పరిశీలించి పంపడానికి మరో పక్షం రోజులు తీసుకుంటారు.
* అన్ని అడ్డంకులు అధిగమించి ఆర్థికశాఖకు పోయిన తర్వాత వారు కనీసం ఒక్క కొర్రీ అయినా వేస్తారు. దానికి పరిష్కారం లభించాలంటే కనీసం నెలరోజులు పడుతుంది.
* అప్పటికి మార్చి వస్తుంది. డబ్బుల్లేక దాదాపు ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేతి నుంచి రూ.3,500 కోట్లకుపైగా ఖర్చుచేసింది. ఇంకా చేతి నుంచి పెట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారం. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో వనరులు సమకూర్చడం సాధ్యంకాదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి వస్తే పనులు ఆగిపోతాయి. సవరించిన అంచనాలపై ప్రతిపాదనలను జనవరి 15వ తేదీన జలవనరులశాఖకు పంపితే... మీకు డబ్బు ఇచ్చే ఉద్దేశం లేదని అనుకోవాల్సి వస్తుంది.’’ అని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీ అధికారులతో అన్నారు.

ఏ తప్పు జరిగినా బాధ్యత వహిస్తాం
సమావేశం అయిన తర్వాత శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఓపీ సింగ్‌, కమిషనర్‌ ఓరాను కలిసి తాజా చర్చల సారాంశాన్ని వివరించారు. 20కల్లా ఆమోదముద్ర వేయాలని ఓపీ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున అధికారికంగా పంపిన అంచనాల్లో ఏ తప్పు జరిగినా బాధ్యత వహించాడానికి తాము సిద్ధంగా ఉన్నామని అందువల్ల దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. సవరించిన అంచనాలపై సీడబ్ల్యూసీ సోమవారం వేసిన 20 కొర్రీలకు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

పదివేలకోట్లయినా ఇవ్వండి
ముఖ్యమంత్రి ఇదివరకు కోరినట్లు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపేలోపు కనీసం పదివేల కోట్ల రూపాయలైనా ఇవ్వాలని ఏపీ అధికారులు మరోసారి కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి వద్ద ప్రస్తావించారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టుకు రావాల్సిన మొత్తం పదివేల కోట్లకుపైగానే ఉంటుందని వివరించారు. తాత్కాలిక ప్రాతిపదికన రూ.10వేల కోట్లకు అనుమతిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు సాగడానికి వీలవుతుందని తెలిపారు. గతంలో ఈ ప్రతిపాదన చేసినప్పుడు కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయగా తాజా సమావేశంలో ఈ ప్రతిపాదన మంచిదేనని ఓపీ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

పోలవరంలో మరో కీలక ఘట్టం
17-11-2018 02:46:32
 
636780195932076502.jpg
  • ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభం
  • మే 30లోగా పూర్తికావాలని లక్ష్యం
  • నెలముందే పూర్తిచేస్తాం: నవయుగ
  • గోదావరి మళ్లింపునకు ప్రత్యేక కల్వర్టు
ఏలూరు/పోలవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు కీలకమైన కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నారు. ఇప్పటికే జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తయినందున దానికి ఇరువైపులా 6 మీటర్ల వెడల్పున కాఫర్‌ డ్యాం నిర్మాణం తలపెట్టారు. ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించాలన్న పట్టుదల ఇంజనీర్లలో కనిపిస్తోంది. జెట్‌గ్రౌటింగ్‌ పూర్తికి ఎంత క్రియాశీలంగా వ్యవహరించారో.. కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి మరోసారి తమను తాము నిరూపించుకోవాలని వారు భావిస్తున్నారు.
 
గోదావరిలో నీటి ప్రవాహం ఆరంభం కాకమునుపే పనులన్నిటినీ పూర్తిచేసి, సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించే ఉద్దేశంతో కాంట్రాక్టు సంస్థలు పనులకు ఉపక్రమించాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల డిజైన్లకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి లభించింది. ఎగువ డ్యాం పనులకు క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ ఆనందకుమార్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనిని మే 30లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నెలరోజుల ముందే పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థ నవయుగ సంకల్పించింది. అందుకు తగినట్లుగానే ఆధునిక యంత్రాలను రప్పిస్తోంది. ‘మాకంటూ పక్కా ప్రణాళిక ఉంది. పనులన్నిటినీ చకచకా పూర్తి చేస్తాం. మా యంత్రాంగం 24 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. సీఎం ఆశించినదానికి అనుగుణంగానే గ్రావిటీ ద్వారా నీరు అందించేందుకు వీలుగా, గడువులోపే పనులన్నిటినీ కొలిక్కి తెస్తాం. ఎక్కడా రాజీ పడేదిలేదు. సమయంతోనే పరుగులు పెడతాం’ అని ఇంజనీర్లు పేర్కొన్నారు. జెట్‌ గ్రౌటింగ్‌ ఇరువైపులా వంద మీటర్ల వెడల్పులో యంత్రాలతో చదును చేస్తున్నారు. కాపర్‌ డ్యాం నిర్మించే ప్రాంతం మొత్తంలో సర్వేల ద్వారా జెండాలు వేశారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులను పది రోజుల్లో ప్రారంభించే అవకాశముంది.
 
నిర్మాణం ఇలా..
గోదావరిలో సుమారు 2,480 మీటర్ల పొడవున, 187ను ంచి 237 మీటర్ల మేర వెడల్పున.. 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మిస్తారు. దీనికిగాను 66.751 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాయి, మెటల్‌ను నిర్మాణంలో వినియోగిస్తారు. ఇందులో 42.324 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, 5.116 లక్షల క్యూబిక్‌ మీటర్ల హీటింగ్‌ సాయిల్‌, 3.573 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 26,700 క్యూబిక్‌ మీటర్ల జిగురుమట్టిని వాడతారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగిన ప్రాంతంలో 6మీటర్ల వెడల్పున ఇరువైపులా నల్ల మట్టితో నింపుతారు. ఇలా నింపే నల్లమట్టిని ఏ రోజుకారోజు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో పరీక్షలు చేస్తారు. దీనికి సంబంధించి అత్యంత ఆధునికంగా సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
 
వెడల్పులో హెచ్చుతగ్గులు..
కాఫర్‌ డ్యాం నిర్మాణంలో గోదావరి గర్భం లోతును బట్టి వెడల్పును నిర్దేశించారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగినప్పుడు భూమి అంతర్భాగంలో నిపుణుల సూచనల మేరకు నిర్మాణం చేస్తూ వచ్చారు. అప్పటి మాదిరిగానే కాఫర్‌ డ్యాం నిర్మాణంలోనూ జాగ్రత్తలు పాటించబోతున్నారు. దీనికితోడు ఎగువ కాఫర్‌ డ్యాంకు మరింత ఎగువన వంద మీటర్ల వెడల్పున ప్రత్యేకించి కల్వర్టు నిర్మాణానికి ఈ మధ్యనే కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. వంద మీటర్ల వెడల్పున కల్వర్టు నిర్మించి, దానికి 80 పైపులు అమర్చుతారు. ప్రాజెక్టుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా వైపున ఉన్న గట్టుకు ఆనుకుని సాగే గోదావరి ప్రవాహాన్ని ఇలా మళ్లిస్తారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...