Jump to content

kukatpally seat, serilingampally seat


sonykongara

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply
 
 
 
కూకట్‌పల్లి.. టీడీపీపైనే గురి
కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో రోజురోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం... బీజేపీ టికెట్‌ దాదాపు మాధవరం కాంతారావుకే దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి మహాకూటమి అభ్యర్థిపైనే ఉంది. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి టికెట్‌ టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల్లో టికెట్లు రానివారంతా టీడీపీపై ఆశలు పెట్టుకొన్నారు. ఓ పక్క టీడీపీ నాయకులు... మరోపక్క ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు టీడీపీ అధిష్ఠానం వద్ద క్యూలు కడుతున్నారు. టికెట్‌ కోసం ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించే సమయం ఆసన్నం కావడంతో చంద్రబాబుపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కూకట్‌పల్లి టికెట్‌ దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, ఆరెకపూడి ప్రసాద్‌, మందడి శ్రీనివాసరావు, మాధవరం రంగారావు, కృష్ణగౌడ్‌ టికెట్‌ కేటాయించాలని పార్టీ అధిష్ఠానం వద్ద ప్రతిపాదించారు. తాజాగా ప్రముఖ బిల్డర్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి డా.ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ టీడీపీ టికెట్‌ తనకు కేటాయించాలంటూ రేసులోకి వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు టికెట్‌ కేటాయిస్తే సులభంగా గెలవవచ్చని ఆయన విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిసింది. అధిష్ఠానం మాత్రం అందరినీ పరిశీలించి గెలిచే సత్తా ఉన్న నాయకుడికే టికెట్‌ కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
 
పెద్దిరెడ్డి ప్రచారం...
కూకట్‌పల్లి టికెట్‌ ఆశిస్తున్న ఇ.పెద్దిరెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని కూటమికి సంబంధించిన నాయకులు, యూనియన్‌ సంఘాలు, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర పార్టీల నాయకులు టీడీపీలో చేరే కార్యక్రమాల్లోనూ ముమ్మరంగా పాల్గొంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు. దాదాపుగా టికెట్‌ పెద్దిరెడ్డికే ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అభ్యర్థులను అఫీషియల్‌గా ప్రకటించకపోవడం, ఆశావహులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతుండడంతో టికెట్‌ కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
 
Link to comment
Share on other sites

అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసిన టీడీపీ.. రెండు స్థానాల్లో విజయావకాశాలు
04-11-2018 11:17:26
 
636769271509086398.jpg
  • శేరిలింగంపల్లిలో ‘పోటాపోటీ’ సమస్యకు పరిష్కారం
  • కూకట్‌పల్లిలో సరైన క్యాండిడేట్‌ను పెట్టాలనే ప్రయత్నం
  • కసరత్తు చేస్తున్న అధిష్ఠానం
  • తుది ప్రకటన వెలువడే వరకూ ఉత్కంఠ
 
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను నిజం చేసే దిశగా టీడీపీ అధిష్ఠానం అడుగులు వేస్తోందా? శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్‌ కోసం నేనంటే నేనంటూ పోటీ పడుతున్న మొవ్వా సత్యనారాయణ, వెనిగళ్ల ఆనందప్రసాద్‌లలో ఒకరిని పార్టీ కూకట్‌పల్లికి పంపనుందని ప్రచారం జరుగుతోంది. టికెట్‌ హామీతోనే మొవ్వా తిరిగి సొంత గూటికి చేరినట్లు ఆయన అనుచరులు చెబుతుండగా, కొత్తగా తెరపైకి వచ్చిన ఆనంద ప్రసాద్‌కు కూకట్‌పల్లి టికెట్‌ ఇవ్వడం ద్వారా పార్టీకి లాభం జరుగుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
 
 
హైదరాబాద్‌: వారిద్దరూ బలమైన అభ్యర్థులే. పోటీకి అన్ని విధాలుగా అర్హులే. ఇద్దరూ ఒకే సీటు కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తే ఎవరికి న్యాయం చేయాలి? సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితి నగర శివారు నియోజకవర్గమైన శేరిలింగంపల్లిలో నెలకొంది. ఈ స్థానం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగేందుకు ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందు లో ఒకరు ఆ మధ్యన టీఆర్‌ఎ్‌సకు వెళ్లి, ఇటీవల సొంతగూటికి తిరిగి వచ్చిన మొవ్వా సత్యానారాయణ కాగా, మరొకరు భవ్యా పేరుతో పలు వ్యాపారాలు చేస్తున్న వెనిగళ్ల ఆనందప్రసాద్‌.
 
ఇద్దరూ నేతలు టికెట్‌ కోసం తమ తమ ప్రయత్నాలు చేస్తూ, ఎవరికి వారు తమకే టికెట్‌ వస్తుందని చెప్పుకోవడం విశేషం. ఇందులో వెనిగళ్ల ఆనందప్రసాద్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం, ప్రచార రంగంలోకి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది. మొవ్వా సైతం తన ప్రయత్నాల్లో తాను ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఇరువురు నేతలు పోటాపోటీగా టికెట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.
 
శేరిలింగంపల్లి టీడీపీకే..?
అసలు ఈ స్థానాన్ని కాంగ్రె్‌సకు కేటాయిస్తారా? తెలుగుదేశంకు కేటాయిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇరు పార్టీల నేతలు తమదైన వాదనను వినిపిస్తూ సీటు తమ పార్టీకే అని జోరుగా ప్రచారం చేసుకున్నారు. సిట్టింగ్‌ స్థానాల్ని తాము వదులుకునే అవకాశమే లేదన్న విషయాన్ని టీడీపీ అధినాయకత్వం తేల్చి చెప్పడంతో శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయిస్తారన్న సంకేతాలు అందుతున్నట్లు నేతలు చెబుతున్నారు.
 
భరోసాతోనే పార్టీలోకి..
మొవ్వా తిరిగి టీడీపీలో చేరే క్రమంలో టికెట్‌ ఇస్తారన్న భరోసా తీసుకునే వచ్చారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు రాజకీయ తెర మీదకు రాని ఆనంద్‌ ప్రసాద్‌ అధిష్ఠానం ఆశీస్సులతోనే రంగం మీదకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. మొవ్వాకు శేరిలింగంపల్లి టికెట్‌ మొదట్నించి అనుకుంటున్నా, ఆనంద్‌ ప్రసాద్‌ రావటంతో అభ్యర్థుల్ని తేల్చే విషయమైన పీటముడి పడింది. దీన్ని అధిష్ఠానం ఎలా విప్పుతుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
 
 
చెరో స్థానం?
శేరిలింగంపల్లిలో నేనంటే నేనన్నట్లు టీడీపీ తరపున అభ్యర్థులు పోటీ పడుతుంటే, కూకట్‌పల్లిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్లుగా పార్టీ భావిస్తోంది. ఇలాంటి వేళ పార్టీ అధినాయకత్వం ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రెండు నియోజకవర్గాలకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్టీ ప్రయోజనం పొందేలా పరిష్కారాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. శేరిలింగంపల్లిలో పార్టీ టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఆనందప్రసాద్‌ను కూకట్‌పల్లికి పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
 
కొత్తగా రాజకీయాల్లోకి వస్తుండటం.. ఎలాంటి ఆరోపణలు లేకపోవటం పార్టీకి లాభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను మొవ్వాకు కేటాయిస్తే రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ లాభపడుతోందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొవ్వాకు శేరిలింగంపల్లిలో ఇప్పటికే పోటీ చేసిన అనుభవం ఉండటం, ఆ నియోజకవర్గం మీద పట్టు ఉండటంతో ఆయనకు ఆ టికెట్‌ కేటాయించి, ఆనందప్రసాద్‌ను కూకట్‌పల్లి బరిలో నుంచి దింపితే బాగుంటుందన్న దిశగా పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతిమంగా ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
 
 
కూకట్‌పల్లిలో ఇలా..
శేరిలింగంపల్లి టికెట్‌ కోసం టీడీపీలో పోటీ నడుస్తుంటే, పొరుగునే ఉన్న కూకట్‌పల్లిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాధవరం కృష్ణారావు తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరటం తెలిసిందే. తాజాగా అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ కార్యకలాపాలు మందగించాయి. నాయకత్వ సమస్య నెలకొంది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు (కూకట్‌పల్లి) ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
 
ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరికొందరు టీడీపీ టికెట్‌కు ఆసక్తి చూపుతున్నప్పటికీ మాధవరంతో ఢీ కొట్టే అభ్యర్థికి సంబంధించి పార్టీ నాయకత్వ ఆలోచనలు వేరుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉన్న ఈ స్థానాన్ని వారికే కేటాయిస్తే బా గుంటుందన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొత్త ముఖాన్ని తీసుకొస్తే ఫలితం తమకు సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయంలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

వార్ వన్ సైడ్ అనుకున్న స్థానాల్లో టీఆర్ఎస్‌కు ఊహించని పరిస్థితి
04-11-2018 11:35:43
 
636769281853745011.jpg
  • ‘గ్రేటర్‌’ ఎన్నికల్లో హవా
  • ఓటు బ్యాంకు కాపాడుకునే యత్నం
  • క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం
  • కుల సంఘాలు, రాష్ట్రేతరులే టార్గెట్‌
  • వీకెండ్స్‌లో ప్రత్యేక సమావేశాలు
  • బూత్‌ స్థాయిలో కార్యక్రమాలు
 
రంగారెడ్డి: నగర శివార్లలోని స్థానాలపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. శివార్లలో ఎక్కువ స్థానాలు ఉండడంతో ఈ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. ఇందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రచారం చేస్తోంది. బహిరంగ ప్రచారంతో పాటు బూత్‌ స్థాయిలో ఎప్పటికపుడు సమాచారం సేకరించి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో శివార్లలోని దాదాపు అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది.
 
గ్రేటర్‌లో 150 డివిజన్లకుగానూ 99 డివిజన్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో సైతం టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. రానున్న ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి నగర శివార్లలో దాదాపు అన్ని స్థానాలు స్వీప్‌ చేసింది. కూటమి 8 స్థానాల్లో విజయం సాధించగా, ఇందులో టీడీపీ ఏడు స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ గెలిచిన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఎమ్మెల్యేలు ఆ తర్వాత టీ ఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. ఎల్‌బీనగర్‌లో టీడీపీ తరుపున గెలిచిన ఆర్‌. కృష్ణయ్య ఒక్కరే ఆ పార్టీ తరుపున మిగిలారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వీటన్నింటిలో పాగా వేయాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది.
 
మహాకూటమితో మారిన పరిస్థితి
మహాకూటమి ఏర్పాటు తరువాత పరిస్థితులు మారాయి. ఫలితాలు ఇపుడు ఏకపక్షంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అనేక చోట్ల పోటాపోటీ కనిపిస్తోంది. ఎన్నికల ప్రకటనకు ముందు ఉన్న పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఆయా పార్టీల బలాబలాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రభుత్వ రద్దు సమయంలో తమకు రాష్ట్రంలో తిరుగులేదనే భావించింది. అప్పటి పరిస్థితులు కూడా దాదాపు అలానే కనిపించాయి. అయితే అభ్యర్థుల ప్రకటన తరువాత టీఆర్‌ఎ్‌సలో కొన్ని చోట్ల తిరుబాట్లు జరిగాయి. అసంతృప్తులు కనిపించాయి. వీటిని చల్లార్చే విషయంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం కొంత సఫలీకృతమైంది. కానీ, కొన్ని చోట్ల అభ్యర్ధులపై ఇంకా తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో అనేక చోట్ల అధికార టీఆర్‌ఎస్‌, మహాకూటమి మధ్య పోటాపోటీ సమరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో టీఆర్‌ఎ్‌సకు ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయనే ప్రచారం జరిగినా ఇపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
 
ప్రచార సరళి మార్చిన టీఆర్‌ఎస్‌
టీఆర్‌ఎస్‌ ప్రచార సరళిని పూర్తిగా మార్చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రెండు పద్ధతుల్లో నిర్వహిస్తోంది. ముఖ్యనేతలు, పార్టీ అభ్యర్థుల రోజు వారీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ ప్రచార కార్యక్రమాలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో మరో వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి బూత్‌కు 15 మందిని ప్రత్యేకంగా నియమించింది. ఇందులో ఒకొక్కరూ సుమారు వంద మంది ఓటర్లతో నిత్యం టచ్‌లో ఉంటారు. వీరంతా బూత్‌స్థాయిలో ఓటర్లను గుర్తించడంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, బూత్‌స్థాయిలో ఆయా పార్టీల బలాబలాలను బేరీజు వేసి ఎప్పటికపుడు కేంద్ర పార్టీకి సమాచారం పంపిస్తుంటారు. వీరు ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర కమిటీ నుంచి క్షేత్రస్థాయిలో ఉండే నేతలకు సూచనలు అందుతుంటాయి. ఇలా పార్టీకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే దీన్ని కొనుగొని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తుంటారు.
 
ఇదే కాకుండా అన్ని కులసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఆదివారం శివార్లలో దాదాపు 15 చోట్ల కుల సంఘాలతో టీఆర్‌ఎస్‌ సమావేశాలను నిర్వహిస్తోంది. అలాగే, రాష్ట్రేతరులపై ప్రత్యేక దృష్టిసారించింది. వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ప్రాంతాల వారీగా వీరితో కూడా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమావేశాలన్నీ వీకెండ్స్‌లో నిర్వహిస్తున్నారు.
Link to comment
Share on other sites

శేరిలింగంపల్లి టీడీపీలో వర్గ విబేధాలు
04-11-2018 11:21:02
 
636769273514393300.jpg
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోగల శేరిలింగంపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు ఆదివారం బయటపడ్డాయి. టీడీపీ నేతలు మొవ్వా సత్యనారాయణ, ఆనందప్రసాద్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేత ఆనందప్రసాద్‌ తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీని నిర్వహిస్తుండగా మొవ్వా సత్యనారాయణ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాగా... ఈ నియోజకవర్గాన్ని మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తున్నారని ఉహాగానాలు వస్తున్న నేపధ్యంలో గెలుపు కోసం ఐక్యంగా కృషిచేయాల్సిన నేతలు ఇలా ఘర్షణకు దిగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

3 hours ago, rama123 said:

Bhaya meeda cheppulatho dadanta movva batch

Vallu Anand Prasad Jeep ki addam ga nunchunnaru kadhalanivakunda..  oka 15 members vunnaru.  police lu lekapothe kullaModiche vallu vallani..

 

Movva batch Ticket confirm avvakunda Anand Prasad Ela pracharam chestharu ani godava chesaru..  20 years ga vunna maaku ticket ivvakunda 15 days Mundhu vachina Anand Prasad ki endhuku isthunnadu ani inko godava..

 

Movva batch lo okadini Jntu ps ki theesukelthunte buuthulu dobbaamu mare meeru endhuku pracharam chesthunnaru ani.. TRS lo ki endhuku join ayyavu  ani dobbaru janalu. vadu edho matladabothe Police lu apaaru vaadini.. mamalni silent ga vundamannaru..

Rally matram super success.. full happies :no1:

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Movva batch piccha li8.. vallu 15 members vuntaaru..

Anand Prasad rally ki minimum 500 members vacharu.. Andharu buuthulu dobbadame.. valla valla Rally late ayindhi baaga. Taruvata police la hadavidi okati :sleep:

 

howz the response raaz....movva gadi overaction enti asalu eededo party ki veera vidheyudilaga

Link to comment
Share on other sites

నాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తా

నాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తా

హైదరాబాద్‌ : గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శేరిలింగంపల్లి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌కే  కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. అందులోని ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కిరోసిన్ పోసుకొని ఒకరు... చేయి కోసుకొని మరొకరు ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు. పొత్తుల్లో భాగంగా శేరిలింగపల్లి స్థానాన్ని తెదేపాకు కేటాయించవద్దని, తనకు కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తామని బిక్షపతి హెచ్చరించారు. సుమారు 100 మంది కార్యకర్తలతో ఆయన గాంధీభవన్ ఎదుట ఆందోళనకు కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...