Jump to content

Recommended Posts

Posted
On 2/27/2025 at 9:31 AM, Bezawada_Lion said:

 

Delhi part…I don’t agree. If forcibly made a hub, then there is no choice. But practically, Delhi is not the better option. 3 months a year severe delays due to poor visibility. Frequent delays for rest of the year. Being the capital, security is a risk.

If you remember post covid, Flights have to take a longer route around Pakistan as Indian Airlines are denied to use its Air route. We have to circle back around Pakistan and need to reach Delhi over Mumbai. Fuel costs skyrockted and also, US flights had to stop in Vienna for fueling. We suffered a lot during that time. Overall a horrible idea to Make Delhi as a hub.

There is a physical reason, Delhi is the hub and not Mumbai. It is the distance to West. Most flights to India from US go to Europe and from Europe travel to India via Russia, Iran etc. Because Delhi is at a higher latitude, its distance is shorter from Europe. At ultra-long haul, each additional hour matters. The plane has to carry the extra hour fuel for 12+ hours which requires more fuel.  When Pakistan restricts its airspace, then Mumbai may be closer. But it doesn't happen regularly.

Posted

విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌ కావాలి

విజయవాడ విమానాశ్రయంలో గతం కంటే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళనే స్పష్టత ఇచ్చింది.

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskUpdated : 04 Mar 2025 06:53 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

కృష్ణా పోలీసు నుంచి ప్రభుత్వానికి లేఖ
భావి అవసరాల దృష్ట్యా అత్యంత అవశ్యం
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గన్నవరం గ్రామీణం

amr03032025-4a.webp

ప్రముఖ ట్రావెల్స్‌ యజమాని ఒకరు ఇటీవల ఖరీదైన కారును విమానాశ్రయ పార్కింగ్‌ ప్రదేశంలో నిలుపుదల చేసి వారంపాటు విదేశాలకు తరలి వెళ్లారు. తిరిగి వచ్చి చూసుకుంటే పార్కింగ్‌లో కారు మాయమైంది. ఆవరణలో భద్రత డొల్లగా మారింది.  

విజయవాడ విమానాశ్రయంలో గతం కంటే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళనే స్పష్టత ఇచ్చింది. దీనికితోడు రాజధాని పునర్నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రభావం విమానాశ్రయం రద్దీపై పడింది. దీంతో విజయవాడకు సాధారణ ప్రయాణికులతోపాటు వీఐపీల రాకపోకలు పెరిగాయి. ఈనేపథ్యంలో భద్రత దృష్ట్యా ప్రత్యేక పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై కృష్ణా పోలీసు నుంచి ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. 

నెలకు లక్ష మంది పైగా...

రాజధాని అమరావతిలో కీలకంగా మారిన విమానాశ్రయం దినాదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో.. భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి నుంచి నిత్యం 50 వరకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రత్యేక విమానాలు సగటున రోజుకు మూడు రాకపోకలు సాగిస్తున్నాయి. 2024 జూన్‌కు ముందు నెలకు 70 వేల మంది ప్రయాణిస్తుండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య నెలకు 1.10 లక్షల వరకు పెరిగింది. మూడేళ్లలో మొదటి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మున్ముందు మరింత పెరిగే వీలుంది. 

ప్రత్యేక ఠాణా అవసరం...

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విమానాశ్రయంలో ప్రత్యేక పోలీసు స్టేషన్‌ అవసరం ఉంది. ప్రస్తుతం గన్నవరం సీఐ పర్యవేక్షిస్తున్నారు. దీనిని విభజిస్తే గన్నవరం పీఎస్‌పై ఒత్తిడి తగ్గుతుంది. విమానాశ్రయ కేసులు నేరుగా ఈ ఠాణాకే వస్తాయి. వీఐపీల భద్రత కూడా ఈ స్టేషన్‌ పరిధిలోకే వస్తుంది. 

విమానాశ్రయం ఆవరణలో చోటుచేసుకునే ఘటన, నేరం, ప్రముఖుల రాకపోకల సమయంలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన కేసులపై గన్నవరం పోలీసులు దృష్టి సారించడం కష్టంగా మారింది. దాదాపు 40 వేల జనాభా కలిగిన గన్నవరంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని 23 గ్రామాల్లోని కేసుల భారం ఈ స్టేషన్‌పైనే పడుతోంది. నిత్యం రద్దీగా ఉండే గన్నవరం స్టేషన్‌ సిబ్బంది విమానాశ్రయ బాధ్యతలు చూడటం కత్తిమీద సాములా మారింది. గతంలో పలుమార్లు తమకు ప్రత్యేక స్టేషన్‌ కేటాయించాలని విమానాశ్రయాధికారులు సలహా, అభివృద్ధి మండలి సమావేశాల్లో పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అయినా నేటికీ విమానాశ్రయ ఆవరణలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ ప్రకటనలకే పరిమితమైంది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ప్రయోజనం కలుగుతుంది. 

 
  • sonykongara changed the title to Vijayawada International Airport
  • 2 weeks later...
Posted

జామ్‌జామ్‌గా జంబో..!

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:45 AM

 

భారీ విమాన రాకపోకలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ విమానాల సంఖ్య పెరగడంతో అందుకు తగ్గట్టుగానే ఆక్యుపెన్సీ నిష్పత్తి కూడా వృద్ధి చెందింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విస్తరించిన రన్‌వే కారణంగా ప్రస్తుతం భారీ విమానాల రాకపోకలకు మార్గం ఏర్పడింది.

జామ్‌జామ్‌గా జంబో..!
విజయవాడ విమానాశ్రయంలో భారీ విమానం

 

విజయవాడ విమానాశ్రయం నుంచి భారీ విమానాల రాకపోకలు

ఎనిమిది నెలల్లో ఎనిమిది భారీ విమానాలు

రోజూ ఎయిర్‌బస్‌ 5, బోయింగ్‌ 3.. పెరిగిన ఆక్యుపెన్సీ

ఢిల్లీ, ముంబయి ప్రయాణికులకు ఉపయుక్తంగా..

బెంగళూరు, హైదరాబాద్‌, వైజాగ్‌కు బోయింగ్‌

విమానాలకు అనుకూలంగా మారిన కొత్త రన్‌వే

 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ విమానాలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిర్‌బస్‌, బోయింగ్‌ విమానాలు పోటీలు పడుతూ తిరుగుతున్నాయి. గతంలో ఒకటి, రెండు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఎనిమిది భారీ విమానాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 37 నుంచి 50కు విమానాల సంఖ్య పెరిగింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా భారీ విమానాల సంఖ్య కూడా పెరిగింది. 750 ఎకరాలను ఏఏఐకు ఇవ్వటంతో అదనంగా రన్‌వేను విస్తరించటానికి అవకాశం ఏర్పడింది. భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఏఏఐ అధికారులు మరో 1,075 మీటర్ల మేర రన్‌వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2018 మధ్యకాలంలో నూతన రన్‌వే పనులు శరవేగంగా జరిగాయి. ఫలితంగా మొత్తంగా 3,360 మీటర్ల రన్‌వే ఏర్పడింది. అంటే 11,023.62 చదరపు గజాల మేర విస్తరణ జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. ఈ క్రమంలో బోయింగ్‌-747, బోయింగ్‌-777, బోయింగ్‌-787 విమానాలు కూడా ల్యాండ్‌ కావటానికి వీలు కలిగింది.

రోజూ 8 భారీ విమానాల రాకపోకలు

విమానాశ్రయంలో ఒకేసారి 15 విమానాలను పార్కింగ్‌ చేసేలా పార్కింగ్‌ బేలను సిద్ధం చేశారు. ప్రస్తుతం శాశ్వత అవసరాల ప్రాతిపదికన దేశీయ, అంతర్జాతీయ నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ (ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌)ను నిర్మిస్తున్న సంగతి తెలిసింది. దీని పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ టెర్మినల్‌కు అనుసంధానంగా ఆఫ్రాన్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ ఆఫ్రాన్‌లో ఒకేసారి ఆరు భారీ విమానాలను నిలిపే అవకాశం ఉంది. దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. భారీ విమానాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఈ నూతన ఆఫ్రాన్‌ను సిద్ధం చేస్తున్నారు.

రన్‌వేను విస్తరించడం వల్లే..

విజయవాడ విమానాశ్రయం భారీ విమానాలు ల్యాండింగ్‌ కావటానికి వీలుగా రన్‌వే పటిష్టతతో పాటు విస్తరణ పనులు కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 2017లో అప్పటికి ఉన్న 1,685 మీటర్ల రన్‌వేను భారీ విమానాలు దిగేందుకు వీలుగా అభివృద్ధిపరచటంతో పాటు అదనంగా 600 మీటర్ల మేర రన్‌వేను విస్తరించారు. ఫలితంగా మొత్తం 2,285 మీటర్ల పొడవున రన్‌వే విస్తరించింది. దీనివల్ల ఎయిర్‌బస్‌-321 అనే పెద్ద విమానాలు ల్యాండింగ్‌ అయ్యే స్థాయికి విమానాశ్రయం చేరుకుంది. ఆ తర్వాత భూ సేకరణ జరిపి

భారీ విమానాలు ఇవే..

విజయవాడ విమానాశ్రయం నుంచి రోజూ 8 భారీ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఐదు ఎయిర్‌బస్‌, మూడు బోయింగ్‌ విమానాలు ఉన్నాయి. ఎయిర్‌బస్‌లలో ఏ321, ఏ330, ఏ380 రకాలు ఉంటాయి. ఇవన్నీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కావటానికి అవకాశం ఉంది. ఎయిర్‌బస్‌ ఏ321లో 150 నుంచి 180 మంది ప్రయాణించవచ్చు. ఏ330లో 250 నుంచి 300 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్‌బస్‌ ఏ380లో 500 నుంచి 850 మంది ప్రయాణించవచ్చు. వీటిలో ఎయిర్‌బస్‌ ఏ321 విమానాలు ప్రస్తుతం మన దగ్గర రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిరిండియా సంస్థ ఢిల్లీకి మూడు విమానాలు నడుపు తోంది. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో ముంబయికి రెండు నడుస్తున్నాయి. ఎయిర్‌బస్‌లతో పోల్చుకుంటే పరిమాణం రీత్యా బోయింగ్‌ విమానాలు పెద్దగా ఉంటాయి. ఈ విమానాల్లో బి737, బీ777, బీ787 విమానాలు ఉంటాయి. బోయింగ్‌ 737లో 130 నుంచి 220 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్‌ 777లో 300 నుంచి 400 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్‌ 787లో 240 నుంచి 330 మంది ప్రయాణించవచ్చు. ఈ బోయింగ్‌ శ్రేణి విమానాలన్నీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యేలా రన్‌వేను సిద్ధం చేశారు. ప్రస్తుతం మన దగ్గర బోయింగ్‌ 737 విమానాలు నడుస్తున్నాయి. ఈ విమానాలు బెంగళూరుకు 1, హైదరాబాద్‌కు 1, విశాఖపట్నానికి 1 చొప్పున నడుస్తున్నాయి. వీటిని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నడుపుతోంది.

Posted

𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐰𝐚𝐝𝐚 𝐭𝐨 𝐌𝐚𝐝𝐮𝐫𝐚𝐢 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐅𝐥𝐢𝐠𝐡𝐭 𝐟𝐫𝐨𝐦 𝐌𝐚𝐫𝐜𝐡 30th 📍 Via Bangalore (30-min halt, no aircraft change) 🔹 Total travel time: 3hr 40min 🔹 Vijayawada Dep: 17:40 | Madurai Arr: 21:20

Posted

Sep 2025 nunchi three days Amsterdam to Hyderabad KLM flight 3 days/ week schedule icharu. 
 

Oka 2 days Vijayawada ku kuda isthe saripotundi 😀 Vijayawada to major US cities one stop lo vellachu with less waiting time. 

Posted
2 hours ago, srikanthnarne said:

Sep 2025 nunchi three days Amsterdam to Hyderabad KLM flight 3 days/ week schedule icharu. 
 

Oka 2 days Vijayawada ku kuda isthe saripotundi 😀 Vijayawada to major US cities one stop lo vellachu with less waiting time. 

EU nunchi travel is very painful…especially US Visa based travellers ki.  

Posted
5 hours ago, Bezawada_Lion said:

EU nunchi travel is very painful…especially US Visa based travellers ki.  

Yeah, we can travel with expired US visa from US to India via Paris and Amsterdam only. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...