Jump to content

Recommended Posts

Posted

Vijayawada: దేశమంతా ఎగిరేలా.. విజయవాడ విమానాశ్రయానికి పూర్వ వైభవం

విజయవాడ విమానాశ్రయానికి మళ్లీ పాత రోజులొచ్చాయి. 2019కి ముందు ఎంత కళకళలాడేదో.. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. దేశంలోని అన్ని నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా కొత్త సర్వీసులు ఆరంభిస్తున్నారు.

Updated : 21 Sep 2024 07:15 IST
 
 
 
 
 
 

వచ్చే నెలలో పుణె, విశాఖకు కొత్త సర్వీసులు
అన్ని నగరాలకూ నడపాలనే లక్ష్యంతో చర్యలు

AMR21927-1A.jpg

ఈనాడు, అమరావతి: విజయవాడ విమానాశ్రయానికి మళ్లీ పాత రోజులొచ్చాయి. 2019కి ముందు ఎంత కళకళలాడేదో.. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. దేశంలోని అన్ని నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా కొత్త సర్వీసులు ఆరంభిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొలువుదీరిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పునర్వైభవం రావడంతో విజయవాడ విమానాశ్రయం కీలకంగా మారింది. గత మూడు నెలల్లోనే ముంబయి, దిల్లీ, బెంగళూరుకు నాలుగు సర్వీసులు కొత్తగా ఆరంభమయ్యాయి. వచ్చే నెలలో పుణెకు ప్రారంభం కానుంది. విశాఖకు కూడా నిత్యం సర్వీసులు నడపబోతున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చే సర్వీసే ఉదయం, రాత్రి విజయవాడ మీదుగా విశాఖకు వెళుతోంది.

రికార్డు స్థాయికి ఎదిగి..

విజయవాడ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఏ ప్రాంతానికి ప్రారంభించినా ఆక్యుపెన్సీకి లోటు ఉండదని ఇప్పటికే అనేకసార్లు స్పష్టమైంది. షిర్డీ, వారణాశి, ముంబయి, దిల్లీ ఇలా ఏ నగరానికి కొత్తగా ఆరంభించినా ఆక్యుపెన్సీ 80 శాతానికి పైగానే ఉండేది. 2014 వరకూ ఏడాదికి కనీసం రెండు లక్షలు కూడా లేని ప్రయాణికుల రద్దీ 2018కి వచ్చేసరికి అమాంతం పెరిగి ఏటా 12లక్షలు రాకపోకలు సాగించే స్థాయికి ఎదిగింది. దేశంలోని ఒక్కో నగరానికి సర్వీసులను ఏర్పాటు చేసుకుంటూ రావడంతో ఆ నాలుగేళ్లలో దేశంలోనే అత్యధిక ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయంగా విజయవాడ రికార్డు నెలకొల్పింది.

వైకాపా హయాంలో దయనీయం..

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో గన్నవరం పరిస్థితిని అత్యంత దయనీయంగా మార్చేశారు. 2019 వరకూ ఇక్కడి నుంచి నిత్యం 60కు పైగా సర్వీసులు.. నెలకు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. దేశంలోని హైదరాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కొచ్చి, వారణాశి, షిర్డీతో పాటు రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, కడప సహా 11 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడిచేవి. ఉదయం 7.45 నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఒక దేశీయ సర్వీసు ఇక్కడి నుంచి ఉండేది. అలాంటిది 2023కు వచ్చేసరికి ఒక్కో నగరానికి ఆపేస్తూ కేవలం 34 సర్వీసులకు తగ్గించేశారు.

నాలుగు ఉమ్మడి జిల్లాలకు కీలకం..

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు విజయవాడే కీలకం. గత ఐదేళ్లలో ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయి.. నెలకు 80 వేలు కూడా ఉండేవారు కాదు. తాజాగా మళ్లీ కొత్త సర్వీసుల రాకతో ప్రయాణికులు నెలకు లక్షకు పైగా పెరిగారు. దేశంలోని అన్ని నగరాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు నడిపినా ఆక్యుపెన్సీకి కొదవ లేదంటూ ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

దుబాయ్, సింగపూర్‌కు

ప్రస్తుతం షార్జాకు మాత్రమే వారానికి రెండు రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులను ఆరంభించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఈ రెండు దేశాలకు సర్వీసులు ఆరంభమైతే.. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా అక్కడి నుంచి తేలికగా చేరుకునేందుకు వీలుంటుంది.

ఆ రెండు దేశాలకు సర్వీసులొస్తే ..

విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్‌ దేశాలకు రోజువారీ అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే చాలని.. ఏళ్ల తరబడి వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. 2018లో అప్పటి చంద్రబాబు సర్కారు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఏ) విధానంలో సింగపూర్‌కు సర్వీసులను నడిపింది. ఆరంభం దగ్గర నుంచి సింగపూర్‌ సర్వీసులు 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడిచాయి. ఆరు నెలలు నడిపాక జగన్‌ సర్కారు 2019లో వచ్చిన వెంటనే ఆపేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ సర్వీసుల ఊసే లేదు.

ఒక్కో నగరానికి పునరుద్ధరిస్తూ..

మళ్లీ ఒక్కొక్క నగరానికి  సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ముంబయికి ప్రారంభించారు. దిల్లీ, బెంగళూరు సహా అన్ని నగరాలకు సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. 2019కి ముందు దిల్లీకి 4సర్వీసులు ఉండగా వాటిని తర్వాత రెండుకు తగ్గించేశారు. ప్రస్తుతం దిల్లీకి కొత్త సర్వీసులు ఆరంభిస్తున్నారు. వారం కిందట దిల్లీకి మరో కొత్త సర్వీసు ఆరంభించారు. పుణేకు వచ్చేనెల విమానం ఎగరనుంది.

 
Posted

Dubai ki Indigo, Air India kaakunda, Emirates tho maatlaadi service start chestey, it will be huge….Daily kaakapoina, 3-4 days a week services vunna chaalu….Kummuthaaru NRI’s. Every major Europe/North American cities and even Australasia ki connections with cheap price and shorter time dorukutai. It opens the world to VJA and Nellore, Prakasam, Guntur, Krishna, West, East, Nalgonda and Khammam districts as well. Will be huge boost for VJA new terminal building. 

  • 2 weeks later...
Posted

ఏపీని కార్గో హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

వ్యవసాయం, ఆక్వా, ఫిషరీస్‌ రంగాలపై ప్రత్యేక దృష్టి

మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి సురేశ్‌ కుమార్‌

 

అమరావతి/విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్గో సేవలను విస్తరిస్తామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రధాన కార్యదర్శి సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. కార్గో సేవల రంగంలో ఏపీని హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు, ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్సు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఆర్గనైజేషన్స్‌, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ‘స్టేక్‌ హోల్డర్స్‌ కన్సల్టేషన్‌’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సురేశ్‌కుమార్‌ హాజరయ్యారు. రాష్ర్టాన్ని వ్యవసాయం, ఆక్వా, ఫిషరీస్‌, హెల్త్‌ తదితర సెక్టార్ల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్గో సేవల విస్తరణలో కనెక్టివిటీ సదుపాయం ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఐదు పోర్టులు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలకు తోడు కొత్త ఎయిర్‌పోర్టులు కూడా అందుబాటులోకి వస్తే కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. కొత్తగా కుప్పం, మూలపేట తదితర ప్రాంతాల్లో పరిశ్రమ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ క్లస్టర్లలో వ్యవసాయోత్పత్తులు, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆరోగ్య రంగం సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఉద్యానవనశాఖ, ఆక్వాకల్చర్‌, ఫిషరీస్‌ కార్యదర్శి బాబు మాట్లాడుతూ క్లస్టర్‌ ఆధారిత విధానంతో సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఏ రంగంలోనైనా ఎగుమతులను పెంచడం సాధ్యమౌతుందన్నారు. ఇండస్ర్టీస్‌, కామర్స్‌ అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఏపీఏడీసీఎల్‌ ఎండీ సీవీ ప్రవీణ్‌ మాట్లాడుతూ ఏపీని కార్గో హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళుతోందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సర్వీసులు పెంచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిపారు. కార్గో బిల్డింగ్‌ విస్తరణకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సుముఖంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ సీఈఓ అజయ్‌ కుమార్‌, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అండ్‌ ప్లానింగ్‌ (జీఎంఆర్‌ గ్రూప్‌) కార్గో కమర్షియల్‌ హెడ్‌ జె.ప్రసాద్‌, ఎయిర్‌పోర్ట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.నాగమల్లేశ్వరరావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఎం.రమేష్‌, గరుడవేగ సీఈఓ ఎల్‌.సతీష్‌, ఏపీఎంబీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఏ షేక్‌, ఏపీఈడీబీ ఏవీపీ ప్రకాశ్‌లతో పాటు ఫార్మా, సీ ఫుడ్‌, ఏపీఈడీఏ, టెక్స్‌టైల్స్‌, ఫ్రూట్‌ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Posted

గన్నవరం విమానాశ్రయం.. శరవేగంగా ఇంటిగ్రేటెడ్‌ పనులు: ఎంపీ బాలశౌరి

గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు.

Published : 05 Oct 2024 13:58 IST
 
 
 
 
 
 

124181662_0510-bza.jpg

విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. వచ్చే జూన్‌ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్‌ హోదాలో ఎంపీ బాలశౌరి, వైస్‌ ఛైర్మన్‌ హోదాలో ఎంపీ కేశినేని శివనాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపునకు సంప్రదింపులు జరిపామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను జూన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేశినేని శివనాథ్‌ తెలిపారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా వారాంతపు రివ్యూలు నిర్వహిస్తామన్నారు.

Posted

2029 కల్లా న్యూయార్క్‌కు విమానం నడుపుతాం

2029 నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి విమాన సర్వీసు నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు విమానాశ్రయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.

Published : 06 Oct 2024 02:51 IST
 
 
 
 
 
 

త్వరలో నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిపై సమీక్ష

AMR-7A_19.jpg

సమావేశంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ (చిన్ని) కలెక్టర్‌ బాలాజీ, డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్పీ గంగాధరరావు తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: 2029 నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి విమాన సర్వీసు నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు విమానాశ్రయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన సలహా కమిటీ సమావేశంలో ఆయన కమిటీ వైస్‌ ఛైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), కలెక్టర్‌ డీకే బాలాజీ, డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్పీ గంగాధరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి ప్రముఖుల తాకిడి రోజురోజుకు మరింత పెరుగుతున్నందున వీలైనంత త్వరగా నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో ఆలస్యమైన టెర్మినల్‌ నిర్మాణ పనులను ముందస్తుగా నిర్ణయించిన 2025 జూన్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలన్నారు. ముంబయి సర్వీసును అహ్మదాబాద్‌ వరకు, విశాఖ సర్వీస్‌ కోల్‌కతా వరకు పెంచడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి కోసం సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంకలకు సర్వీసులు నడపాలని కేంద్రం, విమానయాన సంస్థలను కోరినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి దుబయ్‌కు ఎమిరేట్స్‌ సర్వీస్‌ వస్తే యూకే, అమెరికా, ఇతర దేశాలకు ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యంగా ఉంటుందని కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. కమిటీ వైస్‌ ఛైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) మాట్లాడుతూ నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణ పనుల్లో వేగం మరింత పెంచాలని.. అవసరమైతే వారాంతపు సమీక్షలు నిర్వహించాలన్నారు. భద్రత నేపథ్యంలో విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గంగాధరరావు కమిటీని కోరారు.

image.jpeg.aa5eada395bea214d474ae9ecb438b01.jpeg

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన నమూనా

నిర్వాసితులు, ఇతర సమస్యల పరిష్కారం.. విమానాశ్రయ విస్తరణలో భాగంగా స్థలాలు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సత్వరమే నెరవేర్చాలని సలహా కమిటీ నిర్ణయించింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, ఏలూరు కాలువపై పైవంతెన నిర్మాణం, కాలువ మళ్లింపు, ప్రైవేట్‌ లేఔట్‌ బాధితులకు అజ్జంపూడిలో ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు సహా ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది

Posted

image.jpeg.c7ed4e96d755a80bc38dd4d6b935c344.jpeg

విజయవాడ నుంచి విశాఖకు మరో రెండు విమాన సర్వీసులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖకు మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Published : 15 Oct 2024 04:32 IST
 
 
 
 
 
 

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖకు మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి సర్వీసును ప్రారంభిస్తామని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటికే ప్రకటించగా.. ఇండిగో సంస్థ కూడా ఆ రోజు నుంచే విశాఖకు తమ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అక్కడ విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల రాకతో విజయవాడ-విశాఖ విమాన సర్వీస్‌ల సంఖ్య మూడుకు చేరనుంది.

Posted

Vijayawada: ఇంటిగ్రేటెడ్‌కు.. గుత్తేదారే గండం!

విజయవాడ విమానాశ్రయంలో రూ.470 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం పనులు గత ప్రభుత్వంలో తీవ్ర ఆలస్యమయ్యాయి. గుత్తేదారు సంస్థ నిర్లక్ష్యం వల్లే.. నాలుగేళ్లుగా పనులు మందకొడిగా సాగుతున్నాయి.

Updated : 21 Oct 2024 08:07 IST
 
 
 
 
 
 

విజయవాడ విమానాశ్రయంలో రెండేళ్లలో టెర్మినల్‌ను పూర్తిచేయాలనేది లక్ష్యం
నాలుగేళ్లయినా సగం పనులూ పూర్తి కాలేదు
పట్టించుకోకుండా వదిలేసిన జగన్‌ సర్కారు

ap201024main22a.jpg

కొలిక్కి రాని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన నిర్మాణం

ఈనాడు, అమరావతి: విజయవాడ విమానాశ్రయంలో రూ.470 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం పనులు గత ప్రభుత్వంలో తీవ్ర ఆలస్యమయ్యాయి. గుత్తేదారు సంస్థ నిర్లక్ష్యం వల్లే.. నాలుగేళ్లుగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2020 సెప్టెంబరులో ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు టెర్మినల్‌ పనులను అప్పగించారు. 2022 సెప్టెంబరు నాటికి భవనం అప్పగించాలని నిర్దేశించారు. నాలుగేళ్లయినా.. సగం పనుల్నీ పూర్తిచేయలేదు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు పెట్టడం.. ప్రతిసారీ గుత్తేదారును హెచ్చరించడం.. పనులు ముందుకు సాగక పోవడం.. ఇదే తంతు. విమానాశ్రయానికే తలమానికమైన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నా.. గుత్తేదారును మార్చకుండా.. ఎందుకు బతిమాలుతున్నారనేది ప్రశ్నార్థకం.

దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలన్నింటినీ అధునాతన సౌకర్యాలతో ఒకేచోట అందించేలా 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018 డిసెంబరులో అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ప్రకృతి విపత్తులకు తట్టుకునేలా స్టీలు, గ్లాస్‌ ఆకృతులతో నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం విమానాశ్రయంలో అంతర్జాతీయ, దేశీయ రాకపోకలకు వేర్వేరు టెర్మినల్‌ భవనాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.  

ap201024main22b.jpg

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నమూనా 

సంస్థ ఆర్థిక సమస్యల వల్లే..

ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో.. టెర్మినల్‌ను సకాలంలో పూర్తిచేయలేక పోతోంది. పూర్తయిన పనులకు భారత విమానయాన సంస్థ(ఏఏఐ) ఎప్పటికప్పుడు బిల్లుల్ని చెల్లిస్తోంది. అయినా పనుల్లో పాల్గొంటున్న ఉప గుత్తేదారులకు ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎన్నిసార్లు సమీక్ష సమావేశాలు పెట్టి, హెచ్చరిస్తున్నా పనుల పురోగతి లేదు. తాజాగా ఏఏఐ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టు జీఎంగా కె.రామాచారి బాధ్యతలు చేపట్టాక.. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత నెలలో విజయవాడకు వచ్చిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు.. గుత్తేదారు సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిగ్గా ఏడాదిలో నిర్మాణం పూర్తిచేయపోతే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.  

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు 

ఒకేసారి 1,200 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు ఆరంభించాలంటే పూర్తిస్థాయిలో దేశీయ, విదేశీ సేవలు నిర్వహించేలా పెద్ద టెర్మినల్‌ కావాలి. అది అందుబాటులోకొస్తే.. ఒకేసారి 400 మంది అంతర్జాతీయ, 800 మంది స్వదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు. ఇప్పుడున్న రెండు టెర్మినల్‌ భవనాల్లోనూ ఏరోబ్రిడ్జిలు లేవు. నూతన టెర్మినల్‌లో ఆరు ఏరోబ్రిడ్జిలు, 24 చెక్‌ఇన్‌ కౌంటర్లు, 14 ఇమ్మిగ్రేషన్, 4 కస్టమ్స్‌ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్‌ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ వ్యవస్థ, సెంట్రల్‌ ఏసీ, 24 గంటలూ సీసీటీవీ పర్యవేక్షణతో భద్రతా వ్యవస్థ వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.  

ఏటేటా పెరుగుతున్న రద్దీ 

విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఏటేటా పెరుగుతోంది. వచ్చే రెండు దశాబ్దాల అవసరాలకు తగ్గట్టుగా నూతన టెర్మినల్‌ను తలపెట్టారు. 2014కు ముందు ఏడాదికి లక్షన్నర మంది ఉన్న ప్రయాణికుల సంఖ్య...  2019 నాటికి 12 లక్షల మందికి చేరింది. ఇక్కడి నుంచి ఏ నగరానికి విమాన సర్వీసులను ఆరంభించినా.. ఆక్యుపెన్సీ 80 శాతం పైనే. 2017-18 మధ్య విమానాశ్రయం నుంచి 7.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తే.. 2018-19 మధ్య 12 లక్షలకు చేరారు. ఈ స్థాయిలో ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయం దేశంలోనే మరొకటి లేదు. జగన్‌ పాలనలో విమానాశ్రయం అభివృద్ధిని గాలికొదిలేశారు. పనులపైనా కనీస పర్యవేక్షణ లేదు. ఫలితంగా ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో.. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎన్నికలకు ముందు నెలకు 80 వేలలోపే ప్రయాణికులు ఉండగా.. తాజాగా సెప్టెంబరులో 1.20 లక్షలకు పెరిగారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 15 లక్షలు దాటే అవకాశం ఉందని విమానాశ్రయం డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి వెల్లడించారు.


నిత్యం పర్యవేక్షిస్తాం 

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం నిర్మాణం గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైంది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. కచ్చితంగా వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఇక నుంచి పనులపై నిత్య పర్యవేక్షణ ఉంటుంది. ఇందుకోసం ఓ వాట్సప్‌ గ్రూప్‌ను పెట్టాం. కేంద్రమంత్రి సహా అందరం అందులో ఉన్నాం. ప్రతిరోజూ పనుల పురోగతిని అందులో ఉంచాలని రామ్మోహన్‌నాయుడు సూచించారు. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయకపోతే మరో పెద్ద సంస్థకు అప్పగించాలని మంత్రికి నేను విజ్ఞప్తి చేశాను.

వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ, విమానాశ్రయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌

Posted

Vizag: రేపటి నుంచి విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 26 Oct 2024 13:11 IST
 
 
 
 
 
 

flight-123.jpg

విశాఖ: విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అక్కడ విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల రాకతో విజయవాడ-విశాఖ విమాన సర్వీస్‌ల సంఖ్య మూడుకు చేరనుంది.

Posted

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు సమీక్షించారు. న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కూచిపూడి థీమ్ తో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లు అంత ఆకర్షణీయంగా లేవని...నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి బిసి జనార్థన్ రెడ్డి, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పౌర విమానయాన అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, ప్రోగ్రెస్ ను వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 5 చోట్ల ఎయిర్ స్ట్రిప్ లు అందబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నామని ....పౌర విమాన యాన శాఖ అధికారులకు సీఎం తెలిపారు. మూలపేట, కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెంతో పాటు అనంతపురం- తాడిపత్రి మధ్యలో ఒక ఎయిర్ స్ట్రిప్ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...