sonykongara Posted July 28, 2025 Author Posted July 28, 2025 విశాఖ మెడ్‌టెక్ జోన్ సామర్థ్యాలు ప్రశంసనీయం By Andhra Pradesh News DeskPublished : 28 Jul 2025 04:09 IST Ee Font size 1 min read కేంద్ర మంత్రి గడ్కరీ నాగ్‌పుర్‌లోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి ఇక్కడి పరికరాలు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్, కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంఆర్‌ఐ యంత్రం పనితీరు గురించి వివరిస్తున్న మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్రశర్మ పరవాడ, న్యూస్‌టుడే: దేశీయంగా వ్యాధి నిర్ధారణ పరికరాలు తయారు చేస్తున్న విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ సామర్థ్యాలు ప్రశంసనీయమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన భానుతాయి గడ్కరీ స్మారక డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో తయారు చేసిన వ్యాధి నిర్ధారణ పరికరాలు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. మెడ్‌టెక్ జోన్ సహకారంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంతో పాటు దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ముందుంటామని చెప్పారు. మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మ మాట్లాడుతూ ప్రపంచస్థాయి వైద్య పరికరాల తయారీలో భారత్ ముందు వరుసలో ఉందని మెడ్‌టెక్ జోన్ నిరూపిస్తోందని తెలిపారు. దేశీయ తయారీ వైద్య పరికరాల వల్ల ప్రజలకు చౌకగా ఆరోగ్య పరిరక్షణ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ మెడ్‌టెక్ జోన్ సేవలను కొనియాడారు.
sonykongara Posted September 1, 2025 Author Posted September 1, 2025 Visakhapatnam: దేశంలోనే మొదటిది ‘భూగోళ’మంత విజ్ఞానం! By Andhra Pradesh News DeskPublished : 01 Sep 2025 04:33 IST Ee Font size 1 min read విశాఖలో ప్రారంభానికి సిద్ధమవుతున్న మెడ్‌టెక్ వర్సిటీ గాజు పలకలతో ఉన్న ఈ పెద్ద భూగోళాన్ని ప్రదర్శన కోసం ఏర్పాటుచేశారని అనుకుంటున్నారా? కాదండీ.. వైద్య సాంకేతికత (మెడికల్ టెక్నాలజీ)లో ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం నెలకొల్పనున్న ‘మెడ్‌టెక్ విశ్వవిద్యాలయం’ ఇది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ(మెడ్‌టెక్) జోన్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే తొలి మెడ్‌టెక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుంది. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగసామ్యం(పీపీపీ) విధానంలో నిర్వహించనున్నట్లు సమాచారం. వైద్య సాంకేతికత, నియంత్రణ వ్యవహారాలు (రెగ్యులేటరీ ఎఫైర్స్)లో ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సులు అందించనున్నారు. మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం 150కి పైగా సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామిక నిపుణులే బోధించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. తద్వారా ప్రపంచదేశాల దృష్టి భారత్‌పై పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశ్వవిద్యాలయం ఆకృతిని గతేడాది జులైలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రవేశాలకు అర్హత, ఇతర వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
sonykongara Posted September 14, 2025 Author Posted September 14, 2025 కృత్రిమ అవయవాల తయారీ కేంద్రంగా విశాఖ By Andhra Pradesh News DeskPublished : 14 Sep 2025 05:35 IST Ee Font size 1 min read కృత్రిమ కాలు అమర్చిన తర్వాత నడుస్తున్న మహిళ పరవాడ, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ మహిళకు శనివారం మయో ఎలక్ట్రిక్ చేతిని అమర్చి, పనితీరు పరీక్షించినట్లు ఏపీ మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ శనివారం వెల్లడించారు. మరొక మహిళకు కృత్రిమ కాలునూ అమర్చామని వివరించారు. ప్రోస్థెటిక్ అవయవాల తయారీకి విశాఖను ప్రాంతీయ కేంద్రంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జితేంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు.
sonykongara Posted November 5, 2025 Author Posted November 5, 2025 medtech zone: మానవాళికి మహోపకారం!! By Andhra Pradesh Dist. DeskUpdated : 05 Nov 2025 06:48 IST Ee Font size 2 min read ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న ‘మెడ్‌టెక్ జోన్’ అంకుర సంస్థలకు నిపుణుల దిశానిర్దేశం ఈనాడు, విశాఖపట్నం: ఒకప్పుడు నగర శివారులో ఎలాంటి జనసంచారం లేని ప్రాంతం. ఇప్పుడు దేశంలో వైద్య ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వైద్య ఉపకరణాలు ఎగుమతి చేస్తోంది. వందలాది సంస్థలు, అక్కడ తయారయ్యే పరికరాలతో తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాయి. అదే విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్). విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తోంది. ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం నెలకొల్పిన ‘మెడ్‌టెక్ యూనివర్సిటీ’ని త్వరలోనే ప్రారంభించ నున్నారు. సదుపాయాలు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రయోగశాలలు, పరీక్ష కేంద్రాలు, త్రీడీ ప్రింటింగ్, బయోమెటీరియల్ టెస్టింగ్, కేంద్రాలు, రీజెనరేటివ్, మెడికల్ ఫెసిలిటీ, స్టెమ్‌సెల్ కల్చర్ ఫెసిలిటీ తదితరాలు. అందుబాటులో ‘పీజీ’ కోర్సులు.. మెడ్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఆరు నెలల వ్యవధితో పీజీ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. అక్కడి ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సార్టియమ్ (ఐబీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సులకు భారతీయులతోపాటు విదేశీయులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సుల ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్నారు. ‘అంకుర సంస్థ’లకు ఆసరా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లక్ష చదరపు అడుగుల స్టార్టప్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నీతిఆయోగ్‌కు చెందిన ‘మెడీ వ్యాలీ’, కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖకు చెందిన ‘బయో వ్యాలీ’ పేరిట రెండు ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేశారు. అంకుర సంస్థలకు ఆర్థిక సలహాలు, నిధులు సమకూరేందుకు సహకరిస్తున్నారు. వ్యక్తిగత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ పాస్‌పోర్టు (ఐ-పాస్‌పోర్టు)లు జారీ చేస్తోంది. దీని ద్వారా అంకుర సంస్థలు అక్కడి ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యాలు, ప్రపంచ స్థాయి పరీక్షల కేంద్రాలు, ఫ్యాబ్రికేషన్ ల్యాబ్‌లు, పూర్తి ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు. ప్రారంభం: 2018 విస్తీర్ణం: 275 ఎకరాలు సంస్థలు: 150కి పైగా టర్నోవర్: రూ.10 వేల కోట్లకు పైగా.. ఎగుమతులు: 80 దేశాలకు ఉత్పత్తులు: క్యాన్సర్ నిర్ధారణలో వినియోగించే ఐసోటోప్‌లు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తదితర 400కు పైగా. దివ్యాంగులకు భరోసా.. మెడ్‌టెక్ జోన్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటితో పోలిస్తే ఇవి తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉంటున్నాయి. వీటిని లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో పెంపుడు జంతువులకూ ఈ తరహా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఓ శునకం, మరో లేగదూడ సులభంగా నడిచే ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవగాహన పరిశ్రమల సందర్శనలో భాగంగా విద్యార్థులకు అత్యాధునిక మెడ్‌టెక్ ఎకోసిస్టమ్, ఉత్పత్తులు, పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తున్నారు. మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్‌లు, సౌకర్యాలను విద్యార్థులు సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 154కు పైగా కళాశాలల యాజమాన్యాలు మెడ్‌టెక్ జోన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.
sonykongara Posted December 16, 2025 Author Posted December 16, 2025 విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో కీలక ఘనత By Andhra Pradesh News DeskUpdated : 16 Dec 2025 06:43 IST Ee Font size 1 min read వారెక్స్ ఇమేజింగ్’ తయారీ యూనిట్ ప్రారంభం విశాఖపట్నం (పరవాడ), న్యూస్‌టుడే: భారతదేశ వైద్య సాంకేతిక తయారీ ఆశయాలకు ఊతమిస్తూ విశాఖ ఏపీమెడ్‌టెక్ జోన్ కీలక ఘనత సాధించింది. ఎక్స్-రే ఇమేజింగ్ భాగాల తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన వారెక్స్ ఇమేజింగ్ కార్పొరేషన్...విశాఖ మెడ్‌టెక్ జోన్(ఏఎంటిజెడ్)లో అధునాతన తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. దీన్ని సోమవారం సాయుధ బలగాల వైద్యసేవల డైరెక్టర్ జనరల్, వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్, హిందుస్థాన్ సిరంజిస్, మెడికల్ డివైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌నాథ్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైద్య ఇమేజింగ్ వ్యవస్థలకు శక్తినిచ్చే ఎక్స్-రే ట్యూబ్‌లు, ఇమేజింగ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ తదితరాలను వారెక్స్ ఇమేజింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుందన్నారు. మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్రశర్మ మాట్లాడుతూ వారెక్స్ కేంద్రం ప్రారంభంతో వైద్య సాంకేతికతకు విశ్వసనీయ గమ్యస్థానంగా భారత్ మారనుందన్నారు. దేశంలో మొదటిసారిగా ఇక్కడి కేంద్రంలో సీసియం అయోడైడ్ పూతతో ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లు, అధునాతన ఇమేజింగ్ భాగాలు తయారవుతాయని అన్నారు. వారెక్స్ సంస్థ సీఈవో సన్నీ సన్యాల్ మాట్లాడుతూ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి, ఆవిష్కరణ వ్యూహంలో భారతదేశం కేంద్రంగా ఉందన్నారు. సంస్థ భారత్ హెడ్ వివేక్ ఫాల్లే మాట్లాడుతూ మేకిన్ ఇండియా నినాదాన్ని బలపరుస్తూ భారత్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యత గల ఫ్లాట్‌ప్యానెల్స్ డిటెక్టర్ తయారీని సాధ్యం చేసేందుకు ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దిన మెడ్‌టెక్‌జోన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వారెక్స్ ఇమేజింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా సంస్థను ప్రారంభిస్తున్న ఆర్తి సరిన్, రాజీవ్‌నాథ్ తదితరులు
sonykongara Posted December 23, 2025 Author Posted December 23, 2025 ఆవిష్కరణలు.. అందిపుచ్చుకునేలా! By Andhra Pradesh Dist. DeskPublished : 23 Dec 2025 05:20 IST Ee Font size 2 min read మెడ్‌టెక్ జోన్‌తో వివిధ సంస్థల ఎంవోయూలు మరింత వేగంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మెడ్‌టెక్ జోన్‌లో ఆకట్టుకునే నిర్మాణాలు ఈనాడు, విశాఖపట్నం: వైద్య సాంకేతికతలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇటీవల కొన్ని సంస్థలు మెడ్‌టెక్ జోన్‌తో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నాయి. దీంతో ఇక్కడ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వైద్య సాంకేతికత రంగంలో పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ఒకే వేదికపై వివిధ రంగాలు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న వంద విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యూడబ్ల్యూఏ) మెడ్‌టెక్ జోన్‌లో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం విద్యా కార్యక్రమాల మార్పిడి, పరిశ్రమల సహకారం, ఆవిష్కరణలకు వేదికగా పనిచేయనుంది. తద్వారా విశాఖ గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ సహకార కేంద్రంగా స్థిరపడనుంది. మెడ్‌టెక్, సముద్ర విజ్ఞానం, రక్షణ, సుస్థిరాభివృద్ధి, వ్యవసాయం, డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. ప్రపంచవ్యాప్త సవాళ్లకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రంగాల్లో భవిష్యత్తు ఉద్యోగావకాశాలను అందుకునేలా విద్యార్థులు, వృత్తి నిపుణులను సిద్ధం చేసేందుకు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు అందించనున్నారు. సంయుక్త పరిశోధన, దేశంలోని అగ్రస్థాయి మెడ్‌టెక్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు కొత్త అవకాశాలు రానున్నాయి. పరిశోధనల మెరుగుకు దిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఎంఆర్) ప్రజారోగ్యం, అనుబంధ రంగాల్లో నిర్వహణ, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తోంది. భారత్‌లో కీలకమైన మెడ్‌టెక్ పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్)ను బలోపేతం చేసేందుకు ఆ సంస్థ మెడ్‌టెక్ జోన్‌లో ఉపగ్రహ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తద్వారా మెడ్‌టెక్ రంగంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలు మరింత మెరుగుపడేందుకు వీలుంటుంది. పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్య కోర్సులు, ఎగ్జిక్యూటివ్ విద్యా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం బలోపేతమవుతుంది. సంయుక్తంగా మాస్టర్ ప్రోగ్రాంలు.. ఆమ్‌స్టర్‌డామ్‌లోని వ్రిజె యూనివర్సిటీ (వీయూ) ఏఎంటీజెడ్‌లో ఎకోసిస్టమ్, ఆవిష్కరణ సామర్థ్యాలను వినియోగించుకోనుంది. ఇక్కడ నూతన సాంకేతికతను అభివృద్ధి చేయనుంది. అందుబాటు ధరలో రోగ నిర్ధారణ, వైద్య పరికరాల తయారీకి సంబంధించిన ఆలోచనలను ఆచరణరూపంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. మెడ్‌టెక్ విశ్వవిద్యాలయంలో వీయూకు చెందిన మేనేజ్‌మెంట్, పాలసీ అనాలసిస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ తదితర మాస్టర్ ప్రోగ్రాంలను సంయుక్తంగా అందిస్తాయి. విద్యార్థులు ఆయా కోర్సులు నేర్చుకోవడంతోపాటు ఇంటర్న్‌షిప్‌లు పొందొచ్చు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now