Jump to content

AP Government’s transitional headquarters

sonykongara

Recommended Posts

బండెనుక బండి....
 
636058438607066003.jpg
హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వ యంత్రాంగ పాలన అమరావతి నుంచే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించించనప్పటి నుంచి ఒక్కో శాఖ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలుతోన్నాయి. ఇప్పటికే పలు శాఖలు అమరావతి నుంచి పాలన ప్రారంభించగా మరి కోన్ని శాఖలు పాలనకు సిద్దంగా ఉన్నాయి. ఇదే తరహాలో పలు శాఖలు రేపు వెలగపూడికి తరలనున్నాయి. ఇప్పటికే అక్కడికి తరలిన శాఖలు కొన్ని రేపటి నుంచి పాలన సాగించనున్నాయి.
 
రేపు వెలగపూడిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న శాఖలు
 • హోం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాలు
 • పెట్టుబడులు, మున్సిపల్‌, ఇంధన శాఖలు
త్వరలో తరలనున్న శాఖలు
 • 7న వెలగపూడికి బీసీ సంక్షేమ శాఖ తరలింపు
 • 10న వ్యవసాయం, పశు సంవర్ధక, మానవవనరుల శాఖ
 • న్యాయ, సాధారణ పరిపాలన శాఖల తరలింపునకు సన్నాహాలు
మిగిలిన శాఖల తరలింపు తేదీలు త్వరలోనే ఖరారుకానున్నాయి.
Link to comment
Share on other sites

వెలగపూడి వెల.. వెల! 
09-08-2016 03:03:18
636063086001197349.jpg
 • కుదురుకోని తాత్కాలిక సచివాలయం
 • నీళ్లూ లేవు.. క్యాంటీన్‌ లేదు
 • కొనసాగుతున్న నిర్మాణ పనులు
 
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర పాలనలో ‘సంధి కాలపు’ కష్టాలు కొనసాగుతున్నాయి. బాలారిష్ఠాలు పీడిస్తున్నాయి. ‘జూన్‌ 27లోపు అందరూ అమరావతికి వచ్చి తీరాల్సిందే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పినా... ఆ గడువు ముగిసి నెలన్నర దాటినా... వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వెలవెలపోతోంది. జూలైలో ముగ్గురు, ఆగస్టు మొదటి వారంలో మరో ముగ్గురు మంత్రులు సచివాలయ ప్రవేశం చేసినా... అక్కడ కూడా కనీస వసతుల్లేవు.
 
హైదరాబాద్‌ నుంచి కార్గో ద్వారా ఫైళ్లు, ఫర్నీచర్‌ తరలించారు కానీ, కనీసం ఆ డబ్బాలు కూడా విప్పలేని పరిస్థితి. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం సిబ్బంది వేచి చూస్తున్నారు. డ్రెయినేజీ, వాటర్‌, క్యాంటీన్‌లాంటి కనీస సౌకర్యాలు కూడాలేవు. వర్షం కురిసిందంటే... తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్డు మొత్తం బురదమయమే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో చాలా గదుల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఓ వైపు నిర్మాణాలు జరుగుతుండగా, మరోవైపు గోడలకు ప్లాస్టరింగ్‌, రంగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి... ప్రజలకు అవసరమైన పనులు ఏ మాత్రం జరగడంలేదు.
 
అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో పనులు సాగడంలేదు. మంత్రుల పేషీల్లో తాగడానికి వాటర్‌ క్యాన్లతో నీరు తెస్తున్నారు. బాతరూముల్లోనూ నీరులేదు. ఇంకా డ్రెయినేజీ వ్యవస్థ పూర్తికాలేదు. దీంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్‌ కూడా లేదు. కనీసం చాయ్‌ నీళ్లకూ దిక్కులేదు. వెలగపూడి నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ‘అన్న క్యాంటీన్‌’ ఉంది. అధికారులు, సచివాలయంలో పనిచేసే సిబ్బందికి అక్కడ తినడం కుదరడంలేదు. కొందరు అధికారులు మధ్యాహ్న భోజనం కోసం విజయవాడకు వెళుతున్నారు. సిబ్బంది క్యారియర్‌ తెచ్చుకుందామంటే.. విజయవాడలో కుటుంబం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు.
 
నో ఇంటర్నెట్‌.. 
సీఎం కార్యాలయం(బ్లాక్‌-1) పక్కనే రెండో బ్లాకులో ఉప ముఖ్యమంత్రుల కార్యాలయాలు, మంత్రి నారాయణ పేషీ, హోం, మునిసిపల్‌ అడ్మినిసే్ట్రషన్‌ కార్యాలయాలున్నాయి. ఆ భవనానికి ముఖద్వారం కూడా ఇంకా పూర్తి కాలేదు. నారాయణ, చినరాజప్ప పేషీల వరకూ పని కానిచ్చి... ఫర్నీచర్‌ తెచ్చిపెట్టినా, ఇతర సిబ్బంది కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. టేబుల్‌ వరకూ కేబుల్‌లాగి పెట్టినా వాటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదు. ఏపీలో ఎక్కువగా పాలన ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రివ్యూలకు సంబంధించిన పత్రాలను సెక్రటరీలు ల్యాప్‌టా్‌పలలో సిద్ధం చేసుకొని... విజయవాడలోని ఆయా శాఖల జిల్లా కార్యాలయాల్లో ప్రింట్లు తీసుకొని వెళుతున్నారు.
 
పెండింగ్‌.. పెండింగ్‌ 
సీఎం విధించిన గడువు ‘జూన్‌ 27’లోపు ఒక్క మంత్రి కూడా రాలేకపోయారు. జూలైలో ముగ్గురు మంత్రులు (అయ్యన్నపాత్రుడు, మృణాళిని, కామినేని శ్రీనివాస్‌) వెలగపూడిలో సచివాలయంలోకి ప్రవేశించగా... ఆగస్టు మొదటి వారంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మం త్రి నారాయణ, మంత్రి రాఘవరావు కార్యాలయ ప్రవేశం చేశారు. పలుమార్లు తేదీలు ప్రకటించి మంత్రులు వాయి దా వేసుకొని కార్యాలయాల ప్రవేశం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం నాడు అక్కడికొచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు ఇంకా వెలగపూడి భవనంలోకి అడుగు పెట్టలేదు.
 bloxk.jpg

Drainage and water facilities kooda levaaa inka :atwitsend:

Link to comment
Share on other sites

తుది మెరుగుల్లో సచివాలయం
 
636070812702829350.jpg
 • నెలాఖరులోగా అన్ని విభాగాలూ ప్రారంభం
 • సచివాలయానికి క్యూ కడుతున్న పుష్కర యాత్రికులు
అమరావతి, ఆగస్టు 17: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయంలో మంత్రులు, అధికారులు, సిబ్బంది చాంబర్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మంత్రులు ప్రారంభించిన ఐదు, రెండు బ్లాకుల్లో సకల సౌకర్యాలు కల్పించారు. ఒకటి, మూడు, నాలుగు బ్లాకులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి భవనంలోనూ ఒకే విధమైన వసతులు కల్పిస్తున్నారు. విలువైన ఫర్నిచర్‌ను వినియోగిస్తున్నారు. మిలమిల మెరిసే టైల్స్‌, పాల వెలుగుల విద్యుత బల్బులతో హాళ్లు తళతళ మెరుస్తున్నాయి. ప్రతి ఫ్లోరుకి సెంట్రల్‌ ఏసీ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్‌ ఫైట్స్‌ పైపులను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల క్యాబిన్లు, మంత్రుల పేషీలు, సందర్శకులు వేచి ఉండే గదులకు ఫర్నిచర్‌ను సిద్ధం చేశారు. అన్ని బ్లాకులకు ముందు తారు రోడ్లు వేస్తున్నారు. డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. సచివాలయానికి సంబంధించి దాదాపు 45 శాఖలకు ఐదు భవనాలు నిర్మించారు. సీఎం, చీఫ్‌ సెక్రటరి కార్యాలయాలుండే మొదటి బ్లాకులో పనులు దాదాపు పూర్తయ్యాయి. తాగునీటి వసతి కల్పించాల్సి ఉంది. ఉద్యోగుల క్యాబిన్లు, ఉన్నతాధికారుల చాంబర్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇంటర్నెట్‌ కనెక్షన ఇవ్వాల్సి ఉంది. ఓ వైపు కృష్ణా పుష్కరాలు జరుగుతున్నా.. సచివాలయ పనులకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన ఫ్లోర్లను ఈ నెలాఖరులోగా ఆయా శాఖల మంత్రులు ప్రారంభించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో పుష్కర స్నానాలకు వస్తున్న యాత్రికులు సచివాలయాన్ని సందర్శించి, భవనాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం కూడా పర్యాటక స్థలంగా మారిపోవడం గమనార్హం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...