sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 జలరవాణా జోష్!ముక్త్యాల-విజయవాడ మార్గంలో పనులు ప్రారంభంతొలిదశలో 90 కిలోమీటర్ల పొడవైన నావిగేషన్ ఛానల్రూ.98 కోట్లు మంజూరుచేసిన కేంద్ర ప్రభుత్వంఈనాడు - అమరావతి శాతావాహనుల కాలంలో వాణిజ్యపరంగా ఓ వెలుగువెలిగిన అమరావతి మళ్లీ పూర్వపు కళను సంతరించుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇందులోభాగంగా ఇక్కడ జలరవాణాను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి చాలాఏళ్లు ఇక్కడ జలరవాణా ఓ వెలుగువెలిగింది. కాలువల్లో పడవలు ఒయ్యారంగా కదలాడేవి. ఆ తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల ఈ మార్గం మూతపడింది. అమరావతి రాజధాని కావడం, చౌకైన, పర్యావరణ అనుకూలమైన జలరవాణాను ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. జాతీయ ఉపరితల జల రవాణా మార్గం-4లో పనుల హడావుడి మొదలైంది. ఈ పనులన్నీ సాఫీగా సాగితే సరకు రవాణా, పర్యాటకుల పడవుల రాకపోకలతో ఈ ప్రాంతానికి కొత్తశోభ సమకూరనుంది. దేశంలోని వివిధ నదులు, ప్రధాన కాలువల్లో 111 జాతీయ ఉపరితల జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. 2016లో జాతీయ ఉపరితల జలరవాణా చట్టాన్ని తీసుకువచ్చింది. 111 జల రవాణా మార్గాల్లో.. 106 కొత్తగా గుర్తించినవి. ఐదు పాతవి. వీటిలో కాకినాడ నుంచి పుదుచ్ఛేరి వరకు 1,078 కిలోమీటర్ల పొడవున ఉన్న జాతీయ ఉపరితల జలరవాణా మార్గం-4 ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్ఛేరి మీదుగా వెళుతుంది. ఇందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఈ మార్గం అభివృద్ధిలో భాగంగా తొలి దశలో ముక్త్యాల-విజయవాడ మధ్య కృష్ణా నదిలో నావిగేషన్ ఛానల్ (నౌకలు ప్రయాణించే కాలువ) తవ్వకం పనులు మొదలయ్యాయి. దీన్ని ఫేజ్-1 ప్రాజెక్టుగా చేపట్టారు. ముక్త్యాల-హరిశ్చంద్రపురం మధ్య నావిగేషన్ ఛానల్, టెర్మినళ్ల నిర్మాణం వంటి పనులన్నీ పూర్తిచేసి... వీలైనంత త్వరగా ఈ మార్గంలో రవాణా ప్రారంభించాలని జాతీయ ఉపరితల రవాణా మార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) కృతనిశ్చయంతో ఉంది. ఫేజ్-1 ప్రాజెక్టు కోసం ఐడబ్ల్యూఏఐ రూ.98 కోట్లు మంజూరు చేసింది. కృష్ణా నదిలో ముక్త్యాల నుంచి విజయవాడకు మధ్య దూరం సుమారు 90 కిలోమీటర్లు. ఈ రెండింటి మధ్యలో 62 కిలోమీటర్ల మేర ప్రస్తుతం నావిగేషన్ ఛానల్ తవ్వకం పనులు మొదలుపెట్టారు. 2018 డిసెంబరు నాటికి తొలిదశ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. 30 లక్షల ఘనపు మీటర్లు తవ్వాలి.. వెయ్యి టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన బార్జ్‌లు తిరిగేందుకు వీలుగా జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. దీనికి నావిగేషన్ ఛానల్ లోతు 2.2 మీటర్లు ఉండాలి. వెడల్పు... కాలువ అడుగున 45 మీటర్లు, ఉపరితలంలో 70 మీటర్లు ఉండాలి. ఈ ప్రమాణాలకు తగ్గట్లుగా ముక్త్యాల నుంచి హరిశ్చంద్రపురం వరకు నదిలో నావిగేషన్ ఛానల్ ఏర్పాటు చేయాలంటే.. సుమారు 30 లక్షల ఘనపు మీటర్ల ఇసుక, మట్టి తవ్వాల్సి ఉంటుంది. ముక్త్యాల-హరిశ్చంద్రపురం రీచ్ పనుల్ని ఐఎంఎస్ షిప్పింగ్ సంస్థకు, చామర్రు-హరిశ్చంద్రపురం మధ్య రీచ్‌ని కోస్టల్ కన్సాలిడేటెడ్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ (సీసీఎస్‌ఎల్) సంస్థకు అప్పగించారు. సీసీఎస్‌ఎల్ మేలో పనులు ప్రారంభించింది. ఇప్పటివరకు 46 ఘనపు మీటర్ల తవ్వకాలు జరిపింది. ఐఎంఎస్ సంస్థ జూన్‌లో ప్రారంభించి, ఇంత వరకు 34 ఘనపు మీటర్ల ఇసుక తవ్వకాలు చేసింది. ప్రస్తుతం కృష్ణా నదికి వరదల సమయం కావడంతో... పనులు నిలిపివేశారు. మూడు చోట్ల కార్గో టెర్మినళ్లు.. తొలిదశ (ఫేజ్-1) జలరవాణా మార్గం అభివృద్ధిలో భాగంగా ఇబ్రహీంపట్నం, ముక్త్యాల (కృష్ణా జిల్లా), హర్చింద్రపురం (గుంటూరు జిల్లా) వద్ద సరకు రవాణా (కార్గో) టెర్మినళ్లు నిర్మిస్తారు. విజయవాడలోని దుర్గాఘాట్, భవానీ ద్వీపం, కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద ప్రయాణికుల రవాణా కోసం నీటిలో తేలియాడే (ఫ్లోటింగ్) టెర్మినళ్లు నిర్మిస్తారు. ఒక్కో కార్గో టెర్మినల్ నిర్మాణానికి 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు అవసరమవుతుంది. జెట్టీలపై ‘రైట్స్’ సంస్థ ప్రస్తుతం సర్వే నిర్వహిస్తోంది. నిధులు వెచ్చించేది ఇలా.. జాతీయ జలరవాణా మార్గం-4లో ఆంధ్రప్రదేశ్‌లో వెళ్లే భాగం వరకు సంయుక్తంగా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఎస్పీవీ విధి విధానాలు, ఎవరికెంత వాటా ఉండాలి వంటి అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చేలోగా... ఫేజ్-1 ప్రాజెక్టుకి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ముందుకువచ్చింది. రూ.98 కోట్లు విడుదల చేసింది. దానిలో రూ.48.96 కోట్లు డ్రెడ్జింగ్ పనులకు, రూ.43.05 కోట్లు టెర్మినళ్ల నిర్మాణానికి, రూ.1.89కోట్లు నావిగేషన్ పరికరాలకు, రూ.1.55 కోట్లు ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు. ప్రయోజనాలెన్నో.. * ముక్త్యాల-విజయవాడ జలరవాణా మార్గం సిద్ధమైతే... దానిలో వెయ్యి టన్నుల సామర్థ్యం కలిగిన బార్జ్‌లు నడుస్తాయి. బార్జ్‌ల్లో స్వయంగా నడిచేవి (సెల్ఫ్ ప్రొపెల్డ్), టగ్‌లతో (ఇంజిన్‌లతో) లాక్కుని వెళ్లేవి ఉంటాయి.* ప్రయాణికుల రవాణా, పర్యాటకుల విహార యాత్రల కోసం మర పడవలు, విలాసవంతమైన పడవలు నడుపుతారు.* కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట చుట్టుపక్కల సిమెంటు పరిశ్రమలు ఎక్కువ. ముక్త్యాల టెర్మినల్ అక్కడికి దగ్గరగా ఉంటుంది. ఆటెర్మినల్‌లో సిమెంటు బస్తాలు బార్జ్‌ల్లో నింపి, హరిశ్చంద్రపురం టెర్మినల్‌లో దించుతారు. అక్కడి నుంచి రాజధానికి సరఫరా చేస్తారు.* వీటీపీఎస్ నుంచి బూడిదను (ఫ్లైయాష్‌ను) సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేయవచ్చు. గుంటూరు జిల్లాలో సున్నపురాయి ఎక్కువగా దొరుకుతుంది. సిమెంటు పరిశ్రమలకు దాన్ని సరఫరా చేయవచ్చు.* జగ్గయ్యపేట నుంచి రాజధానికి రోడ్డు మార్గంలో రవాణా చేయాలంటే సుమారు 140 కిలోమీటర్లు వెళ్లాలి. అదే జల రవాణా మార్గంలో 70 కిలోమీటర్ల ప్రయాణంతోనే రాజధానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకయ్యే ఖర్చులో మూడో వంతు ఖర్చుతోనే జలరవాణా చేయవచ్చు. Link to comment Share on other sites More sharing options...
akhill Posted August 13, 2017 Share Posted August 13, 2017 Sonybro... AP lo channel length entha ? Considerable freight transport jarigidda once finished ? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 800km anukunta bro, Link to comment Share on other sites More sharing options...
akhill Posted August 13, 2017 Share Posted August 13, 2017 800km anukunta bro, Ohh ok ok. Antha length aithe great ye le.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 ముక్త్యాల-విజయవాడ మార్గంలో పనులు ప్రారంభంతొలిదశలో 90 కిలోమీటర్ల పొడవైన నావిగేషన్ ఛానల్ ekkada oka 90km vasthundimanaku akhill 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 Ohh ok ok. Antha length aithe great ye le.. ఇదీ జలరవాణా మార్గం... కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జలరవాణా మార్గం- 4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మమూరు కెనాల్, నార్త్ బకింగ్‌హామ్ కెనాల్, సౌత్ బకింగ్ హామ్ కెనాల్, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు జల రవాణా ద్వారా అనుసంధానం చేయనున్నారు. ముఖ్యమైన ఈ రెండు పోర్టులను అను సంధానం చేయడం ద్వారా జలరవాణా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశపెట్టనున్నారు. దీంతో కాల్వలను, లాకులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుందని నివేదికలో పొందుపరిచారు. కేంద్ర డిజైన్ల సంస్థ నుంచి ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులను చేపట్టే అవకాశం ఉంది. ముక్త్యాల-విజయవాడ మార్గంలో పనులు ప్రారంభం తొలిదశలో 90 కిలోమీటర్ల పొడవైన నావిగేషన్ ఛానల్ evi vasthe bagane use avuthundi AP ki brother Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted August 13, 2017 Share Posted August 13, 2017 Good Link to comment Share on other sites More sharing options...
akhill Posted August 13, 2017 Share Posted August 13, 2017 ఇదీ జలరవాణా మార్గం... కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జలరవాణా మార్గం- 4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మమూరు కెనాల్, నార్త్ బకింగ్‌హామ్ కెనాల్, సౌత్ బకింగ్ హామ్ కెనాల్, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు జల రవాణా ద్వారా అనుసంధానం చేయనున్నారు. ముఖ్యమైన ఈ రెండు పోర్టులను అను సంధానం చేయడం ద్వారా జలరవాణా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశపెట్టనున్నారు. దీంతో కాల్వలను, లాకులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుందని నివేదికలో పొందుపరిచారు. కేంద్ర డిజైన్ల సంస్థ నుంచి ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులను చేపట్టే అవకాశం ఉంది. ముక్త్యాల-విజయవాడ మార్గంలో పనులు ప్రారంభం తొలిదశలో 90 కిలోమీటర్ల పొడవైన నావిగేషన్ ఛానల్ evi vasthe bagane use avuthundi AP ki brother Ya bro.. 977 kms total.. alnost 1000 kms.. nit a small thing. And load factor kuda chala bagundhi.. 1000 tonnes tops ante almost 10 to 15 tanks in war time and nearly 10 to 20 containers of load that is transported through roads. Grains movement ki.. construction material movement ki chala plus avvuddi.. will save lot of money in fuel. Villu cheptunnatlu 2018 end ki first phase finish chesina it is a considerable achievement. Kindly keep updating this threaf.. i ve bookmarked it fr updates nd new posts. Link to comment Share on other sites More sharing options...
akhill Posted August 13, 2017 Share Posted August 13, 2017 what is this nonsensical "sutrapraya amodam" business ? ippativaraku centre announce chesina projects anni ilantive Suthrapraya ante... frst stage of projects bro.. MoU lu raskotam.. feasibility study ki funds release cheyyatam... vaati output ni batti project finalize chestaru.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 Ya bro.. 977 kms total.. alnost 1000 kms.. nit a small thing. And load factor kuda chala bagundhi.. 1000 tonnes tops ante almost 10 to 15 tanks in war time and nearly 10 to 20 containers of load that is transported through roads. Grains movement ki.. construction material movement ki chala plus avvuddi.. will save lot of money in fuel. Villu cheptunnatlu 2018 end ki first phase finish chesina it is a considerable achievement. Kindly keep updating this threaf.. i ve bookmarked it fr updates nd new posts. no chance avvadu brother, land acquisition cheyyali first, karcchu bagane avuthundi kastam Link to comment Share on other sites More sharing options...
akhill Posted August 13, 2017 Share Posted August 13, 2017 no chance avvadu brother, land acquisition cheyyali first, karcchu bagane avuthundi kastam Ya i m not exepecting total 1000 km... but atleast some stretches which were classified as phase 1. Paina oka post lo 2018 june ki oka stretch ready antunnaru.. so atleast if they can finish by end of 2018, its a good deal i guess. Gadkari is an efficient minister.. lets see if he puts any efforts into this. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 13, 2017 Author Share Posted August 13, 2017 edi ayye pani na Link to comment Share on other sites More sharing options...
rk09 Posted August 13, 2017 Share Posted August 13, 2017 asalu Muktuala - chamarru madyalo year long neellu vuntaya - that too 2.5 meter deep and 45 meters wide pulichintala lo 45 tmc store chesina doubte makes sense between amaravati and vijayawada Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted August 14, 2017 Share Posted August 14, 2017 asalu Muktuala - chamarru madyalo year long neellu vuntaya - that too 2.5 meter deep and 45 meters wide pulichintala lo 45 tmc store chesina doubte makes sense between amaravati and vijayawada longer the route is more economically viable that will be. who would want to ship 1000 tons from Amaravati to vijayawada? loading/unloading kharchulu dandaga. ade muktyala surrounding areas lo ayithe cement factories nunchi emaina cement transport jarugutundemo. 2.5mx45mx60km is 0.25 TMC. around 3 to 6 TMC is enough to maintain the channel full throughout the year. assuming complete evaporation in 30 days to 15 days. Link to comment Share on other sites More sharing options...
rk09 Posted August 14, 2017 Share Posted August 14, 2017 longer the route is more economically viable that will be. who would want to ship 1000 tons from Amaravati to vijayawada? loading/unloading kharchulu dandaga. ade muktyala surrounding areas lo ayithe cement factories nunchi emaina cement transport jarugutundemo. 2.5mx45mx60km is 0.25 TMC. around 3 to 6 TMC is enough to maintain the channel full throughout the year. assuming complete evaporation in 30 days to 15 days. fully agree on longer the route...... naa view based on current water availability and more over -- from barrage canals, water always flows from july - oct/dec in full extent and after drinking purposes.. so its difficult to maintain that level at upstream especially at muktyala as long as there is some flow -- no issues Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 19, 2017 Author Share Posted August 19, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
swas Posted August 19, 2017 Share Posted August 19, 2017 I think we should use buckingham canal to transfer godavari water to penna elago it will pass through nellore varuku ready chesi before start of polavaram it will be better 2 lifts pettali one to dump water into Somalia and another small checkdam kattali downstream of somasila and dump water in it. 0.5 tmc per day pampali canal dwara which will be lift okati ready chesi downstream of water dump cheyali somasila downstream lo inko checkdam kattali near to sea checkdam kadithe with less distance more water maintain cheyochu downstream of somasila (or) buckingham canal when it comes to nellore if possible dig another canal and try to dump water in new checkdam. then from there we had to start another project to pump water into somasila project. elago after completing polavaram manaki storage undadu for 4-5 years so right canal per day 1.5 tmc/day pampithe 100 days 150tmc which can't be stored some water will go into sea. so better to divert 0.5 tmc/day to buckingham canal and in that 0.5tmc/day pump chesi oka lift tho inko lift tho somasila lo vesthe better deni start chesthe election time lo super majority in nellore, chittor Inko lift petti backwaters ni remaining districts ki pamputam ani chepina nammutaru appudu rayalaseema lo votes one side avutayi Link to comment Share on other sites More sharing options...
Vulavacharu Posted September 10, 2017 Share Posted September 10, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 19, 2017 Author Share Posted September 19, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 అమరావతిలో నౌకాయానం ముక్త్యాల నుంచి విజయవాడ దాకా.. 100 కోట్లతో 90 కి.మీ.మేర జలరవాణాకు 3న గడ్కరీ శంకుస్థాపన ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక పోలవరం ప్రాజెక్టు పరిశీలన? అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అమరావతికి కొత్త సొబగులు.. ఇప్పటికే విశాలమైన రహదారుల నిర్మాణానికి సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం.. నౌకాయానానికి శ్రీకారం చుడుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో కొత్త జలరవాణా మార్గం ఏర్పాటుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ముక్త్యాల నుంచి విజయవాడ దాకా 90 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో నౌకాయాన పథకానికి అక్టోబరు 3న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శంకుస్థాపన చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.100 కోట్లని జాతీయ అంతర్గత జలరవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా జలరవాణా మార్గాన్ని రూ.40 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం వద్ద మూడు టెర్మినళ్లను నిర్మిస్తారు. వీటికి రూ.60 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అమరావతిలో అంతర్గత జల రవాణాను అభివృద్ధి చేస్తామని ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో గడ్కరీ వెల్లడించారు.రాష్ట్రంలో రవాణా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన పథకాలన్నీ చేపడతామని, ప్రధానంగా బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణను వేగవంతం చేసి.. తక్కువ వ్యయంతో కూడిన జల రవాణాను అమల్లోకి తెస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల పర్యాటక రంగమూ వృద్ధి చెందుతుందన్నారు. ఇటీవల ఉపరితల, నౌకాయానంతో పాటు జల వనరుల శాఖ బాధ్యతలను కూడా ప్రధాని మోదీ ఆయనకు అప్పగించారు. జల వనరుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. రాష్ట్రాల మంత్రులతోనూ, కార్యదర్శులతోనూ ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రావాలని గడ్కరీని రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమ ఆహ్వానించారు. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో స్వయంగా సమీక్షించాలని కోరారు. అందుకాయన అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టునూ సందర్శించి, పనులను సమీక్షిస్తానని.. త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తిచేసేలా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనలో భాగంగా పోలవరం పనులను గడ్కరీ స్వయంగా పరిశీలించే అవకాశముందని అధికారులు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21, 2017 Author Share Posted September 21, 2017 రాష్ట్రంలో విశాలమైన నేషనల్ హైవేలకు తోడు, ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ (జల రవాణా) కూడా తోడవ్వనుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల నుంచి విజయవాడ దాకా 90 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో జల రవాణాకు అక్టోబరు 3న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుననున్నారు. 100 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యనున్నారు. 40 కోట్లు జలరవాణా మార్గానికి, మిగతా 60 కోట్లతో, ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం వద్ద మూడు టెర్మినళ్లను నిర్మిస్తారు. విజయవాడలోని దుర్గాఘాట్, భవానీ ద్వీపం, కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద ప్రయాణికుల రవాణా కోసం ఫ్లోటింగ్ టెర్మినళ్లు నిర్మిస్తారు. జల రవాణాలో సరుకు రవాణాతో పాటు, ప్రయాణికులు కూడా ఈ రూట్ ఉపయోగించుకోవచ్చు. అటు పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. జగ్గయ్యపేట నుంచి రాజధానికి రోడ్డు మార్గంలో రవాణా చేయాలంటే సుమారు 140 కిలోమీటర్లు వెళ్లాలి. అదే జల రవాణా మార్గంలో 70 కిలోమీటర్ల ప్రయాణంతోనే రాజధానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకయ్యే ఖర్చులో మూడో వంతు ఖర్చుతోనే జలరవాణా చేయవచ్చు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 23, 2017 Author Share Posted September 23, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 23, 2017 Author Share Posted September 23, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 23, 2017 Author Share Posted September 23, 2017 రాష్ట్రంలో సాగరమాలకు ప్రాధాన్యం23-09-2017 04:26:08 3న గడ్కరీ రాక.. ముక్త్యాల-విజయవాడ జల రవాణా పథకానికి శంకుస్థాపన మరో 7 జాతీయ రహదారులకు భూమి పూజ అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగరమాల కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సాగరమాల డైరెక్టర్ అభిషేక్ చంద్ర హామీ ఇచ్చారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌తో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. అక్టోబరు 3న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడకు రానున్నారని, ముక్త్యాల-విజయవాడ(90 కిలో మీటర్లు) జల రవాణా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టే ఏడు జాతీయ రహదారుల పనులకు కూడా గడ్కరీ భూమి పూజ చేయనున్నారని వివరించారు. సాగరమాలపై అభిషేక్ చంద్ర సమీక్షించారు. సాగరమాల కింద రాష్ట్రం ప్రభుత్వం రూ.1,30,762 కోట్ల వ్యయంతో 90 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. వాటిలో 60 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం. 30 ప్రాజెక్టులను విశాఖ పోర్టు ట్రస్టు చేపట్టేందుకు ప్రతిపాదించారు. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సాగరమాల కార్యక్రమం కింద మొత్తం 106 ప్రాజెక్టులు ఇస్తే.. వాటిలో 71 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం, 31 ప్రాజెక్టులు విశాఖ పోర్టు ట్రస్టుకు, మరో 4 ప్రాజెక్టులు మత్స్యశాఖకు కేటాయించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26, 2017 Author Share Posted September 26, 2017 ఏపీలో రూ.4468 కోట్ల ప్రాజెక్టులు జాతీయ రహదారులు ప్రారంభం.. జల మార్గాలకు శిలాఫలకం 3న గడ్కరీ చేతుల మీదగా నిర్వహణ న్యూఢిల్లీ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పలు జాతీయ రహదారులు, జలమార్గాలు ప్రారంభమవబోతున్నాయి. మొత్తం రూ.4,468 కోట్ల వ్యయంతో చేపట్టిన, చేపట్టనున్న ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించబోతున్నారు. అక్టోబరు 3వ తేదీన రాష్ట్రంలో పర్యటించి పలు ప్రాజెక్టుకు శంకుస్థాపన, శిలాఫలకం వేస్తారని సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రూ.1928.56 కోట్ల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టును(415 కిలోమీటర్లు) ప్రారంభిస్తారు. మరో రూ.2589.08 కోట్ల వ్యయంతో చేప్టనున్న రహదారి పనులకు(250 కిలోమీటర్లు) శిలాఫలకం వేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటికే ఉన్న రహదారుల అభివృద్ధి, ఆప్‌గ్రెడేషన్, ఎన్‌హెచ్-43పై విజయనగరం పట్టణంలో నాలుగు లైన్ల బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు. మరోవైపు, అదే రోజు కృష్ణానదిపై ముక్త్యాల-విజయవాడ మొదటిదశ జలమార్గానికి శిలాఫలకం వేస్తారు. 82 కిలోమీటర్ల ఈ జలమార్గం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో తవ్వకపు పనులు ప్రారంభమయ్యాయని, జూన్ 2019 నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది. తాత్కాలిక టెర్మినల్ పనులు 2018 జూన్‌లోగా పూర్తవుతాయని స్పష్టం చేసింది. శాశ్వత టెర్మినల్ పనులను 2018 మార్చిలో మంజూరు చేస్తామని, ఆ పనులు 2019 జూన్ నాటికి పూర్తవుతాయని వివరించింది. నైట్ నేవిగేషనల్ సహాయక పనులను 2018లో ప్రారంభిస్తామని తెలిపింది. కొత్తగా నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన వస్తువులను ఈ జలమార్గం ద్వారా రవాణా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, రెండోదశ జలమార్గంలో విజయవాడ -కాకినాడ, రాజమండ్రి-పోలవరం జలమార్గాలు ఉన్నాయి. రెండోదశ పనులకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వే అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ) సంస్థ కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదించిందని, ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేక ప్రయోజనాల సంస్థ(స్పెషల్ పర్పస్ వెహికల్)ని ఏర్పాటు చేసే అంశం కేబినెట్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది. మూడుదశల్లో రాష్ట్రంలో జలమార్గాల ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రంతో 2016 ఏప్రిల్ 14న రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. మొదటి దశ: ముక్త్యాల-విజయవాడ (కృష్ణానదిపై 82 కిలోమీటర్లు) రెండో దశ: విజయవాడ-కాకినాడ (ఏలూరు కెనాల్, కాకినాడ కెనాల్ మీదుగా..), రాజమండ్రి - పోలవరం(గోదావరి నదిపై). ఈ రెండు మార్గాలు కలిపి 233 కిలోమీటర్లు. మూడో దశ: కొమ్మమూరు కెనాల్, బకింగ్‌హామ్ కెనాల్, కృష్ణా, గోదావరి నదులపై మిగిలిన స్ర్టెచ్‌లు (మొత్తం 573 కిలోమీటర్లు). రాష్ట్రంలో జాతీయ జలమార్గం-4 పేరుతో 1078 కిలోమీటర్ల ప్రాజెక్టును 2008లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని 2016లో 2890 కిలోమీటర్లకు విస్తరించారు. ఇవీ స్ట్రెచ్‌లు భద్రాచలం - రాజమండ్రి (గోదావరి నది) - 171 కిలోమీటర్లు వజీరాబాద్ - విజయవాడ (కృష్ణా నది) - 157 కిలోమీటర్లు కాకినాడ - రాజమండ్రి (కాకినాడ కెనాల్) - 50 కిలోమీటర్లు రాజమండ్రి - విజయవాడ (ఏలూరు కెనాల్) - 139 కిలోమీటర్లు విజయవాడ - పెదగంజాం (కొమ్మమూరు కెనాల్) - 113 కిలోమీటర్లు పెదగంజాం - చెన్నై (ఉత్తర బకింగ్‌హామ్ కెనాల్) - 316 కిలోమీటర్లు చెన్నై - మెర్కానం (దక్షిణ బకింగ్‌హామ్ కెనాల్) - 110 కిలోమీటర్లు మెర్కానం - పుదుచ్చేరి (కలువెళ్లి ట్యాంక్) - 22 కిలోమీటర్లు విస్తరించినవి: కృష్ణానదిపై వజీరాబాద్ నుంచి గలగలి (628 కిలోమీటర్లు) గోదావరి నదిపై భద్రాచలం నుంచి నాసిక్ (1184 కిలోమీటర్లు) Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26, 2017 Author Share Posted September 26, 2017 భద్రాచలం-రాజమండ్రికి జలమార్గం హైదరాబాద్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): భద్రాచలం గోదావరి తీరప్రాంతం నుంచి రాజమండ్రికి లాంచీలో వెళ్లే సౌకర్యం అందుబాటులోకి రానుంది. 171 కి.మీ.ల నిడివి ఉన్న ఈ జలమార్గానికి కేంద్రం ఆమోదం తెలిపింది Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26, 2017 Author Share Posted September 26, 2017 (edited) v Edited May 29 by sonykongara Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now