Jump to content

Recommended Posts

Posted
మెడ్‌టెక్‌ మణిహారం!
14-12-2018 03:00:12
 
636803532137044994.jpg
  • సూది నుంచి సీటీ స్కాన్‌ దాకా.. అన్ని ఉపకరణాల తయారీ జోన్‌
  • కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన సీఎం
  • ఇక ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి
  • సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం
  • రికార్డు సమయంలో మొదటిదశ పూర్తి
  • మరిన్ని పెట్టుబడులు పెట్టండి
  • నిపుణుల సలహాల మేరకు మెరుగులు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
  • రెండో దశ నిర్మాణాలకూ శ్రీకారం
విశాఖపట్నం/గాజువాక, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ ప్రారంభమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల తయారీ సెజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబేతో కలిసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కలిసి వైద్య పరికరాల తయారీపై ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి సదస్సులో సీఎం ప్రసంగించారు. ఏపీ మెడికల్‌ టెక్నాలజీ పార్కు (ఏపీ మెడ్‌టెక్‌)ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘పేదలకు తక్కువ ధరలో ఆరోగ్య భాగ్యం అందాలి. నాణ్యమైన వైద్య పరికరాలు, కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, పూర్తిస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ పార్కును ఏర్పాటు చేశాం. దీనిని నెరవేర్చాలని కోరుతూ పార్కును జాతికి అంకితం చేస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు.
 
 
భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సదస్సుకు 90 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇచ్చిన సలహాలతో పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య పరికరాల తయారీపై ఇప్పటికి మూడు సదస్సులు నిర్వహించిందని... భారత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌కు 275 ఎకరాలు కేటాయించగా... మొదటి దశలో భాగంగా 80 ఎకరాల్లో కేవలం 342 రోజుల్లో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. ఇదో రికార్డు అని తెలిపారు. రెండో దశను కూడా ఏడాదిలో పూర్తిచేస్తామన్నారు.
 
 
విశాఖపట్నం పరిసరాల్లో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయని, ఐటీ పార్కులతో ఇన్నోవేషన్‌ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని, పెట్టుబడులతో తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల అనుమతులు సింగిల్‌ విండో విధానంలో ఇస్తామని... కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ వైద్య ఉపకరణాల తయారీ విధానం ప్రకారం రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పార్కును రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను, సీఈఓ జితేంద్రశర్మను సీఎం, చౌబే అభినందించారు.
 
 
బాబు బృందానికి అభినందనలు: చౌబే
దేశానికి అవసరమైన వైద్య పరికరాల్లో 25 శాతం చైనా నుంచి, 15 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి చౌబే తెలిపారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా ఈ పార్కులో రెండు ఇంకుబేషన్‌ సెంటర్లను కేంద్రమే సమకూర్చిందన్నారు. 342 రోజుల్లోనే మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేసిన చంద్రబాబు బృందానికి అభినందనలు తెలిపారు. సీఎం ప్రోత్సాహంవల్లే ఇది సాధ్యమైందని పూనం మాలకొండయ్య చెప్పారు.
 
ఇక్కడ ఏర్పాటైన 80 కంపెనీలు వచ్చే జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. మెడ్‌టెక్‌ జోన్‌లో 250 కంపెనీలు, 18 అత్యుత్తమ టెస్టింగ్‌ లేబరేటరీలు ఏర్పాటవుతాయని సీఈవో జితేందర్‌ శర్మ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఫరూక్‌, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి హెంక్‌ బెకెడాం, ప్రపంచ సదస్సు సమన్వయకర్త ఆండ్రియానా, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్‌కే వాట్స్‌, సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారీ, విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
 
మెడ్‌టెక్‌ ఫేజ్‌-2కు శంకుస్థాపన
మెడ్‌టెక్‌ పార్కు ఫేజ్‌-1ను ప్రారంభించిన చంద్రబాబు కేంద్రమంత్రి చౌబేతో కలిసి ఫేజ్‌-2 పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు 190 ఎకరాల స్థలంలో చేపట్టనున్నారు. మరో 170 సంస్థలు ప్రారంభించేందుకు వీలుగా ఈ ఫేజ్‌లో పనులు, భవన నిర్మాణాలు చేపడతారు. ఫేజ్‌-2 పనులకు అనుమతి రావడం, ఫేజ్‌-1 ప్రారంభం రోజునే శంకుస్థాపన చేయడంపై అందరూ ఆనందం వ్యక్తంచేశారు.
 
 
ల్యాబ్స్‌, సంస్థల ప్రారంభం
మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్‌, సంస్థలను కేంద్ర మంత్రితో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోబోనిక్‌ ఇండియా, ఫోరస్‌ హెల్త్‌, మాస్‌ మెడ్‌టెక్‌, గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌, ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌, రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, బయోసైన్స్‌ టెక్నాలజీస్‌, జైనా మెడిటెక్‌ వంటి సంస్థలను కూడా చంద్రబాబు పరిశీలించారు.
Posted
80 సంస్థలు... 342 రోజులు
14-12-2018 03:03:13
 
  • రికార్డు సమయంలో మెడ్‌టెక్‌ సిద్ధం
గాజువాక, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎనభై కంపెనీలు...ఉత్పత్తులను పరీక్షించే ల్యాబ్స్‌...రహదారులు...మంచినీటి సౌకర్యం...సోలార్‌ విద్యుత్‌తో కూడిన మెడ్‌టెక్‌ జోన్‌ ఫేజ్‌-1 మెగా ప్రాజెక్టును కేవలం 342 రోజుల రికార్డు సమయంలో పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు 19న మెడ్‌టెక్‌ జోన్‌కు శంకుస్థాపన చేసింది. సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులు జారీచేసింది. ఉన్న అధునాతన సాంకేతిక ఆధారంగా ఉత్పత్తులు తయారుచేసేందుకు ముందుకువస్తున్న సంస్థలకు స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతలో 18 రకాల ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వాటిని పరిశీలించిన వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల తయారీకి ముందుకువచ్చాయి.
 
ఇలా మొత్తం 80 సంస్థలు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వారికి మౌలిక వసతులు కల్పించడంతోపాటు రికార్డు సమయంలో భవనాలు నిర్మించి ఇచ్చారు. ఫేజ్‌-1లో ఉన్న అన్నిటినీ 342 రోజుల్లో పూర్తిచేశారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కలాం కన్వెన్షన్‌ సెంటర్‌ను 70 రోజుల్లోనే నిర్మించారు. తొలి ఫేజ్‌ అందుబాటులోకి రావడంతో రెండో ఫేజ్‌లో మరిన్ని సంస్థలు ముందుకువచ్చే అవకాశం ఉంది.
Posted
4 hours ago, sonykongara said:

శాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. #MyAPMyPride #APwithCBN

DuWc7p5V4AAhw4j.jpg

evaradi tappu, mana govt de tappu, mediani enduku moniter cheyatla, asalu tdp adikara prathindhulu evaro kuda teliyani paristhithi unidi, govt lo unte calm ga undali ani CBN strategy emo ........elane undamanandi antha assam ayyae daka.

 

Posted

@Ispate Raju IT saturated ani meeku telusu. So, creating a new industry hub altogether by CBN. IT lekapothe yenti...I can show many more opportunities in many other industries ani MedTech from scratch start chesadu CBN...and here it is right now with many companies

Posted
వైద్యపరికరాలపై సాంకేతిక బృందాల నిఘా
డబ్ల్యూహెచ్‌వోకు సూచించిన
  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
15ap-state5a.jpg

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లో నిర్వహిస్తున్న నాలుగో డబ్ల్యూహెచ్‌వో వైద్యపరికరాల ప్రపంచ సదస్సు శనివారం ముగిసింది. మూడ్రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సుకు 90 దేశాల నుంచి 1049 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డయోగ్నోస్టిక్స్‌ సేవలు వీలైనంత మందికి చేరడం, పేద, మధ్యతరగతి దేశాలకు సులువైన ఆక్సిజన్‌ సప్లయ్‌ వ్యవస్థ పెరుగుదల, వైద్యపరికరాలపై నియంత్రణ, విధానాల రూపకల్పన, ధరల తగ్గింపు, రోగులు/ఆరోగ్యసిబ్బంది భద్రత, రోగాల్ని వెంటనే గుర్తించే ఆధునిక పరిజ్ఞానం, వైద్యపరికరాలపరంగా ఉన్న సవాళ్ల మీద చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడ్‌టెక్‌ జోన్‌లో పరిశ్రమల స్థాపనలకు 10 ఒప్పందాలు కుదిరాయి. సదస్సుకు రాలేకపోయిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా.. ఓ లేఖరూపంలో తన సందేశాన్ని పంపారు. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్‌ భండారీ దాన్ని చదివి వినిపించారు. వైద్యపరికరాల నమోదు, తయారీ, పంపిణీ వ్యవస్థ చాలా కీలకమైనవని మంత్రి తెలిపారు. ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాల్ని ఏర్పాటు చేసి ఈ ప్రక్రియపై నిఘా పెట్టాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదన్‌ మాట్లాడుతూ వైద్యపరికరాలపై రెగ్యులేటరీ విధానాన్ని 2020 జనవరి నుంచి దేశంలో అమల్లోకి తెస్తామని తెలిపారు.

15ap-state5b.jpg

అంతర్జాతీయ ఆకర్షణగా మెడ్‌టెక్‌జోన్‌: పూనం
ప్రపంచ వైద్యపరికరాల తయారీ చరిత్రలో మెడ్‌టెక్‌జోన్‌కు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరెక్కడా లేని పూర్తిస్థాయి వసతులు ఇక్కడే సమకూరుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి, మెడ్‌టెక్‌జోన్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్య ‘ఈనాడు-ఈటీవీ’కి వివరించారు. జోన్‌ ద్వారా 24 వేల ఉద్యోగాలు లభ్యం కానున్నాయని ఇప్పటిదాకా 80 కంపెనీలు రిజిష్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.270 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రూ.120 కోట్లు అందించాయన్నారు. రెండో విడత పనుల్ని కూడా ఇప్పుడు ప్రారంభించుకున్నామని 200 కంపెనీలను తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 18 రకాల టెస్టింగ్‌ యూనిట్లను మెడ్‌టెక్‌జోన్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం..అమెరికాలోని బూస్టన్‌లో 7 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి రావడానికి అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గర్వంగా ఉంది: వీరేంద్ర సెహ్వాగ్‌
మెడ్‌టెక్‌జోన్‌కు గుడ్‌విల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నారు. సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన తన అనుభవాల్ని కూడా వివరించారు. అంతకుముందు సెహ్వాగ్‌, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి      ప్రీతి సుదన్‌ వేర్వేరుగా మెడ్‌టెక్‌ భవనాల్ని సందర్శించారు. డబ్ల్యూహెచ్‌వో వైద్యపరికరాల సీనియర్‌ సలహాదారు అడ్రియానా వెలక్వెజ్‌,  డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ టెక్నాలజీ ప్రతినిధి సుసెన్‌ హిల్డ్‌, భారత ప్రతినిధి హెంక్‌ బెకెడమ్‌, మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో జితేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు

Posted

మెడ్‌టెక్‌ జోన్‌కు అనుబంధంగా ఉన్న కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ (కేఐహెచ్‌టీ)తో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ఎమర్జెన్సీ కేర్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (ఈసీఆర్‌ఐ) ఒప్పందం కుదుర్చుకుంది. రోగుల ఆరోగ్య భద్రతపై ఈ సంస్థ పనిచేస్తోందని ఏఎంటీజెడ్‌ అధికారులు తెలిపారు.

DvA7EoFU8AAl-Hx.jpg
  • 1 month later...
  • 2 weeks later...
Posted
మెడ్‌టెక్‌ జోన్‌లో మ్యాగ్నెటిక్‌ కాయిల్స్‌ పరిశోధన కేంద్రం
06-02-2019 00:23:18
 
  • రూ. 25 కోట్ల విడుదలకు సూత్రప్రాయంగా ఆమోదం
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణం మెడ్‌టెక్‌ జోన్‌లో సూపర్‌ కండక్టింగ్‌ మ్యాగ్నటిక్‌ కాయిల్స్‌ పరీక్ష, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిధులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యకు రాసిన లేఖను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖలోని ఫార్మా విభాగం అండర్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ అందచేశారు. మెడికల్‌ డివైజ్‌ ఇండస్ట్రీ ఫర్‌ కామన్‌ ఫెసిలిటీ కేంద్రానికి ఆర్థిక సహకారం అందించే పథకం నుంచి రూ. 25 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు.
  • 5 years later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...