Jump to content

ప్రపంచ మీడియా బోనులో మోదీ!


Recommended Posts

ప్రపంచ మీడియా బోనులో మోదీ!

Apr 27 2021 @ 01:48AMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
04272021014310n52.jpg

 

 • రెండో దశ కరోనా విజృంభణ ఆయన వైఫల్యమే
 • ఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలికొదిలారు
 • రెండో వేవ్‌ ముందే తెలిసినా సన్నద్ధత లేదు
 • కుప్పకూలిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు
 • భారత్‌లో కొత్త మ్యూటెంట్లు వస్తే ముప్పే
 • దుమ్మెత్తి పోస్తున్న అంతర్జాతీయ పత్రికలు
 •  

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: నిన్నటిదాకా భారతదేశం ప్రపంచ దేశాల దృష్టిలో కరోనా నుంచి రక్షించే ఒక ఆపన్న హస్తం. మొదట ప్రాణాధార మందులను అందించి, తర్వాత కాలంలో వ్యాక్సిన్లను అందించి, ప్రపంచ మానవాళిని రక్షించడంలో తన పాత్ర పోషిస్తున్న బాధ్యతాయుత దేశంగా భారత్‌ను అందరూ కొనియాడారు. కొద్ది వారాలుగా హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మీడియా దృష్టిలో భారత్‌ ఒక బాధ్యతా రహితమైన దేశంగా నిలిచింది. నిన్నటి చైనాలా నేడు మనదేశం బోనులో నిలబడుతోంది. రెండో అల కరోనా ముంచుకొస్తున్న విషయాన్ని గత అక్టోబరులోనే హెచ్చరించినా, భారత ప్రభుత్వం ఎన్నికల జాతరలు, కుంభమేళాలు నిర్వహించి, బడులు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌ తెరచి భౌతిక దూరాన్ని మరచింది. దాంతో 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ఒక్కసారిగా కరోనా విపత్తుకు గురుత్వ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం భారత్‌ నుంచే వస్తున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యను దాటిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ దొరక్క రోగులు కారిడార్లలోనే మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్మశాన వాటికల్లో రోజంతా చితిమంటలు ఎగస్తున్నాయి. ఇదంతా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అంతర్జాతీయ మీడియా కొద్ది రోజులుగా 24 గంటలూ ఒకే విషయాన్ని కవర్‌ చేస్తోంది. అది భారత్‌లో విజృంభిస్తున్న రెండో అల కరోనా. ఈ దారుణ వైఫల్యానికి ప్రధాని మోదీనే కారకుడిగా నిందిస్తున్నాయి. నిన్నటిదాకా ప్రపంచానికి దారిచూపే ముఖ్యనేతల్లో ఒకరిగా కీర్తి గడించి, ఇప్పుడు పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో అత్యంత అసమర్థపాలకుడు అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల భారత్‌ కరోనా కూపంగా మారిందని, కొత్త కొత్త కరోనా వేరియంట్లు భారత్‌లో పుట్టుకొచ్చి, సరిహద్దులు దాటి ప్రపంచమంతటికీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తీవ్రత ఏంటో ఏడాది కిందటే తెలిసింది.  రెండోదశకు ఏడాది సమయం ఉన్నా మోదీ నిర్లక్ష్యం చేశారని విదేశీ మీడియా మండిపడింది. ముందే తెలిసిన రెండో అలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎందుకు సన్నద్ధం కాలేక పోయిందో సమాధానం లేదని ఎకనామిస్ట్‌ వ్యాఖ్యానించింది. కరోనా విషయంలో మోదీ వైఫల్యాలను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొంది.

 

 

 

04272021014847n65.jpg

 

ఢిల్లీలోని ఒక ఆస్పత్రి ముందు స్కైన్యూస్‌ టీవీ లైవ్‌ కవరేజ్‌ ఇచ్చింది. తన కళ్లముందే కొద్ది గంటల వ్యవధిలో చికిత్సకోసం ఎదురుచూస్తూ ఆరుగురు మరణించారని ఆ చానెల్‌ విలేకరి చెప్పారు. మీడియాను మోదీ మ్యానేజ్‌ చేశారని, అందుకే, ఎన్నికలు, కుంభమేళా వంటి జాతరల విషయంలో భారతీయ మీడియా మెతగ్గా వ్యవహరించిందని వ్యాఖ్యానించాయి. మోదీ ర్యాలీల గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా ప్రస్తావించింది. మోదీ ప్రధానమంత్రి అయ్యాక అంతర్జాతీయ మీడియా నుంచి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం ఇదే ప్రథమం. ప్రపంచానికి మొత్తానికి ఔషధాలు ఎగుమతిచేసి గుర్తింపుపొందిన మోదీ ఇప్పుడు తన ఆకర్షణను కోల్పోయారు. భారత్‌లో కరోనా రెండో భారీ అలలో మోదీ కొట్టుకుపోయారని లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. వైద్య వ్యాపార వర్గాలు వ్యాక్సిన్లు, మందుల వ్యాపారంతో దోచుకుంటుంటే ప్రధాని మోదీ సర్కారు ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దేశ ప్రజలంతా కరోనాతో విలవిలలాడుతుంటే మోదీ, అమిత్‌షా ద్వయం వేల మందితో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బెంగాల్లో ఒక భారీ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఇంత భారీ జనసమూహాన్ని తన జీవితకాలంలో చూడలేదని వ్యాఖ్యానించారు.

 

రెండో అలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నాయి. మోదీ మాత్రం ఆ సమయాన్ని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు,వ్యూహాలు రచించడానికి వాడుకున్నారు. మోదీ 20, అమిత్‌షా 30 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.  మోదీ ప్రతిష్ఠకు ఇప్పటివరకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది అని ప్రపంచ మీడియా వ్యాఖ్యానించింది. భారత్‌లో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని గార్డియన్‌ పేర్కొంది. 

Link to post
Share on other sites
1 minute ago, kanagalakiran said:

Enti daaani kosam ennalu buildup echada?

free vaccines to third world countries and elevation tweets.... all parts of this ground work..... of course.... that beard look as if he is Socrates to the entire world and also Rabindranath Tagore for Bengalis!

Link to post
Share on other sites

దేశం వెలిగిపోతుంది

ఆరని చితులతో ....

కాలుతున్న  కాష్ట్టా లతో.......

కాషాయ కాలకేయులతో......

WhatsApp received

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×
×
 • Create New...