Jump to content

kukatpally seat, serilingampally seat


sonykongara

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply
On ‎11‎/‎14‎/‎2018 at 5:08 AM, Godavari said:

Bikshapathi Yadav rebel ga unte TDP ke konchem Benefit ah basthilaa votes trs ke ekkuva potayiii bikshapathi unte entho kontha vallaki poyevee ekkuva chilustadu emo

xactly aadiki settlers evaru eyaru

Link to comment
Share on other sites

నందమూరి సుహాసినికి శుభాకాంక్షల వెల్లువ
16-11-2018 14:10:20
 
636779744601305701.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని అభ్యర్థిత్వం ఖరారవడంతో ఆమె తండ్రి హరికృష్ణ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సుహాసినికి శుభాకాంక్షలు తెలియజేసందుకు శ్రేయోభిలాషులు, మిత్రులు తరలివస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు సుహాసినిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్నారు. రేపు ఎన్టీఆర్, హరికృష్ణ ఘాట్‌లో నందమూరి సుహాసిని తాతకు, తండ్రికి నివాళులర్పించబోతున్నారు. ఆ తర్వాతే ఆమె నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళతారు. ఈరోజు సాయంత్రం సుహాసిని మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
 
Tags : nandamuri suhasini, TDP, kukatpally, Nomination, Hyderabad
Link to comment
Share on other sites

నందమూరి సుహాసినికే కూకట్‌పల్లి!
16-11-2018 02:25:22
 
636779319239368625.jpg
  • టీడీపీ టికెట్‌ ఖరారు
  • రేపు నామినేషన్‌
హైదరాబాద్‌/అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు సుహాసినిని కూకట్‌పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె ఆమె. కూకట్‌పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్‌లో ఆమె చంద్రబాబును కలుసుకున్నారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు వారికి వెల్లడించి, సుహాసిని విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శనివారం ఆమె కూకట్‌పల్లిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖ వచ్చిన వారిలో కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. కూకట్‌పల్లి టిక్కెట్‌ను ఆశించిన ఆయనకు మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ టిక్కెట్‌ ఆశించిన పెద్దిరెడ్డిని కూడా రావాలని కబురు పంపినా రాలేదు. తనకు విడిగా పార్టీ అధినేత నచ్చచెప్పాల్సిన అవసరం లేదని, ఖరారు చేసిన అభ్యర్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఫోన్లో పార్టీ నేతలకు తెలిపారు. హరికృష్ణ కుమార్తె అయిన సుహాసినిని.. తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. పిల్లల చదువుల కోసం కొన్ని సంవత్సరాలుగా సుహాసిని హైదరాబాద్‌లోనే స్ధిరపడ్డారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం నుంచి టీడీపీలో రాజకీయ వారసత్వం కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం భావించింది. పోటీ చేయాల్సిందిగా ఆయన కుమారుడు కల్యాణ్‌రామ్‌ను అడిగారు. కానీ ఆయన చేయనన్నారు. ఇక ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని అనుకొంటున్న తరుణంలో ఆకస్మికంగా సుహాసిని పేరును అధిష్ఠానం తెరపైకి తెచ్చింది.
 
వ్యూహాత్మక నిర్ణయం
సుహాసిని ఎంపిక వ్యూహాత్మకంగా కీలక నిర్ణయంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. వారితోపాటు, స్థానికుల్లోనూ ఎన్టీఆర్‌ కుటుంబం పట్ల సానుకూలత ఉంది. ఆ కుటుంబం నుంచి అభ్యర్థిని నిలపడం ఓటర్లలో మహాకూటమికి అనుకూల వాతావరణం సృష్టిస్తుందని, అదే సమయంలో తెలంగాణలో టీడీపీ శ్రేణులను కూడా ఉత్సాహపరుస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆకస్మికంగా మరణించిన హరికృష్ణ కుటుంబానికి అధిష్ఠానం అండగా నిలిచిందని, వారి రాజకీయ ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడిందని కూడా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందినప్పుడు కుటుంబ పెద్దగా చంద్రబాబు రెండు రోజులు హరికృష్ణ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకొన్నారు. ఆ పరిణామాల కొనసాగింపుగానే ఇప్పుడు సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె విజయం సునాయాసమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చుట్టుపక్కల మరి కొన్ని నియోజకవర్గాలపైన కూడా ఈ ప్రభావం ఉంటుందని, పార్టీ సానుభూతిపరులు మరింత చురుగ్గా ఎన్నికల్లో పనిచేస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్‌ కుటుంబం అంతా ఏకతాటిపై ఉందన్న పరిణామాన్ని ఈ నిర్ణయం సూచిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఈ నిర్ణయంతో గట్టి సమాధానం ఇచ్చినట్లయిందని టీడీపీ ముఖ్య నేత ఒకరు అన్నారు.
Link to comment
Share on other sites

మొన్న వాడెవడో టీడీపీ పార్టీ కి tg లో దమ్ము లేదు అన్నాడు పిచ్చి పావలా అండ్ ముక్కు కెసిఆర్ గాడు. ఇది చూసాక ప్యాంట్ తాడిపేసుకొని ఉంటారు...????#kukatpally

DsW52DNVsAALsHe.jpg
DsW5286VAAAQWnN.jpg
Link to comment
Share on other sites

SRINIVAS Retweeted
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజకూటమి బలపర్చిన టి డి పి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు ఈ రోజు నామినేషన్ వేయనున్న సందర్భంగా ప్రజకూటమి లోని అన్ని పార్టీల నాయకులు అందరు శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారిని కలిసి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు. #venigallaanandaprasad

DsWw-97UcAAOMDC.jpg
DsWxAA_U4AEY_zY.jpg
DsWxAguUwAAQFse.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...