sonykongara Posted September 9 Author Posted September 9 #ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ AMTZ LTD విశాఖపట్నంలో భారతదేశపు మొట్టమొదటి 'గ్లోబల్ మెడ్‌టెక్ యూనివర్సిటీ' ని ప్రారంభించనుంది ! ఇండస్ట్రీ ప్లేయర్‌ల సహకారంతో మెడికల్ టెక్నాలజీ & రెగ్యులేటరీ వ్యవహారాల్లో MBA, MTech, PhD కోర్సులను అందించనుంది. కాగా 250 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ 2025-26 విద్యాసంవత్సరం నుండి ప్రారంభమవుతుంది !! Mobile GOM 1
sonykongara Posted September 11 Author Posted September 11 MedTech: ‘మెడ్‌టెక్’లో మరో మణిహారం వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) జోన్ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. Updated : 11 Sep 2024 07:06 IST ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభం 2025-26 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభం ఈనాడు డిజిటల్, విశాఖపట్నం నిర్మాణంలో ఉన్న మెడ్‌టెక్ విశ్వవిద్యాలయం వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) జోన్ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. మెడికల్ టెక్నాలజీలో పరిశోధన, శిక్షణ కోసం ప్రపంచస్థాయి మెడ్‌టెక్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. దీని భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే దేశంలోనే తొలి మెడ్‌టెక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుంది. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. జులైలో ఆకృతి ఆవిష్కరించిన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో 2018లో ఏర్పాటైన మెడ్‌టెక్ జోన్... సీఈఓ జితేంద్రశర్మ కృషితో వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. వైద్య పరిజ్ఞానంలో తగిన విద్యావనరులు, పరిశోధన లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి పరిష్కారంగా ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం నెలకొల్పాలని నిర్ణయించారు. జులైలో ఏఎంటీజడ్ సందర్శనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. వర్సిటీ ఆకృతిని ఆవిష్కరించారు. దీనికి అనుసంధానంగా స్థానిక ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయొచ్చని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహకారం అందిస్తాయని అప్పట్లో చంద్రబాబు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం నమూనా పారిశ్రామిక నిపుణులే బోధకులు విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మెడికల్ టెక్నాలజీ, నియంత్రణ వ్యవహారాలు (రెగ్యులేటరీ ఎఫైర్స్)లో ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. తొలుత 250 మంది విద్యార్థులతో ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్‌లో 140కి పైగా సంస్థలున్నాయి. విద్యార్థులు వాటిలో శిక్షణ తీసుకుని, ఉద్యోగాలు పొందేందుకు అవకాశముంది. పారిశ్రామిక నిపుణులు పాఠాలు బోధించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇస్తారు. ప్రవేశాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now