Jump to content

Buckingham Canal inland waterways


Recommended Posts

  • 3 weeks later...
  • 2 weeks later...
గంగా నదిపై ఇన్‌లాండ్ వాటర్‌వేస్ టెర్మినల్ జాతికి అంకితం
12-11-2018 18:23:51
 
636776438320239146.jpg
వారణాసి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం గంగా నదిపై ఇన్‌లాండ్ వాటర్‌వేస్ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. గంగా నదిపై జాతీయ జలమార్గాలు -1లో నిర్మిస్తున్న నాలుగు మల్టీ మోడల్ టెర్మినల్స్‌లో ఇదొకటి. ప్రపంచ బ్యాంకు సహాయంతో, జల మార్గాల అభివృద్ధి పథకంలో భాగంగా దీనిని నిర్మించారు.
 
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వరకు గంగా నదిపై జల మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 1,500 నుంచి 2,000 టన్నుల బరువుగల భారీ నౌకల ప్రయాణానికి అనువుగా ఈ టెర్మినల్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సరకు రవాణా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. పర్యావరణ హితకరమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దాలన్న ఆశయం పెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

జాతీయ జల మార్గాల్లో సరుకు రవాణా షురూ
13-11-2018 00:49:16
 
636776669566468336.jpg
  • వారణాసిలో గంగా నదిపై నిర్మించిన తొలి మల్టీ మోడల్‌ టెర్మినల్‌ జాతికి అంకితం
వారణాసి: దేశంలో తొలిసారిగా జాతీయ జలమార్గాల ద్వారా సరుకు రావాణా ప్రారంభమైంది. కోల్‌కతా నుంచి వారణాసికి తొలి కంటైనర్‌ సోమవారం చేరుకుంది. దేశంలో తొలిసారిగా వారణాసిలోని గంగా నదిపై నిర్మించిన మల్టీ మోడల్‌ టెర్మినల్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. కోల్‌కతా నుంచి నదీ మార్గంలో వచ్చిన తొలి కంటైనర్‌ను అందుకున్నారు. అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ పెప్సికోకు చెందిన ఆహార, పానీయాల ఉత్పత్తులతో కూడిన ఈ కంటైనర్‌ గతనెల చివరి వారంలో కోల్‌కతా నుంచి బయలు దేరింది.
 
హల్దియా నుంచి అలహాబాద్‌ (1,620 కిలోమీటర్లు) మధ్య గంగా-భగీరథీ-హూగ్లీ నదుల అనుసంధాన వ్యవస్థను ఒకటో నంబరు జాతీయ జలమార్గంగా 1986లో ప్రకటించారు. అప్పటి నుంచి భారత జలమార్గాల మండలి (ఐడబ్ల్యూఏఐ) లోతట్టు నదీ మార్గాల్లో రవాణా కోసం పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. జల్‌ మార్గ్‌ వికాస్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5,369.18 కోట్లు. ఇందులో సగం నిధులను ప్రపంచ బ్యాంక్‌ సమకూరుస్తుండగా.. మిగతా సగం కేంద్రం భరిస్తున్నది. వారణాసిలో నిర్మించిన మల్టీ మోడల్‌ టర్మినల్‌.. జాతీయ జలమార్గం నెంబర్‌ 1పై తలపెట్టిన నాలుగు టెర్మినళ్లలో మొదటిది.
Link to comment
Share on other sites

  • 2 months later...
అడుగు పడదేం?
 

రూ.3500 కోట్లతో జాతీయ జల రవాణా మార్గం-4కు ఆమోదం
రెండేళ్లుగా నిధులు కేటాయించని కేంద్రం

gnt-gen1a_44.jpg

కొమ్మమూరు కాల్వలో జల రవాణా పునరుద్ధరణకు తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు 112 కి.మీ. మేర జాతీయ జల రవాణా మార్గం-4 నిర్మాణానికి 2016లో రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా వాటికి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు సాకారమైతే సరుకు రవాణా ఖర్చు బాగా తగ్గడంతోపాటు అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

న్యూస్‌టుడే, బాపట్ల

బిట్రీషర్ల హయాంలో కొమ్మమూరు కాల్వలో జల రవాణా ప్రారంభమైంది. పడవల రాకపోకలకు అనుకూలంగా వంతెనలు నిర్మించారు. ప్రత్యేక కాల్వల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో విజయవాడ నుంచి పెదగంజాం వరకు సరుకులు, ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులు రవాణా చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1960 దశకం వరకు  జల రవాణా కొనసాగింది. ప్రజలు సైతం ఈ పడవల్లో రాకపోకలు సాగించేవారు. 1968 తర్వాత రహదారులు అభివృద్ధి చెందడంతో క్రమేపీ జల రవాణా నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది. కొమ్మమూరులో జల రవాణాను పునరుద్ధరించాలని పధ్నాలుగేళ్ల కిత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయించినా అది  కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ఉపరితల జల రవాణా సంస్థ ఆధ్వర్యాన విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 మేలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జల రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి కేంద్ర ఉపరితల జలరవాణా సంస్థ నిపుణులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి కాల్వను పరిశీలించారు. జల రవాణా సవివర ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో తయారు చేయించి కేంద్ర జల రవాణా సంస్థకు పంపారు. అది దానిని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌కు పంపగా ఆమోద ముద్రా పడింది. అయినా పనుల జాడ లేకపోయింది.

ఆకృతులు ఇలా...
పడవలు రాకపోకలు సాగించాలంటే కాల్వ ఇరుకట్టలను కలుపుకుని మొత్తం వెడల్పు 120 మీటర్లు ఉండాలి. కింద వెడల్పు(బెడ్‌ విడ్త్‌) 40 మీటర్లు ఉండాలి. ఈ ప్రాజెక్టు కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమి, 650 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సివుంది. జల రవాణాను పునరుద్ధరిస్తే 10 మీ. వెడల్పు, 60 మీ. పొడవు, వెయ్యి టన్నుల సామర్థ్యం కలిగిన మరపడవలు తిరుగుతాయి. వాటి రాకపోకల కోసం కాల్వలో ఎప్పుడూ రెండున్నర మీటర్ల లోతున నీరు తప్పనిసరిగా ఉండాలి. రెండు పడవలు ఎదురుగా వచ్చినా తిరగటానికి ఇబ్బంది లేకుండా కాల్వను తీర్చిదిద్దేలా ఆకృతులు రూపొందించారు. కాల్వ వంపు బాగా ఉన్న ప్రాంతాల్లో దీనిని తగ్గించి 700 మీటర్ల వ్యాసార్థం ఉండేలా విస్తరణ నిమిత్తం భూమి కావాల్సివుంది. సీతానగరం నుంచి  దుగ్గిరాల వరకు కాల్వ 120 మీటర్ల వెడల్పు ఉండగా ఈ ప్రాంతంలో విస్తరణ చేపట్టాల్సిన అవసరం లేదు. దుగ్గిరాల నుంచి సంగంజాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల లాకుల వరకు కాల్వ కింద వెడల్పు 40 మీటర్లు ఉండగా ఆయా ప్రాంతాల్లో కట్టలను మాత్రమే వెడల్పు చేయాల్సివుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కొల్లిమర్ల లాకుల నుంచి కాల్వ వెడల్పు తగ్గుతూ వస్తోంది. నరసాయపాలెం వద్ద బెడ్‌ విడ్త్‌ 15 మీటర్లు కాగా పెదగంజాం వద్ద ఆరు మీటర్లు మాత్రమే ఉంది. దీనిని 40 మీటర్లకు పెంచాల్సివుంది. చీరాల వద్ద లోతు 1.25 మీటర్లు మాత్రమే ఉండగా దీనిని 2.50 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భూసేకరణ ఎక్కువగా చేపట్టాల్సివుండగా కాల్వకు ఇరువైపులా మురుగునీటి కాల్వలు(క్యాచ్‌ డ్రెయిన్లు) తవ్వుతారు. ప్రస్తుతం ఇవి ఉన్న చోట పూడిక తీస్తారు. కాల్వకు ఇరువైపులా కాంక్రీటు గోడలు లేదా రాతి రివిట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. సీతానగరం, వడ్డేశ్వరం, దుగ్గిరాల, చేబ్రోలు, కొల్లిమర్ల, నల్లమడ లాకులు, సంతరావూరు, పెదగంజాం వద్ద సరుకు పడవలు ఆగటానికి ప్లాట్‌ఫారాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి సరుకులను రవాణా చేయటానికి సమీప జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ అప్రోచ్‌లు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రహదారి రవాణాతో పోలిస్తే కేవలం 40 శాతం వ్యయంతో జలరవాణా ద్వారా సరుకులను చేరవేయవచ్చని నిపుణులు అంటున్నారు. దశలవారీగా ప్రాజెక్టు చేపట్టాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ 2018లో తొలి విడత పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియనే ప్రారంభించలేదు. నిధులపరంగా రెండేళ్లకుపైగా రూపాయీ కేటాయించలేదు. దాంతో తాజాగా పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల కోట్లకుపైగా మంజూరు చేయాల్సిన అగత్యం ఏర్పడింది.

ప్రతిపాదనలు పంపాం
కొమ్మమూరు కాల్వలో జల రవాణా పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందజేశాం. దీనిని జాతీయ జల రవాణా మార్గం-4గా నామకరణం చేశారు. కేంద్ర జలరవాణా సంస్థ పర్యవేక్షణలో జల వనరుల శాఖ ఆధ్వర్యాన పనులు చేపట్టాలని నిర్ణయించినా నిధులివ్వకపోవడంతో పనులకు శ్రీకారం చుట్టలేదు. ఆ సంస్థ పరిధిలోకి కాల్వ వెళ్లడంతో మూడేళ్లుగా రైతులకు సాగునీటిపరంగా ఇబ్బంది లేకుండా చూడటానికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం. భూసేకరణ ప్రక్రియ ఆరంభించాల్సివుంది. కేంద్రం నిధులు విడుదల చేస్తేనే పనుల్లో కదలిక వస్తుంది.

- పి.వెంకటరత్నం, ఈఈ, కృష్ణ పశ్చిమ డెల్టా, జల వనరుల శాఖ
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...