Jump to content

Buckingham Canal inland waterways


Recommended Posts

గోదారిలో రహదారి..!

636422763769405045.jpg



  •  భద్రాచలం నుంచి రాజమండ్రికి జలమార్గం
  • సరుకు రవాణా మరింత చౌక
  •  కీలకం కానున్న భద్రాద్రి ప్రాంతం
  • పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం

భద్రాచలం: భద్రాద్రి నుంచి పాపికొండలకు లాంచీ ప్రయాణం కొత్తేం కాదు..! కానీ.. రాజమండ్రి వరకూ ప్రయాణం సాగించే అవకాశం ఉంటే..! అది శాశ్వత రవాణా మార్గమైతే..!! అన్నీ సజావుగా సాగితే.. గోదారిలో ఓడలు నిత్యం ప్రయాణించే అవకాశం ఉంది. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు జలమార్గం ఏర్పాటుకు కేంద్రం ఇటీవలే అనుమతిచ్చింది. దీంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 

2013లో సర్వే నిర్వహణ..

గోదావరి నదిపై భద్రాచలం-రాజమండ్రి వరకు జలరవాణా మార్గానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర జలవనరుల శాఖ గతంలోనే దృష్టి సారించింది. దాదాపుగా రూ.కోటి నిధులు ఇందుకు వెచ్చించారు. ఇందులో భాగంగా రాజమండ్రి నుంచి 2013 ఏప్రిల్‌ 13న ఇన్‌లండ్‌ వాటర్‌ వేస్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. నెల రోజులపాటు ఆంధ్రాలోని తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిసిన వరరామచంద్రాపురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరుల గోదావారి పరివాహక ప్రాంతంతో పాటు భద్రాచలం వరకు అధ్యయనం చేశారు. గోదావరి లోతు, అడుగున ఉన్న ఇసుక, రాళ్లు, గోదావరి ప్రవాహ వేగాన్ని తెలుసుకునేందుకు అత్యంత ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించారు. జీపీఎస్‌ సిస్టమ్‌, హైడ్రోలాజికల్‌, టోపోగ్రాఫికల్‌ పద్ధతుల ద్వారా కూలంకషంగా సర్వే చేపట్టారు. అన్నీ పరిశీలించాక గోదావరిపై జలరవాణాకు మార్గం అనుకూలమని తేలడంతో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, నిధులు కేటాయించేందుకు ముందుకొచ్చింది. అలాగే గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నీరు పుష్కలంగా ఉంటుంది. దీంతో భద్రాచలం-రాజమండ్రిల మధ్య లాంచీలు, ఓడల రవాణా మార్గానికి సులభమవుతుంది.

 

ఆచరణదాలిస్తే మరింత చౌకగా..

వ్యాపార, వాణిజ్యపరంగా రహదారి మార్గం కంటే జల రవాణా ఎంతో చౌకగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గణాంకాల ప్రకా రం రైలు ద్వారా టన్ను సరకును 1 కిలోమీటరు దూరం రవాణా చేస్తే పన్నులతో సహా రూ2.20 కాగా, జాతీయ రహదారుల ద్వారా అయితే రూ.3.50 పైసలు ఖర్చవుతుంది. అదే.. జల మార్గం ద్వారా కేవలం రూ.1.50 మాత్రమే ఖర్చవుతుందని అనధికారిక అంచనా. రహదా రుల రవాణా కంటే జలమార్గం ద్వారా సగానికి సగం ఖర్చు వ్యత్యాసం వుండటంతో జలమార్గం రవాణాకు మార్గం సుగమం అవుతోంది. నదులు, కాలువల ద్వారా సముద్ర రేవులకు సరుకులను సులభంగా తక్కువ ఖర్చుతో చేరవేయవచ్చు. జలమార్గం ద్వారా ఎగుమతు లు, దిగుమతులు ఊపందుకొంటాయి. తద్వారా వ్యాపారలావాదేవీలు జరుగుతాయి. అన్నింటికం టే ప్రధానంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ బాధ తప్పుతుంది. అలాగే ఉద్యోగ అవకాశా లు మెరుగుపడి ప్రజలకు జీవనోపాధి మెరుగు పడుతుంది. జలమార్గం ద్వారా ప్రయాణ సౌక ర్యం మెరుగవడంతో.. పర్యాటక రంగం అభివృద్ధి చెంది, ప్రభుత్వానికి ఆదాయం చేకూరే అవకాశ మూ ఉంది. బ్రిటీషర్ల కాలంలో కాలువల ద్వారా సరుకుల రవాణా జలమార్గం ద్వారా జరిపేవా రు. మళ్లీ నాటి రోజులు రానున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఇదే గోదావరిపై జల రవాణా యథేచ్ఛగా సాగేది. రాజమండ్రి-భద్రాచలం- వెంకటాపురం వరకు రాకపోకలు సాగేవి.

 

కేంద్రం ఆసక్తిపైనే..

జల రవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఎన్నో అనుకూల అంశాలున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం ఇందుకు ఆమోదముద్ర వేసినా జల రవాణా నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు వేగంగా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే నాటికి జల రవాణాకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఆచర ణ రూపందాల్చడం, తదనంతర ప్రక్రి యలు పూర్తయితే భద్రాద్రికి మహర్ద శ పడుతుందనడంలో ఏ మా త్రం అతిశయోక్తి లేదు. ఇది ఏ మేరకు సకాలంలో పూర్తి చేస్తారు..? అనేది కేంద్ర ప్రభు త్వ వైఖరి పై ఆధారపడి ఉంది.

Link to comment
Share on other sites

జల రవాణాకు లైన్ క్లియర్..!
 
 
636425449748313656.jpg
  • రేపు శంకుస్థాపన
  • తొలివిడతలో ముక్త్యాల-విజయవాడ మార్గం అభివృద్ధి
  • మొత్తం ఏడు టెర్మినల్స్‌ నిర్మాణం
  • బహుళ వినియోగానికి మూడు టెర్మినల్స్‌
  • నదిలో 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల డ్రెడ్జింగ్‌
  • రెండు కంపెనీలకు పనుల అప్పగింత
  • రెండోదశలో విజయవాడ-కాకినాడ మార్గం
విజయవాడ:  జల రవాణాకు ‘లైన్‌’ క్లియర్‌ అయింది. ఇప్పటివరకు కృష్ణా, గోదావరి నదులు సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతుండగా మరికొద్ది రోజుల్లో రవాణా అవసరాలనూ తీర్చనున్నాయి. ఈ నదులకు అనుసంధానంగా ఉన్న కాలువలు ఇప్పుడు జలమార్గాలుగా మారబోతున్నాయి. అందుకు మంగళవారం పునాదిరాయి పడబోతున్నది. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ జలమార్గాల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 13 జాతీయస్థాయి ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపే కార్యక్రమంలో భాగంగా జలరవాణా ప్రాజెక్టు మొదటివిడతకు డిజిటల్‌ శిలాఫలకం ఆవిష్కరణ చేస్తారు.
 
కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి కేంద్రం రూ.7015కోట్లు కేటాయించింది. మొదటివిడతగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల నుంచి విజయవాడ వరకు 82కిలోమీటర్లలో ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. దీనిలోభాగంగా ఏడు టెర్మినల్స్‌ నిర్మిస్తారు. ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, గుంటూరు జిల్లాలోని హరిశ్చంద్రపురం గ్రామాల్లో నదీతీర ప్రాంతంలో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తారు. బహుళ ప్రయోజనంగా వీటిని నిర్మిస్తారు. ఇక్కడి నుంచి సరకు రవాణాతోపాటు ప్రయాణికులను చేరవేస్తుంటారు. ఇక వేదాద్రి, అమరావతి, భవానీ ఐల్యాండ్‌, విజయవాడలోని దుర్గాఘాట్‌లో నిర్మించే టెర్మినల్స్‌ పర్యాటకరంగాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తారు. వేదాద్రిలో నరసింహ స్వామి ఆలయం, అమరావతిలో అమరేశ్వరాలయం, బౌద్ధస్థూపం ఉన్నాయి. త్వరలో ఇక్కడే నవ్యాంధ్ర రాజధాని అపురూప భవనాలకు పునాదులు పడబోతున్నాయి. విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ ఇప్పటికే పర్యాటక ప్రదేశంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక దుర్గాఘాట్‌ ఇంద్రకీలాద్రికి చేరువలో ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రేమికుల ప్రదేశాలే! ఈ నాలుగు టెర్మినల్స్‌ను ప్రయాణికుల కోసం అభివృద్ధి చేస్తారు.
 
 
రెండో విడతలో విజయవాడ నుంచి కాకినాడ వరకు మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. మొత్తం 233 కిలోమీటర్ల మేర దీన్ని అభివృద్ధి చేయాల్సివుంది. విజయవాడ నుంచి మొదలైన మార్గం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గోదావరి కాలువ వరకు వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం నుంచి మరోమార్గం ఏలూరు కాలువ వరకు వస్తుంది. ఈ రెండూ కలిసి కాకినాడ పోర్టు వరకు వెళతాయి. ఈ మార్గాల్లో ఉన్న కాలువను పూర్తిగా విస్తరించాల్సివుంది. కాలువలకు అడుగుభాగాన 40 మీటర్లు, పైభాగంలో 60 మీటర్లు విస్తరించాలి. ఇందుకోసం మొత్తం 1730 ఎకరాల భూమి అవసరమవుతుందని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అధికారులు గుర్తించారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాటిని నిర్మించిన లాక్‌లను తొలగించి పునఃనిర్మించాల్సి ఉంది. వీటితోపాటు కొన్నిచోట్ల వంతెనల నిర్మాణాలు చేయాల్సివుంది. రెండోవిడతలో భారీగా భూసేకరణ అవసరమవుతు న్నప్పటికీ, మొదటి విడత మొత్తం నదిలోనే సాగుతుం డటంతో ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా పోయింది.
 
డ్రెడ్జింగ్‌ తప్పనిసరి
జల రవాణాను అభివృద్ధి చేసే మార్గాల్లో 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు డ్రైడ్జింగ్‌ చేయాల్సివుంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. కోస్టల్‌ కన్సల్టెట్స్‌ కార్గోరైట్స్‌, ఐఎంఎస్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పనులను దక్కించుకున్నాయి. ఈ మార్గంలో బోట్లు రాకపోకలు సాగించడానికి నది లోతు కనీసం 2.2 మీటర్లు ఉండాలి. ముక్త్యాల నుంచి విజయవాడ దుర్గాఘాట్‌ వరకు నదిలోని కొన్ని ప్రదేశాల్లో ఇసుకమేటలు వేసి ఉంది. దీన్ని తొలగించాల్సివుంది. 82 కిలోమీటర్ల దూరంలో ఎక్కడెక్కడ డ్రెడ్జింగ్‌ చేయాలన్న దానిపై ఈ రెండు కంపెనీలు సర్వే చేస్తాయి. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తాయి.
Link to comment
Share on other sites

జాతీయ జలరవాణా’కు శ్రీకారం నేడు

ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా కార్యక్రమం

తొలిదశలో ముక్త్యాల- విజయవాడ మార్గం అభివృద్ధి

ఈనాడు - అమరావతి

జాతీయ ఉపరితల జల రవాణా మార్గం-4 అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ముక్త్యాల-విజయవాడ మధ్య కృష్ణా నదిలో చేపడుతున్న తొలి దశ ప్రాజెక్టు పనుల్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొంటారు. ముక్త్యాల-విజయవాడ మధ్య కృష్ణా నదిలో 82 కి.మీ. మేర నేవిగేషన్‌ ఛానల్‌ (నౌకలు ప్రయాణించే కాలువ) తవ్వకం పనులు, టెర్మినళ్ల నిర్మాణాన్ని తొలి దశలో చేపడుతున్నారు. రెండో దశలో విజయవాడ నుంచి కాకినాడ వరకు నావిగేషన్‌ కాలువల అభివృద్ధి పనులు చేపడతారు. రెండో దశలో కాకినాడ కాలువ (కాకినాడ నుంచి రాజమండ్రి వరకు), ఏలూరు కాలువ (రాజమండ్రి నుంచి ఏలూరు), కృష్ణా-ఏలూరు కాలువ (ఏలూరు నుంచి విజయవాడ), గోదావరి నదిలో రాజమండ్రి నుంచి పోలవరం వరకు పనులు చేపడతారు. మొదటి, రెండు దశల్లో అభివృద్ధి చేసే మొత్తం కాలువల పొడవు 315 కి.మీ.లు. రెండు దశల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7,015 కోట్లు. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

తొలి దశ పనులు ఇప్పటికే మొదలు..!

ఫేజ్‌-1 ప్రాజెక్టు కోసం భారత జల మార్గాల అభివృద్ధి సంస్థ (ఐడబ్ల్యూఏఐ) ఇప్పటికే రూ.98 కోట్లు మంజూరు చేసింది. దీనిలో రూ.48.96 కోట్లు డ్రెడ్జింగ్‌ పనులకు, రూ.43.05 కోట్లు టెర్మినళ్ల నిర్మాణానికి, రూ.1.89 కోట్లు నేవిగేషన్‌ పరికరాలకు, రూ.1.55 కోట్లు ఇతర అవసరాలకు వెచ్చిస్తారు. ముక్త్యాల-విజయవాడ మధ్య కృష్ణా నదిలో సుమారు 62 కి.మీ. మేర నేవిగేషన్‌ ఛానల్‌ తవ్వకం పనుల్ని మేలో అనధికారికంగా ప్రారంభించారు. ముక్త్యాల, చామర్రు మధ్య ప్రాంతాన్ని ఒక రీచ్‌గా, చామర్రు నుంచి హరిశ్చంద్రపురం వరకు ఒక రీచ్‌గా విభజించి రెండు సంస్థలకు డ్రెడ్జింగ్‌ పనులు అప్పగించారు. 2018 డిసెంబరు నాటికి ఫేజ్‌-1 ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. వెయ్యి టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన బార్జ్‌లు తిరిగేందుకు వీలుగా జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు.చామర్రు-హరిశ్చంద్రపురం రీచ్‌ పనుల్ని ఐఎంఎస్‌ షిప్పింగ్‌ సంస్థకు, చామర్రు-హరిశ్చంద్రపురం మధ్య రీచ్‌ని కోస్టల్‌ కన్సాలిడేటెడ్‌ స్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (సీసీఎస్‌ఎల్‌) సంస్థకు అప్పగించారు.

నేడు గడ్కరీ ‘పోలవరం’ పనుల పరిశీలన

కేంద్ర జాతీయ రహదారులు, జలవనరులు, ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటన నిమిత్తం విజయవాడకు వస్తున్నారు. గడ్కరీ పోలవరం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి మంగళవారం పరిశీలిస్తారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షిస్తారు. దీనికి ముందు పట్టిసీమ ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం 6.10 నిమిషాలకు భాజపా కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్లతో ఆరగంటపాటు సమావేశమవుతారు.

ఇదీ ప్రాజెక్టు..!

దేశంలోని వివిధ నదులు, ప్రధాన కాలువల్లో 111 జాతీయ ఉపరితల జల రవాణా మార్గాలు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఐదు పాతవే. 106 కొత్తగా గుర్తించినవి. ఐదు పాత మార్గాల్లో ఒకటి జాతీయ ఉపరితల జలరవాణా మార్గం-4. ఇది కాకినాడ నుంచి పుదుచ్ఛేరి వరకు 1078 కి.మీ. పొడవున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్ఛేరి మీదుగా వెళుతుంది. మొత్తం ఈ 1078 కి.మీ.లలో 888 కి.మీ.లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

Link to comment
Share on other sites

జల రవాణాకు వేళాయె!
 
 
636425948060477436.jpg
  • ముక్త్యాల-విజయవాడ మధ్య తొలిగా..
  • 87 కిలోమీటర్ల మేర ఓడ ప్రయాణం
  • రెండో దశలో కాకినాడ -బెజవాడ మధ్య
  • నేడు విజయవాడలో గడ్కరీ శంకుస్థాపన
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కలిసి మొత్తం
  • 4.5 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
అమరావతి, న్యూఢిల్లీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు పరుగులు తీయనున్నాయి. అంతర్గత జల రవా ణా వ్యవస్థ పునరుజ్జీవనం పొందనుంది. అందులోభాగంగా కృష్ణానదిపై ముక్త్యాల- విజయవాడ జల మార్గం ఏర్పాటు పనులకు కేంద్ర జలరవాణా, జ లవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన జరపనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన వస్తువులను వేగంగా చేరవేయడానికి ఈ జలమార్గం ఎంతో ఉపయుక్తం కానుంది. అలాగే, రూ. 4, 468 కోట్ల విలువైన పలు రహదారులు, జల మార్గాల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి గడ్కరీ చేపట్టనున్నారు. ఇందులోభాగంగా రూ. 1,928.56 కోట్ల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టుకు (415 కిలోమీటర్లు), రూ. మరో 2589.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు (250 కిలోమీటర్లు) శిలాఫలకం వేయనున్నారు. అనంతరం తొలి అనుసంధాన ప్రయత్నం పట్టిసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌లతో కలిసి వారు సందర్శించి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు.
 
తొలి అడుగు..
కృష్ణా నదిపై ముక్త్యాల- విజయవాడ మొదటి దశ జలమార్గానికి గడ్కరీ శిలాఫలకం వేస్తారు. 82 కిలోమీటర్ల మేర ఓడ ప్రయాణానికి వీలుగా ఈ జలమార్గాన్ని జూన్‌ 2019 నాటికి సిద్ధం చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే ఒకమేరకు పనులు మొదలు కాగా, గడ్కరీ రాకతో అవి మరింత ఊపందుకోనున్నాయి. దీనిపై మంగళవారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక.. జలమార్గం రెండో దశలో కాకినాడ నుంచి విజయవాడ దాకా నౌకాయానానికి అనువుగా కాలువలను సిద్ధం చేస్తారు. ఈ రెండు దశలకూ రూ.715 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
 
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం, కేంద్రం 51 శాతం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భూమిని పెట్టుబడిగా పెడుతుంటే .. కేంద్రం ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని భరిస్తుంది. ముక్త్యాల నుంచి విజయవాడ దాకా జల రవాణాలో మూడు కార్గో, పాసింజర్‌ టెర్మినళ్లను నిర్మిస్తారు. ముక్త్యాల, హరిశ్చంద్రపురం, ఇబ్రహీం పట్నం వద్ద ఈ కార్గో, పాసింజర్‌ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా పర్యాటక రంగం కింద 4 టెర్మినళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ పర్యాటక టెర్మినళ్లు విజయవాడ దుర్గాఘట్‌, అమరావతి, భవానీ ఐలాండ్స్‌, ముక్త్యాల సమీపంలోని వేదాద్రి ఆలయం వద్ద ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే, నౌకాయానానికి వీలుగా కృష్ణా నదిలో డ్రెడ్జింగ్‌ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో.. తాత్కాలిక టర్మినల్‌ సౌకర్యాల పనులు జూన్‌ 2018లోగా, శాశ్వత టర్మినల్‌ పనులు జూన్‌ 2019 నాటికి పూర్తి కావాలని కేంద్రం నిర్దేశించింది.
 
నిధులపై స్పష్టత
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్‌ గడ్కరీకి ఇటీవలి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా జల వనరుల శాఖ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఆయన ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయి.. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షను నిర్వహించారు. ఈ సమయంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించి .. సమీక్షించాలంటూ ఆయనను సీఎం ఆహ్వానించారు. అందుకు గడ్కరీ అంగీకరించారు.
 
ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు గడ్కరీ, చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బృందం ఒక హెలికాప్టర్‌లోనూ .. అధికారుల బృందం మరో హెలికాప్టర్‌లోనూ పట్టిసీమ డెలవరీ సిస్టమ్‌ వద్దకు వెళ్తారు. గోదావరి- కృష్ణా నదులను అనుసంధానం చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గడ్కరీ సమీక్షిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు పోలవరం ఎత్తిపోతల పథకాలను ఏరియల్‌ సర్వేద్వారా సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.20 గంటలకు పోలవరం హెడ్‌వర్క్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం 2.15 నిమిషాలపాటు అధికారులతో సమావేశమవుతారు. పోలవరం ఆలోచన దశ నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రస్థానాన్ని గురించి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. 2010-11లో రూ.2934.42 కోట్లుగా ఉన్న భూసేకరణ అంచనా .. 2013 చట్టం ఫలితంగా .. 33,858 కోట్లకు చేరిన వైనం వివరించనున్నారు.
 
హెడ్‌ వర్క్స్‌ పనులు రూ. 6,600.56 కోట్ల నుంచి రూ.11,637.98 కోట్లకు, కుడి ప్రధాన కాలువ వ్యయం రూ. 2,135.08 కోట్ల నుంచి రూ. 3,656.14 కోట్లకు, ఎడమ ప్రధాన కాలువ రూ.1,471.99 కోట్ల నుంచి 4,960.83 కోట్లకు, పవర్‌ హౌస్‌ వ్యయం రూ. 2,868.40 నుంచి రూ. 4205.66 కోట్లకు చేరుకుందని గడ్కరీ దృష్టికి తీసుకురానున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసేకరణలో సహాయ, పునరావాస కార్యక్రమాలను అమలు చేస్తుండటం వల్ల.. నిర్వాసితుల నుంచి నిరసన రావడం లేదని పశ్చిమ గోదావరి కలెక్టర్‌ భాస్కర్‌ తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ వ్యయమే అధికంగా ఉందని .. మిగిలిన ఇంజనీరింగ్‌ పనుల వ్యయం పెరుగుదలలో భారీ వ్యత్యాసం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. ఈ భేటీ వల్ల ప్రాజెక్టు నిధులపై స్పష్టత లభిస్తుందని భావిస్తున్నారు.
 
నిజానికి, సీఎంతో జరిగిన భేటీలో రూ.2829.47 కోట్లను చెల్లించేందుకు గడ్కరీ అంగీకరించారు. 2013-14 సవరించిన అంచనాలు రూ.58,319.06 కోట్ల రూపాయలపై అధ్యయనం చేసి 15 రోజుల్లోనే నివేదిక అందించాలంటూ కేంద్ర జల సంఘాన్ని ఆయన ఆదేశించారు. దీంతో .. సవరించిన అంచనాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా, గడ్కరీ తన పర్యటనలో భాగంగా విజయవాడలో సాయంత్రం 6.15 గంటల నుంచి బీజేపీ నేతలతో 45 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇదిలాఉండగా, కేంద్ర మంత్రి, ఉపరాష్ట్రపతిల పర్యటనను విజయవంతం చేయాలని రైతులకు మంత్రి దేవినేని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా పరిథిలోని రైతులందరూ పెద్ద ఎత్తున నితిన్‌గడ్కరీ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
Link to comment
Share on other sites

నాలుగో జాతీయ జలరవాణా మార్గానికి వెంకయ్య శంకుస్థాపన

636426289931891582.jpg


విజయవాడ: నాలుగో జాతీయ జలరవాణా మార్గానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడలో మంగళవారం ఉదయం వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే ఏడు హైవేల విస్తరణ, అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు. రూ. 7015 కోట్లతో 315 కి.మీ జాతీయ జలరవాణా ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ పనులకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

కలవరపెడుతున్న.. జల రవాణా
 
 
636429627028435328.jpg
  • కృష్ణా జిల్లా వైపు నీళ్లు రావంటున్న రైతులు
  • ఎత్తిపోతల పథకాలు మూతపడతాయని ఆందోళన
  • సప్లయ్‌ చానల్‌ ఏర్పాటు చేయాలంటున్న రైతు నాయకులు
విజయవాడ - ముక్త్యాల జల రవాణా మార్గం ఎత్తిపోతల పథకాల రైతులను కలవరపెడుతోంది. జల రవాణా కోసం గుంటూరు జిల్లా అమరావతి వైపు ప్రత్యేకంగా కాల్వ ఏర్పాటు చేయటం వల్ల కృష్ణా జిల్లా వైపు నదిలో నీళ్లు ఉండవని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లోని తాగు, సాగునీటి ఎత్తిపోతల పథకాలు మూతబడతాయని రైతులు వాపోతున్నారు.
 
కంచికచర్ల: కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో 25 సాగునీటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా వేలాది ఎకరాకు సాగునీరు అందుతోంది. మూడు నాలుగు దశాబ్ధాల క్రితం వరకు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.. వర్షాకాలంలో సైతం వరదలు వస్తే తప్ప కృష్ణా జిల్లా వైపు నీటి ప్రవాహం ఉండటం లేదు. అంతా ఇసుక మయంతో ఎడారిని తలపిస్తున్నది. నీటి ప్రవాహం గుంటూరు జిల్లా వైపు ఉంటోంది. సాగునీటి కోసం ఈ పథకాల రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
 
డ్రెడ్జింగ్‌తో నీళ్లు రావని ఆందోళన
రోడ్డు రవాణా కన్న ఖర్చు తక్కువగా ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జల రవాణాను తిరిగి అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే. దీనిలో భాగంగా ముక్త్యాల - విజయవాడ మధ్య కృష్ణానదిలో జల రవాణా మార్గం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పడవల రాకపోకలకు నదిలో కనీసం 2.2 మీటర్ల లోతు ఉండాలి. ఇందుకోసం నదిలో 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుందని అఽధికారుల అంచనా. ముక్త్యాల నుంచి ప్రారంభమయ్యే రవాణా మార్గం ఎక్కువగా గుంటూరు జిల్లా వైపు ఉంటుంది. ఈ మార్గం కోసం నదిలో డ్రెడ్జింగ్‌ వల్ల, ఇటువైపు వస్తున్న అరకొర నీళ్లు కూడా రావని రైతులు కలవరపడుతున్నారు. నీళ్ల కోసం ఇసుకలో కాల్వలు తీసినప్పటికీ ప్రయోజనం ఉండదని, సాగునీటి పథకాల మనుగడ ప్రశ్నార్ధకంగా తయారవుతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా వైపు డ్రెడ్జింగ్‌ చేస్తుండగా చందర్లపాడు మండలం రైతులు అడ్డుకున్నారు. పూడిక తీత వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని, సమీప భవిష్యత్తులో మేలు జరుగుతుందని కొందరు రైతు నాయకులతో పాటుగా నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్లు చెపుతున్నారు. జలరవాణాకు సంబంధించి నదిలో భారీ పడవల రాకపోకలకు నీటిమట్టం తగ్గకుండ చూడాల్సి ఉంటుందని, వేసవిలో సైతం ఒక లెవల్‌ తగ్గకుండ నీళ్లు ఉంటాయని అంటున్నారు. నదిలో నీటి మట్టం పెరగటం వల్ల సాగునీటి పథకాలకు నీటి ఎద్దడి ఉండదని అంటున్నారు. రైతులు అపోహ పడవద్దని చెపుతున్నారు.
 
సప్లయ్‌ చానల్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం
సాగునీటి పథకాల నిర్వహణ ఖర్చు రైతులకు తలకు మించిన భారంగా తయారైంది. నీటి ప్రవాహం గుంటూరు జిల్లా వైపు వెళుతున్నందున, ఇసుకలో కాల్వలు తీసేందుకు, సాగునీటి కోసం ఏయేటికాయేడు ఖర్చు లక్షల్లో అవుతున్నది. ఒక్కోసారి ఖర్చు భరించలేక రైతులు వదిలేస్తుండటంతో మాగాణి భూములు బీళ్లుగా పడి ఉంటున్నాయి. ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు ఏర్పడిన సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. చందర్లపాడు మండలంలో ఉస్తేపల్లి నుంచి నదిలో దిగువకు ప్రత్యేకంగా సప్లయ్‌ చానల్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏటూరు వరకు అధికారులు కూడా సర్వే చేసి చానల్‌కు రూ.4.5 కోట్లు అవసరమంటూ గత ఏడాది అంచనాలు కూడా రూపొందించారు. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లో ఎత్తిపోతల పథకాల మనుగడ కాపాడేందుకు నదిలో సప్లయ్‌ చానల్‌ ఒక్కటే శరణ్యమని రైతు నాయకులు పేర్కొంటున్నారు.
 
జల రవాణా మార్గం వల్ల నష్టం..
ముక్త్యాల - విజయవాడ జల రవాణా మార్గం ఏర్పాటు వల్ల నందిగామ నియోజకవర్గంలో కృష్ణానది వెంబడి 25 ఎత్తిపోతల పథకాలు మూలనపడతాయి. గుంటూరు జిల్లా వైపు నదిలో రవాణా మార్గం కోసం డ్రెడ్జింగ్‌ చేయటం వల్ల ఇటువైపు నీళ్లు రావు. చందర్లపాడు, కంచికచర్ల మండలాల వైపు సప్లయ్‌ చానల్‌ ఏర్పాటు చేసి రైతులకు సాగునీటి భరోసా కల్పించాలి.
- చుండూరు వెంకట సుబ్బారావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి
 
అపోహ మాత్రమే
 జల రవాణా మార్గం వల్ల నీళ్లు అందవన్నది కేవలం అపోహ మాత్రమే. అయితే ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ, ఐడీసీ ఇంజనీర్లు రైతులకు వాస్తవ పరిస్థితులు వివరించాలి. నదిలో కనీస నీటి మట్టం మెయింటెయిన్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఈ రెండు మండలాలకు చెందిననీటి పథకాలకు, రైతులకు ఉపయోగం తప్పితే ఎటువంటి నష్టం ఉండదు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
జలమార్గం.. రైట్‌ రైట్‌
04-12-2017 03:44:00
 
636479565466896262.jpg
  • ముక్త్యాల టు ప్రకాశం బ్యారేజీ...
  • 82 కి.మీ మేర కాలువ పనులు
  • 7 అడుగుల లోతున నిర్మాణం
  • 2 భాగాలుగా, 2 కంపెనీలకు...
  • 18 నెలల్లో పూర్తికి డెడ్‌లైను
  • త్వరలోనే పనులు ప్రారంభం
విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాలువల మీద ప్రయాణానికి అడుగులు పడుతున్నాయి. రద్దీ జీవితంలో కాస్తంత హాయిని, మరింత చల్లదనాన్ని ఆస్వాదించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు రహదారులు మోస్తున్న రవాణా ‘బరువు’బాధ్యతలనూ, ఇటు రోడ్డు, ట్రాక్‌ల మీద కిక్కిరిసిపోతున్న ప్రయాణికులనూ జలమార్గం పట్టించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. జలరవాణా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా నదిలో పడవల రాకపోకలకు కాలువ పనులకు శ్రీకారం చుడుతున్నారు.
 
దాదాపు 82 కిలోమీటర్ల మేర ఈ పనులు జరుగుతాయి. నిజానికి, కృష్ణా నదిలో వరద ఉన్నా, లేకపోయినా ఏడాది పొడవున నదీ భూగర్భం నుంచి ఉండే నీటి ఊటతో పాయలలో నీటి నిల్వలు ఉంటాయి. ఈ నీటి మట్టం అక్కడ ఉండే ఊటను బట్టి రెండు నుంచి అయిదారు అడుగుల వరకు ఉంటుంది. ఏడాది పొడవున జల రవాణా జరగాలంటే కనీస నీటిమట్టం 7 అడుగులు ఉండాలి. దీని కోసమే నదిలోని జలరవాణా మార్గంలో అడుగున 45 మీటర్లు, పైన 70 మీటర్ల వెడల్పు ఉండేలా కాల్వను నిర్మిస్తున్నారు. కాల్వ లోతు ఏడు అడుగులు ఉంటుంది. జలరవాణా మార్గాన్ని రెండు భాగాలుగా విభజించి రెండు కంపెనీలకు అప్పగించారు. 18 నెలల వ్యవధిలో ఈ కంపెనీలు తమ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
 
ప్రైవేటు బస్సుల తరహాలోనే....
జలరవాణా మార్గం నిర్వహణ బాధ్యతలు ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అఽథారిటీ చూస్తుంది. ఈ మార్గంలో ట్రాఫిక్‌ నిర్వహణ కూడాఆ సంస్థే చేపడుతుంది. జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసిన తరువాత ప్రైవేటు ఆపరేటర్లకు సరుకు, పాసింజర్ల రవాణాకు అవకాశం కల్పిస్తారు. రోడ్డు మీద తిరగటానికి ప్రైవేటు బస్సులు పన్ను చెల్లించినట్టు జల రవాణాకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
ఉభయతారకం
జలరవాణా మార్గం అటు సరుకు సరఫరా ఇటు ప్రయాణికుల రవాణాకు అనువుగా ఉండే విధంగా రూపొందిస్తున్నారు. ముక్త్యాల, హరిశ్చంద్రపురం, ఇబ్రహీంపట్నం, ప్రకాశం బ్యారేజీ వద్ద టెర్మినల్‌ పాయింట్లు ఉంటాయి. వీటిని సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ఉపయోగిస్తారు. సరుకు రవాణా కోసం తిరిగే పడవలను బార్జ్‌ లని పిలుస్తారు. ఒక్కో బార్జ్‌ 1000 టన్నుల వరకు తీసుకెళ్లగలదు. దీని వల్ల రోడ్‌ ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్యాసింజర్లను ఎక్కించుకునే నౌకలను క్రూయిజ్‌ లు అంటారు. వీటిలో పాసింజర్లు ఎక్కి, దిగడానికి వీలుగా వేదాద్రి, అమరావతి, భవానిపురం, దుర్గాఘాట్‌ వద్ద టెర్మినల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.
 
పనులు ఇలా..
ముక్త్యాల - అచ్చంపేట, అచ్చంపేట - హరిశ్చంద్రపురం మధ్య ఉన్న జలమార్గాలలో డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక మేటలు తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేస్తారు. ముక్త్యాల నుంచి ఇస్తేపల్లి వరకు పాయ ఉంది. ఈ పాయనే హరిశ్చంద్రపురం వరకు వెడల్పు చేసి లోతు తీస్తారు. పులిచింతల నుంచి నీటి విడుదల ఉన్నా, లేకపోయినా జలరవాణాకు ఇబ్బంది లేదు. నదిలోని పాయల అడుగున ఉండే జల ఊటలలో ఊరే జలం రవాణాకు సరి పోతుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో నదిలో కూడా జల ఊట తగ్గుతుంది. అయితే, మేటలు తొలగిస్తే ఊట సహజంగా పెరుగుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. పులిచింతల దిగువన ఉన్న మునేరు, పాలేరు, కట్టలేరులతో పాటు చిన్న చిన్న వాగులు, వంకల నుంచి వచ్చే నీరు నేరుగా నదిలోకి చేరడం వలన పాయల కింద ఉండే
ఊట పెరుగుతుంది.
Link to comment
Share on other sites

aa dredging chesina isukani gatlaki dooranga poyandra - lekapothe varshalaki malli venakki vasthundi

its a good step -  water storage peruguthundi - future lifts ki paniki vasthundi on guntur dt side

and more over - due to conditions, ee dredging periodically life long chesthu vundalisindhe

Edited by rk09
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...