Jump to content

కోడి కత్తి గుచ్చుడు కేసులో పురోగతి.


sonykongara

Recommended Posts

మన అనుమానం నిజమే.. అన్ని పేజీల్లో చేతిరాత ఒక్కళ్ళది కాదు.

దాడి కేసులో పురోగతి

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో పురోగతి సాధించామని విశాఖపట్నం సీపీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు.

నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని ఆయన బాబాయి కూతురు జే.విజయలక్ష్మీ (16)తో ఇటీవల ఊరికి వెళ్లినప్పుడు రాయించాడని వివరించారు.

మరో పేజీని రెస్టారేంట్ లో పనిచేసే తోటి ఉద్యోగి రేవతీపతి(19)తో రెండు రోజుల క్రితం రాయించాడని తెలిపారు.

రేవతిపతిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి గ్రామమని తెలిపారు.

అతడు 10వ తరగతి చదివి అటెండర్ గా రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.

రెండు రోజుల క్రితమే అతడితోనే జిరాక్స్ తెప్పించాడన్నారు.

నాలుగు నెలలుగానే పని…
నిందితుడి వద్ద ఉన్న కత్తిని అప్పుడప్పుడు రెస్టారెంట్ లో పండ్లు కోయడానికి ఉపయోగించేవాడని తెలిపారు.

నిందితుడి వద్ద మరో చిన్న కత్తి కూడా దొరికిందని వివరించారు.

రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ స్టేట్ మెంట్ తీసుకున్నామని, నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ కి పంపించనున్నట్లు తెలిపారు.

కాగా, నిందితుడు నాలుగు నెలలుగానే రెస్టారెంట్ లో పనిచేస్తున్నారని సీపీ వివరించారు.

అయితే, నిన్న పలు మీడియా ఛానళ్లతో రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నిందితుడు ఎనిమిది నెలలుగా తమవద్ద పనిచేస్తున్నాడని చెప్పడం గమనార్హం.

Link to comment
Share on other sites

  • Replies 99
  • Created
  • Last Reply
9 సెల్‌ఫోన్లు ఎందుకు మార్చాడో విచారిస్తున్నాం
జగన్‌పై దాడి కేసులో పురోగతి వెల్లడించిన విశాఖ సీపీ
04364126VSP118CP.JPG

విశాఖ: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో పురోగతిని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా మీడియాకు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని రంగోలి వాసిగా చెప్పారు. అతడు పదో తరగతి చదివాడని, గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. దాడికి వాడిన కత్తి కోడిపందేలుకు వాడిందని, ఆ కత్తి పొడవు 8సెం.మీలు ఉండగా.. ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని వివరించారు. దాంతో పాటు ఘటనా స్థలం నుంచి మరో చిన్న కత్తి కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చి వాటిలో ఒకే సిమ్‌ను వాడాడని, అలా ఎందుకు చేశాడనేది విచారిస్తున్నట్టు సీపీ వెల్లడించారు.

Link to comment
Share on other sites

‘నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా‌’
జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ వెల్లడి
05374526BRK131-DAADI.JPG

విశాఖ : వైకాపా అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ని విశాఖ సెషన్స్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో తాను చెప్పాలనుకున్నదే లేఖలో రాశానని పేర్కొన్నాడు. అందులోనే చూసుకోండి.. అంటూ తెలిపాడు. నిందితుడిని భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. నిన్న విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్ష నేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్‌ కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దాడి అనంతరం నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకోగా.. జగన్‌ హైదరాబాద్‌కు చేరుకొని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.

మరోవైపు జగన్‌పై దాడి కేసులో పురోగతిని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా మీడియాకు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని రంగోలి వాసిగా చెప్పారు. అతడు పదో తరగతి చదివాడని, గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు.

Link to comment
Share on other sites

సంచలనం సృష్టించేందుకే
27-10-2018 02:30:43
 
636762042439798528.jpg
  • తన భావాలు, సమస్యలు చెప్పాలి.. సీఎంగా ఏం చేయాలో తెలపాలి
  • మొత్తం వివరాలతో సుదీర్ఘ లేఖ.. సారాంశం తయారీకి 45 రోజులు
  • చిన్నాన్న కుమార్తెతో 9 పేజీలు... మిత్రుడితో మరో పేజీ రాయించాడు
  • చివరి పేజీ సొంతంగా రాశాడు.. ఊరి నుంచే కోడి కత్తితో రాక: లడ్డా
విశాఖపట్నం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించడం, తన భావాలను, రాష్ట్ర సమస్యలను, సీఎం అయ్యాక ఏం చెయ్యాలో నేరుగా చెప్పడమే లక్ష్యంగా జనిపెల్ల శ్రీనివాసరావు విపక్షనేత జగన్‌పై కత్తిదాడి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. విశాఖ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో నగర కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘తన భావాలతోపాటు, రాష్ట్ర సమస్యలను నేరుగా జగన్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకే దాడికి పాల్పడినట్టు శ్రీనివాసరావు మా ప్రాథమిక విచారణలో తెలిపాడు. అతను ఈ ఏడాది జనవరిలో ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌లో వెయిటర్‌గా చేరాడు. గ్రామానికి వెళ్లినప్పుడు కోడిపందాల కత్తిని తీసుకొచ్చాడు.ఆ కత్తిని వెజిటబుల్‌ డెకరేషన్‌కు కూడా వాడుతున్నట్లు తెలిపాడు’’ అని వివరించారు.
 
లేఖ రాసిందిలా..: సీఎం అయిన తర్వాత చేయాల్సిన పనులను జగన్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు నిందితుడు ఒక లేఖను సిద్ధం చేసుకున్నాడని కమిషనర్‌ లడ్డా తెలిపారు. ఈ లేఖను రూపొందించేందుకు దాదాపు 45 రోజుల సమయం తీసుకున్నాడన్నారు. ‘‘15 రోజుల కిందట ఇంటికి వెళ్లినప్పుడు ఆ లేఖను తన చిన్నాన్న కుమార్తె అయిన విజయలక్ష్మి(16)కి ఇచ్చి ఫెయిర్‌ చేయించాడు. అది 9 పేజీలు వచ్చింది. తనతోపాటు పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయికి చెందిన తెప్పల రేవంత్‌పతి(19)తో రెండు రోజుల క్రితం మరో పేజీ రాయించాడు. జగన్‌ హైదరాబాద్‌ వెళ్లేందుకు గురువారం ఎయిర్‌పోర్టుకు వస్తున్నట్టు తెలుసుకున్న శ్రీనివాసరావు ఆ లేఖను ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
 
అప్పటికప్పుడు తానే స్వయంగా మరోపేజీలో రెండు వాక్యాలు రాశాడు. మొత్తం లేఖను జిరాక్స్‌ తీయించి... ఒక ప్రతిని తన వద్ద భద్రపరుచుకున్నాడు. మామూలుగా ఇస్తే జగన్‌ ఆ లేఖను తన అనుచరులకు ఇచ్చి వెళ్లిపోతారని, ఏదైనా చేసి సంచలనం రేపాలనే భావనతో కోడిపందాల కత్తితోపాటు చిన్నపాటి బ్లేడ్‌ను తీసుకుని వెళ్లాడు. సెల్ఫీకి జగన్‌ సరే అనడంతో దగ్గరకు వెళ్లి తన జేబులోని కత్తి తీసి దాడి చేశాడు’’ అని కమిషనర్‌ తెలిపారు. శ్రీనివాసరావును సీఐఎ్‌సఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి లేఖ జిరాక్స్‌ కాపీని, 8 సెంటీమీటర్ల (పదును ఉన్న భాగం 3 సెంటీమీటర్లు) పొడవు ఉన్న కత్తిని, మరో చిన్నపాటి కత్తిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడిని, ఆయా వస్తువులను పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతాం’’ అని తెలిపారు. లేఖ రాయడంలో సహకరించిన ఇద్దరినీ విచారిస్తున్నారన్నారు. చేతితో కొట్టడం, బెదిరించడం వంటి అభియోగాలపై ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై గతంలో ఒక కేసు నమోదైందన్నారు.
Link to comment
Share on other sites

గన్‌పై దాడి జరిగిందిలా..!
27-10-2018 02:33:02
 
636762291768164717.jpg
  • మోదీకి వివరించిన గవర్నర్‌ నరసింహన్‌
  • దోవల్‌తోనూ భేటీ
  • శ్రీనివాస్‌కు రిమాండ్‌
  • రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ
  • నరసింహన్‌తో లగడపాటి మంతనాలు
న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి గురించి సమాచారం అందించి.. పరిస్థితుల్ని వివరించినట్లు తెలిసింది. మోదీతో ఆయన సమావేశం దాదాపు 15 నిమిషాలు జరిగింది. ప్రధాని నివాసంలోనే ఆయన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోవల్‌ను కూడా కలిసినట్లు సమాచారం. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన తీరు గురించి డీజీపీ అందించిన సమాచారంతో పాటు ఇతరత్రా వివరాలను కూడా ఆయనకు తెలియజేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి కూడా గవర్నర్‌ తన అభిప్రాయం చెప్పినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా.. సాయంత్రం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. మరోవైపు.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఢిల్లీలో నరసింహన్‌ను కలుసుకుని దాదాపు అరగంట మంతనాలు జరపడం గమనార్హం.
Link to comment
Share on other sites

గంటసేపు కత్తి ఏమైంది?
27-10-2018 02:36:33
 
636762237633628403.jpg
  • దాడి తర్వాత కత్తిని తీసుకెళ్లిన పార్టీ నేతలు!
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఉపయోగించిన కత్తి.. దాడి తర్వాత సుమారు గంటసేపు అక్కడ కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో క్యాంటిన్‌లో పనిచేసే శ్రీనివాసరావు కత్తితో జగన్‌ ఎడమ భుజంపై పొడిచాడు. అక్కడున్న పార్టీ నేతలు, జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అతడి చేతిలోని కత్తిని లాక్కొన్నారు. నిందితుడిని సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు అప్పగించారు. గంట తర్వాత సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు వచ్చి.. దాడికి వినియోగించిన కత్తి ఇవ్వాలని కోరారు.
 
నేతలు కొంతసేపటి తర్వాత ఆ కత్తిని సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు అందజేశారు. దీంతో ఘటన జరిగిన తర్వాత సుమారు గంటసేపు కత్తి ఏమైందనేది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న పార్టీ నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్‌, మజ్జి శ్రీనివాసరావు (బొత్స మేనల్లుడు) కలిసి ఆ కత్తిని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది. దానికి ఏమైనా విషం పూశారేమోననే అనుమానంతో నగరంలోని ఒక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించి పరీక్ష చేయించి, తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్టు సమాచారం.
Link to comment
Share on other sites

సొంత ఊరిలో ‘సిట్‌’
27-10-2018 02:40:48
 
636762048493062872.jpg
  • శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల విచారణ
  • లేఖకు సహకరించిన యువతికీ ప్రశ్నలు
ముమ్మిడివరం, అక్టోబరు 26: వైసీపీ అధినేత జగన్‌పై దాడిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన పని ప్రారంభించింది. సీఐ వైకుంఠరావు, ఎస్‌ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి శుక్రవారం నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణెలంకకు వచ్చారు. విశాఖలో నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇక్కడ దర్యాప్తు చేపట్టారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ జరిపారు. శ్రీనివాసరావు తల్లిదండ్రులు, అన్న వదినలను విడివిడిగా ప్రశ్నించారు. శ్రీనివాసరావు వద్ద లభించిన లేఖలో తొలి పదిపేజీలు రాసిపెట్టిన జనిపెల్ల విజయలక్ష్మిని కూడా ప్రశ్నించారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను విశాఖకు తీసుకెళ్లారు. శ్రీనివాసరావు ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన బంధువైన యువతి ఫోన్‌ వాడినట్లు తేలడంతో ఆమె వివరాలు కూడా సేకరించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రిని పిలిచి విచారించారు.
 
పాత కేసు ఇది...
శ్రీనివాసరావు 2017లో స్వగ్రామంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో కాగితం వెంకటేశ్‌ అనే వ్యక్తిపై కొంతమంది కలిసి దాడి చేశాడు. దీనిపై ముమ్మిడివరం స్టేషన్‌లో ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉండగా, శ్రీనివాసరావు నాలుగో నిందితుడు. శ్రీనివాసరావు ఇంటర్‌, ఐటీఐ చదువు తర్వాత దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ నెలరోజులు మాత్రమే పనిచేశాడు. ఆపై బెంగళూరు వెళ్లాడు. తర్వాత విశాఖలో ఉద్యోగంలో చేరాడు. శ్రీనివాసరావు నివాసం నుంచి మూడు బ్యాంకు ఖాతాల పాస్‌ పుస్తకాలు, పాస్‌పోర్టు, కొన్ని సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
 
ఫ్లెక్సీ దొరికింది...
2flexi20.jpg‘హ్యాపీ న్యూఇయర్‌’ అంటూ జగన్‌ ఫొటోతో తన ఫొటో కలిపి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ! దాడి తర్వాత ఈ ఫొటో వైరల్‌గా మారింది. అభిమానే దాడి చేశాడనేందుకు ఇదే తొలి ఆధారంగా నిలిచింది. అయితే... దీనిని ప్రభుత్వమే సృష్టించిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘సిట్‌’ బృందం ఠాణెలంకలో ఫ్లెక్సీ కోసం వెతికారు. గ్రామంలో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోటే... ఒక ఇంటి వద్ద అది శిథిలావస్థలో కనిపించింది. ఫ్లెక్సీ తయారీకి సహకరించిన శ్రీనివాసరావు స్నేహితుడిని పోలీసులు విశాఖకు తీసుకెళ్లినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:
గంటసేపు కత్తి ఏమైంది?
27-10-2018 02:36:33
 
636762237633628403.jpg
  • దాడి తర్వాత కత్తిని తీసుకెళ్లిన పార్టీ నేతలు!
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఉపయోగించిన కత్తి.. దాడి తర్వాత సుమారు గంటసేపు అక్కడ కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో క్యాంటిన్‌లో పనిచేసే శ్రీనివాసరావు కత్తితో జగన్‌ ఎడమ భుజంపై పొడిచాడు. అక్కడున్న పార్టీ నేతలు, జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అతడి చేతిలోని కత్తిని లాక్కొన్నారు. నిందితుడిని సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు అప్పగించారు. గంట తర్వాత సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు వచ్చి.. దాడికి వినియోగించిన కత్తి ఇవ్వాలని కోరారు.
 
నేతలు కొంతసేపటి తర్వాత ఆ కత్తిని సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు అందజేశారు. దీంతో ఘటన జరిగిన తర్వాత సుమారు గంటసేపు కత్తి ఏమైందనేది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న పార్టీ నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్‌, మజ్జి శ్రీనివాసరావు (బొత్స మేనల్లుడు) కలిసి ఆ కత్తిని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది. దానికి ఏమైనా విషం పూశారేమోననే అనుమానంతో నగరంలోని ఒక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించి పరీక్ష చేయించి, తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్టు సమాచారం.

What CISF & Police doing when these guys taking it with them.

Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:
గన్‌పై దాడి జరిగిందిలా..!
27-10-2018 02:33:02
 
636762291768164717.jpg
  • మోదీకి వివరించిన గవర్నర్‌ నరసింహన్‌
  • దోవల్‌తోనూ భేటీ
  • శ్రీనివాస్‌కు రిమాండ్‌
  • రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ
  • నరసింహన్‌తో లగడపాటి మంతనాలు
న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి గురించి సమాచారం అందించి.. పరిస్థితుల్ని వివరించినట్లు తెలిసింది. మోదీతో ఆయన సమావేశం దాదాపు 15 నిమిషాలు జరిగింది. ప్రధాని నివాసంలోనే ఆయన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోవల్‌ను కూడా కలిసినట్లు సమాచారం. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన తీరు గురించి డీజీపీ అందించిన సమాచారంతో పాటు ఇతరత్రా వివరాలను కూడా ఆయనకు తెలియజేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి కూడా గవర్నర్‌ తన అభిప్రాయం చెప్పినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా.. సాయంత్రం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. మరోవైపు.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఢిల్లీలో నరసింహన్‌ను కలుసుకుని దాదాపు అరగంట మంతనాలు జరపడం గమనార్హం.

ilebba intha hadavidi chesthunnaru.. comedy ga President rule Antara endhi :roflmao: :roflmao: :roflmao:

Link to comment
Share on other sites

శ్రీనివాస్‌ ఖాతాలోకి భారీగా నిధులు?
28-10-2018 03:05:15
 
636762927135609055.jpg
  • ఆయన ఇంట్లో 3 బ్యాంకు పుస్తకాలు లభ్యం
  • కాల్‌ డేటా ఆధారంగా విచారణ
ముమ్మిడివరం, అక్టోబరు 27: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనపై విశాఖ సిట్‌ అధికార బృందం రెండోరోజు శనివారం కూడా విచారణ కొనసాగించింది. నిందితుడు శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని ఆయన కుటుంబసభ్యులను మరోసారి విచారించారు. వారినుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతా పుస్తకాలలోని లావాదేవీలపై ఆరా తీశారు. ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్టు సిట్‌ అధికారులకు సమాచారం అందింది.
 
 
దీనిపై కుటుంబసభ్యుల దగ్గర కూపీ లాగుతున్నారు. అయితే, శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ ఖాతాలను పరిశీలించే పనిని సోమవారానికి వాయిదా వేసుకొన్నారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు, ఫ్లెక్సీ తయారీకి సహకరించిన గిడ్డి చైతన్య, శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిపెట్టిన చిన్నాన్న కుమార్తె జే విజయదుర్గను ఇప్పటికే సిట్‌ బృందం సాయంత్రం విశాఖ తరలించిన విషయం విదితమే. తాజాగా ఆమె సోదరుడు రాజేశ్‌ను కూడా విచారించారు. శ్రీనివాసరావు ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా అతనితో చనువుగా తిరిగే వ్యక్తులందరి నుంచి వివరాలు రాబడుతున్నారు.
 
ఈ క్రమంలో శనివారం గ్రామంలో అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్న బూల శమంతకమణిని విచారించారు. శ్రీనివాసరావు సోదరి దోనిపాటి లక్ష్మీదేవి, గ్రామానికి చెందిన మెల్లం శ్రీనివాసరావు, సామంతకుర్తి నాగరాజు, పాము నాగేశ్వరరావు, జనిపల్లి శివసుబ్రహ్మణ్యం, జనిపల్లి సతీశ్‌, జనిపల్లి ఝాన్సీలక్ష్మి, జనిపల్లి ప్రసాదరావులను ఒక్కొక్కరిగా ముమ్మిడివరం పోలీ్‌సస్టేషన్‌కు రప్పించి పొద్దుపోయే వరకు విచారించారు.
Link to comment
Share on other sites

జగన్‌‌పై దాడి.. నేను అనుకున్నది నెరవేరింది: శ్రీనివాసరావు
28-10-2018 03:08:29
 
636763136301274910.jpg
  • సానుభూతి, పార్టీకి లాభం కోసమే చేశా
  • నా వెనుక ఎవరూ లేరు.. అంతా లేఖలో రాశా
  • పోలీస్‌ విచారణలో శ్రీనివాసరావు
  • ఏ కోశానా భయంలేని నిందితుడు!
  • ఒకటి రెండ్రోజుల్లో కస్టడీకి?
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ను చంపాలనే ఆలోచన నాకు లేదు. ఆయన్ని గాయపరిస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. పార్టీకి లాభం జరుగుతుందని భావించే దాడి చేశా’ అని నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ‘నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని జగన్‌తో పంచుకొనే అవకాశం లభించలేదు. ఇప్పుడీ ఘటన ద్వారా నేను రాసిన లేఖతో వైసీపీ అధినేతకు అన్నీ అర్థమవుతాయి. నేను అనుకున్నది నెరవేరినట్లే’ అని కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావులో ఏ కోశానా భయం, ఆందోళన కనిపించడం లేదని అతడ్ని గురు, శుక్రవారాల్లో విచారించిన పోలీసులు అంటున్నారు.
 
 
ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ‘నా వెనుక ఎవరూ లేరు. ఎవరూ ప్రేరేపించలేదు. బుద్ధిపూర్వకంగానే దాడి చేశా’ అని అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అంత కరుడుగట్టిన వ్యక్తిత్వం శ్రీనివాస్ కు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాగా, శ్రీనివాస్‌ చెప్పిన విషయాలను లేఖ రూపంలో రాసిన ఆయన బంధువు విజయలక్ష్మి, అతనితోపాటు పనిచేస్తున్న రేవతీపతిని విశాఖ తీసుకువచ్చారు. ‘లేఖలో ఉన్నవన్నీ శ్రీనివాస్‌ చెప్పిన విషయాలేనా? అవి ఆయన మాటలేనా? ఇంకెవరైనా చెప్పారా? శ్రీనివాస్‌ ఎలాంటివాడు?’ వంటి అంశాలపై పోలీసులు ఆరా తీశారు.
 
 
హోటల్‌ యజమానిని విచారించిన సిట్‌
నిందితుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ యజమాని హర్షవర్దన్‌ను సిట్‌ అధికారులు విచారించారు. ‘శ్రీనివాసరావు ఎప్పుడు చేరాడు? అతని వ్యవహార శైలి ఎలా ఉండేది? అతడిని కుక్‌గా చేర్చుకోవాల్సిందిగా ఎవరైనా సిఫారసు చేశారా?’ అనే అంశాలకు సంబంధించి వాంగ్మూలం తీసుకున్నట్టు సమాచారం.
 
 
విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
దాడి నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకుల ప్రాంతంలో భద్రత పెంచారు. సిబ్బంది, ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీఐపీలు వచ్చే సమయంలో పాస్‌ల ద్వారా లోపలకు వెళ్లే ప్రతిఒక్కరినీ ఆధార్‌ నమోదు చేసుకున్న తర్వాతే అనుమతిస్తున్నారు. విమానాశ్రయంలో, దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బందిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఘటన చోటుచేసుకున్న వీఐపీ లాంజ్‌ను శనివారం ఫోరెన్సిక్‌, సిట్‌, సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు.
 
 
ప్రత్యేక సెల్‌లో నిందితుడు
శ్రీనివాసరావును సెంట్రల్‌ జైలు అధికారులు చిత్రావతి బ్యారక్స్‌లోని ప్రత్యేక సెల్‌లో ఉంచారు. అక్కడ ప్రత్యేక బందోస్తు కూడా ఏర్పాటు చేశారు. అందరిలానే శనివారం ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టినట్టు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌. రాహుల్‌ తెలిపారు. రిమాండ్‌ సమయంలో అతడ్ని కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమన్నారు.
Link to comment
Share on other sites

తాజాగా మరో యువతిని విచారించిన సిట్ పోలీసులు
28-10-2018 14:26:51
 
636763336098841928.jpg
 
అమరావతి: జగన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో కీలక నిందితుడు శ్రీనివాసరావును సిట్ పలు కోణాల్లో విచారిస్తోంది. శ్రీనివాసరావును నవంబర్ 2 వరకు విచారించనుంది. ఇప్పటికే అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం వారితో మరొకసారి మాట్లాడనున్నారు. లేక రాసిన రేవతి పతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని కూడా శ్రీనివాసరావు చెప్పే వివరాలతో పోల్చనున్నారు.
 
గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు ఎందుకు మార్చాడు? వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? నగదు పరిస్థితి, ఇతర లావాదేవీలు ఏంటి? ఈ అంశాలపై సిట్ పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు. వేల సంఖ్యలో ఫోన్లు మాట్లాడడానికి కారణాలు, ఎక్కువసార్లు ఎవరితో మాట్లాడాడు? గత ఆరు నెలల్లో అతను ఎవరెవరిని కలిశాడు? ఏయే ప్రాంతాలకు ఎందుకు వెళ్లాడు? ఏ పార్టీలతో సన్నిహితంగా మెలిగాడు? తదితర అంశాలపై సిట్ బృందం ప్రశ్నావళి రూపొందించుకుంది.
 
శ్రీనివాసరావు రాయగలిగే స్థితిలో ఉండి.. ఇతరులతో రాయించడానికి గల కారణాలు ఏంటి? విమానాశ్రయంలో భద్రతాపరమైన లోపాలను అతను ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? హత్యాయత్నం విషయం ఎవరికైనా ముందుగానే చెప్పాడా? ఘటన తర్వాత కత్తిని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువెళ్లినవారు ఎవరు? మళ్లీ వారు లోపలికి ఎతా తెచ్చారు? కత్తిని ఎక్కడ కొనుగోలు చేశారు? ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది సహకారం ఉందా? వారితో శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ అంశాలన్నింటిపైనా సిట్ బృందం విచారించనుంది.
 
 

Advertisement

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...