Jump to content

Recommended Posts

  • sonykongara changed the title to Andhra Pradesh Medtech Zone, Vizag.
Posted

మెడ్‌టెక్‌ జోన్‌లో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Jul 11 , 2024 | 01:26 AM

 

మెడ్‌టెక్‌ జోన్‌ చంద్రబాబునాయుడి మానస పుత్రిక. వైద్య రంగానికి అవసరమైన ఆధునిక పరికరాలు తయారుచేసేందుకు ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా పరిశ్రమ ఇదే మొదటిది. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో పూర్తిచేసి సీఎంగా ఆయనే ప్రారంభోత్సవం కూడా చేశారు. స్టీల్‌ప్లాంటు సమీపాన పెదగంట్యాడ మండలంలో సుమారు 270 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు రూ.500 కోట్లు వెచ్చించారు. కానీ ఆశించిన ప్రగతి లేదు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.

 
మెడ్‌టెక్‌ జోన్‌లో  ఇష్టారాజ్యం
 

 

 

 
 
 
 
 
 
 

 

 

 

ఐదేళ్లుగా అక్కడ ఆయన చెప్పిందే వేదం

ఎదురు మాట్లాడితే కంపెనీలకు తాళాలే

ఆడిటింగ్‌ లేదు...

ప్రచారం ఎక్కువ...పనితీరు తక్కువ

గాడిలో పెట్టకపోతే మరింత నిర్వీర్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మెడ్‌టెక్‌ జోన్‌ చంద్రబాబునాయుడి మానస పుత్రిక. వైద్య రంగానికి అవసరమైన ఆధునిక పరికరాలు తయారుచేసేందుకు ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా పరిశ్రమ ఇదే మొదటిది. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో పూర్తిచేసి సీఎంగా ఆయనే ప్రారంభోత్సవం కూడా చేశారు. స్టీల్‌ప్లాంటు సమీపాన పెదగంట్యాడ మండలంలో సుమారు 270 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు రూ.500 కోట్లు వెచ్చించారు. కానీ ఆశించిన ప్రగతి లేదు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.

మెడ్‌టెక్‌ జోన్‌కు అంకురార్పణ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆయన అదంతా తన సామ్రాజ్యంగా భావించి ఎవరినీ లెక్కచేయడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా ఆర్థిక వ్యవహారాలపై సరైన ఆడిటింగ్‌ లేదు. ఒప్పందాలను సమీక్షించే దిక్కు లేదు. ఎవరితో ఏ రకమైన ఒప్పందం జరుగుతున్నదో...ఆ తరువాత అది ఏమవుతున్నదో పట్టించుకునేవారు లేరు. సంస్థలను రప్పించడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పడం, పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం, ఆ తరువాత వాటిని అమలు చేయకపోవడం వల్ల అనేక సంస్థలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏ సంస్థ అయినా వారి హక్కులు గురించి మాట్లాడితే, వెంటనే ఆ కంపెనీకి తాళాలు వేయించి, వేధించడం వంటి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయంటే...పెట్టుబడిదారులతో ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి?, ఎంత టర్నోవర్‌ జరిగింది?, జోన్‌కు ఎంత లాభం వచ్చింది?, ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పించారు?...అనే విషయాలపై ఈ ఐదేళ్లలో ఎప్పుడు నోరు విప్పి మాట్లాడింది లేదు. నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. వేటిపైనా సరైన విచారణ జరగలేదు. వారం క్రితం కూడా ఓ సంస్థకు తాళాలు వేయించేశారు. ఎంతో నమ్మకంతో వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే గొడవపడి పెద్ద పెద్ద కేకలు వేస్తూ చెప్పుకోలేని విధంగా వ్యవహరిస్తున్నారని పెట్టుబడిదారులు వాపోతున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇస్తారో, ఎవరిని ఎందుకు తీసేస్తారో సరైన కారణాలు ఉండవనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ తాము జవాబుదారులం కాదనే తీరుతో వ్యవహారాలు సాగుతున్నాయి. కామన్‌ సైన్స్‌ ఫెసిలిటీలు అనేకం ఉన్నాయని భ్రమలు కల్పించి తీసుకువస్తున్నారని, అనేక కంపెనీలు ఉన్నాయని, వస్తాయని, పెద్ద సంఖ్యలో పరికరాల తయారీకి ఆర్డర్లు వస్తాయని ఆశలు కల్పిస్తున్నారని, తీరా ఇక్కడకు వచ్చాక ఆంక్షలు పెట్టి, కంపెనీ నుంచి కాలు బయట పెట్టడానికి కూడా అనుమతి తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అన్ని నిర్మాణాలు ఒక్కరికే

ఇక్కడ వివిధ సంస్థలకు భూమి కేటాయిస్తారు. వారు నిర్మాణాలు చేసుకోవడానికి టెండర్లు ఆహ్వానిస్తారు. కానీ వాటిని పక్కకునెట్టి ఒకరికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు. అందులో మతలబు ఏమిటనేది అర్థం కాదు. జోన్‌ ప్రారంభించినప్పుడు ఒక సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. వారి దగ్గర పనిచేసే ముఖ్యమైన వ్యక్తిని తీసుకొని, ఇప్పుడు ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా లేవు. ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నామని నిర్మాణాలు చేపడుతుంటారు. కానీ వాటి ఫలితం ఎక్కడా కనపడదు. సమావేశాలు నిర్వహించడం, పెద్దగా అరవడం, ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిని బయటకు పంపేయడం...ఇదే తరహాలో వ్యవహారాలు సాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీలు భూమిని లీజుకు తీసుకుంటాయి. డబ్బులు చెల్లిస్తాయి. అవన్నీ ఎక్కడికి వెళుతున్నాయనే దానికి సరైన లెక్కలు లేవు. పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉండకూడదని సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తుంటే...వాటిని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులెవరినీ రానివ్వకపోవడం, పరిశ్రమల శాఖ అధికారులకూ సరైన సమాచారం అందించకపోవడం వంటి లోపాలు ఉన్నాయి. దీనిని పరిశీలించడానికి గురువారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఈ జోన్‌ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ప్రక్షాళన చేయకపోతే ఆశించిన ప్రయోజనం చేకూరదు. కరోనాలో మాస్క్‌లు తయారు చేశామనో, ఆక్సిజన్‌ అందించామనే కబుర్లు కాకుండా వైద్య రంగానికి ఉపయోగపడే పరికరాలు ఏమి తయారుచేశారో, ఎంత ఉత్పత్తి జరిగిందో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి కల్పించాలో అక్కడి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది.

 
Posted (edited)
2 hours ago, sonykongara said:

 

perigite chaala santhosham anna, kanni, nijam ga 10k crores ayyindha? antha pedhadhi ayyindha ? monnae vartha choosa medtech ki poyina govt asradha chesi padu chessindhi

Edited by AndhraBullodu
Posted
1 hour ago, AndhraBullodu said:

perigite chaala santhosham anna, kanni, nijam ga 10k crores ayyindha? antha pedhadhi ayyindha ? monnae vartha choosa medtech ki poyina govt asradha chesi padu chessindhi

MRI, CT scan devices kuda manufacture chesthunnaru bro, CBN dige mundu ki 80 daka companies  tho MOU chesukunnaru, ippudu 140 antunnaru, , 2019 lo kuda CBN vachi unte edi ekkadiko poyedi ..

Posted

MedTech Zone: మెడ్‌టెక్‌ జోన్‌ ‘విశ్వ’రూపం!

వైకాపా ప్రభుత్వ హయాంలో మెడ్‌టెక్‌ జోన్‌ అభివృద్ధికి సరైన సహకారం లభించలేదు. సంస్థ సీఈవో జితేంద్రశర్మ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అందులో పెట్టుబడులు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Jul 2024 07:22 IST
 
 
 
 
 
 

విశాఖలో నెలకొల్పడం సీఎం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం 
వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రస్థానం

ap220724main4a_1.jpg

మెడ్‌టెక్‌ జోన్‌లో భవనాలు

ఎనిమిదేళ్ల క్రితం.. 

కనుచూపు మేర అటవీ ప్రాంతం.. రవాణా సౌకర్యాలే కాదు.. సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు కూడా రాని పరిస్థితి!

ఇప్పుడు.. 

ఆ ప్రాంతం ఆవిష్కరణలకు కేంద్రమైంది. కొవిడ్‌ విపత్తు సమయంలో ఆపద్బాంధవిగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముందుచూపు, అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. ఆచరణ సాధ్యం కాదన్న ప్రాజెక్టు ‘గ్లోబల్‌ హబ్‌’గా ఎదిగింది. రూ. 10 వేల కోట్ల ఉత్పత్తులు అందించే స్థాయికి చేరింది. అదే విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ (మెడ్‌టెక్‌) జోన్‌. 

ap220724main4b.jpg

వైకాపా ప్రభుత్వ హయాంలో మెడ్‌టెక్‌ జోన్‌ అభివృద్ధికి సరైన సహకారం లభించలేదు. సంస్థ సీఈవో జితేంద్రశర్మ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అందులో పెట్టుబడులు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఉత్తరాంధ్ర పర్యటనలో మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించి తన లక్ష్యాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. దీన్ని ప్రారంభించే సమయానికి దేశీయంగా 96 శాతం వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేవారు. వాటి విలువ ఏడాదికి రూ. 65 వేల కోట్లు. ఈ విషయాన్ని అప్పట్లో కేంద్ర వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న జితేంద్రశర్మ గుర్తించారు. 2015లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఆయన ఆరోగ్య సలహాదారు పనిచేశారు. వైద్య పరికరాల తయారీకి ఓ కేంద్రం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించారు. అప్పట్లో ఎవరూ మద్దతు తెలపకపోయినా.. శర్మను చంద్రబాబు ప్రోత్సహించారు. మెడ్‌టెక్‌ జోన్‌ నెలకొల్పాలంటే శాస్త్రీయ ప్రయోగశాలలు అవసరం. అప్పటికి చైనా, అమెరికా, సింగపూర్‌లో మాత్రమే అవి ఉన్నాయి. వాటిని స్థానికంగా ఏర్పాటు చేస్తే పెట్టుబడులు రావడంతోపాటు ఒక ఎకో సిస్టమ్‌ తయారవుతుందని భావించారు. తయారు చేసిన పరికరాల ఎగుమతికి పోర్టు ఉన్న విశాఖ అనువైన ప్రాంతమని చంద్రబాబు చెప్పడంతో శర్మ అంగీకరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెదగంట్యాడ మండలంలోని నడుపూరు గ్రామానికి సమీపంలో 275 ఎకరాలు కేటాయించింది. 2016లో మెడ్‌టెక్‌ జోన్‌కు శంకుస్థాపన చేశారు. 2018 జనవరి 3న మొదటి దశ నిర్మాణం ప్రారంభించి.. 342 రోజుల్లోనే పూర్తిచేసి రికార్డు సృష్టించారు. అదే వేగంతో దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. 2018లోనే 80కు పైగా కంపెనీలు, పరిశోధన ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. 

ap220724main4c.jpg

ఓ వైద్య పరికరాల తయారీ కేంద్రం లోపల..

145కు పైగా కంపెనీలతో..

మెడ్‌టెక్‌ జోన్‌ ప్రస్తుతం 145కు పైగా కంపెనీలతో అతిపెద్ద మెడికల్‌ టెక్నాలజీ పార్కుగా అవతరించింది. ఇక్కడ దాదాపు 150కు పైగా ఉత్పత్తులు తయారవుతుండగా, 6,000 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కెట్లో రూ. 25కు లభిస్తున్న గ్లూకోమీటర్‌  స్ట్రిప్స్‌ను ఇక్కడ రూ. 1.86కే ఉత్పత్తి చేస్తున్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, కేథ్‌ల్యాబ్, పేస్‌ మేకర్, బయోకెమిస్ట్రీ, హెమటాలజీ ఎనలైజర్, ఆసుపత్రిలో ఉపయోగించే పడకలు.. ఇలా ఎన్నో ఉత్పత్తి అవుతున్నాయి. మెడ్‌టెక్‌ జోన్‌ డబ్ల్యూహెచ్‌వోకు సాంకేతిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సహా 15 మంత్రిత్వ శాఖలకు చెందిన సెంటర్లు ఇక్కడ నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ విపత్తు సమయంలో ఇక్కడ రోజుకు ఒక మిలియన్‌ ఆర్టీపీసీఆర్‌ కిట్లు, 500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 100 వెంటిలేటర్లు తయారు చేశారు. మొబైల్‌ కంటెయినర్‌ హాస్పిటళ్లు, ఆర్టీపీసీఆర్‌ వాహనాలు, మొబైల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను సిద్ధం చేసి గ్రామీణ ప్రాంతాలకు తరలించారు.

ap220724main4d.jpg


భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలి

ap220724main4e.jpg

సీఎం చంద్రబాబు వంటి పరిపాలనా దక్షత గల నాయకులు అరుదుగా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఏఎంటీజడ్‌ మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకముంది. ఆయన సహకారం, మార్గదర్శకత్వంలో పనిచేస్తాం. మెడికల్‌ టెక్నాలజీలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలి. వైద్య పరికరాల దిగుమతులు 20 శాతం కంటే తగ్గించాలి. ఇదే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 

జితేంద్రశర్మ, సీఈవో, మెడ్‌టెక్‌ జోన్‌


‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఆసుపత్రులకు ప్రణాళిక

క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే రేడియో ఐసోటోప్‌లను ఉత్పత్తి చేసే ‘సైక్లో ట్రాన్‌’ను మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేశారు. మోకాలు, తుంటి శస్త్రచికిత్సల్లో అవసరమయ్యే ఇంప్లాంట్ల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఇటలీ, అమెరికాలో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో కేంద్రంగా, దేశంలో తొలిసారిగా ఏఎంటీజడ్‌లో వాటి ఉత్పత్తి కేంద్రం ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడిటివ్‌ మెటీరియల్‌’ను నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన వీటిని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ తయారైన వైద్య పరికరాలతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా ఆసుపత్రుల’ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కిర్గిస్థాన్, కజకిస్థాన్, బార్బడోస్, ఫిజి, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల్లో సైతం వాటిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం 

  • 2 weeks later...
  • 3 weeks later...
Posted

Vizag: మెడ్‌టెక్‌ మరో ఘనత.. దేశీయంగా తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారీ

విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ ఘనత సాధించింది. దేశీయంగా తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ను ఉత్పత్తి చేసింది.

Updated : 24 Aug 2024 19:44 IST
 
 
 
 
 
 

24vsp-1a_1.webp

విశాఖ: విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి కావాల్సిన పలు దేశీయ ఉత్పత్తులు అందించిన ఈ సంస్థ తాజాగా.. మంకీపాక్స్‌ నిర్ధారణ కోసం దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ను ఉత్పత్తి చేసింది. మెడ్‌టెక్‌ జోన్‌ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎర్బామ్‌ డీఎక్స్‌ మంకీ పాక్స్‌ కెకె ఆర్టీ-పాక్స్‌ పేరిట కిట్‌ రూపకల్పన చేసింది. ఈ కిట్‌కి ఐసీఎంఆర్‌, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అత్యవసర అనుమతి లభించింది. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలలో ముందంజలో ఉన్న భారతదేశ స్థానాన్ని ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుందని మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో డాక్టర్‌ జితేంద్రశర్మ అన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...